Thyroid Cancer

థైరాయిడ్‌ గ్రంథి

థైరాయిడ్‌ గ్రంథి అనేది మెడలో ఉండే ఎండోక్రైన్‌ గ్రంథి. ఎండోక్రైన్‌ గ్రంథి అనేది హార్మోన్‌లను ఉత్పత్తిచేసే మరియు రక్త ప్రవాహంలోకి నేరుగా స్రవించే గ్రంథి. శరీరంలో అనేక ఎండోక్రైన్‌ గ్రంథులు ఉంటాయి. వీటిల్లో థైరాయిడ్‌ ఒకటి.
థైరాయిడ్‌ గ్రంథి మెడ ముందర మరియు ఆడమ్‌ యాపిల్‌ కింద ఉంటుంది. ఇది ఇస్తుమస్‌చే ఒకటిగా కలిపే కుడి మరియు ఎడమ ఉండే రెండు లోబ్స్‌తో తయారుచేయబడుతుంది.
థైరాయిడ్‌ గ్రంథి థైరోక్సిన్‌ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంది. శరీరం యొక్క సాధారణ ఎదుగుదలకు మరియు వికాసానికి ఇది సహాయపడుతుంది.

థైరాయిడ్‌ క్యాన్సర్

థైరాయిడ్‌ క్యాన్సర్‌ అనేది థైరాయిడ్‌ గ్రంథిలో ప్రారంభమయ్యే క్యాన్సర్‌. గ్లొబోకాన్‌ డేటా 2018 ప్రకారం, భారతదేశంలో 18688 థైరాయిడ్‌ క్యాన్సర్‌లు ఉన్నాయి, ఇవి మొత్తం క్యాన్సర్లలో 1.6%కి సమానం.

థైరాయిడ్‌ క్యాన్సర్‌ రకాలు

థైరాయిడ్‌ క్యాన్సర్‌ అనేక రకాలుగా ఉండొచ్చు. ఇవి ఈ కింద ఇవ్వబడ్డాయి.

పాపిల్లరి థైరాయిడ్‌ క్యాన్సర్

ఇది చాలా వరకు అత్యంత సామాన్యమైన థైరాయిడ్‌ క్యాన్సరు రూపం. థైరాయిడ్‌ క్యాన్సర్లన్నిటిలో దీని వాటా దాదాపు 60% ఉంది. ఈ క్యాన్సరు మహిళల్లో మరింత సామాన్యంగా ఉంటుంది, సాధారణంగా పిన్న వయస్సులో కలుగుతుంది మరియు నెమ్మదిగా పెరుగుతోంది.

ఫోలిక్యులర్‌ థైరాయిడ్‌ క్యాన్సర్

థైరాయిడ్‌ క్యాన్సర్‌లో ఇది రెండవ అత్యంత సామాన్యమైన రూపం. మొత్తం క్యాన్సర్లలో దీని వాటా దాదాపు 15% ఉంది. యువ మరియు మధ్య వయస్సు ప్రజల్లో కూడా ఈ రకమైన క్యాన్సరు సామాన్యమైనది. ఫోలిక్యులర్‌ మరియు పాపిల్లరి క్యాన్సరును కలిపి, వెల్‌ డిఫరెన్షియేటెడ్‌ క్యాన్సర్‌లు అని అంటారు. ఈ డిఫరెన్షియేటెడ్‌ క్యాన్సర్లలో అత్యధిక వాటిని నయం చేయవచ్చు.

మెడుల్లరీ కార్సినోమా

ఈ రకమైన థైరాయిడ్‌ క్యాన్సర్‌ వాటా మొత్తం థైరాయిడ్‌ క్యాన్సర్‌లలో దాదాపు 5-10% ఉంది. వీటిల్లో దాదాపు నాలుగో వంతు కుటుంబంలో వారసత్వంగా వచ్చిన ఫాల్టీ జీన్‌ వల్ల కలిగింది. ఈ స్థితిని మెన్‌ 2 సిండ్రోమ్‌ అంటారు మరియు థైరాయిడ్‌ యొక్క మెడుల్లరీ క్యాన్సరు ఉన్నట్లుగా నిర్థారణ చేయబడిన రోగులందరినీ ఈ సిండ్రోమ్‌ కోసం పరీక్షించడం జరుగుతుంది.

అనప్లాస్టిక్‌ కార్సినోమా

ఇది థైరాయిడ్‌ క్యాన్సర్‌ యొక్క అసామాన్యమైన రకం. ఇది సాధారణంగా వృద్ధుల్లో ఉంటుంది మరియు చాలా త్వరగా పురోగమించగలదు.

థైరాయిడ్‌ యొక్క నాన్‌-హాడ్జ్‌కిన్స్‌ లింఫోమా

ఇది థైరాయిడ్‌ క్యాన్సర్‌ యొక్క అరుదైన రూపం. నాన్‌-హాడ్జ్‌కిన్స్‌ లింఫోమా అనేది లింఫ్‌ నోడ్స్‌ మరియు లింఫటిక్‌ సిస్టమ్‌లో ఉద్భవించే క్యాన్సర్‌. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా ఉద్భవించవచ్చు మరియు అప్పుడప్పుడు థైరాయిడ్‌లో ప్రారంభమవుతుంది.

థైరాయిడ్‌ క్యాన్సర్‌ అభివృద్ధికి ప్రమాదకర అంశాలు ఈ కింద ఇవ్వబడ్డాయి.

