పిల్లల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌లు

పిల్లల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌లు

కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు మరియు వెన్నెముక ఉంటాయి. మెదడు పుర్రె క్యావిటిలో ఉంటుంది మరియు ఇది మెత్తని నిర్మాణం మరియు దీనిలో నరం కణాలు మరియు ఇతర రకాల కణాలు ఉంటాయి. వెన్నెముక గొట్టం-లాంటి నిర్మాణం. ఇది వెన్నెలో ఉంటుంది మరియు పైన మెదడు వరకు కొనసాగుతుంది. ఇవన్నీ కలసి సిఎన్‌ఎస్‌ లేదా కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి.

మెదడు లోపల కలిగే కణితులను బ్రెయిన్‌ ట్యూమర్‌లు అని అంటారు మరియు వెన్నెముకలో కలిగే వాటిని స్పైనల్‌ కార్డ్‌ ట్యూమర్‌లు అంటారు,

కణితులు నిరపాయకరంగా లేదా ప్రాణాంతకంగా ఉంటాయి మరియు మామూలు వాటిని ఈ కింద ఇవ్వడమైనది.

పిల్లల్లో ప్రాథమిక మెదడు కణితులు అనేవి రక్తం సంబంధ కణితుల తరువాత పిల్లల్లో కలిగే రెండవ అత్యంత సామాన్యమైన కణితులు. పిల్లల్లో కలిగే మెదడు కణితుల్లో తక్కువ మరియు ఎక్కువ గ్రేడ్ గ్లయోమాస్, మెడుల్లోబ్లాస్టోమా, ఎపెన్డైమోమా, కానియోఫారింజియోమా, జెర్మ్ సెల్ కణితులు మరియు నరం షీత్ కణితులు ఉంటాయి. సామాన్యమైన వాటిని ఈ కింద ఇవ్వడమైనది.

బ్రెయిన్‌ ట్యూమర్‌ల లక్షణాలు మరియు రోగనిర్థారణ

ఈ కణితులతో ముడిపడివుండే లక్షణాల్లో తలనొప్పులు, కంటిచూపులో మార్పులు, ఫిట్స్‌, నిద్రమగత, తికమక, కదలిక తగ్గడం మరియు నీరసం లాంటివి ఉంటాయి. మెదడు లేదా వెన్నెముకకు ఎంఆర్‌ఐ సిటి స్కాన్‌ లాంటి స్కాన్‌లు తీయడం ద్వారా రోగనిర్థారణ చేయబడుతుంది.

గ్లయోమస్‌ అనేవి గ్లయల్‌ కణాలు వల్ల మెదడు మరియు వెన్నెముకకు కలిగే కణితులు. బాల్యంలో కలిగే బ్రెయిన్‌ ట్యూమర్‌లలో ఇవి 30-40% ఉంటాయి. మెదడులోని ఆస్ట్రోసైట్స్‌ నుంచి ఇవి కలుగుతాయి మరియు ఆస్ట్రోసైటోమస్‌ అనే ఇవి ఆలిగోడెండ్రోలగ్లియల్‌ కణాల వల్ల కలుగుతాయి మరియు ఆలిగోడెండ్రోగ్లయోమాస్‌ అని అంటారు. తక్కువ గ్రేడ్‌ గ్లయోమస్‌ నెమ్మదిగా వృద్ధిచెందే కణితులు.

ఈ కణితులకు గల చికిత్స ఎంపికల్లో సర్జరీ, రేడియోథెరపి మరియు కీమోథెరపి ఉంటాయి. ఎక్కువ దుష్ప్రభావాలు కలిగించకుండా కణితిని తొలగించగలమని భావిస్తే మొదటి చికిత్స సాధారణంగా సర్జరీ ఉంటుంది. సర్జరీ సాధ్యపడని రోగుల్లో లేదా సర్జరీ అసంపూర్ణంగా ఉన్న చోట లేదా సర్జరీ క్యాన్సరు తిరిగొచ్చిన చోట, వ్యాధిని నియంత్రించేందుకు రేడియోథెరపి మంచి ఎంపిక అవుతుంది. రేడియోథెరపి 6 వారాల పాటు వారానికి 5 రోజులు రోజుకు ఒకసారి ఇవ్వబడుతుంది. రేడియోథెరపి తరువాత వ్యాధి పెరిగితే కీమోథెరపిని ఉపయోగించవచ్చు మరియు మామూలుగా ఉపయోగించే ఔషధాల్లో కార్బోప్లాటిన్‌ మరియు విన్‌క్రిస్టిన్‌ ఉంటాయి.

