అన్నవాహిక కేన్సర్

అన్నవాహిక


అన్నవాహిక (ఎసోఫేగస్) అనేది శరీరంలో గొట్టం వంటి నిర్మాణం, ఇది నోటిని ఉదర భాగంతో కలుపుతుంది.

ఇది సుమారు 25 సెం.మీ. పొడవు ఉంటుంది. ఇది నాలుగు పొరలుగా ఉంటుంది, అవి లోపల నుంచి బయటికి ఉండే శ్లేష్మం పొర, ఉప శ్లేష్మం పొర, కండర పొర, అడ్వెంటిషియా అనబడే బాహ్య పొర. నోటిలో మ్రింగిన ఆహారం అన్నవాహిక ద్వారా కడుపులోకి వస్తుంది. అన్నవాహికలో కండర పొర తన నుంచి ఆహారాన్ని ముందుకు నడిపిస్తుంది. అన్నవాహిక ముగిసిన చోట, ఉదరం ప్రారంభమవుతుంది, దీన్ని ఎసోఫేగా- గ్యాస్ట్రిక్ జంక్షన్ అని పిలుస్తారు.

అన్నవాహిక కేన్సర్

అన్నవాహిక కేన్సర్ అన్నవాహికలో మొదలయ్యే కేన్సర్. ఈ కేన్సర్ సాధారణంగా ట్యూబ్ లోపలి భాగంలో ఉండే శ్లేష్మం పొరలో ఉత్పన్నమవుతుంది. అన్నవాహిక కేన్సర్ అనేది స్క్వామస్ (పొలుసల) సెల్ కార్సినోమా కేన్సర్ లేదా ఎడెనోకార్సినోమా కేన్సర్ కావచ్చు. స్క్వామస్ సెల్ కార్సినోమా కేన్సర్ శ్లేష్మ కణాల లైనింగ్ నుంచి ఉత్పన్నమవుతుంది.

ఎడెనోకార్సినోమా అన్నవాహికలో శ్లేష్మాన్నిఉత్పత్తి చేసే గ్లాండ్యులర్ కణాల నుంచి ఉత్పన్నమవుతుంది. అన్నవాహిక కేన్సర్లలో ఈ రెండు కేన్సర్లే 95% కి పైగా ఉన్నాయి.

అన్నవాహిక కేన్సర్ రావడానికి అనేక రకాల హాని కారకాలు ఉన్నాయి. ఈ హాని కారకాలు స్క్వామస్ సెల్ మరియు ఎడెనోకార్సినోమా కేన్సర్లకు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని ప్రమాద కారకాలు ఈ రెండు రకాల కేన్సర్లకీ సర్వసాధారణం.

ధూమపానం, మద్యం

ధూమపానం, మద్యం (ఆల్కహాల్) స్క్వామస్ సెల్ రకం కేన్సర్ ని పెంచి పోషించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సిగరెట్ త్రాగడం, చుట్టలు త్రాగడం కంటే ఎక్కువ ప్రమాదకరం. వినియోగింపబడిన అసలు మద్యం రకం కంటే మద్యం మొత్తం పరిమాణం దీన్ని నిర్ధారిస్తుంది.

తీసుకునే ఆహారం (డైట్)

నైట్రోసో సమ్మేళనాలు (కాంపౌండ్స్) అధికంగా ఉన్న ఆహారం ఎక్కువ ప్రమాదకరమైనది. ఎండిన, ఊరగాయలు పెట్టబడిన లేదా పొగబెట్టిన ముడి ఆహార పదార్థాలు నైట్రోసో కాంపౌండ్స్ ని కలిగి ఉంటాయి.
వక్క పలుకుల్ని నమలడం ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా వేడిగా ఉన్న పానీయాలు (ఉదాహరణకు చాలా వేడిగా ఉన్న టీ) ఈ ప్రమాదాన్ని మరింత ఎక్కువ పెంచుతాయి, ఇది అన్నవాహిక లైనింగ్ ని దెబ్బతీసి పుండు పడేలా చేస్తుంది.

మునుపటి అన్నవాహిక పరిస్థితులు

అఖాలసియా కార్డియా (ఆహార నాళం బిగుసుకుపోయి మ్రింగలేక పోవడం), ఎసోఫేజియల్ స్ట్రిక్చర్లు లేదా అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ వంటి మునుపటి లేదా అంతర్లీనంగా ఉన్న అన్నవాహిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది.

