Neuroendocrine Tumours

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు

న్యూరోఎండోక్రిన్ వ్యవస్థ అనేది నాడీ కణాల లాంటి కణాలలాగే ఉంటూ, హార్మోన్లను ఉత్పత్తి చేయు న్యూరోఎండోక్రిన్ కణాలతో రూపొందించబడింది. ఈ హార్మోన్లు రక్తంలోకి విడుదలవుతాయి మరియు శరీరంలోని అనేక ప్రాంతాలపై ప్రభావం చూపుతాయి. న్యూరోఎండోక్రిన్ కణాలు సాధారణంగా ప్రేగు, జీర్ణాశయం, ఆహారవాహిక, ఊపిరితిత్తులు, క్లోమము మరియు కాలేయం సహా అనేక శరీర భాగాలలో ఉంటాయి.

న్యూరోఎండోక్రిన్ వ్యవస్థలో వృద్ధి చెందు ట్యూమర్లను న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు అంటారు. ఈ రకమైన ట్యూమర్లలో సగం జీర్ణనాళంలో మరియు నాలుగవవంతు ఊపిరితిత్తులలో సంభవిస్తాయి. మిగిలినవి శరీరంలోని ఇతర భాగాలలో సంభవిస్తాయి. న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు అసాధారణమైన ట్యూమర్లు మరియు అవి సంభవించే సగటు వయస్సు సుమారుగా 50-60 సంవత్సరాలు.

MEN సిండ్రోమ్, వోన్ హిప్పెల్-లిండౌ సిండ్రోమ్, న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1 మరియు ట్యూబరస్ స్క్లెరోసిస్ వంటి వంశపారంపర్య పరిస్థితులతో బాధపడుతున్నవారిలో న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు వృద్ధి చెందడానికి ప్రమాద కారకాలుగా ఉంటాయి. ధూమపానం, డయాబెటిస్ మరియు పొట్టలో పుండ్లు అయినటువంటి దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్స్ అనేవి సంభావ్య ప్రమాద కారకాలు.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు నిరపాయమైన ట్యూమర్లా లేదా ప్రాణాంతకమైనవా (క్యాన్సర్)?

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు నిరపాయమైన లేదా ప్రాణాంతక ట్యూమర్లు కావచ్చు. అవి ఏ రకమైన ట్యూమర్ రకం అనేది కణాలు ఎంత చురుకుగా విభజింపబడుతున్నాయనే దాని పెరుగుదల రేటుపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ట్యూమర్లు చాలా నెమ్మదిగా పెరుగుతాయి మరియు నిరపాయమైన ట్యూమర్ల వలె ఉంటాయి, కాగా మరికొన్ని త్వరగా పెరుగుతాయి మరియు అవి ప్రాణాంతక ట్యూమర్లు లేదా క్యాన్సర్ వంటివి.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ల గ్రేడింగ్

మైక్రోస్కోప్‌‌లో చూసినప్పుడు ట్యూమర్ల కణాల ఆకారాన్ని బట్టి ఈ ట్యూమర్లకు 1 నుండి 3 గ్రేడ్ ఇవ్వబడుతుంది. ఇవ్వబడిన Ki -67 సూచిక అనేది గ్రేడ్‌ను నిర్ణయిస్తుంది. Ki -67 చురుకుగా విభజింపబడుతున్న ట్యూమర్ల కణాల శాతాన్ని పరిగణిస్తుంది. కణాలు ఎంత ఎక్కువ విభజింపబడతాయో, Ki -67 మరియు గ్రేడ్ అంత ఎక్కువ ఉంటాయి. గ్రేడ్ 1 ట్యూమర్ కణాలు సాధారణ కణాల మాదిరిగానే కనిపిస్తాయి మరియు నెమ్మదిగా పెరుగుతాయి, కాగా గ్రేడ్ 3 ట్యూమర్ కణాలు సాధారణ కణానికి చాలా భిన్నంగా కనిపిస్తూ త్వరగా పెరుగుతాయి.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు చిన్నవిగా ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలను చూపకపోవచ్చు మరియు ఇతర కారణాల కొరకు పరీక్షలు జరుగుతున్నప్పుడు యాదృచ్ఛికంగా కనుగొనబడవచ్చు. చూపబడినపుడు లక్షణాలనేవి ట్యూమర్ యొక్క స్థానం మరియు ట్యూమర్ శరీరంలోని ఇతర భాగాలకు, ముఖ్యంగా కాలేయానికి వ్యాప్తి చెందడంపై ఆధారపడి ఉంటాయి. ఈ ట్యూమర్ల లక్షణాలు క్రింది సంబంధిత సెక్షన్లలో ఇవ్వబడ్డాయి.

