Cancer Terminology

క్యాన్సరు పరిభాష

స్థితి, చికిత్స, చికిత్సకు స్పందన తదితర వాటిని వివరించేందుకు రోగులతో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులతో క్యాన్సర్‌ చికిత్స డాక్టర్లు మాట్లాడేటప్పుడు ఉపయోగించే వివిధ పదాలు లేదా మాటలు ఉన్నాయి. ఈ పరిభాషలు క్యాన్సరుకు సంబంధించిన వ్యాసాల్లో కూడా కనిపిస్తాయి. క్యాన్సరులో ఉపయోగించే మామూలు పదాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది, ఇది దీనిపై భావాన్ని మరియు ఇతర సైట్‌లను మరింతగా అర్థంచేసుకునేలా చేస్తాయి.

క్యూర్‌ (నయమవుట)

క్యాన్సరుకు చికిత్స చేసినప్పుడు మరియు తిరిగి రానప్పుడు క్యూర్‌ (నయమవ్వుట) అనే పదాన్ని ఉపయోగిస్తారు. ప్రారంభ చికిత్స పూర్తయిన తరువాత 5 సంవత్సరాల లోపు క్యాన్సరు తిరిగిరాకపోతే క్యాన్సరు నయమైనట్లుగా సాధారణంగా డాక్టర్లు సూచిస్తారు. అనేక సార్లు ఆపరేషన్‌లో లేదా రేడియోథెరపి లేదా కీమోధెరపి తరువాత క్యాన్సరు పూర్తిగా తొలగించబడుతుంది మరియు స్కాన్‌లలో వ్యాది కనిపించదు. అయితే, క్యాన్సరు నయమైందని చెప్పాలంటే, కనీసం 5 సంవత్సరాలు మేము వేచివుండవలసి ఉంటుంది. అత్యధిక క్యాన్సర్లు తిరిగొస్తే 5 సంవత్సరాల లోపు వస్తాయి కాబట్టి దానిని ఎంచుకోవడమైనది.

చికిత్సకు స్పందన

కీమోథెరపి, రేడియోథెరపి లేదా ఇతర పద్ధతులతో క్యాన్సరుకు చికిత్స చేస్తున్నప్పుడు, స్కాన్‌లు లేదా రక్త పరీక్షలు చేయడం ద్వారా చికిత్స స్పందన మదింపు చేయబడుతుంది. చికిత్స పనిచేస్తున్నదా లేదా అనే విషయం ఈ పరీక్షలు మాకు చెబుతాయి. స్కాన్‌ రిపోర్టుల్లో లేదా ఈ స్పందనలను వివరిస్తూ డాక్టర్లు చేసే స్టేట్‌మెంట్‌లలో వివిధ పదాలను ఉపయోగిస్తారు. వీటిని ఈ కింద ఇచ్చాము.
పూర్తి స్పందన– క్యాన్సర్లన్నీ పోయినప్పుడు లేదా చికిత్స తరువాత పోయినప్పుడు దీనిని చెబుతారు. చికిత్సకు ముందరి స్కాన్‌లతో పోల్చుకుంటే ఏదైనా క్యాన్సరును ఈ స్కాన్‌లు చూడలేవు.
పాక్షిక స్పందన– చికిత్స తరువాత క్యాన్సరు కొద్దిగా తగ్గినప్పటికీ, స్కాన్‌లు లేదా ఇతర పరీక్షల్లో కనిపించే క్యాన్సరు కొద్దిగా ఉండిపోతే పాక్షిక స్పందన అని చెబుతారు. క్యాన్సరు సాధారణంగా 30% కంటే ఎక్కువగా తగ్గితే దానిని పాక్షిక స్పందన అంటారు.
స్థిరమైన వ్యాధి– 20% కంటే ఎక్కువ పెరుగుదల లేదా 30% కంటే తగ్గుదల లేనప్పుడు మరియు వ్యాధి కొత్త ప్రాంతాలకు విస్తరించనప్పుడు సాధారణంగా స్థిరమైన వ్యాది అంటారు.
పురోగామిక వ్యాధి– చికిత్సలో లేదా అనుసరణ వ్యవధిలో క్యాన్సరు పెరిగినప్పుడు ఇలా అంటారు. క్రితం స్కాన్‌తో పోల్చుకుంటే పెరుగుదల 20% కంటే ఎక్కువ ఉంటే లేదా క్యాన్సరు కొత్త ప్రాంతాలకు విస్తరించివుంటే, దీనిని పురోగామిక వ్యాధి అని అంటారు.

రిలాప్స్‌ లేదా తిరగబెట్టడం

క్యాన్సరుకు గతంలో చికిత్స చేయబడివుంటే మరియు అది ఇప్పుడు తిరిగొస్తే ఇలా అంటారు.

చికిత్స కోర్సు (కీమోథెరపి, రేడియోథెరపి లేదా ఇతరవి)

కీమోథెరపి లేదా ఏదైనా ఇతర చికిత్స కోర్సు క్యాన్సరును నియంత్రించేందుకు ఇవ్వబడిన ఔషధాల ఎంపిక. ఈ కోర్సు కొంత కాలానికి ఇవ్వబడుతుంది. ఉదాహరణకు, రొమ్ము క్యాన్సరులో ఎఫ్‌ఇసి కీమోథెరపి కోర్సు 4.5 నెలల్లో ఇవ్వబడుతుంది. ఈ కోర్సు చక్రాల్లో పదేపదే ఇవ్వబడుతుంది.

