Chronic Lymphocytic Leukaemia (CLL)

క్రానిక్ లింఫోసైటిక్ ల్యుకేమియా (సిఎల్ఎల్)

ల్యుకేమియా అనేది తెల్ల రక్త కణాల క్యాన్సర్. భిన్న రకాల ల్యుకేమియాలు ఉంటాయి మరియు ల్యుకేమియాలోకి రూపాంతరం చెందే ఒక రకం తెల్ల రక్త కణాలపై మరియు క్యాన్సరు త్వరగా (ఎక్యూట్) లేదా నెమ్మదిగా (క్రానిక్) పెరుగుతుందా అనే దానిపై కూడా ఆధారపడి వీటిని వర్గీకరించడం జరుగుతుంది.

క్రానిక్ లింఫోసైటిక్ ల్యుకేమియా (సిఎల్ఎల్) అనేది లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాల్లోని ఒక సెక్షన్ నియంత్రణ లేకుండా వృద్ధిచెందినప్పుడు కలిగే ఒక రకం ల్యుకేమియా. ఈ కణాలు ఎముక మూలుగలో తయారై రక్త ప్రవాహంలోకి వెళతాయి. రక్తం మరియు ఎముక మూలుగలోనే కాకుండా లింఫ్ నోడ్స్ మరియు ప్లీహంలో కూడా అసాధారణ లింఫోసైట్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటం లింఫోసైట్స్ కర్తవ్యం. సిఎల్ఎల్లో ఉండే అసాధారణ లింఫోసైట్స్ సరిగ్గా పనిచేయవు మరియు ఎర్ర రక్త కణాలు లాంటి ఇతర రక్త కణాలు మరియు ప్లెట్లెట్స్ తగ్గిపోవడానికి కూడా దారితీయొచ్చు.

ఎస్ఎల్ఎల్ (స్మాల్ లింఫోసైటిక్ లింఫోమా)

లింఫోసైట్స్ నుంచి అభివృద్ధి చెందే ఎస్ఎల్ఎల్ చాలా వరకు సిఎల్ఎల్ మాదిరిగా ఉంటుంది. ఇది తక్కువ గ్రేడ్ లింఫోమా. రెండిటి మధ్య గల తేడా ఏమిటంటే సిఎల్ఎల్ ప్రధానంగా రక్త ప్రవాహంలో ఉంటే ఎస్ఎల్ఎల్ ఎక్కువగా లింఫ్ నోడ్స్లో ఉంటుంది. సిఎల్ఎల్ మరియు ఎస్ఎల్ఎల్ని ఒకే విధంగా నిర్వహిస్తారు.

క్రానిక్ లింఫొసైటిక్ ల్యుకేమియా నెమ్మదిగా వృద్ధిచెందుతుంది మరియు అత్యధిక సార్లు ఈ కారణాలతో పరీక్షలు చేసినప్పుడు ఇది నిర్థారణ అవుతుంది. నిత్యపరిపాటి రక్త పరీక్షలు లింఫోసైట్ల సంఖ్య పెరగడాన్ని చూపిస్తుంది. రోగనిర్థారణ చేయడానికి ముందు కొంతమంది రోగులకు లక్షణాలు కలగవచ్చు. ఇవి ఏమిటంటే

లింఫ్ నోడ్స్ పెరగడం

లింఫ్ నోడ్స్ పెరగడం అనేది సిఎల్ఎల్ యొక్క మామూలు లక్షణం. ఈ లింఫ్ నోడ్స్ మెడ, బాహు మూలలు, ఛాతీ, గజ్జలు లేదా పొత్తికడుపులో ఉండొచ్చు. పెరిగిన లింఫ్ నోడ్స్ సైజు మారుతుండొచ్చు, కొంత కాలంలో సైజు పెరగవచ్చు మరియు తగ్గవచ్చు మరియు సాధారణంగా నొప్పిగా ఉండదు.

ఇన్ఫెక్షన్లు

సిఎల్ఎల్ గల రోగుల్లో లింఫోసైట్స్ సంఖ్య పెరుగుతుంది, ఇవి పనిచేయవు కాబట్టి, రోగులకు ఏదో ఒక రకం ఇన్ఫెక్షన్లు కలగవచ్చు.