ప్రధానంగా ప్రేగు నుండి వచ్చే న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ కాలేయంలోకి వ్యాపించి, రోగిలో లూజ్ మోషన్లు, అబ్డామెన్‌‌లో నొప్పి, చర్మం యొక్క ఎరుపుదనం మరియు ఫ్లషింగ్, దడ మరియు శ్వాసలో ఇబ్బంది కలుగజేయు రసాయనాలను (సెరోటోనిన్) ఉత్పత్తి చేసేటప్పుడు కార్సినోయిడ్ సిండ్రోమ్ ఏర్పడుతుంది.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు ఉన్నట్లు అనుమానించబడినప్పుడు, ట్యూమర్ యొక్క ప్రత్యేక రకాన్ని గురించి తెలుసుకోవడం, శరీరంలోని వివిధ భాగాలకు దాని వ్యాప్తి మరియు చికిత్సకు దాని సాధ్యమైన ప్రతిస్పందన గురించి రోగ నిర్ధారణ చేయడానికి అనేక పరీక్షలు చేయబడవచ్చు. ముఖ్యమైన పరీక్షలు క్రింద ఇవ్వబడ్డాయి.

మూత్ర పరీక్షలు

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు మూత్రంలో కనుగొనబడు సెరోటోనిన్ వంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి రోగ నిర్ధారణ చేయడానికి లేదా చికిత్సకు ప్రతిస్పందనను అంచనా వేయడానికి సహాయపడతాయి. మూత్రంలో పరీక్షించబడు పదార్ధం 5-HIAA లేదా 5 హైరాక్సీ ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం. రోగి 24 గంటలకు పైగా ఉత్పత్తి చేసిన మొత్తం మూత్రాన్ని ఒక సీసాలో సేకరించి అంచనా కోసం ప్రయోగశాలకు పంపబడుతుంది. ఈ మూత్రాన్ని సేకరించే ముందుగా, టమాటాలు, వంకాయలు, అరటిపండ్లు, ఆల్కహాల్, టీ, కాఫీ, పైనాపిల్ మరియు గింజలతో సహా కొంత మొత్తంలో సిరోటోనిన్ కలిగిన ఆహారాన్ని తినకూడదని రోగికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించబడుతుంది. మూత్రం సేకరించే కంటైనర్ ల్యాబ్ వారు ఇస్తారు.

రక్త పరీక్షలు

సాధారణంగా రక్త పరీక్షలు ట్యూమర్ల నిర్ధారణకు మరియు చికిత్సకు ప్రతిస్పందనను అంచనా వేయడానికి జరుగుతాయి. సాధారణ రక్త పరీక్షలలో CBP, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ పరీక్షలతో పాటు క్రోమోగ్రానిన్ A మరియు B వంటి ఇతర పరీక్షలు ఉంటాయి. ఇది ఈ ట్యూమర్ల ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ మరియు ఇది రక్తంలో పెరిగినప్పుడు రోగ నిర్ధారణకు సహాయపడుతుంది. రోగి చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారా లేదా ప్రారంభ చికిత్స తదనంతరం ట్యూమర్ తిరిగి వస్తుందో లేదో తెలుసుకోవడానికి కూడా ఈ పరీక్ష ఉపయోగించబడుతుంది.

