కోలన్ మరియు కోలన్ క్యాన్సర్

కోలన్ క్యాన్సర్

పురీషస్థానము

పెద్దప్రేగు అని పిలువబడే శరీరంలో పురీషస్థానము ఒక భాగం. ఇది పొత్తికడుపులో ఉంటుంది మరియు ఒక కొస పురీషనాళానికి మరియు ఇంకొక కొస చిన్న ప్రేగులకు కలుపుతుంది. దీనిని పక్వాశయం కాగమ్, పురీషస్థానము లోని ఆరోహణ భాగము, విలోమ పురీషస్థానము, పురీషస్థానము లోని అవరోహణ భాగము మరియు డింబము గా విభజించవచ్చు. డింబము పురీషనాళంగా కొనసాగుతుంది

తీసుకోబడ్డ ఆహారం కడుపు మరియు ప్రేగులలో జీర్ణమవుతుంది. అన్ని పోషకాలు చిన్న ప్రేగుల చేత గ్రహించాబడతాయి మరియు జీర్ణమైన ఆహారంలో అవసరం లేనివి పురీషస్థానానికి పంపబడతాయి. ఈ జీర్ణమైన ఆహారంలో ఉన్న నీరు పెద్దప్రేగులో శోషించబడుతుంది మరియు మిగిలిన నీరు విసర్జించటానికి పురీషనాళంలో నిల్వ చెయ్యబడతాయి.

పురీషస్థాన క్యాన్సర్

పురీషస్థానంలో మొదలయ్యే క్యాన్సర్ను పెద్దప్రేగు కాన్సర్ అని పిలుస్తారు. ఇప్పటిదాకా తెలిసిన సాధారణమైన పెద్దప్రేగు క్యాన్సర్ అడెనొకార్సినోమా. ఈ రకమైన క్యాన్సర్ పురీషస్థానం లోపలి పొరల్లో మొదలవుతుంది, దాన్ని శ్లేష్మ పొర అని అంటారు. లోపల లోపలి పొరలో శ్లేష్మ పొర అని పిలువబడుతుంది. పెద్దప్రేగు కాన్సర్ శ్లేష్మ పొర నుండి పెద్దప్రేగు యొక్క ఇతర పొరలకు తరువాత బయటకు వ్యాపించవచ్చు. ఈ రకంగా వ్యాపించటాన్ని డైరెక్ట్ స్ప్రెడ్ అని అంటారు. ఇది కూడా శోషరస మార్గాల ద్వారా పెద్దప్రేగు చుట్టూ ఉన్న శోషరస గ్రంథులకు మరియు శరీరం యొక్క ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. క్యాన్సర్ కూడా కాలేయం మరియు ఊపిరితిత్తుల వంటి శరీర ఇతర భాగాలకు రక్త ప్రవాహం ద్వారా వ్యాపిస్తుంది.

2018 నాటి గ్లోబోన్ సమాచారం ప్రకారం, 2018 లో భారతదేశంలో 27605 మందికి కొత్తగా పెద్దప్రేగు కాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారించటం జరిగింది, దానితో ఇది మొత్తం క్యాన్సర్లలో 2.4% అవుతుంది.

అడెనోకార్సినోమా

ఎన్నో రక్కాల పెద్దప్రేగు క్యాన్సర్లు ఉన్నాయి, కానీ అందులో సాధారణమైనది అడెనోకార్సినోమా, 95% పెద్ద ప్రేగు క్యాన్సర్లు ఈ రకమే. పెద్దప్రేగు గోడలోని లోపలి భాగంలో ఉండే శ్లేష్మ పొరల యొక్క లైనింగ్ నుండి అడెనొకార్సినోమాలు ఏర్పడతాయి. శ్లేష్మ పొరలకు గ్రంధుల వంటి కణాలు ఉంటాయి అందులో ఈ క్యాన్సర్ పుడుతుంది.

పొలుసుల కణ క్యాన్సర్

ఈ రకమైన కణితులు పెద్దప్రేగు కాన్సర్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రేగుల గోడపై కూడా ఉన్న పొలుసుల కణాల నుంచి ఉత్పన్నమవుతాయి.

లింఫోమా

శోషరస కణుపులు వంటి శోషరస వ్యవస్థ నుండి అభివృద్ధి ఆయే క్యాన్సర్లు లింఫోమాస్. శరీరంలోని ఏ భాగంలోనైనా, పెద్ద ప్రేగు తో సహా, శోషరస కణజాలం నుండి లింఫోమాస్ ఉత్పతి అవుతాయి

కార్సినాయిడ్ కణితులు

ఇవి పెద్దప్రేగు యొక్క లైనింగ్ లో ఉన్న న్యూరోఎండోక్రిన్ కణాలు నుండి ఉత్పన్నమయ్యే అరుదైన కణితులు.

సర్కోమాలు

సార్కోమాలు కండరాల, ఎముక వంటి శరీరంలో సహాయక నిర్మాణ కణాల నుండి తలెత్తే అరుదైన క్యాన్సర్లు. పెద్దప్రేగులో కనిపించే సాధారణ సర్కోమాలు పెద్దప్రేగు గోడలోని కండరాల కణాల నుంచి ఉత్పన్నమవుతాయి.

పొలుసల కణ కార్సినోమాలు, లింఫోమాలు, కార్సినాయిడ్ కణితులు మరియు సార్కోమాస్కు చికిత్స ఎంపికలు అడెనొకార్సినోమాకు భిన్నంగా ఉంటాయి.

