About Cancer

క్యాన్సర్ అంటే ఏమిటి

సాధారణ కణాలు నియంత్రణ లేకుండా మారిపోవడం, పెరిగిపోతూ ఉండడం ప్రారంభమవడంతో సంభవించే వ్యాధుల సమూహాన్ని కేన్సర్ అని అంటారు .

మానవ శరీరం సుమారు 200 రకాల కణాలతో రూపొందించబడుతుంది. ఈ కణాల సంఖ్య మొత్తం ట్రిలియన్లలో ఉంటుంది.

సాధారణంగా శరీరంలో ఈ పాత కణాలు చనిపోతూ ఉండడం, వాటిని భర్తీ చేయడానికి కొత్త కణాలు పుడుతూ ఉండడమనే ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే ఈ నిరంతర ప్రక్రియ మంచి కట్టుదిట్టమైన నియంత్రణలో జరుగుతుంది.

ఈ నియంత్రణ కోల్పోయినప్పుడు కేన్సర్ గా మారుతుంది. అదుపు తప్పి పెరుగుతున్న ఈ కణాలు కొంత పరిమాణానికి చేరుకున్నప్పుడు ఒక ముద్ద లేదా గడ్డను తయారు చేస్తాయి. కేన్సర్ గా అభివృద్ధి చెందినపుడు, అది దాని చుట్టూ ఉన్న నిర్మాణాలపై దాడి చేయవచ్చు, అలాగే రక్త ప్రవాహం లేదా శోషరస మార్గాల (లింఫ్ ఛానెల్స్) ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందవచ్చు.

కేన్సర్ నామకరణం

కేన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా పెరగవచ్చు. కేన్సర్ శరీరంలోని ఏ భాగానికి వస్తే దాన్ని ఆ పేరుతోనే పిలుస్తారు. ఉదాహరణకు, రొమ్ము కేన్సర్ అనేది రొమ్ములో మొదలైన కేన్సర్ అని అర్థం, అలాగే ఊపిరితిత్తుల కేన్సర్ అంటే ఆ కేన్సర్ ఊపిరితిత్తుల్లో ప్రారంభమైందని అర్థం.

కేన్సర్ ని వివరించే మరెన్నో ఇతర పదాలు ఉన్నాయి. కణితి లేదా ట్యూమర్ అనే పదం సాధారణంగా ఉపయోగించే పదం.

కణితి వచ్చిందంటే కేన్సర్ వచ్చిందని అర్థం కాదు. ఒక కణితి నిరపాయకరమైన ట్యూమర్ (ఇతర భాగాలపై దాడి చేయని లేదా వేరే చోట్లకి వ్యాప్తి చెందని) కూడా కావచ్చు లేదా ప్రాణాంతకమైనదైనా కావచ్చు. ఒక నిరపాయకరమైన కణితి కేన్సర్ కాదు

ఇతర భాగాలకు చొచ్చుకుని వెళ్లి వ్యాపించే కేన్సర్ ప్రాణాంతకంగా మారగల కణితి. ఇది వ్యాపించడం మొదలైందంటే, దీన్ని మెటాస్టేటిక్ కేన్సర్ లేదా సెకండరీ కేన్సర్ అంటారు. “గడ్డ” లేదా “పెరుగుదల” వంటి పదాలు కూడా సాధారణంగా ఉపయోగించబడతాయి. ఈ పదాలు సూచిస్తున్న కేన్సర్ నిరపాయమైనదైనా లేదా ప్రాణాంతకమైనదైనా కావచ్చు.

రొమ్ము కేన్సర్ లేదా ఊపిరితిత్తుల కేన్సర్ వంటి వ్యక్తిగత పేర్లతో పాటు, కేన్సర్లు అవి ప్రారంభమైన కణాల రకాన్ని బట్టి కూడా వాటిని కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు.

శరీరంలో లోపలి మరియు వెలుపలి ఉపరితలాలపై వరసగా పేరుకునే కేన్సర్ కణాల్ని కార్కినోమాస్ అని పిలుస్తారు. దీన్ని మళ్లీ స్క్వామస్ సెల్ కార్సినోమర్ అడెనోకార్సినోమా (గ్రంధుల నుండి అభివృద్ధి చెందుతుంది) వంటి కణాల రకాన్ని బట్టి ఇంకా ఉపవిభాగం చేయవచ్చు.

కండరాలు, ఎముక, మృదులాస్థి మరియు క్రొవ్వుల బంధన కణజాలం (కనెక్టివ్ టిష్యూ) కణాలలో మొదలైన కేన్సర్ ని సర్కోమా కేన్సర్లని అంటారు.

ఎముక మజ్జ వంటి రక్తం ఏర్పడే కణాల్లో మొదలైన కేన్సర్ ని లుకేమియా కేన్సర్లని అంటారు.

శోషరస వ్యవస్థలో మొదలైన కేన్సర్లని లింఫోమా కేన్సర్లని అంటారు.

భారతదేశంలో క్యాన్సరు

భారతదేశంలో క్యాన్సరు పెరుగుతోంది. 1990 మరియు 2016 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశంలో క్యాన్సరును అధ్యయనం చేసి 2018లో ప్రచురించబడిన అంతర్జాతీయంగా వ్యాధుల, గాయాల భారం మరియు ప్రమాదకర అంశాలపై అధ్యయనం (జిబిడి) ప్రకారం, ఈ వ్యవధిలో కొత్త క్యాన్సర్లు మరియు మరణాల సంఖ్య రెట్టింపు అయినట్లుగా వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం జనాభా పెరుగుదల మరియు వృద్ధ జనాభా అని వెల్లడించింది. ఇప్పుడు బారతదేశంలో జరుగుతున్న మరణాలన్నిటిలో దాదాపు 8.3% క్యాన్సరు వల్లే ఉంటున్నాయి.

ఆ వ్యవధిలో పొగాకు వాడకం తగ్గిపోయినప్పటికీ క్యాన్సరుకు పొగాకు ప్రధాన నష్టాంశంగా ఉంది. క్యాన్సర్లలో 10.9%కి ఇది కారణమవుతోంది. మొత్తం క్యాన్సర్లలో ఆల్కహాల్ 6.6% మరియు ఆహారం 6% కారణమవుతున్నాయి. ఈ వ్యవధిలో పొగాకు వాడకం తగ్గినప్పటికీ మద్యపానం పెరిగింది. మద్యపానంతో ముడిపడివున్న క్యాన్సర్లు పెరగడం మొదలైంది.

క్యాన్సర్ల సంఖ్య 1990లో 548,000 ఉండగా అది 2016 నాటికి 1,069,000కి పెరిగింది. మిజోరాం, కేరళ, హర్యానా, ఢిల్లీ, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా మరియు హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో క్యాన్సర్ల రేటు అత్యధికంగా ఉంది.

భారతదేశంలో మహిళల్లో రొమ్ము క్యాన్సరు ప్రముఖ క్యాన్సరుగా ఉంది మరియు 1990 మరియు 2016 మధ్య కాలంలో ఈ సంఖ్య దాదాపుగా 40% పెరిగింది. మహిళల్లో కలుగుతున్న ఇతర మామూలు క్యాన్సర్లలో సెర్విక్స్, పొట్ట, కోలన్ మరియు పురీషనాళం మరియు పెదవులు మరియు మౌఖిక క్యావిటి క్యాన్సర్లు ఉన్నాయి.

పురుషుల్లో మామూలు క్యాన్సర్లలో ఊపిరితిత్తులు, పెదవులు మరియు నోటి క్యావిటి, అన్నవాహిక, పొట్ట మరియు ల్యుకేమియా ఉంటాయి.