ఇన్సులిన్, గ్లూకాగాన్, సెరోటోనిన్, గ్యాస్ట్రిన్ మరియు VEP స్థాయిలను చూడటం కొరకు ఇతర రక్త పరీక్షలు చేయబడతాయి. ఈ రసాయనాలను కొన్ని రకాల న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లలో వృద్ధి చేయవచ్చు.

అల్ట్రాసౌండ్ స్కాన్

అల్ట్రాసౌండ్ స్కాన్‌‌లు చిత్రాలను రూపొందించడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తాయి మరియు రొమ్ము మరియు ఇతర క్యాన్సర్ల నిర్ధారణలో సాధారణంగా ఉపయోగించబడతాయి. ఈ స్కాన్‌‌లు చవకగా మరియు ప్రమాదకరం కానివిగా ఉంటాయి కానీ ఇతర స్కాన్‌‌ల మాదిరిగా కొన్ని క్యాన్సర్లను గుర్తించడంలో అంత ఉత్తమమైనవి కాకపోవచ్చు.

CT స్కాన్

CT స్కాన్ అంటే స్కాన్ చేయబడిన శరీర భాగం యొక్క త్రీ-డైమెన్షనల్ చిత్రాన్ని ఇవ్వడానికి ఎక్స్-రే లను ఉపయోగించే ఒక స్కాన్. క్యాన్సర్‌ను నిర్వహించడంలో మరియు ప్రదర్శించడంలో ఇది ఎక్స్‌రే కంటే చాలా ఖచ్చితమైనది. మంచి చిత్రాలను పొందదానికి స్కాన్‌కు ముందుగా సిరలోకి ఇంజెక్షన్ ఇవ్వడాన్ని కాంట్రాస్ట్‌ ఎన్‌‌హాన్స్‌డ్ స్కాన్ అంటారు. అబ్డామెన్‌‌ను స్కాన్ చేస్తున్నప్పుడు రోగికి తాగడానికి ఓరల్ కాంట్రాస్ట్ ఇవ్వబడుతుంది. CT స్కాన్ చేయడానికి కొద్ది నిమిషాలు మాత్రమే పడుతుంది. కొన్ని బయాప్సీలు చేసినప్పుడు వైద్యుడికి మార్గనిర్దేశం చేయడానికి కుడా CT స్కాన్ ఉపయోగపడుతుంది.

MRI స్కాన్

MRI స్కాన్ అనేది చిత్రాలను రూపొందించడానికి అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తుంది మరియు క్యాన్సర్‌ను నిర్ధారించడానికి మరియు స్టేజ్ చేయడానికి చాలా తరచుగా ఉపయోగించబడుతుంది. ఈ స్కాన్ కొన్ని రకాల క్యాన్సర్ల కోసం చేయబడుతుంది. మెదడు, వెన్నెముక మరియు కటి (అబ్డామెన్ యొక్క దిగువ భాగం) వంటి ప్రాంతాలలో CT కంటే MRI మెరుగైన చిత్రాలను ఇస్తుంది. స్కాన్ చేస్తున్నప్పుడు క్లాస్ట్రోఫోబిక్‌‌గా అనిపించవచ్చు గనుక కొంతమంది రోగులకు MRI స్కాన్‌‌ ఇబ్బందిగా అనిపిస్తుంది. MRI స్కాన్‌ల కొరకు 20 నిమిషాల నుండి గంట వరకు సమయం పడుతుంది. మెరుగైన చిత్రాలను పొందడానికి స్కాన్ సమయంలో కాంట్రాస్ట్ ఏజెంట్ ఇంజెక్ట్ చేయబడుతుంది. స్కాన్ క్రమాలుగా జరుగుతుంది మరియు సాధారణంగా క్యాన్సర్ రోగులలో ఒక స్కాన్‌లో చాలా క్రమాలు జరుగుతాయి.