వయసు

వృద్ధాప్యంలో సర్వసాధారణంగా ఉన్న అన్ని క్యాన్సర్ల మాదిరిగా, ఎక్కువ వయసులో ఉన్న రోగులలో పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందులోనూ ముఖ్యంగా 60 ఏళ్ళ పైబడిన వారికి.

జన్యు కారకాలు

అసాధారణ జన్యువు కారణంగా పెద్దప్రేగు క్యాన్సర్ కుటుంబాలలో 5% ముందు తరాలకు రావచ్చు. ఒకవేళ దగ్గరి కుటుంబ సభ్యులలో ఒకరికి ఎవరికైనా ఏదైనా వయసులో పెద్ద ప్రేగు క్యానర్ వచ్చి ఉండటం, లేదా దగ్గరి కుటుంబ సభ్యులలో ఒకరికి పెద్ద ప్రేగు క్యానర్ 45 ఏళ్ల కంటే ముందే రావటం వంటివి పెద్ద ప్రేగు క్యాన్సర్కు జన్యుపరమైన కారకాన్ని తెలియచేస్తాయి. ఒక దగ్గరి కుటుంబ సభ్యుడు అంటే తల్లితండ్రులు, కన్న బిడ్డలు, సోదరుడు లేదా సోదరి.
కుటుంబంలోని వారసత్వంగా అసాధారణ జన్యువుల కారణంగా వస్తున్న 5% పెద్ద ప్రేగు క్యాన్సర్లలో, సాధారణంగా కనిపించే రెండు పరిస్థితులు ఫ్యామిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్ (ఎఫ్ఎపి) మరియు హెరెడిటటరీ నాన్ పాలిపోసిస్ కోలన్ క్యాన్సర్ (హెచ్ఎన్పిసిసి). ఎఫ్ఎపి చిన్న వయస్సులోనే పెద్దప్రేగులో పాలిప్స్ అభివృద్ధికి దారితీస్తుంది, ఇది కాలక్రమేణా క్యాన్సర్గా మారుతుంది. ధ్రువీకరించిన ఎఫ్ఎపి ఉన్నవారిలో, ప్రమాదాన్ని తగ్గించడానికి పురీషస్థానాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స సిఫార్సు చేయబడింది.
హెచ్ఎన్పిసిసి అనేది పెద్దప్రేగు కాన్సర్తో పాటుగా క్లోమం, పిత్తాశయం, గర్భాశయం మరియు అండాశయ క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లకు సంబంధించిన పరిస్థితి.

ఊబకాయం మరియు శారీరక శ్రమ

పెద్దప్రేగు కాన్సర్కు ఊబకాయం ప్రమాద కారకంగా ఉంటుంది. అలాగే, శారీరక శ్రమ లేకపోవడం ప్రమాదాన్ని పెంచుతుందని తెలుస్తోంది.

డైట్

ఎరుపు మరియు ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా ఉన్న ఉన్న ఆహారం పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎర్రగా మరియు ప్రాసెస్ చేయబడిన మాంసం ఎక్కువగా తీసుకోవడం అంటే ఒక వారం యొక్క చాలా రోజులలో ఈ ఆహారాలను తినడం. ఎర్ర మాంసం యొక్క వినియోగం వారానికి ఒకసారి లేదా రెండుసార్లు అయితే, అది ప్రమాదాన్ని పెంచదు. పళ్ళు మరియు కూరగాయలలో అధికంగా ఉన్న ఆహారం పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మద్యం

మద్యం వినియోగం పెద్దప్రేగు కాన్సర్ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది మరియు ఈ ప్రమాదం తీసుకున్న మద్యపానానికి అనుగుణంగా పెరుగుతుంది

తాపజనక ప్రేగు వ్యాధి

క్రోన్’స్ వ్యాధి మరియు అల్సరేటివ్ కోలిటిస్ వంటి తాపజనక ప్రేగు వ్యాధి యొక్క సుదీర్ఘ చరిత్ర కలిగిన రోగులు పెద్దప్రేగు కాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదం తాపజనక ప్రేగు వ్యాధి నిర్ధారణ నుండి 10-20 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది.

ఉదర రేడియోథెరపీ

క్యాన్సర్ వలన తమ చిన్నతనంలో ఉదర రేడియోధార్మికత పొందిన పెద్దలు, పెద్ద వయసులో పెద్దప్రేగు కాన్సర్ను వచ్చే ప్రమాదం కలిగి ఉంటారు.

పెద్దప్రేగు క్యాన్సర్ వివిధ రకాల లక్షణాలను కలిగి ఉంటుంది మరియు అవి క్రింద ఇవ్వబడ్డాయి

మల విసర్జన పద్దతిలో మార్పు

మల విసర్జన పద్దతిలో మార్పు పెద్దప్రేగు కాన్సర్లో కనిపించే ఒక సాధారణ లక్షణం. ఈ మార్పు కారణం లేకుండా విరేచనాలు కావటం, లేదా మలబద్ధకం ఇంకా విరేచనాల ఒకదాని తరువాత ఒకటి రావటం. ఈ లక్షణాలు మూడు వారాల కంటే ఎక్కువ ఉంటే పరిశోధనలు జరుగుజరపాల్సిన అవసరం ఉంది.

మలవిసర్జనలో రక్తం

మలవిసర్జనలో రక్తస్రావం లేదా పాయువు నుండి రక్తస్రావం అనేది పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణం కావచ్చు లేదా పైల్స్ లేదా ఇతర కారణాల వలన కూడా కావచ్చు. కానీ అందుకు వైద్యుడిని సంప్రదించటం ముఖ్యం.