స్థూలకాయం

అధిక బరువు లేదా స్థూలకాయం వల్ల గ్యాస్టో-ఎసోఫేజియల్ రిఫ్లక్స్ కి దారి తీస్తుంది. సాధారణంగా కడుపు మరియు ఎసోఫాగస్ జంక్షన్ బిగుతుగా మూసివేయబడి ఉండి, ఉదరం నుంచి అన్నవాహికకి ఆమ్లాల ప్రవాహాన్ని నిరోధిస్తుంది. స్థూలకాయం ఉన్న రోగులలో ఈ జంక్షన్ సాగిపోయి ఉండి, ఆమ్లం, అన్నవాహికలోకి ప్రవేశించేలా చేస్తుంది. ఇది రిఫ్లక్స్ వ్యాధి అనబడుతుంది, ఇది బారెట్స్ ఎసోఫేగస్ కండిషన్ గా మారేందుకు దారి తీస్తుంది. ఇది ఎసోఫాగస్ అడెనోకేర్సినోమా కేన్సర్ వచ్చేలా చేస్తుంది.

బారెట్స్ ఎసోఫేగస్

బారెట్స్ ఎసోఫేగస్ అనేది ఉదరానికి చెందిన ఒక స్థితి. ఇందులో ఉదరం నుంచి నిరంతరంగా ఆమ్లం బహిర్గతం కావడం వల్ల అన్నవాహిక క్రింది చివరి భాగానికి చెందిన అంతర్గత (ఇన్నర్) లైనింగ్ ఒక రకం నుంచి మరో రకానికి మారుతూ ఉంటుంది. బారెట్స్ ఎసోఫేగస్ ఉండడం వల్ల అన్నవాహిక కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

టైలోసిస్

టైలోసిస్ అనేది సంక్రమిత చర్మ వ్యాధికి అరుదైన రూపం. దీనితో బాధపడుతున్న వారికి జీర్ణకోశ కేన్సరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అన్నవాహిక కేన్సర్ అనేక లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ లక్షణాలు ఏవైనా ఉంటే కేన్సర్ ఉందని అర్ధం కాదు, కానీ ఒక వైద్యుడి చేత ఈ లక్షణాల్ని చెక్ చేయించుకోవడం ముఖ్యం. అన్నవాహికకి సంబంధించి ఎడెనోకేర్సినోమా, స్క్వామస్ సెల్ కేన్సర్ ఒకే రకంగా ఉంటాయి.

కష్టంగా మ్రింగడం

ఇది అన్నవాహిక కేన్సర్ ఉన్నవారిలో కనిపించే ఒక సాధారణ లక్షణం. మ్రింగడంలో ఇబ్బందులు మొదట్లో ఘనపదార్థాలతో ప్రారంభించినా తరువాత అది ద్రవ పదార్థాల విషయంలోనూ కొనసాగుతాయి. ఈ లక్షణాలు రాన్రానూ ఎక్కువవుతూ ఉంటాయి. బరువు కోల్పోవడం కూడా జరుగుతుంది. ఈ ఇబ్బందులు మొదలవుతున్నప్పుడు రోగులకి తెలుస్తుంది కాబట్టి వారు ముందుగా ఒక గుక్కెడు నీరు త్రాగి ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు.

ఆహారం వాంతి కావడం లేదా వెనక్కి రావడం

ముందు తిన్న ఆహారం వాంతి రావడం లేదా మళ్లీ నోట్లోకి రావడం జరుగుతుందని మనం ఎప్పుడో ఒకప్పుడు గమనించే ఉంటాం. ఆహారం వాంతి కావడం, లేదా వెనక్కి రావడమంటే లోపలికి వెళ్లిన ఆహారం ఉదరంలోకి ప్రవేశించకుండా తిరిగి నోట్లోకి రావడమని అర్థం. మ్రింగిన తర్వాత ఆహారం కడుపులోకి వెళ్ళలేక పోవడం వల్ల ఇలా జరుగుతుంది.

మ్రింగడానికి నొప్పి

మ్రింగడానికి నొప్పిగా ఉండడమనే లక్షణం అన్నవాహిక కేన్సర్ ఉన్నదని సూచించే ఒక సంకేతం. గొంతు ప్రాంతంలో గానీ లేదా వక్షోజ ఎముక వెనుక ఛాతీలో గానీ నొప్పిగా ఉంటుంది.

గుండెల్లో ఎప్పుడూ మంటగా అనిపించే లక్షణాలు

సాధారణంగా గుండెల్లో మంట అనేది అందరికీ అనిపించే లక్షణమే. అయితే ఇది కేన్సర్ కి సంబంధించిన పరిస్థితి వల్ల కాదు. కానీ ఎప్పుడూ గుండెల్లో మంటగా ఉండేవారు లేదా అజీర్తి ఉన్నవారు తమ డాక్టర్ కి చూపించుకోవాలి. ఎందుకంటే ఇది అన్నవాహిక కేన్సర్ ఉండటం వల్ల కావచ్చు.

