పిల్లల్లో క్యాన్సర్‌లు

పిల్లల్లో క్యాన్సర్‌లు

వయోజనుల్లో క్యాన్సర్లతో పోల్చుకుంటే బాల్యంలో వచ్చే క్యాన్సర్లు అరుదైన క్యాన్సర్లు. వాళ్ళ బయాలజీ కూడా వయోజన క్యాన్సర్లకు చాలా భిన్నంగా ఉంటాయి ఎందుకంటే ఇవి మరింత ప్రిమిటివ్‌ కణ రకాల నుంచి ఉత్పన్నమవుతాయి. దీని ఫలితంగా, ఈ క్యాన్సర్లు వయోజన క్యాన్సర్ల కంటే కీమోథెరపికి మెరుగ్గా స్పందిస్తాయి. శిశువులో జన్యుపరమైన మార్పుల వల్ల లేదా జన్యుపరమైన సిండ్రోమ్‌లు ఉండటం వల్ల ఈ క్యాన్సర్లు మామూలుగా కలుగుతాయి. రేడియేషన్‌, ఇబివితో (ఎప్‌స్టీన్‌ బర్‌ వైరస్‌) లేదా ధూమపానం, డ్రగ్స్‌ మరియు మద్యపానం లాంటి తల్లిదండ్రుల అంశాల వల్ల ఈ క్యాన్సర్లు కలగడానికి గల ఇతర కారణాలు.

బాల్యంలో వచ్చే వివిధ క్యాన్సర్లు ఉన్నాయి, వీటిల్లో కొన్ని ఈ సెక్షన్‌లో చర్చించబడ్డాయి. లింఫోమాస్‌ మరియు ల్యూకేమియాలు వాటి సొంత విభాగాల్లో చర్చించబడ్డాయి. అవి ఏమిటంటే

పిల్లల్లో క్యాన్సర్లను అదుపుచేయుట

పిల్లల్లో క్యాన్సర్లను శిశు ఆంకాలజిస్టులు లేదా హెమటాలజిస్టు అదుపు చేస్తారు. ఎముక కకణితులు మరియు మెదడు కణితులు లాంటి కొన్ని క్యాన్సర్లకు వరుసగా ఆర్థోపెడిక్‌ సర్జన్‌లు మరియు న్యూరోసర్జన్‌లు చికిత్స చేస్తే మిగతా సర్జరీలను సాధారణంగా శిశు సర్జన్‌లు చేస్తారు. రేడియోథెరపిని ఆంకాలజిస్టులు ఇస్తారు. కొన్ని పెద్ద క్యాన్సర్‌ సెంటర్లకు ప్రత్యేక శిశు రేడియేషన్‌ ఆంకాలజిస్టులు ఉండొచ్చు.

బాల్యంలో వచ్చే క్యాన్సర్లకు చేసే చికిత్సలో ఆంకాలజిస్టులు, పిల్లల డాక్టర్లు, తల్లిదండ్రులు, పేథాలజిస్టులు, రేడియాలజిస్టులు, కౌన్సెలర్‌లు, ఎండోక్రైనాలజిస్టులు, నర్సులతో సహా వివిధ ప్రముఖులకు మరియు శాఖలకు ప్రమేయం ఉంటుంది. క్యాన్సర్లకు స్పందించే రేట్లు మరియు క్యాన్సరును నయం చేసుకునే అవకాశం పిల్లలకు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి శిశువు ఎదిగేలా మరియు సాధ్యమైనంత తక్కువ విషతుల్యత మరియు దుష్ప్రభావాలతో పనిచేసేలా చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

బాల్యంలో వచ్చే క్యాన్సర్లు అరుదుగా ఉంటాయి కాబట్టి, చికిత్స విధానాలు మరియు ప్రణాళిక వయోజనుల క్యాన్సర్లంత ప్రామాణీకృతంగా ఉండకపోవచ్చు. రోగులకు క్లినికల్‌ ట్రయల్‌ని చికిత్స ప్రణాళికలో భాగంగా అందించబడుతుంది ఎందుకంటే ఆ నిర్దిష్టమైన క్యాన్సరుకు ఎంపిక ఇంకా నిర్వచించబడకపోయివుండొచ్చు. చికిత్సలు, ప్రత్యేకించి కీమోథెరపి ఉధృతంగా ఉండొచ్చు మరియు ఈ క్యాన్సర్లను డీల్‌ చేసే క్యాన్సరు యూనిట్‌ నిశిత పర్యవేక్షణలో చికిత్స చేయబడుతుంది.

చికిత్స సమయంలో, ఇవ్వబడిన చికిత్స యొక్క దుష్ప్రభావాలను శిశువు అనుభవించే అవకాశం ఉంది. ఏ దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందో మరియు వాటి విషయంలో ఏం చేయాలనే విషయం తెలుసుకోవడం ఈ దుష్ప్రభావాలను అదుపుచేయడంలో కష్టాన్ని మరియు ఆతృతను తగ్గించుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏదైనా సందేహం ఉంటే డాక్టరును లేదా ఇతర హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్ని సంప్రదించడం ఈ స్థితిని అదుపుచేయడానికి సహాయపడుతుంది.