PET-CT స్కాన్

ఈ రకమైన స్కాన్, స్కాన్‌కు ఫంక్షనల్ ఎలిమెంట్‌‌ను కలిగి ఉండటం వలన స్టాండర్డ్ CT స్కాన్‌కు భిన్నంగా ఉంటుంది. స్కాన్ యొక్క PET కాంపొనెంట్ క్యాన్సర్లు, ఇన్ఫెక్షన్, మంట వంటి కణాలు వేగంగా విభజన చెందు శరీరంలోని ప్రాంతాలను గుర్తించగలదు. కొన్ని క్యాన్సర్లను నిర్వహించడంలో CT స్కాన్ కంటే PET-CT స్కాన్ మంచిది. మొదట రేడియోలేబుల్ చేయబడిన పదార్థాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా స్కాన్ యొక్క PET భాగం జరుపబడి, తరువాత స్కాన్ చేయబడుతుంది. ఈ పదార్ధం విభజన కణాల ద్వారా తీసుకోబడుతుంది మరియు స్కాన్‌‌లో కనిపిస్తుంది.

మనకు వివిధ రకాల PET-CT స్కాన్‌‌లు ఉన్నాయి మరియు వ్యత్యాసం అనేది వేగవంతమైన విభజన కణాలను గుర్తించడానికి ఉపయోగించే రేడియోలేబుల్ ట్రేసర్ రకంలో ఉంటుంది. స్టాండర్డ్ PET-CT స్కాన్ అనేది 18ఫ్లోరిన్‌‌ను ఉపయోగించే FDG PET స్కాన్. న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లలో ఉపయోగించు ఇతర ట్రేసర్లు, కోలిన్ C -11, 11C మెథియోనిన్, 18F లేబుల్ కోలిన్, గాలియం 68 లేబుల్డ్ సోమాటోస్టాటిన్ అనలాగ్ స్కాన్‌‌లు. సాధారణంగా PET-CT స్కాన్ క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి మరియు వ్యాధిని ఖచ్చితంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. అన్ని క్యాన్సర్లు PET-CT స్కాన్‌‌లో కనిపించవని గమనించవలసి ఉంటుంది. కొన్ని క్యాన్సర్లు ఇతర క్యాన్సర్ల మాదిరిగా రేడియోయాక్టివ్ ట్రేసర్‌ను తీసుకోవు గనుక కొన్ని క్యాన్సర్లలో మాత్రమే PET-CT ని ఖచ్చితమైన పరిశోధనగా సిఫార్సు చేస్తారు.

రేడియోయాక్టివ్ స్కాన్‌‌లు

రేడియోయాక్టివ్ ట్రేసర్ల వాడకంతో జతపరచు స్కాన్‌‌లు న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ల రోగ నిర్ధారణ మరియు చికిత్సలో ఉపయోగించబడతాయి. ఈ ట్యూమర్లలో కొన్ని ఈ రేడియోయాక్టివ్ పదార్ధాలను శోషిస్తాయి మరియు వీటిని తరువాత స్కాన్‌‌లలో చూడవచ్చు. సాధారణ స్కాన్‌‌లలో చూడలేని చిన్న ట్యూమర్లను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఉపయోగించే సాధారణ రేడియోధార్మిక ట్రేసర్లలో ఆక్ట్రియోటైడ్, mIGB(మెటైయోడోబెంజైల్గువానిడిన్), గాలియం డోటాటేట్ (PET) ఉంటాయి. రేడియోయాక్టివ్ పదార్థాలు సాధారణంగా సిరలోకి చొప్పించబడతాయి మరియు కొంత సమయం తరువాత గామా కెమెరా అని పిలువబడే స్కానింగ్ మెషిన్‌‌తో శరీరంలోని చిత్రాలు తీయబడతాయి.

