రొమ్ము క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్

రొమ్ము


కణజాలం, నాళాలు, కొవ్వు మరియు సహాయక కణజాలం వంటి గ్రంథితో తయారైన నిర్మాణమే రొమ్ము. కణజాలం వంటి గ్రంధి పాలు ఉత్పత్తి చేసే లోబ్స్ మరియు లోబ్యుల్స్ తో రూపొందించబడింది. డక్ట్స్ అనబడే గొట్టాలు, లోబ్స్ నుండి నిపుల్ వరకు పాల రవాణాకు సహాయపడతాయి. కొవ్వు మరియు సహాయక నిర్మాణాలు రొమ్ముకు ఆకారం మరియు రూపాన్ని అందిస్తాయి.

సాధారణంగా ఒక మహిళ జీవితకాలంలో రొమ్ము రూపాంతరం చెందుతుంది. ఛాతీ. యువతులలో ఛాతీ పెద్దగా మరియు దట్టంగా ఉంటుంది, మరియు వయసు పైబడిన స్త్రీలలో, ఛాతీ తక్కువగా ఉంటుంది. ఋతుస్రావం కాలం లో రొమ్ము బరువు మరియు స్థిరత్వంలో మార్పులు ఉండచ్చు. వారు ఆ సమయములో గడ్డలు ఉన్నట్టు కూడా అనుభూతి చెందుతారు.

రొమ్ము మరియు అక్సిల్లా (చంక)లో క్రింద చిత్రంలో కనిపించే విధంగా శోషరస గ్రంథులు ఉంటాయి. శోషరస కణుపులు రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగం మరియు ఇవి అంటువ్యాధుల నుండి రక్షణగా ఉంటాయి. రక్తంలోకి చుట్టుప్రక్కల ప్రాంతం నుండి శోషరస ద్రవం ప్రవహించటానికి ఇవి సహాయ పడతాయి.

రొమ్ము క్యాన్సర్


రొమ్ము కణజాలంలో మొదలయ్యే క్యాన్సర్ నే రొమ్ము క్యాన్సర్ అంటారు. ఇది లోబ్యుల్స్ నుండి మొదలయినప్పుడు అది లోబ్యులర్ కార్సినోమా మరియు డక్ట్స్ నుండి మొదలయినప్పుడు డక్తల్ కార్సినోమా అని పిలుస్తారు. ఈ రకమైన క్యాన్సర్లను ఇన్వేసివ్ క్యాన్సర్లుగా పిలుస్తారు. రొమ్ము యొక్క నాన్- ఇన్వేసివ్ క్యాన్సర్ల లో డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (డిసిఐఎస్) మరియు లోబ్యులార్ కార్సినోమా ఇన్ సిటు (ఎల్సిఐఎస్) ఉంటాయి. నాన్- ఇన్వేసివ్ క్యాన్సర్లకు ఆ పేరు ఎనుకు వచ్చిందంటే, అవి నిర్మాణాలను దాటలేవు మరియు ఇన్వేసీవ్ క్యాన్సర్ల వలే వేరే భాగాలకు వ్యాపించవు..

2018 నాటి గ్లోబోకాన్ సమాచారం ప్రకారం, 2018 నాటికి 1,62,468 కొత్త రొమ్ము క్యాన్సర్లను భారతదేశంలో నిర్ధారణ చేశారు, ఇది మొత్తం క్యాన్సర్లలో 14% ఉంటుంది.

వివిధ రకాలైన రొమ్ము క్యాన్సర్ లు ఉన్నాయి. సాధారణ రకాలు కింద ఇవ్వబడ్డాయి.

డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (డిసిఐఎస్)

ఇది రొమ్ము క్యాన్సర్ యొక్క మొట్టమొదటి రూపం. ఇక్కడ డక్ట్స్ లో క్యాన్సర్ కణాలు ఉంటాయి, అవి ఇంకా కణజాలం బయటికి వ్యాపించలేదు. ఇది క్యాన్సర్-పూర్వ స్థితిలో లేదా నాన్ – ఇన్వాసివ్ క్యాన్సర్ గా పిలువబడుతుంది. దీని అర్ధం, ఇది ఇప్పటికీ ఒక కాన్సర్ యొక్క సాంప్రదాయిక లక్షణాన్ని పొందలేదు, అంటే ఇతర నిర్మాణాలకు వ్యాపించే సామర్ధ్యం. చికిత్స చేయకుండా వదిలేస్తే, కొన్ని సంవత్సరాల్లో కొందరు రోగులలో డిసిఐఎస్ ఒక హానికరక క్యాన్సర్ గా అభివృద్ధి చెందవచ్చు. డిసిఐఎస్ ఒక మామోగ్గ్రామ్లో కనిపిస్తుంది మరియు రొమ్ముల స్క్రీనింగ్ జరుగుతున్నప్పుడు సాధారణంగా గుర్తించబడుతుంది.

లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు (LCIS)

రొమ్ము యొక్క లబ్ల్యుల్స్లో అసాధారణ కణాలు ఉన్నప్పుడు, క్యాన్సర్ పూర్వ స్థితిలో ఇది మరొక రకం. ఇది ఒక నాన్ ఇన్వేసీవ్ స్థితి, కానీ కొన్ని సంవత్సరాల్లో రొమ్ము క్యాన్సర్ గా అభివృద్ధి చెందవచ్చు.

ఇన్వేసివ్ డక్టల్ కార్సినోమా

ఇది డక్ట్స్ లో ప్రారంభమైన రొమ్ము క్యాన్సర్ మరియు డక్ట్స్ వెలుపల ఉన్న రొమ్ము కణజాలాలకు వ్యాపించింది. ఇది రొమ్ము క్యాన్సర్ యొక్క సాధారణ రూపం మరియు మొత్తం రొమ్ము క్యాన్సర్ల లో 80% వరకు ఉంటుంది.

ఇన్వేసివ్ డక్టల్ క్యాన్సర్ ను, ట్యూబులర్, క్రిబ్రిఫార్మ్, మెడుల్లరి, మ్యుసినస్, పాపిల్లారి వంటి ప్రత్యేక విభాగాలుగా విభజించవచ్చు లేదా ఎటువంటి ప్రత్యేక రకం కాని కూడా కావచ్చు.

ఇన్వెసివ్ లోబ్యులర్ కార్సినోమా

లోబ్యుల్స్ లో ప్రారంభమైన రొమ్ము క్యాన్సర్ ఇది. ఇది అన్ని రొమ్ము క్యాన్సర్లలో సుమారు 10% వరకు ఉంటుంది.

రొమ్ము యొక్క ఇన్ఫ్లమేటరీ క్యాన్సర్

ఈ రొమ్ము యొక్క ఒక అసాధారణ క్యాన్సర్, దీనిలో క్యాన్సర్ కణాలు రొమ్ము మరియు చర్మం ఉపరితలంపై ఉన్న చిన్న శోషరసాల ద్వారా పెరుగుతాయి. ఫలితంగా చర్మం మరియు రొమ్ము ఎరుపు తంగుకు మారుతుంది మరియు వాపు ఉంటుంది.

ఇన్ఫ్లమేటరీ క్యాన్సర్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల దర్యాప్తు మరియు చికిత్స వెంటనే అవసరమవుతుంది.

రొమ్ము యొక్క పాగెట్’స్ వ్యాధి

చనుమొనపై రాష్, దద్దుర్లు రావడం ఈ పరిస్థితి. ఈ స్థితిలో ఉన్న మహిళలకు అంతర్లీన రొమ్ము క్యాన్సర్ ఉండవచ్చు.

ఫిల్లోడ్స్ ట్యూమర్ ఆఫ్ ది బ్రెస్ట్

ఇది సాధారణంగా ఒక గడ్డలా అనిపించే రొమ్ము స్థితిలో మరొక రకం. ఒక ఫిల్లోడ్స్ కణితి ఒక నిరపాయమయిన స్థితి నుండి క్యాన్సర్లా ప్రవర్తించే స్థితికి రావచ్చు. క్యాన్సర్లా ప్రవర్తిస్తున్న ఒక దానికి నిరపాయమైన స్థితిగా ఉంటుంది. కణితి తొలగింపు తర్వాత కనుగొన్న ఫిల్లోడ్స్ రకం మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ లా ప్రవర్తించే కణితులకు శస్త్రచికిత్స తర్వాత రేడియోధార్మిక చికిత్స ఇవ్వబడుతుంది.

రొమ్ము క్యాన్సర్ అభివృద్ధికి అనేక ప్రమాద కారకాలు కారణం కావచ్చు.

వయసు

అనేక క్యాన్సర్ల మాదిరిగానే, వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మొత్తం రొమ్ము క్యాన్సర్లలో 70% పైగా 55 ఏళ్ల వయసు పైబడిన మహిళల్లో జరుగుతుంది.

జన్యుపరమైన

రొమ్ము క్యాన్సర్లలో కేవలం 5% మాత్రమే వంశపారంపర్యంగా రావచ్చు. మిగిలిన 95% ఆకస్మికంగా సంభవిస్తాయి. వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్లు యువ మహిళల్లో సంభవిస్తాయి. రొమ్ము, అండాశయ లేదా ఇతర క్యాన్సర్లు కలిగిన (కుటుంబంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ) బలమైన కుటుంబ చరిత్ర ఉన్నట్లయితే, మీ అంకాలజిస్టు లేదా జన్యుశాస్త్రవేత్తకి మరిన్ని పరీక్షల కోసం మాట్లాడటం మంచిది. బి.ఆర్.సి.ఎ 1 మరియు బి.ఆర్.సి.ఎ2 రెండు జన్యువులు, వీటిలో అసాధారణమైనవి పెరిగితే రొమ్ము క్యాన్సర్ మరియు ఓవరియన్, కోలన్, ప్యాంక్రియాటిక్ మరియు థైరాయిడ్ వంటి ఇతర క్యాన్సర్లు పొందే ప్రమాదాన్ని పెంచుతాయి. వంశపారంపర్య క్యాన్సర్ అన్న అనుమానం ఉంటే ఈ అసాధారణ జన్యువుల కోసం పరీక్ష చేయవచ్చు.

కుటుంబ చరిత్ర

రొమ్ము క్యాన్సర్తో ఉన్న దగ్గరి బంధువులు (సోదరి, తల్లి, కుమార్తె) కలిగిన స్త్రీలు మామూలు వారికంటే రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ప్రమాదం కలిగి ఉన్నారు.

30 సంవత్సరాల వయసులోపు ఛాతీకి రేడియేషన్

30 సంవత్సరాల వయసులోపు ఛాతీకి రేడియోధార్మిక చికిత్స చేయించుకుని ఉంటే, అది రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కలిగిస్తుంది. హాడ్జికిన్స్ లింఫోమా వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి ఈ రకమైన రేడియోధార్మిక చికిత్స ఉపయోగపడుతుంది.

అధిక బరువు మరియు ఊబకాయం

ఊబకాయం వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత. ఇది గతంలో రొమ్ము క్యాన్సర్కు ఇప్పటికే చికిత్స చేయించుకున్న స్త్రీలకు కూడా వర్తిస్తుంది.

హెచ్.ఆర్.టి వాడకం

ప్రస్తుత లేదా ఇటీవలి హార్మోన్ పునఃస్థాపన చికిత్స యొక్క వాడకం రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

మద్యం మరియు ధూమపానం

మద్యపానం మరియు ధూమపానం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది

త్వరగా రజస్వల కావటం మరియు ఆలస్యంగా మెనోపాజ్ చేరుకోవటం

12 ఏళ్ల వయస్సు లోపల రజస్వల అయిన మరియు 55 ఏళ్ళ వయసు దాటాక మెనోపాజ్ వచ్చిన స్త్రీలు రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని అధికంగా కలిగి ఉంటారు.

నిరపాయమైన రొమ్ము పరిస్థితులు

కొన్ని నిరపాయమైన (క్యాన్సర్ కానివి) రొమ్ము పరిస్థితులు కూడా రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ నిరపాయమైన పరిస్థితులు డక్ట్ల్ హైపెర్ప్లాసియా, పాపిలెమా, స్క్లిలోర్సింగ్ అడినోసిస్ మరియు క్లిష్టమైన ఫైబ్రోఅడెనోమాస్. అంతేకాకుండా, సిటులో లోబ్యులార్ కార్సినోమా కలిగి ఉండటం (ఎల్.సి.ఐ.ఎస్.) రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎల్.సి.ఐ.ఎస్. ​​అనేది క్యాన్సర్ పూర్వ స్థితి మరియు పేరు సూచిస్తున్నట్టు క్యాన్సర్ కాదు.

రొమ్ము క్యాన్సర్ వివిధ లక్షణాలు కలిగి ఉండవచ్చు. ప్రారంభ దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్ ఎటువంటి లక్షణాలను బయట పెట్టక పోవచ్చు. క్యాన్సర్ పెరుగుతుండగా, క్రింది లక్షణాలు సంభవించవచ్చు. ఈ లక్షణాలలో ఏవైనా ఉంటే మాత్రం అది క్యాన్సర్ ఉందని అర్థం కాదు, కానీ డాక్టర్ చేత చెక్ అప్ చేయించుకోవటం చాలా ముఖ్యం.

  • రొమ్ము లో ఒక గడ్డ లేదా గట్టిపడటం
  • చనుమొన నుండి ఒక డిచ్ఛార్జ్
  • రొమ్ము లేదా చనుమొన పైన దద్దుర్లు
  • లోపలి వంగిన చనుమొన
  • రొమ్ము మీద చర్మం తగ్గడం
  • చంకలో గడ్డ
  • రొమ్ము ఆకారం లేదా పరిమాణంలో మార్పు

రొమ్ము లో గడ్డలు

రొమ్ము లో గడ్డ అనేది రొమ్ము గట్టిపడటం లేదా వాయటం.

చాలా రొమ్ము గడ్డలు నిరపాయమైనవి (క్యాన్సర్ కానివి). ఇవి సాధారణంగా ఫైబ్రోఎడినోమాస్ లేదా రొమ్ము లో కణితి వలే ఉంటాయి, వీటిని అలాగే వదిలెయ్యవచ్చు లేదా సులభంగా చికిత్స చెయ్యవచ్చు. రొమ్ముకి ఇన్ఫెక్షన్, గాయం లేదా దెబ్బ కూడా ఒక గడ్డ లాగానే ఉండవచ్చు. రొమ్ములో గడ్డ ఉన్నట్టు అనిపించినట్లయితే వైద్యుడిని సంప్రదించటం చాలా మంచిది.

