ఊపిరితిత్తుల కేన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సరు

ఊపిరితిత్తులు

ఊపిరితిత్తులు శ్వాసించడానికి ఉపయోగపడే ఛాతీలోని అవయవాలు. ఈ ఊపిరితిత్తులు రెండు (కుడి మరియు ఎడమ) గా విభజించబడ్డాయి. కుడి ఊపిరితిత్తులకు మూడు లంబిక (లోబ్) లు మరియు ఎడమ ఊపిరితిత్తులకు రెండు లంబికలు ఉంటాయి.

మనం పీల్చే గాలి ముక్కు, గొంతు నుండి శ్వాసనాళం (ట్రాకియా) లేదా విండ్ పైప్ లోకి వెళుతుంది. ట్రాకియా రెండు శ్వాసనాళికలు (బ్రోంఖై) గా విభజింపబడి ఉంటుంది, ఇది రెండు ఊపిరితిత్తులకీ గాలిని సరఫరా చేస్తుంది. శ్వాసనాళికలు ఊపిరితిత్తుల లోపల మరింతగా విభజింపబడతాయి. మనం శ్వాసని లోపలికి తీసుకునేటపుడు, గాలి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ శరీరంలోకి కలిసిపోతుంది మరియు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది.

ఊపిరితిత్తుల కేన్సర్

ఊపిరితిత్తుల కేన్సర్ ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే కేన్సర్. సాధారణంగా ఊపిరితిత్తుల కేన్సర్ శ్వాసనాళికల (బ్రోంఖై) పొర (లైనింగ్) లో మొదలవుతుంది. అందువల్ల దీనిని బ్రోంకస్ కార్సినోమా అని కూడా పిలుస్తారు.
శరీరంలోని ఇతర భాగాలలో ఉద్భవించిన అనేక కేన్సర్లు ఊపిరితిత్తులకు వ్యాపిస్తాయి. దీనిని ఊపిరితిత్తుల్లో వచ్చే మెటాస్టాటిక్ లేదా సెకండరీ కేన్సర్ అని పిలుస్తారు. ఇక్కడ చర్చించబడే ప్రధానమైన ఊపిరితిత్తుల కేన్సర్ కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక రోగికి రొమ్ము కేన్సర్ ఉంటే అది ఊపిరితిత్తుల్లోకి వ్యాపించి ఉంటే, అది మెటాస్టాటిక్ రొమ్ము కేన్సర్ అవుతుంది తప్ప ఊపిరితిత్తుల కేన్సర్ కాదు.

గ్లోబోకాన్ డేటా 2018 ప్రకారం, 2018 లో భారతదేశంలో కొత్తగా 67,795 ఊపిరితిత్తుల కేన్సర్లు వచ్చాయి, మొత్తం కేన్సర్లలో ఇవి 5.9% ఉన్నాయి.

ఊపిరితిత్తుల కేన్సర్ రకాలు

ఊపిరితిత్తుల కేన్సర్లలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. సాధారణ రకం నాన్ స్మాల్ సెల్ లంగ్ (ఊపిరితిత్తుల) కేన్సర్ (NSCLC). ఇది ఊపిరితిత్తుల కేన్సర్లలో 80% ఉంటుంది. మరో రకం స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ (SCLC)15-20% వరకు ఉంటుంది.

నాన్ స్మాల్ సెల్ (చిన్న కణాలు కాని) లంగ్ (ఊపిరితిత్తుల) కేన్సర్

ఊపిరితిత్తుల కేన్సర్ లో ఇది సాధారణ రకం. ఈ రకమైన కేన్సర్‌ను స్క్వామస్ సెల్ కార్సినోమా, అడెనోకార్సినోమా, లార్జ్ (పెద్ద) సెల్ (కణ) కార్సినోమాగా విభజించవచ్చు. స్క్వామస్ సెల్ కార్సినోమా కేన్సర్‌ పొగత్రాగే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది శ్వాసనాళికల (బ్రోంకై) పొర (లైనింగ్) లోని కణాల నుంచి అభివృద్ధి చెందుతుంది. శ్వాసనాళికల చుట్టూ పొరగా ఏర్పడే శ్లేష్మం ఉత్పత్తి చేసే గ్రంథుల నుంచి అడెనోకార్సినోమా అభివృద్ధి చెందుతుంది. ఈ రకం కేన్సర్ ధూమపానం చేసేవారిలో కనిపిస్తుంది. ధూమపానం చేయనివారికి వచ్చే ఊపిరితిత్తుల కేన్సర్ లో ఇది సాధారణంగా కనిపించే రకం. సహజ స్థితిలో ఉన్న అడెనోకార్సినోమా అనేది ఉద్రిక్తంగా రాబోయే అడెనోకార్సినోమాకి ప్రారంభ రూపం. ఈ ఉప రకాన్ని గతంలో బ్రోంకోఅల్వోలార్ కార్సినోమా అని పిలిచేవారు.

స్మాల్ సెల్ ఊపిరితిత్తుల కేన్సర్

ఈ కేన్సర్ దాదాపుగా ధూమపానం చేసేవారిలో కనిపిస్తుంది. సూక్ష్మదర్శిని క్రింద కనిపించే కణాల రూపాన్ని బట్టి దీనిని ఈ విధంగా పిలుస్తారు. ఈ రకమైన కేన్సర్ వేగంగా పెరుగుతుంది.

మెసోథెలియోమా

మెసోథెలియోమా ఒక కేన్సర్, ఇది ఊపిరితిత్తుల (ప్లూరా) పై ఆవరించుకుని ఉన్న కవరింగ్స్ పై అభివృద్ధి చెందుతుంది. మెసోథెలియోమా ప్రధానంగా అస్బెస్టాస్‌ దగ్గర పని చేసే వారిలో పెరుగుతుంది.

కార్సినోయిడ్ కణితి

లంగ్ కార్సినోయిడ్ ట్యూమర్ (కణితి) ఊపిరితిత్తుల్లో వచ్చే అసాధారణ కేన్సర్. ఇది సాధారణంగా నెమ్మదిగా పెరుగుతుంది. శస్త్రచికిత్స ద్వారా దీన్ని తొలగించి దీని బారి నుంచి బయటపడవచ్చు.

ఇతరులు

ఊపిరితిత్తులలో అరుదుగా కనిపించే ఇతర రకాల కేన్సర్లు సార్కోమా కేన్సర్లు, లింఫోమా కేన్సర్లు.

ఊపిరితిత్తుల కేన్సర్ ని వచ్చేలా చేసే ప్రమాద కారకమే ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆ కారకాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

ధూమపానం

ఊపిరితిత్తుల కేన్సర్ కి ధూమపానం అత్యంత ప్రమాద కారకాల్లో ఒకటి. ఇది సిగరెట్, బీడీ లేదా చుట్ట త్రాగడం వల్ల రావచ్చు. ఇటీవల జరిపిన అధ్యయనాల్లో పురుషుల్లో రోజుకు 5 సిగరెట్లకు పైగా ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే అవకాశం 25% ఉందని తేలింది. మహిళల్లో ఇది 18% గా ఉంది. జీవితంలో లేత వయసులోనే ధూమపానం మొదలుపెట్టినవారికి ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. 12 నుండి 15 సంవత్సరాల వరకు ధూమపానం మానేయడం జరిగితే, ధూమపానం చేయనివారి స్థితికి తిరిగి వెళ్లగలుగుతారు, ఆ విధంగా ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇతరులు ధూమపానం చేస్తున్నపుడు వారు విడుదల చేసే సిగరెట్ పొగకు గురికావడం (పాసివ్ స్మోకింగ్) కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం గురించి మరిన్ని వివరాల కోసం కేన్సర్ నివారణ విభాగాన్ని చూడండి. కేన్సర్ నివారణపై విభాగంలో ధూమపానం గురించి వివరాలు మరిన్ని తెలుస్తాయి.

అజ్బెస్టాస్ దగ్గర పని చేయడం

అజ్బెస్టాస్ కి గురికావడం వల్ల మెసోథెలియోమా (ఊపిరితిత్తులను కప్పే కేన్సర్) అభివృద్ధి చెందే ప్రమాదం మాత్రమే కాకుండా ఊపిరితిత్తుల కేన్సర్ కూడా పెరుగుతుంది. ధూమపానం చేసేవారు ఆస్బెస్టాస్ కి గురికావడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. ఆస్బెస్టాస్ కి గురికావడానికీ, ఊపిరితిత్తుల కేన్సర్ పెరగడానికీ మధ్య చాలా కాలం రోగం ఉన్నట్టు కూడా తెలియకుండా ఉండే స్థితి ఉంటుంది.

వంట పొగ

వంట చేసేటప్పుడు, ఇంటి లోపల ఉత్పన్నమయ్యే వేడి పొగ సోకడం, పొగ పీల్చడం జరుగుతుంది. ఇది ఊపిరితిత్తుల కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కట్టెల పొయ్యితో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.

పరిశ్రమల్లో పనిచేసేవారు

పరిశ్రమల్లో పనిచేసేవారు ఆర్సెనిక్, నికెల్, క్రోమియం, మసి, తారు, పాలిసైక్లిక్ హైడ్రోకార్బన్లు, డీజిల్ ఎగ్జాస్ట్ వంటి కారకాల (ఏజెంట్ల)కీ, సాధారణ కాలుష్యానికీ గురికావడం ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

గతంలో చేసిన రేడియోథెరపీ

లింఫోమా, రొమ్ము కేన్సర్ లేదా జెర్మ్ సెల్ కేన్సర్ వంటి ఇతర కేన్సర్లకు గతంలో ఛాతీకి రేడియోథెరపీ చేయించుకున్న వారికి ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానంతో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.

ఊపిరితిత్తుల కేన్సర్లు అనేక రకాల లక్షణాలను ఉత్పత్తి చేస్తాయి. సాధారణ లక్షణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ఈ లక్షణాలలో దేనినైనా కలిగి ఉండడమంటే ఊపిరితిత్తుల కేన్సర్ ఉందని కాదు, కానీ లక్షణాల్ని పరిశోధించడానికి డాక్టర్ ని చూడడం చాలా ముఖ్యం.

దగ్గు

లంగ్ కేన్సర్ లో కనిపించే సాధారణ లక్షణాల్లో దగ్గు ఒకటి. మూడు వారాల్లో దగ్గు తగ్గకపోతే ఛాతీ ఎక్స్-రే తీసి పరిశోధించాలి. దగ్గు ఇతర లక్షణాలతో ముడిపడి ఉంటుంది.

ఊపిరి ఆడకపోవడం

ఊపిరితిత్తుల కేన్సర్ లో ఇది సాధారణ లక్షణం. కొంత కాలానికి తన శ్వాస పరిస్థితి క్రమంగా అధ్వాన్నమవుతోందని రోగి గమనిస్తాడు.

రక్తంతో కూడిన దగ్గు

రక్తపు జీరలతో కూడిన కఫం లేదా కేవలం రక్తమే వచ్చే దగ్గు ఊపిరితిత్తుల కేన్సర్ కి సంకేతం. ఈ లక్షణాన్ని అత్యవసరంగా పరిశోధించాలి.

