Soft tissue Sarcoma

మెత్తని కణజాలం సర్కోమ

సర్కోమా అనేది శరీరంలోని అనుసంధాన కణజాలాల్లో ప్రారంభమయ్యే క్యాన్సరు. మెత్తని కణజాలం సర్కోమా అనేది కొవ్వు, కండరాలు, నరాలు, రక్త నాలాలు మరియు ఫైబ్రస్‌ కణజాలాలు లాంటి శరీరం లోని మెత్తని అనుసంధాన కణజాలాల నుంచి ఉత్పన్నమయ్యే క్యాన్సరు. ఈ నిర్మాణాలు శరీరంలో ప్రతి చోటా ఉంటాయి కాబట్టి, మెత్తని కణజాలం సర్కోమాలు శరీరంలోని భాగాలన్నిటి నుంచి ఉత్పన్నమవ్వవచ్చు, కానీ కాళ్ళుచేతుల్లో మరింత సామాన్యంగా కలుగుతాయి.
సర్కోమాలు ఏ రకమైన కణం నుంచి ఉత్పన్నమయ్యాయనే దానిపై ఆధారపడి వాటికి భిన్న పేర్లు ఇవ్వబడ్డాయి. లైపోసర్కోమా అనే కొవ్వు కణాల నుంచి, లెమ్యోసర్కోమా అనే కండరం నుంచి, యాంజియోసర్కోమా అనే రక్త నాళం నుంచి సర్కోమా ఉత్పత్తి అవుతుంది. సైనోవియల్‌ సర్కోమా, మాలిగ్నంట్‌ పెరిఫెరల్‌ నర్వ్‌ షీత్‌ ట్యూమర్‌, డెస్‌మోయిడ్‌ ట్యూమర్‌ మరియు సాలిటరి ఫైబ్రవస్‌ ట్యూమర్‌లు ఇతర రకాల సర్కోమాలు.

మెత్తని కణజాలం సర్కోమాలు పిల్లల్లో, యుక్తవయస్కుల్లో మరియు యువ వయోజనుల్లో కలగవచ్చు, కానీ 30 సంవత్సరాలకు మించిన ప్రజల్లో ఎక్కువ సామాన్యంగా కలుగుతాయి.
ఎముకల నుంచి ఉత్పన్నమయ్యే సర్కోమాలు వేరేగా చర్చించబడతాయి. కాలులోని మెత్తని కణజాలం సర్కోమా బొమ్మ ఈ కింద ఇవ్వబడింది.

వయస్సు

ఏ క్యాన్సరులోనైనా ఉన్నట్లుగానే, వయస్సు అనేది మెత్తని కణజాలం సర్కోమా అభివృద్ధిలో ప్రమాదకర అంశం. 60 సంవత్సరాల వయస్సు దాటిన ప్రజల్లో సర్కోమా చాలా సామాన్యమైనది, కానీ ఏ వయస్సులోనైనా కలగవచ్చు. పిల్లల్లో కూడా సర్కోమాలు కలగవచ్చు.

జన్యుపరమైన స్థితులు

లై ఫ్రావుమెని సిండ్రోమ్‌, న్యూరోఫైబ్రోమటోసిస్‌, గార్డెనర్స్‌ సిండ్రోమ్‌ లాంటి జన్యుపరమైన స్థితులు గల రోగుల్లో కొద్ది సంఖ్యలో మెత్తని కణజాలం సర్కోమాలు ఉత్పన్నమవుతాయి. ఈ సిండ్రోమ్‌లు గల ప్రజలందరికీ మెత్తని కణజాలం సర్కోమా కలగదు, కానీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గత రేడియోథెరపి

గతంలో రేడియోథెరపితో చికిత్స మెత్తని కణజాలం సర్కోమా కలిగే ప్రమాదం పెరుగుతుంది. ఈ ప్రమాదం కొద్దిగా ఉంటుంది మరియు సాధారణంగా చాలా వరకు రేడియోథెరపి చికిత్స తరువాత 5-10 సంవత్సరాలకు కలుగుతుంది.
రేడియోథెరపి చేయించుకున్న రోగుల్లో ప్రమాదం తక్కువగా ఉందని మరియు రేడియోథెరపి ఇచ్చే ప్రయోజనంపై సమతుల్యంగా ఉండాలనే విషయం గమనించడం ముఖ్యం.

