Brain Metastases

మెదడు మెటాస్టాసెస్

సెకండరి లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్

రొమ్ము, ఊపిరితిత్తులు తదితర లాంటి శరీరంలోని ఒక భాగంలో క్యాన్సరు ప్రారంభమై కాలేయం, మెదడు లేదా ఎముకలు లాంటి ఇతర ప్రాంతాలకు వ్యాపించవచ్చు. ఇది ప్రారంభమైన చోటును ప్రాథమిక సైట్ అంటారు మరియు ఇది వ్యాపించిన ప్రాంతాలను సెకండరి సైట్స్ అంటారు మరియు ఇక్కడ ఉన్న క్యాన్సరును సెకండరి క్యాన్సరు లేదా మెటాస్టాటిక్ క్యాన్సరు అంటారు.

మెదడు మెటాస్టాసెస్

క్యాన్సరు మెదడుకు వ్యాపించినప్పుడు మెదడు మెటాస్టాసెస్ కలుగుతాయి. మెదడుకు మామూలుగా వ్యాపించే క్యాన్సర్లు రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు గ్యాస్ట్రోఇంటెస్టినల్ మార్గం క్యాన్సర్లు.

మెదడు మెటాస్టాసెస్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. వీటిల్లో ఒకటి గట్టి మెటాస్టాసెస్, దీనిలో మెదడులో క్యాన్సరు గట్టిగా ఉంటుంది. రెండవది సిస్టిక్ మెటాస్టాసెస్, దీనిలో మెటాస్టాసెస్ ఫ్లూయిడ్ నిండిన తిత్తి మాదిరిగా ఉంటుంది. గట్టి మరియు సిస్టిక్ కాంపొనెంట్లతో మిశ్రమంగా ఉండొచ్చు.

మెటాస్టాసెస్ వల్ల మెదడులో ఏ ప్రాంతం ప్రభావితమైందనే దానిపై ఆధారపడి మెదడు మెటాస్టాసెస్ లక్షణాలు కలిగించవచ్చు. రోగులకు కలిగే మామూలు లక్షణాల్లో ఉంటాయి

తలనొప్పులు

ఇవి కలగడం మామూలు విషయం మరియు సాధారణ తలనొప్పుల కంటే ఎక్కువగా ఉంటాయి, ఉదయం నిద్ర లేచినప్పుడు ఎక్కువగా ఉండొచ్చు మరియు మందగొడిగా లేదా పోటుపుడుతున్నట్లుగా ఉంటాయి. తలనొప్పులు వాంతులు లేదా వాంతులు లాంటి అనుభూతితో ముడిపడివుండొచ్చు (వికారం) ముడిపడివుండొచ్చు.

గెయిట్ అవాంతరం

మెదడు మెటాస్టాసెస్ గల ప్రజలు తమ పాదాలపై అస్థిర లక్షణాలు ఉండొచ్చు లేదా నడవలేకపోవచ్చు. వీళ్ళకు వెర్టిగో, సమతూకం కోల్పోవుట లేదా వణుకుడు ఉండొచ్చు.

వికారం మరియు వాంతులు

మెదడు మెటాస్టాసెస్ గల వ్యక్తిలో వాంతుల అనుభూతి లేదా ఇతర లక్షణాలతో కూడిన వాస్తవ వాంతులు కావచ్చు. వాంతులు రెగ్యులర్గా మరియు మరింత ఫోర్స్గా ఉండొచ్చు.

బలహీనత

కాళ్ళు లేదా బాహువుల్లో లేదా శరీరంలో ఒక వైపు బలహీనత మెదడు మెటాస్టాసెస్ యొక్క లక్షణం అయివుండొచ్చు.

ఫిట్స్

ఫిట్స్ లేదా సీజర్లు మెదడు మెటాస్టాసెస్ యొక్క లక్షణం అయివుండొచ్చు. ఈ ఫిట్స్ శరీరంలోని ఒక భాగంలో పాక్షికంగా ఉండొచ్చు లేదా శరీరం మొత్తంతో మరియు నిద్రమగతతో ముడిపడివుండొచ్చు.

జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, తికమక

ఇటీవల జ్ఞాపకశక్తి కోల్పోవడం, తికమక మరియు మానసిక స్థితి కుంగిపోవడం కొత్తగా రావడం లేదా వ్యక్తిత్వంలో మార్పు మెదడు మెటాస్టాసెస్కి సంబంధించిన లక్షణాలు కావచ్చు.

కంటికి అవాంతరాలు

మెదడు మెటాస్టాటిస్ గల రోగుల్లో కంటిచూపు అవాంతరాలు కనిపిస్తాయి. వాళ్ళకు కంటిచూపు మసకబారవచ్చు, రెండుగా కనిపించవచ్చు లేదా ఒక వైపుకు చూసినప్పుడు కంటిచూపు లేకపోవచ్చు.