నిరపాయకర థైరాయిడ్‌ స్థితులు

నిరపాయకర (క్యాన్సర్‌ కానిది) థైరాయిడ్‌ స్థితులు గల ప్రజలకు థైరాయిడ్‌ క్యాన్సర్‌ కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ నిరపాయకర స్థితులు థైరోయిడైటిస్‌ (థైరాయిడ్‌ శోథ), గోయిటర్‌ (థైరాయిడ్‌ వాపు) లేదా నిరపాయకర నోడ్యూల్‌ అయివుండొచ్చు. కుటుంబంలో నిరపాయకర థైరాయిడ్‌ వ్యాధి చరిత్ర ఉన్నా కూడా థైరాయిడ్‌ క్యాన్సర్‌ కలిగే ప్రమాదం పెరగవచ్చు.

రేడియేషన్‌కి గురవ్వడం

గతంలో మెడకు రేడియేషన్‌ గురైన వారికి థైరాయిడ్‌ క్యాన్సర్‌ కలిగే ప్రమాదం పెరుగుతుంది. బాల్యంలో రేడియోథెరపితో మెడ ప్రాంతంలో క్యాన్సర్‌ చికిత్స వల్ల ఈ రేడియేషన్‌కి గురైవుండొచ్చు. అణు ప్రమాదాల నుంచి రేడియేషన్‌కి గురవ్వడం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది.

జన్యుపరమైన కారణం

వారసత్వంగా లోపభూయిష్టమైన ఆర్‌ఇటి జీన్‌ ఉంటే మెన్‌ 2 సిండ్రోమ్‌ లాంటి సిండ్రోమ్‌లకు దారితీయొచ్చు. ఈ సిండ్రోమ్‌లో, థైరాయిడ్‌ మరియు ఇతర రకాల క్యాన్సర్లు కూడా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది.

అయోడిన్‌ తక్కువగా గల ఆహారం

అయోడిన్‌ తక్కువగా ఉన్న ఆహారం థైరాయిడ్‌ క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచవచ్చు. భారతదేశంలో అయోడైజ్‌డ్‌ ఉప్పు వాడటం అయోడిన్‌ లోపం కలగడాన్ని తగ్గించింది. బటర్‌ మాంసం మరియు ఇతర కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల థైరాయిడ్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మెడలో నొప్పి లేని గడ్డ ఉండటం థైరాయిడ్‌ క్యాన్సర్‌ యొక్క అత్యంత సామాన్యమైన లక్షణం. ఈ గడ్డ సైజు నెమ్మదిగా పెరుగుతుంది. వేగంగా పెరుగుతున్న మెడ గడ్డతో అనప్లాస్టిక్‌ కార్సినోమా ఉంటుంది.
కొన్నిసార్లు, థైరాయిడ్‌ క్యాన్సర్‌ గాలి గొట్టం లేదా గుల్లెట్‌ని అణచివేయవచ్చు మరియు శ్వాసతీసుకోలేకపోవడం లేదా మింగడంలో కష్టం కలిగించవచ్చు. సంబంధిత ఇతర లక్షణాల్లో స్వరంలో మార్పు లేదా దగ్గు ఉంటాయి. అరుదుగా, థైరాయిడ్‌ క్యాన్సర్‌ యొక్క తొలి లక్షణాలు దగ్గుతో రక్తం పడటం లేదా నొప్పి లాంటి శరీరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించిన క్యాన్సర్‌ నుంచి రావచ్చు. థైరాయిడ్‌ క్యాన్సర్‌ అస్సలు లక్షణాలు ఏవీ కలిగించకపోవచ్చు మరియు థైరాయిడ్‌ గ్రంథిలో నిరపాయకర గడ్డకు ఆపరేషన్‌ చేసిన తరువాత అనుకోకుండా కనుగొనడం జరగవచ్చు.
థైరాయిడ్‌ నుంచి ఉత్పన్నమయ్యే అత్యధిక గడ్డలు నిరపాయకర గడ్డలు అని క్యాన్సర్‌తో కూడినవి కావని తెలుసుకోవడం ముఖ్యం. మెడలో గడ్డ ఉంటే డాక్టరును సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వబడుతోంది.

థైరాయిడ్‌ క్యాన్సర్‌ని అనుమానిస్తే ఈ కింది పరిశోధనలు చేయబడతాయి.

రక్త పరీక్షలు

థైరాయిడ్‌ పనితనాన్ని (టిఎఫ్‌టి) పరీక్షించేందుకు పరిశోధనల్లో భాగంగా సాధారణంగా రక్త పరీక్షలు చేయబడతాయి. చేయబడే ఇతర రక్త పరీక్షల్లో కాల్సిటోనిన్‌ లెవెల్స్‌, క్యాల్షియం మరియు ఫాస్ఫేట్‌ లెవెల్స్‌ ఉంటాయి.

మెడకు అల్ట్రాసౌండ్

గ్రంథి బొమ్మ పొందేందుకు థైరాయిడ్‌కి చేసే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ శబ్ద తరంగాలు ఉపయోగిస్తుంది. గడ్డ ఉందా మరియు గడ్డలో సిస్ట్‌ లాంటి లిక్విడ్‌ లేదా కణాలతో గట్టిగా ఉందా అనే విషయం ఇది బాగా చెప్పగలదు. మెడపై కొద్దిగా జెల్‌ పెట్టడం ద్వారా మరియు చేతితో పట్టుకునే ప్రోబ్‌ని దానిపై పెట్టడం ద్వారా స్కాన్‌ తీయబడుతుంది. పరీక్ష చేయడానికి కొద్ది నిమిషాల సమయం పడుతుంది మరియు నొప్పి ఉండదు.