పౌష్టికాహారం చికిత్స ప్రక్రియలో చాలా ముఖ్యమైన భాగం. కార్బోహైడ్రేట్‌లు, ప్రొటీన్‌లు, కొవ్వు, విటమిన్‌లు, మినరల్స్‌ మరియు ఫ్లూయిడ్స్‌ని తగిన మొత్తంలో తీసుకోవడం వల్ల చికిత్సను తట్టుకునేందుకు సాధ్యమైన మేరకు శిశువు ఫిట్గా ఉంటారు. చికిత్స వల్ల శిశువు ఆకలి మరియు రుచి కోల్పోతుంది మరియు చికిత్సకు ముందు తిన్నంతగా తినలేకపోవచ్చు. ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినడం, శిశువుకు ఇష్టమైన భోజనం ఇవ్వడం, పౌష్ఠికాహార అనుబంధాలు ఇవ్వడం సహాయపడుతుంది.

శిశువులో క్యాన్సరును నిర్థారణను తెలుసుకోవడం తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు లేదా స్నేహితులకు చాలా కష్టమైన ప్రక్రియ అయివుండొచ్చు. క్యాన్సరు ఉన్నట్లుగా నిర్థారణ కాగానే కలిగే మొదటి ప్రతిచర్య షాక్‌ కలిగించేదిగా మరియు నమ్మలేనిదిగా ఉంటుంది. సన్నిహిత బంధువులు మరియు స్నేహితులతో మాట్లాడటం, కచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకునేందుకు డాక్టరుతో మళ్ళీ మరియు వివరంగా మాట్లాడటం లాంటివి చేయడం వల్ల ఇలాంటి పరిస్థితిని సులభంగా తట్టుకోవచ్చు. ఏం జరిగిందనే విషయం నమ్మడం కష్టంగా ఉన్న చోట నిరాకరించడం ప్రారంభ షాక్‌ తరువాత మామూలుగా ఉంటుంది. డాక్టరును అనేక ప్రశ్నలు అడటం లేదా రెండవ అభిప్రాయం తీసుకోవడం సర్వ సామాన్యం మరియు రోగనిర్థారణను నిర్థారించుకునేందుకు ఇలా చేయడం తప్పేమీ కాదు మరియు ఇది తల్లిదండ్రికి లేదా కుటుంబానికి స్వాంతన చేకూరుతుంది. తరువాత ఏం జరుగుతుంది, చికిత్స ఎలా ముందుకు సాగుతుంది, చికిత్సను శిశువు ఎలా తట్టుకోగలుగుతుంది, శిశువుకు నొప్పి మరియు అసౌకర్యం కలుగుతుందా అనే మామూలు ప్రశ్నలు ఆ సమయంలో ఆతృత మరియు భయం కలిగిస్తాయి. అనేక సార్లు, పెద్దల కంటే పిల్లలే కీమోథెరపి లాంటి క్యాన్సరు-నిరోధక చికిత్సలు సహించగలుగుతారు. శిశువు చికిత్స చేయించుకోవడాన్ని చూడటం మరియు వాళ్ళతో ఉండటం వల్ల కుటుంబానికి కొంత వరకు ఆతృత తగ్గుతుంది.