ఇతర లక్షణాలు

సిఎల్ఎల్తో ముడిపడివున్న ఇతర లక్షణాల్లో బరువు తగ్గడం, జ్వరం, అలసట మరియు రాత్రిళ్ళు చెమటపోయడం ఉంటాయి, ఇవి చాలా గణనీయంగా ఉండొచ్చు. సులభంగా కమలడం, రక్తస్రావం, ఎముక మూలుగలో వ్యాధి వల్ల ఎముకల నొప్పులు కూడా ఉండొచ్చు.

సిఎల్ఎల్ని అనుమానించినప్పుడు, రోగనిర్థారణను ధృవీకరించేందుకు ఈ కింది పరీక్షలు చేయబడతాయి.

రక్త పరీక్షలు

సిబిపి లేదా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది సిఎల్ఎల్ ప్రత్యేకత అయిన రక్తంలో లింఫోసైట్స్ పెరిగాయేమో చూసేందుకు చేయబడే రక్త పరీక్ష. ఇతర కారణాలతో ఈ పరీక్ష నిత్యపరిపాటిగా చేయవచ్చు మరియు రోగనిర్థారణ చేయడానికి ముందుగా దానిలో సిఎల్ఎల్ని చూడవచ్చు. సిఎల్ఎల్ వేరియంట్ అయిన ఎస్ఎల్ఎల్ గల రోగుల్లో, లింఫోసైట్ కౌంట్ మామూలుగా ఉండొచ్చు. ఎర్ర రక్త కణాలు మరియు ప్లెట్లెట్లు తగ్గడాన్ని కూడా సిబిపి చూపించవచ్చు.

ఫ్లో సైటోమెట్రీ

రక్త కణాలను వాటి భౌతిక మరియు రసాయనిక గుణాల ఆధారంగా వాటిని మరింతగా వర్గీకరించే ప్రక్రియ ఇది. ఫ్లో సైటోమీటర్ అనేది రక్తం శాంపిల్స్ని విశ్లేషించే మెషీన్. క్రానిక్ లింఫోసైటిక్ ల్యుకేమియాను రోగనిర్ధారణ చేయడానికి ఇది సహాయపడుతుంది.

ఎముక మూలుగ బయాప్సీ

సిఎల్ఎల్ యొక్క రోగనిర్ధారణ చేయడానికి ఈ పరీక్ష మామూలుగా చేయబడదు.

లింఫ్ నోడ్ బయాప్సీ

రోగిలో లింఫ్ నోడ్స్ పెరగడం కనిపించినప్పుడు మరియు సిఎల్ఎల్ని ఇంకా నిర్థారణ చేయనప్పుడు కొన్నిసార్లు ఈ పరీక్ష చేయబడుతుంది. అనేక కారణాల వల్ల లింఫ్ నోడ్స్ పెద్దవి అవుతాయి మరియు పెరిగిన లింఫ్ గ్రంథి బయాప్సీ సిఎల్ఎల్ లేదా ఎస్ఎల్ఎల్ని నిర్థారణ చేయవచ్చు.

ఛాతీ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు సిటి స్కాన్లు

పెరిగిన నోడ్స్ లేదా అవయవాలను చూసేందుకు ఛాతీకి ఎక్స్రే మరియు పొత్తికడుపుకు అల్ట్రాసౌండ్ స్కాన్ తీయబడతాయి. సిఎల్ఎల్ యొక్క సంపూర్ణ దశను పొందే అదే ఉద్దేశంతో సిటి స్కాన్ తీయబడవచ్చు.

జన్యుపరమైన పరీక్షలు

సిఎల్ఎల్ని రోగనిర్థారణ చేసే మ్యుటేషన్లను చూసేందుకు మరియు ఏ చికిత్స అత్యంత ప్రభావవంతంగా ఉంటుందనే విషయం గురించి డాక్టరుకు తెలియజేసే పరీక్షల కోసం తీసుకున్న రక్త నాళాలపై జన్యుపరమైన పరీక్షలు చేయబడతాయి. ఫిష్ (ఫ్లూరోసెన్స్ ఇన్ సిటు హైబ్రిడైజేషన్) అనే పద్ధతితో ఈ పరీక్షలు చేయబడతాయి.