చికిత్స చక్రాలు

కీమోథెరపిని ఇచ్చినప్పుడు, ఇది సాధారణంగా చక్రాల రూపాల్లో ఇవ్వబడుతుంది. వాడిన డ్రగ్స్‌ని బట్టి చక్రం 1, 2, 3, 4 లేదా 6 వారాలు కూడా ఉండొచ్చు. మామూలుగా ఇది వారంవారం లేదా వారానికి ఒకసారి మూడు వారాలు (21 రోజులు) ఉంటుంది. కీమోథెరపిలో, ఒక చికిత్స కోర్సులో అనేక చక్రాలు ఉంటాయి. రొమ్ము క్యాన్సరులో, ఎఫ్‌ఇసి కీమోథెరపి 6 చక్రాల్లో ఇవ్వబడుతుంది, ప్రతి చక్రం 3 వారాలు ఉండి, కోర్సు 4.5 నెలలు ఉండేలా చేస్తుంది.

క్యూరేటివ్‌ చికిత్స

చికిత్సతో క్యాన్సరు నుంచి రోగిని నయం చేసే లక్ష్యంతో చికిత్సను ఎంచుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. స్టేజ్‌ 1, 2, కొంత స్టేజ్‌ 3 క్యాన్సర్లు మరియు కొద్ది స్టేజ్‌ 4 క్యాన్సర్‌లు గల అత్యధిక మంది రోగులకు ఇది ఎంపిక కావచ్చు.

పల్లియేటివ్‌ చికిత్స

లభించే ఎంపికలతో క్యాన్సరును నయం చేయలేనప్పుడు మరియు లక్షణాలను నియంత్రించేందుకు చికిత్సను ఉపయోగించినప్పుడు, క్యాన్సరును నియంత్రించేటప్పుడు మరియు ఆయుష్షును పెంచినప్పుడు పల్లియేటివ్‌ చికిత్స అనేది చికిత్స ఎంపిక.

నియో-అడ్జువంట్‌ చికిత్స

కచ్చితమైన చికిత్సకు ముందు చేసే చికిత్స రకం ఇది. కచ్చితమైన చికిత్స అనేది క్యాన్సరును నియంత్రించడం లక్ష్యంగా గల ప్రధాన చికిత్స. నయంచేసే అవకాశాలను పెంచేందుకు దానికి ముందు నియో-అడ్జువంట్‌ చికిత్స ఇవ్వబడుతుంది.

అడ్జువంట్‌ చికిత్స

అడ్జువంట్‌ చికిత్స అనేది కచ్చితమైన చికిత్స తరువాత ఇవ్వబడే చికిత్స. కచ్చితమైన చికిత్స అనేది క్యాన్సరును నియంత్రించడం లక్ష్యంగా గల ప్రధాన చికిత్స. కచ్చితమైన చికిత్స వల్ల ప్రధానంగా సాధించడం క్యూర్‌ అవకాశాన్ని పెంచడం కచ్చితమైన చికిత్స తరువాత అడ్జువంట్‌ చికిత్స లక్ష్యం. నియో- అడ్జువంట్‌ లేదా అడ్జువంట్‌ చికిత్సలు కీమోథెరపి, రేడియోథెరపి, బయోలాజికల్‌ థెరపి లేదా ఇతర ఎంపికలు అయివుండొచ్చు.

బయాప్సీ

బయాప్సీ అనేది ఒక పరీక్ష. దీనిలో కణజాలం ముక్క తొలగించబడుతుంది మరియు రోగనిర్థారణను నిరూపించేందుకు సూక్ష్మదర్శినిలో చూడటం జరుగుతుంది. దీనిని ఎలా చేయవచ్చదానికి భిన్న మార్గాలు ఉన్నాయి.

ఫైన్‌ నీడిల్‌ ఆస్పిరేషన్‌ సైటాలజీ (ఎఫ్‌ఎన్‌ఎసి)

ఇది ఒక పరీక్ష, దీనిలో చాలా చిన్న సూది పొత్తికడుపు ఏరియాలోకి మరియు వ్యక్తిగత కణాల్లోకి గుచ్చబడుతుంది లేదా ఫ్లూయిడ్‌ తొలగించబడుతుంది. రోగనిర్థారణను ధృవీకరించేందుకు క్యాన్సరు కణాలు కనిపించినప్పుడు లేదా తీసుకున్న శాంపిల్‌పై ఆధారపడి రోగనిర్థారణ చేయలేనప్పుడు ఎల్లప్పుడూ మరింతగా పరీక్ష అవసరమవుతుంది.