స్వరంలో దగ్గు లేదా మార్పు

అన్నవాహిక కేన్సర్ లక్షణాల్లో స్వరం బాగా బొంగురు పోయి ఉండడం, దగ్గు వంటివి ఉన్నాయి.

ఇతర లక్షణాలు

రక్తం వాంతి చేసుకోవడం, బరువు తగ్గడం లేదా పొత్తి కడుపులో నొప్పి, అలసట, పొత్తి కడుపు వాపు వంటి ఇతర లక్షణాలు కూడా అన్నవాహిక కేన్సర్ కి ఉన్నాయి.

అన్నవాహిక కేన్సర్ అని అనుమానం కలిగినా లేదా నిర్ధారించాల్సి ఉన్నా ఈ క్రింది పరీక్షలు చేయడం జరుగుతుంది.

అప్పర్ GI ఎండోస్కోపీ

ఇది అసాధారణంగా ఉన్న అంశాల్ని గమనించడం కోసం అన్నవాహికలోకీ మరియు కడుపులోకీ ఒక సన్నని గొట్టాన్ని ప్రవేశ పెట్టడానికి సంబంధించిన ప్రక్రియ. డాక్టర్ ఈ ప్రక్రియ చేస్తూ అన్నవాహికలోకీ, ఉదరంలోకీ చూడడానికి వీలుగా ట్యూబ్ చివర్లో ఒక లైటు, ఒక కెమెరా ఉంటుంది. ఈ పరీక్ష చేయడానికి తేలికపాటి మత్తు ఇస్తారు, ఇది ఏ మాత్రం నొప్పిలేకుండా జరిగిపోతుంది.

ఇది పగటి పూట జరిగే ప్రక్రియ, కాబట్టి రోగి ఆసుపత్రిలో రాత్రిపూట ఉండవలసిన అవసరం లేదు. డాక్టర్ ఎండోస్కోపీలో అసాధారణమైన ప్రాంతాన్ని చూస్తే, అప్పటికప్పుడే బయాప్సీ చేయవచ్చు.

CT స్కాన్

ఎండోస్కోపీలో అన్నవాహిక కేన్సర్ రోగ నిర్ధారణ చేసిన తర్వాత ఒక CT లేదా కంప్యూటెడ్ టొమోగ్రఫిక్ స్కాన్ జరుగుతుంది. CT స్కాన్ శరీరం లోపలి చిత్రాల్ని వివరంగా చూడడానికి వీలుగా x- రే లను ఉపయోగిస్తుంది.

అందువల్ల, కేన్సర్ శరీరం ఇతర భాగాలకు వ్యాపించిందా అనే దాని గురించి సమాచారం ఇవ్వవచ్చు.

PET స్కాన్ లేదా PET-CT స్కాన్

ఒక PET –CT స్కాన్ అనేది CT స్కాన్ చేయక ముందు ఒక రేడియోయాక్టివ్ ట్రేసర్ ని శరీరంలోకి చొప్పించే ఒక ప్రత్యేకమైన CT స్కాన్. ఈ ట్రేసర్ గ్లూకోజ్ అధికంగా అవసరం ఉన్న శరీరం లోపలి ప్రాంతాల్లో ఉంటుంది.

కేన్సర్ల మనుగడ కోసం చాలా గ్లూకోజ్ అవసరం కాబట్టి, అవి మిగిలిన శరీరం కంటే ట్రేసర్ ని ఎక్కువగా తీసుకుంటాయి. దాంతో కేన్సర్ ని స్కాన్ లో సులభంగా గుర్తించవచ్చు. కేన్సర్ వ్యాప్తిని రుజువు చేయడానికి ఒక PET-CT స్కాన్ ఒక స్టాండర్డ్ CT స్కాన్ కంటే చాలా సున్నితంగా ఉంటుంది. ఇది చికిత్సకు ముందు అన్నవాహిక కేన్సర్ ని నిర్ధారించడానికి చేసే అతి ముఖ్యమైన పరీక్ష.

ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (EUS)

ఒక ఎండోస్కోపిక్ ఆల్ట్రాసౌండ్ ఒక ఎండోస్కోపీ లాంటిదే, అయితే దీని చివర ఒక అల్ట్రాసౌండ్ స్కానర్ ఉంటుంది. ఈ పరీక్ష అన్నవాహిక గోడలలో కేన్సర్ ఎంత లోతు వరకు వ్యాపించిందో చూసేందుకు ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది. ఈ స్కానర్ కేన్సర్ చుట్టూ విస్తరించి ఉన్న లింఫ్ (శోషరసం) నోడ్స్ (గడ్డలు) ని కూడా చూడడానికి సహాయపడుతుంది. కేన్సర్ ఖచ్చితమైన దశ ఏమిటో తెలుసుకోవడం కోసం ఈ పరీక్షను ఉపయోగిస్తారు. ఏవైనా వింత గడ్డలు (నోడ్స్) కనబడితే, వాటిని బయాప్సీ కూడా చేస్తారు.

లాప్రోస్కోపీ

ఒక లాప్రోస్కోపీ అనేది డాక్టరు పొత్తి కడుపు లోపల చూడడానికి చేసే పరీక్ష. ఈ పరీక్ష కడుపులోకి కేన్సర్ ఎంతవరకు వ్యాపించిందో చూసేందుకు అన్నవాహిక కేన్సర్ ఉన్న కొందరు రోగులకు జరుగుతుంది.
పరీక్ష సాధారణ అనస్తీషియా ఇచ్చి చేస్తారు. రోగికి ఆస్పత్రిలో కొద్దిసేపు ఉండాలి.

ఈ పరీక్షకి బొడ్డు చుట్టూ ఒక అంగుళం పరిమాణంలో ఒక చిన్న గాయం చేస్తారు. ఆ రంధ్రం నుంచి లాప్రోస్కోప్ ని పంపి డాక్టర్ లోపల చూడవచ్చు. అవసరమైతే, బయాప్సీ తీసుకోవచ్చు. ప్రక్రియ జరిగే సమయంలో లోపల బాగా చూడడానికి వీలుగా పొత్తికడుపులోకి కార్బన్ డయాక్సైడ్ వాయువుని లోపలకి పంపుతారు. ఈ CO2 వాయువు కాలక్రమేణా బయటికి

TNM ఆధారంగా లేదా నెంబర్ల ఆధారంగా కేన్సర్ దశల్ని నిర్ధారిస్తారు. ఈ రెండు రకాల స్టేజింగ్ సిస్టమ్స్ ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

అన్నవాహిక కేన్సర్ TNM స్టేజింగ్

TNM అనేది ట్యూమర్, నోడ్, మెటాస్టేసెస్.

T స్టేజింగ్

T కణితి పరిమాణాన్ని సూచిస్తుంది. T T1 నుండి T4 వరకు విభజించబడింది. ఈ కేన్సర్ లో T స్టేజింగ్ కణితి అన్నవాహిక గోడలో ఎంత లోతు వరకు వ్యాపించిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

T1 కణితి లామినా ప్రొప్రియా లేదా సబ్ మ్యూకోసాలోకి చొచ్చుకుపోతుంది
T2 కణితి అన్నవాహిక కండరాల పొరలోకి చొచ్చుకుపోతుంది
T3 కణితి అన్నవాహిక బయటి పొర (అవరోధం) లోకి చొచ్చుకుపోతుంది
T4 కణితి అన్నవాహికని దాటుతుంది. అన్నవాహిక చుట్టూ ఉన్న ఇతర నిర్మాణాల్లోకి చొచ్చుకుపోతుంది

N స్టేజింగ్

ఎన్ స్టేజింగ్ అనేది అన్నవాహిక చుట్టూ శోషరస కణుపుల ప్రమేయంపై ఆధారపడి ఉంటుంది

Nx లింఫ్ నోడ్ ప్రమేయం అంచనా వేయబడదు
N0 కేన్సర్ కీ లింఫ్ నోడ్స్ (శోషరస కణుపుల) కీ సంబంధం లేదు
N1 కేన్సర్ 1-2 లింఫ్ నోడ్స్ లోకి వెళ్లింది
N2 కేన్సర్ 3-6 లింఫ్ నోడ్స్ లోకి వెళ్లింది
N3 కేన్సర్ 7 లేదా అంతకంటే ఎక్కువ లింఫ్ నోడ్స్ లోకి వెళ్లింది

M స్టేజింగ్

M స్టేజింగ్ శరీరంలో సుదూర భాగాలకు కూడా కేన్సర్ వ్యాపించిందో లేదో అనే దాని గురించి సమాచారం అందిస్తుంది

M0 కేన్సర్ దూర ప్రాంతాలకి వ్యాపించినట్టు ఎలాంటి ఆధారం లేదు
M1 కేన్సర్ దూర ప్రాంతాలకి వ్యాపించి ఉంది

నెంబర్ స్టేజింగ్

ఈ రకమైన కేన్సర్ దశల్లో 1 నుండి 4 వరకు చేయబడిన నిర్ణయం TNM వర్గీకరణపై ఆధారపడి ఉంది. అన్నవాహిక కేన్సర్ లోని ఈ స్టేజింగ్ సిస్టమ్ స్క్వామస్ సెల్ కేన్సర్ మరియు ఎడెనోకార్సినోమా రకాలకు భిన్నమైనది. ఎడెనోకేర్సినోమా దశలు ఈ క్రింద చూపబడ్డాయి.