క్రానిక్ లింఫోసైటిక్ ల్యుకేమియాను రెండు వ్యవస్థల ఆధారంగా స్టేజింగ్ చేయబడుతుంది. ఒకటి రాయ్ సిస్టమ్ కాగా మరొకటిది బైనెట్ సిస్టమ్. రాయ్ సిస్టమ్ ప్రకారం స్టేజింగ్ ఈ కింద ఇవ్వడమైనది.

రిస్కు స్టేజ్ వివరాలు
తక్కువ రిస్కు 0 రక్తం మరియు ఎముక మూలుగలో లింఫోసైట్స్ పెరగడం
మధ్యస్తం 1 లింఫోసైట్స్ పెరగడం మరియు లింఫ్ నోడ్స్ పెద్దవికావడం
మధ్యస్తం 2 లింఫోసైట్స్ పెరగడం మరియు లింఫ్ నోడ్స్ పెద్దవి కావడంతో లేదా కాకుండా కాలేయం లేదా ప్లీహం పెరగడం ప్లీహం
ఎక్కువ 3 లింఫోసైట్స్ పెరగడం మరియు కాలేయం, ప్లీహం లేదా లింఫ్ నోడ్స్తో లేదా లేకుండా రక్తహీనత
ఎక్కువ 4 లింఫోసైట్స్ పెరగడం మరియు మరియు పై కారకాలతో లేదా లేకుండా ప్లేట్లెట్స్ తగ్గడం

బైనెట్ స్టేజింగ్ సిస్టమ్ ఇక్కడ జాబితాగా ఇవ్వబడలేదు.

రోగుల్లో సిఎల్ఎల్ అనేక రకాల లక్షణాలను మరియు క్లినికల్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. వ్యాధి నిర్థారణ సమయంలో వ్యాధి దశ, రోగి వయస్సు మరియు ఫిట్నెస్ దశపై చికిత్స ఎంపికలు ఆధారపడి ఉంటాయి.

ప్రారంభ దశ వ్యాధి

వ్యాధి ప్రారంభ దశలో ఉండి లక్షణాలు ఏవీ లేని రోగులకు వెంటనే చికిత్స ఏమీ అందించబడదు. ప్రతి 3 నెలలు లేదా ఎక్కువ కాలానికి రక్త పరీక్షలు చేస్తూ వాళ్ళను సన్నిహితంగా గమనించడం జరుగుతుంది మరియు రోగిలో లక్షణాలు కనిపించినప్పుడే లేదా అనుకున్న దానికంటే వేగంగా సిఎల్ఎల్ పెరుగుతున్నప్పుడు మాత్రమే చికిత్స చేయబడుతుంది. సిఎల్ఎల్ ప్రారంభ దశలో గల రోగులకు ఏదైనా చికిత్సను ప్రారంభించవలసిన అవసరానికి ముందు సంవత్సరాల పాటు సన్నిహితంగా పర్యవేక్షించడం జరుగుతుంది.

క్రియాశీల వ్యాధిలో చికిత్స

సిఎల్ఎల్ ఉన్నట్లుగా నిర్థారణ చేయబడిన రోగులకు రాజ్ స్టేజింగ్ సిస్టమ్ ప్రకారం స్టేజ్ 3 మరియు స్టేజ్ 4 వ్యాధి ఉన్నప్పుడు క్రియాశీల వ్యాధి ఉన్నట్లుగా పరిగణించడం జరుగుతుంది. ఇంకా, వాళ్ళకు రక్తహీనత లేదా ప్లెట్లెట్ కౌంట్ నిర్దిష్ట స్థాయిల కంటే తక్కువగా ఉంటే లేదా నింఫ్ నోడ్లు లేదా ప్లీహం లాంటి అవయవాలు గణనీయంగా పెరిగితే లేదా అలసట, జ్వరం, 10% కంటే ఎక్కువగా బరువు తగ్గితే లేదా రాత్రిళ్ళు చెమటలుపోయడం లాంటి లక్షణాలు ఉంటే.

చికిత్స ఎంపికలు

క్రియాశీల వ్యాధి ఉన్నట్లుగా నిర్థారణ చేయబడిన మరియు చికిత్స అవసరమైన రోగులకు, ఈ కింది ఎంపికలు లభిస్తాయి. జన్యుపరమైన పరీక్షలో కనుగొన్న మ్యుటేషన్ల ఆధారంగా చికిత్స ఎంపికలను ఎంపికచేయవచ్చు.