కోర్‌ బయాప్సీ

ఇది ఒక పరీక్ష, దీనిలో పెద్ద సూది కణజాలం యొక్క పెద్ద ముక్కను (కోర్‌) తీసేందుకు ఉపయోగించబడుతుంది. కోర్‌ బయాప్సీ అనేది ఎఫ్‌ఎన్‌ఎసి కంటే మరింత కచ్చితత్వంతో రోగనిర్థారణ చేసే పద్ధతి. ఎక్స్‌రే (స్టీరియోటాక్టిక్‌), అల్ట్రాసౌండ్‌, సిటి లేదా ఎంఆర్‌ఐ మార్గదర్శనంలో కోర్‌లను తీయవచ్చు. ఇది అవుట్‌-పేషెంట్‌ ప్రక్రియ మరియు స్థానిక మత్తుమందు ఇచ్చి చేయబడుతుంది. ఇది క్యాన్సరు నిర్థారణలో ఉపయోగించే అత్యంత సామాన్య రకం పరీక్ష.

సర్జికల్‌ బయాప్సీలు

క్యాన్సరులో గంటు పెట్టడమే సర్జికల్‌ బయీప్సీలు. ఇవి ఎక్సిషనల్‌ లేదా ఇన్సిషనల్‌ బయాప్సీలు అయివుండొచ్చు. దీనిని స్థానిక లేదా సాధారణ మత్తుమందు కింద చేయవచ్చు.

ఎక్స్‌సిషనల్‌ బయాప్సీ

దీనిలో గడ్డ లేదా కణితి పూర్తిగా తొలగించబడుతుంది. గడ్డ చిన్నదిగా ఉంటే మరియు క్యాన్సరు అనిపించకపోతే, వైర్‌ లేదా సూది మార్గదర్శనతో ఎక్స్‌సిషన్‌ చేయబడవచ్చు. అల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే లేదా ఎంఆర్‌ఐ మార్గదర్శనంలో ప్రక్రియకు ముందు ఇవి పెట్టబడతాయి.

ఇన్సిషనల్‌ బయాప్సీ

క్యాన్సరులో గంటు (కోయడం) చేసినప్పుడు ఇది చేయబడుతుంది మరియు శాంపిల్‌ తీసుకోబడతుంది.
బయాప్సీ రిపోర్టు కొద్ది రోజుల్లోనే ఇవ్వబడుతుంది, తొలగించిన శాంపిల్‌లో క్యాన్సరు ఉందా లేదా అనే విషయం ఇది చెబుతుంది.

హిస్టోపేథాలజీ రిపోర్టు

ఆపరేషన్‌లో క్యాన్సరును తొలగించినప్పుడు లేదా పేథాలజిస్టు దీనిని సూక్ష్మదర్శినిలో పరీక్షించినప్పుడు హిస్టోపేథాలజీ రిపోర్టు లేదా పేథాలజీ రిపోర్టు తయారుచేస్తారు. ఇది బయాప్సీ రిపోర్టుకు భిన్నంగా ఉంటుంది, దీనిలో క్యాన్సరు నుంచి కొద్ది ప్రాంతం మాత్రమే శాంపిల్‌ చేయబడుతుంది. హిస్టోపేథాలజీ రిపోర్టులో, క్యాన్సరు రకం, మార్జిన్స్‌, క్యాన్సరు గ్రేడ్‌, అవసరమైతే ఐహెచ్‌సి రకం గురించి మరియు ఆపరేషన్‌ పూర్తయినట్లుగా పేథాలజిస్టు పేర్కొంటారు.

సర్జరీలో మార్జిన్‌లు

క్యాన్సరు సర్జరీ తరువాత, ఆపరేషన్‌ యొక్క మార్జిన్‌ స్థితి ఎల్లప్పుడూ హిస్టోపేథాలజీ రిపోర్టులో పేర్కొంటారు. క్యాన్సరు పూర్తిగా తీసేయబడిందనే విషయం నిర్థారించేందుకు మామూలు కణజాలం రిమ్ము చుట్టూ ఉన్న క్యాన్సరు ఎల్లప్పుడూ తొలగించబడుతుంది. మార్జిన్‌లు క్యాన్సరు లేకుండా ఉన్నాయా, లేదా మార్జిన్‌లు చాలా సన్నిహితంగా ఉన్నాయా లేదా క్యాన్సరుతో ప్రమేయం ఉన్నాయా అనే విషయం రిపోర్టు పేర్కొంటుంది. మార్జిన్‌లు చాలా సన్నిహితంగా ఉంటే లేదా ప్రమేయం ఉంటే, సర్జరీ పూర్తవుతుందని గ్యారంటీ ఇవ్వబడదు మరియు రేడియోథెరపి లాంటి ఇతర ఎంపికలను పరిగణించవలసి ఉంటుంది. మార్జిన్‌లు సన్నిహితంగా లేదా ప్రమేయం ఉండటం అంటే సర్జరీ సరిగ్గా జరగలేదని అర్థం. క్యాన్సరు లొకేషన్‌ మరియు పరిధి వల్ల దీనిని నివారించలేకపోవచ్చు.

ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ (ఐహెచ్‌సి)

బయాప్సీ రిపోర్టును ఇచ్చిన తరువాత మరింతగా పరీక్ష చేసినప్పుడు ఇది చేయబడుతుంది. బయాప్సీ రిపోర్టు కనుక క్యాన్సరును చూపిస్తే, ఏ రకమైన క్యాన్సరు మరియు ఉపరకం క్యాన్సరును ఐహెచ్‌సి పరీక్ష ధృవీకరించగలుగుతుంది. అత్యంత సముచితమైన చికిత్సను నిర్ణయించడానికి కచ్చితమైన టైపింగ్‌ మరియు ఉపటైపింగ్‌ క్యాన్సరుగా ఐహెచ్‌సి పరీక్ష చాలా ముఖ్యమైనది.