నొప్పి

కొంతమంది రోగులకి ఊపిరితిత్తుల కేన్సర్ వల్ల ఛాతీ నొప్పి వస్తుంది. ఎప్పుడూ వస్తుండే నొప్పిని పరిశోధించాలి. కొన్నిసార్లు రోగులు తమ చేతి చుట్టూ లేదా భుజం చుట్టూ ఉండే నొప్పి గురించీ, ఛాతీ వెనుక భాగంలో వచ్చే నొప్పి గురించీ ఫిర్యాదు చేయవచ్చు.

స్వరంలో మార్పు

ఊపిరితిత్తుల కేన్సర్ తో బాధపడుతున్న కొంతమంది రోగుల గొంతులో మార్పు కనిపిస్తుంది, స్వరం గరగరలాడడం ఉంటుంది.

ఇతర లక్షణాలు

ఊపిరితిత్తుల కేన్సర్ తో సంబంధం ఉన్న ఇతర లక్షణాల్లో అలసట, ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, మ్రింగడంలో ఇబ్బంది కలగడం వంటివి ఉంటాయి.

లంగ్ కేన్సర్ అని అనుమానం ఉంటే, ఈక్రింది పరీక్షలు జరుగుతాయి.

ఛాతీ ఎక్స్-రే

సాధారణంగా ఛాతీ లక్షణాల కోసం లేదా ఊపిరితిత్తుల కేన్సర్ అని అనుమానించినపుడు చేసే మొదటి పరీక్ష ఛాతీ ఎక్స్-రే. ఛాతీ ఎక్స్-రే మరీ సున్నితమైన పరీక్ష కాదు. కేన్సర్ ఉన్నా లేదా సాధారణ నిర్మాణం (నార్మల్ స్ట్రక్చర్) వెనుక ఉన్నపుడు కూడా అది మామూలుగా ఉండవచ్చు.

CTస్కాన్

ఎక్స్ రే మామూలుగా ఉన్నపుడు, ఇంకా అప్పటికీ అనుమానంగా ఉన్నా, లేదా ఎక్స్ రే లో ఏదైనా అసాధారణమైన పరిస్థితి కనుగొనబడినా CT గానీ లేదా కంప్యూటెడ్ టోమోగ్రాఫిక్ స్కాన్ గానీ చేయబడుతుంది. CTస్కాన్ ఛాతీకి సంబంధించి స్పష్టమైన వివరాల్నిచిత్ర రూపంలో ఇవ్వడానికి ఎక్స్-రే ని ఉపయోగిస్తుంది. ఇది ఛాతీలో ఉన్న అత్యంత అసాధారణమైన పరిస్థితుల్ని కొన్ని మిల్లీ మీటర్ల కంటే పెద్దదిగా చేసి చూపిస్తుంది.

ఇది త్వరగా జరిగిపోతుంది, నొప్పి అనిపించదు, ఇది చాలా కేంద్రాల్లో లభిస్తుంది. మెరుగైన చిత్రాలను పొందడానికి స్కాన్ చేయడానికి ముందు ఒక కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది.

బ్రాంకోస్కోపీ

బ్రోంకోస్కోపీ అనేది ముక్కు ద్వారా సన్నని గొట్టాన్ని గొంతులోకీ, ఊపిరితిత్తుల్లోకీ ప్రవేశపెట్టే ఒక పరీక్ష. తేలికపాటి మత్తు, స్థానిక ప్రాంతంలో మత్తు మందుని స్ప్రే చేసి ఈ పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష సహాయంతో వైద్యుడు శ్వాస నాళం లోపల ఏం తేడా ఉందో చూడగలుగుతాడు. అవసరమైతే ఏదైనా బయాప్సీలు తీసుకోవచ్చు. ఇది ఒక ఔట్ పేషెంట్ ప్రొసీజర్. ఇది నొప్పి లేకుండా ఉంటుంది.

బయాప్సీ

పై పరీక్షలలో ఏదైనా అసాధారణ పరిస్థితి కనబడితే, డాక్టర్ బయాప్సీ చేయాలని చెప్పవచ్చు. బయాప్సీ పరీక్షలో అక్కడి కణజాలంలోని కొంతభాగాన్ని బయటికి తీసి, రోగ నిర్ధారణ చేయడానికి సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) క్రింద చూస్తారు. ఊపిరితిత్తుల బయాప్సీని CT స్కాన్(CT గైడెడ్ బయాప్సీ) లేదా బ్రోంకోస్కోపీ సహాయంతో చేయవచ్చు. బయాప్సీ కోసం ఒక నమూనా తీసుకోవడానికి కొన్నిసార్లు మెడియాస్టినోస్కోపీ లేదా థొరాకోస్కోపీ అవసరమవుతుంది.

 

ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు

ఇవి ఊపిరితిత్తులు ఎంత బాగా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షలు. శస్త్రచికిత్స లేదా రేడియోథెరపీ చేయడానికి రోగి ఎంత ఫిట్‌నెస్‌ని కలిగి ఉన్నాడో అంచనా వేయడానికి ఈ పరీక్ష జరుగుతుంది.

PET-CT స్కాన్

PET-CT స్కాన్ అనేది ఒక ప్రత్యేకమైన CTస్కాన్. ఇందులో CT స్కాన్‌చేయడానికి ముందు శరీరంలోకి రేడియో యాక్టివ్ ట్రేసర్ ఇంజెక్ట్ చేయబడుతుంది. ఈ ట్రేసర్ శరీరంలో గ్లూకోజ్ అధికంగా అవసరం ఉన్న ప్రదేశాలలో ఉంటుంది. కేన్సర్ల మనుగడకు చాలా గ్లూకోజ్ అవసరం కాబట్టి, అవి శరీరంలోని మిగిలిన భాగాల కంటే చాలా ఎక్కువ ట్రేసర్‌ను తీసుకుంటాయి. కేన్సర్‌ను ఈస్కాన్‌లో సులభంగా గుర్తించవచ్చు. ఊపిరితిత్తుల కేన్సర్ నిర్ధారణ చేయబడిన తర్వాత ఈ పరీక్ష జరుగుతుంది. ఊపిరితిత్తుల కేన్సర్‌లో ఈ పరీక్ష చేయడంలో గల ముఖ్య ఉద్దేశ్యం కేన్సర్ ఊపిరితిత్తుల నుండి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందేమో చూడడమే. ఈ స్కాన్ చాలా సున్నితమైనది, ఇది వ్యాపించిన చిన్న చిన్న ప్రాంతాలను కూడా గుర్తించి చిత్రాల్ని తీయడానికి సహాయపడుతుంది.

మెడియాస్టినోస్కోపీ

ఇది సాధారణ అనస్థీషియా ఇచ్చి చేసే పరీక్ష. ఊపిరితిత్తుల కేన్సర్ ఉందని అనుమానించే రోగులకి ఇది అవసరం లేదు. ఖచ్చితంగా దశ నిర్ధారింపబడి ఊపిరితిత్తుల కేన్సర్ శస్త్రచికిత్స కి ప్లాన్ చేస్తున్న రోగులకు ఇది ప్రధానంగా చేయడం జరుగుతుంది.

ఎండోబ్రోంకైల్ అల్ట్రాసౌండ్ (EBUS)

ఇది మెడియాస్టినోస్కోపీకి బదులుగా చేయగలిగే కొత్త రకం పరీక్ష. మీకు సాధారణ మత్తుమందు ఇవ్వబడుతుంది లేదా మీకు మగతగా అనిపించేలా తేలికపాటి మత్తుమందు ఇవ్వవచ్చు. అలాగే, ఈ పరీక్ష ఒక చిన్న గ్రూపు రోగులకి మాత్రమే అవసరమవుతుంది. ఇది భారతదేశంలోని కొన్ని కేంద్రాలలో లభిస్తుంది. ఈ పరీక్ష కేన్సర్‌తో సంబంధం ఉన్న ఛాతీలోని లింఫు గ్రంథుల్ని బయాప్సీ చేయడానికి సహాయపడుతుంది.

రోగలక్షణ నిర్ధారణ

బయాప్సీ చేసిన తరువాత, పాథాలజిస్ట్ సూక్ష్మదర్శిని క్రింద ఆ నమూనాని పరిశీలిస్తాడు. రోగ నిర్ధారణ చేయడానికి ముందు పాథాలజిస్ట్ ఆ నమూనాపై కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయవలసి ఉంటుంది.
అది ఊపిరితిత్తుల కేన్సర్ అయితే, ఈ రిపోర్టు కేన్సర్‌ ని స్మాల్ సెల్ కేన్సర్ లేదా నాన్-స్మాల్ సెల్ కార్సినోమాగా స్పష్టీకరిస్తుంది.
అది నాన్ స్మాల్ సెల్ కార్సినోమా కాకపోతే, మళ్లీ దానిని స్క్వామస్ సెల్ కార్సినోమా, అడెనోకార్సినోమా లేదా లార్జ్ సెల్ కార్సినోమాగా వర్గీకరించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ విధంగా వర్గీకరించడం సాధ్యం కాదు. ఇది అడెనోకార్సినోమా అయితే, EGFR, ALK మరియు ROS స్థితి కోసం ప్రత్యేక పరీక్ష కూడా చేయాల్సి ఉంటుందని చెప్తారు. సాధ్యపడితే PD-L1 పరీక్ష చేస్తారు.

నెక్స్ట్ జెనరేషన్ (తదుపరి తరం) జీన్ సీక్వెన్సింగ్

ఊపిరితిత్తుల కేన్సర్‌లో ఇది సిఫార్సు చేయబడిన పరీక్ష, అయితే ఇది చాలా ఖరీదైనది. ఈ పరీక్ష బయాప్సీ నమూనా జన్యువులను చూస్తుంది, కేన్సర్‌లో ఉన్న అన్ని జన్యుపరమైన అసాధారణ స్థితుల్నీ చూస్తుంది. ఈ పరీక్షల ఆధారంగా డాక్టర్ చికిత్సను పూర్తి చేయగలడు. స్టేజ్ 4 ఊపిరితిత్తుల కేన్సర్ రోగులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే పైన పేర్కొన్న EGFR, ALK, ROS ఇంకా ఇతర పరీక్షల్ని ఒకేసారి చేస్తుంది.

స్టేజింగ్

కేన్సర్ దశ అంటే, శరీరంలోని కేన్సర్ పరిమాణం, అది ఉన్న స్థానాన్ని వివరించడానికి ఉపయోగించే పదం.

కేన్సర్ దశ తెలుసుకుంటే వైద్యులు దాని నివారణకి సరైన చికిత్సని నిర్ణయించగలుగుతారు.

దశని నిర్ణయించే సిస్టమ్ నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ కి వేరుగా ఉంటుంది. నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ TNM స్టేజింగ్ సిస్టమ్ లేదా నెంబర్ సిస్టమ్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ లో రెండు దశలు మాత్రమే ఉంటాయి.