పూర్వ క్రీమోథెరపి

గతంలో కీమోథెరపి చేయించుకోవడం మెత్తని కణజాలం సర్కోమా అభివృద్ధిచెందే ప్రమాదాన్ని కొద్దిగా పెంచుతుంది. మళ్ళీ, ఈ ప్రమాదం కొద్దిగా ఉంటుంది మరియు ఆ కారణంతో కీమోథెరపి చేయించుకోకుండా మరియు ఇలాంటి చికిత్సలను పరిగణించేటప్పుడు ప్రయోజనాలను మరియు ప్రమాదాలను సమతుల్యం చేయించుకోకుండా ఎవ్వరినీ అడ్డగించదు.

రసాయనాలు

డయోక్సిన్స్‌, పురుగుమందులు, వినైల్‌ క్లోరైడ్‌ లాంటి రసాయనాలకు గురవ్వడం, మెత్తని కణజాలం సర్కోమా కలిగే ప్రమాదాన్ని పెంచుతుంది.

మెత్తని కణజాలం సర్కోమా చిన్నదిగా ఉన్నప్పుడు అస్సలు లక్షణాలు ప్రదర్శించకపోవచ్చు, కానీ సైజు పెరిగే కొద్దీ సాధారణంగా లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఇలాంటి కణితితో ముడిపడివున్న మామూలు లక్షణాల్లో ఈ కిందివి ఉంటాయి

గడ్డ

సైజు పెరుగుతుండే గడ్డ ఉండటం లేదా కనిపించడం మెత్తని కణజాలం సర్కోమా యొక్క మామూలు లక్షణం. గడ్డ నొప్పి లేకుండా ఉండొచ్చు లేదా నొప్పిగా ఉండొచ్చు మరియు నెమ్మదిగా లేదా వేగంగా పెరగవచ్చు.

శరీరంలో పెరిగే అత్యధిక గడ్డలు సర్కోమాలు కావు, కానీ గడ్డలు పెద్దవిగా లేదా నొప్పిగా ఉంటే సర్కోమాను అనుమానించవచ్చు. పొత్తికడుపులో కలిగే సర్కోమాలను కనిపెట్టడానికి ముందు పెద్దవి కావచ్చు.

ఇతర లక్షణాలు

సర్కోమాలు కణితి వల్ల లేదా నరం లాంటి మరొక నిర్మాణాన్ని కణితి అణచివేయడం వల్ల నొప్పి లాంటి లక్షణాలు కలిగించవచ్చు. పొత్తికడుపులో ఉండే సర్కోమాలు పొత్తికడుపు నొప్పి, మలబద్ధకం లేదా అతిసారం లాంటి లక్షణాలు కలిగించవచ్చు. ఊపిరితిత్తుల్లో ఉండే సర్కోమాలు దగ్గు మరియు శ్వాసతీసుకోలేకపోవడం కలిగించవచ్చు. యుటెరస్‌ (గర్భసంచి) నుంచి ఉత్పన్నమయ్యే సర్కోమా యోని నుంచి రక్తస్రావం కలిగించవచ్చు. ముదిరిన సర్కోమాలు గల రోగులకు అలసట, ఆకలి లేకపోవడం మరియు బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉండొచ్చు.

మెత్తని కణజాలం సర్కోమాను గుర్తించడానికి మరియు ధృవీకరించడానికి అనేక పరిశోధనలు చేయబడతాయి. రోగికి గడ్డ ఉన్నప్పుడు, మరింతగా మదింపు చేసేందుకు ఈ కింది పరీక్షలు చేయబడతాయి. ఈ పరీక్షలకు ముందు డాక్టరు సంపూర్ణ పరీక్ష మరియు నిత్యపరిపాటి రక్త పరీక్షలు చేస్తారు.