గ్లయోమస్‌ని భిన్న గ్రేడ్‌ల్లోకి విభజించవచ్చు. గ్రేడ్‌ 1 మరియు 2ని తక్కువ గ్రేడ్‌ అని మరియు గ్రేడ్‌లు మరియు 3 మరియు 4ని అధిక గ్రేడ్‌ అంటారు. అధిక గ్రేడ్‌ కణితులు చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి, కాబట్టి వేగంగా పెరుగుతుంటాయి. అధిక గ్రేడ్‌ గ్లయోమస్‌ లక్షణాలు తక్కువ కాలం ఉండటం మినహా తక్కువ గ్రేడ్‌ వాటి మాదిరిగా ఉంటాయి. రోగనిర్థారణను నిరూపించేందుకు బయాప్సీ చేయబడుతుంది. సర్జరీతో తొలగించే చోట కణితి ఉంటే సర్జరీ పరిగణనలోకి తీసుకోవచ్చు. లేకపోతే 6 వారాల పాటు రోజుకు ఒకసారి, వారానికి అయిదు రోజులు రేడియోథెరపి ఒక ఎంపిక అవుతుంది. కార్బోప్లాటిన్‌ మరియు టెమోజోలోమైడ్‌ లాంటి కీమోథెరపి ఉపయోగించబడతాయి.

బాల్యంలో వచ్చే ఎపెండిమోమ ప్రధానంగా 5 సంవత్సరాల లోపు వయస్సు పిల్లల్లో కలుగుతుంది మరియు బాల్యంలో వచ్చే మెదడు కణితిలన్నిటిలో ఇది దాదాపు 10% ఉంటుంది. మెదడులో ఉండే ఎపెండిమల్‌ కణాల వల్ల కలుగుతాయి.

ఎపెండిమోమలకు సర్జరీతో మరియు ఆ తరువాత రేడియోథెరపితో బాగా చికిత్స చేయవచ్చు. సర్జరీ చేయడం సాధ్యమైతే, ఉత్తమంగా నయం చేస్తుంది. మెదడులో కణితి ఉన్న చోట రేడియోథెరపి ఇవ్వబడుతుంది మరియు 6 వారాల పాటు ఇవ్వబడుతుంది. రేడియోథెరపి సాధారణంగా 3 సంవత్సరాల లోపు పిల్లలకు ఇవ్వబడదు ఎందుకంటే, వీళ్ళలో మెదడు వికాసాన్ని ఇది గణనీయంగా ప్రభావితం చేయవచ్చు. రేడియోథెరపి ఇవ్వలేనప్పుడు లేదా సర్జరీ మరియు రేడియోథెరపి తరువాత క్యాన్సరు తిరిగొచ్చినప్పుడు కీమోథెరపి ఇవ్వబడుతుంది. ఈ సెట్టింగులో సిస్‌ప్లాటిన్‌ ఆధారిత కీమోథెరపి ఇవ్వబడుతుంది.

మెడుల్లోబ్లాస్టోమా అనేది సెరెబెల్లమ్‌ అనే మెదడు భాగంలో ప్రారంభమయ్యే క్యాన్సరు. పిల్లల్లో అత్యంత సామాన్యంగా ఉండే మెదడు కణితి. ఇది దాదాపుగా 5-6 సంవత్సరాల వయస్సులో కలుగుతుంది.