క్యాన్సరును నిర్థారించినట్లుగానే మరియు దీని ప్రక్రియ తల్లిదండ్రికి షాకింగ్‌ మరియు కష్టంగా ఉన్నట్లుగానే, ఇది శిశువుపై కూడా గణనీయంగా ప్రభావం చూపుతుంది. శిశువు వయస్సును బట్టి, అతను లేదా ఆమె పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు లేదా చేసుకోలేకపోవచ్చు. వాళ్ళు పరిస్థితిని మెరుగ్గా తట్టుకోవాలంటే, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు మరియు వాతావరణం సాధ్యమైన మేరకు మామూలుగా ఉండాలి. ఉదాహరణకు, ఏం జరగబోతోందో శిశువుకు వివరించవచ్చు మరియు పాశ్చాత్య దేశాల్లో ఇది మామూలుగా జరుగుతుంది. ఇలా చెప్పడం వల్ల శిశువు పరిస్థితిని మెరుగ్గా తట్టుకోగలుగుతారు. ఏం జరుగుతోందో తెలియడం వల్ల శిశువు చికిత్స ప్రక్రియకు మరింత మెరుగ్గా సహకరించగలుగుతారు. ఏం జరుగుతోందో తెలియకపోతే, వాస్తవంగా ఉన్న దానికంటే మరింత గంభీరంగా పరిస్థితిని ఊహించుకోవచ్చు. కాబట్టి ఏం జరుగుతోందో శిశువుకు చెప్పి విశ్వాసం పొందడం వల్ల శిశువు తన యొక్క ఆలోచనలను మరియు అనుభూతులను వ్యక్తపరచగలుగుతారు. శిశువు తన అనుభూతులను వ్యక్తపరిచేలా ప్రోత్సహించడం, స్నేహితులతో ఆడుకునేందుకు అనుమతించడం, స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించడం, వాళ్ళ స్థితి గురించి ప్రశ్నలు అడగటం ఈ స్థితికి సహాయపడతాయి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు శిశువుపై ఎక్కువ శ్రద్ధపెట్టడం మరియు శిశువును స్వయంగా ఏదైనా పని చేసేందుకు అనుమతించకపోవడం చికిత్స పూర్తయిన తరువాత శిశువు త్వరగా కోలుకునేలా చూడటంలో ప్రతిబంధకంగా మారవచ్చు. చికిత్స వల్ల పిల్లలు స్కూలుకు వెళ్ళలేరు కాబట్టి, ప్రత్యామ్నాయ విద్య మార్గాలు, ఇంటి వద్ద ట్యూషన్‌ సదుపాయం కల్పించడం వల్ల శిశువు నేర్చుకోగలుగుతారు మరియు చికిత్స పూర్తయిన తరువాత సులభంగా తిరిగి చదువుకోగలుగుతారు.

క్యాన్సరుకు చికిత్స చేయబడిన పిల్లలు అనేక సంవత్సరాల పాటు అనుసరణలో ఉండాలి, అంటే చికిత్స చేయించుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏవైనా ఉన్నాయా అనే విషయం తెలుసుకునేందుకు వాళ్ళు పెద్దవాళ్ళయ్యేంత వరకు లేదా ఎక్కువ కాలం పాటు అనుసరణ చేయడం జరుగుతుంది. ఈ దుష్ప్రభావాలు క్యాన్సరు రకం మరియు ఉపయోగించిన చికిత్సలపై ఆధారపడి ఉంటాయి. చేయబడే కొన్ని పనులు ఈ కింద ఇవ్వబడ్డాయి.

న్యూరోసైకలాజికల్‌ అభివృద్ధి

కొన్ని రకాల కీమోథెరపి, సర్జరీ మరియు రేడియోథెరపితో మెదడు కణితులకు చికిత్స చేయించుకున్న రోగులకు, మెదడు పనితనం ప్రభావితం కావచ్చు. ఇలాంటి చికిత్సను ఎంచుకునేటప్పుడు, నష్టాల కంటే కలిగే లాభాలను డాక్టరు మరియు తల్లిదండ్రులు బేరీజు వేసుకోవాలి. కీమోథెరపితో పాటు రేడియోథెరపి మోతాదును ఉపయోగించినప్పుడు మెదడు పనితనంపై ప్రభావం చూపొచ్చు. దుష్ప్రభావాల్లో జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత తగ్గడం, చదువులో రాణించడం తగ్గడం మరియు పిచ్యూటరి గ్రంథి పనితనం తగ్గడం ఉండొచ్చు, వీటిని మందులతో అదుపు చేయవచ్చు.

శిశువులో చికిత్స యొక్క ఇతర ప్రభావాలు

శిశువుకు క్యాన్సరు చికిత్స చేయడం వల్ల శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపవచ్చు. ఎత్తు మరియు బరువు పరంగా శిశువు ఎదుగుదలను చికిత్స పూర్తయిన తరువాత పర్యవేక్షించడం జరుగతుంది. వెన్నెముక లేదా మెదడు లాంటి ఏరియాలకు కీమోథెరపి లేదా రేడియోథెరపి ఇవ్వడం వల్ల రోగి ఎత్తు ప్రబావితం కావచ్చు. సన్నిహిత అనుసరణ శిశువు ఎదుగుదలను మదింపుచేయడానికి సహాయపడవచ్చు.

పొత్తికడుపు లేదా పెల్విస్‌ ఏరియాకు రేడియోథెరపిని ఇచ్చేటప్పుడు పురుషునిలో వృషణాలకు లేదా స్త్రీలో అండాశయాలకు రేడియేషన్‌ మోతాదును తగ్గించేందుకు జాగ్రత్త తీసుకోబడుతుంది. చికిత్స సమయంలో సాధ్యమైన మేరకు ఈ అవయవాలను వదిలేసేలా డాక్టరు జాగ్రత్త తీసుకుంటారు.
కీమోథెరపి మరియు రేడియోథెరపి ప్రభావాలు కళ్ళు, చెవులు మరియు పళ్ళు, మూత్రపిండాలు మరియు ఇతర అవయవాలను కొంత కాలం తరువాత మళ్ళీ పరీక్షించడం జరుగుతుంది.