Chronic Myeloid Leukaemia

క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియా (సిఎంఎల్)

ల్యుకేమియా అనేది తెల్ల రక్త కణాల క్యాన్సర్. భిన్న రకాల ల్యుకేమియాలు ఉంటాయి మరియు ల్యుకేమియాలోకి రూపాంతరం చెందే ఒక రకం తెల్ల రక్త కణాలపై మరియు క్యాన్సరు త్వరగా (ఎక్యూట్) లేదా నెమ్మదిగా (క్రానిక్) పెరుగుతుందా అనే దానిపై కూడా ఆధారపడి వీటిని వర్గీకరించడం జరుగుతుంది.

క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియా (సిఎంఎల్) అనేది ఒక రకం తెల్ల రక్త కణాలు నియంత్రణ లేకుండా పెరిగినప్పుడు కలిగే ఒక రకం ల్యుకేమియా.

శరీరంలోని అత్యధిక కణాల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి, వీటిని క్రోమోజోమ్ 1 నుంచి 23 అని అంటారు.

ఈ క్రోమోజోమ్స్లో అనేక జీన్స్ ఉంటాయి. క్రోమోజోమ్ 9 మరియు క్రోమోజోమ్ 22 మధ్య జీన్స్ ట్రాన్స్లొకేషన్ (పరస్పరం మార్పు) ఉన్నప్పుడు అత్యధిక క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియాలు కలుగుతాయి. క్రోమోజోమ్ 9లో ఉన్న ఎబిఎల్1 అనే జీన్ క్రోమోజోమ్ 22లో బిసిఆర్ జీన్కి అతుక్కుంటుంది మరియు ఇది బిఆర్సి-ఎబిఎల్1 జీన్ని సృష్టిస్తుంది. అనంతరం దీనివల్ల రక్తంలో ఎక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి, ఇది క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియాగా మారుతుంది.

ఫిలాడెల్ఫియా క్రోమోజోమ్ (పిహెచ్) అనేది బిసిఆర్-ఎబిఎల్1 జీన్ని గల క్రోమోజోమ్ 22 మరియు మైక్రోస్కోప్లో చూడవచ్చు మరియు సిఎంఎల్ నిర్థారణలో సహాయపడుతుంది.

క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియా అనేక రకాల లక్షణాలు ఉత్పత్తి చేయవచ్చు. అత్యధిక లక్షనాలు రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కలుగుతాయి. అనేక మంది రోగులకు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు మరియు నిత్యపరిపాటి రక్త పరీక్షలపై పొరబాటున మాత్రమే నిర్థారణ చేయబడుతుంది. ఇతరులకు ఈ కింది లక్షణాలు ఉండొచ్చు.

అలసట మరియు నీరసం

రక్తంలో ఎక్కువ సంఖ్యలో డబ్ల్యుసిసి ఉండటం ఎర్ర రక్త కణాలు లాంటి ఇతర రక్త కణాల పనితనాన్ని మరియు వృద్ధిని నిరోధిస్తుంది. దీనివల్ల రక్తహీనత కలుగుతుంది, ఇది అలసట మరియు నీరసం లాంటి లక్షణాలు కలిగిస్తుంది.

రక్తస్రావం

డబ్ల్యుసిసి ఎక్కువగా ఉండటం రక్తంలో ప్లెట్లెట్స్ని తగ్గిస్తుంది, ఇది రక్తస్రావం లక్షణాలకు దారితీస్తుంది. ఈ రక్తస్రావం చిగుళ్ళు, మలం నుంచి కలగవచ్చు లేదా చర్మంపై కమలడం లేదా చర్మంపై దద్దురుగా ఉండొచ్చు.

పొత్తికడుపు నొప్పి లేదా కడుపుబ్బరం

ప్లీహం అనేది శరీరంలో ఉన్న అవయవం మరియు పొత్తికడుపుకు ఎడమ వైపున ఉంటుంది. సిఎంఎల్లో ప్లీహం పెరగవచ్చు మరియు కొన్నిసార్లు పెద్ద సైజుకు పెరుగుతుంది. ఇది లాగుడు అనుభూతి, కడుపుబ్బరం లేదా భారంగా ఉండటం, పొట్ట నిండినట్లుగా లేదా పొత్తికడుపులో నొప్పి లాంటి లక్షణాలు కలిగించవచ్చు.