లక్షణాలు

మెడుల్లోబ్లాస్టోమా గల పిల్లల్లో ఈ కింది లక్షణాలు ఉంటాయి. మెడుల్లోబ్లాస్టోమా గల రోగుల్లో తలనొప్పులు సామాన్యంగా ఉంటాయి. ఇవి రాత్రి వేళలో లేదా ఉదయం వేళలో కలగవచ్చు. ఇవి వాంతులు, వికారం మరియు ప్రవర్తన మారడంతో కూడివుండొచ్చు. ఈ కణితులు రోగుల కదలికలో మార్పు కలిగించవచ్చు. వాళ్ళు తమ కాళ్ళపై స్థిరంగా ఉండలేకపోవచ్చు. ఇది అకస్మాత్తుగా రావచ్చు లేదా క్రమేపీ పెరగవచ్చు. మెడుల్లోబ్లాస్టోమా గల రోగులకు కంటిచూపు అస్పష్టంగా ఉండొచ్చు లేదా తలతిరుగుతున్నట్లు అనిపించవచ్చు లేదా రెండుగా కనిపించవచ్చు. రోగులకు క్రమేపీ నిద్రమత్తు కలగవచ్చు మరియు మెదడులో ఒత్తిడి పెరగడం వల్ల స్ప్రుహ తగ్గవచ్చు.

మెడుల్లోబ్లాస్టోమాలో పరిశోధనలు

మెడుల్లోబ్లాస్టోమాను అనుమానించినప్పుడు, మెదడుకు ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయడం చేయబడే మొదటి పరీక్ష. మెదడులో కణితిని చూడటానికి సిటి స్కాన్‌ కంటే ఎంఆర్‌ఐ మెరుగ్గా ఉంటుంది. లంబార్‌ పంక్చర్‌లో వెన్నెముక కెనాల్‌లో సూది గుచ్చి ఫ్లూయిడ్‌ శాంపిల్‌ని (సిఎస్‌ఎఫ్‌) తీస్తారు. మెడుల్లోబ్లాస్టోమా కణాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఈ ఫ్లూయిడ్‌ని పరీక్షిస్తారు, ఎందుకంటే మెదడు నుంచి ఫ్లూయిడ్‌ ద్వారా ఈ కణితి వెన్నెముకలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. సర్జరీ చేశాక మెడుల్లోబ్లాస్టోమా కచ్చితంగా రోగనిర్థారణ చేయబడుతుంది మరియు కణితిని తొలగించి సూక్ష్మదర్శినితో పరీక్షించడం జరుగుతుంది. ఎలాగూ సర్జరీ అవసరమవుతుంది కాబట్టి వేరేగా బయాప్సీ చేయబడదు మరియు ఎంఆర్‌ఐ బాగా రోగనిర్థారణ చేస్తుంది.

మెడుల్లోబ్లాస్టోమా స్టేజింగ్

ఈ కింద ఇవ్వబడిన మార్పు ప్రామాణికత ప్రకారం మెడుల్లోబ్లాస్టోమాకు స్టేజింగ్‌ ఇవ్వబడుతుంది:

కణితి విస్త్రుతి

టి1 3 సెంమీ కంటే తక్కువ కణితి
టి2 3 సెం.మీకి మించిన కణితి
టి3 3 సెం.మీ కంటే ఎక్కువ కణితి మరియు సిల్వియస్‌ యొక్క ఆక్వాడెక్ట్‌మరియు/లేదా లస్క్‌కా ఫోరామెన్‌ లాంటి నిర్మాణాల్లోకి లేదా మెదడు స్టెమ్‌లోకి విస్తరించవచ్చు.
టి4 3 సెం.మీ కంటే ఎక్కువ కణితి మరియు సిల్వియస్‌ లేదా ఫోరామెన్‌ మ్యాగ్నమ్‌ యొక్క ఆక్వాడెక్ట్ ని దాటి విస్తరించవచ్చు.