థైరాయిడ్‌ ఎఫ్‌ఎన్‌ఎసి

ఎఫ్‌ఎన్‌ఎసి లేదా ఫైన్‌ నీడిల్‌ ఆస్పిరేషన్‌ సైటాలజీ అనేది కణాల శాంపిల్‌ని పొందడానికి అనుమానిత గడ్డ లేదా ఏరియాలోకి పలచని సూది గుచ్చబడే పరీక్ష. అసాధారణతలు ఏవైనా ఉన్నాయేమో చూసేందుకు వీటిని సూక్ష్మదర్శిని కింద పరీక్షించడం జరుగుతుంది. థైరాయిడ్‌ గడ్డల్లో, గడ్డ క్యాన్సరా కాదా అనే విషయం ఎన్‌ఎన్‌ఎసి చెబుతుంది. ఎఫ్‌ఎన్‌ఎసి రిపోర్టులో సాధారణంగా 1 నుంచి 5 వరకు స్కోరింగ్‌ సిస్టమ్‌ (థై) ఉంటుంది, ఇక్కడ 1 నిరపాయకరం మరియు 5 క్యాన్సర్‌.

సిటి (కంప్యూటరైజ్‌డ్‌ టోమోగ్రఫి) స్కాన్

సిటి స్కాన్‌ అనేది శరీరంలో సవివరమైన ఇమేజ్‌లు పొందేందుకు ఎక్స్‌రేలను ఉపయోగించే పరీక్ష. థైరాయిడ్‌ క్యాన్సర్‌ని అనుమానించినప్పుడు లేదా పరిశోధించినప్పుడు, క్యాన్సరును మరియు దాని వ్యాప్తిని గుర్తించేందుకు మెడకు మరియు ఛాతీకి సిటి స్కాన్‌ తీయబడుతుంది. దీనిని చేయడానికి కొద్ది నిమిషాల సమయం పడుతుంది మరియు నొప్పి లేనిది.

ఎంఆర్‌ఐ (మ్యాగ్నెటిక్‌ రెసోనన్స్‌ ఇమేజింగ్‌) స్కాన్

శరీరంలో మంచి ఇమేజ్‌లు పొందడానికి ఎంఆర్‌ఐ స్కాన్‌ అయస్కాంతం ఉపయోగిస్తుంది. థైరాయిడ్‌ క్యాన్సర్‌లో, మెడ ఇమేజ్‌ తీయడానికి దీనిని ఉపయోగించడం జరుగుతుంది. దీనిలో ఎక్స్‌రేలు ఏవీ ఉండవు. కొన్ని రకాల మెటల్‌ ఇంప్లాంట్‌లు లేదా గుండె పేస్‌మేకర్‌ గల రోగులు ఈ రకమైన స్కాన్‌ తీయించుకునేందుకు అనువైన వారు కారు. మెడకు ఎంఆర్‌ఐ మెడ యొక్క చాలా సవివరమైన ఇమేజ్‌లు ఇవ్వవచ్చు మరియు సిటి స్కాన్‌ కంటే మెరుగైనదిగా పరిగణించబడుతుంది.

థైరాయిడ్‌ ఐసోటోప్‌ స్కాన్‌

మెడ మరియు శరీరంలో థైరాయిడ్‌ కణజాలాన్ని తెలుసుకునేందుకు సహాయపడటం కోసం కొద్ది మొత్తంలో రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ని థైరాయిడ్‌ రేడియోఐసోటోప్‌ స్కాన్‌ ఉపయోగిస్తుంది. స్కాన్‌ తీయడానికి గంట సమయం పడుతుంది. మొదటగా, సిరలోకి రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ ఎక్కించబడుతుంది. శరీరంలోని మిగతా భాగంతో పోల్చుకుంటే ఈ అయోడిన్‌ని ప్రాధాన్యంగా థైరాయిడ్‌ కణజాలం తీసుకుంటుంది. కొద్దిసేపు వేచివున్న తరువాత గమ్మా కెమెరా సహాయంతో స్కాన్‌ తీయబడుతుంది, ఎక్కించిన పదార్థాన్ని ఇది తీసుకుంటుంది.

పిఇటి (పొజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫి) స్కాన్‌ లేదా పిఇటి-సిటి స్కాన్

పిఇటి-సిటి స్కాన్‌ అనేది ప్రత్యేక సిటి స్కాన్‌, దీనిలో 18ఎఫ్‌డిజి అనే రేడియోయాక్టివ్‌ ట్రేసర్‌ని సిటి స్కాన్‌కి ముందు శరీరంలోకి ఎక్కించబడుతుంది. గ్లూకోజ్‌ అవసరం ఎక్కువగా ఉన్న శరీరం లోపలి ప్రాంతాల్లో ఈ ట్రేసర్‌ ఉంటుంది. జీవించడానికి గ్లూకోజ్‌ చాలా ఎక్కువగా క్యాన్సర్‌లకు అవసరం కాబట్టి, మిగతా శరీరం కంటే చాలా ఎక్కువ మొత్తంలో ట్రేసర్‌ని అవి తీసుకుంటాయి. క్యాన్సర్‌ని అప్పుడు స్కాన్‌లో సులభంగా చూడవచ్చు. థైరాయిడ్‌ క్యాన్సర్‌లో ఈ స్కాన్‌ని అప్పుడప్పుడు తీస్తారు.

క్యాన్సర్‌ స్టేజ్‌ అనేది శరీరంలో క్యాన్సరు ఉన్న తావు మరియు సైజును వివరించేందుకు ఉపయోగించే పదం. క్యాన్సర్‌ స్టేజ్‌ని తెలుసుకోవడం అత్యంత సముచితమైన చికిత్సను అందించడానికి డాక్టర్లకు సహాయపడుతుంది.

టిఎన్‌ఎం సిస్టమ్‌ లేదా నంబరు సిస్టమ్‌ని ఉపయోగించి థైరాయిడ్‌ క్యాన్సర్‌ స్టేజ్‌ని నిర్ణయించడం జరుగుతుంది.