ఏ సిస్టమ్ లో దశల్ని నిర్థారించాల్సి వచ్చినా అది, ఊపిరితిత్తుల్లోని కణితి (ట్యూమర్) పరిమాణం, ఊపిరితిత్తులలో స్థానికంగా కేన్సర్ ఎంతవరకు వ్యాపించిందీ, లింఫు నోడ్స్ (శోషరస కణుపుల)లో ఎంతవరకు వ్యాపించిందీ, ఇతర శరీర భాగాలలోకి ఎంతవరకు వ్యాపించిందీ అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

TNM స్టేజింగ్

TNM అంటే కణితి, నోడ్ మెటాస్టేస్ లను తెలియజేస్తుంది.

T స్టేజింగ్

T1a – కణితి ఊపిరితిత్తులలో ఉంటుంది, 2 సెం.మీ. కంటే తక్కువగా ఉంటుంది

T1b – కణితి ఊపిరితిత్తులలో ఉంటుంది, 2 నుండి 3 సెం.మీ. మధ్య ఉంటుంది

T2 – కణితి 3 మరియు 7 సెం.మీ. మధ్యలో ఉన్నా లేదా వాయుమార్గం (ప్రధాన బ్రోంకస్)లో ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి విడిపోయే చోట క్రింది భాగంలో 2సెం.మీ. ఎక్కువ పెద్దదిగా పెరిగి ఉన్నా లేదా కణితి ఛాతీ కుహరం (విసెరల్ ప్లూరా) లోపలి భాగంలోకి పెరిగిన కణితి లేదా ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని పని చేయనీయకుండా చేసే కణితి.

T2 కణుతులంటే, 5 సెం.మీ లేదా అంతకంటే చిన్నవిగా ఉండే T2a గానూ, 5 సెం.మీ కంటే పెద్ద కణుతుల్ని T2b కణుతులుగానూ వర్గీకరించబడ్డాయి.

T3 – కణితి 7 సెం.మీ కంటే పెద్దది లేదా ఈ క్రింది నిర్మాణాలలో ఒకటిగా పెరిగింది – ఛాతీ కుహర సెంట్రల్ లైనింగ్ ఛాతీ కుడ్యం (మెడియాస్టినల్ ప్లూరా), ఛాతీ కుహరం దిగువన ఉన్న కండరం (డయాఫ్రమ్), లేదా గుండె బయటి ఆవరణ (పెరికార్డియం) లేదా మొత్తం ఊపిరితిత్తులను పనిచేయనీయకుండా చేస్తున్న కణితి లేదా అదే ఊపిరితిత్తుల లంబికలో గల ఒకటి కంటే ఎక్కువ కణితి నాడ్యూల్.

T4 – కణితి ఈ క్రింది నిర్మాణాలలో ఒకటిగా పెరుగుతుంది – ఛాతీ మధ్యలో ఊపిరితిత్తుల మధ్య ఉన్న ప్రాంతం (మెడియాస్టినమ్), గుండె, ఒక ప్రధాన రక్తనాళం, శ్వాసనాళం (విండ్ పైప్, ట్రాకియా), ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడానికి విభజింపబడే ప్రాంతంలో ప్రధాన వాయుమార్గ ప్రాంతం, అన్నవాహిక (ఓస్ఫాగస్), వెన్నెముక ఎముక, స్వరపేటికని నియంత్రించే నాడి లేదా ఒకే ఊపిరితిత్తుల్లో ఒకటి కంటే ఎక్కువ లంబికల్లో (లోబ్స్) కణితి నోడ్యూల్స్ ఉండడం.

N స్టేజింగ్

N0 – ఏ లింఫు నోడ్స్ (శోషరస కణుపుల) లోనూ కేన్సర్ లేదు

N1 – ప్రభావిత ఊపిరితిత్తులకు సమీపంలో శోషరస కణుపులలో కేన్సర్ ఉంది

N2 – ఛాతీ (మెడియాస్టినమ్) మధ్యలో లింఫు నోడ్స్ లో ప్రభావితమైన ఊపిరితిత్తుల వైపు కేన్సర్ ఉంది లేదా ఊపిరితిత్తుకి విండ్ పైప్ శాఖలు కలిసే చోటనే లింఫు నోడ్స్ లో కేన్సర్ ఉంది

N3 – ప్రభావితమైన ఊపిరితిత్తుల నుండి ఛాతీకి ఎదురుగా ఉన్న లింఫు నోడ్స్ లో లేదా మెడ ఎముక (కాలర్ బోన్) పైన ఉన్న లింఫు నోడ్స్ లో లేదా ఊపిరితిత్తుల పైభాగంలో ఉన్న లింఫు నోడ్స్ లో కేన్సర్ ఉంది.

M స్టేజింగ్

M0 – కేన్సర్ ఊపిరితిత్తుల్లో మరొక లంబిక (లోబ్) లోకి గానీ లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినట్లు గానీ సంకేతాలు లేవు

M1a – కేన్సర్ కణాలను కలిగి ఉన్న ఊపిరితిత్తులు లేదా గుండె చుట్టూ ద్రవం ఉంది- (ప్రాణాంతక ప్లూరల్ ఎఫ్యూషన్) లేదా పెరికార్డియల్ ఎఫ్యూషన్

M1b – కాలేయం లేదా ఎముకలు వంటి శరీరంలోని సుదూర భాగాలలో ఊపిరితిత్తుల కేన్సర్ కణాలు ఉన్నాయి

నెంబర్ స్టేజింగ్

స్టేజి T N M
Ia T1a N0 M0
T1b N0 M0
Ib T2a N0 M0
IIa T1a N1 M0
T1b N1 M0
T2a N1 M0
IIb T2b N1 M0
T3 N0 M0
IIIa T1 N2 M0
T2 N2 M0
T3 N2 M0
T3 N1 M0
T4 N0 M0
T4 N1 M0
IIIb T4 N2 M0
T1 N3 M0
T2 N3 M0
T3 N3 M0
T4 N3 M0
IV ఏ T అయినా ఏ N అయినా M1a లేక 1b

స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ దశల నిర్ధారణ

స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ దశల నిర్ధారణలో రెండు దశలు ఉంటాయి. పరిమిత దశ, విస్తృతమైన దశ.పరిమిత (లిమిటెడ్) దశ అంటే కేన్సర్ అంతా ఛాతీకి ఒక వైపు ప్రాంతంలో ఉంటుంది. ఛాతీలో సగం కంటే ఎక్కువ ప్రాంతానికి కేన్సర్ ఉంటే, దానిని విస్తృతమైన (ఎక్స్టెన్సివ్) దశ అంటారు. చికిత్స ఎంపికలు రెండు దశలకీ వేర్వేరుగా ఉంటాయి.

స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ ని TNM, అలాగే పైన తెలిపిన నెంబర్ స్టేజింగ్ ఆధారంగా కూడా నిర్ధారించవచ్చు.

దశ 3 ఊపిరితిత్తుల క్యాన్సరును అదుపుచేయడం వివాదాస్పదం, కాబట్టి మారిపోతుంది. కణితి కచ్చితంగా ఎక్కడ ఉంది మరియు ప్రమేయం ఉన్న లింఫ్ నోడ్స్ ఆధారంగా, సర్జరీతో క్యాన్సరును పూర్తిగా తొలగించవచ్చా లేదా అనే విషయంలో సర్జన్ అభిప్రాయం ఇస్తారు. దీనిని తొలగించగలిగితే మరియు రోగి ఫిట్గా ఉంటే, రోగి సాధారణంగా సర్జరీ చేయించుకుంటారు. సర్జరీ తరువాత, నయం చేసే అకశాలను పెంచేందుకు ఇతర చికిత్స ఎంపికలు లభిస్తున్నాయి. సర్జరీ చేయించుకున్న మరియు క్యాన్సరు గల సర్జికల్ మార్జిన్లు గల లేదా మెడియాస్టైనల్ లింఫ్ నోడ్స్ ప్రమేయం గణనీయంగా ఉన్న రోగుల్లో, 6 వారాల పాటు రేడియోథెరపి ఒక ఎంపిక కావచ్చు. సర్జరీ తరువాత మూడు నెలల పాటు కీమోథెరపి నుంచి ఇతర రోగులు ప్రయోజనం పొందవచ్చు.

సర్జరీ తరువాత క్యాన్సరు ఇజిఎఫ్ఆర్ పాజిటివ్ గల రోగులకు, ఒసిమెర్టినిబ్ టాబ్లెట్లతో చికిత్సను ఉపయోగించవచ్చు. పురోగతి లేకుండా జీవించడాన్ని మెరుగుపరచడానికి ఈ చికిత్స సహాయపడుతుంది.

కణితిని తొలగించలేమని సర్జన్ భావిస్తే, కొన్నిసార్లు కీమోరేడియోథెరపిని ఇవ్వడం దానిని తొలగించవచ్చు. సర్జన్ ఆ సమయంలో కణితిని రీసెక్ట్ చేయవచ్చు. అన్ని కేంద్రాల్లో ఈ ఎంపిక ప్రాక్టీస్ చేయబడదు మరియు సర్జరీకి అనుకూలం కాని రోగులకు కీమోరేడియోథెరపి మాత్రమే ఉంటుంది. ఫిట్గా ఉన్న రోగుల్లో, ఇది కాంకరెంట్ కీమోరేడియోథెరపి, ఇక్కడ కీమోథెరపి మరియు రేడియోథెరపి ఏక కాలంలో ఇవ్వబడతాయి. లేకపోతే సీక్వెన్షియల్ కీమోరేడియోథెరపిని ఉపయోగించవచ్చు, ఇక్కడ కీమోథెరపి తరువాత రేడియోథెరపి ఇవ్వడం జరుగుతుంది.

కణితిని తొలగించలేమని సర్జన్ భావిస్తే, కొన్నిసార్లు కీమోరేడియోథెరపిని ఇవ్వడం దానిని తొలగించవచ్చు. సర్జన్ ఆ సమయంలో కణితిని రీసెక్ట్ చేయవచ్చు. అన్ని కేంద్రాల్లో ఈ ఎంపిక ప్రాక్టీస్ చేయబడదు మరియు సర్జరీకి అనుకూలం కాని రోగులకు కీమోరేడియోథెరపి మాత్రమే ఉంటుంది. ఫిట్గా ఉన్న రోగుల్లో, ఇది కాంకరెంట్ కీమోరేడియోథెరపి, ఇక్కడ కీమోథెరపి మరియు రేడియోథెరపి ఏక కాలంలో ఇవ్వబడతాయి. లేకపోతే సీక్వెన్షియల్ కీమోరేడియోథెరపిని ఉపయోగించవచ్చు, ఇక్కడ కీమోథెరపి తరువాత రేడియోథెరపి ఇవ్వడం జరుగుతుంది.

కీమోరేడియోథెరపి అనువుగా లేకపోతే, ఈ స్థితి గల రోగులకు చికిత్స చేసేందుకు రేడియోథెరపి ఒక్కటే ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు, వివిధ కారణాల రీత్యా మరింత దూకుడు చికిత్స రూపాలు ఇవ్వడం సాధ్యపడకపోతే కీమోథెరపి, ఇమ్యునోథెరపి లేదా లక్షిత థెరపిని ఉపయోగించవచ్చు.