పొత్తి కడుపు నొప్పి

పొత్తి కడుపు లేదా కడుపు నొప్పి ప్రేగు క్యాన్సర్ యొక్క లక్షణం. మళ్ళీ, ఈ లక్షణానికి ఎన్నో కారకాలు ఉండచ్చు మరియు లక్షణం కొనసాగితే ఒక కారణం కోసం శోధించడానికి పరీక్షలు చేయ్యిన్చుకోవాల్సి ఉంటుంది.

ఇతర లక్షణాలు

బరువు కోల్పోవటం, అలసట, రక్తహీనత, పొత్తికడుపు యొక్క వ్యాకోచం, వాంతులు వంటి ఇతర లక్షణాలు పెద్దప్రేగు కాన్సర్కు సంబంధించి ఉంటాయి.

పెద్ద ప్రేగుక్యాన్సర్ అని అనుమానం ఉంటే, ఈ క్రింది పరిశోధనలు సాధారణంగా జరుపబడతాయి. ప్రతికేసులోఅన్నిపరిశోధనలు అవసరంలేదు.

కోలోనోస్కోపీ

కోలొనోస్కోపీ అనేది ఒక ఎండోస్కోపిక్ పరీక్ష, ఇక్కడ ఒక లైట్ మరియు కెమెరా అమర్చబడి ఉన్న ఒక సన్నని గొట్టం పాయువులోకి చొప్పించబడి, పురీషనాళం మరియు పెద్దప్రేగులోకి ప్రవేశింపచెయ్యబడుతుంది. పరీక్షచేస్తున్నడాక్టర్ ఒక స్క్రీన్పై పెద్ద ప్రేగు లోపలికి చూడగలుగుతారు మరియు పెద్ద ప్రేగులో ఉన్నఅసాధారణ పరిస్థితులను గుర్తించగలుగుతారు. ఈ ప్రక్రియ ద్వారా పెద్ద ప్రేగు మొత్తం చూడవచ్చు.

ఇది ఒక అవుట్ పేషెంట్ విధానం మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి తేలికపాటి అనస్థీషియా కింద జరుపబడుతుంది. వైద్యుడు ఏదైనా అసాధారణమైనది కనుగొంటే, కణజాలనమూనాను (బయాప్సీ) పరీక్షల కోసం తీసుకోవచ్చు.

అలాగే, కొన్నిసార్లు పాలిప్స్ వంటి చిన్నఅసాధారణ ప్రాంతాలు ఈ పద్ధతిలో పూర్తిగా తొలగించబడతాయి. కోలోనోస్కోపీకి ముందు, పురీషస్థానము మరియు పురీషనాళం ఖాళీ అవ్వటానికి రోగికి ముందు రోజు మందులు ఇవ్వబడతాయి.

ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ

ఈ పరీక్ష ఒక కోలొనోస్కోపీ వలె అదే రకమైన ట్యూబ్నుఉపయోగిస్తుంది, కానీ పెద్ద ప్రేగు మరియు పురీషనాళం యొక్క దిగువభాగాన్నిమాత్రమే పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఇది అవుట్ పేషెంట్ క్రియగా జరుగుతుంది మరియు సాధారణంగా ఏ రకమైన అనస్థీషియా అవసరంలేదు. పురీషనాళం మరియు పురీషస్థాన కింది భాగం ఖాళీ చేయటానికి పరీక్షకు ముందు ఎనీమా ఇవ్వబడుతుంది.

వర్చువల్ కొలొనోస్కోపీ లేదా సీటీ కోలోనోగ్రఫీ

ఈ పరీక్షలో సీటీ స్కాన్ సహాయంతో పెద్ద ప్రేగు లోపల చూడటంజరుగుతుంది. రోగి పెద్ద ప్రేగును ఖాళీచేయటానికి ముందు రోజు మందులు ఇస్తారు మరియు స్కాన్ కు ముందు కొన్నిరోజుల పాటు నిర్దిష్ట ఆహారం తీసుకోవాల్సిఉంటుంది. పెద్ద ప్రేగు యొక్క వివరణాత్మక చిత్రాలను పొందటానికి సీటీస్కాన్ చేయబడుతుంది. పెద్ద ప్రేగులోఉన్నఅసాధారణతలు చూడవచ్చు. ఈ పరీక్ష యొక్క లోపము ఏమిటంటే, బయాప్సీ చెయ్యటం కుదరదు మరియు బయాప్సీ చెయ్యటం కోసం కోలొనోస్కోపీ మరలా చెయ్యాల్సి వస్తుంది.

సీటీస్కాన్

పెద్దప్రేగు క్యాన్సర్కోలొనోస్కోపీ మరియు బయాప్సీలో నిర్ధారణ అయ్యాక ,ఛాతీ,ఉదరం మరియు పొత్తి కడుపు భాగంలో కాంట్రాస్ట్ఎన్హాన్సడ్సీటీ స్కాన్ చేయబడుతుంది. ఈ స్కాన్తనమూలం నుండి క్యాన్సర్వ్యాప్తి శరీరం యొక్క ఇతర ప్రాంతాలకు వ్యాపించిందేమో చూడడానికి ఉపయోగించబడుతుంది.