కీమోథెరపి

కీమోథెరపి అనేది క్రానిక్ లింఫోసైటిక్ ల్యుకేమియాకు చికిత్స చేసేందుకు చాలా మామూలుగా ఉపయోగించే చికిత్స ఎంపిక. క్యాన్సరును బాగా నియంత్రించడంలో కీమోథెరపి ప్రభావవంతమైనది మరియు కీమోథెరపి యొక్క విభిన్న లైన్స్ మధ్య రోగులకు సుదీర్ఘ విరామాలు ఉండొచ్చు. ఈ సెట్టింగులో ఉపయోగించే మామూలు కీమోథెరపి ఔషధాలు లేదా రెజిమెన్లలో ఫ్లుడారబైన్, బెండాముస్టైన్, సైక్లోఫాస్ఫమైడ్, క్లోరాంబుసిల్ మరియు పెంటోస్టాటిన్ ఉంటాయి. వీటిని సింగిల్ ఏజెంట్లుగా లేదా రెండు లేద ఎక్కువ ఔషధాల సమ్మేళనంగా లేదా లక్షిత థెరపి ఔషదాలతో సమ్మేళనంగా ఇవ్వవచ్చు.

లక్షిత థెరపి ఔషధాలు

ఇవి సిఎల్ఎల్ కణాల యొక్క కొన్ని లక్ష్యాలపై ప్రత్యేకంగా పనిచేసే ఔషధాలు, కాబట్టి ప్రభావంతంగా ఉంటాయి. ఇవి కీమోథెరపి కంటే భిన్నమైనవి, కాబట్టి కీమోథెరపి ఔషధాలతో పోల్చుకుంటే మామూలు కణాలపై తక్కువ ప్రభావాలతో క్యాన్సరు కణాలపై ప్రధానంగా వీటికి ప్రభావం ఉంటుంది.లక్షిత ఏజెంట్లుగా ఉపయోగించే కొన్ని రకాల ఔషధాల్లో మోనోక్లోనల్ యాంటీబాడీలు మరియు టైరోసిన్ కైనసే ఇన్హిబిటర్లు ఉంటాయి. రిటూక్సిమాబ్, ఒఫాటుముమాబ్, అలెంటుజుమాబ్ మరియు ఇబ్రుటినిబ్ లాంటి ఔషధాలను సిఎల్ఎల్కి చికిత్స చేసేందుకు మామూలుగా ఉపయోగిస్తారు. వీటిని కీమోథెరపితో సమ్మేళనంగా ఇస్తారు మరియు ఈ ఔషధాలన్నిటినీ సిరలోకి ఇస్తారు. పైన వివరించిన ఔషధాలతో ప్రారంభ థెరపి తరువాత సిఎల్ఎల్లో ఉపయోగించే ఇతర ఔషధాలు ఇడెలాలిసిబ్, దువెలిసిబ్ మరియు వెనెటోక్లాక్స్.

హెమటోపొయిటిక్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్

సిఎల్ఎల్ గల కొంతమంది రోగులకు, ప్రత్యేకించి యవ్వనంలో ఉన్న వాళ్ళకు ఇది చికిత్స ఎంపిక. ఈ స్థితిలో ఇది ఏకైక సంభావ్య రోగనాశక ఎంపిక.

స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ కొరకు రోగిని ఎంచుకోవడానికి ముందుగా, రోగి వయస్సు, ఉన్న ఇతర జబ్బులు మరియు రోగి ఫిట్నెస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఈ ట్రాన్స్ప్లాంట్ కోసం స్టెమ్ సెల్స్ని ఇచ్చే దాత అవసరం. దాత కవలల్లో ఒకరై, తల్లిదండ్రి లేదా తోబుట్టువులు (సోదరుడు లేదా సోదరి) లాంటి రక్తసంబంధీకులు అయివుండొచ్చు లేదా రోగికి దాత బంధువు కానివారై అయివుండొచ్చు.