క్లినికల్ పరీక్ష మరియు పరిశోధనలు తర్వాత రొమ్ము క్యాన్సర్ నిర్ధారించబడుతుంది.

క్లినికల్ పరీక్ష

క్లినికల్ పరీక్ష డాక్టర్ చే జరుగుతుంది. ఈ పరీక్ష చేతుల కింద భాగం (చంకలు) మరియు వక్షస్థల ప్రాంతాలను పూర్తిగా పరిశీలిస్తుంది. ఇది మెడ, ఛాతీ మరియు పొత్తికడుపు వంటి ఇతర భాగాల పరీక్షను కూడా కలిగి ఉంటుంది. ఈ పరీక్షను ఒక కుటుంబ వైద్యుడు, రొమ్ము సర్జన్ లేదా అంకాలజిస్ట్ చేయవచ్చు.

ప్రారంభ పరిశోధనలు

పరీక్షించిన తరువాత, డాక్టర్ క్రింది పరిశోధనలను అభ్యర్థించవచ్చు.

మామోగ్రాం

మామోగ్రాం అనేది రొమ్ము పరిస్థితులను గుర్తించడానికి సాధారణంగా ఉపయోగించే పరీక్ష.

ఇది రొమ్ము యొక్క తక్కువ మోతాదు ఎక్స్- రే. పరీక్ష సమయంలో, రొమ్ము కణజాలం ఒక ప్లేట్తో కంప్రెస్ చేయబడుతుంది మరియు వేర్వేరు కోణాలలో రెండు ఎక్స్-రేలు తీసుకోబడతాయి. గడ్డ గట్టిగా మారే ముందు కూడా రొమ్ము క్యాన్సర్లను మామోగ్రాం లో గుర్తించవచ్చు. ఇవి సాధారణంగా 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో జరపబడతాయి. యువ మహిళల్లో రొమ్ము కణజాలం దట్టంగా ఉండటం ఇది మంచి చిత్రాన్ని పొందడం మరియు ఏవైనా మార్పులను చూడటం కష్టతరం చేస్తుంది.

రొమ్ము అల్ట్రాసౌండ్

రొమ్ము యొక్క ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ రొమ్ము యొక్క చిత్రాన్ని పొందడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది. ఈ పరీక్షలో రొమ్ము గడ్డలో ద్రవం ఉందా, అంటే కణితి వలే, లేక గట్టిగా ఉంది కణాలను కలిగి ఉం ఉందా అని చెప్పటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రొమ్ముపై జెల్ పూసి దానిపై చేతితో పట్టుకున్న ప్రోబ్ను ఉపయోగించడం ద్వారా ఈ స్కాన్ జరుగుతుంది. పరీక్ష కొన్ని నిమిషాలు పడుతుంది మరియు నొప్పిలేకుండా ఉంటుంది.

రొమ్ము ఎం.ఆర్.ఐ

ఎం.ఆర్.ఐ (మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్) శరీరం యొక్క ఒక భాగం యొక్క వివరణాత్మక చిత్రం పొందడానికి బలమైన అయస్కాంతాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఎక్స్-రే కిరణాలను ఉపయోగించదు. రొమ్ము ఎం.ఆర్.ఐ, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో కొన్ని సందర్భాలలో మాత్రమే ఉపయోగిస్తారు. ఇది ఒక సాధారణ పరీక్ష వలె అందరికీ ఉపయోగించబడదు. ఇది చాలా దట్టమైన ఛాతీ కలిగి ఉన్న స్త్రీలలో ప్రధానంగా ఉపయోగించబడుతుంది, ఇక్కడ మామోగ్రాం సహాయకరంగా ఉండదు. రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఉన్న యువ మహిళల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు (బి.ఆర్.సి.ఎ1 మరియు బి.ఆర్.సి.ఎ2).

రొమ్ము బయాప్సీ

పరీక్ష మరియు ప్రాధమిక పరిశోధనలు క్యాన్సర్ అనే అనుమానం కలిగించిన తరువాత, వైద్యుడు అసాధారణ ప్రాంతానికి జీవాణుపరీక్షను నిర్వహిస్తారు. బయాప్సీ అనేది రొమ్ము కణజాలంలో కొంత తీసుకోబడి మరియు రోగ నిర్ధారణను స్థాపించడానికి దానిని ఒక సూక్ష్మదర్శిని క్రింద చూసే ఒక పరీక్ష. ఇది ఎలా చేయాలనేదానికి వివిధ మార్గాలు ఉన్నాయి.

ఫైన్ నీడిల్ యాస్పిరేషణ్ సైటోలజీ (ఎఫ్.ఎన్.ఎ.సి)

ఈ పరీక్షలో చాలా చిన్న సూది రొమ్ములో గుచ్చబడుతుంది మరియు వ్యక్తిగత కణాలు లేదా ద్రవం తొలగించబడుతుంది. క్యాన్సర్ కణాలు ఉన్నట్టు నిర్ధారించడానికి లేదా తీసుకున్న నమూనా ఆధారంగా ఒక రోగ నిర్ధారణ చేయలేనప్పుడు మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి.

కోర్ బయాప్సీ

ఇది ఒక పెద్ద సూది ఉపయోగించి కణజాలం యొక్క పెద్ద భాగం (కోర్) తీసుకోవడానికి ఉపయోగించే పరీక్ష. ఇది ఎఫ్.ఎన్.ఎ.సి కంటే నిర్ధారణ యొక్క ఖచ్చితమైన పద్ధతి. కోర్లను ఎక్స్ – రే (స్టీరియోలాక్టిక్), అల్ట్రాసౌండ్ లేదా ఎం.ఆర్.ఐ మార్గదర్శకత్వంలో తీసుకోవచ్చు. ఇది అవుట్-పేషెంట్ విధానం మరియు స్థానిక అనస్థీషియా కింద జరుగుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో ఉపయోగించే పరీక్ష యొక్క ప్రామాణిక రూపం.

సర్జికల్ బయాప్సీలు

శస్త్రచికిత్స బయాప్సీలలో రొమ్ములో ఒక కోత పెట్టటం జరుగుతుంది. అవి తొలిగింపు లేదా కోత పెట్టటం కావచ్చు. ఇది స్థానిక లేదా సాధారణ అనస్థీషియా కింద చేయవచ్చు.

ఎక్సిషనల్ బయాప్సీ

దీనిలో గడ్డ లేదా కణితి పూర్తిగా తొలగించబడుతుంది. గడ్డ చిన్నదిగా ఉంటే మరియు తెలియక పొతే, వైర్ లేదా సూది మార్గదర్శకత్వ సహాయంతో ఈ తొలగింపు చేయబడుతుంది. అల్ట్రాసౌండ్, ఎక్స్-రే లేదా ఎం.ఆర్.ఐ. ప్రక్రియ ముందు ఇవి చెయ్యబడతాయి.

ఇన్సిషనల్ బయోప్సీ

గడ్డ మరీ పెద్దదిగా ఉంటే, రొమ్ము ఆకారం మార్చకుండా దానిని తోలిగించటానికి, ఇది చెయ్యబడుతుంది. గడ్డ యొక్క ఒక చిన్న భాగం మాత్రమే తొలగించబడుతుంది.

రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ

బయాప్సీ నమూనా ప్రాసెస్ చేయబడి పాధాలజిస్ట్ చూచిన తరువాత రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ జరుగుతుంది. పాధాలజిస్ట్ నిపుణులు క్యాన్సర్ను వర్గీకరించడానికి జీవాణుపరీక్ష నమూనాపై అదనపు పరీక్షలు చేస్తారు, ఇది మరింత చికిత్సకు మార్గనిర్దేశం చేస్తుంది. కింది ఫలితాలు సాధారణంగా రోగనిర్ధారణ నివేదికలో చూడవచ్చు.

రొమ్ము క్యాన్సర్ రకం:

క్యాన్సర్ గ్రేడ్:

గ్రేడ్ 1 నుండి 3 గ్రేడ్ 3 అంటే తీవ్రమైన క్యాన్సర్ రూపం అని అర్థం

క్యాన్సర్ పరిమాణం:

క్యాన్సర్ను తొలగించిన తర్వాత రోగనిర్ధారణ నివేదికలో పరిమాణం సాధారణంగా ఇవ్వబడుతుంది.

మార్జిన్లు:

ఆపరేటెడ్ క్యాన్సర్ చుట్టూ ఉన్న మార్జిన్లు స్పష్టంగా ఉంటే క్యాన్సర్ ఎక్సిషన్ తర్వాత నివేదిక తెలియజేస్తుంది. మార్జిన్లు స్పష్టంగా లేనట్లయితే, తిరిగి ఎక్సిషన్ అవసరమవుతుంది.

ఈ.ఆర్ మరియు పీ.ఆర్ స్థితి:

ఇది ఈస్ట్రోజెన్ రిసెప్టర్ (ఈ.ఆర్) లేదా ప్రొజెస్టెరాన్ రిసెప్టర్ (పీ.ఆర్) లలో క్యాన్సర్ పాజిటివ్ గా ఉంటే మనకు తెలియజేస్తుంది. వీటిలో ఒకటి పాజిటివ్ గా ఉన్నా కూడా, రోగి హార్మోన్ల చికిత్సను తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు.

హెచ్.ఈ.ఆర్ 2 స్థితి:

క్యాన్సర్ హెచ్.ఈ.ఆర్ 2 కు పాజిటివ్ గా ఉందో లేదో ఈ నివేదిక తెలియ చేస్తుంది. ఒకవేళ పాజిటివ్ గా ఉంటే ట్రస్టూజుమాబ్, పెర్టుజుమాబ్ మరియు ఇతర ఎజెంట్తో చికిత్స చెయ్యడం వలన రోగి ప్రయోజనం పొందుతారు. కొన్నిసార్లు హెచ్.ఈ.ఆర్ 2 స్థితిని తెలుసుకోవటానిక ఎక్కువ పరీక్షలు అవసరమవుతాయి.

ఇతర పరిశోధనలు

సీటీ స్కాన్

సీటీ స్కాన్ లేదా కంప్యూటెడ్ టొమోగ్రఫిక్ స్కాన్ అనేది క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత, స్టేజింగ్ ప్రయోజనాల కోసం సాధారణంగా ఉపయోగించే పరీక్ష. రొమ్ము నుండి శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్ భావించినప్పుడు ఇది చెయ్యబడుతుంది.

పెట్-సీటీ స్కాన్

ఒక పెట్-సీటీ స్కాన్ అనేది క్యాన్సర్ వ్యాప్తిని ఎంచుకోవడం యొక్క ఖచ్చితత్వం ఎక్కువగా ఉన్న ప్రత్యేకమైన సీటీ స్కాన్. మీ డాక్టర్ కొన్ని సందర్భాల్లో ఈ స్కాన్ను కోరవచ్చు.

బోన్ స్కాన్

ఒక ఐసోటోప్ ఎముక స్కాన్ అనేది ఎముకలలోకి క్యాన్సర్ వ్యాప్తి చెందిందేమో చూపే ఒక స్కాన్. ఎముకలలో క్యాన్సర్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని డాక్టర్ భావించినప్పుడు రోగులని ఇది చెయ్యమని కోరవచ్చు. రెండు రకాల ఎముక స్కాన్స్ జరపవచ్చు. ఒకటి టెక్నీషియమ్ -99 స్కాన్, దాని ధర తక్కువ మరియు మరొకటి ఒక ఎఫ్ -18 బోన్ స్కాన్, ఇది చాలా సున్నితమైనది, కానీ చాలా ఖరీదైనది.

టి.ఎన్.ఎం స్టేజింగ్ వ్యవస్థ లేదా సంఖ్య వ్యవస్థ ఆధారంగా రొమ్ము క్యాన్సర్ స్టేజింగ్ నిర్వహించబడుతుంది. ఏ వ్యవస్థ వాడాలి అనేది రొమ్ములో కణితి యొక్క పరిమాణంపై, రొమ్ములో స్థానికంగా క్యాన్సర్ వ్యాప్తి మరియు శోషరస గ్రంథుల లోకి, ఇంకా శరీరంలో వివిధ భాగాలకు క్యాన్సర్ వ్యాప్తి పైన ఆధారపడి ఉంటుంది.

టి.ఎన్.ఎం స్టేజింగ్

టి.ఎన్.ఎం అంటే కణితి, నోడ్ మరియు మెటాస్టేజ్ అని అర్ధం.