అల్ట్రాసౌండ్‌ స్కాన్

అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ అనేది కనుగొన్న గడ్డను మదింపు చేయడానికి చేయబడే ప్రారంభ పరీక్ష. గడ్డ సైజు, లొకేషన్‌ మరియు సంభావ్య మూలస్థానం ఏరియాను స్కాన్‌ మదింపు చేయగలుగుతుంది. కొన్ని పరిస్థితుల్లో, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయకుండానే నేరుగా సిటి లేదా ఎంఆర్‌ఐ స్కాన్‌ని డాక్టరు కోరవచ్చు.

ఎంఆర్‌ఐ స్కాన్

ఎంఆర్‌ఐ స్కాన్‌ అనేది పరిశోధించబడుతున్న గడ్డ స్వభావాన్ని నిర్థారించేందుకు చాలా ముఖ్యమైన పరీక్ష. కాళ్ళుచేతులు, తల మరియు శరీర ప్రాంతాల యొక్క సర్కోమాను మదింపు చేయడానికి సిటి స్కాన్‌ కంటే ఇది మరింత సునిశితమైనది మరియు సర్కోమాలను మదింపు చేసేటప్పుడు ప్రాధాన్యం ఇవ్వబడే పరిశోధన ఇది. గ్రోత్‌ లేదా గడ్డను గుర్తించేందుకు సహాయపడటానికి ఈ పరిస్థితిలో ఎంఆర్‌ఐ స్కాన్‌ అత్యుత్తమ పరీక్ష మరియు గడ్డ క్యాన్సరా లేదా కాదా అనే విషయం చెప్పగలుగుతారు.

సిటి స్కాన్

సర్కోమాను అనుమానించినప్పుడు గడ్డను మదింపు చేసేందుకు లేదా పరిశోధించేందుకు కూడా సిటి స్కాన్‌ని ఉపయోగించవచ్చు. కాలేయం, ఊపిరితిత్తులు లాంటి అవయవాల నుంచి ఉత్పన్నమైనప్పుడు లేదా ఎంఆర్‌ఐ లభించని స్థితుల్లో మెత్తని కణజాలం సర్కోమాను మదింపు చేయడంలో ఎంఆర్‌ఐ కంటే సిటి స్కాన్‌ ఎక్కువ సహాయకారిగా ఉంటుంది. క్యాన్సరు ఇతర ప్రాంతాలకు వ్యాపించిందేమో చూసేందుకు శరీరం మొత్తాన్ని స్కాన్‌ చేసేందుకు సిటి స్కాన్‌ ఒక్కటే లేదా పిఇటితో సిటి స్కాన్‌ తీయబడవచ్చు.

పిఇటి/సిటి స్కాన్

మెత్తని కణజాలం సర్కోమాల్లో పిఇటి/సిటి స్కాన్‌ని ఉపయోగించడం నిత్యపరిపాటి దశ పరిశోధన కాదు. కొన్ని రకాల సర్కోమాలను మదింపుచేయడంలో అన్ని కాకపోయినా కొన్ని పిఇటి సిటి స్కాన్‌లు బాగుంటాయి కాబట్టి నిత్యపరిపాటిగా చేయబడవు. సర్కోమా తిరగబెట్టిందా అనే విషయం పరిశోధించడం ఎంపిక చేయడంలో లేదా చాలా సందర్భాల్లో చికిత్స స్పందనను మదింపు చేయడంలో ఈ పరీక్ష ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది.