టిఎన్‌ఎం పూర్తి రూపం ట్యూమర్‌, నోడ్‌ మరియు మెటాస్టాసెస్‌

టి స్టేజింగ్‌

టి1ఎ కణితి 1 సెం.మీ లేదా చిన్నదిగా ఉంటుంది మరియు థైరాయిడ్‌ని దాటి పెరగలేదు.
టి1బి కణితి 1 సెం.మీ కంటే పెద్దగా మరియు 2 సెం.మీ కంటే చిన్నదిగా ఉంటుంది మరియు థైరాయిడ్‌ని దాటి పెరిగింది.
టి2 కణితి 2 సెం.మీ కంటే పెద్దగా మరియు 4 సెం.మీ కంటే చిన్నదిగా ఉంటుంది మరియు థైరాయిడ్‌ని దాటి పెరగలేదు.
టి3 కణితి 2 సెం.మీ కంటే పెద్దగా ఉంది లేదా థైరాయిడ్‌ని దాటి పెరగడం ఇప్పుడే మొదలైంది.
టి4ఎ కణితి ఏ సైజులోనైనా ఉంది మరియు స్వర పేటిక, గాలి గొట్టం, అన్నవాహిక లేదా స్వర పేటిక సమీపంలోని నరం లాంటి మెడలోని సమీప ప్రాంతాలకు థైరాయిడ్‌ పెరిగింది
టి4బి కణితి ఏ సైజులోనైనా ఉంది మరియు వెన్నెముక లేదా పెద్ద రక్త నాళాలు లాంటి సమీప ప్రాంతాలకు థైరాయిడ్‌ పెరిగింది

అనప్లాస్టిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌కి టి స్టేజింగ్

అనప్లాస్టిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌లన్నీ రోగనిర్థారణ సమయంలో టి4 క్యాన్సర్‌లుగా పరిగణించబడతాయి.

టి4ఎ కణితి థైరాయిడ్‌ లోపల ఉంది
టి4బి కణితి థైరాయిడ్‌ని దాటి బయటకు పెరిగింది

థైరాయిడ్‌ క్యాన్సర్‌కి ఎన్‌ స్టేజింగ్

ఎన్‌ఎక్స్‌ రీజినల్‌ లింఫ్‌ నోడ్‌లను మదింపుచేయలేరు
ఎన్‌0 క్యాన్సర్‌ సమీపంలోని లింఫ్‌ నోడ్‌లకు విస్తరించలేదు
ఎన్‌1ఎ క్యాన్సర్‌ థైరాయిడ్‌ చుట్టూ గల లింఫ్‌ నోడ్‌లకు విస్తరించింది
ఎన్‌1బి క్యాన్సర్‌ మెడ లేదా ఎగువ ఛాతిలో ఇతర లింఫ్‌ నోడ్‌లకు విస్తరించింది

ఎం స్టేజింగ్

ఎం0 క్యాన్సరు దూర ప్రాంతాలకు విస్తరించినట్లుగా సాక్ష్యం లేదు
ఎం1 దూరాన ఉన్న లింఫ్‌ నోడ్‌లు, అవయవాలు లేదా ఎముకలు లాంటి శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్‌ విస్తరించింది

నంబరు స్టేజింగ్‌

నంబర్‌ స్టేజింగ్‌ 1 నుంచి 4 ఉంటుంది. భిన్న టిఎన్‌ఎం స్టేజ్‌లను కలపడం ద్వారా ఈ స్టేజ్‌లను తయారు చేస్తారు.

45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల రోగుల్లో పాపిల్లరీ లేదా ఫోలిక్యులర్‌ థైరాయిడ్‌ క్యాన్సర్

స్టేజ్‌ 1- ఏదైనా టి స్టేజ్‌, ఏదైనా ఎన్‌ స్టేజ్‌, ఎం0

స్టేజ్‌ 2- ఏదైనా టి స్టేజ్‌, ఏదైనా ఎన్‌ స్టేజ్‌, ఎం1

45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల రోగుల్లో పాపిల్లరీ లేదా ఫోలిక్యులర్‌ థైరాయిడ్‌ క్యాన్సర్

Stage 1- T1 N0 M0

Stage 2- T2 N0 M0

Stage 3- T3 N0 M0
T1 to T3 N1a M0

Stage 4a- T4a, Any N stage, M0
T1 to T3, N1b, M0

Stage 4b- T4b, Any N, M0
Any T, Any N, M1

మెడుల్లరీ థైరాయిడ్‌ క్యాన్సర్

Stage 1- T1 N0 M0

Stage2- T2 N0 M0
T3 N0 M0

Stage 3- T1 to T3,N1a,M0

Stage 4a- T4a, any N, M0
T1 to T3, N1b, M0

Stage 4b- T4b, Any N, M0
Any T, Any N, M1

అనప్లాస్టిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌

అనప్లాస్టిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌లన్నిటినీ స్టేజ్‌ 4గా పరిగణిస్తారు

Stage 4a- T4a, Any N, M0

Stage 4b- T4B, Any N, M0

Stage 4c- Any T, Any N, M0

థైరాయిడ్‌ క్యాన్సర్‌కి విభిన్న రకాల చికి్త్సలు లభిస్తున్నాయి. వీటిల్లో ఉన్నవి

  • థైరాయిడ్‌ సర్జరీ
  • రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ చికిత్స
  • కీమోథెరపి
  • రేడియోథెరపి
  • థైరాయిడ్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్

మరిన్ని వివరాలకు దయచేసి సంబంధిత సెక్షన్‌లు చూడండి.

థైరాయిడ్‌ గ్రంథిని సర్జరీతో తొలగించడం థైరాయిడ్‌ యొక్క పాపిల్లరీ, ఫోలిక్యులర్‌ మరియు మెడుల్లరీ కార్సినోమాలను అదుపుచేయడంలో సాధారణంగా చేయబడే మొదటి చికిత్స ప్రక్రియ. థైరాయిడ్‌ గ్రంథిలో మరియు గ్రంథి బయట థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఏ మేరకు ఉందనే దానిని బట్టి చేయబడే సర్జికల్‌ ఆపరేషన్‌ రకం ఉంటుంది. సాధారణ మత్తు మందు కింద థైరాయిడ్‌ సర్జరీ చేయబడుతుంది మరియు సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులు ఆసుపత్రిలో ఉండిపోవలసి ఉంటుంది.