పెట్ – సీటీస్కాన్

ఒక పెట్ – సీటీ స్కాన్ అనేది సీటీ స్కాన్ తో కలిపబడిన పెట్ స్కాన్. ఇది స్కాన్ కు ముందు సిరలోకి ఒక ప్రత్యేక రేడియోధార్మిక రంగును ప్రవేశపెట్టడం అనే అంశాన్నికలిగిఉంటుంది. కొన్నిప్రత్యేక పరిస్థితులలో సాధారణ సీటీ స్కాన్ కన్నా క్యాన్సర్ను గుర్తించటంలో ఈ ప్రత్యేక రంగు ఉపయోగపడుతుంది.

పెద్ద ప్రేగు క్యాన్సర్లో, పెట్ –సీటీ ని రొటీన్ స్టేజింగ్ కు సిఫారసు చెయ్యడం జరగదు కానీ కాలేయము లేదా ఇతర అవయవాలకు శస్త్రచికిత్స పరిగణించబడుతున్నప్పుడు లేదాప్రామాణిక సీటీ స్కాన్ క్యాన్సర్ ఉనికిని లేదా లేకపోవడాన్ని స్పష్టంగా గుర్తించలేకపోయినప్పుడు, అటువంటి దశలలోఉపయోగించబడుతుంది.

ఎంఆర్ఐ స్కాన్

ఒక ఎంఆర్ఐ స్కాన్ క్యాన్సర్ ను లేదా పెద్ద ప్రేగు క్యాన్సర్ నిర్ధారణ కొరకు సాధారణంగా ఉపయోగించబడదు. కాలేయంలోఉన్నఅసాధారణతలు క్యాన్సర్ అని అనుమానం కలిగినప్పుడు లేదా కాలేయ శస్త్రచికిత్స అవసరమని భావించే తరుణంలో అంచనా వేయటానికి ఉపయోగిస్తారు.

పెద్ద ప్రేగు క్యాన్సర్ యొక్క స్టేజింగ్ శరీరం యొక్క క్యాన్సర్ పరిమాణం మరియు స్థానాన్ని వివరించడానికి ఉపయోగించబడుతుంది.క్యాన్సర్ స్టేజి తెలుసుకోవటం వలన వైద్యులు సరైన చికిత్సఇవ్వటంలోదోహదపడుతుంది. పెద్ద ప్రేగు క్యాన్సర్ టిఎన్ఎం స్టేజింగ్ వ్యవస్థ లేదా నంబర్ వ్యవస్థ ఆధారంగా నిర్వహించబడుతుంది.

ఏదో ఒక వ్యవస్థతో స్టేజింగ్ నిర్వహించడం పెద్ద ప్రేగులో కణితి యొక్క విస్తృతి, పెద్ద ప్రేగులో క్యాన్సర్ మరియు శోషరస కణుపులు మరియు క్యాన్సర్ వ్యాప్తిని శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించడం వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది.

టిఎన్ఎం అనగా ట్యూమర్, నోడ్ మరియు మెటాస్టసెస్. టి అనేది ట్యూమర్ని సూచిస్తుంది మరియు పెద్ద ప్రేగు కాన్సర్లో పెద్ద ప్రేగు గోడకు ఎంత లోతుగా చొచ్చుకుందో సూచిస్తుంది. ఎన్ అనేది నోడ్ మరియు పెద్ద ప్రేగు చుట్టూ శోషరస కణుపులుకు క్యాన్సర్ వ్యాప్తినిసూచిస్తుంది. ఎం అంటే మెటాస్టసెస్ మరియు శరీరంలోవివిధ భాగాలకు క్యాన్సర్ వ్యాప్తిని సూచిస్తుంది.

నెంబర్ స్టేజింగ్ వ్యవస్థ

క్యాన్సర్ యొక్క టిఎన్ఎం స్టేజ్ ఆధారంగా, పెద్ద ప్రేగు క్యాన్సర్ను 1 నుంచి 4 స్టేజ్లుగా విభజించవచ్చు. డ్యూక్ స్టేజింగ్ అనేది పెద్ద ప్రేగు క్యాన్సర్ యొక్క మరొక వర్గీకరణ. డ్యూక్ స్టేజింగ్ ఏ నుండి డి వరకు ఉంటుంది.

స్టేజ్ 1

స్టేజ్ 1 లో, క్యాన్సర్ పెద్ద ప్రేగునకు పరిమితం చేయబడింది మరియు సబ్ఫ్యూకోసా మరియు మస్క్యులారిస్ పొరలు అనే పెద్ద ప్రేగులో భాగంగా ఉంటుంది. శోషరస కణుపులకు ఎలాంటి సంబంధం లేదు.

స్టేజ్ 2

స్టేజ్ 2 లో, క్యాన్సర్ పెద్ద ప్రేగు బయట ఉన్న ప్రదేశాలలో లేదా పరిసర అవయవాల్లోకి వ్యాపించి శోషరస కణుపులతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది.

స్టేజ్ 3

స్టేజ్ 3 క్యాన్సర్లో, కణితి పెద్ద ప్రేగు యొక్క ఏ పొరలోనైనా ఉంటుంది, కానీ శోషరస కణుపుల ఖచ్చితమైన ప్రమేయం ఉంటుంది.

స్టేజ్ 4

స్టేజ్ 4 లో, క్యాన్సర్ కాలేయం, ఊపిరితిత్తులు వంటి వివిధ శరీర భాగాలకు వ్యాపించి ఉంటుంది.