బయాప్సీ

గడ్డ లేదా మాస్‌ స్వభావాన్ని నిర్థారించేందుకు సాధారణంగా కోర్‌ బయాప్సీ చేయబడుతుంది. సూదితో చిన్న గడ్డ ముక్కను తీసుకోవడం మరియు సూక్ష్మదర్శినిలో దీనిని పరీక్షించడం కోర్‌ బయాప్సీలో ఉంటుంది. బయాప్సీ తరువాత సంపూర్ణ రోగనిర్థారణ చేయబడుతుంది. మాస్‌ స్వభావాన్ని కచ్చితంగా నిర్థారించేందుకు తరచుగా, బయాప్సీ చేసిన మెటీరియల్‌ యొక్క ప్రత్యేక స్టెయినింగ్‌ అవసరమవుతుంది. అనుమానిత ఈ మెత్తని కణజాలం సర్కోమా బయాప్సీని చాలా జాగ్రత్తగా మరియు ఈ స్థితిని నిర్థారించడంలో లేదా చికిత్స చేస్తన్న అనుభవజ్ఞుడైన డాక్టరు తీస్తారు. ప్రక్రియ కోసం సరైన లొకేషన్‌ని ఎంచుకోవాలి, సర్కోమాను నిర్థారణ చేస్తే తరువాత ఆపరేషన్‌ చేసే సమయంలో ఈ ప్రాంతాన్ని తొలగిస్తారు. తప్పు చోటు నుంచి బయాప్సీ తీస్తే భవిష్యత్తు సర్జీరీని ఎక్కువ మిశ్రమంగా లేదా సంక్లిష్టంగా చేయవచ్చు.

గడ్డ చిన్నదిగా ఉంటే, గంటు బయాప్సీ చేయబడుతుంది, ఇక్కడ గడ్డ లేదా గ్రోత్‌ మొత్తం తీయబడుతుంది. సూక్ష్మదర్శిని కింద దీనిని చూసి నిర్థారణ చేయడం జరుగుతుంది.

క్యాన్సరు దశ అనేది శరీరంలో క్యాన్సరు సైజును మరియు ప్రాంతాన్ని వివరించేందుకు ఉపయోగించే పదం. క్యాన్సరు దశను తెలుసుకోవడం అత్యంత సముచితమైన చికిత్సను నిర్ణయించుకోవడానికి డాక్టర్లకు సహాయపడుతుంది. మెత్తని కణజాలం సర్కోమా దశ టిఎన్‌ఎం దశ వ్యవస్థ లేదా సంఖ్య వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.
ఏదో ఒక వ్యవస్థతో దశను నిర్ణయించడం కణితి సైజు మరియు వ్యాప్తి, లింఫ్‌ నోడ్‌లకు క్యాన్సరు వ్యాప్తి మరియు శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సరు వ్యాప్తి ఆధారపడి ఉంటుంది.టిఎన్‌ఎం అంటే ట్యూమర్‌, నోడ్‌ మరియు మెటాస్టాసెస్‌ అని అర్థం. టి అంటే కణితి మరియు ఎన్‌ అంటే నోడ్స్‌ మరియు క్యాన్సరు చుట్టూ లింఫ్‌ నోడ్స్‌లోకి క్యాన్సరు వ్యాపించడమని అర్థం. ఎం అంటే మెటాస్టాసెస్‌ మరియు శరీరంలోని సుదూర ప్రాంతాలకు క్యాన్సరు వ్యాపించడం అని అర్థం.

టిఎన్‌ఎం దశ

టి దశ

టి1 ఇక్కడ క్యాన్సరు సైజు 5 సెం.మీ లేదా తక్కువగా ఉంటుంది. ఇది టి1ఎలోకి విభజించబడుతుంది. ఇక్కడ
క్యాన్సరు పైపైన ఉంటుంది మరియు టి1బి ఇక్కడ కణజాలాల్లోకి లోతుగా ఉంటుంది.
టి2 క్యాన్సరు సైజు 5 సెం.మీ కంటే ఎక్కువగా ఉంటుంది మరియు పైపైన టి2ఎ మరియు లోతుగా టి2బిలోకి విభజించబడుతోంది.

ఎన్‌ దశ

ఎన్0 లింఫ్‌ నోడ్స్‌కి క్యాన్సరు ప్రమేయం ఉండదు
ఎన్‌1 క్యాన్సరు పరిసరాల లింఫ్‌ నోడ్స్‌కి వ్యాపించివుంటుంది.

