లింఫోమా

లింఫోమా

లింఫోమా అనేది లింఫటిక్ సిస్టమ్ క్యాన్సరు. లింఫటిక్ సిస్టమ్ లో శరీరం అంతటా ఉండే లింఫ్ నోడ్స్‌, ఈ లింఫ్ నోడ్స్ ని పరస్పరం కనెక్ట్‌ చేసే లింఫ్ నాళాలు ఉంటాయి. ప్లీహం, థైమస్ గ్రంథి, ఎముక మూలుగ మరియు టాన్సిల్స్‌ లాంటి అవయవాలు కూడా లింఫటిక్ సిస్టమ్ లో భాగంగా ఉంటాయి. రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలైన లింఫోసైట్స్ మరియు ఎముక మూలుగ కూడా లింఫటిక్ సిస్టమ్ లో భాగంగా ఉంటాయి.

అవయవాల నుంచి ద్రవాన్ని బయటకు పంపడం మరియు ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని కాపాడటం లింఫటిక్ సిస్టమ్ యొక్క విధి. శరీరంలోని ఒక భాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలోని నింఫ్ నోడ్స్ శరీరంలోని ఇతర భాగాలకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఆపుతాయి మరియు ఆపడానికి ప్రయత్నిస్తాయి. మామూలుగా కనిపించినట్లుగా ఇది లింఫ్ నోడ్స్ పెరగడానికి దారితీస్తుంది.

లింఫోమా రకాలు

లింఫోమా ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒక దానిని హాడ్జ్ కిన్స్ లింఫోమా అని మరియు మరొక దానిని నాన్ హాడ్జ్ కిన్స్ లింఫోమా అని అంటారు.

హాడ్జ్ కిన్స్ లింఫోమా

ఈ స్థితిని కనుగొన్న వ్యక్తి పేరు హాడ్జ్ కిన్స్ లింఫోమాకు పెట్టబడింది. సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు, ఈ లింఫోమాలో రీడ్ స్టెర్న్ బెర్గ్‌ సెల్ అనే ఒక రకం సెల్ ఉంది. ఈ లింఫోమా ఇతర లింఫోలాకు భిన్నంగా ఉంటుంది మరియు ప్రవర్తిస్తుంది మరియు నాన్ హాడ్జ్ కిన్స్ లింఫోమాకు భిన్నంగా చికిత్స చేయబడుతుంది. మొత్తం లింఫోమాస్ లో ఇది దాదాపు 20% ఉంది.

మైక్రోస్కోప్ లో ఎలా కనిపిస్తుందనే దానిని బట్టి హాడ్జ్ కిన్స్ లింఫోమా అనేక రకాలుగా ఉండొచ్చు. వీటిని ఈ కింది విధంగా వర్గీకరించవచ్చు

  • క్లాసికల్ హాడ్జ్ కిన్స్ లింఫోమా
  • నోడ్యులర్ స్లెరోసింగ్
  • మిశ్రమ సెల్యులారిటి
  • లింఫోసైట్ ప్రీడామినంట్
  • లింఫోసైట్ డిప్లీటెడ్
  • నోడ్యులర్ లింఫోసైట్ ప్రీడామినంట్ రకం

అంతర్జాతీయ డేటా 2018 ప్రకారం, 2018 లో భారతదేశంలో 9115 కొత్త హాడ్జ్ కిన్స్ లింఫోమా క్యాన్సర్లు నమోదయ్యాయి, మొత్తం క్యాన్సర్లలో దీని వాటా 0.79%.

నాన్- హాడ్జ్ కిన్ లింఫోమా

మొత్తం లింఫోమాస్ లో దాదాపు 80% నాన్-హాడ్జ్ కిన్ లింఫోమాలు ఉన్నాయి. మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు వీటిల్లో రీడ్ స్టెర్న్‌బెర్గ్‌ కణాలు ఉండవు. మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు రూపంపై ఆధారపడి ఈ లింఫోమాస్ ని మళ్ళీ అనేక ఉప రకాలుగా విభజించవచ్చు. వీటిని తక్కువ గ్రేడ్, మధ్య గ్రేడ్ మరియు అధిక గ్రేడ్ నాన్-హాడ్జ్ కిన్ లింఫోమాగా (ఎన్ హెచ్ ఎల్) కూడా వర్గీకరించవచ్చు.

నాన్-హాడ్జ్ కిన్ లింఫోమా రకాలు

నాన్-హాడ్జ్ కిన్ లింఫోమాలో అనేక రకాలు ఉండొచ్చు. కణం మూలంపై ఆధారపడి, వాటిని ఇలా వర్గీకరించవచ్చు.

  • టి సెల్ లింఫోమాస్
  • బి సెల్ లింఫోమాస్

మైక్రోస్కోప్ లో చూసినప్పుడు అవి ఎలా కనిపిస్తాయనే దానిపై ఆధారపడి కూడా వాటిని వర్గీకరించవచ్చు.
కనిపించే మామూలు రకాలు ఇవి-

  • డిఫ్యూజ్ లార్జ్‌ బి సెల్ లింఫోమా
  • మ్యాంటిల్ సెల్ లింఫోమా
  • బర్కిట్ సెల్ లింఫోమా
  • ఫోలిక్యులర్ లింఫోమా
  • లింఫోప్లాస్మాసైటిక్ లింఫోమా
  • చిన్న లింఫోసైటిక్ లింఫోమా/క్రానిక్ లింఫోసైటిక్ లింఫోమా
  • మార్జినల్ జోన్ లింఫోమా
  • ఎన్ కె మరియు టి సెల్ లింఫోమా

అంతర్జాతీయ డేటా 2018 ప్రకారం, 2018లో భారతదేశంలో 28,110 కొత్త నాన్ హాడ్జ్ కిన్ లింఫోమా క్యాన్సర్లు నమోదయ్యాయి, మొత్తం క్యాన్సర్లలో దీని వాటా 2.4%.