పాక్షిక థైరోయిడెక్టమి

ఈ సర్జరీలో థైరాయిడ్‌ గ్రంథి యొక్క ఒక భాగం లేదా లోబ్‌ని తొలగించడం జరుగుతుంది. దీనిని పాక్షిక థైరోయిడెక్టమి లేదా లోబెక్టమి లేదా హెమిథైరోయిడెక్టమిఅని అంటారు. స్టేజ్‌ 1 పాపిల్లరీ లేదా ఫోలిక్యులర్‌ థైరాయిడ్‌ క్యాన్సరు గల కొంతమంది రోగుల్లో ఇది చేయబడుతుంది.

టోటల్‌ థైరోయిడెక్టమి

ఈ ఆపరేషన్‌లో థైరాయిడ్‌ గ్రంథి మొత్తాన్ని తొలగించడం జరుగుతుంది. థైరాయిడ్‌ గ్రంథి వెనుక ఉన్న పారాథైరాయిడ్‌ గ్రంథులను వదిలేయడం జరుగుతుంది. టోటల్‌ థైరోయిడెక్టమి తరువాత, రోగి జీవితాంతం థైరాయిడ్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ని తీసుకోవలసిన అవసరం ఉంది. థైరాయిడ్‌ క్యాన్సరు గల అత్యధిక మంది రోగులు టోటల్‌ థైరోయిడెక్టమి చేయించుకుంటారు.

లింఫ్‌ నోడ్‌ని తొలగించుట

థైరాయిడ్‌ సర్జరీ చేసినప్పుడు, అత్యధిక సందర్భాల్లో మెడలో గల లింఫ్‌ నోడ్‌లను తొలగిస్తారు. మధ్య అరలో (లెవెల్‌ 6) ఉన్న లింఫ్‌ నోడ్‌లను ఎల్లప్పుడూ తొలగిస్తారు. మెడకు క్యాన్సరు విస్తరిస్తేనే లేదా విస్తరించినట్లుగా అనుమానిస్తేనే దానిలోని ఇతర ప్రాంతాల్లో గల లింఫ్‌ నోడ్‌లను తొలగించడం జరుగుతుంది.థైరాయిడ్‌ సర్జరీ యొక్క సంక్లిష్టసమస్యలు లేదా దుష్ప్రభావాలు
థైరాయిడ్‌ సర్జరీ ఇతర వాటితో పోల్చుకుంటే సురక్షితమైన ఆపరేషన్‌ మరియు మామూలుగా ప్రాక్టీస్‌ చేయబడుతోంది. అయితే, ఏదైనా రకం సర్జరీతో కలిగినట్లుగానే, సంక్లిష్ట సమస్యలు ఉండొచ్చు, ఇవి ఈ కింద ఇవ్వబడ్డాయి.

పారాథైరాయిడ్‌ గ్రంథులకు డేమేజ్‌ రిస్కు

సర్జరీ చేసేటప్పుడు, పారాథైరాయిడ్‌ గ్రంథులకు డేమేజ్‌ కలిగి రక్తంలో క్యాల్షియం స్థాయిలు తగ్గడానికి మరియు క్యాల్షియం అనుబంధం తీసుకోవలసిరావడానికి దారితీయొచ్చు. ఆపరేషన్‌ తరువాత ఈ రిస్కును గమనిస్తారు.

రక్తస్రావం

సర్జరీ చేసిన తరువాత, ఆపరేషన్‌ చేసిన తావు నుంచి రక్తస్రావం కలగవచ్చు మరియు దీనిని ఆపేందుకు రోగిని తిరిగి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళవలసి ఉంటుంది.

నరం దెబ్బతినడం

స్వర పేటికకు వెళ్ళే నరం సర్జరీ సమయంలో దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల బొంగురుగొంతు ఏర్పడవచ్చు. గొంతుబొంగురుపోవడం సాధారణంగా దానంతటదే మెరుగుపడుతుంది. ఈ దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం కొద్దిగా ఉంటుంది మరియు ఆపరేషన్‌ చేసే సర్జన్‌ దీని గురించి మరింతగా వివరిస్తారు.

ఇతర సర్జరీలు

వ్యాధి మొత్తాన్ని పూర్తిగా తొలగించడం సాద్యం కాని మెడలో వ్యాధి తీవ్రంగా గల రోగులకు, వ్యాధిని చాలా వరకు తగ్గించేందుకు కొన్నిసార్లు డీబల్కింగ్‌ సర్జరీ చేయబడుతుంది. ఆ తరువాతే ఇతర చికిత్సలు చేయబడతాయి.
ట్రాకియోస్టోమి అనేది సర్జరీ. దీనిలో థైరాయిడ్‌ క్యాన్సరు వల్ల గాలి గొట్టం అణచివేయబడి రోగికి శ్వాసతీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ సర్జరీలో, థైరాయిడ్‌ వాపు కింద మెడ దిగువ భాగంలో శ్వాస నాళంలో చిన్న రంధ్రం చేయబడుతుంది. దీనివల్ల రోగి సులభంగా శ్వాస తీసుకోగలుగుతారు. రంధ్రంలో ట్రాకియోస్టోమి ట్యూబు పెడతారు.