ఇన్ఫెక్షన్లు

ఈ స్థితిలో డబ్ల్యుసిసి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ కణాల పనితనం అంత బాగా ఉండదు. కాబట్టి, తరచుగా ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం పెరుగుతుంది.

జ్వరం మరియు రాత్రిళ్ళు చెమటలుపోయడం

సిఎంఎల్ గల కొంతమంది రోగుల్లో ఈ లక్షణాలు ఉండొచ్చు.

ఇతర లక్షణాలు

సిఎంఎల్లో ఇతర లక్షణాల్లో కీళ్ళ మరియు ఎముకల నొప్పి, లింఫ్ నోడ్స్ పెరగడం లేదా బరువు తగ్గడం ఉంటాయి.

సిఎంఎల్ ఉన్నట్లుగా అనుమానిస్తే వ్యాధిని నిర్థారించేందుకు ఈ కింది పరీక్షలు చేయబడతాయి.

సిబిపి మరియు రక్త ఫిలిమ్

పూర్తి బ్లడ్ పిక్చర్ లేదా బ్లడ్ కౌంట్ సాధారణంగా సిఎంఎల్ ఉన్న విషయంలో బలమైన సంకేతం ఇస్తుంది. రక్త పరీక్ష దాదాపు 100,000 (మామూలు స్థాయి 4000-11000) తెల్ల రక్త కణాల పెరుగుదలను చూపిస్తుంది. సిఎంఎల్ గల రోగులందరికీ 100,000 కౌంట్ ఉండదు, కానీ లెవెల్ 12000 నుంచి 100,000 మధ్య ఎంతయినా లేదా అంతకంటే ఎక్కువ లెవెల్ ఉండొచ్చు. తెల్ల రక్త కణ కౌంట్ పెరగడం ఇన్ఫెక్షన్లు లాంటి క్యాన్సరుకు సంబంధం లేదని ఇతర కారణాలతో చాలా సామాన్యంగా కలుగుతుంది. మైక్రోస్కోప్లో చూసినప్పుడు, ఈ పెరిగిన కణాలు మైలోసైట్స్ అనే తెల్ల రక్త కణాల రకాలు. ప్లెట్లెట్స్, హిమోగ్లోబిన్ లాంటి ఇతర రక్త కణాలు మరియు ఇతర తెల్ల రక్త కణాలు తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు.

ఎముక మూలుగ బయాప్సీ

ఎముక మూలుగ అనేది కొత్త రక్త కణాలు పుట్టే స్థలం. రక్త కణాల్లో క్యాన్సరును అనుమానించినప్పుడు, మూలుగలో కణాలను చూసేందుకు మరియు రోగనిర్థారణను ధృవీకరించేందుకు ఎముక మూలుగ బయాప్సీ చేయబడుతుంది.

జన్యుపరమైన పరీక్షలు

బిసిఆర్-ఎబిఎల్1 ప్రొటీన్ కోసం చూసేందుకు జన్యుపరమైన పరీక్ష చేయబడుతుంది. ఇది ఫిష్- లేదా ఆర్టి- పిసిఆర్ పరీక్షతో చేయబడుతుంది. సిఎంఎల్ గల రోగుల్లో దాదాపు 90%కి పైగా రోగుల్లో అసాధారణ ట్రాన్స్లొకేషన్ని పరీక్ష చూపిస్తోంది. వీళ్ళను పిహెచ్ క్రోమోజోమ్ పాజిటివ్ మరియు రిమైండర్ లేదా పిహెచ్ నెగెటివ్ రోగులు అంటారు.
ఎక్కువ తెల్ల రక్త కణ కౌంట్, బిసిఆర్- ఎబిఎల్1 ఫ్యూజన్ జీన్ లేదా ఎంఆర్ఎన్ఎ ఉండటం మరియు పిహెచ్ క్రోమోజోమ్ ప్రదర్శన సిఎంఎల్ డయాగ్నసిస్ని ధృవీకరిస్తాయి.