కేన్సర్ స్టేజిని బట్టి స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ చికిత్స నిర్ధారణ నిర్ణయించబడుతుంది. సాధారణంగా స్మాల్ సెల్ కేన్సర్ నిర్వహణలో సర్జరీ అనేది ఒక ఎంపిక కాదు.

పరిమిత దశ (లిమిటెడ్ స్టేజి) స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ చికిత్స

పరిమిత దశ స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ ని కెమోథెరపీ మరియు రేడియోథెరపీల కాంబినేషన్ తో చికిత్స చేస్తారు. దీన్ని కంకరెంట్ కెమోరేడియోథెరపీ అని పిలుస్తారు. రేడియోథెరపీతో కేన్సర్ వ్యాపించి ఉన్న ప్రాంతాలన్నింటినీ కవర్ చేయడమే దీని లక్ష్యం. రెండు చికిత్సల్నీ కలిపి ఇవ్వడం వల్ల వ్యాధి నియంత్రణకు మెరుగైన అవకాశాల్ని కల్పిస్తుంది.

ప్రతి 21 రోజులకీ 3 రోజులు కెమోథెరపీని ఇస్తారు. ఇలాంటి నాలుగు కెమోథెరపీ సైకిల్స్ వరకు రేడియేషన్ ఇవ్వబడుతుంది. రేడియేషన్ ప్రతిరోజూ ఒకసారి చొప్పున, వారానికి ఐదు రోజులు పాటు, ఏడు వారాల వరకు ఇవ్వబడుతుంది. కొన్ని కేంద్రాల్లో, రేడియోథెరపీని మూడు వారాల పాటు రోజుకు రెండుసార్లు ఇవ్వవచ్చు. రోగికి ఫిట్నెస్ సరిగా లేకపోతే, మొదట కెమోథెరపీ ఇచ్చి రేడియోథెరపీ ద్వారా అందిస్తారు.

కెమోరేడియోథెరపీ దుష్ప్రభావాలు ఛాతీ, నొప్పి లేదా అసౌకర్యం, ఛాతీపై చర్మం ఎర్రబారడం, గొంతు పూత, రక్తంలో సెల్స్ కౌంట్స్ తక్కువగా ఉండడం, సంక్రమణ ప్రమాదం, వికారం, వాంతులు. రేడియోథెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాలు చికిత్స పూర్తయిన తర్వాత 4 వారాల వరకు ఉంటాయి, ఆ తరువాత పరిస్థితి మెరుగుపడుతుంది.

వ్యాధి లేనప్పుడు కూడా మెదడును రేడియోథెరపీతో చికిత్స చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది ప్రోఫిలాక్టిక్ క్రానియల్ ఇర్రేడియేషన్ (PCI) గా పిలువబడుతుంది. ఈ చికిత్స మెదడులో కేన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పై విధమైన చికిత్స పూర్తి చేసిన తర్వాత ఇవ్వబడుతుంది. అంకాలజిస్ట్ ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాల్నీ, నష్టాల్నీ వివరిస్తారు.

ఎక్స్టెన్సివ్ స్టేజి స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ చికిత్స

ఎక్స్టెన్సివ్ స్టేజి స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ ని మొదటి తడవ మాత్రమే కెమోథెరపీతో చికిత్స చేస్తారు. ఈ కెమోథెరపీ అనేది సాధారణంగా 2 ఔషధాల కాంబినేషన్ లో ఉంటుంది, ఇది ప్రతి 3 వారాలకూ 3 రోజులు ఇవ్వబడుతుంది. అలాంటి 4 లేదా 6 సైకిల్స్ ఇవ్వబడతాయి. చికిత్సకు కేన్సర్ ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నదీ పరిశీలించడం కోసం చికిత్స 2-3 సైకిల్స్ తరువాత స్కాన్ తీయడం జరుగుతుంది. రోగి చికిత్సను బాగా తట్టుకోగలుగుతుంటే, కెమోథెరపీని కొనసాగిస్తారు. అంటే వ్యాధి, చికిత్సకు ప్రతిస్పందిస్తోందని అర్థం.

పైన పేర్కొనబడిన ఇమ్యునోథెరపితో కీమోథెరపి సమ్మేళనం కీమోథెరపి ఒక్కదానికంటే మెరుగైన స్పందన అందించగలదు. దుర్వాలుమాబ్ లేదా అటెజోలిజుమాబ్ లాంటి ఇమ్యునోథెరపి ఔషధాలను కీమోథెరపితో పాటు 4 చక్రాల పాటు ఇవ్వడం జరుగుతుంది, ఆ తరువాత మెయింటెనెన్స్ చికిత్సగా ఇమ్యునోథెరపి ఔషధాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ రోగుల్లో ఇది ప్రాధాన్యత ఎంపిక కాదు, కాకపోతే ఇమ్యునోథెరపి ఖరీదైనది కాబట్టి దీనిని భరించగలిగితేనే

కెమోథెరపీ పూర్తయిన తరువాత, కొన్నిసార్లు ఛాతీకి రేడియోథెరపీ ఇస్తారు. పై పేరాలో వివరించిన విధంగా ప్రొఫిలాక్టిక్ క్రానియల్ (కపాల) ఇర్రేడియేషన్ (PCI) ని కూడా ఇక్కడ ఉపయోగించవచ్చు. అంకాలజిస్ట్ దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు రెండింటి గురించీ వివరిస్తారు.

స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కెమోథెరపీ మందులు సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్, ఎటోపోసైడ్, టోపోటెకాన్, ప్యాక్లిటాక్సెల్.

స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ కి కెమోథెరపీ ఇస్తే కేన్సర్ లక్షణాలను తగ్గించడంలోనూ, కేన్సర్ ని బాగా కుదించడంలోనూ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే, ఇది కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఇవి-

  • జుట్టు ఊడడం
  • వికారం, వాంతులు
  • అలసట
  • గొంతు పూత
  • నీళ్ల విరేచనాలు
  • మలబద్ధకం
  • వినికిడిలో మార్పులు
  • సంక్రమణ ప్రమాదం
  • రుచి మార్పులు
  • చేతులు, కాళ్లు తిమ్మర్లు ఎక్కడం
  • రక్తహీనత
  • రక్తస్రావం

స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ మళ్లీ తిరగబెడితే చేసే చికిత్స

ప్రారంభ చికిత్స జరిగిన తర్వాత కేన్సర్ మళ్లీ తిరగబెడితే, ఏ చికిత్స ఎంపిక చేయాలన్న నిర్ణయం, కేన్సర్ మళ్లీ వచ్చిన ప్రాంతం, ఎంత కాలానికి వచ్చిందీ, రోగి ఫిట్నెస్, మునుపటి చికిత్స వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, చికిత్సా ఎంపికలలో కెమోథెరపీ మరియు రేడియోథెరపీ ఉంటాయి. ముందు కెమోథెరపీ ఇచ్చిన తర్వాత, ఆ చికిత్సకీ, మళ్లీ వ్యాధి తిరగబెట్టడానికీ మధ్య ఎక్కువ సమయం ఉంటే, అదే కెమోథెరపీ తిరిగి ఉపయోగించబడుతుంది. అలా కాకపోతే ఆ తర్వాత ఉన్న ఎంపికల్ని (సెకండ్-లైన్ ఆప్షన్ల) ఆలోచిస్తారు. కేన్సర్ మళ్లీ తిరగబెట్టిన సందర్భంలో ఉపయోగించే రేడియోథెరపీ లేదా కెమోథెరపీలను ప్రధానంగా కేన్సర్ ని ఉత్పత్తి చేసే లక్షణాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. రేడియోథెరపీ రోజువారీ ప్రాతిపదికన 1-10 చికిత్సలు ఇవ్వబడతాయి. కొన్నిసార్లు ఎండోబ్రోంకైల్ బ్రాచీథెరపీ వంటి ఎంపికలు ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించబడతాయి. కేన్సర్ ఆటంకం కలిగిస్తున్న బ్రోంకస్ లోకి ఒక రేడియోయాక్టివ్ సోర్స్ (వనరు) ని ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది.

రోగనిరోధక చికిత్స

స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ చికిత్సలో కెమోథెరపీ పనిచేయకపోతే చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అనే మందుల వాడకాన్ని ఉపయోగిస్తారు. దీనిని సెకండ్ లైన్ ట్రీట్మెంట్ గా పిలుస్తారు, ఇది కెమోథెరపీతో ప్రారంభించిన చికిత్స తర్వాత ఉపయోగించబడే చికిత్స. నివోలుమాబ్ అనేది ఒక డ్రగ్. ఇది ప్రతి 2 వారాలకు ఒకసారి సిర (వెయిన్) లోకి ఇవ్వబడుతుంది. ఈ చికిత్సతో దుష్ప్రభావాలు ఉంటాయి, కొన్నిసార్లు అవి తీవ్రమైనవి కావచ్చు, కానీ సాధారణంగా కెమోథెరపీ కంటే తక్కువగా ఉంటాయి.

మెసోథెలియోమా అంటే ఏమిటి

మెసోథెలియోమా అనేది మెసోథెలియంలో మొదలయ్యే కేన్సర్. మెసోథెలియం అనేది ఛాతీ, పొత్తికడుపు, వాటిలో ఉన్న అవయవాలను కప్పే పొర. ఊపిరితిత్తుల్ని లైనింగ్ చేసే మెసోథెలియంని ప్లూరా అంటారు. ప్లూరా రెండు పొరలతో నిర్మాణమై ఉంటుంది, బయటి పొరను ప్యారిటల్ ప్లూరా అని పిలుస్తారు లోపలి పొరను విసెరల్ ప్లూరా అని పిలుస్తారు. ఈ రెండు పొరల మధ్యా వాటిని వేరుచేసే ద్రవం పల్చని ఫిల్మ్ లను కలిగి ఉంటాయి. మెసోథెలియోమా ప్లూరా నుండి లేదా పొత్తికడుపు పొర (లైనింగ్) లో మొదలవుతుంది. ప్రధానంగా ఈ రకమైన కేన్సర్ ఆస్బెస్టాస్, ధూమపానం కారణంగా సంభవిస్తుంది.

అజ్బెస్టాస్ కి గురి కావడం (ఎక్స్పోజర్)

మెసోథెలియోమాకి అజ్బెస్టాస్ ఎక్స్పోజర్ ప్రధాన ప్రమాద కారకం. అజ్బెస్టాస్ చాలా రకాలు. బ్లూ (నీలి) అస్బెస్టాస్, బ్రౌన్ (గోధుమ రంగు) అజ్బెస్టాస్, వైట్ (తెలుపు) అజ్బెస్టాస్.