మెటాస్టాసెస్‌ డిగ్రీ

ఎం0 గ్రాస్‌ మెటాస్టాసెస్‌ ఉన్నట్లు సాక్ష్యం లేదు
ఎం1 వెన్నెముకలోని ఫ్లూయిడ్‌లో ఉండే (సిఎస్‌ఎఫ్‌) మైక్రోస్కోపిక్‌ కణాలు
ఎం2 మెదడు లేదా 3వ లేదా లేటరల్‌ వెంట్రికల్స్‌లో సబరాక్నోయిడ్‌ స్థలంలో వ్యాధి కనిపిస్తుంది.
ఎం3 వెన్నెముకలోని సబరాక్నోయిడ్‌ స్థలంలో వ్యాధి కనిపిస్తుంది.
ఎం4 మెదడు లేదా వెన్నెముక బయట మెటాస్టాసెస్‌ ఉండటం

మెడుల్లోబ్లాస్టోమాకు చికిత్స

సర్జరీ, రేడియోథెరపి మరియు కీమోథెరపిలను మెడుల్లోబ్లాస్టోమాకు చికిత్సలు ఉపయోగించబడతాయి. శిశువు వయస్సుపై ఆధారపడి చికిత్స ఎంపికలు భిన్నంగా ఉంటాయి. 3 సంవత్సరాల వయస్సు మించిన పిల్లలకు మరియు చాలా ముదిరిన వ్యాధి లేని వారికి, మెదడులోని క్యాన్సరును సర్జరీ ద్వారా తొలగించడం మొదటి చికిత్స ఎంపిక. దీని తరువాత వాళ్ళకు కీమోథెరపితో పాటు రేడియోథెరపి ఇవ్వబడుతుంది, వీటిల్లో విన్‌క్రిస్టిన్‌, సిసిఎన్‌యు మరియు సిస్‌ప్లాటిన్‌ లాంటి ఔషధాలు ఉంఆయి. ఈ రేడియోథెరపి మెదడు మరియు వెన్నెముక మొత్తానికి ఇవ్వబడుతుంది. దీనిని క్రానియోస్పైనల్‌ ఇరాడియేషన్‌ అంటారు. మొదట్లో రేడియోథెరపి మెదడుకు మరియు వెన్నెముకకు ఇవ్వబడుతుంది, ఆ తరువాత మెదడుకు రేడియోథెరపి ఎక్కువగా ఇవ్వబడుతుంది. కీమోరేడియోథెరపి దాదాపు 6 వారాలు ఉంటుంది. ఆ తరువాత కీమోథెరపి మాత్రమే ఇవ్వబడుతుంది.

3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలకు, ఆ వయస్సులో ఎదుగుతున్న మెదడు దెబ్బతినే ప్రమాదం ఉన్న కారణంగా రేడియోథెరపి పరిగణించబడదు. ఈ పిల్లలకు సర్జరీతో చికిత్స చేసి ఆ తరువాత కీమోథెరపి ఇవ్వబడుతుంది. ఈ కీమోథెరపిలో ఔషధాల సమ్మేళనం ఉంటుంది. మెటాస్టాటిక్‌ వ్యాధి ముదిరిన లేదా నయం చేయలేని పిల్లలకు క్రానియోస్పైనల్‌ రేడియోథెరపి, ఆ తరువాత కీమోథెరపి ఇవ్వబడతాయి.

చికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలు

పై చికిత్సలు చేయించుకున్న పిల్లలు యువకులు కాబట్టి, చికిత్సల వల్ల దుష్ప్రభావాలు కలిగే సంభావ్యత ఉంది. మెదడు వికాసం తగ్గడం, వినికిడి కోల్పోవడం, వెన్నెముకకు రేడియోథెరపి ప్రభావం వల్ల శిశువు ఎదుగుదల తగ్గడం, థైరాయిడ్‌ గ్రంథి పనితనం తగ్గడం మరియు ఇతర ఎండోక్రైన్‌ గ్రంథులు వీటిల్లో ఉండొచ్చు. చికిత్స తరువాత ఇలాంటి దుష్ప్రభావాలను పర్యవేక్షించేందుకు పిల్లలకు క్రమంతప్పకుండా డాక్టరు వద్ద పరీక్షలు చేయించాలి.