పాపిల్లరీ మరియు ఫోలిక్యులర్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌కి రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ మామూలుగా ఉపయోగించే చికిత్స.
థైరాయిడ్‌ గ్రంథి పనిచేయాలంటే మామూలుగా అయోడిన్‌ అవసరమవుతుంది. రక్తంలో ఉన్న అయోడిన్‌ని థైరాయిడ్‌ గ్రంథి తీసుకొని థైరాయిడ్‌ హార్మోన్‌ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తుంది. రేడియోయాక్టివ్‌ రూపంలో ఇచ్చిన అయోడిన్‌ని థైరాయిడ్‌ కణాలు మరియు డిఫరెన్షియేటెడ్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ కణాలు తీసుకుంటాయి. తీసుకోబడిన రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ స్థానికంగా రేడియేషన్‌ని ఉద్గమింపజేసి క్యాన్సర్‌ కణాలను చంపుతుంది, కానీ శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపదు. మామూలుగా ఉపయోగించే రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ ఐ-131 ఉంటుంది.
రోగి థైరోయిడెక్టమిని (థైరాయిడ్‌ని తొలగించడం) పూర్తిచేసిన తరువాత రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ ఇవ్వబడుతుంది. థైరాయిడ్‌ సర్జరీ తరువాత ఉండిపోయిన అవశేష వ్యాధిని సూక్ష్మదర్శినితో ధ్వంసం చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. కొంతమంది రోగుల్లో ఉన్న ఏదైనా స్పష్టమైన అవశేష లేదా మెటాస్టాటిక్‌ వ్యాధికి చికిత్స చేసేందుకు కూడా ఇది సహాయపడుతుంది. చికిత్సగా రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ ఉపయోగించబడిన రోగుల్లో 1 సెం.మీ కంటే ఎక్కువ సైజు గల పాపిల్లరీ క్యాన్సర్‌లు, థైరాయిడ్‌ క్యాప్సుల్‌ లేదా లింఫ్‌ నోడ్స్‌లకు సోకిన 1 సెం.మీ కంటే ఎక్కువ సైజు గల ఫోలిక్యులర్‌ క్యాన్సర్‌లు గల వారు ఉన్నారు.

చికిత్సకు ముందు

రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ ఐ131 ప్రధానంగా క్యాప్సుల్ రూపంలో ఇవ్వబడుతుంది. దీనిని ఇతర రూపాల్లో కూడా ఇవ్వవచ్చు. చికిత్స సాధారణంగా ఇన్‌పేషెంట్‌గా ఇవ్వబడుతుంది. రేడియోయాక్టివ్‌ అయోడిన్‌తో చికిత్సకు ముందు, రోగి కొద్ది వారాల పాటు థైరాయిడ్‌ హార్మోన్‌ని తీసుకోవడం ఆపేయాలి లేదా దీనికి బదులుగా ఆర్‌-టిఎస్‌హెచ్‌ అనే ఒక రకం థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ని తీసుకోవాలి. ఈ పద్ధతుల్లో ఏదో ఒకటి రక్తంలో టిఎస్‌హెచ్‌ (థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌) స్థాయిలను పెంచడానికి, రేడియోయాక్టివ్‌ చికిత్స మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి.

ఇంకా, చికిత్సకు ముందు రెండు వారాల పాటు అయోడిన్‌ తక్కువ ఉన్న ఆహారం తీసుకోవలసిందిగా రోగిని అడగటం జరుగుతుంది. చేపలు మరియు సీ ఫుడ్‌, అయోడైజ్‌డ్‌ ఉప్పు, పాల పదార్థాలు మరియు ఇ127 లాంటి ఆహార రంగులు లాంటి ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి

ఆసుపత్రిలో

ఆసుపత్రిలో చేరగానే, రోగిని ఒక గదిలో వేరుగా ఉంచడం జరుగుతుంది. ఈ గది మందపాటి గోడలు మరియు గది నుంచి రేడియేషన్‌ని బయటకు పోనివ్వని లీడ్‌ లైన్‌డ్‌ తలుపులు గల ప్రత్యేక గది. రోగిని కొద్ది రోజుల పాటు రేడియోయాక్టివ్‌గా ఉంచడం జరుగుతుంది మరియు సింగిల్‌ రూమ్‌లో ఏకాంతంగా ఉంచడం వల్ల ఇతరులు రేడియేషన్‌కి గురవ్వకుండా ఉంటారు. శరీరంలో రేడియేషన్‌ స్థాయిలు సురక్షితమైన స్థాయిలకుచేరుకుంటే, రోగిని ఇంటికి పంపడం జరుగుతుంది.

దుష్ప్రభావాలు

రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ యొక్క దుష్ప్రభావాలు కొద్దిగా మరియు స్వల్పంగా ఉంటాయి. అప్పుడప్పుడు రోగికి వికారం, నొప్పి లేదా మెడలో బిగుసుకుపోయిన అనుభూతి లేదా శ్వాసతీసుకోలేకపోవడం ఉండొచ్చు. దీర్ఘ కాలంలో, కొంతమంది రోగులకు నోరు ఎండిపోవచ్చు. యువకుల్లో, సంతానోత్పత్తి సామర్థ్యం ప్రభావితం కావచ్చు మరియు చికిత్సకు ముందు వీర్యం స్టోరేజ్‌ని పరిగణించవచ్చు.

చికిత్స తరువాత

చికిత్స తరువాత కొద్ది రోజుల నుంచి వారాల పాటు, ఏదైనా అవశేష వ్యాధిని చూసేందుకు అయోడిన్‌ అప్‌టేక్‌ స్కాన్‌ తీయబడవచ్చు. ఇలాంటి వ్యాధి ఇప్పటికీ ఉంటే, రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ మోతాదును మళ్ళీ ఇవ్వవచ్చు. లేకపోతే, రోగిని 10 సంవత్సరాల పాటు సన్నిహితంగా అనుసరించడం జరుగుతుంది.