అజ్బెస్టాస్ సూక్ష్మ పీచుపదార్థాలతో తయారవుతుంది, పీల్చుకునేపుడు లేదా మింగినపుడు ఇవి లోపలికి పోతాయి. పీల్చినప్పుడు అవి ఊపిరితిత్తులలో ఉంటాయి. ఊపిరితిత్తులలో మంటను కలిగించడం ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతాయి. ఈ పీచుల్లో కొన్ని ప్లూరా వరకు ప్రయాణించి ప్లూరల్ వ్యాధులకీ, మెసోథెలియోమాకీ కారణమవుతాయి. అజ్బెస్టాస్ భారతదేశంలో వివిధ పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించడం జరుగుతోంది. అజ్బెస్టాస్ కి గురయ్యే వారిలో నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులు, ప్లంబర్లు, మోటారు మెకానిక్స్, ఎలక్ట్రీషియన్లు, ఓడల్ని తయారు చేసేవారు, ఇళ్లకు పైకప్పు వేయడానికి అజ్బెస్టాస్ ఉపయోగించే సామాన్య ప్రజలు ఉన్నారు.

అజ్బెస్టాస్ కి గురికావడం, అలా గురి కావడం వల్ల పెరిగే అనారోగ్యాల మధ్య సుదీర్ఘ జాప్యం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 5 0 కి పైగా దేశాలలో అజ్బెస్టాస్ ని పూర్తిగా నిషేధించడం జరిగింది, అయితే భారతదేశంలో ఇప్పటికీ ఇది విస్తృతంగా ఉపయోగించబడుతోంది.

మెసోథెలియోమా లక్షణాలు

మెసోథెలియోమా లక్షణాల్లో దగ్గు, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, రక్తంతో కూడిన దగ్గు, బరువు తగ్గడం, అలసట, జ్వరం, చెమట పట్టడం, పొత్తికడుపు వాపు వంటి ఉదర సంబంధమైన లక్షణాలు. ఈ కేన్సర్ లో కనిపించే ఒక సాధారణ సమస్య ప్లూరల్ ఎఫ్యూషన్ అభివృద్ధి. ఈ సమస్య వచ్చిందంటే ప్లూరా 2 పొరల మధ్యా ద్రవం పేరుకుపోతుంది. ఇది ఊపిరి ఆడనీయకుండా చేస్తుంది.

మెసోథెలియోమా నిర్ధారణ

రోగి లక్షణాలు, ఎక్స్-రే, స్కాన్ పరిశీలనలు, బయాప్సీ ఫలితం ఆధారంగా మెసోథెలియోమా నిర్ధారణ అవుతుంది.
ఛాతీ ఎక్స్-రే, ఛాతీ CT స్కాన్ మరియు ప్లూరల్ ఫ్లూయిడ్ (ద్రవం) యాస్పిరేషన్, మెసోథెలియోమా కణాలు ప్లూరల్ లో ఉన్నాయేమో చూసేందుకు బయాప్సీ వంటి సాధారణ పరీక్షలు చేస్తారు. అప్పుడప్పుడు, ఈ పరీక్షలన్నీ చేసినా కూడా రోగ నిర్ధారణ చేయడం కుదరదు. అందువల్ల ప్రత్యేక పరీక్షలు అవసరం. ఇవి-

థ్రోయాకోస్కోపీ (VATS) వీడియో సహాయం

మెసోథెలియోమా ఉనికిని చూడటానికి బయాప్సీ కోసం కణజాల నమూనాను తీసుకోవడానికి ప్లూరా పొరల మధ్య కెమెరాతో సన్నని గొట్టాన్ని చొప్పించే పరీక్ష ఇది. ఇది సాధారణంగా థొరాసిక్ సర్జన్ చేత చేయబడుతుంది ఇది డే కేర్ (పగటి పూట చేసే ప్రక్రియ) విధానం.

మెసోథెలియోమా చికిత్స

సర్జరీ

VATS ప్లూరెక్టమీ

ప్లూరా ఊపిరితిత్తుల్ని కప్పి ఉంచినందు వల్ల, ప్లూరాలో ఫ్లూయిడ్ (ద్రవం) లేదా ద్రవ్యరాశి ఉండటం వల్ల ఊపిరితిత్తుల విస్తరణని తగ్గించి ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఇది వీడియో సహాయం సహాయంతో ప్రభావితమైన ప్లూరాను ఛేదించేందుకు చేసే ప్రక్రియ ఇది. ఇది ఇబ్బంది పడుతున్న ఊపిరితిత్తుల్ని విడుదల చేస్తుంది, ఆ విధంగా శ్వాసక్రియ మెరుగుపడుతుంది.

VATS ప్లూరోడెసిస్

ప్లూరా వ్యాధులలో, రెండు ప్లూరా లైనింగ్ ల మధ్యా ద్రవం చేరుతుంది. దీనిని ప్లూరల్ ఎఫ్యూషన్ అంటారు. ప్లూరల్ ఎఫ్యూషన్ శ్వాస తీసుకోకపోవటానికి కారణమవుతుంది, ఇది ప్లూరల్ ద్రవాన్ని తొలగించడంతో ఉపశమనం పొందవచ్చు. VATS గైడెడ్ ప్లూరోడెసిస్ అనేది ప్లూరల్ ఎఫ్యూషన్ ని ఎండిపోయేలా చేయడం జరుగుతుంది, తర్వాత రెండు ప్లూరా పొరల్నీ కలుపుతారు, తద్వారా ఎఫ్యూషన్ మళ్లీ ఎన్నడూ పేరుకుపోవడం జరగదు.

రాడికల్ ఎక్స్ట్రాప్లూరల్ నెమోనెక్టమీ

కొన్ని కేంద్రాల్లో ఈ ఎంపికని ఉపయోగిస్తారు. ఇందులో ప్రభావితమైన వైపు గుండె (పెరికార్డియం) భాగాన్ని డయాఫ్రాగమ్ తో పాటు ప్లూరాతో సహా మొత్తం ఊపిరితిత్తిని తొలగించడం జరుగుతుంది. ఇది చాలా దుష్ప్రభావాలనీ, చివరికి మరణ ప్రమాదం కూడా కలిగి ఉన్న పెద్ద ఆపరేషన్ ప్రక్రియ. చాలా కేంద్రాలు దీన్ని ఇకపై రోగులకు అందించవు, ఇది కేవలం క్లినికల్ ట్రయల్స్ సందర్భాల్లో మాత్రమే చేయబడుతుంది.

రేడియోథెరపీ

బయాప్సీ తీసుకోవడానికి లేదా ప్లూరల్ ద్రవాన్ని హరించడానికి డ్రెయిన్ లేదా ట్యూబ్ ఉంచిన ప్రదేశంలో ఛాతీ కుడ్యాని (గోడ)కి చికిత్స చేయడానికి కొన్నిసార్లు రేడియోథెరపీని ఉపయోగిస్తారు. రేడియోథెరపీ చేయడం వల్ల మెసోథెలియోమా ఛాతీ వెలుపలికి వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

కెమోథెరపీ

కేన్సర్ తగ్గించడానికీ, లక్షణాలను మెరుగుపరచడానికి కెమోథెరపీని ఉపయోగిస్తారు. సాధారణంగా కెమోథెరపీ కాంబినేషన్ ప్రభావవంతంగా ఉపయోగించబడుతుంది. మెసోథెలియోమా కేన్సర్ వచ్చినపుడు, కేన్సర్ నీ, దాని లక్షణాల్నీ నియంత్రించడానికే కెమోథెరపీతో చికిత్స చేయడం జరుగుతుంది. మెసోథెలియోమా నివారణకి సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ పెమెట్రెక్స్డ్ మొదలైన మందుల్ని ఉపయోగిస్తారు. ఈ డ్రగ్స్ ని కాంబినేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 2 1 రోజులకు ఒకసారి 4 – 6 సార్లు లేదా సైకిల్స్ లో ఇస్తారు. కెమోథెరపీకి కేన్సర్ ప్రతిస్పందన ఎలా ఉందో చూసేందుకు స్కాన్లు చేస్తారు.

ప్లీయూరోడెసిస్

అడ్వాన్స్డ్ మెసోథెలియోమా గల అత్యధిక మంది రోగులకు ప్లీయూరల్ ఎఫ్యూజన్ కలుగుతుంది, ఇది ఊపిరితిత్తుల యొక్క రెండు బాహ్య పొరల మధ్యలో (ప్లూయూరా) ఫ్లూయిడ్ జమకావడం, ప్లీయూరోడెసిస్ అనేది ఫ్లూయిడ్ని తొలగించే ప్రక్రియ, ప్లీయూరా యొక్క రెండు పొరల్లోకి పదార్థాన్ని ఎక్కించడం ద్వారా వాటిని ఒకటిగా జాయింట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియను చేయడానికి, రోగి కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. స్థానిక మత్తుమందు సహాయంతో ఛాతీ ట్యూబు ఎక్కించబడుతుంది మరియు ఫ్లూయిడ్ పూర్తిగా పోయేందుకు మరియు స్థలంలోకి పదార్థాన్ని ఎక్కించేందుకు వీలుగా కొద్ది రోజుల పాటు ట్యూబు అక్కడ ఉండిపోతుంది. ఒకసారి చేస్తే, డ్రెయిన్ని తొలగించడం జరుగుతుంది, మరియు రోగి ఇంటికి వెళ్ళవచ్చు.

నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ కి చేసే శస్త్రచికిత్సలో కేన్సర్ తొలగింపు మరియు ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న లింఫ్ నోడ్స్ తొలగింపు జరుగుతుంది. ఛాతీకి ఒక వైపు వ్యాపించి ఉన్న కేన్సర్లకి చికిత్స చేయడానికి ఇది ఉత్తమ ఎంపిక.

శస్త్రచికిత్స చేయకూడదని ఒక నిర్దిష్ట కారణం ఉంటే తప్ప, లేకపోతే స్టేజ్ 1 మరియు 2 కేన్సర్ల శస్త్రచికిత్సని రిసెక్షన్ ద్వారా చికిత్స చేయాలి (ఉదాహరణకు, ఫిట్నెస్ స్థాయి తగ్గడం, ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేకపోవడం మొదలైనవి).
శస్త్రచికిత్స ఆపరేషన్ రకం కేన్సర్ ఉన్న ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. లోబెక్టమీ అనే ఆపరేషన్ లో కేన్సర్ ఉన్న ఊపిరితిత్తుల మొత్తం లోబ్ (లంబిక) తొలగించబడుతుంది. కుడి ఊపిరితిత్తులకు మూడు లోబ్స్, ఎడమ ఊపిరితిత్తులకు రెండు లోబ్స్ ఉంటాయి. కొన్నిసార్లు, రెండు లోబ్స్ కలిసే చోట జంక్షన్ లో కేన్సర్ ఉంటే, సెగ్మెంటల్ రెసెక్షన్ తో కూడిన లోబెక్టమీ లేదా బై-లోబెక్టమీ (రెండు లోబ్స్) చేస్తారు.

కొంతమంది రోగులకు ఒక ఊపిరితిత్తిని మొత్తం తొలగించబడే న్యుమోనెక్టమీ అవసరం.

