Bone Metastases

ఎముక మెటాస్టాసెస్

సెకండరి లేదా మెటాస్టాటిక్ క్యాన్సరు

రొమ్ము, ఊపిరితిత్తులు తదితర లాంటి శరీరంలోని ఒక భాగంలో క్యాన్సరు ప్రారంభమై కాలేయం, మెదడు లేదా ఎముకలు లాంటి ఇతర ప్రాంతాలకు వ్యాపించవచ్చు. ఇది ప్రారంభమైన చోటును ప్రాథమిక సైట్ అంటారు మరియు ఇది వ్యాపించిన ప్రాంతాలను సెకండరి సైట్స్ అంటారు మరియు ఇక్కడ ఉన్న క్యాన్సరును సెకండరి క్యాన్సరు లేదా మెటాస్టాటిక్ క్యాన్సరు అంటారు.

ఎముక మెటాస్టాసెస్

ఎముక మెటాస్టాసెస్ అనేవి ఎముకలోని సెకండరి క్యాన్సర్లు గల ఏరియాలు. శరీరంలోని ఇతర భాగాల నుంచి ఎముకలకు క్యాన్సరు విస్తరించినప్పుడు ఇవి కలుగుతాయి. ఎముకలకు మామూలుగా వ్యాపించే క్యాన్సర్లు రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, మూత్రపిండాలు, మైలోమా మరియు థైరాయిడ్ క్యాన్సర్లు. అత్యధిక క్యాన్సర్లు ఎముకలకు విస్తరిస్తాయి, కొన్ని ఇతర వాటి కంటే ఎక్కువ మామూలువి.

ఎముక మెటాస్టాసెస్ మూడు రకాలుగా ఉండొచ్చు.

లైటిక్ మెటాస్టాసెస్ అనేవి క్యాన్సరు ఎముకను ధ్వంసం చేసి ఎక్స్రేలో చూసినప్పుడు తక్కువ దట్టమైన బొమ్మకు దారితీసే స్థితి.

బ్లాస్టిక్ మెటాస్టాసెస్ అనేవి ఎముకలో క్యాన్సరు జమయినప్పుడు కలుగుతాయి మరియు ఎక్స్రేలో చూసినప్పుడు మిగతా మామూలు ఎముక కంటే దట్టంగా కనిపిస్తాయి.

మిశ్రమ మెటాస్టాసెస్ అంటే లైటిక్ మరియు బ్లాస్టిక్ మెటాస్టాసెస్లను క్యాన్సరు కలిగించిందని అర్థం.

క్యాన్సరు ఎముకలకు విస్తరించినప్పుడు, రోగికి లక్షణాలు కలగవచ్చు లేదా కలగకపోవచ్చు. కానీ ఇది ఎముకల్లో పెరుగుతుంది కాబట్టి, అత్యధిక మంది రోగులు అంతిమంగా లక్షణాలు అనుభవిస్తారు.

నొప్పి

ఎముక మెటాస్టాసెస్ గల రోగుల్లో ఉండే అత్యంత మామూలు లక్షణం ఇది. రోగి తిరుగుతున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకున్నప్పుడు నొప్పి ఉంటుంది. మెటాస్టాసెస్ కనుక దిగువ కాళ్ళ ఎముకల్లో ఉంటే, నడిచేటప్పుడు లేదా బరువు మోసేటప్పుడు నొప్పి ఉండొచ్చు. వెన్నెముకలో ఉంటే, వంగినప్పుడు, పక్కకు తిరిగినప్పుడు లక్షణాలు ఉంటాయి. ఛాతీ లేదా పక్కటెముకల్లో ఉన్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు లేదా వంగినప్పుడు నొప్పి తీవ్రతరం కావచ్చు.

ఎముక మెటాస్టాసెస్ లొకేషన్ని బట్టి నొప్పి రకం మారిపోవచ్చు. ఎముక మెటాస్టాసెస్ వల్ల నరం ఇరుక్కుపోయినప్పుడు నొప్పి మందగొడిగా, తీక్షణంగా, లేదా మండుతున్నట్లుగా లేదా లాగుతున్న రకంగా ఉండొచ్చు.

ఫ్రాక్చర్

ఎముకలోని క్యాన్సర్ ఎముకను బలహీనపరుస్తుంది కాబట్టి, ఎముకలో, ప్రత్యేకించి కాళ్ళలోని ఎముకల్లో ఫ్రాక్చర్ అపాయం ఉంటుంది. చాలా తక్కువ దెబ్బతో, లేకుండా కూడా ఫ్రాక్చర్ కలగవచ్చు.

నరం నొక్కేయడం లేదా వెన్నుపూస నొక్కేయడం

వెన్నెముకలో మెటాస్టాసెస్ ఉన్నప్పుడు, కుప్పకూలడం లేదా వెన్నెముకలోని వెర్టెబ్రాలో ఫ్రాక్చర్ కలిగే ప్రమాదం ఉంది. వెన్నెముకలో వెన్ను పూస మరియు ఇతర నరాలు ఉంటాయి కాబట్టి, వెన్నెముక నిర్మాణంలో కలిగే మార్పు ఏదైనా ఈ నరాలకు డేమేజ్ మరియు లక్షణాలు కలిగించవచ్చు. మరింత సమాచారం కోసం దయచేసి వెన్నుపూస కంప్రెషన్ సెక్షన్ని చూడండి.