థైరాయిడ్‌ క్యాన్సర్‌లో రేడియోథెరపిని ఉపయోగిస్తారు, కానీ రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ కంటే తక్కువ సామాన్యంగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనం పాపిల్లరీ మరియు ఫోలిక్యులర్‌ క్యాన్సర్‌లు లాంటి డిఫరెన్షియేటెడ్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ గురించి ప్రధానంగా మాట్లాడబోతున్నాము. ఇక్కడ ఉపయోగించే రేడియోథెరపి రకం ఎక్స్‌టర్నల్‌ బీమ్‌ రేడియోథెరపి, దీనిని లీనియర్‌ యాక్సెలరేటర్‌ అనే యంత్రం సహాయంతో ఇస్తారు. చికిత్స సాధారణంగా వారానికి 5 రోజులు రోజుకు ఒకసారి చొప్పున 5-6 వారాల పాటు ఇవ్వబడుతుంది.
స్థానికంగా ముదిరిన, సర్జరీ తరువాత కొద్దిగా అవశేష వ్యాధి ఉన్న లేదా అనేక లింఫ్‌ నోట్స్‌కి వ్యాధి సోకిన లేదా ప్రారంభ చికిత్స తరువాత వ్యాధి తిరిగొచ్చిన మరియు రేడియోయాక్టివ్‌ అయోడిన్‌కి స్పందించని లేదా స్పందించబోని క్యాన్సరులో రేడియోథెరపిని మామూలుగా ఉపయోగిస్తారు. సర్జరీతో వ్యాధిని నిర్మూలించడం సాధ్యంకానప్పుడు కూడా రేడియోథెరపి ఉపయోగించబడుతుంది. రేడియోథెరపితో చికిత్స చేయబడిన ప్రాంతంలో సాధారణంగా మెడ మొత్తం మరియు ఎగువ ఛాతీ ప్రాంతాలు ఉంటాయి.
మెటాస్టాటిక్‌ వ్యాధి గల రోగుల్లో, వ్యాధి ఎముకలకు లేదా ఊపిరితిత్తులు తదితర వాటికి విస్తరించినప్పుడు నొప్పి లేదా రక్తస్రావం లాంటి లక్షణాలను నియంత్రించేందుకు రేడియోథెరపిని ఉపయోగిస్తారు. ఈ లక్షణాలను నియంత్రించే లక్ష్యంతో ఇక్కడ 1-10 రోజుల పాటు చికిత్స చేయబడుతుంది.

క్యాన్సర్‌ చికిత్సలో కీమోథెరపి మరియు లక్షిత థెరపీలు లాంటి పదార్థాలను ఉపయోగించడం సిస్టమిక్‌ థెరపి ఉంటుంది. డిఫరెన్షియేలెడ్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌లో, సిస్టమిక్‌ థెరపిని ఉపయోగించడం మామూలుగా ఉండదు. ఇది మెటాస్టాటిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌లో మాత్రమే సిఫారసు చేయబడుతోంది, దీనిలో క్యాన్సర్‌ శరీరంలోని విభిన్న భాగాలకు విస్తరించివుంటుంది మరియు రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ థెరపి ప్రభావరహితంగా ఉంటోంది.

మెటాస్టాటిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ గల రోగుల్లో, మ్యుటేషన్‌ల కోసం చూడటానికి బయాప్సీ శాంపిల్‌పై జన్యుపరమైన పరీక్ష చేయబడుతుంది. చికిత్స రకాన్ని గుర్తించే నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఈ పరీక్షలు సహాయపడతాయి.
బిఆర్‌ఎఎఫ్‌ మ్యుటేషన్‌లు గల క్యాన్సర్‌లకు లెన్వాటినిబ్‌ లాంటి యాంటీ-యాంజియోజెనిక్‌ టైరోసిన్‌ కినసే ఇన్హిబిటర్లు ఉపయోగించబడతాయి. ఇతర వాటిల్లో సొరాఫెనిబ్‌, డాబ్రాఫెనిబ్‌ మరియు వెమురాఫెనిబ్‌ ఉంటాయి.
కీమోథెరపి ఎంపికలు అరుదుగా ఉపయోగించబడతాయి మరియు ఇలాంటి పరిస్థితిలో ఉపయోగించే ఔషధంలో డోక్సోరుబిసిన్‌ ఉంటుంది.

థైరాయిడ్‌ యొక్క మెడుల్లరీ కార్సినోమా అనేది న్యూరో ఎండోక్రైన్‌ క్యాన్సర్‌ మరియు థైరాయిడ్‌ గ్రంథి యొక్క పారాఫోలిక్యులర్‌ కణాల నుంచి ఉత్పన్నమవుతుంది. దీని ప్రవర్తన మరియు చికిత్స అనేది డిఫరెన్షియేటెడ్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ కంటే భిన్నమైనది. మెడుల్లరీ కార్సినోమాస్‌ అన్నిటిలో దాదాపు 20% మెన్‌ 2 సిండ్రోమ్‌లో భాగంగా ఉత్పన్నమవుతున్నాయి.

లక్షణాలు

ఈ క్యాన్సర్‌ సాధారణంగా మెడలో ఏక లేదా అనేక గడ్డలుగా ఉంటుంది. కొన్నిసార్లు, క్యాన్సరు ఇతర ప్రాంతాలకు విస్తరించివున్నందున ఆ ఇతర భాగాల నుంచి వస్తున్న లక్షణాలను ఇది ప్రదర్శించవచ్చు.