టి స్టేజింగ్

టి కణితి పరిమాణాన్ని సూచిస్తుంది. టి అనేది టి1 నుండి టి4 వరకు విభజించబడింది

టి1 కణితి పరిమాణం గరిష్ట వ్యాసంలో 2సెం.మీ లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. టి1 కింది విధంగా ఉపవిభజన చేయబడింది
టి1ఎంఐ కణితి 0.1సెం.మీ లేదా తక్కువగా ఉంటుంది
టి1ఎ కణితి 0.1 సెం.మీ కన్నా ఎక్కువ అయితే 0.5సెం.మీ కన్నా ఎక్కువ కాదు
టి1బి కణితి 0.5 సెం.మీ కంటే ఎక్కువ కానీ 1సెం.మీ కన్నా ఎక్కువ కాదు
టి1సి కణితి 1.0 సెం.మీ కంటే ఎక్కువ కానీ 2.0 సెం.మీ కన్నా ఎక్కువ కాదు
టి2 కణితి 2.0 సెం.మీ కంటే ఎక్కువ కానీ 5.0 సెం.మీ కన్నా ఎక్కువ కాదు
టి3 కణితి వ్యాసంలో 5.0 సెం.మీ కన్నా ఎక్కువ.
టి4 టి4 దశలో ఉపవిభజన చేయబడింది
టి4 ఎ కణితి ఛాతీ గోడలోకి వ్యాపించింది
టి4 బి కణితి చర్మంలోకి వ్యాపించింది
టి4 సి కణితి ఛాతీ గోడ మరియు చర్మం రెండింటికి వ్యాపించింది
టి4 డి క్యాన్సర్ చర్మం ఎర్రబడేలా మరియు వాచేలా చేస్తుంది (తాపజనక క్యాన్సర్)

ఎన్ స్టేజింగ్

ఎన్0 శోషరస కణుపులలో క్యాన్సర్ కణాలు లేవు.
ఎన్1 కదిలించగలిగే శోషరస కణుపులలో క్యాన్సర్ కణాలు కనుగొనబడ్డాయి
ఎన్2 ఒకదానికి ఒకటి అంటుకుని ఉన్న శోషరస గ్రంధులలో క్యాన్సర్ కణాలు ఉన్నాయి
ఎన్3 క్యాన్సర్ కణాలు రొమ్ము ఎముక దగ్గర శోషరస కణుపులలో కనుగొనబడ్డాయి

ఎం స్టేజింగ్

ఎంఎక్స్ రొమ్ము మరియు ప్రాంతీయ నోడ్స్ వెలుపల క్యాన్సర్ వ్యాప్తి అంచనా వేయలేము
ఎం0 రొమ్ము లేదా ప్రాంతీయ శోషరస కణుపులకు బయటకు క్యాన్సర్ వ్యాప్తి చెందలేదు
ఎం1 రొమ్ము లేదా ప్రాంతీయ శోషరస కణుపులకు బయట ఉన్న క్యాన్సర్ కణాలు

సంఖ్య స్టేజింగ్

స్టేజ్ 1

స్టేజ్ 1 స్టేజ్ 1 రొమ్ము క్యాన్సర్ను కింది విధంగా ఉపవిభజన చేయవచ్చు
దశ 1ఎ క్యాన్సర్ 2.0సెం.మీ లేదా అంతకంటే చిన్నదిగా ఉంటుంది మరియు శోషరస కణుపులకు వ్యాపించదు.
దశ 1 బి క్యాన్సర్ 2.0సెం.మీ లేదా అంతకంటే చిన్నదిగా ఉంటుంది మరియు క్యాన్సరు కణాలు రొమ్ము దగ్గర ఉన్న శోషరస గ్రంధులలో కనిపిస్తాయి

స్టేజ్ 2

స్టేజ్ 2 స్టేజ్ 2 ను 2 గ్రూపులుగా ఉపవిభజన చేయవచ్చు
స్టేజ్ 2ఎ రొమ్ములో కణితి 2.0సెం.మీ లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది మరియు క్యాన్సర్ చంకలో లేదా రొమ్ము ఎముకలో ఉన్న 1 నుంచి 3 శోషరస గ్రంధులలో కనుగొనబడుతుంది లేదా రొమ్ము లో కణితి 2.0సెం.మీ కంటే పెద్దది మరియు 5.0సెం.మీ కంటే చిన్నది అయి ఉంటుంది మరియు శోషరస కణుపుల్లో క్యాన్సర్ ఉండదు.
స్టేజ్ 2 బి రొమ్ము లో కణితి 2.0సెం.మీ కంటే పెద్దది మరియు 5.0సెం.మీ కంటే చిన్నది అయి ఉంటుంది మరియు క్యాన్సర్ చంకలో లేదా రొమ్ము ఎముకలో ఉన్న 1 నుంచి 3 శోషరస గ్రంధులలో కనుగొనబడుతుంది లేదా .కణితి 5 సెం.మీ కన్నా పెద్దదిగా ఉంటుంది మరియు శోషరసలోకి వ్యాపించదు

స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్

Stage 3 స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్ 3 సమూహాలుగా విభజించబడింది
స్టేజ్ 3ఎ ఎటువంటి కణితి లేదా గడ్డ కనిపించదు కానీ క్యాన్సర్ చంకలో లేదా రొమ్ము ఎముకలో ఉన్న 4-9 శోషరస గ్రంధులలో కనుగొనబడుతుంది లేదా కణితి 5 సెం.మీ కన్నా పెద్దది మరియు క్యాన్సర్ శోషరస కణాల్లో చిన్న సమూహాలలో ఉంటుంది లేదా కణితి 5 సెం.మీ కన్నా పెద్దది మరియు క్యాన్సర్ చంకలో లేదా రొమ్ము ఎముక వద్ద ఉన్న శోషరస కణుపుల్లోకి వ్యాపించింది
స్టేజ్ 3బి క్యాన్సర్ రొమ్ము చర్మానికి లేదా ఛాతీ గోడకు వ్యాపించింది మరియు చర్మానికి పుండు లేదా వాపు వచ్చేలా చేసింది. క్యాన్సర్ చంకలో లేదా రొమ్ము ఎముకలో ఉన్న 9 వరకు శోషరస గ్రంధులలో కనుగొనబడుతుంది
స్టేజ్ 3 సి కణితి పరిమాణం ఏదైనా కావచ్చు కానీ క్యాన్సర్ చర్మానికి వ్యాపించి పుండు లేదా వాపు వచ్చింది మరియు ఛాతీ గోడకు వ్యాపించింది. ఇది కాలర్బోన్ పైన లేదా క్రింద లేక రొమ్ము ఎముక శోషరస కణుపులకు లేక చంక సమీపంలో 10 లేక అంతకంటే ఎక్కువ శోషరస కణుపులకు వ్యాప్తి చెందింది.

స్టేజ్ 4

ఈ స్టేజ్ లో, రొమ్ములో ఉండే కణితి ఏ పరిమాణంలో అయినా ఉండవచ్చు మరియు శోషరస కణుపుల్లో క్యాన్సర్ కణాలు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు, కాని క్యాన్సర్ కాలేయం, ఊపిరితిత్తులు, ఎముక లేదా మెదడు వంటి ఇతర భాగాలకు వ్యాపించింది.

రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ చేయబడిన తర్వాత శస్త్రచికిత్స చేయబడుతుంది మరియు అందులో భాగమైన శోషరస కణుపులు మరియు క్యాన్సర్ తొలగించటానికి ఉపయోగపడుతుంది. ప్ఇది సాధారణంగా రొమ్ము క్యాన్సర్ కు ఇవ్వబడే మొదటి చికిత్స. కొన్నిసార్లు, శస్త్రచికిత్సకు ముందు కీమోథెరపీ తీసుకోవాలని సర్జన్ రోగికి సిఫారసు చేయవచ్చు.

రొమ్ములో గడ్డ తొలగించడానికి సర్జరీ

రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స అనేక విధాలుగా చేయవచ్చు. శస్త్రచికిత్స లక్ష్యం సాధారణంగా క్యాన్సర్ మొత్తం తొలగించి, వీలైనంతగా కణజాలాన్ని సంరక్షించడం. దీనిపై ఆధారపడి, దిగువ పేర్కొన్న వివిధ పద్ధతులు సాధ్యమవుతాయి.

వైడ్ లోకల్ ఎక్సిషన్

వైడ్ లోకల్ ఎక్సిషన్ లేదా లమ్పెక్టమి లో రొమ్ములోని క్యాన్సర్ మరియు చుట్టూ ఉన్న సాధారణ కణజాలం యొక్క రిమ్ తొలగించబడుతుంది. రొమ్ము యొక్క మిగిలిన భాగం చెక్కుచెదరకుండా అలాగే వదిలివెయ్యబడుతుంది మరియు తోలిగించబడదు. ఈ శస్త్రచికిత్స సాధారణంగా జనరల్ అనస్థీషియా కింద జరుగుతుంది, అయితే అవసరమైతే ఇతర పద్ధతులను కూడా ఉపయోగించవచ్చు. లమ్పెక్టమి తరువాత రేడియోథెరపీ చెయ్యటం మాస్టేక్టమి అంత మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మాస్టేక్టమి

శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా స్తనమును తొలగించే ప్రక్రియ మాస్టేక్టమి అని పిలుస్తారు.

మాస్టేక్టమి అనేక రకాలుగా ఉంటుంది.

ఒక సాధారణ మాస్టేక్టమి అనేది శస్త్ర చికిత్స ద్వారా మొత్తం స్తనమును మరియు రొమ్ము కణజాలాన్ని మరియు రొమ్మును కప్పి ఉంచే చర్మాన్ని తొలగిస్తుంది.

ఒక రాడికల్ మాస్టేక్టమి లో మొత్తం స్తనం, దాన్ని కప్పి ఉంచిన చర్మమ, దాని కింద ఉన్న రెండు కండరాలు మరియు ఆక్సిల్లా (చంక) లో శోషరస కణుపులు తొలగించబడతాయి.

ఒక మాడిఫైడ్ రాడికల్ మాస్టేక్టమి అనేది రాడికల్ మాస్టేక్టమి వంటిదే, కానీ ఇందులో ఒక్క కండరం మాత్రమె తోలిగించబడుతుంది.

ఒక స్కిన్ స్పెరింగ్ మాస్టేక్టమి లో రొమ్ము కణజాలం మొత్తం తోలిగించబడుతుంది కానీ రొమ్ము మీద ఉన్న చర్మం అలాగే వదిలి వెయ్యబడుతుంది. వెంటనే రొమ్ము పునర్నిర్మాణ ప్రణాళిక ఉంటే ఇది జరుగుతుంది.

ఏ విధమైన రొమ్ము శస్త్రచికిత్స చేయాలి

రొమ్ము శస్త్రచికిత్స యొక్క రకం అనేది రోగ నిర్ధారణలో కణితి పరిమాణం మరియు స్టేజి, శస్త్రచికిత్స చేసే రొమ్ము సర్జన్ యొక్క అనుభవం మరియు రోగి యొక్క వ్యక్తిగత ఎంపిక పైన ఆధారపడి ఉంటుంది.

వైడ్ లోకల్ ఎక్సిషన్ చెయ్యించుకోబోతున్నారంటే , అసాధారణమైన గడ్డ మాత్రమే తొలగించబడుతుంది, మరియు మిగిలిన రొమ్ము అలాగే వదిలివెయ్యబడుతుంది. మొత్తం రొమ్ము తీసివేయబడనందువల్ల ఈ ప్రక్రియ చాలా మంది మహిళలకు ఆకర్షణీయంగా అనిపిస్తుంది.

శస్త్ర చికిత్స గాటు సాధారణంగా చిన్నదిగా ఉంటుంది మరియు కాలక్రమేణా తక్కువగా గుర్తించగలుగుతారు. సౌందర్యపరంగా చూసినట్లయితే కూడా ఫలితం బాగుంటుంది.

కానీ వైడ్ లోకల్ ఎక్సిషన్ చెయ్యించుకున్నాక, రోగి దాదాపు ఎల్లప్పుడూ రేడియో ధార్మిక చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైడ్ లోకల్ ఎక్సిషన్ అనేది పాశ్చాత్య దేశాలలో అత్యంత సాధారణంగా అభ్యసిస్తున్న రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స. భారతదేశంలో మాస్టేక్టమి శస్త్రచికిత్స అనేది చాలా సాధారణం.

పైన వివరించినట్లుగా మాస్టేక్టమి రోమ్ముని, దానితో పాటు కణితిని కూడా తొలగిస్తుంది.ద్వారా స్తనమును తొలగించుట పాటు మొత్తం రొమ్ము తొలగిస్తుంది. కొన్ని పరిస్థితులలో, క్యాన్సర్ యొక్క పరిమాణం మరియు స్థానం కారణంగా, లేదా క్యాన్సర్ రకం ఆధారంగా, ఒక మాస్టేక్టమి అనేది రోగికి ఉన్న ఒకే ఒక్క ఎంపిక కావచ్చు.

మాస్టేక్టమి తరువాత, ముఖ్యంగా ప్రారంభ దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్లో, రేడియోధార్మిక చికిత్స అవసరం ఉండకపోవచ్చు మరియు చికిత్స ఒకే ఆపరేషన్తో పూర్తి కావచ్చు. మాస్టేక్టమి తర్వాత తక్షణమే లేక తరువాతి కాలంలో రొమ్ము పునర్నిర్మాణం చేయించుకునే ఎంపిక కూడా ఉంది.

శోషరస కణితి శస్త్రచికిత్స

రొమ్ము క్యాన్సర్ దాని మూలం నుండి వ్యాపిస్తున్నప్పుడు, అది ఆక్సిల్లా(చంకలలో) యొక్క శోషరస గ్రంధుల్లోకి వెళుతుంది..

అందువల్ల, ఆక్సిల్లరీ శోషరస కణుపు శస్త్రచికిత్స రొమ్ము క్యాన్సర్ యొక్క శస్త్రచికిత్సలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఆక్సిల్లరీ శస్త్రచికిత్స అనేక రకాలుగా చెయ్యబడుతుంది.

సెంటినెల్ నోడ్ బయాప్సీ

సెంటినెల్ నోడ్ అనేది క్యాన్సర్ వ్యాప్తి చెందే మొదటి కణుపు లేదా కణుపులు. సెంటినెల్ నోడ్లో క్యాన్సర్ లేనట్లయితే, ఇతర యాక్సిలరీ నోడ్లలో క్యాన్సర్ వచ్చే అవకాశంచాలా తక్కువ.

రేడియోధార్మిక పదార్థం యొక్క చిన్న మోతాదును లేదా నీలం రంగులో చర్మాన్ని కణితి చుట్టుపక్కల ప్రాంతానికి చొప్పించిన తర్వాత ఒక సెంటినెల్ నోడ్ను సాధారణంగా ఆక్సిల్లాలో గుర్తించవచ్చు. ఈ రంగును వ్యాపిస్తుండగా మొదటి శోషరస కణుపు / కణుపులు దానిని పీల్చుకుంటాయి. ఈ పదార్థాలు శస్త్రచికిత్సలో కణుపులను గుర్తించటానికి సర్జన్ కు సహాయపడతాయి.

సెంటినెల్ నోడ్ బయాప్సీ అనేది వైడ్ లోకల్ ఎక్సిషన్ లేదా మాస్టేక్టమి జరిగిన సమయంలోనే జరుగుతుంది.

ఈ తొలగించిన కణుపులు అప్పుడు క్యాన్సర్ కణాలు కోసం సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించబడతాయి. ఏ క్యాన్సర్ కణాలు లేకపోతే, యాక్సిలరీ శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే, క్యాన్సర్ కణాలు కనుగొనబడితే, సర్జన్ అన్ని ఇతర ఆక్సిలరీ శోషరస కణుపులను తొలిగించాలి అనుకోవచ్చు లేదా ఆక్సిల్లాకు రేడియేషన్ చికిత్సను పరిగణలోకి తీసుకోవచ్చు.

