Skin Cancer

చర్మ కేన్సర్

చర్మం

చర్మం శరీరాన్ని కప్పే బాహ్య పొర, ఇది శరీరంలో అతిపెద్ద అవయవం. చర్మం పొరలతో ఏర్పడుతుంది. బాహ్య పొరను ఎపిడెర్మిస్ అని, లోపలి పొరను డెర్మిస్ అంటారు. డెర్మిస్ క్రింద ఉండే కణజాలాన్ని సబ్‌క్యుటేనియస్ కణజాలం అని పిలువబడుతుంది ఇది క్రొవ్వు, రక్త నాళాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. వాటి క్రింద కండరాలు, ఇంకా ఇతర నిర్మాణాలతో కూడిన అవయవాలు ఉంటాయి.

చర్మ కేన్సర్

చర్మం నుండి ఉత్పన్నమయ్యే కేన్సర్‌ను చర్మ (స్కిన్) కేన్సర్ అంటారు. శరీరంలోని ఇతర భాగాలలో ప్రారంభమయ్యే కేన్సర్లు చర్మానికి వ్యాపించిన సందర్భాలు ఉంటాయి. వీటిని సెకండరీ స్కిన్ కేన్సర్ అంటారు. ఈ విభాగంలో మనం చర్మంలో ప్రాథమిక చర్మ కేన్సర్ గురించి తెలుసుకుంటాము.

చర్మ కేన్సర్ రకాలు

వివిధ రకాల చర్మ కేన్సర్లు ఉన్నాయి, సాధారణమైనవి ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

  • బేసల్ సెల్ కార్సినోమా
  • స్క్వామస్ సెల్ కార్సినోమా
  • మాలిగ్నెంట్ మెలనోమా
  • ఇతర అసాధారణ చర్మ కేన్సర్లలో చర్మంపై లింఫోమా, మెర్కెల్ సెల్ కార్సినోమా ఉన్నాయి.

కాకేసియన్ జనాభాలో చర్మ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది భారతదేశంలో మరీ సాధారణంగా కనిపించే వ్యాధి కాదు. ఈ క్రింది ప్రమాద కారకాల వల్ల చర్మ కేన్సర్ అభివృద్ధి చెందుతుంది.

UV ఎక్స్పోజర్

సూర్య కిరణాలు లేదా UV కిరణాలకు ఎక్కువసేపు గురికావడం చర్మ కేన్సర్‌కు ప్రమాద కారకం. ఈ విధమైన ఎక్స్పోజర్ సాధారణంగా కేన్సర్ అభివృద్ధికి చాలా సంవత్సరాల ముందు నుంచీ ఉండి ఉంటుంది.

రేడియేషన్

గతంలో రేడియేషన్ లేదా రేడియోథెరపీకి గురికావడం స్కిన్ కేన్సర్ ప్రమాద కారకమవుతుంది. ఈ ఎక్స్పోజర్ ఇతర కేన్సర్లకు లేదా రేడియేషన్ ఉన్న పరిస్థితులకు చికిత్స నుండి రావచ్చు.

రోగనిరోధక శక్తిని అణచిపెట్టడం

వ్యాధి కారణంగా లేదా మందుల వల్ల (అవయవ మార్పిడి తర్వాత) శరీర రోగనిరోధక శక్తిని అణచివేయడం చర్మ కేన్సర్ అభివృద్ధికి ప్రమాద కారకంగా ఉంటుంది.

దీర్ఘకాలిక అల్సర్లు

చర్మంపై దీర్ఘకాలికంగా అల్సర్లు ఉండటం చర్మ కేన్సర్ అభివృద్ధికి ప్రమాద కారకంగా ఉంటుంది.

కెమికల్స్

ఆర్సెనిక్ వంటి రసాయనాలకు గురికావడం ప్రమాదాన్ని పెంచుతుంది.

స్కిన్ కేన్సర్ ఉన్న రోగిలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.