ఇవి మెదడులో పిచ్యూటరి గ్రంథికి సమీపంలో కలిగే కణితులు. ఈ కణితి వల్ల కలిగిన లక్షణాలు ప్రధానంగా చుట్టూ ఉన్న నిర్మాణాలపై స్థానిక పీడన ప్రభావాల వల్ల ప్రధానంగా కలుగుతాయి మరియు కంటిచూపు మసకారడం లేదా రెండుగా కనిపించడం, తలనొప్పులు, నిద్రమగత తదితర లాంటి కంటిచూపులో మార్పులు ఉంటాయి. చికిత్స సర్జరీ రూపంలో ఉంటుంది ఎందుకంటే ఇది ఉత్తమంగా నయం చేస్తుంది. సర్జరీ తరువాత వ్యాధి ఉంటే లేదా సర్జరీ తరువాత మళ్ళీ కలిగితే, వ్యాధిని నియంత్రించేందుకు రేడియోథెరపి ఇవ్వబడుతుంది. ఈ చికిత్స 6 వారాల వరకు ఉంటుంది. బాల్యంలో పిల్లల్లో వచ్చే ఇతర వ్యాధుల మాదిరిగా, చాలా చిన్న పిల్లల్లో రేడియోథెరపిని నివారించవచ్చు. చికిత్స తరువాత, పిచ్యూటరి గ్రంథి పనిని పర్యవేక్షించేందుకు రోగిని సన్నిమితంగా పర్యవేక్షించడం జరుగుతుంది.

ఇవి పిల్లల మెదడులో అరుదుగా కనిపించే కణితులు. జెర్మ్ సెల్ కణితులు అనేవి శరీరంలోని విభిన్న భాగాల్లో ఉండే ప్రిమిటివ్ జెర్మ్ కణాల నుంచి కలిగే కణితులు. పిల్లల్లో క్రానియమ్ (పుర్రె) లోపల కణితులు ఎక్కువ సామాన్యంగా జీవితంలో రెండవ దశాబ్దంలో కలుగుతాయి. వీటిని విస్త్రుతంగా జెర్మినోమాస్ మరియు నాన్ జెర్మినోమటస్ జెర్మ్ సెల్ కణితుల్లోకి విభజించవచ్చు.

ఈ కణితులతో ముడిపడివున్న లక్షణాల్లో తలనొప్పులు, కంటి లక్షణాలు, వాంతులు, నిద్రమత్తుకు దారితీసేలా మెదడులో పీడనం పెరుగుదల ఉంటుంది. ఇతర లక్షణాల్లో పిచ్యూటరి గ్రంథి పనిచేయడం తగ్గడం ఉంటుంది, ఎందుకంటే ఈ కణితులు దానికి చేరువగా కలుగుతుంటాయి.

ఈ కణితులను సిటి లేదా ఎంఆర్ఐ స్కాన్, బీటా హెచ్సిజి, ఎఎఫ్పి రక్త పరీక్షలు మరియు కణితి బయాప్సీతో రోగనిర్థారణ చేయడం జరుగుతుంది. సిఎస్ఎఫ్ విశ్లేషణ మామూలుగా కూడా చేయబడుతుంది మరియు రోగనిర్థారణలో సహాయపడవచ్చు.

ఇంట్రాక్రానియల్ జెర్మ్ సెల్ కణితులకు చికిత్స జెర్మ్ సెల్ కణితి ఉపరకంపై ఆధారపడి ఉంటుంది. జెర్మినోమా గల రోగులను ఒక ఏరియాకు పరిమితం చేయడం జరుగుతుంది, మొత్తంగా మెదడుకు రేడియోథెరపి 4-5 వారాల్లో చేయబడుతుంది. మెదడు మరియు వెన్నెముకకు రేడియోథెరపిని ఈ ప్రాంతాలకు కణితి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నరోగుల్లో ఉపయోగించబడుతుంది.

నాన్ జెర్మినోమటస్ జెర్మ్ సెల్ కణితులకు చికిత్సలో కీమోథెరపి, ఆ తరువాత రేడియోథెరపి ఉంటుంది. కీమోథెరపిలో సాధారణంగా సిస్ప్లాటిన్ లేదా కార్బోప్లాటిన్ ఔషధాలతో సహా ఔషధాల సమ్మేళనం ఉంటుంది. ఇది 3-4 నెలల పాటు ఇవ్వబడుతుంది మరియు ఆ తరువాత మెదడు మరియు వెన్నెముకకు రేడియోథెరపి ఇవ్వబడుతుంది, ఇది 6 వారాల వరకు ఉండొచ్చు.