క్యాల్షియం స్థాయిలు పెరగడం

ఎముకల్లో మెటాస్టాసెస్ గల రోగులకు రక్తంలో క్యాల్షియం స్థాయి పెరగవచ్చు. ఇది నీరసం, అలసట, తికమక, దాహం మరియు మూత్రపిండాలు పనిచేయకపోవడం లాంటి లక్షణాలకు దారితీయొచ్చు.

ఎముక మెటాస్టాసెస్ని అనుమానించినప్పుడు, ఈ కింది పరీక్షలు చేయబడవచ్చు. ఏ స్కాన్ని ఉపయోగించాలనే విషయం రోగి స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎముక మెటాస్టాసెస్ కోసం చూసేందుకు ఎక్స్రే, ఎముక స్కాన్ లేదా ఎంఆర్ఐ ఉత్తమమైనవి.

రక్త పరీక్షలు

సిబిపి, మూత్రపిండాల పనితనం, కాలేయం పనితనం పరీక్షలు, క్యాల్షియం మరియు ఎముక ప్రొఫైల్తో సమా రక్త పరీక్షలు మామూలుగా చేయబడతాయి.

ఎక్స్రేలు

అనుమానిత ఎముకల్లో మెటాస్టాసెస్ ఉందేమో చూసేందుకు మరియు నొప్పి ఉన్న రోగుల్లో ఫ్రాక్చర్ అపాయాన్ని అంచనావేసేందుకు ఎక్స్రేలు తీయబడతాయి.

సిటి స్కాన్

సిటి స్కాన్ అనేది స్కాన్ తీసిన శరీర భాగం యొక్క మూడు-డైమెన్షనల్ ఇమేజ్ని ఇవ్వడానికి ఎక్స్రేలను ఉపయోగించే స్కాన్. క్యాన్సరును గుర్తించడంలో మరియు సేజిని నిర్ణయించడంలో ఎక్స్రే కంటే ఇది ఎక్కువ కచ్చితత్వం గలది. కాంట్రాస్ట్ ఎన్హేన్స్డ్ స్కాన్ అనేది స్కాన్కి ముందు సిరలోకి ఇంజెక్షన్ ఇవ్వబడేది మరియు ఇది మెరుగైన ఇమేజ్లు ఇస్తుంది. పొత్తికడుపుకు స్కాన్ తీసేటప్పుడు తాగడానికి రోగికి ఓరల్ కాంట్రాస్ట్ ఇవ్వబడుతుంది. సిటి స్కాన్ని తీయడానికి కొద్ది నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కొన్ని బయాప్సీలు తీసినప్పుడు డాక్టరుకు మార్గదర్శనం చేయడానికి సహాయపడేందుకు కూడా సిటి స్కాన్ తీయబడుతుంది.

ఎంఆర్ఐ స్కాన్

ఇమేజ్లను రూపొందించేందుకు ఎంఆర్ఐ స్కాన్ అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తుంది మరియు క్యాన్సరును మరియు దశను నిర్థారణ చేసేందుకు చాలా తరచుగా ఉపయోగించబడుతుంది. ఈ స్కాన్ కొన్ని రకాల క్యాన్సరుకు చేయబడుతుంది. మెదడు, వెన్నెముక మరియు పెల్విస్ (పొత్తికడుపు దిగువ భాగం) లాంటి ఏరియాల్లో సిటి కంటే మెరుగైన ఇమేజ్లను ఎంఆర్ఐ ఉత్పత్తి చేస్తుంది. కొంతమంది రోగులకు ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవడం కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే స్కాన్ తీసేటప్పుడు వాళ్ళకు క్లాస్ట్రోఫోబిక్ అనుభూతి కలుగుతుంది. ఎంఆర్ఐ స్కాన్లకు పట్టే సమయం 20 నిమిషాల నుంచి గంట వరకు సుదీర్ఘ సమయం ఉంటుంది. మెరుగైన ఇమేజ్లు పొందడానికి స్కాన్ సమయంలో కాంట్రాస్ట్ ఏజెంట్ ఎక్కించబడుతుంది. సీక్వెన్స్లుగా స్కాన్ తీయబడుతుంది మరియు క్యాన్సరు రోగుల్లో ఒక స్కాన్లో సాధారణంగా అనేక సీక్వెన్స్లు తీయబడతాయి.