దాత కణాలు రోగికి ఎలా సరిపోలుతున్నాయో (హెచ్ఎల్ఎ పోలిక) తెలుసుకునేందుకు మదింపు కూడా ఉంటుంది. దాత మరియు రోగికి మధ్య హెచ్ఎల్ఎలో సంపూర్ణ మ్యాచ్ ఉంటే ఇది సంపూర్ణ పోలిక అయివుండొచ్చు, దాతకు మరియు రోగికి మధ్య పోలిక లేకపోతే మిస్మ్యాచ్ మరియు సగం పోలిక ఉన్న చోట హాప్లోఐడెంటికల్ అవుతుంది.

స్టెమ్ సెల్స్ రక్తం, ఎముక మూలుగ లేదా ఒకవేళ లభిస్తే కార్డు బ్లడ్ నుంచి సేకరించబడతాయి.

కండిషనింగ్ చికిత్స

క్రానిక్ లింఫోసైటిక్ ల్యుకేమియాలో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ముందు రక్తం మరియు మూలుగలోని రక్త కణాలన్నిటినీ అబ్లేషన్ చేసేందుకు కండిషనింగ్ కీమోథెరపి ఇవ్వబడుతుంది. దాత ఇచ్చిన కణాలను ఇవ్వడానికి ముందు ల్యుకేమియా కణాలన్నిటినీ చంపడానికి సహాయపడటానికి ఇలా చేయబడుతుంది. సిఎల్ఎల్లో సాధారణంగా, ఇతర స్థితులు గల రోగులతో పోల్చుకుంటే తక్కువ ఉధృతి గల ట్రాన్స్ప్లాట్ చేయబడుతుంది.

స్టెమ్ సెల్స్ సేకరణ

స్టెమ్ సెల్స్ అనేవి ఎర్ర రక్త, తెల్ల రక్త కణాలు లేదా ప్లెట్లెట్స్ లాంటి ఏ రకమైన రక్త కణంలోకి అయినా అభివృద్ధి చెందగల సామర్థ్యం ఉన్న ఒక రకం రక్త కణాలు. ఈ స్టెమ్ సెల్స్ రక్త ప్రవాహంలో మరియు ఎముక మూలుగలో ఉంటాయి మరియు రోగికి ఎక్కువ మోతాదు కీమోథెరపిని ఇవ్వడానికి ముందు రోగి నుంచి సేకరించబడతాయి.

స్టెమ్ సెల్స్ని మరొక వ్యక్తి (దాత) నుంచి తీసుకుంటే, దీనిని అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. దాత బంధువు అయివుండొచ్చు, సాధారణంగా సోదరుడు లేదా సోదరి, లేదా సంబంధం లేని మ్యాచింగ్ దాత అయివుండొచ్చు. సరిపోలని లేదా పాక్షికంగా సరిపోలిన దాతను కూడా ఉపయోగించుకోవచ్చు.

స్టెమ్ సెల్స్ని సేకరించడానికి ముందుగా, రోగి కీమోథెరపి మరియు జి- సిఎస్ఎఫ్తో ఇంజెక్షన్లు పొందవచ్చు, విజయవంతంగా సేకరించేందుకు రక్తంలో స్టెమ్ సెల్స్ సంఖ్యను ఇవి పెంచుతాయి.

స్టెమ్ సెల్స్ని సేకరించే రోజున, దాతను మెషీన్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది మరియు ఒక సిర నుంచి రక్తం తీసుకోబడుతుంది మరియు రక్తంలో ఉన్న స్టెమ్ సెల్స్ని సేకరించేందుకు మెషీన్ గుండా ఇది వెళుతుంది. మరొక సిర గుండా రక్తం తిరిగి దాతలోకి వెళుతుంది. ఈ ప్రక్రియను కొద్ది గంటల్లో చేయడం జరుగుతుంది.

స్టెమ్ సెల్స్ని సేకరిస్తే, రోగి ఎక్కువ మోతాదు కీమోథెరపి పొందుతారు. కీమోథెరపి తరువాత, దాత నుంచి సమీకరించిన స్టెమ్ సెల్స్ని రోగికి ఎక్కించడం జరుగుతుంది. ఈ కణాలు ఎముక మూలుగలోకి వెళ్ళి మళ్ళీ రక్త కణాలు తయారుచేయడం ప్రారంభిస్తాయి.