బ్లాస్ట్ సెల్స్ సంఖ్య ఆధారంగా క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియాను 3 దశల్లోకి విభజిస్తారు. బ్లాస్ట్ సెల్స్ అనేవి అపరిపక్వ తెల్ల రక్త కణాలు. మైలోసైట్స్ కూడా అపరిపక్వ తెల్ల రక్త కణాలు, కానీ బ్లాస్ట్ సెల్స్ కంటే ఎక్కువ పరిపక్వమైనవి. మూడు దశలు ఇవి:

దీర్ఘకాలిక దశ

సిఎంఎల్ గల అత్యధిక మంది రోగులు, వీళ్ళలో సుమారుగా 80-85% మంది వ్యాధి యొక్క దీర్ఘకాలిక దశలో ఉంటారు. ఇక్కడ, ఎముక మూలుగలోని బ్లాస్ట్ సెల్స్ శాతం 5% కంటే తక్కువగా ఉంటుంది. ఈ దశలో వ్యాధి నెమ్మదిగా పెరుగుతుంది మరియు చికిత్సతో బాగా నియంత్రించబడుతుంది.

యాక్సెలరేటెడ్ దశ

ఈ దశలో, ఎముక మూలుగ లేదా రక్తంలో బ్లాస్ట్ సెల్స్ సంఖ్య 10 మరియు 19% మధ్య ఉండొచ్చు.

బ్లాస్ట్ దశ

బ్లాస్ట్ దశలో, రక్తంలో లేదా ఎముక మూలుగలో 20%కి పైగా కణాలు బ్లాస్ట్ సెల్స్ ఉంటాయి.

సిఎంఎల్ గల రోగి కొంత కాలంలో ఒక దశ నుంచి మరొక దశకు మారవచ్చు లేదా బ్లాస్ట్ దశలో సిఎంఎల్ ఉన్నట్లుగా నిర్థారణ చేయబడవచ్చు. బ్లాస్ట్ దశలో బ్లాస్ట్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇతర దశలతో పోల్చుకుంటే చికిత్స చేయడం మరింత కష్టంగా ఉంటుంది.

క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియా అనేది అత్యధిక మంది రోగుల్లో చికిత్స చేయదగిన వ్యాధి. చికిత్స ఎంపికలు వ్యాధి దశ, లక్షణాలు మరియు రోగి ఫిట్నెస్పై ఆధారపడి ఉంటాయి.

దీర్ఘకాలిక వ్యాధిలో ఉన్న అత్యధిక మంది రోగులకు మరియు యాక్సెలరేటెడ్ మరియు బ్లాస్ట్ దశలో ఉన్న రోగులకు, ప్రారంభ చికిత్స టైరోసిన్ కైనసే ఇన్హిబిటర్లు లేదా టికెఐలు అనే ఔషధాల (లక్షిత థెరపి) రూపంలో ఉంటుంది. దీర్ఘకాలిక దశ వ్యాధి గల రోగులకు, ఇది ప్రారంభ చికిత్స మాత్రమే అయివుండొచ్చు మరియు మంచి మరియు దీర్ఘకాలిక స్పందనలను అంచనావేయవచ్చు. యాక్సెలరేటెడ్ దశ లేదా బ్లాస్ట్ దశ గల రోగులకు, వాళ్ళకు ఉపశమనం కలగడానికి లేదా దీర్ఘకాలిక దశలోకి వెళ్ళడానికి వీలు కల్పించేందుకు ప్రారంభ చికిత్సగా టికెఐలు ఉపయోగించబడతాయి. దాని తరువాత, ఈ రోగులు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళవచ్చు.

టైరోసిన్ కైనసే ఇన్హిబిటర్లు

ఈ కేటగిరి కిందకు వచ్చే మరియు సిఎంఎల్కి చికిత్స చేయడంలో ఉపయోగించే ఔషధాల్లో ఇమాటినిబ్, దాసాటినిబ్, నీలోటినిబ్, బొసుటినిబ్ మరియు పొనాటినిబ్ ఉన్నాయి. వీటిల్లో, ఇమాటినిబ్ అనేది అత్యంత సామాన్యంగా ఉపయోగించబడుతుంది మరియు భారతీయ సెట్టింగులో ఖర్చు తక్కువతో కూడుకున్నది. ఈ ఔషధాలను టాబ్లెట్లుగా తీసుకోవాలి. వీటిల్లో కొన్నిటిని ఆహారంతో మరియు కొన్నిటిని నిరాహారంతో తీసుకోవాలి. కొద్దిపాటి దుష్ప్రభావాలతో వీటికి బాగా చికిత్స చేయవచ్చు. ఈ ఔషధాలతో మామూలుగా కలిగే దుష్ప్రభావాల్లో వికారం, నీళ్ళ విరేచనాలు, చర్మ దద్దురు, ముఖం మరియు కాళ్ళు వాపు, ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటాయి. ఈ విభిన్న టికెఐల యొక్క దుష్ప్రభావాలు మారుతుంటాయి మరియు దేనిని తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. టాబ్లెట్ల నుంచి గరిష్ట ప్రయోజనం పొందాలంటే నిరంతరాయంగా క్రమంతప్పకుండా వీటిని తీసుకోవడం తప్పనిసరి.