ఎడెనోకార్సినోమా నెంబర్ స్టేజింగ్

  • T1 N0 M0————దశ 1
  • T1 N1 M0————దశ 2ఎ
  • T2 N0 M0————దశ 2బి
  • T2 N1 M0————దశ 3
  • T2 N0-1 M0———దశ 3
  • T4a N0-1 M0——-దశ 3
  • T1-4a N2 M0——-దశ 4ఎ
  • T4b N0-2 M0——-దశ 4ఎ
  • Any T N3 M0——-దశ 4ఎ
  • Any T Any N M1—దశ 4బి

కేన్సర్ గ్రేడ్

కేన్సర్ గ్రేడింగ్ సూక్ష్మదర్శిని క్రింద కణాలు ఎలా కనిపిస్తాయనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కేన్సర్లలో 1 నుండి 3 లేదా 4 వరకు శ్రేణి ఉంటుంది. గ్రేడ్ 1 అనేది సాధారణ కణాల్లాగానే ఉంటాయి. సాధారణ కణాలకి ఏమాత్రం పోలికలేని కణాలుగా ఉండే గ్రేడ్ 4 కణాలు.

అన్నవాహిక కేన్సర్ గ్రేడ్లు

గ్రేడ్ 1- కేన్సర్ లోని కణాలు బాగా విలక్షణంగా ఉంటాయి (సాధారణ కణాల్లాగానే ఉన్నాయి)

గ్రేడ్ 2-కేన్సర్ లోని కణాలు కొంచెం తేడాగా ఉన్నాయిed

గ్రేడ్ 3-కేన్సర్ కణాల్ని సరిగా వేరు చేయడం జరగలేదు (సాధారణ కణాల మాదిరిగా కనిపించవు)

గ్రేడ్ 4- కణాలు వేరుపరచబడలేదు (పూర్తిగా భిన్నంగా ఉన్నాయి)

శస్త్రచికిత్స, కెమోథెరపీ, రేడియోథెరపీ లేదా ఈ పద్ధతులన్నిటినీ సమన్వయం చేసుకుంటూ అన్నవాహిక కేన్సర్ కి చికిత్స చేయవచ్చు. ఖచ్చితంగా ఎలాంటి చికిత్సా విధానాన్ని అవలంబించాలీ అనేది రోగ నిర్ధారణలో రోగికి గల సాధారణ శారీరక స్థితి, కేన్సర్ దశని బట్టీ నిర్ణయించాల్సి ఉంటుంది.అన్నవాహిక కేన్సర్ తొలిదశలో చికిత్స లక్ష్యం చికిత్సతో రోగికి నయం చేయడమే అయి ఉంటుంది.

కేన్సర్ (దశ 4 లేదా స్థూల దశ 3) దశల్లో బాగా ముదిరి ఉన్నపుడు, నివారణ సాధ్యం కావచ్చూ లేదా సాధ్యం కాకపోవచ్చు, కాని కేన్సర్ ని తగ్గించడానికీ, నియంత్రించడానికీ చికిత్స ఇవ్వబడుతుంది.

అన్నవాహిక కేన్సర్ ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడమనేది చాలా సాధారణమై పోయింది. అన్నవాహిక కేన్సర్ చికిత్సలో ఇది ముఖ్యమైన భాగం. అన్నవాహిక తొలగింపును ఓసోఫేగెక్టమీ అని పిలుస్తారు.స్క్వామస్ సెల్ లేదా ఎడెనోకేర్సినోమా కేన్సర్ల 1, 2, 3 దశల నిర్వహణలో ఓసోఫేగెక్టమీ ఒక ఆప్షన్. కేన్సర్ నిర్వహణ 4 వ దశలో మాత్రం ఇది ఒక ఎంపిక కాదు.