బయాప్సి

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ రోగ నిర్ధారణను నిర్ధారించడానికి బయాప్సి చేయబడుతుంది. బయాప్సి అనేది ఒక చిన్న సూదిని ట్యూమర్‌‌లోనికి పంపి కొన్ని కణాలు తీసుకోబడే ఒక FNAC నుండి ట్యూమర్ యొక్క ఒక చిన్న భాగం పెద్ద సూదితో శాంపుల్ చేయబడే కోర్ బయాప్సీగా వివిధ రకాలుగా ఉంటుంది. ట్యూమర్ పూర్తిగా తొలగించబడే ఎక్సిషన్ బయాప్సి కుడా ఉపయోగించబడుతుంది. బయాప్సి అనేది అల్ట్రాసౌండ్ స్కాన్, CT స్కాన్ సహాయంతో చేయబడుతుంది లేదా ట్యూమర్ ఉన్న ప్రదేశాన్ని బట్టి, బయాప్సి తీసుకోవటానికి ఎండోస్కోపీ, కోలనోస్కోపీ లేదా బ్రోంకోస్కోపీ చేయబడుతుంది.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ల చికిత్స ప్రైమరీ ట్యూమర్ స్థానం, ట్యూమర్ రకం మరియు శరీరంలోని వివిధ భాగాలకు ట్యూమర్ వ్యాప్తి యొక్క ఉనికిపై ఆధారపడి ఉంటుంది. చికిత్స యొక్క ప్రధాన ఎంపికలు ఇలా ఉంటాయి:

  • సర్జరీ
  • డ్రగ్ థెరపీ
  • రేడియేషన్ థెరపీ
  • రేడియోన్యూక్లైడ్ చికిత్స
  • స్థానిక థెరపీ

సర్జరీ

ఇది చిన్నగా ఉండి మరియు సర్జరీకి సౌకర్యంగా ఉండే ట్యూమర్ల చికిత్స ఎంపిక. నెమ్మదిగా పెరుగుతూ మరియు ఒకే ప్రాంతానికి పరిమితం అయిన చాలా న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లలో, సర్జరీ అనేది చికిత్సగా ఒక అవసరం. దాని చుట్టూ సాధారణ కణజాల ప్రదేశం కలిగిన ట్యూమర్‌‌ని పూర్తిగా తొలగించడమే ఆపరేషన్ లక్ష్యం. ట్యూమర్ స్థానాన్ని బట్టి, సర్జరీ వివిధ రకాలుగా ఉంటుంది.

ఊపిరితిత్తుల ట్యూమర్లలో, సర్జరీలో ఊపిరితిత్తుల కొంత భాగాన్ని (లోబ్ తొలగించబడుతుంది) లేదా మొత్తం ఊపిరితిత్తులు తొలగించబడతాయి. జీర్ణాశయం యొక్క ట్యూమర్ల కొరకు జీర్ణాశయం యొక్క ఒక భాగం లేదా మొత్తం జీర్ణాశయం తొలగించబడుతుంది. చిన్న లేదా పెద్ద ప్రేగు యొక్క ట్యూమర్ల కొరకు, ప్రేగు యొక్క ఒక భాగం లేదా ప్రేగు మొత్తం తొలగించబడుతుంది. క్లోమము లేదా పిత్తాశయం మరియు పిత్త వాహిక వంటి పిత్త నాళం యొక్క ట్యూమర్ల కొరకు విప్పల్ ప్రక్రియ అని పిలువబడే ఒక రకమైన ఆపరేషన్ జరుగుతుంది. ఆంత్రమూలం లేదా జీర్ణాశయంలో ఉన్నవారికి అదే సర్జరీ చేయవచ్చు. కాలేయంలో మాత్రమే ఉండే ట్యూమర్లలో కాలేయంలోని కొంత భాగం తొలగించబడుతుంది. థైరాయిడ్ గ్రంథిలో ట్యూమర్లు ఉన్నట్లయితే అది తొలగించబడుతుంది.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లను తొలగించే సర్జరీలో ట్యూమర్ ఉనికిని చూడటానికి చుట్టుపక్కల శోషరస కణుపులను తొలగించడం కూడా జరుగుతుంది. ఇది ట్యూమర్‌‌ని మరింత ఖచ్చితంగా నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు చికిత్స తర్వాత ఫలితాన్ని బాగా అంచనా వేయడంలో సహాయపడుతుంది.