మెదడు మెటాస్టాసెస్ని అనుమానించినప్పుడు, ఈ కింది పరీక్షలు చేయబడవచ్చు.

మెదడుకు సిటి స్కాన్

మెదడు మెటాస్టాసెస్ని చూసేందుకు మెదడుకు కాంట్రాస్ట్ ఎన్హేన్స్డ్ సిటి స్కాన్ తీస్తారు. స్కాన్ త్వరగా ఉంటుంది, కానీ సాధారణంగా చిన్న మెదడు మెటాస్టాసెస్ని తీసుకునేందుకు ఎంఆర్ఎం కంటే తక్కువ సున్నితంగా ఉంటుంది.

ఎంఆర్ఐ స్కాన్

అనుమానం ఉన్న చోట మెదడు మెటాస్టాసెస్ని చూఏందుకు మెదడుకు కాంట్రాస్ట్ ఎన్హేన్స్డ్ ఎంఆర్ఐ స్కాన్ ఉత్తమ పరీక్ష. సిటి స్కాన్ లేదా ఇతర స్కాన్ల కంటే ఎంఆర్ఐ స్కాన్ మెరుగైన వివరాలు ఇస్తుంది.

బయాప్సీ

మెదడులో అనుమానాస్పద ఏరియాకు బయాప్సీ మెదడు మెటాస్టాసెస్ని నిర్థారణ చేసేందుకు మామూలుగా చేయబడుతుంది. ఇటీవల క్యాన్సరు చరిత్ర లేని లేదా స్కాన్ ఫలితాలు మెదడు మెటాస్టాసెస్ని సూచించని చోట రోగుల్లో ఇది ఎక్కువగా చేయబడుతుంది.

శరీరం మొత్తానికి సిటి లేదా పిఇటి-సిటి స్కాన్

కొన్నిసార్లు, మరెక్కడైనా ప్రారంభమైన క్యాన్సరు కంటే ముందుగా మెదడు మెటాస్టాసెస్ని మొదటగా నిర్థారణ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సరు ప్రారంభమైన అసలు చోటును మరియు మెదడులోకి వ్యాపించిన చోటును కనుగొనేందుకు సిటి లేదా పిఇటి-సిటి స్కాన్లు తీస్తారు.

మెదడు మెటాస్టాసెస్కి చికిత్స ఎంపికలు రోగి ఫిట్నెస్, మిగతా శరీరంలో క్యాన్సరు ప్రవర్తన మరియు పూర్వ చికిత్సలకు స్పందన మరియు మెదడులో కనిపించిన మెటాస్టాసెస్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఈ కారకాలపై ఆధారపడి చికిత్స వ్యక్తిగతంగా ఉంటుంది.

స్టీరాయిడ్లు

స్టీరాయిడ్లు అనేవి మెదడు మెటాస్టాసెస్కి చికిత్స చేసేందుకు ఉపయోగించే ఔషధాలు. క్యాన్సరు మెదడులోకి ప్రవేశించినప్పుడు దీని చుట్టూ ఫ్లూయిడ్ జమవుతుంది (సెరెబ్రల్ ఎడెమా). ఇది మెదడులో పీడనం పెరగడానికి దారితీసి లక్షణాలన్నీ తీవ్రతరమయ్యేలా చేస్తుంది. మెదడులో ఫ్లూయిడ్ని తగ్గించడానికి స్టీరాయిడ్లు సహాయపడతాయి, తద్వార లక్షణాలను మెరుగుపరుస్తాయి. డెక్సామెథాసోన్ అనేది ఈ సెట్టింగ్లో ఎక్కువగా ఉపయోగించే స్టీరాయిడ్. దీనిని టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటారు. టాబ్లెట్లుగా తీసుకున్నప్పుడు, పొట్టలో మంటపుట్టడాన్ని నిరోధించేందుకు దీనిని ఆహారం తరువాత తీసుకోవాలి. ఈ మంటను తగ్గించేందుకు దీనితో పాటు ఇతర టాబ్లెట్లు ఇవ్వబడతాయి. సుదీర్ఘ కాలం పాటు తీసుకున్నప్పుడు, స్టీరాయిడ్లు బరువు పెరగడం, ముఖం వాపు, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి దుష్ప్రబావాలు కలిగించవచ్చు.

యాంటీకన్వల్సంట్స్

అప్పటికే ఫిట్స్ కలిగిన లేదా ఫిట్స్ కలిగే ప్రమాదం గల రోగుల్లో ఫిట్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఉపయోగించబడే ఔషధాలు ఇవి. ఈ పని కోసం ఉపయోగించగల అనేక ఔషధాలు లభిస్తున్నాయి.