చికిత్స స్పందన మూల్యాంకన మరియు పర్యవేక్షణ

టికెఐలను ప్రారంభించిన రోగులకు, చికిత్సకు వ్యాధి స్పందనను అనేక రక్త మరియు జన్యుపరమైన పరీక్షలతో మదింపుచేయడం జరుగుతుంది. మొత్తం తెల్ల రక్త కౌంట్ని చూడటానికి సిబిపిని చేస్తారు మరియు ఇది తక్కువగా ఉంటే చికిత్సకు స్పందనను సూచిస్తుంది. మామూలు కంప్లీట్ బ్లడ్ కౌంట్ (10000 కంటే తక్కువగా డబ్ల్యుసిసి) పూర్తి హెమటోలాజికల్ స్పందనకు సంకేతం. చికిత్స చేసిన 3 నెలల లోపు ఇది సాధారణంగా కలుగుతుంది. ఫిలాడెల్ఫియా పాజిటివ్ స్థాయిని పరీక్షించేందుకు రక్త పరీక్ష, సిహెచ్ఆర్ తరువాత చేయబడుతుంది మరియు ఇది తగినంత తక్కువగా ఉంటే, పూర్తి సైటోజెనెటిక్ స్పందన (పిహెచ్+ కణాలు లేకపోవడం) సాధించినట్లుగా చెబుతారు. కనిపిస్తే, ఉన్న పిహెచ్+ కణాల సంక్యపై ఆధారపడి అతితక్కువ, స్వల్ప లేదా ప్రధాన స్పందనలు కలుగుతాయని చెప్పవచ్చు. బిసిఎల్-ఎబిఎల్1 పరీక్ష చేసినప్పుడు మరియు లెవెల్ కొంత స్థాయికి పడిపోయినప్పుడు (మూడు లాగ్ల తగ్గింపు) మేజర్ మాలిక్యులర్ రెస్పాన్స్ (ఎంఎంఆర్) సాధించినట్లు.

టికెఐ థెరపి వ్యవధి

టికెఐకి స్పందించిన రోగులు చికిత్సను బాగా సహిస్తారు, చికిత్స పనిచేసినంత కాలం ఔషధాలు కొనసాగించబడతాయి. టికెఐపై ఉండగా మళ్ళీ రోగులకు సిఎంఎల్ పెరిగిన చోట, ప్రత్యామ్నాయ టికెఐ పరిగణించబడుతుంది. ఇమాటినిబ్ని మొదటిసారి ఉపయోగిస్తుంటే, దసాటినిబ్, నీలోటినిబ్ లేదా బొసుటినిబ్ లాంటి ఇతర ఔషధాలు ఉపయోగించబడతాయి. ఇలాంటి రోగులకు హెమటోపొయిటిక్ సెల్ ట్రాన్స్ప్లాంట్ పరిగణించబడుతుంది.

హెమటోపొయిటిక్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్

క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియా యొక్క యాక్సెలరేటెడ్ దశ లేదా బ్లాస్ట్ దశ గల రోగులకు ఇది చికిత్స ఎంపిక. దీర్ఘకాలిక దశ ఉండి టికెఐకి స్పందించని లేదా టికెఐ చికిత్స తరువాత వ్యాధి మళ్ళీ పెరిగిన రోగులకు కూడా ఇది చికిత్స ఎంపిక.

స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ కొరకు రోగిని ఎంపికచేయడానికి ముందు పరిగణించబడే కారకాల్లో రోగి వయస్సు, ఇతర వైద్య జబ్బులు ఉండటం మరియు రోగి ఫిట్నెస్ ఉంటాయి.

ఈ ట్రాన్స్ప్లాంట్ కోసం, స్టెమ్ సెల్స్ని దానం చేసే దాత అవసరమవుతారు. ఈ దాత కవలల్లో ఒకరు, తల్లిదండ్రి లేదా తోబుట్టువు (సోదరుడు లేదా సోదరి) లాంటి బంధువు అయివుండొచ్చు లేదా రోగికి సంబంధం లేని దాత అయివుండొచ్చు.