రోగి పనితీరు స్థితి

రోగి ఫిట్‌నెస్‌ అనేది క్యాన్సరుకు చికిత్సను నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకోబడే అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. రోగి ఎంత ఫిట్‌గా ఉంటే, మరిన్ని చికిత్స ఎంపికలు పరిగణించబడతాయి. రోగి యొక్క పనితీరు స్థితిని అంచనావేయడం ద్వారా ఈ ఫిట్‌నెస్‌ మదింపు చేయబడుతుంది. డబ్ల్యుహెచ్‌ఒ, ఇసిఒజి మరియు కర్నోఫ్‌స్కై లాంటి విభినన స్కోరింగ్‌ వ్యవస్థలు ఉన్నాయి, ఇవి ఈ ప్రక్రియలో సహాయపడతాయి.

క్యాన్సర్‌ గ్రేడ్‌

క్యాన్సరును గ్రేడ్‌ చేయడం క్యాన్సరు అగ్రెసివ్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. బయాప్సీ లేదా సర్జరీ తరువాత మైక్రోస్కోప్‌లో క్యాన్సరును చూడటం ద్వారా క్యాన్సరు గ్రేడ్‌ని పేథాలజిస్టు అంచనావేస్తారు. కొన్ని క్యాన్సర్లలో గ్రేడింగ్‌ 1 నుంచి 3 లేదా 4 వరకు ఉండొచ్చు. గ్రేడ్‌ 1 అంటే తక్కువ అగ్రెసివ్‌ మరియు గ్రేడ్‌ 4 అంటే అత్యంత అగ్రెసివ్‌ అని అర్థం. ఎక్కువ అగ్రెసివ్‌గా ఉండే క్యాన్సర్లు సాధారణంగా వేగంగా ఎదుగుతుంటాయి. గ్రేడ్‌ 1ని తక్కువ గ్రేడ్‌ అని, గ్రేడ్‌ 2ని ఇంటర్మీడియట్‌ గ్రేడ్‌ అని, మరియు గ్రేడ్‌ 3ని హై గ్రేడ్‌ అని కూడా అంటారు.

క్యాన్సరు దశ

క్యాన్సరు స్టేజ్‌ అనేది శరీరంలో క్యాన్సరు సైజు మరియు లొకేషన్‌ని వివరించేందుకు ఉపయోగించే పదం. క్యాన్సరు దశను తెలుసుకోవడం అత్యంత సముచితమైన చికిత్సను నిర్ణయించడానికి డాక్టర్లకు సహాయపడుతుంది. అత్యధిక క్యాన్సర్లకు టిఎన్‌ఎం స్టేజింగ్‌ సిస్టమ్‌ లేదా నంబరు సిస్టమ్‌పై ఆధారపడి స్టేజింగ్‌ ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఒక సిస్టమ్‌తో స్టేజింగ్‌ ఇవ్వడం మూలస్థానంలో కణితి విస్త్రుతి, లింఫ్‌ నోడ్స్‌కి క్యాన్సరు వ్యాప్తి, మరియు క్యాన్సరు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడంపై ఆధారపడి ఉంటుంది.

మెటాస్టాసెస్‌ లేదా మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌

మూలస్థానం నుంచి శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సరు వ్యాపించినప్పుడు ఉపయోగించే పదం ఇది. మెటాస్టాసెస్‌ కనిపించినప్పుడు ఇది సాధారణంగా స్టేజ్‌ 4 క్యాన్సరు. శరీరంలోని దూర ప్రాంతాల్లో క్యాన్సరు ఉన్నప్పుడు, మెటాస్టాటిక్‌ డిపాజిట్‌లు అంటారు మరియు కాలేయం, ఎముకలు, ఊపిరితిత్తులు, మెదడు తదితర వాటితో సహా శరీరంలో ఎక్కడైనా ఇవి ఉండొచ్చు. మెటాస్టాటిక్‌ వ్యాధి ఉన్నప్పుడు, క్యాన్సరుకు ఇప్పటికీ చికిత్స చేయవచ్చు మరియు నియంత్రించవచ్చు, కొన్నిసార్లు క్యాన్సరులోని ఏరియాలన్నీ పూర్తిగా తొలగించబడతాయి. అయితే, నయమయ్యే అవకాశం కొద్దిగా ఉంటుంది ఎందుకంటే క్యాన్సరు తిరిగికలిగే అపాయాలు ఎక్కువగా ఉంటుంది, చాలా కొద్దిమంది రోగుల్లో మరియు కొన్ని రకాల క్యాన్సరులో మినహా.

పురోగతి లేకుండా జీవించడం

పురోగతి లేకుండా జీవించడం అనేది చికిత్స ముగింపుకు మరియు క్యాన్సరు తిరిగొచ్చిన సమయానికి మధ్య గల కాల వ్యవధి. చికిత్స ఎంపికను పరిగణించేటప్పుడు, పురోగతి లేకుండా జీవించడం ఎంత ఎక్కువ కాలం ఉంటే, అది అంత మెరుగ్గా ఉంటుంది.