ఓసోఫేగెక్టమీ చేసినపుడు కేన్సర్ ఉన్న అన్నవాహిక భాగాన్ని తీసేసి, మిగిలిన భాగాల్ని కలిపేస్తారు. మిగిలిన అన్నవాహికని ఛాతీతో కలపడానికి ఉదరం సాధారణంగా ఛాతీలోకి లాగబడుతుంది. కొన్నిసార్లు కత్తిరించబడిన ఈ రెండు విభాగాల్నీ కలిపేందుకు పెద్ద ప్రేగులో కొంత భాగం అవసరమవుతుంది. కేన్సర్ అన్నవాహికలో క్రింద గానీ లేదా అన్నవాహిక, కడుపు కలిసే జాయింట్ లో గానీ ఉంటే, అప్పుడు కేన్సర్ చుట్టూ తగినంత మార్జిన్స్ ఉంచడానికి కడుపులో కొంత భాగం కూడా తొలగించబడుతుంది. ఆపరేషన్ సమయంలో, సర్జన్ అన్నవాహిక చుట్టూ ఉన్న లింఫ్ (శోషరస) గ్రంథుల్ని కూడా తొలగిస్తారు.

ఆపరేషన్ సమయంలో శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నప్పుడు రోగికి అవసరమైన అన్ని పోషకాలను ఇచ్చేందుకు వీలుగా ఒక న్యూట్రిషన్ ట్యూబ్ పెడతారు. ఈ ఫీడింగ్ ట్యూబ్ ఒక ఫీడింగ్ జెజునోస్టమీ కావచ్చు. ఇందులో ట్యూబ్ ని జెజునమ్ లేదా గ్యాస్ట్రోస్టోమీ అని పిలవబడే చిన్న ప్రేగులలో ఉంచుతారు, ఇక్కడ ట్యూబ్ కడుపులో ఉంటుంది. ఈ ట్యూబ్ లు చర్మం నుండి బయటకు వస్తాయి ఆహారం, ద్రవాలు ట్యూబ్ ద్వారా లోపలికి పంపబడతాయి.

సర్జరీ రకాలు

శస్త్రచికిత్స మూడు విధాలుగా చేయవచ్చు-

  • ట్రాన్స్-థొరాసిక్ ఓసోఫాగెక్టోమీ- ఇందులో ఛాతీ, పొత్తి కడుపు మీద కోసి ఆపరేషన్ చేస్తారు.
  • ట్రాన్స్ హియాటల్ ఓసోఫాగెక్టోమీ – ఇందులో మెడ, పొత్తి కడుపు మీద కోసి ఆపరేషన్ చేస్తారు.
  • త్రీ ఇన్సిషనల్ ఓసోఫాగెక్టోమీ- ఇందులో మెడ, ఛాతీ, పొత్తి కడుపు మీద కోసి ఆపరేషన్ చేస్తారు.

ఈ మూడు రకాల సర్జరీల్లో అన్నీ చాలా మంచి ఫలితాల్ని ఇచ్చేవే. అయితే కేన్సర్ ఉన్న ప్రదేశం మీద, సర్జన్ అనుభవం మీద ఇవి ఆధారపడి ఉంటాయి.

కొంతమంది కీహోల్ శస్త్రచికిత్సను ఉపయోగించి ఆపరేషన్ చేయించుకునే స్థితి ఉండవచ్చు. ఇది ఛాతీలో థొరాకోస్కోప్ ని ఉపయోగించీ, అలాగే పొత్తికడుపులో లాప్రోస్కోప్ ని ఉపయోగించీ చేస్తారు.

అన్నవాహిక కేన్సర్ (పొలుసుల కణం లేదా ఎడెనోకేర్సినోమా) దశ 1 ఆపరేషన్లలో రోగికి శరీర సామర్థ్యం బాగుంటే, శస్త్రచికిత్స ద్వారా దానంతట అది తొలగిపోయేలా చేసే ఆపరేషన్ సరైన ఎంపిక.

2, 3 దశల్లో ఉన్న రోగులకు శస్త్రచికిత్స తొలగింపుకు ముందు కెమోథెరపీ లేదా కెమోథెరపీ మరియు రేడియోథెరపీల కలయిక (కెమోరేడియోథెరపీ)తో పరిగణించబడుతుంది. ఏ ఆప్షన్ ఉపయోగించాలనేది రోగి శరీర సామర్థ్య స్థాయిపై ఆధారపడి ఉంటుంది.