పెద్ద ప్రేగు క్యాన్సర్ చికిత్స యొక్క అవలోకనం

పెద్ద ప్రేగు క్యాన్సర్ చికిత్స రోగ నిర్ధారణ సమయంలో క్యాన్సర్ స్టేజి పైన ఆధారపడి ఉంటుంది. స్టేజింగ్ ప్రక్రియ పెద్ద ప్రేగు క్యాన్సర్ ను నాన్-మెటాస్టాటిక్, ఎక్కడైతే క్యాన్సర్ పెద్ద ప్రేగు ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటుందో, మరియు శోషరస కణుపులు శరీరంలో వివిధ భాగాలకు వ్యాప్తి చెందకుండా ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటాయో, అలాగే మెటాస్టాటిక్ క్యాన్సర్, ఎక్కడైతే క్యాన్సర్ తన మూలం నుండి శరీరం యొక్క వివిధ భాగాలకు వ్యాప్తి చెంది ఉంటుందో అన్నదాని ప్రకారం విభజింజబడుతుంది.

క్యాన్సర్ మెటాస్టాటిక్ లేదా నాన్-మెటాస్టాటిక్ అన్నది మాత్రమే కాకుండా, రోగనిర్ధారణలో ఉన్న లక్షణాల పైన చికిత్స కూడా ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా, వివిధభాగాలకు వ్యాపించని పెద్ద ప్రేగు క్యాన్సర్, అంటే క్యాన్సర్ సోకిన పెద్ద ప్రేగులో ఒక భాగం మరియు దాని చుట్టూ ఉన్న శోషరస కణాలు శాస్త్ర చికిత్స ద్వారా తీసివేయ్యబడి, ఆపై చికిత్స చేయబడుతుంది. శస్త్రచికిత్స వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.శస్త్రచికిత్స తరువాత, శస్త్రచికిత్స నుండి తీసుకోబడ్డ రోగనిర్ధారణ ఫలితాల పై ఆధారపడి కీమోథెరపీ ఇవ్వబడుతుంది. ఈ అమరికలో ఇచ్చిన కీమోథెరపీని ఆడ్జువెంట్ కీమోథెరపీ అని పిలుస్తారు, దీని ఉద్దేశ్యం నివారణ అవకాశాలను పెంచటమే. కొన్ని సందర్భాల్లో, ఆడ్జువెంట్ రేడియోధార్మిక చికిత్సను పరిగణించవచ్చు కానీ ఇది సర్వసాధారణం కాదు.

మెటాస్టాటిక్ క్క్యాన్సర్ కలిగినరోగులలో, కీమోథెరపీ సాధారణంగా చికిత్స యొక్క మొదటి ఎంపిక. ఇక్కడ కీమోథెరపీ ఒక్కటే గానీ లేదా జీవసంబంధ ఏజెంట్లతో పాటుగా ఇవ్వబడుతుంది, వాటి యొక్క వివరాలు క్రింద చర్చించబడ్డాయి.

మెటాస్టాటిక్ వ్యాధి ఉన్న రోగులలో కానీ పెద్ద ప్రేగులో అడ్డంకి లేదా పెద్ద ప్రేగులో రంధ్రం ఉన్నట్టు సూచించే లక్షణాలతో ఉన్నవారికి గానీ, మొదటగా శస్త్ర సంబంధ విచ్ఛేదం చేసి తరువాత కీమోథెరపీ చేస్తారు. కాలేయం లేదా ఊపిరితిత్తుల భాగాలకు మాత్రమే పరిమితం చేయబడిన మెటాస్టాటిక్ రోగ సంబంధ వ్యాధితో బాధపడుతున్న రోగులు శస్త్రచికిత్స ద్వారా పెద్ద ప్రేగులో మరియు మెటాస్టాటిక్ ప్రాంతాల్లో క్యాన్సర్ తోలిగించటానికి చికిత్స పొందుతారు.

పెద్దప్రేగు క్యాన్సర్ చికిత్సలో భాగంగా శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు కొన్నిసార్లు రేడియోధార్మికత ఉపయోగించడం జరుగుతుంది.

శస్త్రచికిత్స

శస్త్రచికిత్స అనేది పెద్దప్రేగు కాన్సర్ చికిత్సకు ప్రధాన నివారణ ఎంపిక. పెద్దప్రేగు క్యాన్సర్లో, పెద్దప్రేగు మరియు పరిసర శోషరస కణుపులకు మాత్రమే క్యాన్సర్ సోకి ఉంటే, రోగాన్ని పూర్తిగా నయం చెయ్యటానికి పురీషస్థానం మరియు శోషరస కణుపులను తోలిగించటమే శస్త్రచికిత్స యొక్క లక్ష్యం. శోషరస కణుపుల తొలగింపును శోషరస కణుపు విభజనగా పిలుస్తారు మరియు మంచి ఫలితం పొందడానికి కనీసం 12 కణుపులను తొలిగించాలి.

శస్త్రచికిత్స పెద్ద ప్రేగు లో ఉన్న కణితి యొక్క స్థానాన్ని బట్టి ఉంటుంది.

పక్వాశయం లేదా ఆరోహణ పెద్దప్రేగులో కుడి వైపు ఉన్న కణితి రైట్ హెమికోలేక్టోమిని కలిగి ఉంటుంది మరియు పెద్దప్రేగు యొక్క ఆ భాగం చుట్టూ శోషరస గ్రంథులు తొలగించబడతాయి. పెద్దప్రేగు యొక్క కుడి భాగం, అప్పెండిక్స్, పక్వాశయం, మరియు విలోమ పురీషస్థానం వరకు ఇందులో తొలిగించబడతాయి. హెపాటిక్ మడత లో క్యాన్సర్ ఉంటే ఎక్స్టెండెడ్ హెమికోలేక్టోమి చెయ్యబడుతుంది, మరియు ఇందులో భాగంగా విలోమ పురీషస్థానంలో ఒక భాగాన్ని తోలిగించాల్సి ఉంటుంది.