మీడియన్‌ సర్వైవల్‌

ఇది చికిత్స యొక్క ప్రయోజనాలను నిర్ణయించుకునేటప్పుడు ఉపయోగించే మరొక గణాంకం ఇది. మీడియన్‌ అనేది కేంద్ర బిందువు. కాబట్టి, కొంత చికిత్సతో 36 నెలల పాటు జీవించడం అంటే ఆ చికిత్సతో చికిత్స చేయబడిన 50% మంది రోగులు 36 నెలల కంటే ఎక్కువ కాలం జీవిస్తారని మరియు వాళ్ళలో 50% మంది 36 నెలల కంటే తక్కువగా జీవిస్తారని అర్థం.

సమగ్రంగా జీవించడం

సమగ్రంగా బతకడం అంటే క్యాన్సరు నిర్ధారణ లేదా ప్రారంభం నుంచి జీవించివున్న కాలమని అర్థం.

న్యూట్రోపెనియా

న్యూట్రోపెనియా అంటే రక్తంలో న్యూట్రోఫిల్స్‌ అనే ఒక రకం తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువగా ఉండటం. కీమోథెరపి మరియు కొన్ని లక్షిత థెరపీలు దుష్ప్రభావంగా న్యూట్రోపెనియా కలిగిస్తాయి. ఇన్ఫెక్షన్‌ల నుంచి తెల్ల రక్త కణాలు రక్షిస్తాయి కాబట్టి, న్యూట్రోపెనియా గల రోగులకు ఇన్ఫెక్షన్‌ని పొందే అవకాశం పెరిగింది.

థ్రొంబోసైటోపెనియా

థ్రొంబోసైటోపెనియా అంటే రక్తంలో ప్లెట్‌లెట్‌ల సంఖ్య తక్కువగా ఉండటం. ప్లెట్‌లెట్‌లు అనేవి రక్తంలో ఉండే కణాలు, ఇవి రక్తస్రావాన్ని నిరోధిస్తాయి మరియు ఆపుతాయి. కీమోథెరపి లేదా కొన్ని లక్షిత థెరపీలతో చికిత్స చేసిన ఫలితంగా థ్రొంబోసైటోపెనియా కలగవచ్చు. ప్లెట్‌లెట్‌ కౌంట్‌లు తక్కువగా ఉండగా రక్తస్రావం కలిగే ప్రమాదం పెరుగుతుంది.

న్యూట్రోపెనిక్‌ సెప్సిస్‌

న్యూట్రోపెనియా ఫలితంగా రోటికి ఇన్ఫెక్షన్‌ కలిగే స్థితి ఇది. ఇది రోగికి ఉష్ణోగ్రత కలిగేలా చేస్తుంది మరియు రోగికి త్వరగా జబ్బు కలిగేలా చేయవచ్చు ఎందుకంటే ఇన్ఫెక్షన్‌పై పోరాడగల సామర్థ్యం రోగికి ఉండదు. న్యూట్రోపెనిక్‌ సెప్సిస్‌ని అనుమానిస్తే లేదా రోగికి ఉష్ణోగ్రత ఉంటే లేదా ఇటీవల కీమోథెరపి లేదా లక్షిత లేదా ఇమ్యునోథెరపి తరువాత ఒంట్లో బాగాలేనట్లుగా అనిపిస్తే, వాళ్ళు తమ ఆంకాలజిస్టును అత్యవసరంగా సంప్రదించాలి.

కణితి

కణితి అనేది శరీరంలో అసాధారణ వృద్ధి. కణితి నిరపాయకర కణితి లేదా ప్రాణాంతక కణితి అయివుండొచ్చు. నిరపాయకర కణితి క్యాన్సరు కాకపోతే, ప్రాణాంతక కణితి క్యాన్సరు.

నిరపాయకర కణితి

నిరపాయకర కణితి అనేది అసాధారణ, కానీ క్యాన్సరు కాని వృద్ధి. నిరపాయకర కణితి మరియు క్యాన్సరుకు మధ్య ప్రధాన తేడా ఏమిటంటే నిరపాయకర కణితికి శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించగల సామర్థ్యం లేనిది. క్యాన్సరు విస్తరిస్తుంది. అత్యధిక నిరపాయకర కణుతులు నెమ్మదిగా పెరుగుతుంటాయి.

కోలోస్టమి

కోలోస్టోమి అనేది పెద్దపేగును బయటకు కనెక్ట్‌ చేసే పొత్తికడుపులో ఓపెనింగ్‌. పెద్ద పేగులో కొంత భాగాన్ని తొలగించవలసిన లేదా పెద్ద పేగులో బ్లాకేజ్‌ ఉన్న రోగుల్లో కోలోస్టోమి చేయబడుతుంది. మలం లేదా మోషన్స్‌ బయటకు వెళ్ళేలా కోలోస్టోమి చూస్తుంది. మలం సేకరణకు కోలోస్టోమి చుట్టూ బ్యాగ్‌ పెట్టబడుతుంది.