ఎం దశ

ఎం శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సరు వ్యాపించివుండదు
ఎం1 క్యాన్సరు శరీరంలోని దూర బాగాలకు వ్యాపించివుంటుంది

క్యాన్సర్‌ గ్రేడ్

సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు రూపంపై ఆధారపడి క్యాన్సరుకు గ్రేడింగ్‌ ఇవ్వబడుతుంది.
క్యాన్సరు చాలా వరకు ఒరిజినల్‌ కణం యొక్క మూలాన్ని పోలివున్నప్పుడు దీనిని వెల్‌ డిఫరెన్షియేటెడ్‌ లేదా గ్రేడ్‌ 1 మరియు క్యాన్సరు కణాలు అసలు కణాన్ని పోలివుండనప్పుడు గ్రేడ్‌ లేదా పూర్‌లీ డిఫరెన్షియేటెడ్‌ అని అంటారు. గ్రేడ్‌ 2 లేదా మోడరేట్‌లీ డిఫరెన్షియేటెడ్‌ క్యాన్సరు గ్రేడ్‌ 1 మరియు గ్రేడ్‌ 3 మధ్య ఉంటుంది.

రోగనిర్థారణ సమయంలో క్యాన్సరు దశపై ఆధారపడి మెత్తని కణజాలం సర్కోమాలకు చికిత్స చేస్తారు. శస్త్రచికిత్స ద్వారా తొలగించడం, రేడియోథెరపి మరియు కీమోథెరపిలు చికిత్స ఎంపికలు.

శస్త్రచికిత్సతో వేరుచేయడం

సర్కోమాను శస్త్రచికిత్సతో తొలగించడం శస్త్రచికిత్సతో వేరుచేయడం ఉంటుంది. చేయబడే సర్జరీ రకం వెడల్పాటి గంటు అయివుండొచ్చు, కణితి చుట్టూ ఉన్న మామూలు ఏరియా మార్జిన్‌తో పాటు కణితిని తొలగించడం జరుగుతుంది. కణితి పూర్తిగా తొలగించబడిందని నిర్థారించుకునేందుకు మామూలు కణజాలం మార్జిన్‌ తీసుకోబడుతుంది.
కాలు లేదా చెయ్యి లాంటి అవయవంలో వెడల్పాటి గంటు చేసినప్పుడు, దీనిని లింబ్‌ స్పేరింగ్‌ సర్జరీ అని కూడా అంటారు, ఎందుకంటే అవయవం మొత్తం తొలగించబడదు కాబట్టి.

అత్యధిక మంది రోగులకు, వెడల్పాటి గంటు చేయడం సాధ్యమే. అయితే, ఇది సాధ్యపడని రోగుల్లో, కణితిని తొలగించడానికి అవయవం విచ్ఛేదనం అవసరం కావచ్చు. కాలు లేదా చేయి తొలగించడం లింబ్‌ విచ్ఛేదనం ఉంటుంది. క్యాన్సరును తొలగించిన తరువాత, తొలగించిన కణజాలం స్థానంలో కండరం, ఎముక లాంటి ఇతర కణజాలాలతో లేదా ప్రొస్థీసిస్‌ లాంటి ఇతర అవయవాలతో పునర్నిర్మాణ సర్జరీ అవసరం కావచ్చు.
మెత్తని కణజాలం సర్కోమా గల అత్యధిక మంది రోగుల్లో, శస్త్రచికిత్సతో వేరుచేయడం మొదటి చికిత్స ఎంపిక, ఆ తరువాత ఇతరవి ఉంటాయి. అయితే, కొన్ని పరిస్థితుల్లో సర్జరీ సాధ్యంకానప్పుడు, మొదటగా రేడియోథెరపి, ఆ తరువాత సర్జరీ ఉంటుంది. పొత్తికడుపులో ఉత్పన్నమయ్యే సర్కోమాల్లో ఈ ఎంపికను ఎక్కువ సామాన్యంగా ఉపయోగిస్తారు. అంగవిచ్ఛేదనం అవసరమైతే, అవయవం పనితనాన్ని సుగమం చేసేందుకు ప్రొస్థీసిస్‌ని ఏర్పాటు చేయవచ్చు.

ప్రొస్థీసిస్‌ అనేది అంగవిచ్ఛేదన అవయవం లేదా సర్జరీలో తొలగించిన ఇతర శరీర భాగం మాదిరిగా అదే పనితనం ఇవ్వడాన్ని సుగమం చేసే కృత్రిమ అవయం లేదా కీలు లేదా ఏదైనా ఇతర స్ట్రక్చర్‌. అంగవిచ్ఛేదనం చేస్తున్న డాక్టరు దీనిని చేయడానికి ముందు ప్రొస్థీసిస్‌కి గల ఎంపికలను చర్చిస్తారు మరియు ఖరారు చేస్తారు.