రోగనిర్థారణ

థైరాయిడ్‌ యొక్క మెడుల్లరీ కార్సినోమా యక్క రోగనిర్థారణ మెడ గడ్డలోకి ఫైన్‌ నీడిల్‌ ఆస్పిరేషన్‌ సైటాలజీపై (ఎఫ్‌ఎన్‌ఎసి) చేయబడుతుంది. దీనిలో చిన్న పలచని సూది గడ్డలోకి గుచ్చబడుతుంది మరియు కణాలు ఆస్పిరేట్‌ చేయబడతాయి. పేథాలజిస్టు వీటిని సూక్ష్మదర్శినిలో చూస్తారు.క్యాన్సర్‌ స్టేజ్‌ని నిర్థారించేందుకు మరియు క్యాన్సర్‌ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించినట్లుగా సాక్ష్యం కోసం చూడటానికి సిటి స్కాన్‌ లేదా ఎంఆర్‌ఐ తీయబడతాయి.

చికిత్స

సర్జరీ

థైరాయిడ్‌ యొక్క మెడుల్లరీ కార్సినోమాకు చికిత్సలో టోటల్‌ థైరోయిడెక్టమి (థైరాయిడ్‌ తొలగించడం) ఉంటుంది. సర్జరీ తరువాత, వెంటనే థైరాయిడ్‌ రీప్లేస్‌మెంట్‌ హార్మోన్‌ ప్రారంభించబడుతుంది. రక్తంలో కాల్సిటోనిన్‌ మరియు సిఇఎ స్థాయిలను పర్యవేక్షిస్తూనే ఉండాలని సాధారణంగా సిఫారసు చేయబడుతుంది.

రేడియోథెరపి

మెడ లేదా ఎగువ ఛాతీలో కణితిని పూర్తిగా విచ్ఛేదనం చేయడం సాధ్యపడనప్పుడు కొన్ని సెట్టింగ్స్‌లో రేడియోథెరపిని ఉపయోగిస్తారు. చికిత్సను ఎక్స్‌టర్నల్‌ బీమ్‌ రేడియోథెరపి రూపంలో ప్రతి రోజూ, వారానికి అయిదు రోజుల చొప్పున దాదాపు 5 వారాల పాటు చేయబడుతుంది.

ఇతర చికిత్సలు

మెటాస్టాటిక్‌ వ్యాధి (క్యాన్సర్‌ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించడం) గల మరియు కచ్చితమైన వ్యాధి పురోగతి గల రోగులకు, కార్బోజాంటినిబ్‌ మరియు వండెటానిబ్‌ లాంటి టైరోసిన్‌ కినసే ఇన్హిబిటర్‌లు అనే కొత్త ఏజెంట్లను ఉపయోగించవచ్చు. ఈ సెట్టింగులో కూడా కీమోథెరపిని ఉపయోగించవచ్చు, కానీ వాటి నుంచి కలిగే ప్రయోజనం చిన్నదిగా ఉంటుంది. ఉపయోగించే కీమోథెరపి ఔషధాల్లో డకార్‌బజైన్‌, సైక్లోఫాస్ఫమైడ్‌ మరియు విన్‌క్రైస్టిన్‌ ఉంటాయి.

థైరాయిడ్‌ యొక్క అనప్లాస్టిక్‌ కార్సినోమా అనేది థైరాయిడ్‌ క్యాన్సర్‌ యొక్క అగ్రెసివ్‌ రూపం. ఇది సాధారణంగా 60 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధుల్లో నిర్థారణ చేయబడుతుంది మరియు మొత్తం థైరాయిడ్‌ క్యాన్సర్‌లలో ఇది దాదాపు 5% ఉంటోంది. ఇది చాలా త్వరగా పెరుగుతుంటుంది, మరియు చికిత్స వెంటనే ప్రారంభించబడుతుంది.

లక్షణాలు

ఈ క్యాన్సర్‌ యొక్క అత్యంత సామాన్యమైన లక్షణం థైరాయిడ్‌ మాస్‌. ఇది మెడ నొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, మింగడంలో కష్టం, దగ్గు లేదా స్వరంలో మార్పు లాంటి ఇతర లక్షణాలతో ఇది ముడిపడివుండొచ్చు.
ఇతర లక్షణాలు శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్‌ విస్తరించిన విషయం ప్రతిబింబించవచ్చు.

నిర్థారణ

ఎఫ్‌ఎన్‌ఎసి (ఫైన్‌ నీడిల్‌ ఆస్పిరేషన్‌ సైటాలజీ) లేదా బయాప్సీ సహాయంతో నిర్థారణ చేయవచ్చు.

అనప్లాస్టిక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ యొక్క చికిత్స

సర్జరీ

కణితి కనుక థైరాయిడ్‌ గ్రంథికి పరిమితమైతే సర్జరీ చేయబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టోటల్‌ థైరోయిడెక్టమీ చేయబడుతుంది. అయితే, అత్యధిక పరిస్థితుల్లో, సర్జరీ ద్వారా విచ్ఛేదనం చేయడం ఎంపిక కాదు ఎందుకంటే, వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాధి విస్తరించివుంటుంది కాబట్టి. సర్జరీ చేయబడితే, గరిష్ట నియంత్రణ సాధించేందుకు సర్జరీ తరువాత రేడియోథెరపి మరియు కీమోథెరపి ఇవ్వబడతాయి. రేడియోథెరపి కనుక ఇస్తే, రోజూ ఒకసారి దాదాపు 5 వారాల పాటు, వారానికి 5 రోజులు ఇవ్వబడుతుంది. డోక్సోరుబిసిన్‌, టాక్సేన్‌లు మరియు సిస్‌ప్లాటిన్‌ అనేవి కీమోథెరపిగా ఉపయోగించే ఔషధాలు.

కణితికి ఆపరేషన్‌ చేయలేకపోతే, వ్యాధిని నియంత్రించేందుకు కీమోథెరపి మరియు రేడియోథెరపి సమ్మేళనం ఉపయోగించబడుతుంది. సమ్మేళన చికిత్సకు తగినంతగా ఫిట్‌ కాని రోగుల్లో, రేడియోథెరపి ఒక్కటే ఉపయోగించబడుతుంది.