ఇలియోస్టోమి

ఇలియోస్టోమి అనేది ఇలియమ్‌ అనే చిన్న పేగును బయటకు కనెక్ట్‌ చేసే పొత్తికడుపులో చేసిన ఓపెనింగ్‌. పెద్ద పేగు మొత్తం తొలగించబడిన లేదా క్యాన్సరు వల్ల అవరోధించబడిన రోగుల్లో ఇది చేయబడుతుంది. మలం లేదా మోషన్స్‌ బయటకు వెళ్ళడానికి ఇలియోస్టోమి సహాయపడుతుంది.

యూరోస్టోమి

యూరోస్టోమి అనేది శరీరం మూత్రం బయటకు పోవడానికి సహాయపడేందుకు పొత్తికడుపులో చేసిన ఓపెనింగ్‌. క్యాన్సరు వల్ల మూత్ర బ్లాడర్‌ని తొలగించవలసిన లేదా అవరోధించబడిన పరిస్థితుల్లో ఇది చేయబడుతుంది. యూరోస్టోమిని యురేటర్‌లకు ఒక వైపున మరియు బయటి దానిని మరొక దానికి కనెక్ట్‌ చేయబడుతుంది.

నెఫ్రోస్టోమి

నెఫ్రోస్టోమి అనేది యురేటర్‌లో అవరోధం ఉన్నప్పుడు మూత్ర విసర్జనకు సహాయపడేందుకు పొత్తికడుపు వెనుక పెట్టబడే పలచని ట్యూబు. ఒకటి లేదా రెండు యురేటర్‌లను అవరోధించవలసిన అవసరం ఉందా అనే విషయంపై ఆధారపడి నెఫ్రోస్టోమీస్‌ని దూర్చవచ్చు.

క్యాన్సరు లేదా ప్రాణాంతక కణితి లేదా ప్రాణాంతక క్యాన్సరు

క్యాన్సరు అనేది అసాధారణంగా ఉన్న వృద్ధి మరియు వృద్ధి చెందడానికి మరియు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించగల సామర్థ్యం ఉంది. క్యాన్సరును మాలిగ్నంట్‌ వృద్ధి లేదా కణితి లేదా మాలిగ్నన్సీ అని కూడా అనవచ్చు.

కీమోథెరపి

కీమోథెరపి అంటే క్యాన్సరు కణాలను చంపే లక్ష్యంతో ఔషధాలను ఉపయోగించడమని అర్థం. కీమోథెరపి టాబ్లెట్లు, ఇంజెక్షన్‌లు లేదా డ్రిప్స్‌ రూపంలో ఉండొచ్చు. కీమోథెరపిగా అనేక ఔషధాలను ఉపయోగిస్తారు మరియు వీటిని ఒక్కటిగా లేదా సమ్మేళనంగా ఉపయోగించవచ్చు.

లక్షిత థెరపి

ఇవి క్యాన్సరు చికిత్సలో ఉపయోగించే ఔషధాలు. లక్షిత థెరపి ఔషధాలు క్యాన్సరులోని నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాయి కాబట్టి కీమోథెరపి కంటే కొద్ది దుష్ప్రభావాలు ఉండొచ్చు. లక్షిత థెరపీలు టాబ్లెట్‌లు, ఇంజెక్షన్‌లు లేదా డ్రిప్స్‌ రూపంలో ఉండొచ్చు.

ఇమ్యునోథెరపి

ఇమ్యునోథెరపి అంటే క్యాన్సరును తగ్గించే విధంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మార్చే ఔషధాలను ఉపయోగించుట. క్యాన్సరు కణాలను చంపడానికి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ఈ ఔషధాలు క్రియాశీలం చేస్తాయి.

లింఫ్‌ నోడ్స్‌

లింఫ్‌ నోడ్స్‌ అనేవి శరీరం అంతటా ఉండే చిన్న గ్రంథులు. ఇరుకు గొట్టాలుగా ఉండే లింఫటిక్ చానల్స్‌తో ఇవి కనెక్ట్‌ అయివుంటాయి. శరీరంలోని ఒక ప్రాంతంలో క్యాన్సరు కలిగినప్పుడు, ఇది చుట్టూ ఉన్న లింఫ్‌ నోడ్స్‌కి మరియు శరీరంలోని ఇతర ప్రాంతాలకు ఈ లింఫ్‌ చానల్స్‌ ద్వారా విస్తరించవచ్చు.

రేడియోథెరపి లేదా రేడియేషన్‌ థెరపి

క్యాన్సర్లకు చికిత్స చేసేందుకు అధిక శక్తి గల ఎక్స్‌రేలను ఉపయోగించే ఒక రకం క్యాన్సరు చికిత్స ఇది. లీనియర్‌ యాక్సెలరేటర్‌ లేదా రేడియోథెరపి యంత్రం అనే యంత్రంతో ఈ ఎక్స్‌రేలు ఉత్పాదించబడతాయి. అధిక శక్తి ఎక్స్‌రేలు లేదా ఫోటాన్స్‌ అనేవి క్యాన్సరుకు చికిత్స చేసేందుకు చాలా వరకు ఉపయోగించబడే అత్యంత సామాన్య రూపం రేడియోథెరపి. ఇతర రూపాల రేడియోథెరపిలో గమ్మా కిరణాలు, బీటా కిరణాలు మరియు ప్రోటాన్‌లు ఉంటాయి.