విలోమ పురీషస్థానం లో ఉన్న కణితులు, కణితి యొక్క స్థానాన్ని బట్టి ఎక్స్టెండెడ్ లేదా ఎడమ హెమికోలేక్టోమి తో తొలగించబడతాయి. అరుదైన సందర్బాలలో ఒక విలోమ కోలేక్టోమి జరుగుతుంది.

అవరోహణ పెద్దప్రేగులో కణితులు ఎడమ హెమికోలేక్టోమి ద్వారా చికిత్స చేయబడతాయి మరియు పెద్దప్రేగులో సిగ్మోయిడ్ కణితులు సిగ్మోయిడ్ కోలేక్టోమితో చికిత్స పొందుతాయి. ఎడమ హెమికోలేక్టోమిలో విలోమ పురీషస్థానం, ప్లీహపు వంపు మరియు అవరోహణ పురీషస్థానం మరియు సిగ్మోయిడ్ పురీషస్థానం లో కొంత భాగం తోలిగించాల్సి ఉంటుంది.

సిగ్మోయిడ్ పురీషస్థానం లో కణితిని తొలగించటానికి సిగ్మోయిడ్ కోలేక్టోమి చేయబడుతుంది.
పైన శస్త్రచికిత్సలు బహిరంగ పద్ధతిలో జరుగుతాయి, ఇక్కడ కడుపు మీద కోత చెయ్యబడుతుంది లేదా లాపరోస్కోపిక్ పద్ధతి వాడబడుతుంది. లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స, ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడు చేసినట్లయితే, శస్త్రచికిత్స తర్వాత వేగంగా కోలుకోవటం జరుగుతుంది. అన్ని శస్త్రచికిత్సలలో సాధారణంగా జనరల్ అనస్థీషియా ఇవ్వబడుతుంది.

వ్యాధిగ్రస్తమైన పురీషస్థానం తొలగించబడిన తర్వాత, మిగిలిన పెద్దప్రేగు చివరలను అటాచ్ చేస్తారు మరియు దీనిని అనస్టోమోసిస్ అంటారు. కొన్నిసార్లు, ప్రేగును నయం చేయటానికి అనుమతించుటకు, అనస్టోమోసిస్ ఆలస్యం చెయ్యబడుతుంది మరియు ఓస్టోమీ చేయబడుతుంది. ఇది కోయ్యబడిన ప్రేగు చివరను ఉదరం లోకి తెరిచి ఉన్న విధంగా తీసుకురావడం. ఓస్టోమీ కి ఒక సంచి జోడించబడుతుంది, అది మలం మరియు ద్రవం సేకరిస్తుంది. ఒకవేళ పెద్ద ప్రేగు బయటకు తీసుకువస్తే ఓస్టోమీ అనేది ఒక కోలోస్టోమీ అవుతుంది, చిన్న ప్రేగు ను బయటకు తీసుకువస్తే ఇలియోస్టోమీ అవుతుంది. ఈ విధానం భవిష్యత్తులో రివెర్స్ చెయ్యవచ్చు.

ప్రారంభ దశలో ఉన్న పెద్ద ప్రేగు క్యాన్సర్ కోసం శస్త్రచికిత్స

ప్రారంభ దశలో ఉన్న పెద్దప్రేగు క్యాన్సర్లో, కణితి పెద్ద ప్రేగు యొక్క లోపలి పొరకు మాత్రమే పరిమితం అయినప్పుడు, స్థానిక విచ్ఛేదం లేదా ఎండోస్కోపిక్ విచ్ఛేదనం చేయవచ్చు. ఇక్కడ, కోలొనోస్కోప్ పెద్దప్రేగులో చొప్పించబడుతుంది మరియు కనిపించే కణితి సాధారణ పెద్ద ప్రేగు తగినంత మార్జిన్ ఉంచి కత్తిరించబడుతుంది. ఇది పాథాలజిస్ట్ చేత సమీక్షించబడుతుంది. విచ్ఛేదం పూర్తయితే, తదుపరి చికిత్స అవసరం లేదు. కానీ విచ్ఛేదం అసంపూర్ణం అయితే లేదా పెద్దప్రేగు యొక్క లోతైన పొరల ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలు ఉన్నట్లయితే, పైన పేర్కొన్న విధంగా ఒక ప్రామాణిక కోలెక్టోమీ అవసరం.

ఫాలో అప్

వ్యాధి యొక్క దశపై ఆధారపడి, నయం చెయ్యటానికి శస్త్రచికిత్స మరియు కీమోథెరపీ ఇవ్వబడ్డాక, పేషెంట్ ను అవుట్ పేషెంట్ విభాగంలో తరచుగా మరియు జాగ్రత్తగా పరీక్షిస్తుండాలి. ఈ ఫాలో అప్ లు ఐదేళ్ల కాలంపాటు జరగాలి, మరియు మధ్యలో స్కాన్లు మరియు కోలోనోస్కోపి నిర్వహిస్తుండాలి. ఈ ప్రక్రియ ముందుగానే క్యాన్సర్ పునరావృతతను గుర్తించడంలో సహాయపడుతుంది.