మూలస్థానం నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన ముదిరిన సర్కోమా గల రోగుల్లో కొన్నిసార్లు సర్జరీ పరిగణించబడవచ్చు. ఒకటి లేదా ఎక్కువ ప్రాంతాలకు వ్యాప్తి పరిమితమైన రోగుల్లో ఇలా సాధారణంగా జరుగుతుంది మరియు ఖరీదైనది కాదు. మెత్తని కణజాలం సర్కోమాకు సర్జరీ తరువాత, ప్రత్యేకించి కాలు లేదా చెయ్యి లాంటి అవయవంలో ప్రత్యేకించి సర్జరీ తరువాత, ఆపరేషన్‌ చేసిన ఆ అవయవంలో అత్యుత్తమ పనితనం పొందడం తీసుకోవడం పునరావాసం లేదా ఫిజియోథెరపి అవసరమవుతుంది.

రేడియోథెరపి

మెత్తని కణజాలం సర్కోమా గల రోగుల్లో చికిత్స ఎంపికగా రేడియోథెరపి మామూలుగా ఉపయోగించబడుతుంది. సాధారణంగా రేడియోథెరపి అనుబంధ చికిత్సగా ఉపయోగించబడుతుంది, దీని అర్థం సర్జరీ లాంటి కచ్చితమైన చికిత్స తరువాత ఇవ్వబడుతుందని అర్థం. సర్జరీకి ముందు కణితి ఉన్న ప్రాంతానికి చికిత్స ఇవ్వబడుతుంది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఉన్న మిగతా క్యాన్సరు కణాలు వేటినైనా చంపడం ఈ స్థితిలో అనుబంధ రేడియోథెరపి ఉద్దేశం. ఈ సెట్టింగులో సాధారణంగా ఇవ్వబడే రేడియోథెరపి 6-7 వారాలు (30-33 చికిత్సలు) ఉంటుంది, ఈ చికిత్స వారానికి 5 రోజులు ఇవ్వబడుతుంది. అధిక గ్రేడ్‌ మరియు మధ్య గ్రేడ్‌ సర్కోమాలు మరియు కొన్ని తక్కువ గ్రేడ్‌ సర్కోమాలు గల రోగులకు రేడియోథెరపి ఇవ్వబడుతుంది.

కొంతమంది రోగుల్లో, కచ్చితమైన సర్జరీకి ముందు రేడియోథెరపి ఇవ్వబడుతుంది. ఈ పద్ధతిని నియో అడ్జువంట్‌ రేడియోథెరపి అని అంటారు. ఈ రకమైన చికిత్స పొత్తికడుపు సర్కోమాలు గల లేదా భారీ లేదా శస్త్రచికిత్సతో తొలగించడం కష్టంగా ఉన్న ఇతర చోట్ల సర్కోమాలు గల రోగుల్లో ఈ రకమైన చికిత్స పరిగణించబడుతుంది మరియు కీమోథెరపి తరువాత సైజు కుంగిపోయినప్పుడు తొలగించబడతాయి.

సర్కోమాల చికిత్సలో విభిన్న రేడియోథెరపి టెక్నిక్‌లను ఉపయోగించవచ్చు. 3డి-సిఆర్‌టి, ఐఎంఆర్‌టి, ఐజిఆర్‌టి మరియు ఇతర టెక్నిక్‌లు ఉపయోగించబడతాయి. రేడియోథెరపిపై మరిన్ని వివరాలకు, క్యాన్సరు గురించి తరచూ అడిగే ప్రశ్నల్లో రేడియోథెరపిపై సెక్షన్‌ని చూడండి. మెత్తని కణజాలం సర్కోమాల్లో రేడియోథెరపి యొక్క దుష్ప్రభావాల్లో అలసట, చర్మం ఎర్రబడటం, చర్మం పుండు, కీళ్ళు చికిత్స ప్రాంతంలో బిగుతుదనం మరియు అవయవాల వాపు కొంతమంది రోగుల్లో దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కలగవచ్చు.