యాక్సిలరీ క్లియరెన్స్

యాక్సిలరీ క్లియరెన్స్ ఆక్సిల్లా(చంక)లో అన్ని శోషరస కణుపులను తొలగించడం. సెంటినెల్ నోడ్ క్యాన్సర్ కణాలు కలిగి ఉన్నప్పుడు లేదా సెంటినెల్ నోడ్ ప్రక్రియ పూర్తి చేయకపోయినా, మరియు రొమ్ము నుండి ప్రాధమిక కణితిని తొలగించడంతో పాటు యాక్సిలరీ శస్త్రచికిత్స చెయ్యబడినా ఇది జరుగుతుంది. యాక్సిలరీ క్లియరెన్స్ అనేది రాడికల్ మాస్టేక్టమిలో భాగం. ఒక యాక్సిలరీ క్లియరెన్స్ జరిగాక, సగటున 10 నుండి 20 శోషరస కణుపులు తొలగించబడతాయి.

రొమ్ము శస్త్రచికిత్స జరిగాక ఉండే ప్రభావాలు

రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స సాధారణంగా జరుగుతుంది మరియు ఇది ఒక సురక్షితమైన ప్రక్రియ. అన్ని చికిత్సల మాదిరిగా, ఈ రకమైన శస్త్రచికిత్సకు సంబంధించి కొన్ని సాధారణ ప్రభావాలు ఉన్నాయి, అవి క్రింద ఇవ్వబడ్డాయి.

సేరోమా సేకరణ

ఈ శస్త్రచికిత్స గాటు కింద ఒక చిన్న మొత్తంలో ద్రవం చేరుతుంది. సాధారణంగా, ఆపరేషన్ తర్వాత ఒక ట్యూబ్ ద్వారా ఈ ద్రవం బయటకు ప్రవహింప చెయ్యబడుతుంది. కొన్నిసార్లు, ట్యూబ్ తీసిన తరువాత ద్రవం నిలవవచ్చు. ఈ ద్రవం సూది మరియు సిరంజి సహాయంతో సులభంగా తీసేయ్యవచ్చు.

మొద్దుబారుట

భుజము కింద (చంక) మరియు భుజానికి పైన యాక్సిలరీ శస్త్రచికిత్స జరిగిన తరువాత మొద్దుబారినట్టు అనిపించటం సాధారణం. ఈ సంచలనం కాలక్రమేణా మారుతుంది మరియు శస్త్రచికిత్స అయ్యాక చాలా సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఇది శస్త్రచికిత్స యొక్క సాధారణ ప్రభావం మరియు దానర్ధం విధానంలో ఏదో తప్పు జరిగింది అని కాదు.

లింఫోఎడీమా

ఇది శస్త్రచికిత్స జరిగిన వైపు అరచెయ్యి, ముంజేయి లేదా చేతి యొక్క వాపు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత కొన్ని రోజులు మరియు వారాలు ఇది ఉండవచ్చు. స్తుంది. ఇది కింద శోషరస కణుపులను తీసివేసినందున జరుగుతుంది. ఇది రొమ్ము మరియు యాక్సిలరీ శస్త్రచికిత్స యొక్క సాధారణ దుష్ప్రభావము, ప్రత్యేకించి యాక్సిలరీ క్లియరెన్స్ తరువాత మరియు 25% మంది రోగులలో వివిధ స్థాయిలలో సంభవించవచ్చు. మసాజ్ మరియు ఫిజియోథెరపీ పద్ధతులు వాపు తగ్గించడంలో సహాయపడతాయి.

ఇన్ఫెక్షన్

ఇది ఏ శస్త్రచికిత్సా విధానంలోనైనా ఉండే సాధారణ దుష్ప్రభావము మరియు తగిన చికిత్స మరియు యాంటీబయాటిక్స్తో జాగ్రత్త తీసుకోవచ్చు.

నొప్పి లేదా భుజం లో దృఢత్వం

యాక్సిలరీ శస్త్రచికిత్స లేదా మాస్టేక్టమి జరిగాక, రోగి భుజంలో నొప్పి లేదా దృఢత్వాన్ని అనుభవిస్తారు. శస్త్రచికిత్స తర్వాత భుజంలో దృఢత్వాన్ని తగ్గించడంలో సహాయ పడడానికి క్రమంగా చేతికి సంబంధించిన వ్యాయామాలు చేయడం ముఖ్యం. ఈ వ్యాయామాలు శస్త్రవైద్యుడు లేదా ఫిజియోథెరపిస్ట్ మీకు బోధించగలుగుతారు.

రొమ్ము పునర్నిర్మాణం

రొమ్ము పునర్నిర్మాణం మాస్టేక్టమి తర్వాత రెండవ వైపు రొమ్ముకు సరిపోయే ఒక కొత్త రొమ్ము ఆకారాన్ని శాస్త్రచికిత్స ద్వారా పునర్నిర్మించడం.

పునర్నిర్మాణం మాస్టేక్టమి జరిగే సమయంలోనే జరపవచ్చు(తక్షణ పునర్నిర్మాణం) లేదా కొంతకాలం తరువాత జరపవచ్చు(ఆలస్యంగా పునర్నిర్మాణం). రొమ్ము ఇంప్లాంట్ను ఉపయోగించి లేదా శరీరం యొక్క వేరొక భాగంలో కణజాలం ఉపయోగించి పునర్నిర్మాణం చేయవచ్చు.

రొమ్ము పునర్నిర్మాణం చెయ్యటానికి సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ శాస్త్ర చికిత్సలు అవసరం.

తక్షణ పునర్నిర్మాణం యొక్క ప్రయోజనాలు గాట్లు తక్కువగా ఉండటం, రొమ్ము ఆకారం లేకుండా తక్కువ సమయం గడపటం, మరియు సాధారణంగా ఇతర పద్ధతుల కంటే మెరుగుగా కనపడటం. పునర్నిర్మాణం తరువాత రేడియోధార్మిక చికిత్స పునర్నిర్మాణం చేయబడిన రొమ్ము యొక్క ఆకారాన్ని ప్రభావితం చేయవచ్చు.

ఆలస్యంగా జరిగే పునర్నిర్మాణ ప్రయోజనాలు ఏమిటంటే, రోగి అటువంటి శస్త్రచికిత్స అవసరమా లేదా అని ఆలోచించుకోవటానికి ఎక్కువ సమయాన్ని కలిగి ఉంటారు మరియు రోగి ముందుగా వారి క్యాన్సర్ చికిత్సలను పూర్తి చేసి పునర్నిర్మాణం చేయించుకోవచ్చు. ఆలస్యంగా జరిగే పునర్నిర్మాణ యొక్క ప్రతికూలత రోగి మరొక శస్త్రచికిత్స చేయించుకోవాలి మరియు ఆ శస్త్రచికిత్స కోసం అనస్థీషియా తీసుకోవాల్సి వస్తుంది.

ఇతర రొమ్ము రూపానికి సరిగ్గా సరిపోయేటట్లు చనుమొన పునర్నిర్మాణం అవసరమవుతుంది. సాధారణంగా ప్రాధమిక పునర్నిర్మాణం జరిగిన కొన్ని నెలల తర్వాత ఇది ప్రత్యేక శస్త్రచికిత్సగా జరుగుతుంది. ముచ్చిక యొక్క పచ్చబొట్లు ఇతర చనుమొన రంగుతో సరిగ్గా సరిపోయేలా చెయ్యబడుతుంది.

రొమ్ము పునర్నిర్మాణం యొక్క రకాలు

రొమ్ము పునర్నిర్మాణం శస్త్రచికిత్స వివిధ పద్ధతుల ద్వారా చేయవచ్చు.

రొమ్ము యొక్క తొలగింపు సమయంలో రొమ్ము స్థానంలో ఇంప్లాంట్ని ఉంచడం ద్వారా ప్రొస్తెటిక్ పునర్నిర్మాణం జరుగుతుంది. శస్త్రచికిత్స తర్వాత మిగిలిపోయే స్థలాన్ని విస్తరించేందుకు, మాస్టేక్టమి తరువాత వెంటనే ఒక కణజాల ఎక్స్పాండర్ ఉంచబడుతుంది. శాశ్వత పునర్నిర్మాణ ప్రక్రియ తరువాత జరుగుతుంది.

శరీరం యొక్క ఇతర భాగాల నుండి తీసుకోబడిన కణజాలం రొమ్ము ఉన్న ప్రాంతాల్లో ఉంచటం పునర్నిర్మాణం యొక్క ఇంకొక పద్ధతి. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాలలోని సాధారణ రకాలు ఫ్లాప్స్ (వివిధ చోట్ల నుండి తొలగించబడిన కణజాలం) ఉపయోగించబడతాయి.

ఒక టి.ఆర్.ఏ.ఎం ఫ్లాప్ అనేది ఉదరం యొక్క దిగువ భాగం నుండి కణజాలం తొలగింఛి మరియు దానిని రొమ్ము పునర్నిర్మించేందుకు ఉపయోగించటం. ఒక డి.ఐ.ఈ.ఫై ఫ్లాప్ పొట్టి కడుపు కింది నుంచి కణజాలం తొలగించబడుతుంది, కానీ టి.ఆర్.ఏ.ఎం ఫ్లాప్ వలే రెక్టస్ అబ్డోమినస్ కండరాలు తొలగించబడవు.

ఒక ఎల్.డి ఫ్లాప్ అనేది ఛాతి వెనుక ఉన్న లాటిమస్ డోర్సీ కండరాల నుంచి కణజాలం తొలగించబడి మరియు రొమ్మును పునర్నిర్మించడానికి ఉపయోగించటం.

రొమ్ము ప్రొస్థెసిస్

మాస్టేక్టమి తరువాత, ఒక మహిళ పునర్నిర్మాణ శస్త్రచికిత్స లేకుండా ఆ వైపు ఒక రొమ్ము ప్రోస్థెసిస్ ధరించవచ్చు. ఇది సిలికాన్ తయారుచేసిన రొమ్ము మరియు దీనిని బ్ర్రా కింద ధరిస్తారు. ఇది ఇతర వైపు రొమ్ము ఆకారం మరియు పరిమాణంతో సరిపోలేలా చేయవచ్చు. కొంతమంది మహిళలు పునర్నిర్మాణం కాకుండా ఒక ప్రొస్థెసిస్ని ఉపయోగించడానికి ఇష్టపడతారు.

కీమోథెరపీ

కీమోథెరపీ సూది మందులు, డ్రిప్స్ మరియు మాత్రలు రూపంలో క్యాన్సర్ మందుల ఉపయోగం. ఈ మందులు క్యాన్సర్ కణాలకు గరిష్ట నష్టం కలిగించడం ద్వారా క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి మరియు అదే సమయంలో సాధారణ కణజాలాలకు కొంత నష్టాన్ని కలిగిస్తాయి. కీమోథెరపీ ఫలితంగా జరిగే దుష్ప్రభావాల కారణం సాధారణ కణజాలంపై మందులు ప్రభావం వల్లనే. క్యాన్సర్ చికిత్సకు అనేక కీమోథెరపీ మందులు ఉపయోగించబడతాయి. ఈ మందులు కలయికలో గానీ, ఒకే ఏజెంట్గా గాని ఉపయోగించవచ్చు. కీమోథెరపీ దఫాలుగా ఇవ్వబడుతుంది, ప్రతి దఫా 1 నుంచి 4 వారాల మధ్య ఉంటుంది, సాధారణంగా 3 వారాలు ఉంటుంది. తరువాతి మోతాదు ముందు శరీరం తిరిగి కోలుకోవడానికి రెండు కీమోథెరపీ దఫాల మధ్య అంతరం ఉంటుంది. కీమోథెరపీ యొక్క కోర్సు సాధారణంగా కొన్ని నెలలు ఉంటుంది.

రొమ్ము క్యాన్సర్ కోసం కీమోథెరపీ

కీమోథెరపీ రొమ్ము క్యాన్సర్ రోగుల చికిత్సలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వివిధ దశలలో ఇవ్వబడుతుంది. కీమోథెరపీ రొమ్ము క్యాన్సర్లో కొన్ని అమరికలలో జీవ చికిత్సతో పాటు ఇవ్వబడుతుంది. మరింత సమాచారం కోసం జీవ చికిత్స విభాగాన్ని చూడండి.

అడ్జువెంట్ కీమోథెరపీ

శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ పూర్తిగా తొలగించిన తర్వాత ఇవ్వబడే కీమోథెరపీ మందులను అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. అడ్జువెంట్ కీమోథెరపీ యొక్క ప్రయోజనం క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదాన్ని తగ్గించటం.

రొమ్ము క్యాన్సర్ తొలిగించబడిన రోగులందరికీ కీమోథెరపీ అవసరం లేదు. రోగనిర్ధారణలో క్యాన్సర్ యొక్క రకం మరియు దశపై ఆధారపడి, దాని పునరావృత ప్రమాదం అంచనా వేయబడుతుంది, దాని ఆధారంగా ఈ చికిత్స అవసరం ఉందో లేదో తెలుస్తుంది. ఒక వైద్య ఆంకాలజీ నిపుణుడు క్యాన్సర్ పునరావృతమయ్యే ప్రమాదాన్ని చర్చించగలుగుతారు మరియు అడ్జువెంట్ కీమోథెరపీ లాభనష్టాలను వివరించగలుగుతారు. రొమ్ము క్యాన్సర్ అడ్జువెంట్ కీమోథెరపీ కోసం కీమోథెరపీ మందులు వివిధ కలయికలలో. రోగ నిర్ధారణ సమయంలో క్యాన్సర్ యొక్క స్టేజ్ మరియు రోగి యొక్క పరిస్థితి ఆధారంగా ఆదర్శవంతమైన కలయిక ఎంపిక చెయ్యబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన కొన్ని కలయికలు సాధారణంగా ఉపయోగించబడతాయి.