శస్త్రచికిత్స జరిగిన తరువాత చాలామంది రోగులు ఇంటెన్సివ్ కేర్ లో కొన్ని రోజులు గడిపి, తరువాత వార్డుకు బదిలీ చేయబడతారు. సాధారణంగా మామూలుగా తినే స్థాయికి చేరుకునేందుకు సమయం పడుతుంది. సాధారణంగా ఆపరేషన్ జరగక ముందు ఉండే అలవాట్ల కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే, ఆపరేషన్ జరిగిన తర్వాత అన్నవాహిక, ఉదరం ఆకారాల్లోనూ, పరిమాణంలోనూ మార్పు రావడం వల్ల ఇది ఇలా జరుగుతుంది. రోగి రోజు మొత్తంలో తరచుగా భోజనం చేస్తూ ఉండాలి, తిన్నప్పుడల్లా కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి.
అలాగే, రోగి యాసిడ్ రిఫ్లక్స్ మరియు అతిసారం లక్షణాలను నియంత్రించడానికి యాంటాసిడ్స్, యాంటీ-డయేరియా మాత్రలు తీసుకోవాలి.

అన్నవాహిక, ఉదర భాగాల్లో శస్త్రచికిత్స జరిగిన తర్వాత వచ్చే మరో దుష్ప్రభావం డంపింగ్ సిండ్రోమ్. ఆహారం తిన్న తర్వాత మూర్ఛ వచ్చి పడిపోతామనే భావన కలగడమే ఈ సిండ్రోమ్ లక్షణం. ఈ రకమైన శస్త్రచికిత్స జరిగిన తరువాత సాధారణంగా ఉండే పరిస్థితి ఇదే. మెల్లగా తినడం ద్వారానూ, చక్కెర పదార్ధాలను బాగా తగ్గించడం ద్వారానూ, ఆహారాన్ని కొద్ది మోతాదుల్లో తరచుగా తినడం ద్వారానూ దీన్ని తగ్గించవచ్చు.

కెమోథెరపీ

కెమోథెరపీ అంటే ఇంజెక్షన్లు, డ్రిప్స్, మాత్రల రూపంలో యాంటీ-కేన్సర్ మందుల్ని ఉపయోగించడం. ఈ మందులు వారికి బాగా ఎక్కువ నష్టం కలిగించడం ద్వారా కేన్సర్ కణాలను నాశనం చేయగలుగుతాయి, కానీ, అదే సమయంలో సాధారణ కణజాలాలకు కూడా కొంత నష్టాన్ని కలిగిస్తాయి. కెమోథెరపీ చేసినపుడు ఈ మందుల ప్రభావం కారణంగా సాధారణ కణజాలాలపై పడే కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కేన్సర్ చికిత్సకు ఉపయోగించే అనేక రకాల కెమోథెరపీ మందులు ఉన్నాయి. ఈ మందుల్ని కాంబినేషన్ లో గానీ, సింగిల్ ఏజెంట్ లా గానీ ఉపయోగించవచ్చు. కెమోథెరపీ కొన్ని విడతలు (సైకిల్స్)గా ఇవ్వబడుతుంది, ప్రతి విడత 1 నుంచి 4 వారాల మధ్య ఉంటుంది, సాధారణంగా 3 వారాల వరకు ఉంటుంది. తదుపరి మోతాదుకు శరీరం సిద్ధం కావడం కోసం రెండు కెమోథెరపీ విడతల మధ్య అంతరం ఇవ్వబడుతుంది. కెమోథెరపీ కోర్సు సాధారణంగా కొన్ని నెలల వరకు నడుస్తుంది.

అన్నవాహిక కేన్సర్ కి కెమోథెరపీ

కెమోథెరపీ అనేది అన్నవాహిక కేన్సర్ చికిత్సలో ముఖ్యమైన భాగం. అన్నవాహిక కేన్సర్ చికిత్సలో భాగంగా కెమోథెరపీ వేర్వేరు సెట్టింగ్స్ లో ఇవ్వబడుతుంది.

దశ 1, 2, 3 కేన్సర్లలో కెమోథెరపీని రేడియోథెరపీతో పాటు ఇవ్వవచ్చు. ఈ ఎంపికను కంకరెంట్ (ఉభయ) కెమోరేడియోథెరపీ అని అంటారు. ఇందులో వారానికి ఒకసారి గానీ లేదా ప్రతి మూడు వారాలకి ఒకసారి గానీ లేదా రేడియోథెరపీ మొదటి మరియు చివరి వారాల్లో గానీ ఇవ్వబడుతుంది. కెమోథెరపీని తట్టుకునేందుకు రోగికి గల శరీర సామర్థ్యం, సౌలభ్యాన్ని బట్టి ఏ విధానం అవలంబించాలో నిర్ణయించడం ఉత్తమ వ్యూహ రచనగా చెప్పుకోవచ్చు.