చర్మంపై గడ్డ లేదా పుండు

బేసల్ సెల్ కార్సినోమా (BCC) లేదా స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC) చర్మంపై గడ్డలుగా గానీ లేదా అల్సర్ల వలె గానీ కనిపిస్తాయి. BCC ఒక చీకటి, గోధుమ లేదా నల్ల రంగు గడ్డలా ఉంటుంది. ఇది తల, ముఖం లేదా మెడ వంటి శరీరంలోని కొంత భాగంపై బయటికి కనిపించే విధంగా ఉంటుంది. ఈ భాగాలపై ఒక చారలా ఏర్పడి పెరుగుతుంది, అక్కడ నుంచి రక్తస్రావం కావచ్చు లేదా నయం చేయడానికి ప్రయత్నించవచ్చు కానీ ఇవి పూర్తిగా నయం కావు. అవి దురద పెడతాయి లేదా పొలుసులు ఏర్పడి ఉంటాయి. SCC పుండు లాగా ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది కొన్నిసార్లు రక్తస్రావం కావచ్చు.
మెలనోమా అనేది సాధారణంగా ముదురు రంగులో ఉంటుంది. రోగి అకస్మాత్తుగా ఒక పుట్టుమచ్చ పరిమాణంలో మార్పు రావడం, రంగు మారడం, దురద, రక్తస్రావం లేదా అపసవ్యమైన అంచు కలిగి ఉండటం గమనించవచ్చు. ఒక పుట్టుమచ్చ అంతకు ముందు లేని విధంగా శాటిలైట్ లంప్స్ ని అభివృద్ధి చేయవచ్చు.

లింఫ్ నోడ్స్ (శోషరస కణుపుల) విస్తరణ

అప్పుడప్పుడు, రోగులు ఈ ఏరియాలో విస్తరించిన లింఫ్ నోడ్స్ ని గమనించవచ్చు, ఇది మొదట గుర్తించబడే లక్షణం కావచ్చు.

ఇతర లక్షణాలు

బరువు తగ్గడం, అలసట, ఆకలి తగ్గడం, పొత్తికడుపు వాపు, దగ్గు, ఊపిరి సలపకపోవడం వంటి ఇతర లక్షణాలు ముఖ్యంగా మెలనోమా వ్యాధి బాగా ముదిరినప్పుడు కనిపిస్తాయి.

విజువల్ ఇన్‌స్పెక్షన్, పరీక్ష

స్కిన్ కేన్సర్ గా అనుమానం ఉంటే, అవసరమైతే డెర్మోస్కోప్ ఉపయోగించి పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు.

బయాప్సీ

స్కిన్ కేన్సర్ గా నిర్ధారణ చేయడానికి అనుమానాస్పద వ్రణానికి బయాప్సీ చేయడం అవసరం. బయాప్సీ వివిధ రకాలుగా ఉంటుంది.
పంచ్ బయాప్సీ లో చర్మంపై కనిపించే పెరుగుదల నుంచి చిన్న నమూనాను తీసుకోవడం జరుగుతుంది.
ఎక్సిషన్ బయాప్సీలో సాధారణ చర్మం మార్జిన్‌తో అసాధారణ ప్రాంతాన్ని తొలగించడం జరుగుతుంది. ఈ రకమైన బయాప్సీ రోగ నిర్ధారణని బట్టీ, పరిస్థితిని బట్టీ చికిత్స ప్రయోజనాన్ని అందిస్తుంది.
కేన్సర్ లాగా కనిపించే చర్మ పరిస్థితులు చాలా ఉంటాయని గమనించడం ముఖ్యం. అటువంటి పరిస్థితిపై అనుమానం ఉంటే, బయాప్సీతో సహా తదుపరి పరీక్షల కోసం స్కిన్ స్పెషలిస్ట్‌ను చూడడం మంచిది.

స్కాన్స్

మెలనోమా లేదా స్క్వామస్ సెల్ కార్సినోమా ముదిరిన చర్మ కేన్సర్ వచ్చిందని అనుమానం ఉంటే, CT స్కాన్ లేదా PET-CT స్కాన్ వంటి స్కాన్స్ చేసి శరీరంలోని ఇతర భాగాలకు కేన్సర్ సోకిందేమో చూడమని అభ్యర్థించవచ్చు. ఇటువంటి స్కాన్లు కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి.