మెటాస్టాటిక్ వ్యాది లో శస్త్రచికిత్స

మెటాస్టాటిక్ వ్యాది, జీర్ణాశయంలోని జీర్ణక్రియకు అడ్డంకి ఉన్నప్పుడు కొన్నిసార్లు పెద్దప్రేగులో కొంత భాగాని శస్త్రచికిత్స ద్వారా తొలిగించాల్సి వస్తుంది. తొలగింపు కొన్నిసార్లు ప్రత్యేకంగా జరుగుతుంది. తొలిగింపు తరువాత అనాస్టమోసిస్ అయినా అభివృద్ధి చెందుతుంది లేదా మరింత సాధారణంగా, ఒక కోలోస్టొమి జరుగుతుంది.

పెద్ద ప్రేగు క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు వ్యాపిస్తుంది, సాధారణంగా ఇతర భాగాలకంటే కాలేయం మరియు ఊపిరితిత్తులకు ఎక్కువగా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది. సాధారణంగా, క్యాన్సర్ శరీరం లోని వివిధ భాగాలకు వ్యాపించినప్పుడు, నివారణ శస్త్రచికిత్స పరిగణించబడదు. అయితే, కొన్ని రకాల పెద్దప్రేగు కాన్సర్లలో, కాలేయం లేదా ఊపిరితిత్తులలో పరిమితమైన వ్యాధి ఉన్నప్పుడు, క్యాన్సర్ను పూర్తిగా తొలగించడానికి శస్త్రచికిత్స చేయబడుతుంది. క్యాన్సర్ కలిగి ఉన్న కాలేయం లేదా ఊపిరితిత్తుల యొక్క భాగం తొలగింపు ఇందులో ఒక భాగం. సాధారణ ఫిట్నెస్, ప్రస్తుతం వ్యాధి స్థాయి, సంబంధిత అవయవం యొక్క ఫంక్షన్, మునుపటి కీమోథెరపీ కి ప్రతిస్పందన మరియు శస్త్రచికిత్స నైపుణ్యం మొదలైనవి రోగి కి అనుగుణంగా అనేక అనేక విషయాలు పరిగణలోకి తీసుకోబడతాయి.

పెద్ద ప్రేగు క్యాన్సర్ ఛికిత్సలో కీమోథెరపీ అనేది ఒక ముఖ్యమైన భాగం. ఈ పరిస్థితిలో కీమోథెరపీ అనేక అమరికలలో ఇవ్వబడింది.

ఆడ్జువెంట్ కీమోథెరపీ

క్యాన్సర్ తొలగింపు యొక్క ఖచ్చితమైన శస్త్రచికిత్స తర్వాత రోగులకు ఆడ్జువెంట్ కీమోథెరపీ ఇవ్వబడుతుంది. ఆడ్జువెంట్ కీమోథెరపీ యొక్క ప్రయోజనం నివారణ విచ్ఛేదం తర్వాత క్యాన్సర్ పునరావృతమయ్యే ప్రమాదాన్నితగ్గించడం. స్టేజ్ 3 క్యాన్సర్ రోగులకు మరియు స్టేజ్2 క్యాన్సర్ కలిగిన కొందరు రోగులకు కీమోథెరపీ ఖచ్చితంగా సూచించబడుతుంది. ఈ నేపధ్యంలో కీమోథెరపీ యొక్క లాభాలు మరియు నష్టాలు ఒక ఆంకాలజిస్ట్ తో చర్చించవచ్చు. ఫ్లూరోఉరాసిల్, కెపాసిటాబైన్, ఓక్సాలిప్లాటిన్ సాధారణంగా ఉపయోగించే మందులు. ఓక్సాలిప్లాటిన్ ఉపయోగించినప్పుడు, అది ఫ్లూరోఉరాసిల్ లేదా కెపాసిటాబైన్ కలయికతో ఇవ్వబడుతుంది. చికిత్స యొక్క వ్యవధి 3-6 నెలల వరకు ఉంటుంది మరియు ఎంచుకున్న ఔషధాల పై ఆధారపడి ప్రతి రెండు లేదా మూడువారాలకు ఒక్కసారి ఇవ్వబడుతుంది.

పాలియేటివ్ కీమోథెరపీ

స్టేజ్ 4 క్యాన్సర్ ఉన్నప్పుడు పాలియేటివ్ కీమోథెరపీ ఇవ్వబడుతుంది. కీమోథెరపీ యొక్క ప్రయోజనం క్యాన్సర్ మరియు దాని లక్షణాలు తగ్గించటం మరియు జీవితం పొడిగించటం.

స్టేజ్ 4 పెద్దప్రేగు క్యాన్సర్ కోసం ఉపయోగించే మందులలో కెమోథెరపీ మందులు కూడా ఉంటాయి, అవి ఫ్లూరోఉరాసిల్, కెపాసిటాబైన్, ఓక్సాలిప్లాటిన్, ఇరినోటెకాన్ వంటివి. ఓక్సాలిప్లాటిన్, ఫ్లూరోఉరాసిల్(ఫాల్ఫాక్స్) తో పాటుగా కానీ, కెపాసిటాబైన్(క్సిలాక్స్) తో పాటుగా కానీ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇరినోటెకాన్ ను ఫ్లూరోఉరాసిల్(ఫోల్ఫిరి) లేదా కెపాసిటాబైన్(క్సిలిరి) తో కలిపి తీసుకోవచ్చు. ఎంపిక చేయబడిన నియమావళి ప్రకారం ప్రతి రెండు లేదా మూడు వారాలకు ఈ కలయిక నియమాలు ఇవ్వబడతాయి. కీమోథెరపీ నియమావళికి అదనపు ఔషధాలు జోడించవచ్చు అనగా యాంటియాజియోజెనిక్ ఎజెంట్లు లేదా యాంటీ ఈ.జి.ఎఫ్.ఆర్ ప్రతిరోధకాలు వంటివి, వాటి యొక్క వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