ఎఫ్18 ఎముక స్కాన్

ఈ స్కాన్ పిఇటి-సిటి స్కాన్ మాదిరిఆ ఉంటుంది, కానీ ఎముకల్లో క్యాన్సరు ఉందా అనే విషయం కనిపెట్టడం స్కాన్ ఉద్దేశం. రోగనిర్థారణ చేసిన తరువాత ఎముక స్కాన్లు తీయబడతాయి మరియు క్యాన్సరు దశను నిర్ణయించడంలో సహాయపడతాయి. ఎముకల్లో క్యాన్సరును కనిపెట్టడంలో టెక్నెటియమ్ ఎముక స్కాన్ కంటే ఎఫ్8 ఎముక స్కాన్ మరింత సున్నితంగా ఉంటుందని చెబుతారు.

టెక్నెటియమ్99 ఎముక స్కాన్

ఈ రకమైన స్కాన్ ఎముకల్లో క్యాన్సరును చూసేందుకు కూడా ఉపయోగిస్తారు మరియు ఎఫ్18 స్కాన్ కంటే సాధారణంగా చౌకయినవి.

నొప్పి నియంత్రణ

మంచి పెయిన్ కిల్లర్స్తో నొప్నిని నియంత్రించవచ్చు, వీటిల్లో పారాసెటమోల్ లాంటి ఔషధాలు, ఇబుబ్రోఫెన్ మరియు డైక్లోఫెనాక్ లాంటి ఎన్ఎస్ఎఐడి ఔషదాలు మరియు మరింత తీవ్ర నొప్పిలో ట్రమడోల్, బుప్రెనోర్ఫిన్, మోర్ఫిన్, ఫెంటానిల్ లాంటి ఒపియాడ్ ఔషధాలు లేదా ఇతర ఒపియాడ్ ఔషధాలు ఉండొచ్చు. ఏ ఔషధాలను ఉపయోగించాలనే విషయం నొప్పి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది మరియు డాక్టరు దీనిని మదింపు చేస్తారు.

రేడియోథెరపి

ప్రభావిత ఎముకకు రేడియోథెరపి కోర్సు నొప్పిని బాగా నియంత్రిస్తుంది. సాధారణంగా, ఈ ప్రక్రియతో 70%-80% మందికి నొప్పిని నియంత్రించే అవకాశం ఉంది. రేడియోథెరపి కోర్సులో సాధారణంగా మొత్తం 1-10 చికిత్సలు ఉంటాయి. వెన్నెముకలో పరిమిత ఎముక మెటాస్టాసెస్ గల రోగులకు, స్టీరియోటాక్టివ్ బాడీ రేడియోథెరపి (ఎస్బిఆర్టి) లాంటి రేడియోథెరపి యొక్క కొత్త టెక్నిక్లు చాలా ప్రభావవంతంగా ఉండొచ్చు.

సర్జరీ

ఎముకలో ఫ్రాక్చర్ ఉన్న రోగుల్లో లేదా సమీప భవిష్యత్తులో ఫ్రాక్చర్ అపాయం ఎక్కువగా ఉన్న రోగుల్లో, ఫ్రాక్చర్ని పరిష్కరించేందుకు సర్జరీ ఒక చికిత్స ఎంపిక. నొప్పి నియంత్రణకు ఈ ప్రక్రియ సహాయపడుతుంది మరియు ప్రభావిత కాలు పనితనాన్ని మెరుగుపరుస్తుంది.

ఔషధాలు

ఎముక మెటాస్టాసెస్ గల రోగులకు, ఎముకలను దృఢపరచుకోవడానికి మరియు ఫ్రాక్చర్ల ప్రమాదాన్ని నిరోధించేందుకు మందులు ఇవ్వబడతాయి. బిస్ఫోఫోనేట్స్గా పిలవబడే ఔషధాల గ్రూప్ ఈ సెట్టింగ్లో మామూలుగా ఉపయోగించబడుతుంది. ఇవి సాధారణంగా సిరలోకి ఇవ్వబడతాయి. పమిడ్రోనేట్, జొలెడ్రోనేట్ లేదా జొలెడ్రోనిక్ యాసిడ్ అనేవి ఉపయోగించబడే ఔషధాలు. వీటిని ప్రతి 3-6 వారాలకు ఇవ్వవచ్చు. కొన్ని బిస్ఫాస్ఫోనేట్స్ని నోటి ద్వారా ఇవ్వవచ్చు, కానీ సాధారణంగా ఇంట్రావీనస్ మార్గాన్ని ఉపయోగిస్తారు.
ఆస్టియోక్లాస్ట్ ఇన్హిబిటర్లు అనే మరొక గ్రూప్ ఔషధాలు కూడా ఉపయోగించబడతాయి. ఇవి బిస్ఫాస్ఫోనేట్స్ కంటే మరింత ప్రభావవంతంగా ఉంటాయి, కానీ చాలా ఖరీదైనవి కూడా. డెనోసుమాబ్ లాంటి ఈ గ్రూప్కి చెందిన ఔషధాలు ఇంజెక్షన్గా ఇవ్వబడతాయి.
క్యాల్షియం మామూలుగా లేదా తక్కువగా ఉన్న రోగుల్లో ఎముకలను దృఢపరచడానికి సహాయపడేందుకు క్యాల్షియం మరియు విటమిన్ డి ఇవ్వబడతాయి.