బ్రాకిథెరపి

బ్రాకీథెరపి అనేది శరీరంలోకి పెట్టబడిన రేడియోయాక్టివ్‌ సోర్స్‌ సహాయంతో ఇవ్వబడే రేడియోథెరపి రూపం. బ్రాకీథెరపి ఉపయోగించబడే క్యాన్సర్లలో సెర్విక్స్‌, గర్భాశయం, ప్రొస్టేట్‌ మరియు తల మరియు మెడ తదితర క్యాన్సర్లు ఉంటాయి.

ఎక్స్‌రేలు

లక్షణాలను మదింపు చేసేందుకు, క్యాన్సరు ఉందేమో చూసేందుకు మరియు చికిత్సకు స్పందనను మదింపు చేసేందుకు ఛాతీ, రొమ్ము (మమ్మోగ్రామ్‌), పొత్తికడుపు, ఎముకలకు ఎక్స్‌రేలు తీస్తారు. అయితే, ఎక్స్‌రేలు సాధారణంగా స్కాన్‌లంత బాగా ఉండవు మరియు ఎక్స్‌రేల్లో ఏదైనా అనుమానంగా ఉంటే సాధారణంగా స్కాన్‌ తీయడానికి దారితీస్తుంది.

అల్ట్రాసౌండ్‌ స్కాన్

ఇమేజ్‌లను తయారుచేసేందుకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లు ధ్వని తరంగాలను ఉపయోగిస్తాయి మరియు రొమ్ము మరియు ఇతర క్యాన్సర్లను నిర్థారణ చేసేందుకు మామూలుగా ఉపయోగించబడతాయి. ఈ స్కాన్‌లు చౌకయినవి మరియు హాని లేనివి, కానీ ఇతర స్కాన్‌ల మాదిరిగా కొన్ని క్యాన్సర్లను కనిపెట్టడానికి అంత బాగా ఉండకపోవచ్చు.

సిటి స్కాన్

సిటి స్కాన్‌ అనేది స్కాన్‌ తీయబడుతున్న శరీర బాగంలోని త్రీ-డైమెన్షనల్‌ ఇమేజ్‌ని ఇవ్వడానికి ఎక్స్‌రేలను ఉపయోగించే స్కాన్‌. క్యాన్సరును గుర్తించడంలో మరియు స్టేజింగ్‌లో ఎక్స్‌రే కంటే ఇది మరింత కచ్చితత్వంతో ఉంటుంది. కాంట్రాస్ట్‌ ఎన్‌హేన్స్‌డ్‌ స్కాన్‌ అనేది స్కాన్‌కి ముందు సిరలోకి ఇంజెక్షన్‌ ఇవ్వబడేది మరియు ఇది మెరుగైన ఇమేజ్‌లు ఇస్తుంది. పొత్తికడుపుకు స్కాన్‌ తీసేటప్పుడు తాగడానికి రోగికి ఓరల్‌ కాంట్రాస్ట్‌ ఇవ్వబడుతుంది. సిటి స్కాన్‌ని తీయడానికి కొద్ది నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కొన్ని బయాప్సీలు తీసేటప్పుడు డాక్టరుకు గైడ్‌ చేయడానికి కూడా సిటి స్కాన్‌ తీస్తారు.

ఎంఆర్‌ఐ స్కాన్

ఇమేజ్‌లను ఉత్పత్తి చేసేందుకు ఎంఆర్‌ఐ స్కాన్‌ అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తుంది మరియు క్యాన్సరును నిర్థారణ మరియు స్టేజింగ్‌ చేసేందుకు చాలా తరచుగా ఉపయోగించబడుతుది. కొన్ని రకాల క్యాన్సరుకు ఈ స్కాన్‌ని తీస్తారు. మెదడు, వెన్నెముక మరియు పెల్విస్‌ (పొత్తికడుపు దిగువ భాగం) లాంటి తావుల్లో సిటి కంటే మెరుగైన ఇమేజ్‌లను ఎంఆర్‌ఐ ఉత్పత్తి చేస్తుంది. కొంతమంది రోగులకు ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయించుకోవడం కష్టంగా అనిపించవచ్చు ఎందుకంటే స్కాన్‌ తీసేటప్పుడు వాళ్ళకు మూసివేసిన గదిలో ఉన్నామనే భయం కలుగుతుంది. ఎంఆర్‌ఐ స్కాన్‌లు తీయడానికి పట్టే సమయం 20 నిమిషాల నుంచి ఒక గంట వరకు ఉండొచ్చు. మెరుగైన ఇమేజ్‌లు పొందడానికి కాంట్రాస్టు ఏజెంట్‌ ఎక్కించబడుతుంది. స్కాన్‌ వరుసక్రమంలో తీయబడుతుంది మరియు క్యాన్సరు రోగుల్లో ఒక స్కాన్‌లో సాధారణంగా అనేక వరుసక్రమాలు తీయబడతాయి.