అన్నింటినీ తొలగించలేనప్పుడు ఎక్కువ శాతం వ్యాధిని తగ్గించడానికి కుడా సర్జరీ చేయవచ్చు. మందులు లేదా రేడియోథెరపీ వంటి ఇతర చికిత్సల ప్రభావాన్ని పెంచడానికి ఇది సహాయపడుతుంది. శరీరంలోని వివిధ భాగాలకు ట్యూమర్ వ్యాపించినటువంటి కొంతమంది రోగులలో, క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను మెరుగుపరచదానికి సర్జరీ చేయవచ్చు.

మందుల చికిత్స

ట్యూమర్ ద్వారా ఉత్పత్తి అయ్యే లక్షణాలను పరిమితం చేయడానికి మరియు దానిని అదుపులో ఉంచడానికి న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లు లేదా క్యాన్సర్లకు చికిత్స చేయడానికి మందులు ఉపయోగిస్తారు.

సోమాటోస్టాటిన్ అనలాగ్‌లు అనేవి కార్సినోయిడ్ సిండ్రోమ్‌లో చికిత్సలో సాధారణంగా ఉపయోగించే మందులు. ప్రధానంగా ప్రేగు నుండి వచ్చే న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ కాలేయంలోకి వ్యాపించి, రోగిలో లూజ్ మోషన్లు, అబ్డామెన్‌‌లో నొప్పి, చర్మం యొక్క ఎరుపుదనం మరియు ఫ్లషింగ్, దడ మరియు శ్వాసలో ఇబ్బంది వంటి వివిధ లక్షణాలను కలిగించే రసాయనాలను (సెరోటోనిన్) ఉత్పత్తి చేస్తుంది.

సాధారణంగా ఉపయోగించే సోమాటోస్టాటిన్ అనలాగ్‌లు ఆక్ట్రియోటైడ్ మరియు లాన్రియోటైడ్. రెండు మందులు చర్మం కింద ఇంజెక్షన్లుగా ఇవ్వబడతాయి. స్వల్పకాలికంగా పనిచేసే ఆక్ట్రియోటైడ్‌‌ రోజువారీగా మరియు దీర్ఘకాలికంగా పనిచేసే ఆక్ట్రియోటైడ్‌‌ ప్రతి 4 వారాలకు ఒకసారి ఇవ్వబడుతుంది. లాన్రియోటైడ్ ధీర్ఘకాలికంగా మాత్రమే పనిచేస్తుంది మరియు ప్రతి 4 వారాలకు ఇవ్వబడుతుంది.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లలో కీమోథెరపీని తక్కువగా ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా వేగంగా పెరుగుతూ క్యాన్సర్‌‌లా ప్రవర్తించు హై గ్రేడ్ ట్యూమర్లలో ప్రభావవంతంగా ఉంటుంది. ట్యూమర్‌‌ని నియంత్రించడం, లక్షణాలు మరియు మనుగడను మెరుగుపరచడం కీమోథెరపీ ఉద్దేశ్యం.

బయోలాజికల్ డ్రగ్స్ లేదా టార్గెటెడ్ థెరపీలో క్యాన్సర్ కణాలలో నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే మందుల వాడకం ఉంటుంది మరియు దీనిని కొన్ని రకాల న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లలో వాడవచ్చు. ఈ సెట్టింగ్‌లో ఎవెరోలిమస్ మరియు సునిటినిబ్ వంటి మందులు వ్యాధిని నియంత్రించడానికి మరియు లక్షణాలు మరియు రోగి యొక్క మనుగడను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

రేడియోథెరపీ

లీనియర్ యాక్సిలరేటర్ ఉపయోగించి డెలివర్ చేయబడిన ఎక్స్టర్నల్ బీం రేడియోథెరపీ రూపంలోని రేడియోథెరపీ కొన్ని న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లకు, ప్రధానంగా ఎముకలకు వ్యాపించిన వాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఎముకల నుండి వచ్చే నొప్పిని తగ్గించడంలో చికిత్స సహాయపడుతుంది.