పాలియేటివ్ కీమోథెరపీ యొక్క వ్యవధి ఒక ఔషధం లేదా చికిత్సా కలయిక ప్రకారం 3-6 నెలల వరకు ఉంటుంది. ఆ నిర్దిష్ట నియమావళి యొక్క మొత్తం వ్యవధి క్యాన్సర్ యొక్క ప్రతిస్పందన మీద ఆధారపడి ఉంటుంది మరియు రోగి చికిత్సను ఎంతవరకు సహించగలరు అన్నదాని మీద.
చికిత్స యొక్క ఒక నియమాన్ని పూర్తి చేసిన తర్వాత, ఆ సమయంలో క్యాన్సర్ స్థితిని బట్టి మొదటిది అయిన వెంటనే లేదా కొంతకాలం తర్వాత కీమోథెరపీ అవసరం కావచ్చు.

మెటాస్టాటిక్ వ్యాధి యొక్క విచ్ఛేదనకు ముందు కీమోథెరపీ

స్టేజి 4 క్యాన్సర్ ఉన్న కొందరు రోగులలో, శస్త్రచికిత్స విచ్ఛేదనకు అనుకూలంగా ఉండేలా కాలేయానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అటువంటి నేపధ్యంలో, వ్యాధిని చక్కగా నియంత్రించే అవకాశాలు పెంచడానికి కాలేయ విచ్ఛేదనకు ముందు మూడు నెలల పాటు కీమోథెరపీ ఇవ్వబడుతుంది. ఈ కీమోథెరపీ శస్త్రచికిత్స తర్వాత పునఃప్రారంభించబడుతుంది మరియు మొత్తం ఆరు నెలల పాటు కొనసాగుతుంది.

మయాంటీ ఈ.జి.ఎఫ్.ఆర్ ప్రతిరోధకాలు

క్యాన్సర్ కణంలో ఉన్న ఈ.జి.ఎఫ్.ఆర్ రిసెప్టర్ను లక్ష్యంగా చేసుకునే మందులనే యాంటి ఈ.జి.ఎఫ్.ఆర్ ప్రతిరోధకాలు అంటారు. ఇది కణాల పెరుగుదలను ఆపుతుంది. ఉపయోగించే రెండు మందులు సేటుక్సిమాబ్ మరియు పానితుముమాబ్. ఇవి ఒంటరిగా లేదా కీమోథెరపీతో కలిపి ఇవ్వబడతాయి. ఈ ఔషధాల నుండి పెద్దప్రేగు కాన్సర్తో బాధపడుతున్న అందరూ రోగులకు వీటితో ఉపయోగం ఉండదు. బయాప్సీ సమయంలో, ఒక ప్రత్యేక పరీక్ష (ఆర్.ఎ.ఎస్ పరీక్ష) అనేది కే.ఆర్.ఎ.ఎస్ లేదా ఎన్.ఆర్.ఎ.ఎస్ మ్యుటేషన్ కణితిలో ఉన్నదా లేదా అనేదానిని నిర్ధారించడానికి చెయ్యబడుతుంది. ఒకవేళ కే.ఆర్.ఎ.ఎస్ లేదా ఎన్.ఆర్.ఎ.ఎస్ మ్యుటేషన్ ఉన్నట్లయితే, ఈ మందులు సరైనవి కావు. అయితే, కే.ఆర్.ఎ.ఎస్ లేదా ఎన్.ఆర్.ఎ.ఎస్ మ్యుటేషన్ లేకపోతే (కే.ఆర్.ఎ.ఎస్ వైల్డ్ టైప్), ఈ మందులు ఉపయోగకరంగా ఉంటాయి. సేటుక్సిమాబ్ మరియు పానితుముమాబ్ రెండు సిర ద్వారా ఇవ్వబడుతాయి మరియు సాధారణంగా తట్టుకోగలిగేలా ఉంటాయి. ఈ ఔషధాల యొక్క సాధారణ దుష్ప్రభావాలు చర్మం దద్దుర్లు, అతిసారం, నోటి నొప్పి మరియు అలసట వంటివి.

మయాంటీ ఆంజియోజెనిక్ ఏజెంట్స్

ఆంజియోజెనిసిస్ రక్తనాళాల పెరుగుదల మరియు కొత్త రక్తనాళాల అభివృద్ధి. క్యాన్సర్ పెరగటం కొనసాగటానికి కొత్త రక్త నాళాలను అభివృద్ధి కావటం అవసరం. యాంటీ ఆంజియోజెనిక్ మందులు కొత్త రక్తనాళాల అభివృద్ధిని నిలిపివేస్తాయి మరియు తద్వారా క్యాన్సర్ పురోగతిని ఆపుతాయి. అందుబాటులో ఉన్న మందులు బెవాసిజుమాబ్(అవాస్టిన్), అఫ్లిబెర్సెప్ట్ (జల్ట్రాప్) మరియు రేగోఫెనిబ్ (స్టివర్గ). ఈ మందులు ఒక్కటే కానీ లేదా కీమోథెరపీతో కలిపి ఇవ్వబడతాయి. అవి స్టేజి 4 పెద్దప్రేగు కాన్సర్తో ఉన్న అందరు రోగులకు ఇవ్వచ్చు మరియు వీటికి ఏ ప్రత్యేక పరీక్ష అవసరం లేదు.