పిఒటి- సిటి స్కాన్‌

స్కాన్‌కి ఫంక్షనల్‌ ఎలిమెంట్‌ కలిగివుండటం ద్వారా ఈ రకమైన స్కాన్‌ ప్రామాణిక సిటి స్కాన్‌ కంటే బిన్నంగా ఉంటుంది. క్యాన్సర్లు, ఇన్ఫెక్షన్‌, శోథ తదితర లాంటి కణాలు వేగంగా విభజించబడే శరీరంలోని తావులను స్కాన్‌ యొక్క పిఇటి కాంపొనెంట్‌ కనిపెట్టగలుగుతుంది. కొన్ని క్యాన్సర్ల స్టేజింగ్‌లో సిటి స్కాన్‌ కంటే పిఇటి-సిటి స్కాన్‌ మెరుగ్గా ఉంటుంది. శరీరంలో మొదటగా రేడియోలేబుల్‌డ్‌ పదార్థాన్ని ఎక్కించడం ద్వారా స్కాన్‌ యొక్క పిఇటి భాగం తీయబడుతుంది మరియు తరువాత స్కాన్‌ తీయబడుతుంది. కణాలను విభజించడం ద్వారా ఈ పదార్థం తీసుకోబడుతుంది మరియు స్కాన్‌పై కనిపిస్తుంది.

స్టెమ్‌ సెల్స్

స్టెమ్‌ సెల్స్‌ అనేవి ఎర్ర రక్త, తెల్ల రక్త కణ లేదా ప్లెట్‌లెట్‌లు లాంటి ఏదో ఒక రకం రక్త కణాల్లోకి అభివృద్ధి చెందగల సామర్థ్యం గల ఒక రకమైన రక్త కణాలు. ఈ స్టెమ్‌ సెల్స్‌ రక్త ప్రవాహంలో మరియు ఎముక మూలుగలో ఉంటాయి మరియు రోగి అధిక మోతాదు కీమోథెరపి పొందడానికి ముందు రోగి నుంచి మొదట్లో సేకరించబడతాయి.

స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్

అధిక మోతాదు కీమోథెరపి ఎముకలో కణాలన్నిటినీ చంపిన తరువాత, స్టెమ్‌ సెల్స్‌ శరీరంలోకి ట్రాన్స్‌ప్లాంట్‌ లేదా ఇన్‌ఫ్యూజ్‌ చేయబడతాయి.
రోగి నుంచి స్టెమ్‌ సెల్స్‌ని సేకరించే మరియు అధిక మోతాదు కీమోథెరపి తరువాత అదే రోగికి వాటిని తిరిగి ఎక్కించే ప్రక్రియను ఆటోలోగస్‌ స్టెమ్‌ సెల్ ట్రాన్స్‌ప్లాంట్‌ అంటారు.
స్టెమ్‌ సెల్స్‌ కనుక మరొక వ్యక్తి (దాత) నుంచి అయితే, దానిని అల్లోజెనిక్‌ స్టెమ్‌ సెల్ ట్రాన్స్‌ప్లాంట్‌ అని అంటారు. దాత సాధారణంగా సోదరుడు లేదా సోదరి లాంటి బంధువులు, లేదా బంధుత్వం లేని సరిపోలిన దాత అయివుండొచ్చు. మూలుగలో క్యాన్సరు ఉన్నప్పుడు లేదా ఇంతకుముందు ఆటోలోగస్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయబడినప్పటికీ, వ్యాధి తిరగబెట్టిన పరిస్థితుల్లో దాతను ఉపయోగించుకోవచ్చు.

ఎముక మూలుగ

ఎముక మూలుగ అనేది ఎముకల లోపల ఉండే స్పాంజీ మెటీరియల్‌. దీనిలో స్టెమ్‌ సెల్స్‌ మరియు రక్త ప్రవాహంలోకి వెళ్ళే ఇతర పెరిగే రక్త కణాలు ఉంటాయి.

ఎముక మూలుగ ట్రాన్స్‌ప్లాంట్

అదే వ్యక్తి లేదా మరొక వ్యక్తి నుంచి ఎముక మూలుగను రోగిలోకి ట్రాన్స్‌ప్లాంట్‌ చేసే (ఎక్కించే లేదా పెట్టివుంచే) ప్రక్రియ.

ఆటోలోగస్‌ ఎముక మూలుగ ట్రాన్స్‌ప్లాంట్

రోగి నుంచి ఎముక మూలుగ తొలగించబడే మరియు అధిక మోతాదు కీమోథెరపి కోర్సు తరువాత తిరిగి ఎక్కించబడే ప్రక్రియ ఇది. దీనిని ఆటోలోగస్‌ లేదా ఆటో ట్రాన్స్‌ప్లాంట్‌ అని అంటారు. ఎముక మూలుగ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం, అధిక మోతాదు కీమోథెరపి ఇవ్వడానికి ముందు మూలుగను సేకరించవలసిన అవసరం ఉంది. మూలుగను సేకరించే ప్రక్రియ సాధారణ మత్తుమందు కింద సాధారణంగా ఆపరేషన్‌ థియేటర్లో చేయబడుతుంది.

అల్లోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంట్

మరొక వ్యక్తి నుంచి సరిపోలిన ఎముక మూలుగను అధిక మోతాదు కీమోథెరపి తరువాత రోగికి ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడమే అల్లోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంట్‌.