  • ఎఫ్.ఏ.సి -ఫ్లూరోఉరాసిల్, డోక్సోరుబిసిన్, సైక్లోఫోస్ప్యామైడ్
  • ఎఫ్.ఈ.సి-ఫ్లూరోఉరాసిల్, ఎపిరుబిసిన్, సైక్లోఫోస్ప్యామైడ్
  • ఎసి-డొక్సోబుబిసిన్ మరియు సైక్లోఫోస్ప్యామైడ్
  • టిసి-డోసిటాక్సెల్ మరియు సైక్లోఫోస్ప్యామైడ్
  • ఎఫ్.ఏ.సి-టి-ఫ్లూరోఉరాసిల్, డోక్సోరుబిసిన్, సైక్లోఫోస్ప్యామైడ్ మరియు డోసిటాక్సెల్ లేదా పాస్లిటాక్సెల్
  • ఎఫ్.ఈ.సి-టి-ఫ్లూరోఉరాసిల్, ఎపిరుబిసిన్, సైక్లోఫోస్ప్యామైడ్, మరియు డోసిటాక్సెల్ లేదా పాస్లిటాక్సెల్
  • ఎఫ్.ఈ.సి-టిసి-ఫ్లూరోఉరాసిల్, ఎపిరుబిసిన్, సైక్లోఫస్ఫమైడ్, టాక్సేన్ మరియు కార్బోప్లాటిన్

నియోఅడ్జువెంట్ కీమోథెరపీ

కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లలో, కీమోథెరపీ ప్రాథమిక కణితి యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి శస్త్రచికిత్సకు ముందు ఇవ్వబడుతుంది. దీనిని నియోఅడ్జువెంట్ కీమోథెరపీ అని పిలుస్తారు. ఇది సాధారణంగా కణితి పెద్దదిగా ఉన్న వారికి మరియు రొమ్ముల సంరక్షణ శస్త్రచికిత్స సాధ్యంకాని రోగులకు చెయ్యబడుతుంది. నియోఅడ్జువెంట్ కీమోథెరపీ చేయించుకోవటం ద్వారా, కణితి పరిమాణం తగ్గిపోతుంది మరియు రోగి వైడ్ లోకల్ ఎక్సిషన్ కోసం సానుకూలం కావచ్చు. ఇది హార్మోన్ రిసెప్టర్ నెగటివ్ ఉన్నవారికి లేదా హెచ్.ఈ.ఆర్2 పాజిటివ్ గా ఉన్న రోగులలో కూడా పరిగణించబడుతుంది.

అడ్జువెంట్ అమరికలో ఉపయోగించే కీమోథెరపీ నియమాలు కూడా ఈ అమరికలో ఉపయోగించబడతాయి.

కీమోథెరపీ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న అందరు రోగులకు ఇవ్వబడుతుందా?

రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సకు ముందు లేదా తర్వాత కీమోథెరపీ అవసరం అందరు రోగులకు ఇవ్వబడదు, కానీ దీనివలన అధికంగా ప్రయోజనం పొందే రోగులకు ఇది సూచించబడుతుంది మరియు ఇవ్వబడుతుంది.అటువంటి చికిత్సా విధానం నుండి ప్రయోజనం పొందగలరో లేదో చెప్పడానికి ఉపయోగించే అనేక ఉపకరణాలు మరియు పద్ధతులు ఉన్నాయి.

కీమోథెరపీ యొక్క ప్రయోజనాన్ని గుర్తించడంలో ముఖ్యమైన కారకాలు వయస్సు- తక్కువ వయస్సు ఉన్నవారు ఎక్కువ ప్రయోజనం పొందుతారు, కణితుల పరిమాణం- కణితి ఎంత పెద్ద పరిమాణంలో ఉంటే అంత ప్రయోజనం, క్యాన్సర్ లో శోషరస కణుపుల ప్రమేయం, ఈ.ఆర్ పాజిటివ్ లేదా నెగటివ్- ఈ.ఆర్ నెగటివ్ ఉన్నవారు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. హెచ్.ఈ.ఆర్. 2 ఉన్న రోగులు కీమోథెరపీ వలన ఎక్కువ ప్రయోజనం పొందుతారు మొదలైనవి. ప్రతి రోగిలో కీమోథెరపీ ప్రయోజన శాతం అంచనా వేయగల సాధనాలు మరియు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి మరియు ఇవి క్లుప్తంగా క్రింద ఇవ్వబడ్డాయి.

ఆన్లైన్ సాధనాలు

ప్రిడిక్ట్ వెర్షన్ 2.0- ఇది యు.కే లో అభివృద్ధి చేసిన ఒక ఆన్లైన్ సాధనం మరియు రొమ్ము క్యాన్సర్లో అనుబంధ కెమోథెరపీ యొక్క ప్రయోజనాన్ని అంచనా వేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించబడుతుంది.

ఇతర పరీక్షలు

  • ఎండోపెడిక్ట్ (మైరియడ్ జెనెటిక్స్)
  • ఆన్కోటైప్ డి.ఎక్స్ (జీనోమిక్ హెల్త్)
  • మమ్మాప్రింట్ (అజెండియా)
  • ప్రోసిన్య (నానో స్త్రింగ్ టెక్నాలజీస్)

ఈ పై పరీక్షలు క్యాన్సర్ పునరావృత ప్రమాదాన్ని అంచనా వేయడం మరియు కెమోథెరపీ ఆ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంత అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది, మరియు కీమోథెరపీ తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాల గురించి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతాయి. ఈ పరీక్షలు చాలా ఖరీదైనవి కానీ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సహాయపడటానికి కొన్ని పరిస్థితులలో ఉపయోగపడతాయి.

కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలు

రొమ్ము క్యాన్సర్ కోసం తీసుకోబడే కీమోథెరపీ దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. అవి నిర్వహిస్తున్న ఔషధాలపై ఆధారపడి ఉంటాయి. ఈ దుష్ప్రభావాలలో కొన్ని మందులతో చక్కగా నియంత్రించబడతాయి. కీమోథెరపీ భరించే శక్తి ఒక్కొకరికీ ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు వ్యక్తులు ఎటువంటి దుష్ప్రభావాల లేకుండా చాలా బాగా చికిత్సను ఎదుర్కోగలుగుతారు, మరికొందరు ఇతర దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. ఇవి సాధారణ దుష్ప్రభావాలు

జుట్టు రాలటం

ఇది పైన చెప్పిన కీమోథెరపీ నియమాలతో సర్వసాధారణంగా ఉంటుంది. మొట్టమొదటి దఫా యొక్క రెండవ వారంలో జుట్టు రాలటం సాధారణంగా ప్రారంభమవుతుంది. కీమోథెరపీ పూర్తయిన తర్వాత జుట్టు తిరిగి పెరుగుతుంది. కొన్ని కేంద్రాల్లో “కోల్డ్ కాప్” సేవను అందించవచ్చు, ఇది జుట్టు రాలే అవకాశాన్ని తగ్గిస్తుంది. “కోల్డ్ కాప్” అనేది కీమోథెరపీ జరిగే ముందు బాగా చల్లబరిచిన ఒక టోపీ తల మీద పెట్టటం.

వికారం మరియు వాంతులు

ఇది కీమోథెరపీ యొక్క బాగా తెలిసిన దుష్ప్రభావం, కానీ ఆధునిక మందులతో, ఈ లక్షణాలు బాగా నియంత్రించబడతాయి. వికారం అంటే వాంతివచ్చినట్లుగా ఉండే భావన.

అలసట

అలసట అనేది ఒక సాధారణ దుష్ప్రభావం. ఇది సాధారణంగా మొదటి వారంలో ఎక్కువగా ఉంటుంది మరియు ఆ తరువాత క్రమంగా మెరుగుపడుతుంది.

నోటిలో నొప్పి

కీమోథెరపీ తర్వాత ఇది సాధారణంగా ఉంటుంది. దానంతట అదే తగ్గిపోతుంది.

విరేచనాలు

కీమోథెరపీ తర్వాత ఈ లక్షణం అప్పుడప్పుడు కలుగుతుంది.

మలబద్ధకం

కీమోథెరపీ లో మలబద్ధకం అనేది ఒక సాధారణ దుష్ప్రభావం. కీమోథెరపీ మందుల ఫలితంగా ఇది జరగవచ్చు కానీ ప్రధానంగా ఇది కీమోథెరపీతో పాటు ఇవ్వబడిన వికారం రాకుండా చేసే మందుల ప్రభావం కారణంగా కూడా కావచ్చు. కీమోథెరపీ మొదటి కొన్ని రోజుల్లో మలబద్ధకం ఉంటుంది.

ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం

ఇది కీమోథెరపీ యొక్క ముఖ్యమైన దుష్ప్రభావం. కీమోథెరపీ అంటువ్యాధులు పోరాడటానికి శరీరానికి ఉండే సామర్థ్యాన్ని తగ్గించటం వలన ఇది జరుగుతుంది. అందువలన, కీమోథెరపీ సమయంలో ఎప్పుడైనా జ్వరంగా ఉంటే (అర్ధరాత్రి అయినా సరే) మీ డాక్టర్ని తక్షణమే సంప్రదించడం చాలా ముఖ్యం.

రుచిలో మార్పులు

కీమోథెరపీతో ఇది సాధారణంగా ఉంటుంది మరియు అందువల్ల ఆహారపు రుచి ముందువలె ఉండకపోవచ్చు. కీమోథెరపీ పూర్తయిన తర్వాత రుచి దానంతట అదే తిరిగి వస్తుంది.

చేతులు మరియు కాళ్ళలో జలదరింపు

కొన్ని కీమోథెరపీ మందులు ఈ దుష్ప్రభావం చూపుతాయి.

రక్తహీనత

ఇది కీమోథెరపీతో రక్తస్రావం కలిగే చిన్న ప్రమాదం ఉంది. ఇలా జరిగితే, మీరు మీ వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

రక్తస్రావం

కీమోథెరపీతో రక్త స్రావం ఒక చిన్న ప్రమాదం ఉంది. ఇలా జరిగితే, మీ వైద్యునిని నేరుగా సంప్రదించండి.

సంతానోత్పత్తి మరియు ముట్లుడగటం

కీమోథెరపీ అండాశయము యొక్క పనితనాన్ని ప్రభావితం చేయవచ్చు అందువల్ల ముట్లుడగవచ్చు. బహిస్టు తక్కువ కావటం లేదా పూర్తిగా ఆగిపోవటానికి ఇది కారణం కావచ్చు. యువ మహిళల్లో, కీమోథెరపీ పూర్తయిన తర్వాత బహిష్టు పునఃప్రారంభం కావచ్చు, కాని వయసు పైబడిన స్త్రీలలో ఇంకా ఎప్పటికీ బహిష్టు నిలిచిపోవచ్చు. కీమోథెరపీ యొక్క ఈ దుష్ప్రభావం భవిష్యత్తులో ఆ మహిళ బిడ్డను కనే సామర్ధ్యాన్ని ప్రభావితం చెయ్యవచ్చు.

మెటాస్టాటిక్ లేదా సెకండరీ రొమ్ము క్యాన్సర్లో కీమోథెరపీ కోసం, సెకండరీ రొమ్ము క్యాన్సర్ విభాగాన్ని చూడండి.

రేడియోథెరపీ

క్యాన్సర్ కణాలు చంపడానికి ఇవ్వబడే అధిక శక్తి ఎక్స్-రే కిరణాల వాడకం రేడియోథెరపీ. ఈ ఎక్స్-రే కిరణాలు క్యాన్సర్ కణాల డి.ఎన్.ఎ కు నష్టం కలిగిస్తాయి మరియు తద్వారా వాటిని చంపుతాయి. రేడియోథెరపీ అనేది స్థానిక చికిత్స మరియు దీని ప్రభావం ఇది ఇచ్చిన ప్రాంతంలోనే ఉంటుంది. ఇది ఒక పెద్ద యంత్రం (లీనియర్ యాక్సిలేటర్) ఉపయోగించి ఎక్స్-రే కిరణాలను ఉత్పత్తి చేస్తుంది మరియు రోగికి చికిత్సను అందిస్తుంది. ఈ పద్ధతిని ఎక్స్టర్నల్ బీం చికిత్సగా పిలుస్తారు. రేడియోథెరపీ ఇవ్వడానికి ఇతర మార్గం రేడియోధార్మిక వనరులను నేరుగా క్యాన్సర్లోకి ప్రవేశపెట్టడం. ఈ పద్ధతిని బ్రాచీథెరపీ అంటారు మరియు కొన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

రొమ్ము క్యాన్సర్ కోసం రేడియోథెరపీ

రొమ్ము క్యాప్ కోసం రేడియోథెరపీ సాధారణంగా రొమ్ములో కణితి తోలిగించాబద్దాక చెయ్యబడుతుంది. ఇక్కడ రేడియోథెరపీ యొక్క ప్రయోజనం రొమ్ములో క్యాన్సర్ పునరావృత ప్రమాదాన్ని తగ్గించడం. వైడ్ లోకల్ ఎక్సిషన్ చేయించుకున్న రోగుల్లో ఎక్కువ మందికి రేడియోథెరపీ అవసరమవుతుంది. మాస్టేక్టమి చేయించుకున్న కొందరు రోగులకు మాత్రమే రేడియోథెరపీ అవసరమవుతుంది. ఎక్స్టర్నల్ బీం రేడియోథెరపీ అనేది చికిత్స యొక్క అత్యంత సాధారణ రూపం. ఇక్కడ మాస్టేక్టమి జరిగితే మొత్తం రొమ్ము, లేదా ఛాతీ గోడకు చికిత్స చేస్తారు. క్యాన్సర్ దశపై ఆధారపడి ఆక్సిల్లా (ఆర్మ్ పిట్) కి కూడా చికిత్స అవసరం వచ్చు. చికిత్స ఐదు రోజులు ఇవ్వబడుతుంది మరియు మొత్తం మూడు నుండి ఐదు వారాల కాలవ్యవధి ఉంటుంది. ప్రతిరోజూ, చికిత్స సుమారు 15 నిమిషాలు పడుతుంది. ఇది నొప్పి లేనిది మరియు కేవలం ఎక్స్ – రే వంటిది. అంకాలజిస్టుచే ఎన్నుకున్న చికిత్స పద్ధతిని బట్టి రొమ్ము క్యాన్సర్లో రేడియోథెరపీ యొక్క వ్యవధి 3 నుండి 6 వారాల వరకు ఉంటుంది. చికిత్స అయ్యేసరికి క్రింద ఇవ్వబడిన కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.