జన్యు పరమాణు పరీక్ష

మెలనోమాలో, ముఖ్యంగా ముదిరిన లేదా మెటాస్టాటిక్ మెలనోమా సందర్భంలో, మ్యుటేషన్స్ కోసం బయాప్సీ శాంపిల్ పై జెనెటిక్ టెస్టింగ్ జరుగుతుంది. కేన్సర్ లో నిర్దిష్ట మ్యుటేషన్స్ ఉనికిని బట్టి చికిత్స వ్యూహాలు భిన్నంగా ఉంటాయి.

ఎంపికలు భిన్నంగా ఉంటాయి కాబట్టి చర్మ కేన్సర్ చికిత్సను నాన్-మెలనోమా మరియు మెలనోమా అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ విభాగం నాన్-మెలనోమా స్కిన్ కేన్సర్ చికిత్స గురించి తెలియజేస్తుంది.

సర్జరీ

సాధారణంగా సర్జరీతో చర్మ కేన్సర్‌ను తొలగించడమే చికిత్స ఎంపికగా ఉంటుంది. ఈ ఎంపికను ఎంచుకున్నప్పుడు, సాధారణ చర్మం మార్జిన్‌తో పాటు కేన్సర్ తొలగించబడుతుంది. సర్జరీ ఎల్లప్పుడూ చికిత్సలో ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు. ఇది కేన్సర్ ఉన్న ప్రదేశంపైన, రోగి లేదా రోగి ఫిట్నెస్, అలాగే రోగి ఎంచుకునే మరొక ఎంపిక పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, చర్మంలోని లోపాన్ని పూరించడానికి వ్యాధిగ్రస్తమైన ప్రాంతాన్ని తొలగించిన తరువాత స్కిన్ గ్రాఫ్ట్ చేయడం లేదా ఇతర రకాల రీకనస్ట్రక్షన్ అవసరమవుతుంది. చిన్న కేన్సర్లకు స్థానిక ఎనస్థీషియాతో సర్జరీ జరుగుతుంది. స్పష్టమైన మార్జిన్‌లను నిర్ధారించడానికి మోహ్స్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ అని పిలువబడే ఒక ప్రత్యేక రకం సర్జరీ జరుగుతుంది. కొన్ని SCC ల చికిత్సలో, సర్జన్ కేన్సర్ లింఫు నోడ్స్ లోకి కూడా సోకిందేమో అదే సమయంలో చూసి ఆ చుట్టుపక్కల గల లింఫ్ నోడ్స్ ని తొలగించవచ్చు.

రేడియోథెరపీ

సర్జరీ లాగానే రేడియోథెరపీ, చర్మ కేన్సర్ కి BCC లేదా SCC వంటి మరొక నివారణ ఎంపిక. కేన్సర్ సున్నితమైన ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వల్లనూ, సర్జరీ సాధ్యం కానప్పుడూ లేదా రోగి ఆపరేషన్‌కు బదులుగా ఈ ఎంపికను ఎంచుకుంటారు లేదా ఆపరేషన్‌ చేయడం సాధ్యం కాకపోతే రేడియోథెరపీ తరచుగా ఉపయోగించబడుతుంది. పరిస్థితిని నయం చేయడానికి సర్జరీ, రేడియోథెరపీ రెండూ సమానమైన అవకాశాన్ని కలిగి ఉంటాయి. రేడియోథెరపీని ఉపయోగించినప్పుడు, ఇది ప్రతిరోజూ ఇవ్వబడుతుంది, వారానికి ఐదు రోజులు చొప్పున 4-6 వారాలు ఇవ్వడం జరుగుతుంది. తేలికపాటి దుష్ప్రభావాలు కొన్ని వారాలలో పరిష్కరించబడతాయి. చర్మ కేన్సర్‌కు రేడియోథెరపీ ఇతర కేన్సర్‌లకు భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో తక్కువ శక్తి గల రేడియోథెరపీ లేదా ఎలక్ట్రాన్స్ ఉపయోగించబడతాయి. వీటికి ప్రామాణిక రేడియోథెరపీ కంటే తక్కువగా చొచ్చుకుపోతాయి. ఇది ప్రధానంగా చర్మంపై మాత్రమే దుష్ప్రభావాలు కలిగేలా చేస్తుంది. ఇటువంటి రేడియోథెరపీ దుష్ప్రభావాల్లో చర్మం ఎర్రగా మారడం, చర్మం పుండ్లు పడటం వంటివి ఉంటాయి. చర్మంపై ఉన్న కేన్సర్ పుండుగా మారి 6 వారాల నుండి 3 నెలల వ్యవధిలో మెల్లగా నయమవుతుంది, ఆ సమయంలో అది చారలు కలిగి ఉంటుంది, తరువాత పూర్తిగా నయం అవుతుంది.