దాత కణాలు రోగికి ఎలా సరిపోలుతున్నాయో (హెచ్ఎల్ఎ పోలిక) తెలుసుకునేందుకు మదింపు కూడా ఉంటుంది. దాత మరియు రోగికి మధ్య హెచ్ఎల్ఎలో సంపూర్ణ మ్యాచ్ ఉంటే ఇది సంపూర్ణ పోలిక అయివుండొచ్చు, దాతకు మరియు రోగికి మధ్య పోలిక లేకపోతే మిస్మ్యాచ్ మరియు సగం పోలిక ఉన్న చోట హాప్లోఐడెంటికల్ అవుతుంది.స్టెమ్ సెల్స్ రక్తం, ఎముక మూలుగ లేదా కార్డు బ్లడ్ నుంచి సేకరించబడతాయి, ఒకవేళ లభిస్తే. రక్తం లేదా ఎముక మూలుగలో దేని నుంచి సేకరించాలనే విషయం రోగి, దాత స్థితిపై మరియు ఉన్న సిఎంఎల్ రకంపై ఆధారపడి ఉంటుంది.

కండిషనింగ్ చికిత్స

క్రానిక్ మైలోయిడ్ ల్యుకేమియాలో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ముందు రక్తం మరియు మూలుగలోని రక్త కణాలన్నిటినీ అబ్లేషన్ చేసేందుకు కండిషనింగ్ కీమోథెరపి ఇవ్వబడుతుంది. దాత ఇచ్చిన కణాలను ఇవ్వడానికి ముందు ల్యుకేమియా కణాలన్నిటినీ చంపడానికి సహాయపడటానికి ఇలా చేయబడుతుంది. చికిత్సలో మామూలుగా ఉపయోగించే ఔషధాల్లో బుసల్ఫాన్ మరియు సైక్లోఫాస్ఫమైడ్ ఉండొచ్చు లేదా కొన్ని పరిస్థితుల్లో సైక్లోఫాస్ఫమైడ్ మరియు శరీరం మొత్తం కిరణీకరణం చేయడం ఉండొచ్చు. 60 సంవత్సరాల వయస్సు దాటిన మరియు పై చికిత్సను తట్టుకోలేని రోగులకు తక్కువ ఉధృతంగా కీమోథెరపి చికిత్స ఇవ్వబడుతుంది.

స్టెమ్ సెల్స్ సేకరణ

స్టెమ్ సెల్స్ అనేవి ఎర్ర రక్త, తెల్ల రక్త కణాలు లేదా ప్లెట్లెట్స్ లాంటి ఏ రకమైన రక్త కణంలోకి అయినా అభివృద్ధి చెందగల సామర్థ్యం ఉన్న ఒక రకం రక్త కణాలు. ఈ స్టెమ్ సెల్స్ రక్త ప్రవాహంలో మరియు ఎముక మూలుగలో ఉంటాయి మరియు రోగికి ఎక్కువ మోతాదు కీమోథెరపిని ఇవ్వడానికి ముందు రోగి నుంచి సేకరించబడతాయి.
స్టెమ్ సెల్స్ని మరొక వ్యక్తి (దాత) నుంచి తీసుకుంటే, దీనిని అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. దాత బంధువు అయివుండొచ్చు, సాధారణంగా సోదరుడు లేదా సోదరి, లేదా సంబంధం లేని మ్యాచింగ్ దాత. సరిపోలని లేదా పాక్షికంగా సరిపోలిన దాతను కూడా ఉపయోగించుకోవచ్చు.
స్టెమ్ సెల్స్ని సేకరించడానికి ముంుద, రోగి కీమోథెరపి మరియు జి- సిఎస్ఎఫ్తో ఇంజెక్షన్లు పొందవచ్చు, విజయవంతంగా సేకరించేందుకు రక్తంలో స్టెమ్ సెల్స్ సంఖ్యను ఇవి పెంచుతాయి.
స్టెమ్ సెల్స్ సేకరణ రోజున, దాతను మెషీన్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది మరియు ఒక సిర నుంచి రక్తం తీసుకోబడుతుంది మరియు రక్తంలో ఉన్న స్టెమ్ సెల్స్ని సేకరించేందుకు మెషీన్ గుండా ఇది వెళుతుంది. మరొక సిర గుండా దాతలోకి తిరిగి రక్తం వెళుతుంది. ఈ ప్రక్రియను కొద్ది గంటల్లో చేయడం జరుగుతుంది.
స్టెమ్ సెల్స్ని సేకరిస్తే, రోగి హై డోస్ కీమోథెరపి పొందుతారు. కీమోథెరపి తరువాత, దాత నుంచి సమీకరించిన స్టెమ్ సెల్స్ని రోగికి ఎక్కించడం జరుగుతుంది. ఈ కణాలు ఎముక మూలుగలోకి వెళ్ళి మళ్ళీ రక్త కణాలు తయారుచేయడం ప్రారంభిస్తాయి.