రొమ్ము క్యాన్సర్లో బ్రాచీథెరపీ

రొమ్ము క్యాన్సర్ చికిత్సకు రేడియోధార్మిక మూలం ఉపయోగించి రేడియోథెరపీ అందించడమే బ్రాచీథెరపీ. ఈ చికిత్స లంపెక్టమి ఎక్కడైతే క్యాన్సర్ తొలగించబడింది మరియు రొమ్ము అదే స్థానంలో ఉంటుంది, అటువంటి రోగులకు జరుగుతుంది. బ్రాచీ థెరపీ మూలం లంపెక్టమి కుహరంలో ఉంచబడుతుంది మరియు చికిత్స ఇవ్వబడుతుంది. సాంప్రదాయ రేడియోథెరపీ కంటే ఈ పద్ధతి త్వరితంగా ఉంటుంది మరియు కొన్ని సెంటర్స్ లో అందుబాటులో ఉంది. ఈ రకమైన చికిత్సను ఇంట్రాకేవిటీ బ్రాచీథెరపీ అని పిలుస్తారు.

ఇంట్రాఆపరేటివ్ రేడియోథెరపీ

ఈ రేడియోథెరపీ ఒక చిన్న మరియు పోర్టబుల్ మెషిన్ సహాయంతో లంపెక్టమి చేసే సమయంలో చెయ్యబడే ఒక టెక్నిక్.

రొమ్ము లేదా ఛాతీ గోడ రేడియోథెరపీ యొక్క దశలు

రేడియేషన్ అంకాలజిస్ట్ చికిత్స యొక్క అన్ని లాభాలు మరియు నష్టాలు గురించి చర్చిస్తారు. అప్పుడు మీరు ప్రణాళికా అనుకరణ యంత్రం లేదా సీటీ స్కాన్ గదిలోకి తీసుకువెళ్లబడతారు. ఆ సెంటర్ లో ఒక ప్రణాళిక అనుకరణ కలిగి యంత్రం ఉంటే, మీ పైన కొన్ని ఎక్స్ – రే- లు తియ్యబడతాయి మరియు రొమ్ము లేదా ఛాతీ గోడ చుట్టూ మార్కు చెయ్యబడతాయి. సెంటర్ లో సీటీ స్కాన్ ఉంటే, ఛాతీ స్కాన్ తియ్యబడుతుంది మరియు తరువాత మార్క్ చెయ్యబడుతుంది. అది ప్రతీ రోజు ఈ రోగులకు రేడియోగ్రాఫర్ ఒకే విధంగా ఉండేలా సహాయపడుతుంది. దీని తరువాత, అంకాలజిస్ట్ చికిత్సను రూపొందిస్తారు మరియు ఫిజిసిస్ట్ ఈ చికిత్సను ఎలా ఉత్తమంగా అందించాలనే ప్రణాళికలను రూపొందిస్తాడు. ఈ ప్రక్రియ లక్ష్యం ఖచ్చితంగా ఉండటం, క్యాన్సర్ కణానికి గరిష్ట నష్టం కలిగించటం మరియు సాధ్యమైనంతవరకు సాధారణ నిర్మాణాలకు రేడియోధార్మికతను నివారించడం.

రొమ్ము లేదా ఛాతీ గోడ రేడియోథెరపీ యొక్క దుష్ప్రభావాలు

రొమ్ము లేదా ఛాతీ గోడ రేడియోథెరపీ యొక్క దుష్ప్రభావాలు కింద ఇవ్వబడ్డాయి

చర్మంలో మార్పులు

రేడియోథెరపీ వలన రొమ్ము లేదా ఛాతీ గోడపై చర్మం పొడిబారవచ్చు, ఎర్రబడి మరియు దురద పుట్టవచ్చు. చికిత్స చివరలో, చర్మం పొరలుగా మారవచ్చు, లేదా కొన్నిసార్లు చర్మం కింద ప్రాంతం పైన చర్మం ఊడిపోవచ్చు. ఈ చర్మం దుష్ప్రభావాలు చికిత్స పూర్తయిన తర్వాత ఒక వారం లో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి మరియు రెండు వారాల తర్వాత పరిష్కరించబడతాయి. పొడిబారటాన్ని మరియు దురదను నివారించడానికి, సాధారణ మాయిశ్చరైజర్ క్రీమ్ను ఉపయోగించడం మంచిది. ఏ లోహాలు(జింక్ వంటివి) లేని కరీం ఎంచుకోండి, లేదంటే చర్మం యొక్క దుష్ప్రభావాలను మరింత తీవ్రతరం చేయగలదు. అలాగే చికిత్స సమయంలో చర్మాన్ని తీవ్రంగా రుద్దవద్దు. ఒక మృదువైన వస్త్రంతో మెత్తగా తుడవండి. ఒకవేళ చరమ ఊడిపోయి లోపలి చర్మం బయటపడితే, ప్రత్యేకమైన క్రీములు మరియు కట్టలు కోసం మీ అంకాలజిస్ట్ తో మాట్లాడండి.

అలసట

రేడియోథెరపీ చికిత్సా చివరలో కాస్త అలసటను కలిగించవచ్చు. దీనికి చికిత్స కొంత కారణం కావచ్చు మరియు ఆసుపత్రికి ఐదు వారాలపాటు వెళ్ళిరావటం కారణం కావచ్చు. అలసట కొన్ని వారాలలో తగ్గిపోతుంది.

రొమ్ములో లేదా ఛాతీ గోడపై నొప్పి

ఈ చికిత్స చివరలో జరుగుతుంది. ఇది చాలావరకు తక్కువగా ఉంటుంది మరియు ఎటువంటి మందులు అవసరం ఉండవు. కొన్ని వారాలలో ఇది తగ్గిపోతుంది. కొంతమంది రోగులలో ఇది ఎక్కువ కాలం ఉండవచ్చు మరియు వారికి నొప్పి తగ్గించే మందులు అవసరం కావచ్చు.

రొమ్ములో వాపు

రేడియోథెరపీ పూర్తయిన చాలా రోజుల వరకు రొమ్ము మీద చర్మం వాపును కలిగి ఉండచ్చు. దీనిని లింఫోఎడీమా అని పిలుస్తారు. ఇది సాధారణంగా తక్కువగా ఉంటుంది మరియు ఎక్కువ అసౌకర్యం కలిగించదు.

చేతి వాపు

ఆక్సిల్లా కి రేడియోథెరపీ ఇచ్చిన తరువాత యాక్సిలరీ శస్త్రచికిత్స చేయించుకున్న రోగులలో, చెయ్యి వాచే ప్రమాదం ఉంది. దీనిని చేతి యొక్క లింఫోఎడీమా అని పిలుస్తారు. ఇది సాధారణంగా కొన్ని వారాల వ్యవధిలో స్థిరపడుతుంది మరియు అది స్థిరపడకపోతే, ఇది సున్నితంగా రుద్దడం, వ్యాయామాలు మరియు కంప్రెషన్ బ్యాండేజీలతో నిర్వహించవచ్చు.

రొమ్ము యొక్క దృఢత్వం

రేడియోధార్మిక చికిత్సా గడిచిన కొన్ని నెలల తరువాత, చికిత్స చేయబడిన రొమ్ము ఇతర రొమ్ముకన్నా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా కొద్ది మంది రోగులలో చికిత్స చేయబడిన రొమ్ము ఇంకొకదానికన్నా చిన్నగా అయినట్టు గమనిస్తారు.

దగ్గు మరియు ఊపిరి ఆడకపోవటం

రొమ్ము లేదా ఛాతీ గోడ రేడియోథెరపీ చేయించుకున్న కొందరు రోగులు చికిత్స యొక్క దుష్ప్రభావంగా దగ్గు మరియు ఊపిరి ఆడకపోవటం జరగవచ్చు. ఇది సాధారణంగా తేలికపాటిదే అయ్యుంటుంది మరియు త్వరలోనే స్థిరపడుతుంది.

సెకండరీ లేదా మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్లో రేడియోధార్మిక చికిత్స కోసం, సెకండరీ రొమ్ము క్యాన్సర్ పైన సెక్షన్ చూడండి.

రొమ్ము క్యాన్సర్లో హార్మోన్ల చికిత్స అనేది సాధారణంగా మాత్రలు లేదా సూది మందులు రూపంలో ఇవ్వబడే ఔషధాల వాడకం, ఇది క్యాన్సర్ కణాల్లో ఈస్ట్రోజెన్ యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది. 80% రొమ్ము క్యాన్సర్లలో, క్యాన్సర్ కణాలు శరీరంలో సహజంగా ఉత్పత్తి అయిన ఈస్ట్రోజెన్ సహాయంతో పెరుగుతాయి. ఈ హార్మోనల్ ఏజెంట్లు క్యాన్సర్పై ఈస్ట్రోజెన్ యొక్క ప్రభావాన్ని నిరోధించవచ్చు లేదా శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని తగ్గించవచ్చు. అలా చేయడం ద్వారా, ఈ చికిత్స ప్రాథమిక క్యాన్సర్ తర్వాత క్యాన్సర్ పునరావృత ప్రమాదాన్ని తగ్గిస్తుంది లేదా ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ను నియంత్రిస్తుంది.

హార్మోన్ల చికిత్స ఎవరికి అవసరం

ఒక రొమ్ము క్యాన్సర్ను బయాప్సీతో గుర్తించినప్పుడు, ఈస్ట్రోజెన్ రిసెప్టర్ మరియు ప్రొజెస్టెరాన్ రిసెప్టర్ ఉందేమో చూడటానికి ఆ బయాప్సీ శాంపిల్ పరీక్షించబడుతుంది. వీటిలో ఒకటి అయినా పాజిటివ్ అయితే, రోగి హార్మోన్ల చికిత్సను తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. రొమ్ము క్యాన్సర్లలో సుమారు 80% ఈస్ట్రోజెన్ రిసెప్టర్ పాజిటివ్ గా ఉంటాయి మరియు అందువలన హార్మోన్ల చికిత్స నుండి లాభం చేకూరుతుంది.

హార్మోనల్ చికిత్స రకాలు

తీసుకోవలసిన హార్మోన్ల చికిత్స రకం రోగికి ముట్లుడిగాయా లేకా ఇంకా రుతుక్రమం వస్తుందా అనే దానిపైన ఆధార పది ఉంటుంది. ఎందుకంటే, కొన్ని హార్మోన్ల చికిత్సలు రుతుక్రమం ఇంకా వచ్చే మహిళల్లో పనిచేయవు.

ప్రీమెనోపౌసల్ (రుతుక్రమం వచ్చే మహిళల)

టామోక్సిఫెన్ అనేది వారి సాధారణ రుతుక్రమం ఉన్న మహిళల్లో సాధారణంగా ఉపయోగించే మందు. ఇది క్యాన్సర్ పునరావృత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు శస్త్రచికిత్స ద్వారా వారి క్యాన్సర్ను తొలగించిన ప్రీమెనోపౌసల్ మహిళలకు గట్టిగా సిఫార్సు చేయబడుతుంది. ఈ మందు ఒక టాబ్లెట్ రూపంలో ఇవ్వబడుతుంది. రోజుకు 20 ఎం.జి మోతాదులో ఇది తీసుకోబడుతుంది. టామోక్సిఫెన్ సాధారణంగా చాలా తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది చాలా చవక కూడా. అడ్వాన్స్డ్ క్యాన్సర్తో ఉన్న ప్రీమెనోపౌసల్ మహిళల్లో, రుతుక్రమం ఆపడానికి (ఓవరియన్ అబ్లేషన్) మరియు రోగి ముట్లుడిగేలా చెయ్యటాన్ని వైద్యులు సూచించవచ్చు. ఈ సూది మందులను ఎల్.హెచ్.ఆర్.హెచ్ అనలాగ్స్ అని పిలుస్తారు. ఆ మందులు పూర్తయ్యాక అనాస్ట్రాజోల్ మరియు లెట్రోజోల్ వంటి మందులు వాడవచ్చు. అండాశయాల తొలగింపు లేదా అండాశయాలకు రేడియోధార్మికత ఉపయోగించడం ద్వారా శస్త్రచికిత్స ద్వారా అండాశయ పనితీరు అణచివేయబడుతుంది.

ఋతుక్రమం ఆగిన వారు

ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో (ముట్లుడిగిపోయాయి) హార్మోన్ల ఏజెంట్ను ఉపయోగించటానికి విస్తృత ఎంపిక ఉంది. టామోక్సిఫెన్ లేదా అనస్ట్రోజోల్, లెట్రోజోల్ లేదా ఎక్సిమెస్టేన్ వంటి ఇతర ఔషధాలను తీసుకోవచ్చు.

అనస్ట్రోజోల్ మరియు లెట్రోజోల్లను అరోమాటేస్ ఇన్హిబిటర్స్ అని పిలుస్తారు మరియు ఋతుక్రమం ఆగిపోయిన దశలో టామోక్సిఫెన్ కంటే మెరుగ్గా పని చేస్తాయి. ప్రీమెనోపౌసల్ మహిళల్లో ఇవి ఉపయోగపడవు. వీటిని తేలికగా తట్టుకోవచ్చు.

అరోమాటేస్ ఇన్హిబిటర్లు దీర్ఘకాలికంగా ఇవ్వబడినప్పుడు, రోగి యొక్క ఎముకల ఆరోగ్యాన్ని పర్యవేక్షించటం చాలా ముఖ్యం. ఈ మందులు ఎముకలు (బోలు ఎముకల వ్యాధి) బలహీనమవటానికి కారణం కావచ్చు. ఈ ఔషధాలతో పాటు కాల్షియం మరియు విటమిన్ డి మాత్రలు తీసుకోవడం మంచిది.

హార్మోన్ థెరపీ టైమింగ్

క్యాన్సర్ తొలగించినప్పుడు ప్రాధమిక శస్త్రచికిత్స పూర్తి చేసిన తరువాత హార్మోన్ల చికిత్స వాడాలి. రోగి కీమోథెరపీ చేసుకుంటూ ఉంటే, ఈ చికిత్స కీమోథెరపీ పూర్తయిన తర్వాతనే వాడాలి. ఇది కీమోథెరపీలో చేసే సమయంలో ఉపయోగించరాదు. ఏదేమైనా, అది రేడియోథెరపీ చేసే సమయంలో చెయ్యవచ్చు.