ఎముక మూలుగ సేకరణ

ఎముక మూలుగ అనేది ఎముకల లోపల ఉండే మెత్తని మెటీరియల్. ఎముక మూలుగ ట్రాన్స్ప్లాంట్ కోసం, ఎక్కువ మోతాదు కీమోథెరపిని ఇవ్వడానికి ముందు మూలుగను సేకరించవలసి ఉంటుంది. మూలుగను సేకరించే ప్రక్రియ ఆపరేషన్ థియేటర్లో సాధారణ మత్తుమందు కింద ఇవ్వబడుతుంది. ఎముకల్లోని విభిన్న స్థలాల నుంచి మూలుగను తీసుకోవచ్చు మరియు దీనిలో దాదాపు 1 లీటర్ని ప్రక్రియ సమయంలో తీసుకోవచ్చు. ఒకసారి బయటకు తీస్తే, దీనిని భద్రపరుస్తారు మరియు అవసరమైనప్పుడు రోగికి ఎక్కిస్తారు.

స్టెమ్ సెల్ మరియు ఎముక మూలుగ ట్రాన్స్ప్లాంట్ యొక్క అపాయాలు మరియు దుష్ప్రభావాలు

స్టెమ్ సెల్ లేదా ఎముక మూలుగ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం అనేది సంక్లిష్ట ప్రక్రియ మరియు దుష్ప్రభావాలతో ముడిపడివుంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన తరువాత మూలుగ మరియు రక్తంలో రక్త కణాలు మామూలు స్థితికి కోలుకోవడానికి కొద్ది వారాల పాటు ఆసుపత్రిలో ఉండటం సాధారణంగా ఈ ప్రక్రియలో ఉంటుంది.ఈ ప్రక్రియతో ముడిపడివున్న మామూలు దుష్ప్రభావాల్లో ఇవి ఉంటాయి:

వికారం, వాంతులు, జుట్టు ఊడటం, కాలేయం పనితనం మారడం ఈ చికిత్స యొక్క సంభావ్య దుష్ప్రభావాలు.

తెల్ల రక్త కణాలుగా ఇన్ఫెక్షన్ అపాయం తక్కువగా ఉంటుంది మరియు రోగి ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్, వైరల్ లేదా ఫంగల్ అయివుండొచ్చు మరియు వాటిని నియంత్రించడానికి సాధారణంగా యాంటీబయాటిక్స్ అవసరమవుతాయి.

నోరు మరియు జీర్ణ మార్గం యొక్క లైనింగ్ లోపల కీమోథెరపి ప్రభావం వల్ల ముకోసైటిస్ కలుగుతుంది. రోగి తీసుకునే ఆహార పరిమాణాన్ని ఇది పరిమితం చేయవచ్చు మరియు ఇలాంటి సందర్భంలో ఇతర ఫీడింగ్ పద్ధతులు ఉపయోగించవచ్చు.

తక్కువ ప్లెట్లెట్ కౌంట్ వల్ల ఈ ప్రక్రియతో ముడిపడివుండే అపాయం రక్తస్రావం, కానీ ప్లెట్లెట్ కౌంట్లను పెంచేందుకు ప్లెట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ని ఇవ్వవచ్చు.

గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ వ్యాధి. దాత నుంచి ఎక్కించిన కణాలకు ఇది శరీరం యొక్క ప్రతిచర్య.

రేడియోథెరపి

సిఎల్ఎల్ లేదా సిఎల్ఎల్ వేరియంట్ అయిన ఎస్ఎల్ఎల్ (స్మాల్ లింఫోసైటిక్ లింఫోమా) గల కొద్దిమంది రోగులకు చికిత్స ఎంపికగా రేడియోథెరపిని ఉపయోగిస్తారు. శరీరంలోని ఒక ప్రాంతంలో లింఫ్ నోడ్లు పెరిగిన రూపంలో వ్యాది ఐసోలేషన్లో ఉన్న రోగుల్లో రేడియోథెరపి ఉపయోగించబడుతుంది. ఆ ప్రాంతంలో వ్యాధిని నియంత్రించేందుకు రేడియోథెరపిని ఉపయోగిస్తారు. చికిత్స రోజూ 3 వారాల వరకు ఇవ్వబడుతుంది. పెరిగిన లింఫ్ నోడ్లు లేదా పెరిగిన ప్లీహం రోగులకు లక్షణాలు కలిగించిన ముదిరిన వ్యాధి గల రోగులకు కూడా రేడియోథెరపి ఉపయోగించబడుతుంది.