క్రియోథెరపీ

క్రియోథెరపీ అంటే కేన్సర్ కణాలను స్తంభింపచేయడానికీ, నాశనం చేయడానికీ గడ్డకట్టించే ఉష్ణోగ్రతలను ఉపయోగించడం. కేన్సర్ ప్రాంతంపై క్రియోథెరపీ ప్రోబ్ ఉంచబడుతుంది, ఆ ప్రాంతం స్తంభింపజేయబడుతుంది. చర్మంపై చిన్న కేన్సర్లకు ఈ రకమైన చికిత్సను ఉపయోగిస్తారు. దీనిలో టిష్యూ (కణజాలం) ఘనీభవిస్తుంది, చనిపోతుంది. ఇది కొంత కాలం తర్వాత ఒక చారగా మిగులుతుంది.

కెమోథెరపీ

శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపించి, నయం చేయలేని బాగా ముదిరిన చర్మ కేన్సర్ ఉన్న అరుదైన సందర్భాల్లో, కేన్సర్‌ను నియంత్రించడానికి లక్షణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కెమోథెరపీని ఉపయోగిస్తారు. చిన్న చర్మ కేన్సర్ల కోసం, ఆయింట్‌మెంట్ లేదా క్రీమ్ రూపంలో కెమోథెరపీని ప్రయత్నించవచ్చు.

ప్రారంభ దశలో ఉన్న మెలనోమా

ప్రారంభ దశలోని మెలనోమాకి చేసే చికిత్సలో కేన్సర్ ని సర్జరీ ద్వారా తొలగించవచ్చు. దీనిని వైడ్ ఎక్సిషన్ అంటారు. ఇందులో కేన్సర్ చుట్టూ ఉన్న సాధారణ చర్మాన్ని కూడా కేన్సర్ తో బాటు వైడ్ (విస్తృత) మార్జిన్ లో తొలగించబడుతుంది.
చేతులు, కాళ్ళు లేదా ఛాతీ, పొత్తికడుపులో తలెత్తే మెలనోమాస్‌లో, ఆ ప్రాంతంలోని లింఫు నోడ్స్ ని సర్జరీ ద్వారా తొలగించడానికి చూస్తారు. ఇలా మెలనోమాలలో జరుగుతుంది. వీటికి రిస్క్, మధ్యస్థంగానూ, హెచ్చు స్థాయిలోనూ ఉంటుంది.
లింఫు నోడ్ తొలగింపు సెంటినెల్ నోడ్ శాంప్లింగ్ సహాయంతో జరుగుతుంది.