కొన్నిసార్లు, హార్మోన్ల చికిత్స క్యాన్సర్ పరిమాణం తగ్గించడానికి శస్త్రచికిత్సకు ముందుగా ఉపయోగించవచ్చు. సెకండరీ లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్లో కూడా హార్మోన్ చికిత్సను ఉపయోగించవచ్చు. దాని గురించి మరింత సమాచారం కోసం సెకండరీ రొమ్ము క్యాన్సర్పై విభాగాన్ని చూడండి.

హార్మోన్ల చికిత్స యొక్క వ్యవధి

ప్రీమెనోపౌసల్ మహిళలో, టామోక్సిఫెన్ కనీసం 5 సంవత్సరాలు మరియు బహుశా 10 సంవత్సరాల వరకు తీసుకోవాల్సి రావచ్చు . రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో టామోక్సిఫెన్ 5 ఏళ్ళు వాడిన తరువాత అరోమాటేస్ ఇన్హిబిటర్కు మారవచ్చు. మీ డాక్టర్ తో దీని యొక్క లాభ నష్టాలు చర్చించండి.

ఒక అరోమాటేస్ ఇన్హిబిటర్తో మొదలుపెడుతున్న రుతుక్రమం ఆగిపోయిన స్త్రీ, ప్రస్తుత సాహిత్యం ఆధారంగా, దాన్ని 10 సంవత్సరాలు వాడాల్సి ఉంటుంది.

హార్మోన్ల చికిత్స యొక్క దుష్ప్రభావాలు

హార్మోన్ల చికిత్స యొక్క దుష్ప్రభావాలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. అవి కాస్తంత చెమటలు పట్టటం, రాత్రిపూట వేడి గాల్పులు, బరువు పెరుగుట, జుట్టు రాలటం, కండరాలు మరియు కీళ్ళలో నొప్పులు వంటివి.

టామోక్సిఫెన్లో ఉన్నప్పుడు యోని ద్వారా రక్తస్రావం ఉంటే, వైద్యుడిని సందర్శించటం ముఖ్యం.

పైన చెప్పినట్లుగా, అరోమాటేస్ ఇన్హిబిటర్స్ తో బోలు ఎముకల వ్యాధి వచ్చే చిన్న ప్రమాదం ఉంది, అందువలన, ఎముక ఆరోగ్యం ఎప్పటికప్పుడు ఎముక సాంద్రత స్కాన్ల సహాయంతో పర్యవేక్షించబడాలి. మొత్తంమీద, ఈ ఔషధాల నుండి వచ్చే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి మరియు చికిత్స యొక్క లాభాలు ఈ నష్టాలను అధిగమిస్తాయి.

ఇతర హార్మోన్ల ఏజెంట్లు మరియు చికిత్సలు

మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ ఉన్న రోగులలో హార్మోన్ల చికిత్సలు పనిచేయనప్పుడు ఫాస్లోడెక్స్ వంటి ఇతర హార్మోన్ల ఏజెంట్లను ఉపయోగిస్తారు. పైన ఉన్న. ఫాస్లోడెక్స్ నెలకు ఒకసారి సూది మందు రూపంలో ఇవ్వబడుతుంది.

సి.డి.కె. 4/6 ఇన్హిబిటర్లు

ఇవి లెట్రోజోల్ మరియు అనాస్ట్రాజోల్ వంటి హార్మోన్ల చికిత్సలతో పాటు రొమ్ము క్యాన్సర్ల చికిత్స కోసం ఉపయోగించే మందులు. ఈ మందులలో పల్బోసిస్లిబ్, రిబోసిస్లిబ్, అబేమాసిస్లిబ్ ఉన్నాయి. ఈ కలయికలో ఇచ్చినప్పుడు, స్పందన రేటు మరియు క్యాన్సర్ యొక్క ప్రతిస్పందన వ్యవధి కేవలం హార్మోన్ల ఏజెంట్లను మాత్రమే ఉపయోగించినప్పుడు కన్నా బాగా ఉంటుంది.

ఎంటిఓఆర్ ఇన్హిబిటర్లు

ఎవరోలిమస్ వంటి మందులు మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఎక్సిమేస్టేన్ వంటి అరోమాటేస్ ఇన్హిబిటర్ కలయిక లో ఉపయోగించబడతాయి.

జీవ చికిత్స

మోనోక్లోనల్ యాంటీబాడీస్ మరియు ఇతర లక్ష్య చికిత్సలు వంటి ఔషధాల ఉపయోగం జీవశాస్త్ర చికిత్సలో ఉంటుంది.

ఈ మందులు మాత్రలు గాని లేదా ఇంట్రావీనస్ అనగా సిరలోకి ఎక్కించడం ద్వారా ఇవ్వబడతాయి. ఈ మందులు సాధారణంగా క్యాన్సర్ సెల్ లో నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాయి, తద్వారా క్యాన్సర్ తగ్గింపు మరియు కుదింపు లో సహాయ పడతాయి.

ఈ మందులు నిర్దిష్ట రకాల కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవటం వలన, ఈ ఔషధాల యొక్క దుష్ప్రభావాలు కీమోథెరపీ కంటే తక్కువగా ఉంటాయి. ఈ మందులు కొన్ని రకాల క్యాన్సర్లను నియంత్రించడానికి ఉపయోగిస్తారు.

రొమ్ము క్యాన్సర్ కోసం జీవ చికిత్స

రొమ్ము క్యాన్సర్లో ఉపయోగించేందుకు నాలుగు ప్రధాన రకాల జీవ ఔషధాలను అందుబాటులో ఉన్నాయి మరియు అవి క్రింద ఇవ్వబడ్డాయి.

హెచ్.ఈ.ఆర్ 2 పాజిటివ్ క్యాన్సర్లు

హెచ్.ఈ.ఆర్ 2 అనేది ఎపిడెర్మల్ గ్రోత్ ఫాక్టర్ రిసెప్టర్ 2, ఇది రొమ్ము క్యాన్సర్లో విస్తరించినప్పుడు హెచ్.ఈ.ఆర్ 2 నెగటివ్ గా ఉన్న రొమ్ము క్యాన్సర్ కంటే మరింత తీవ్రంగా తయారయ్యే కాన్సర్ పెరుగుదలకు దారితీస్తుంది. అన్ని రొమ్ము క్యాన్సర్లలో దాదాపు 2 0 % హెచ్.ఈ.ఆర్ 2 పాజిటివ్ అయ్యి ఉంటాయి, ఎల్లప్పుడూ క్యాన్సర్ నిర్ధారణలో దీనికోసం పరీక్ష చెయ్యబడాలి. క్యాన్సర్ నమూనాలో హెచ్.ఈ.ఆర్ 2 స్థితి బయాప్సీ లేదా శస్త్రచికిత్సలో లభించిన దాన్ని బట్టి పరీక్షించబడుతుంది. కొన్నిసార్లు ప్రారంభ హెచ్.ఈ.ఆర్ 2 పరీక్ష అసాధారణంగా ఉంటుంది, అప్పుడు ఇంకొక పరీక్ష (ఎఫ్.ఐ.ఎస్.హెచ్) అవసర పడుతుంది. హెచ్.ఈ.ఆర్ 2 పరీక్ష పాజిటివ్ గా ఉంటే, హెచ్.ఈ.ఆర్ 2 కోసం ప్రతిరోధకాలు అందుబాటులో ఉన్నాయి మరియు వాటిని క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ క్రింది మందులు ఈ అమరికలో ఉపయోగించబడతాయి.

ట్రాస్టుజుమాబ్

ఈ మందు రొమ్ము క్యాన్సర్లో సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఈ ఔషధం అనుబంధ అమరికలో (రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత) లేదా క్యాన్సర్ శరీరం యొక్క వివిధ భాగాలకు వ్యాప్తి చెందుతున్నప్పుడు, అంటే మెటాస్టాటిక్ అమరికలో ఉపయోగించబడుతుంది. ఔషధ ఒక్కటే గానీ లేదా పెర్టుజుమాబ్ లేదా కీమోథెరపీతో కలిపి ఇవ్వబడుతుంది.

అనుబంధ అమరికలో ఇచ్చినప్పుడు, ట్రస్టూజుమాబ్ ఒక సంవత్సరం పాటు ఇవ్వబడుతుంది. ఇది వారానికి ఒకసారి లేదా ఎక్కువ మోతాదులో అయితే ప్రతి మూడు వారాలకు ఒకసారి ఇవ్వబడుతుంది. మెటాస్టాటిక్ వ్యాధిలో, ఇది పని చేసినంత వరకూ ఇవ్వబడుతుంది.

పెర్టుజుమాబ్

ఇది అడ్వాన్స్డ్ లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్ కలిగిన రోగులలో నియోఅడ్జువెంట్ (శస్త్రచికిత్స కు ముందు)మరియు అడ్జువెంట్ కీమోథెరపీ లో భాగంగా ట్రస్ట్యూజుమాబ్ తో పాటుగా ఇవ్వబడే మరొక హెచ్.ఈ.ఆర్. 2 రిసెప్టర్ మొనోక్లోనల్ యాంటీ బాడీ.

అడో-ట్రస్టుజుజుబ్ ఎమ్టాన్సైన్ (టిడిఎం-1)

ఈ మందు ట్రస్టుజుమాబ్ మరియు కీమోథెరపీ కలయిక మరియు ఇది హెచ్.ఈ.ఆర్ 2 పాజిటివ్ మరియు గతంలో ట్రస్టుజుమాబ్ ఉపయోగించిన మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ రోగులలో వాడబడుతుంది.

లపాటినిబ్

ఈ ఔషధాన్ని హెచ్.ఈ.ఆర్ 2 క్యాన్సర్ పాజిటివ్ గా ఉన్న రోగుల కోసం వాడతారు,. గతంలో ట్రస్టుజుమాబ్ చికిత్స పొందిన రోగులకు లపాటినిబ్ ఇవ్వబడుతుంది.

ఇచ్చింది. ఇది కీమోథెరపీ ఎజెంట్స్ లేదా ట్రస్టుజుమాబ్ తో కలిపి లేదా ఒక్కటే ఇవ్వబడుతుంది. ఇది నోటి ద్వారా తీసుకోవలసిన మందు.

యాంటీ హెచ్.ఈ.ఆర్ 2 మందుల యొక్క దుష్ప్రభావాలు

ఈ మందులు సాధారణంగా తట్టుకునేలా ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేకమైన దుష్ప్రభావాలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ మందులు హృదయం యొక్క పనితీరును ప్రభావితం చేస్తాయి కాబట్టి గుండె యొక్క విధిని ఎకోకార్డియోగ్రామ్ ఉపయోగించి ప్రతి 3 నెలలకు ఒకసారి పరిశీలించాలి. దగ్గు, శ్వాస ఆడకపోవడం, కాళ్ళ వాపు వంటి లక్షణాలు ఏవైనా ఉంటే రోగి వెంటనే అప్రమత్తం కావాలి.

ఎంటిఓఆర్ ఇన్హిబిటర్లు

ఎవరోలిమస్

ఈ ఔషధాన్ని సెకండరీ రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఎక్సిమెస్టేన్ అనే హార్మోన్ చికిత్సతో కలిపి ఉపయోగిస్తారు. ఈ మందులు క్యాన్సర్ వృద్ధి చెందడానికి ఉపయోగించే ఎంటిఓఆర్ మార్గాన్ని నిరోధిస్తుంది.

సిడికే 4/6 ఇన్హిబిటర్లు

ఇవి లెట్రోజోల్ మరియు అనస్ట్రాజోల్ వంటి హార్మోన్ల చికిత్సలతో పాటు మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ల చికిత్స కోసం ఉపయోగించే మందులు. ఈ మందులలో పాల్బోసిస్లిబ్, రిబోసిస్లిబ్, అబేమాసిస్లిబ్ ఉన్నాయి. ఈ కలయికలో ఇచ్చినప్పుడు, స్పందన రేటు మరియు క్యాన్సర్ యొక్క ప్రతిస్పందన వ్యవధి, హార్మోన్ ఏజెంట్లను ఒంటరిగా ఉపయోగించినప్పుడు కన్నా బాగుంటుంది. ఈ మందులు టాబ్లెట్ రూపంలో ఉంటాయి మరియు సాధారణంగా పరిమిత దుష్ప్రభావాలు ఉన్న రోగులు వీటిని చక్కగా తట్టుకోగలరు.

పిఎఆర్పి ఇన్హిబిటర్లు

ఒలాపరిబ్, రుకాపరిబ్, తలాజోపరీబ్, నిరాపరిబండ్ వెలిపరిబ్ వంటి మందులు బి.ఆర్.సి.ఎ1 మరియు బి.ఆర్.సి.ఎ2 మ్యుటేషన్స్ కలిగి ఉన్న రొమ్ము క్యాన్సర్ రోగులలో చికిత్సకు ఉపయోగకరమైనవి. ఇవి జన్యు పరమైన మ్యుటేషన్లు మరియు ఇవి రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సరు ఉండి బిఆర్సిఎ మ్యుటేషన్లు గల రోగులు ఒలాపరిబ్ లాంటి పిఎఆర్పి ఇన్హిబిటర్లుగా పిలవబడే ఔషధాలు ప్రయోజనం పొందవచ్చు.

సెకండరీ క్యాన్సర్ లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్

సెకండరీ క్యాన్సర్ అనేది దాని మూలం నుండి ఇతర శరీర భాగాలకు వ్యాపించిన క్యాన్సర్. సెకండరీ క్యాన్సర్ ప్రాథమిక క్యాన్సర్ చికిత్స చేయబడిన తర్వాత తిరిగి వచ్చిన క్యాన్సర్ కూడా కావచ్చు.

సెకండరీ రొమ్ము క్యాన్సర్

సెకండరీ రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము నుండి ఇతర శరీర భాగాలకు వ్యాపించిన క్యాన్సర్.

సెకండరీ రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక రొమ్ము క్యాన్సర్, యాక్సిలరీ శోషరస గ్రంధులకు చికిత్స చేయబడిన తర్వాత తిరిగి వచ్చిన క్యాన్సర్ కూడా కావచ్చు.