రేడియోన్యూక్లైడ్ థెరపీ

ఇది ట్యూమర్ లేదా క్యాన్సర్ కణానికి అనుసంధానించబడిన అణువుతో జతచేయబడు లేదా కలుపబడు రేడియో ఐసోటోప్‌ను ఉపయోగించి చేసే టార్గెటెడ్ రేడియోథెరపీ. అటువంటి మందులు ఇచ్చినప్పుడు, అవి ట్యూమర్‌‌చే తీసుకోబడి, రేడియోన్యూక్లైడ్ ట్యూమర్ కణం చుట్టూ ఉన్న ప్రాంతంలో రేడియేషన్ మోతాదును అందించి దానిని చంపడం లేదా దెబ్బతీయడం చేస్తుంది. ఇటువంటి చికిత్సను పెప్టైడ్ రిసెప్టర్ రేడియోలిగాండ్ థెరపీ (PRRT) అని కూడా అంటారు.

అటువంటి చికిత్సను పరిశీలించే ముందుగా, ట్యూమర్ సోమాటోస్టాటిన్ తీసుకుంటుందో లేదో తెలుసుకోవడానికి సోమాటోస్టాటిన్‌తో రేడియోన్యూక్లైడ్ స్కాన్ చేయబడుతుంది. ఈ పదార్ధం తీసుకోబడితే, ఈ చికిత్సలు పని చేయగలవు.

సాధారణంగా ఉపయోగించే చికిత్సలు లుటిటియం Lu-177 డోటాటేట్ మరియు Yttrium-90 డోటాటోక్. ఏ మందును ఉపయోగించాలో కేంద్రంలో సమ్మేళనం లభ్యతపై ఆధారపడి ఉంటుంది. రోగికి ఉపయోగకరంగా ఉన్నట్లు గుర్తించినట్లయితే ఈ మందులతో మళ్ళీమళ్ళీ చికిత్సలు ఇవ్వవచ్చు.

స్థానిక చికిత్సలు

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్లలో చికిత్సకు ఒక ఎంపికగా ఎక్కువ వ్యాధి గల ప్రాంతానికి స్థానికంగా సూచించబడే చికిత్స. కాలేయంలో ఎక్కువ శాతం వ్యాధి ఉన్నప్పుడు ఈ ఎంపిక ప్రధానంగా ఉపయోగించబడుతుంది.

హెపాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది, ట్యూమర్ యొక్క అధిక భాగం ఉన్న కాలేయంలోని భాగానికి రక్త సరఫరాను అందించే ధమనిలోకి మందులను ఇంజెక్ట్ చేసే ప్రక్రియ. ఈ ఇంజెక్షన్ ధమనిని అడ్డుకుని ట్యూమర్‌‌కి రక్తం మరియు పోషక సరఫరాను తగ్గించి దాని పరిమాణాన్ని తగ్గిస్తుంది. ట్యూమర్‌‌కి స్థానికంగా కీమోథెరపీని అందించడానికి కీమోథెరపీ మందులను హెపాటిక్ ధమనిలోకి ప్రవేశపెట్టవచ్చు. దీనిని కీమోఎంబోలైజేషన్ అంటారు.

రేడియోఎంబోలైజేషన్ అనేది రేడియోయాక్టివ్ న్యూక్లైడ్ ట్యూమర్‌‌కి రేడియోథెరపీని అందించడానికి స్థానికంగా హెపాటిక్ ధమనిలోకి చొప్పించబడు అదే రకమైన ప్రక్రియ.

రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది కాలేయంలోని వ్యాధి ఉన్న ప్రాంతానికి రేడియోఫ్రీక్వెన్సీ ప్రోబ్‌ను వర్తింపజేసి మరియు దానిని చంపడానికి ట్యూమర్‌‌కి వేడిని అందిస్తుంది.

ఈ చికిత్సలలో దేనిని ఎంచుకోవాలనేది స్థానిక నైపుణ్యం మరియు లభ్యతపై ఆధారపడి ఉంటుంది.