ఎముక మూలుగ సేకరణ

ఎముక మూలుగ అనేది ఎముకల లోపల ఉండే మెత్తని మెటీరియల్. ఎముక మూలుగ ట్రాన్స్ప్లాంట్ కోసం, ఎక్కువ మోతాదు కీమోథెరపిని ఇవ్వడానికి ముందు మూలుగను సేకరించవలసి ఉంుటంది. మూలుగను సేకరించే ప్రక్రియ ఆపరేషన్ థియేటర్లో సాధారణ మత్తుమందు కింద ఇవ్వబడుతుంది. ఎముకల్లోని విభిన్న స్థలాల నుంచి మూలుగను తీసుకోవచ్చు మరియు దీనిలో దాదాపు 1 లీటర్ని ప్రక్రియ సమయంలో తీసుకోవచ్చు. ఒకసారి బయటకు తీస్తే, దీనిని భద్రపరుస్తారు మరియు అవసరమైనప్పుడు రోగికి ఎక్కిస్తారు.

స్టెమ్ సెల్ మరియు ఎముక మూలుగ ట్రాన్స్ప్లాంట్ యొక్క అపాయాలు మరియు దుష్ప్రభావాలు

స్టెమ్ సెల్ లేదా ఎముక మూలుగ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం అనేది సంక్లిష్ట ప్రక్రియ మరియు దుష్ప్రభావాలతో ముడిపడివుంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన తరువాత మామూలు స్థితికి కోలుకోవడానికి మూలుగ మరియు రక్తంలో రక్త కణాల కోసం కొద్ది వారాల పాటు ఆసుపత్రిలో ఉండటం సాధారణంగా ఈ ప్రక్రియలో ఉంటుంది.ఈ ప్రక్రియతో ముడిపడివున్న మామూలు దుష్ప్రభావాల్లో ఇవి ఉంటాయి:
వికారం, వాంతులు, జుట్టు ఊడటం, కాలేయం పనితనం మారడం ఈ చికిత్స యొక్క సంభావ్య దుష్ప్రభావాలు.
తెల్ల రక్త కణాలుగా ఇన్ఫెక్షన్ అపాయం తక్కువగా ఉంటుంది మరియు రోగి ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్, వైరల్ లేదా ఫంగల్ అయివుండొచ్చు మరియు వాటిని నియంత్రించడానికి సాధారణంగా యాంటీబయాటిక్స్ అవసరమవుతాయి.
నోరు మరియు జీర్ణ మార్గం యొక్క లైనింగ్ లోపల కీమోథెరపి ప్రభావం వల్ల ముకోసైటిస్ కలుగుతుంది. రోగి తీసుకునే ఆహారం పరిమాణాన్ని ఇది పరిమితం చేయవచ్చు మరియు ఇలాంటి సందర్భంలో ఇతర ఫీడింగ్ పద్ధతులు ఉపయోగించవచ్చు.
తక్కువ ప్లెట్లెట్ కౌంట్ వల్ల ఈ ప్రక్రియతో ముడిపడివుండే అపాయం రక్తస్రావం, కానీ ప్లెట్లెట్ కౌంట్లను పెంచేందుకు ప్లెట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ని ఇవ్వవచ్చు.
గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ వ్యాధి. దాత నుంచి ఎక్కించిన కణాలకు ఇది శరీరం యొక్క ప్రతిచర్య.

కీమోథెరపి

టికెఐ చికిత్స తరువాత వ్యాధి తిరగబెట్టిన లేదా టికెఐ చికిత్స ప్రభావవంతంగా లేని రోగుల్లో సిఎంఎల్లో చికిత్సగా కీమోథెరపిని ఉపయోగిస్తారు. మామూలుగా ఉపయోగించే ఔషధాలు సైటరాబైన్, బుసల్ఫాన్ మరియు హైడ్రోక్సియూరియా.