సెకండరీ రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు

సెకండరీ రొమ్ము క్యాన్సర్ శరీరం యొక్క ఏ భాగానైనా ఉండవచ్చు కాబట్టి, దాని లక్షణాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. క్యాన్సర్ చికిత్స చేయించుకున్న తరువాత మీరు ఇంతకు ముందు అనుభవించని ఏవైనా అసాధారణమైన లక్షణాలను మీ వైద్యుడికి తెలియజేయడం ముఖ్యం, లేదా దగ్గు వంటి సాధారణ లక్షణాలు తగ్గకపోతే కూడా.

సెకండరీ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ

ప్రాధమిక రొమ్ము క్యాన్సర్ చికిత్స తరువాత, క్రమం తప్పకుండా ఆంకాలజిస్ట్ చేత పరీక్షా చేయించుకోవడం మంచిది. ఈ ఫాలో అప్ ప్రక్రియలో ఆంకాలజిస్ట్ కూడా సాధారణ పరీక్షలు మరియు స్కాన్లను అభ్యర్థించవచ్చు. సెకండరీ క్యాన్సర్ ఈ పరీక్షలలో మరియు స్కాన్ లలో బయటపడుతుంది. కొన్ని సందర్భాల్లో, రోగి లక్షణాలను చూపుతారు అప్పుడు సెకండరీల యొక్క పరిశోధనలు మరియు నిర్ధారణకు దారితీస్తుంది.

సెకండరీ రొమ్ము క్యాన్సర్ చికిత్స

సెకండరీ రొమ్ము క్యాన్సర్ యొక్క చికిత్స ఎక్కువగా సెకండరీ స్థానాలపైన, రోగి యొక్క లక్షణాల పైన, రోగి యొక్క సాధారణ శారీరక స్థితి మరియు రోగి యొక్క హార్మోన్ల మరియు హెచ్.ఈ.ఆర్ 2 స్థితిపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా, చికిత్స యొక్క ఎంపికలు ఉంటాయి, అవి కింద ఇవ్వబడ్డాయి. ఒకసారి, సెకండరీ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ చేయబడ్డాక, అన్ని చికిత్స ఎంపికలు ప్రధానంగా క్యాన్సర్ను నియంత్రించే లక్ష్యంతో ఉంటాయి.

కీమోథెరపీ

కీమోథెరపీ సెకండరీ రొమ్ము క్యాన్సర్లో సాధారణంగా ఉపయోగించే చికిత్స. అనేక కీమోథెరపీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ కీమోథెరపీ మందులు డ్రిప్స్, సూది మందులు లేదా మాత్రలు రూపంలో ఇవ్వబడుతుంది. ఈ మందులు ఒక్కటే ఇవ్వబడవచ్చు లేదా కలయికలుగా ఇవ్వబడతాయి.

వైద్య అంకాలజిస్ట్ ఈ మందులలో ఏది ఉపయోగించాలో నిర్ణయిస్తారు. తక్కువ ప్రమాదంతో ఎక్కువ లాభం పొందేలా చూస్తారు. ఇక్కడ సెకండరీ రొమ్ము క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే సాధారణ మందులు ఇవ్వబడ్డాయి.

  • టాక్సేన్స్ – (డోసిటాక్సెల్, ప్యాక్లిటాక్సెల్, నాబ్-పాక్లిటాక్సెల్)
  • అంతరాసైక్లిన్స్- (డొక్సోరుబిసిన్, ఎపిరుబిసిన్, లిపోసొమల్ డొక్సోరుబిసిన్))
  • కెపాసిటబైన్
  • జెమ్సిటబైన్
  • వినోరెల్బైన్
  • ఇరుబిలిన్
  • ఇక్సాబెపిలోన్
  • కార్బోప్లాటిన్

రేడియేషన్ థెరపీ లేదా రేడియోథెరపీ

రేడియోధార్మిక చికిత్సా విధానం సాధారణంగా సెకండరీ రొమ్ము క్యాన్సర్ లక్షణాల నిర్వహణలో ఉపయోగిస్తారు. ఇది ఒక స్థానిక చికిత్స, అక్కడ రేడియోధార్మికత శరీరంలో పేర్కొన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇవ్వబడుతుంది. నొప్పి వంటి లక్షణాలను నియంత్రించడంలో రేడియేషన్ చికిత్స బాగా పనిచేస్తుంది. సాధారణంగా, రొమ్ము, మెదడు, వెన్నెముక, ఎముకలు మరియు ఇతర ప్రాంతాల్లోని క్యాన్సర్ కు రేడియోధార్మిక చికిత్స చేస్తారు. రేడియోథెరపీ లక్షణాలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక సాధారణ చికిత్సలో 1-10 రోజులు ఉంటుంది.

హార్మోనల్ చికిత్స

రొమ్ము క్యాన్సర్ ఈస్ట్రోజెన్ రిసెప్టర్ పాజిటివ్ లేదా ప్రొజెస్టెరాన్ రిసెప్టర్ పాజిటివ్ గా ఉంటే, అప్పుడు హార్మోన్ చికిత్సను ఉపయోగిస్తారు. చాలామంది రొమ్ము క్యాన్సర్ రోగులు సెకండరీ క్యాన్సర్ అభివృద్ధికి ముందు ఇప్పటికే హార్మోన్ల చికిత్సను ఉపయోగింఛి ఉంటారు. అనేక హార్మోన్ల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అంకాలజిస్ట్ తగిన హార్మోన్ చికిత్స ను నిర్ణయిస్తారు. కణితి ఈస్ట్రోజెన్ రిసెప్టర్ నెగటివ్ మరియు ప్రొజెస్టెరాన్ రిసెప్టర్ నెగటివ్ గా ఉంటే హార్మోన్ల చికిత్స ప్రభావవంతంగా ఉండదు. సెకండరీ రొమ్ము క్యాన్సర్ లో, ఈ హార్మోన్ల ఏజెంట్లు, వ్యాధికి మరింత పెరిగితే తప్ప, కొనసాగించాలి. ఉపయోగించే ఏజెంట్లు

  • టామోక్సిఫెన్
  • అనస్ట్రాజోల్
  • లెట్రోజోల్
  • ఎక్సిమెస్టేన్
  • ఫుల్వేస్త్రాంట్
  • ప్రోజేస్టిన్స్

జీవ చికిత్సలు

సెకండరీ లేదా మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ కలిగిన రోగుల చికిత్సలో జీవ ఏజెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏజెంట్లు కీమోథెరపీ మందులు కాదు మరియు అందువలన విషపూరితత తక్కువగా ఉంటుంది.

ట్రస్టుజుమాబ్

ఈ ఔషధం పరీక్షలో హెచ్.ఈ.ఆర్ 2 పాజిటివ్ గా ఉన్న రోగులలో ఉపయోగిస్తారు. ఈ పరీక్ష పరిస్థితి నిర్ధారణకు తీసుకున్న రొమ్ము క్యాన్సర్ నమూనాలో చెయ్యబడుతుంది. ఒకవేళ నమూనా లేనట్లయితే లేదా నిర్ధారణ సమయంలో పరీక్ష చేయబడనట్లయితే, హెచ్.ఈ.ఆర్ 2 స్థితి కోసం పరీక్షించడానికి బయాప్సీ మళ్ళీ చెయ్యాల్సిన అవసరముంటుంది.

హెచ్.ఈ.ఆర్ 2 పరీక్ష పాజిటివ్ గా ఉంటే, ట్రస్టుజుమాబ్ ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే దీనివలన ప్రయోజనం ఉండదు. రొమ్ము క్యాన్సర్ రోగులలో సుమారు 20% హెచ్.ఈ.ఆర్ 2 పాజిటివ్ గా ఉంటారు. ట్రస్టుజుమాబ్ ఒక్కటే లేదా కీమోథెరపీతో కలిపి ఇవ్వబడుతుంది.

పెర్టుజుమాబ్

పెర్టుజుమాబ్ హెచ్.ఈ.ఆర్ 2 పాజిటివ్ గా ఉన్న సెకండరీ క్యాన్సర్ లేదా మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మరొక ఔషధం. ఇది ట్రస్టుజుమాబ్ తో పాటు మరియు / లేదా కీమోథెరపీతో కలయికగా ఉపయోగించబడుతుంది.

అడో-ట్రస్టుజుజుబ్ ఎమ్టాన్సైన్ (టిడిఎం-1)

ఇంతకు ముందు ట్రస్టుజుమాబ్ మరియు లపాటినిబ్ వాడిన హెచ్.ఈ.ఆర్ 2 పాజిటివ్ గా ఉన్న సెకండరీ క్యాన్సర్ లేదా మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ రోగుల చికిత్సలో ఇది ట్రస్టుజుమాబ్ తో పాటు మరియు / లేదా కీమోథెరపీతో కలయికగా ఉపయోగించబడుతుంది.

లపాటినిబ్

ఈ ఔషధాన్ని హెచ్.ఈ.ఆర్ 2 క్యాన్సర్ పాజిటివ్ గా ఉన్న రోగుల కోసం వాడతారు,
గతంలో ట్రస్టుజుమాబ్ చికిత్స పొందినా కూడా క్యాన్సర్ తగ్గటానికి బదులు పెరిగిన రోగులకు లపాటినిబ్ ఇవ్వబడుతుంది.

ఇచ్చింది. ఇది కీమోథెరపీ ఎజెంట్స్ లేదా ట్రస్టుజుమాబ్ తో కలిపి లేదా ఒక్కటే ఇవ్వబడుతుంది.

ఎవరోలిమస్

ఈ ఔషధం సెకండరీ రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఎక్సిమేస్టేన్ తో కలిపి ఉపయోగిస్తారు.

సిడికే 4/6 ఇన్హిబిటర్లు

ఇవి లెట్రోజోల్, అనస్ట్రాజోల్ మరియు ఫుల్వేస్త్రాంట్ వంటి హార్మోన్ల చికిత్సలతో పాటు మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ల చికిత్స కోసం ఉపయోగించే మందులు. ఈ మందులలో పాల్బోసిస్లిబ్, రిబోసిస్లిబ్, అబేమాసిస్లిబ్ ఉన్నాయి. ఈ కలయికలో ఇచ్చినప్పుడు, స్పందన రేటు మరియు క్యాన్సర్ యొక్క ప్రతిస్పందన వ్యవధి, హార్మోన్ ఏజెంట్లను ఒంటరిగా ఉపయోగించినప్పుడు కన్నా బాగుంటుంది. ఈ మందులు టాబ్లెట్ రూపంలో ఉంటాయి మరియు సాధారణంగా పరిమిత దుష్ప్రభావాలు ఉన్న రోగులు వీటిని చక్కగా తట్టుకోగలరు.

ఇతర ఔషధాలు

ఫామ్- ట్రస్టూజుమాబ్ డెరూక్స్టెకాన్ అనేది యాంటీబాడీ ఔషధ కాంపౌండ్. ఇప్పుడు మెటాస్టాటిక్ హెచ్ఇఆర్2 పాజిటివ్ రొమ్ము క్యాన్సరు చికిత్సకు లభిస్తోంది. టుకాటినిబ్ అనే మౌఖిక చికిత్సను కూడా ఇతర ఔషధాలతో పాటు పరిగణించబడవచ్చు.

మెటాస్టాటిక్ వ్యాధి ఉండి ట్రిపుల్ నెగెటివ్, అంటే ఇఆర్, పిఆర్ మరియు హెచ్ఇఆర్2కి నెగెటివ్ ఉన్నట్లుగా తెలిసిన రొమ్ము క్యాన్సరు రోగుల్లో చికిత్స ఎంపికగా ఇమ్యునోథెరపిని ఉపయోగించవచ్చు. పిడి-ఎల్1 పరీక్ష ఈ రోగులకు చేయబడుతుంది మరియు పాజిటివ్గా కనుగొంటే, అటెజోలిజుమాబ్ లాంటి ఔషధాలను కీమోథెరపితో పాఉట ఇవ్వవచ్చు. పెంబ్రోలిజుమాబ్ మరియుఅ వెలుమాబ్ లాంటి ఇతర ఔషధాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.

పురుష రొమ్ము క్యాన్సరు అనేది అరుదైన క్యాన్సరు మరియు మొత్తం రొమ్ము క్యాన్సర్లలో దాదాపు 1% ఉంటుంది. పురుష రొమ్ము క్యాన్సరుకు ప్రమాదకర అంశాల్లో వృద్ధ వయస్సు ఉంది, సాదారణంగా 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు. ఊబకాయం లేదా కాలేయం వ్యాధి లాంటివి గల వారిలో ఈస్ట్రోజెన్ అధిక స్థాయిలు గల ప్రజల్లో కూడా ప్రమాదం ఉంటుంది. క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన స్థితి గల పురుష రోగులు లేదా క్యాన్సరు ఉన్నట్లుగా బలమైన కుటుంబ చరిత్ర గల లేదా బిఆర్సిఎ1 ఉన్నట్లుగా లేదా జీన్స్లో 2 మ్యుటేషన్లు ఉన్నట్లుగా తెలిసిన వారికి కూడా రొమ్ము క్యాన్సరు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

రొమ్ము క్యాన్సరు గల మగ పురుషునికి ముడిపడివున్న లక్షణాలు స్త్రీకి ఉన్నట్లుగా ఉంటాయి మరియు రొమ్ములో గడ్డ కనిపించడం లేదా ఉన్నట్లుగా అనిపించడం, లోపలకు లాగేసిన చనుమొన కనిపించడం, లేదా చనుమొన నుంచి డిశ్చార్జి లేదా ఆర్మ్ చుట్టూ వాపు ఉంటాయి. చనుమొన చుట్టూ అల్సర్ లేదా దద్దురు కూడా కనిపిస్తాయి.

పురుష రొమ్ము క్యాన్సరుకు పరిశోధనలు స్త్రీ రొమ్ము క్యాన్సరు మాదిరిగానే ఉంటాయి మరియు పైన జాబితాగా ఇవ్వబడ్డాయి. అలాగే, చికిత్స ఎంపికల్లో సర్జరీ, కీమోథెరపి, రేడియోథెరపి, హార్మోనల్ థెరపి, మరియు బయోలాజికల్ థెరపి చికిత్సగా ఉపయోగించబడుతున్నాయి. అత్యధిక మంది రోగులకు లంపెక్టమికి బదులుగా మాస్టెక్టమి ఉంది.

హార్మోన్ థెరపిని ఉపయోగించినప్పుడు, పురుష రోగుల్లో టామోక్సిఫెన్ మాత్రమే సముచితంగా ఉంటుంది.