సెంటినెల్ నోడ్ శాంప్లింగ్

సెంటినెల్ నోడ్ అనేది కేన్సర్ సోకే మొదటి నోడ్ లేదా నోడ్లు. సెంటినెల్ నోడ్‌లో కేన్సర్ లేకపోతే, ఇతర ఆక్సిలరీ నోడ్‌లలో కేన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ.
సాధారణంగా రేడియోయాక్టివ్ పదార్థాన్ని చిన్న మోతాదులో ఇచ్చిన తరువాత లేదా కేన్సర్‌కు దగ్గరగా ఉన్న ప్రదేశంలోకి బ్లూ డై ని ఇంజెక్ట్ చేసినపుడు సెంటినెల్ నోడ్ కేన్సర్ చుట్టూ ఉన్నట్టు కనుగొనబడుతుంది. ఈ డై (రంగు) వ్యాపిస్తుంటే, దాన్ని ముందుగా లింఫ్ నోడ్/లు తీసుకుంటాయి. ఈ పదార్థాలు సర్జరీలో నోడ్స్ ని గుర్తించడానికి సర్జన్‌కు సహాయపడతాయి.
ఈ తొలగించిన నోడ్స్ లో కేన్సర్ కణాలు ఉన్నాయేమో చూడడం కోసం సూక్ష్మదర్శిని క్రింద పరిశీలిస్తారు. కేన్సర్ కణాలు లేకపోతే, సర్జరీ అవసరం లేదు. అయితే, కేన్సర్ కణాలు కనుగొనబడితే మాత్రం సర్జన్ సమీపంలోని అన్ని లింఫ్ నోడ్స్ నీ తొలగించాలని నిర్ణయించుకోవచ్చు.

అడ్జువెంట్ థెరపీ

అడ్జువెంట్ థెరపీ అంటే కేన్సర్ నివారణ అవకాశాలను పెంచడానికి ఖచ్చితమైన నివారణ చికిత్స చేసిన తర్వాత ఇతర చికిత్సా ఎంపికలను ఉపయోగించడం. మెలనోమా విషయంలో, సర్జరీ తర్వాత 3 వ దశ ఉన్న రోగులకు ఇమ్యునోథెరపీ (నివోలుమాబ్) తో అడ్జువెంట్ థెరపీ ఇవ్వబడుతుంది. 1, 2 స్టేజిలో ఉన్న మెలనోమాకు అడ్జువెంట్ థెరపీ అవసరం లేదు, సర్జరీ సరిపోతుంది.

ముదిరిన మెలనోమాకి చికిత్స

ముదిరిన లేదా దశ 4 మెలనోమా దాని ప్రాధమిక ప్రారంభ స్థానం నుండి శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపించి ఉంటుంది. చికిత్సా ఎంపికలు వ్యాధిని నియంత్రించడం, దీర్ఘకాలిక నియంత్రణను సాధించడం లక్ష్యాలుగా కలిగి ఉంటాయి.

ఇమ్యునోథెరపీ బయోలాజికల్ థెరపీ

మెటాస్టాటిక్ మెలనోమా ఉన్న రోగులందరికీ కేన్సర్‌లో BRAF, MEK and KIT మ్యుటేషన్ల కొరకు పరీక్షించబడతాయి. వారి కేన్సర్‌లో ఇటువంటి మ్యుటేషన్స్ లేని రోగులకు, నివోలుమాబ్, పెంబ్రోలిజుమాబ్ వంటి ఇమ్యునోథెరపీ మందులతో చికిత్స చేస్తారు. ఈ ఔషధాలను ఒంటరిగా లేదా CTLA-4 కి వ్యతిరేకంగా యాంటీబాడీ అయిన ఇపిలిముమాబ్‌తో కలిపి ఇవ్వవచ్చు. పైన పేర్కొన్న సైట్లలో మ్యుటేషన్లు ఉంటే, వెమురాఫెనిబ్, డబ్రాఫెనిబ్, ట్రామెటినిబ్ వంటి మందులను చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా ఇమ్యునోథెరపీతో చికిత్స తర్వాత చేస్తారు.

కెమోథెరపీ

ముదిరిన మెలనోమా వ్యాధికి కెమోథెరపీ ద్వారా చేకూరే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది, అందుకనే తరచుగా ఇది ఉపయోగించబడదు.

సర్జరీ

సర్జరీ అనేది సాధారణంగా మెటాస్టాటిక్ మెలనోమాలో చికిత్స ఎంపిక కాదు, అయితే కొన్ని సందర్భాల్లో వ్యాధి శరీరంలోని ఒక ప్రాంతానికి పరిమితమైనపుడు ఉపయోగిస్తారు.