సర్జరీ

చికిత్సకు సర్జరీ మరియు మెదడు మెటాస్టాసెస్ని తొలగించడం ఎంపిక. మెదడులో పరిమిత సంఖ్యలో మెటాస్టాసెస్ (ప్రధానంగా సింగిల్ మెటాస్టాసిస్) గల రోగుల్లో దీనిని మరింత తరచుగా ఉపయోగిస్తారు. శరీరంలోని ఇతర భాగాఆల్లో క్యాన్సరు కణాలను బాగా నియంత్రించబడుతుంది మరియు రోగిలో మంచి ఫిట్నెస్ ఇస్తుంది. సర్జరీ సాధ్యమయ్యే చోట మెదడు భాగంలో కూడా మెటాస్టాసెస్ ఉంటాయి. సర్జరీ కొన్నిసార్లు కణితిలోని ఒక భాగాన్ని మాత్రమే తొలగించగలుగుతుంది. మెదడుకు క్యాన్సరు తిరిగొచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు సర్జరీ పూర్తయిన తరువాత రేడియోథెరపి ఉపయోగించబడుతుంది.

రేడియోథెరపి

మెదడు మెటాస్టాసెస్ చికిత్సకు రేడియోథెరపి ఒక ఎంపిక. మెదడు మెటాస్టాసెస్ గల అత్యధిక మంది రోగుల్లో, ఈ స్థితికి చికిత్స చేసేందుకు స్టీరాయిడ్లతో పాటు ఏకైక చికిత్సగా రేడియోథెరపి ఉపయోగించబడుతుంది. ఈ స్థితికి విభిన్న రేడియోథెరపి టెక్నిక్లు లభిస్తున్నాయి.

చిన్నవిగా ఉన్న సింగిల్ లేదా చాలా పరిమిత సంఖ్యలో గల మెదడు మెటాస్టాసెస్కి, స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (ఎస్ఆర్ఎస్) ఒక చికిత్స ఎంపిక. ఆధునిక రేడియోథెరపి మెషీన్లను ఉపయోగించి అత్యంత కచ్చితమైన విధానంలో మెదడులో అసాధారణ ఏరియాకు అధిక మోతాదులో రేడియేషన్ ఇవ్వడం ఎస్ఆర్ఎస్లో ఉంటుంది. ఉపయోగించిన మెషీన్పై ఆధారపడి చికిత్స 5-40 నిమిషాలు ఉండొచ్చు. ఎస్ఆర్ఎస్ సాధ్యపడకపోతే, ఫ్రాక్షనేటెడ్ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపిని (ఎఫ్ఎస్ఆర్టి) ఉపయోగిస్తారు, ఎందుకంటే ఎస్ఆర్ఎస్ కంటే కొద్దిగా పెద్దగా ఉన్న మెదడు మెటాస్టాసెస్కి ఇది చికిత్స చేయగలుగుతుంది కాబట్టి.

చాలా బాగా ఫిట్గా లేని లేదా ఎక్కువ మెదడు మెటాస్టాసెస్ గల మరియు పైన పేర్కొన్న టెక్నిక్లు అనువుగా లేని రోగులకు, మెదడు మొత్తానికి రేడియోథెరపి ఉపయోగించబడుతుంది. ఇక్కడ చికిత్స మెదడు మొత్తానికి 5-15 రోజుల్లో ఇవ్వబడుతుంది. కొంతమంది రోగుల్లో, సంపూర్ణ మెదడు మరియు ఎస్ఆర్ఎస్ లేదా ఎఫ్ఎస్ఆర్టి మిశ్రమం కూడా ఉపయోగించవచ్చు. రేడియోథెరపి యొక్క దుష్ప్రభావాల్లో అలసట, జుట్టు ఊడటం, నిద్రమత్తు, తలనొప్పులు, వికారం మరియు వాంతులు, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత ప్రమాదం కొద్దిగా సుదీర్ఘ కాలం పాటు ఉండటం ఉంటాయి. రేడియోనెక్రోసిస్ అనేది ఎస్ఆర్ఎస్ మరియు ఎఫ్ఎస్ఆర్టి చికిత్స యొక్క దీర్ఘకాలిక దుష్ప్రభావం.

కీమోథెరపి

మెదడు మెటాస్టాసెస్కి కీమోథెరపి మామూలు చికిత్స ఎంపిక కాదు, ఎందుకంటే రక్త మెదడు బ్యారియర్ ఉండటం వల్ల మెదడుకు అత్యధిక కీమోథెరపి ఔషధాలు వెళ్ళవు కాబట్టి.

బయోలాజికల్ థెరపి

క్యాన్సరు కణాల్లోని నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే ఔషధాలు బయోలాజికల్ లేదా లక్షిత థెరపిలో ఉంటాయి. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కారణంగా, ఎముక మెటాస్టాసెస్ని నియంత్రించడంలో కొన్ని ఔషధాలు మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి మరియు రొమ్ము మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు.