About Us

మా గురించి

ఈ వెబ్‌సైట్‌కి డా. పృథ్వీరాజ్ జంపన, ఎంబిబిఎస్, ఎంఆర్సిపి (సెంట్రల్ మెడిసిన్), ఎఫ్ఆర్సిఆర్ (క్లినికల్ ఆంకాలజీ), సిసిటి ఊహించారు, రూపకల్పన చేశారు మరియు రాశారు. అతను వృత్తిరీత్యా హైదరాబాద్, ఇండియాలో, మరియు యునైటెడ్ కింగ్డమ్లో క్యాన్సరు స్పెషలిస్టుగా పనిచేశారు.

డా. ఫృథ్దీరాజ్ 1996లో గుల్బర్గా యూనివర్సిటీ, ఇండియా నుంచి ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఆ తరువాత, అతను 1997లో యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళారు. భారతదేశానికి తిరిగిరావడానికి ముందు 2012 వరకు పని చేశారు. యుకెలో, అతను జనరల్ మెడిసిన్ మరియు క్లినికల్ ఆంకాలజీలో శిక్షణ పొందారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్లో అతను క్లినికల్ ఆంకాలజీలో శిక్షణ పొందారు మరియు ఈ కింది ఆసుపత్రుల్లో పనిచేశారు.

 

  • క్రిస్టీ హాస్పిటల్‌, మాన్‌చెస్టర్‌, యుకె
  • క్వీన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఆంకాలజీ, కింగ్‌స్టన్‌ అపాన్‌ హల్‌, యుకె
  • సెయింట్‌ జేమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ, లీడ్స్‌, యుకె
  • ఆక్స్‌ఫర్డ్‌ క్యాన్సరు సెంటర్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ హాస్పిటల్స్‌, ఆక్స్‌ఫర్డ్‌, యుకె
  • బెర్క్‌షైర్‌ క్యాన్సరు సెంటర్‌, రాయల్‌ బెర్క్‌షైర్‌ హాస్పిటల్‌, రీడింగ్‌, యుకె
  • నార్తంప్టన్‌ సెంటర్‌ ఫర్‌ ఆంకాలజీ, నార్తంప్టన్‌, యుకె
  • నార్తర్న్‌ సెంటర్‌ ఫర్‌ ఆంకాలజీ, న్యూకాసిల్‌ అపాన్‌ టైన్‌, యుకె
  • డీన్స్లీ సెంటర్, న్యూ క్రాస్ హాస్పిటల్, వోల్వర్హాంప్టన్, యుకె
  • ఈడెన్‌బరో క్యాన్సర్‌ సెంటర్‌, వెస్టర్న్‌ జనరల్‌ హాస్పిటల్‌, ఈడెన్‌బరో, యురో
  • నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీ హాస్పిటల్స్‌, నార్టింగ్‌హామ్‌, యుకె
  • సెయింట్‌ కేథరిన్‌ హాస్పీస్‌, ప్రెస్టన్‌, లాంక్‌షైర్‌, యుకె (పాల్లియేటివ్‌ మెడిసిన్‌)
  • కోర్‌లీ మరియు డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌, కోర్‌లీ, లాంక్‌షైర్‌, యుకె (జనరల్‌ మెడిసిన్‌)

క్లినికల్‌ ఆంకాలజిస్టుగా, అతను క్యాన్సర్‌ సైట్‌లన్నిటికీ రేడియోథెరపి మరియు సాలిడ్‌ ట్యూమర్‌ సైట్‌లకు కీమోథెరపి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అతని సైట్‌కి రొమ్ము, యూరోలాజికల్‌ (ప్రొస్టేట్‌, బ్లాడర్‌, మూత్రపిండాల), ఊపిరితిత్తుల మరియు మెదడు క్యాన్సర్లలో ప్రత్యేక నైపుణ్యం ఉంది.