థొరాసిక్ సర్జన్ లేదా సర్జికల్ అంకాలజిస్ట్ రోగికి అవసరమైన ఆపరేషన్ గురించి వివరిస్తారు. ఈ రకమైన శస్త్రచికిత్సలన్నీ ప్రధాన ఆపరేషన్లు, రోగులు వాటిని తట్టుకోవడానకి తగినంత ఫిట్నెస్ స్థాయిని కలిగి ఉండాలి. అందువల్ల, రోగులందరికీ ఈ శస్త్రచికిత్సని తట్టుకునే సామర్థ్యం ఉండదు.

ప్రారంభ దశలో నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్లను బాగా నియంత్రించవచ్చు, శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు. స్టేజ్ 3 నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ కి చేసే శస్త్రచికిత్స గురించి విడిగా చర్చించబడుతుంది. స్టేజ్ 4 నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ఒక ఎంపిక కాదు.

లంగ్ కేన్సర్ శస్త్రచికిత్స ని ఓపెన్ మెథడ్ ద్వారా ఛాతీపై కోత పెట్టి గానీ లేదా VATS (వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ) ద్వారా గానీ చేయవచ్చు. VATS విధానంలో ఛాతీపై చిన్న కోత పెట్టడం జరుగుతుంది. దీన్ని ప్రారంభ దశ కేన్సర్లను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ విధానంలో చేసే శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి పట్టే సమయం తక్కువగా ఉంటుంది. ఇది అన్ని రకాల లంగ్ కేన్సర్లకూ చేయదగిన ఆపరేషన్ కాదు. రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సను కొన్ని కేంద్రాల్లో కూడా ఉపయోగిస్తారు. శస్త్రచికిత్స సమయంలో, కేన్సర్ ఖచ్చితమైన స్టేజ్ ని కనుక్కోవడానికీ, అలాగే శస్త్రచికిత్స చేసిన తర్వాత చేయవలసిన తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోవడానికి సర్జన్ ఆ ప్రాంతంలోని లింఫు నోడ్స్ ని కూడా తొలగిస్తారు.

రేడియోథెరపీ అంటే కేన్సర్ కణాలను చంపడానికి ఇచ్చే హై ఎనర్జీ ఎక్స్-రేలని ఉపయోగించడం. ఈ ఎక్స్ రేలు కేన్సర్ కణాల డీఎన్ఎ ని నష్టం కలిగించడం ద్వారా వాటిని చంపుతాయి. రేడియోథెరపీ అనేది స్థానిక చికిత్స. అది ఏ ప్రాంతానికి ఇస్తే అక్కడ దాని ప్రభావం కలిగి ఉంటుంది.ఎక్స్-కిరణాలను ఉత్పత్తి చేసే ఒక పెద్ద యంత్రాన్ని (లీనియర్ యాక్సిలరేటర్) ఉపయోగించి రేడియోథెరపీ ఇవ్వబడుతుంది. ఈ విధంగా ఇది రోగికి చికిత్సను అందిస్తుంది. ఈ పద్ధతిని ఎక్స్టర్నల్ బీమ్ థెరపీ అంటారు. రేడియోథెరపీని ఇవ్వడానికి మరొక మార్గం రేడియోయాక్టివ్ సోర్సుల్ని (వనరుల్ని) చొప్పించడం. ఈ పద్ధతిని బ్రాకీథెరపీ అని పిలుస్తారు. దీనితో కొన్ని రకాల కేన్సర్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ కి రేడియోథెరపీ

నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ కి రేడియోథెరపీ ప్రధానంగా ఎక్స్టర్నల్ బీమ్ తో రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది.

స్టేజ్ 1 మరియు 2 నాన్-స్మాల్ సెల్ కేన్సర్ ఉన్నపుడు, శస్త్రచికిత్స తట్టుకునే సామర్థ్యం లేని లేదా శస్త్రచికిత్స కోరుకోని రోగులకు రేడియోథెరపీని అందిస్తారు. కణితికీ, ఊపిరితిత్తుల దగ్గర ఉన్న లింఫు నోడ్స్ కీ రేడియోథెరపీ ఇవ్వబడుతుంది. ఏ విధంగానూ టార్గెట్ మిస్ కాకుండా ఉండడానికి కణితి చుట్టూ ఉన్న సాధారణ ఊపిరితిత్తుల కణజాలం చుట్టూ ఉన్న అంచుకి కూడా చికిత్స ఇవ్వడం జరుగుతుంది.

ఆరున్నర వారాల వరకు ప్రతిరోజూ చికిత్స ఇవ్వబడుతుంది. ప్రతి రోజూ చికిత్స 10-15 నిమిషాలు ఉంటుంది.

స్టేజ్ I కేన్సర్ ఉన్న రోగులకు రేడియోథెరపీని మాత్రమే ఉపయోగిస్తారు. స్టేజ్ II నుండి స్టేజ్ IIIB ఉన్న రోగులకు రేడియోథెరపీ మరియు కెమోథెరపీ కాంబినేషన్ ఉపయోగించబడుతుంది. రేడియోథెరపీతో పాటు కెమోథెరపీని ఒకే సమయంలో ఇవ్వవచ్చు (కంకరెంట్ కెమోరేడియోథెరపీ), లేదా రోగికి అంతగా బాగా లేకపోతే, మొదట కెమోథెరపీ ఇచ్చి, తర్వాత రేడియోథెరపీ (సీక్వెన్షియల్ కెమోరేడియోథెరపీ) ఇవ్వవచ్చు. శస్త్రచికిత్స చేసిన స్టేజ్ I స్టేజ్ II రోగులకి రేడియోథెరపీని కూడా ఉపయోగిస్తారు, ట్యూమర్ మార్జిన్లు పాజిటివ్ గా ఉంటాయి (ట్యూమర్ పూర్తిగా తొలగించబడదు, అది మార్జిన్ వద్ద ఉంటుంది). స్టేజ్ 4 కేన్సర్లను రేడియోథెరపీతో కూడా చికిత్స చేస్తారు, కానీ ఆ స్థితిలో, చికిత్స తక్కువ వ్యవధి వరకే ఉంటుంది, లక్షణాలను నియంత్రించడమే లక్ష్యంగా ఉంటుంది.

రోగులకు రేడియోథెరపీ చికిత్సని అందించే వివిధ సాంకేతిక మార్గాలు ఉన్నాయి, అవి ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

కేన్సర్ కి నష్టం కలిగించే సామర్థ్యాన్ని బట్టి, ఈ పద్ధతులు ప్రధానంగా చాలా భిన్నంగా ఉంటాయి, దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) పరిమితంగా ఉంటాయి.

కొన్ని పద్ధతులు మిగతా వాటి కంటే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటాయి, ఈ పద్ధతుల మధ్య గల ధరల్లో గణనీయమైన వ్యత్యాసాలు కూడా ఉన్నాయి

3D కన్ఫర్మల్ రేడియోథెరపీ

ఇది ఒక ప్లానింగ్ విధానం. దీనిని రేడియోథెరపీ ఇవ్వడం, CT, MRI స్కాన్స్ ని ఉపయోగించి ట్యూమర్ త్రీ డైమెన్షనల్ ఇమేజ్ పొందడానికి ఉపయోగిస్తారు. ఇది ప్లానింగ్ ప్రక్రియను త్రీ డైమన్షన్స్ లో చేయడానికి అనుమతిస్తుంది.

ఇది రేడియేషన్ చికిత్సను ప్రామాణిక 2D రేడియోథెరపీ కంటే మరింత ఖచ్చితమైనదిగా ఉండేలా చూస్తుంది.

ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ (IMRT)

IMRT అనేది ఒక రకమైన కన్ఫర్మల్ ట్రీట్మెంట్ ప్లానింగ్ మరియు డెలివరీ పద్ధతి. ఇందులో రేడియేషన్ కిరణాలు కణితి ఆకారానికి తగినట్లుగా అమర్చబడి ఉంటాయి. ఇది శరీరంలోని సాధారణ నిర్మాణాల చుట్టూ ఉండే విషపదార్థాన్ని తగ్గిస్తుంది. IMRT కీ 3D కన్ఫర్మల్ రేడియోథెరపీకీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ట్యూమర్ ఆకారానికి తగినట్లుగా IMRT మరింత ఖచ్చితంగా ఆకారంలోకి మార్చవచ్చు. అందువల్ల, దుష్ప్రభావాలు తక్కువగా ఉండవచ్చు. అలాగే, IMRT తో ఒకే కణితిలోని వివిధ భాగాలకు వివిధ రేడియోథెరపీ మోతాదులను అందించే అవకాశం ఉంది. వివిధ కోణాల నుండి కణితికి అనేక రేడియేషన్ కిరణాలను ఉపయోగించడం ద్వారా IMRT జరుగుతుంది.

ఆర్క్ ఆధారిత (బేస్డ్) చికిత్స

ఆర్క్ బేస్డ్ థెరపీ (రాపిడ్ ఆర్క్, VMAT) అనేది రేడియోథెరపీని డెలివరీ చేయడం, ఇది లీనియర్ యాక్సిలరేటర్ తో ఆర్క్ మాదిరిగా రోగి చుట్టూ తిరుగుతుంది. ఈ రకమైన చికిత్స స్టాండర్డ్ IMRT కన్నా ఖచ్చితమైనది.

స్టీరియోటాక్టిక్ శరీరం రేడియోథెరపీ (SBRT) లేదా SABR (స్టీరియోటాక్టిక్ అబ్లేటివ్ రేడియోథెరపీ)

ఇది ప్రారంభ స్టేజ్ లో ఉన్న లంగ్ కేన్సర్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే రేడియోథెరపీ టెక్నిక్. చికిత్సలో చాలా అధునాతన రేడియేషన్ ప్లానింగ్ టూల్స్, అలాగే రేడియోథెరపీ యంత్రాలను ఉపయోగించడం జరుగుతుంది. అందువల్ల, రేడియోథెరపీ డెలివరీ చాలా ఖచ్చితంగా జరుగుతుంది. అంకాలజిస్ట్ కణితికి బాగా ఎక్కువ రేడియేషన్ ఇవ్వడానికి ఇది వీలు కల్పిస్తుంది. స్టాండర్డ్ రేడియోథెరపీకి 6 నుండి 7 వారాలు పడుతుంది. దాంతో పోలిస్తే SBRT తో లంగ్ కేన్సర్ చికిత్స వ్యవధి ఒకటి నుండి రెండు వారాల వరకు ఉంటుంది. కొన్ని ప్రారంభ స్టేజ్ లంగ్ కేన్సర్ రోగులకి SBRT సరిపడదు లేదా వారు శస్త్రచికిత్స చేయించుకోకూడదని నిర్ణయించుకోవచ్చు. ఈ సందర్భంలో SBRT, శస్త్రచికిత్స లాంటి ఫలితాల్నే ఇస్తుంది.

ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ (IGRT)

చికిత్స ఖచ్చితత్వాన్ని పర్యవేక్షించడానికి ఎక్స్-రే లు లేదా CT స్కానర్ల వంటి ఇమేజింగ్ సిస్టమ్స్ ని ఉపయోగించడమే ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని పిలవబడుతుంది. సాధారణంగా, స్టాండర్డ్ 3D కన్ఫార్మల్ రేడియోథెరపీలో, ప్లానింగ్ ప్రయోజనాల కోసం చికిత్స ప్రారంభించడానికి ముందు CT స్కాన్ జరుగుతుంది. IGRT లో, చికిత్స ఖచ్చితత్వాన్ని పరీక్షించడానికి ప్రతి రేడియోథెరపీ చికిత్సకు ముందు CT స్కాన్ లేదా ఎక్స్- రే చేయవచ్చు.

ఊపిరితిత్తులకి ఇచ్చే రేడియోథెరపీకి దుష్ప్రభావాలు

లంగ్ కేన్సర్ రేడియోథెరపీ దుష్ప్రభావాలను కలిగిస్తుంది, ఇది సాధారణంగా చికిత్స మూడవ వారంలో ప్రారంభమవుతుంది. వీటి తీవ్రత రోగి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. చికిత్స పూర్తయిన వారంపాటు దుష్ప్రభావాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కొన్ని వారాల తరువాత మామూలు స్థితి వస్తుంది. అవి-

  • అలసట
  • దగ్గు
  • ఊపిరి ఆడకుండా పోవడం (ఇది సంభవించవచ్చు లేదా చికిత్స ముగిసిన తర్వాత నుంచి 3-6 నెలల లోపు సంభవించవచ్చు)
  • ఛాతీలో నొప్పి
  • మ్రింగుడు పడడం కష్టంగా ఉండడం
  • స్వరంలో మార్పు

EGFR, ALK, ROS టెస్టింగ్ – టార్గెటెడ్ లేదా బయొలాజికల్ థెరపీ

ఊపిరితిత్తులకి సంబంధించిన నాన్ స్మాల్ సెల్ కార్సినోమా రోగులందరూ EGFR, ALK, ROS ​​పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్ష బయాప్సీ నమూనాలో జరుగుతుంది. ఫలితాలు రావడానికి 7-10 రోజులు పట్టవచ్చు. ఈ పరీక్ష స్టేజ్ 4 రోగులకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలలో ఏదైనా పాజిటివ్ గా వస్తే, రోగికి కెమోథెరపీ కంటే బయొలాజికల్ థెరపీ చేయవచ్చు. ఊపిరితిత్తుల అడెనోక్యార్సినోమా ఉన్న కొందరు రోగులకు, ముఖ్యంగా ధూమపానం చేయనివారికీ, మహిళలకీ EGFR అనుకూలమైనది. ఈ చికిత్సలు మాత్రల రూపంలో ఉంటాయి. కేన్సర్ ని నియంత్రించడంలోనూ, లక్షణాల్ని తగ్గించడంలో ఇవి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇవి సాధారణంగా ‌కెమోథెరపీ కంటే తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.

స్టేజ్ IV రోగులకు EGFR పరీక్ష చేసినపుడు పాజిటివ్ గా వస్తే, చేసే ఫస్ట్-లైన్ ట్రీట్మెంట్ లో జిఫిటినిబ్, ఎర్లోటినిబ్, అఫాటినిబ్ లేదా ఒసిమెర్టిబిబ్ ఇవ్వవచ్చు. ALK లేదా ROS పరీక్ష చేసినపుడు పాజిటివ్ గా వస్తే, రోగికి క్రిజోటినిబ్ అనే డ్రగ్ చికిత్సగా తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతాడు.

సర్జరీ, కీమోరేడియోథెరపి లేదా రేడియోథెరపి లాంటి ఇతర చికిత్స ఎంపికలు చేయించుకున్న దశ 1బి నుంచి 3 క్యాన్సర్లు గల మరియు ఇజిఎఫ్ఆర్ పాజిటివ్ ఉన్న రోగుల్లో, ఒసిమెర్నిబ్తో చికిత్స సూచించబడుతోంది ఎందుకంటే వ్యాధిని నియంత్రణలో ఉంచేందుకు కాల వ్యవధిని ఇది పెంచుతుంది.

ఈ మందుల వల్ల కలిగే సాధారణ దుష్ప్రభావాల్లో అలసిపోవడం, చర్మంపై ఎర్రని దద్దుర్లు, ముఖంపైన మొటిమలు, ఛాతీ, ఇతర ప్రాంతాల్లో పొక్కులు, నీళ్ల విరేచనాలు, వికారం, వాంతులు, గొంతు మంట, దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఉన్నాయి. ఒక్కోసారి కలిగే ఈ ఔషధాల దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. అప్పుడు మందులు తీసుకోవడం ఆపవలసి వస్తుంది. కేన్సర్ ప్రతిస్పందిస్తున్నంత వరకు, అది నియంత్రణలో ఉన్నంత వరకు ఈ మందులు ఇవ్వబడతాయి. ఈ మందులు వాడుతున్నప్పటికీ కేన్సర్ పెరిగినట్లయితే మళ్లీ బయాప్సీ జరుగుతుంది.

యాంటీఆంజియోజెనిక్ డ్రగ్స్

యాంటీఆంజియోజెనిక్ మందులు VEGF రిసెప్టార్ (గ్రాహకాని)కి విరుద్ధంగా పనిచేసే యాంటీబోడీస్. ఈ మందులు కేన్సర్ లో కొత్త రక్త నాళాల అభివృద్ధిని ఆపివేస్తాయి. అందువల్ల కేన్సర్ పెరగకుండా ఆపుతుంది. బెవాసిజుమాబ్ అలాంటి మందే. ఇది లంగ్ కేన్సర్ లో కెమోథెరపీతో పాటు ఉపయోగించబడుతుంది. కెమోథెరపీ పూర్తయిన తర్వాత మెయింటెనెన్స్ చేయడానికి ఇది కొనసాగుతుంది.

రోగనిరోధక చికిత్స

లంగ్ కేన్సర్ లో ఇమ్యునోథెరపీ అంటే రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థని కేన్సర్ కణాలపై పనిచేసేలా చేసి, వాటిని నాశనం చేయడానికి సహాయపడే మందుల వాడకం. ఈ డ్రగ్స్ ని చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అని పిలుస్తారు. కేన్సర్ కణాలపై PD-1 లేదా PD-L1 రిసెప్టార్లనీ, రోగనిరోధక వ్యవస్థ కణాల్నీ నిరోధిస్తాయి. నివోలుమాబ్, పెంబ్రోలిజిమాబ్, దుర్వాలుమాబ్, అటెజోలిజుమాబ్ డ్రగ్స్ ని ఇందుకు వాడతారు.

PD-L1 పరీక్ష

స్టేజ్ 4 లంగ్ కేన్సర్ ఉన్న రోగులు, అలాగే ఇతర స్టేజ్ లలో ఉన్న రోగులకి రోగనిరోధక చికిత్స చేయడానికి పరిగణిస్తారు. ఈ రోగులకు PD-L1 పరీక్ష చేయడం ముఖ్యం. పెంబ్రోలిజుమాబ్ ఆ రోగికి ఉపయోగపడుతుందా లేదా అనే విషయాన్నీ, మొదటగా చేసే చికిత్సగా దీన్ని ఉపయోగించవచ్చా లేదా అనే విషయాన్నీ, అలాగే కెమోథెరపీని ఉపయోగించిన తర్వాత దీన్ని ఇవ్వాలా లేదా అనే విషయాన్నీ ఈ పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు. బయాప్సీలో పొందిన కేన్సర్ నమూనాపై ఈ పరీక్ష జరుగుతుంది.

లంగ్ కేన్సర్ నివారణకి పెంబ్రోలిజుమాబ్ ఒక్క డ్రగ్ నే ఉపయోగించబడుతుంది లేదా కెమోథెరపీతో కలిపి ఉపయోగించబడుతుంది. దీన్ని ఫస్ట్ లైన్ సెట్టింగ్ (రోగ నిర్ధారణ చేసిన తర్వాత చేసే మొదటి చికిత్స ఎంపిక) గా ఉపయోగిస్తారు. >50% PD-L1 స్థాయి ఉన్న రోగులకు ఈ డ్రగ్ ఒక్కటీ ఉపయోగించవచ్చు. PD-L1> 1% మరియు 5 0 % కన్నా తక్కువ ఉన్న రోగులలో దీనిని కెమోథెరపీతో పాటు ఉపయోగించవచ్చు. కెమోథెరపీ పూర్తయిన తర్వాత, ఇది మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ గా ఉపయోగించబడుతుంది. కెమోథెరపీతో పాటు అటెజోలిజుమాబ్ ని ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్ గా కూడా ఇస్తారు.

నివోలుమాబ్, అటెజోలిజుమాబ్, దుర్వాలుమాబ్ వంటి ఇతర డ్రగ్స్ కి PD-L1 పరీక్ష అవసరం లేదు. కెమోరేడియోథెరపీ పూర్తయిన తర్వాత స్టేజ్ 3 లంగ్ కేన్సర్ నివారణకి దుర్వలుమాబ్ ని ఉపయోగిస్తారు.

మొత్తంమీద, లంగ్ కేన్సర్ కి రోగనిరోధక చికిత్స (ఇమ్యూనోథెరపీ) ని తట్టుకోవడం రోగికి సాధ్యమవుతుంది. ఇది కెమోథెరపీ కంటే సాధారణంగా తక్కువ విషప్రభావం కలిగి ఉంటుంది, కానీ కొన్ని తీవ్రమైన ప్రభావాలను కలిగి ఉన్న దుష్ప్రభావాలు ఉన్నాయి.

గమనించిన ఇతర మ్యుటేషన్లలో ఎంఇఎటి ఎక్స్ఆన్-14 మ్యుటేషన్ ఉంటుంది, దీనిలో కాప్మాటినిబ్ అనే ఔషధాన్ని ఉపయోగించబడుతుంది మరియు ఆర్ఇటి పునర్ఏర్పాటులో సెల్పెర్కాటినిబ్ అనే ఔషధంతో ఉపయోగించవచ్చు. అలెక్టినిబ్, వాండెటానిబ్ మరియు కాబోజాంటినిబ్ని కూడా ఆర్ఇటి పునర్ఏర్పాటు గల రోగుల్లో కూడా ఉపయోగించబడవచ్చ. ఈ వెబ్సైట్లో వివరించిన రాబోవు తరం జీన్ సీక్వెన్సింగ్ ఈ క్యాన్సర్లు గల రోగుల్లో ఈ జన్యుమపరమైన మార్పులు గుర్తించగలుగుతుంది.

నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ నిర్వహణలో కెమోథెరపీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చికిత్స జరుగుతున్న సందర్భంలో వివిధ సమయాల్లో కెమోథెరపీని ఇవ్వవచ్చు. అవి క్రింద ఇవ్వబడ్డాయి.