పొత్తికడుపుకు రేడియోథెరపి చేయడం పొత్తికడుపు అసౌకర్యం లేదా నొప్పి, నీళ్ళ విరేచనాలు, మలబద్ధకం లాంటి దుష్ప్రభావాలు కలిగించవచ్చు.

కీమోథెరపి

ఇతర క్యాన్సర్లతో పోల్చుకుంటే మెత్తని కణజాలం సర్కోమా గల రోగుల్లో కీమోథెరపిని తక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే దీని ప్రయోజనం అత్యధిక రకాల మెత్తని కణజాలం సర్కోమాలకు పరిమితమవుతుంది కాబట్టి. రాబ్డోమయోసర్కోమాలు, లైపోసర్కోమాలు లాంటి స్థితుల్లో మరియు కీమోథెరపికి ఈ కణితుల స్పందన మెరుగ్గా ఉండే సైనోవియల్‌ సర్కోమాల్లో కీమోథెరపిని ఉపయోగిస్తారు.

కచ్చితంగా సర్జరీ చేయాలని నిర్ణయించే ముందు నియో అడ్జువంట్‌ కీమోథెరపి అనే కీమోథెరపిని ఉపయోగిస్తారు. నేరుగా తొలగించడం కష్టంగా ఉండే పెద్ద కణితిని కుంగదీసేందుకు ఈ ఎంపికను ఉపయోగిస్తారు. కచ్చితంగా సర్జరీ చేయాలని నిర్ణయించిన తరువాత ఉపయోగించే కీమోథెరపిని లేదా రేడియోథెరపిని అడ్జువంట్‌ కీమోథెరపి అని అంటారు మరియు తిరిగి కలిగే అపాయాన్ని తగ్గించేందుకు కొన్ని రకాల మెత్తని కణజాలం సర్కోమాల్లో ఉపయోగిస్తారు.

నయం చేయలేని ముదిరిన లేదా మెటాస్టాటిక్‌ వ్యాధి (దశ 4) గల రోగుల్లో కీమోథెరపిని అత్యంత సామాన్యంగా ఉపయోగిస్తారు. ఇక్కడ, క్యాన్సరును మరియు లక్షణాలు నియంత్రించడం మరియు జీవించివుండటాన్ని పెంచడం కీమోథెరపి ఉద్దేశం. డోక్సోరుబిసిన్‌, ఇఫోసోఫామైడ్‌, టాక్సేన్స్‌, జెమ్‌సిటాబైన్‌, ట్రాబెక్టెడిన్‌ మరియు ఎరిబులిన్‌ ఔషధాలను ఈ సెట్టింగులో మామూలుగా ఉపయోగిస్తారు. కీమోథెరపిపై మరిన్ని వివరాలకు, క్యాన్సరు గురించి తరచూ అడిగే ప్రశ్నల్లో కీమోథెరపిపై సెక్షన్‌ని చూడండి.

బయోలాజికల్‌ లేదా లక్షిత థెరపి

క్యాన్సరు కణాలపై లేదా క్యాన్సరు పెరగడానికి వీలు కల్పించే యంత్రాంగాలపై నిర్దిష్ట సైట్‌లను లక్ష్యంగా చేసుకునే ఔషధాలను ఉపయోగించడం బయోలాజికల్‌ చికిత్స లేదా లక్షిత చికిత్సలో ఉంటుంది. మెత్తని కణజాలం సర్కోమాలకు చికిత్స చేసేందుకు అనేక బయోలాజికల్‌ ఔషధాలు లభిస్తున్నాయి.

పాజోపనిబ్‌, ఇమాటినిబ్‌, సునిటినిబ్‌, సిరోలిమస్‌ మెత్తని కణజాలం సర్కోమాల్లో ఉపయోగించే కొన్ని ఔషదాలు. బయోలాజికల్‌ థెరపిపై వివరాలకు, క్యాన్సరు గురించి తరచూ అడిగే ప్రశ్నల్లో బయోలాజికల్‌ థెరపిపై సెక్షన్‌ని చూడండి.