నియోఅడ్జువెంట్ కెమోథెరపీ

ఖచ్చితమైన రేడియోథెరపీ లేదా కొన్నిసార్లు శస్త్రచికిత్సకు ముందు కెమోథెరపీ ఇచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఈ చికిత్సను కొన్నిసార్లు కెమోరేడియోథెరపీని సహించలేని స్టేజ్ III రోగులకీ, నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ కలిగిన రోగులకీ ఇవ్వబడుతుంది. ఈ స్థితిలో ఇచ్చే కెమోథెరపీ సాధారణంగా సుమారు 3 నెలలు ఇవ్వబడుతుంది.

అనుబంధ (అడ్జువెంట్) కెమోథెరపీ

అనుబంధ కెమోథెరపీ అనేది ఖచ్చితంగా చేయదగిన ప్రాథమిక చికిత్స తర్వాత కెమోథెరపీని ఉపయోగించడం. స్టేజ్ IB మరియు 2 కేన్సర్లలో నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ అనుబంధ కెమోథెరపీ, శస్త్రచికిత్స తొలగింపు తర్వాత ఇవ్వబడుతుంది. ఇది సాధారణంగా 2 ఔషధాల కలయికతో 4 సైకిల్స్ లో ఇవ్వబడుతుంది. ప్రతి సైకిల్ 3 వారాల పాటు నడుస్తుంది, ఈ కోర్సు 3 నెలల వరకు ఉంటుంది.

నాన్ స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సరు దశ 4 కోసం కీమోథెరపి మరియు ఇమ్యునోథెరపి

దశ 4 నాన్స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సరు మరియు ఇజిఎఫ్ఆర్, ఎఎల్కె మరియు ఆర్ఒఎస్ నెగెటివ్ గల రోగులకు, లభిస్తే క్రమబద్ధ కీమోథెరపి మరియు ఇమ్యునోథెరపితో చకిత్స చేయబడుతుంది.

ఇమ్యునోథెరపి లభించని లేదా భరించలేని రోగుల్లో, చికిత్స ఎంపిక సమ్మేళన కీమోథెరపి రూపంలో ఉంటుంది. ఇది రెండు ఔషధాల సమ్మేళనం. ఊపిరితిత్తులకు స్క్వామస్ సెల్ కార్సినోమా గల రోగులకు, సిస్ప్లాటిన్ లేదా కార్బోప్లాటిన్ లాంటి ప్లాటినమ్ ఆధారిత ఔషధం సమ్మేళనంతో మరియు పాక్లీటాక్సెల్, జెమ్సిటాబైన్ లేదా వినోరెల్బైన్ లాంటి మరొక ఔషధంతో చికిత్స ఇవ్వబడుతుంది. ఇది 4 చక్రాల పాటు ప్రతి 3 వారాలకు ఒకసారి ఇవ్వబడుతుంది.
అడెనోకార్సినోమాకు, చికిత్స సిస్ప్లాటిన్ లేదా పెమెట్రెక్స్డ్తో సమ్మేళనంగా కార్బోప్లాటిన్తో చికిత్స ఉంటుంది, స్పందనను బట్టి మళ్ళీ 4-6 చక్రాల పాటు ఇవ్వబడుతుంది. కీమోథెరపి ముగిసిన తరువాత సిటి లేదా పిఇటి-సిటి స్కాన్ల్లో కనిపించిన మంచి స్పందన ఉంటే, పనిచేసినంత కాలం ప్రతి 3 వారాలకు పెమెట్రెక్స్డ్ని కొనసాగించవచ్చు.

ఇమ్యునోథెరపి లభించే మరియు అందుబాటు ధరలో ఉన్న రోగులకు, చికిత్స ఎంపికలు భిన్నంగా ఉంటాయి మరియు పిడి-ఎల్1 స్టేటస్పై ఆధారపడి ఉంటాయి. ఇది బయాప్సీ శాంపిల్పై చేయబడే పరీక్ష మరియు క్యాన్సరులో ఉన్న పిడి- ఎల్1 యొక్క స్కోరు శాతం ఇస్తుంది.

50% కంటే పిడి-ఎల్1 గల రోగులకు, పెంబ్రోలిజుమాబ్ అనే ఇమ్యునోథెరపి ఔషధంతో చికిత్స ఇవ్వబడుతుంది. ఇది ప్రతి 3 వారాలకు ఒకసారి మరియు క్యాన్సరు స్పందించినంత కాలం మరియు దీనితో నియంత్రణలో ఉన్నంత కాలం ఇంట్రావీనస్ ఇన్ఫ్యూజన్గా ఇవ్వబడుతుంది.

50% కంటే తక్కువ పిడి-ఎల్1 స్టేటస్ గల రోగులకు, చికిత్సను కీమోథెరపి ప్లస్ ఇమ్యునోథెరపి రూపంలో ఇవ్వవచ్చు. కీమోథెరపి పైన వివరించిన దానికి సారూప్యంగా ఉండొచ్చు మరియు ఇమ్యునోథెరపి ఔషధం పెంబ్రోలిజుమాబ్ దానికి చేర్చబడుతుంది. కీమోథెరపికి బెవాసిజుమాబ్ అనే మరొక ఔషధాన్ని చేర్చడం మరొక ఎంపిక.

అడెనోకార్సినోమా గల రోగుల్లో, కార్బోప్లాటిన్, పెమెట్రెక్స్డ్ మరియు బెవాసిజుమాబ్ లాంటి కీమోథెరపితో చికిత్స మరియు అటెజోలిజుమాబ్ అనే ఔషధంతో ఇమ్యునోథెరపి కూడా ఒక చికిత్స ఎంపిక.

ఈ రోగుల్లో, కీమోథెరపి 4-6 చక్రాల పాటు ఇవ్వబడుతుంది మరియు ఇమ్యునోథెరపి లేదా బెవాసిజుమాబ్ని ఉపయోగిస్తుంటే, వీటిని మెయింటెనెన్స్ చికిత్సగా కొనసాగించడం జరుగుతుంది.

పైన వివరించిన ప్రారంభ చికిత్స తరువాత వ్యాధి తిరగబెట్టిన లేదా మళ్ళీ వచ్చిన రోగులకు, ప్రత్యామ్నాయ కీమోథెరపి ఆప్షన్లను పరిగణించవచ్చు. నివోలుమాబ్తో ఇమ్యునోథెరపి లేదా ఇతర ఔషధాలను పరిగణించవచ్చు, ఒకవేళ వాటిని మొట్టమొదటిసారి ఉపయోగించకపోతే.

ఇజిఎఫ్ఆర్, ఎఎల్కె, లేదా ఆర్ఒఎస్ పాజిటివ్ మ్యుటేషన్లు లేదా దశ 4 క్యాన్సర్లు గల రోగులు జైవిక ఏజెంట్ల నుంచి ప్రయోజనం పొందుతారు. ఈ ఔషధాలను కీమోథెరపి లేదా ఇమ్యునోథెరపికి బదులుగా చికిత్సగా ఉపయోగిస్తారు. ఇజిఎఫ్ఆర్ పాజిటివ్ గల రోగులకు, ఒసిమెర్టినిబ్, గెఫిటినిబ్, ఎర్లోటినిబ్ లేదా అఫాటినిబ్తో చికిత్స చేయడం ఎంపికలు. ఈ ఔషధాలన్నీ టాబ్లెట్లుగా లభిస్తున్నాయి మరియు ఈ రోగుల్లో కీమోథెరపి కంటే తక్కువ ఉష్ప్రభావాలతో బాగా పని చేస్తాయి. మరిన్ని వివరాల కోసం జైవిక థెరపి విభాగం చూడండి.

నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ చికిత్సలో ఉపయోగించే సాధారణ మందులు

సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్, పెట్రెరెక్స్డ్, జెమ్సిటబైన్, వినొరెబైన్, ప్యాక్లిటాక్సెల్, డోసెటాక్సెల్, బెవాసిజుమాబ్, ఎర్లోటినిబ్, జెఫిటినిబ్, ఒసిమెర్టినిబ్ లేదా క్రిజోటిబిబ్. కొంతమంది రోగులలో పెంబ్రోలిజుమాబ్ వంటి ఇమ్యునోథెరపీ మందులతో కెమోథెరపీని కలపవచ్చు. అటువంటి చికిత్సల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారనేది బయాప్సీలో చేసే PD-L1 పరీక్షపై ఆధారపడి ఉంటుంది.

నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ కి చేసే కెమోథెరపీ దుష్ప్రభావాలు ఉంటాయి. అవి చికిత్సలో ఇచ్చే డ్రగ్స్ పై ఆధారపడి ఉంటాయి. వీటిలో కొన్ని దుష్ప్రభావాలను మందులతో బాగా నియంత్రించవచ్చు. కెమోథెరపీని తట్టుకునే శక్తి రోగిని బట్టి మారుతుంది. కొందరికి ఎలాంటి దుష్ప్రభావాలూ లేకుండా చాలా బాగా చికిత్సను తట్టుకోగలుగుతారు. మరికొంతమందికి దుష్ప్రభావాలు కలగవచ్చు. సాధారణ దుష్ప్రభావాలు –

  • జుట్టు ఊడడం
  • వికారం, వాంతులు
  • అలసట
  • గొంతులో నొప్పి
  • విరేచనాలు
  • మలబద్ధకం
  • చెవుల్లో గింగుర్లు తిరగడం
  • సంక్రమణ ప్రమాదం
  • రుచి మార్పులు
  • చేతులు, కాళ్ళలో జలదరింపు
  • రక్తహీనత
  • రక్తస్రావం

మళ్లీ తిరగబెట్టే లేదా పునరావృతమయ్యే నాన్-స్మాల్ కణ లంగ్ కేన్సర్ కి చికిత్స

తిరగబెట్టిన స్థాయి, రోగి దృఢత్వం, గతంలో చేసిన చికిత్సలు వంటి వాటిపై ఆధారపడి మళ్లీ తిరగబెట్టిన లేదా పునరావృతమైన నాన్-స్మాల్ కణ లంగ్ కేన్సర్ కి చికిత్స చేయవచ్చు.
సాధారణంగా ఈ స్థితిలో కెమోథెరపీ మరియు రేడియోథెరపీ ఎంపికలను ఉపయోగిస్తారు. కెమోథెరపీ డ్రగ్స్ ఎంపిక, మునుపటి చికిత్సలు, రోగి సాధారణ ఫిట్నెస్ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది.
ఈ స్థితిలో ఎండోబ్రోంకైల్ రేడియోథెరపీ లేదా క్రియోథెరపీని ఎంపిక చేసుకోవచ్చు. కేన్సర్ మళ్లీ తిరగబెట్టినపుడు, సాధారణంగా ఈ చికిత్స ఎంపికలు కేన్సర్ ని నయం చేయడం మీద కంటే కేన్సర్ లక్షణాలను నియంత్రించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి.
పైన వివరించిన విధంగా ఇమ్యునోథెరపీ కూడా ముందు చికిత్స పొందినా గానీ మళ్లీ తిరగబెట్టిన లంగ్ కేన్సర్ కి చికిత్సగా ఎంపిక చేయవచ్చు. ఇందులో ఉపయోగించగల మందులతో బాటు నివోలుమాబ్ కూడా వాడవచ్చు.