కొన్ని సెట్టింగ్స్ లో అన్నవాహిక కేన్సర్ ని సర్జికల్ గా తొలగించక ముందే కెమోథెరపీ ఇవ్వవచ్చు. దీనిని నియోఎడ్జువెంట్ కెమోథెరపీ అంటారు. కొన్నిసార్లు శస్త్రచికిత్స ద్వారా కణితి తొలగించిన తర్వాత కెమోథెరపీని ఇవ్వవచ్చు. దీనిని ఎడ్జువెంట్ (అనుబంధ) కెమోథెరపీ అని అంటారు.
4 దశ కేన్సర్ లో కెమోథెరపీని కేన్సర్ నీ, కేన్సర్ ఉత్పత్తి చేసే లక్షణాల్నీ నియంత్రించడానికి కాంబినేషన్ చికిత్సగా చేస్తారు.

2, 3 దశల్లో కేన్సర్ బారి నుండి బయటపడేలా చేసి రోగిని నయం చేయడం, 4 వ దశలో కేన్సర్ ని నియంత్రించడం, జీవితాన్ని పొడిగించడం కెమోథెరపీ ప్రయోజనం.

అన్నవాహిక కేన్సర్ కి సాధారణంగా ఉపయోగించే కెమోథెరపీ ఔషధాల్లో ఇవి కూడా ఉన్నాయి-

ఐపిరుబిసిన్, డోక్సోరుబిసిన్, 5 ఫ్లోరౌరసిల్ (5 FU), కేప్సిటబైన్, సిస్ప్లాటిన్ లేదా కార్బోప్లాటిన్, ఆక్సాలిప్లాటిన్, ఇరినోటెకాన్, డొసెటేక్సెల్, పాక్లిటాక్సెల్ ట్రాస్టుజుమాబ్.

ఈ మందులను కాంబినేషన్లలో ఉపయోగించినప్పుడు, ఆ కాంబినేషన్లు సామాన్యంగా ఇలా ఉంటాయి-

  • DCF (డోసేటాక్సెల్, సిస్ప్లైయిటిన్ మరియు 5FU)
  • ECF (ఎపిరిబికిన్, సిస్ప్లాటిన్, 5FU)
  • ECX (ఎపిరిబికిన్, సిస్ప్లాటిన్, కేప్సిటబిన్)
  • EOX (ఎపిరిబికిన్, ఆక్సాలిప్లాటిన్, కేప్సిటబైన్)
  • FOLFOX (ఓక్సాలిప్లాటిన్, 5FU)
  • XELOX (ఓక్సాలిప్లాటిన్, కేప్సిటబైన్)
  • సిస్ప్లాటిన్ మరియు 5FU

HER2 టెస్టింగ్ మరియు ట్రస్టుజుమాబ్

HER2 అనేది బాహ్యంగా (ఎపిడెర్మల్) ఎదిగే (గ్రోత్) కారక (ఫ్యాక్టర్) రిసెప్టర్ 2. ఇది ఓసోఫేగోగాస్ట్రిక్ కేన్సర్ లో పెరిగినప్పుడు కేన్సర్ ని మరింత ఎక్కువగా పెరిగేలా చేస్తుంది. అన్ని ఓసోఫేగోగాస్ట్రిక్ కేన్సర్లలో 35% వరకు HER2 పాజిటివ్ రకానికి చెందినవే. ఇది ఎల్లప్పుడూ కేన్సర్ నిర్ధారణలో పరీక్షించబడాలి. కేన్సర్ నమూనాలో HER2 స్థితి ఎలా ఉందో పరీక్షించబడాలి, ఇది బయాప్సీ ద్వారా గానీ లేదా శస్త్రచికిత్స చేసి గానీ తీసుకోవచ్చు. ఈ పరీక్ష 3+.ఫలితాన్ని అందించడం ద్వారా కేన్సర్ లో HER2 విస్తరించిందా లేదా పెరిగిందా అనే విషయాన్ని తెలియజేస్తుంది. కొన్నిసార్లు, ప్రారంభ పరీక్ష HER2 సందిగ్ధంగా (2+) ఉంటే తర్వాతి పరీక్ష (FISH) అవసరమవుతుంది.

HER2 పరీక్ష పాజిటివ్ గా ఉంటే, HER2 రిసెప్టర్ కి విరుద్ధంగా పనిచేసే యాంటీబాడీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ రకమైన కేన్సర్ కి ఈ చికిత్సని ఉపయోగిస్తారు.
HER2 రిసెప్టర్ కోసం ట్రస్టుజుమాబ్ అనేది యాంటీ బోడీ. ఈ ఔషధాన్ని HER2 రోగులకి కెమోథెరపీతో బాటు కొంత మెరుగైన ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. ఈ డ్రగ్ ని 4 స్టేజీ రోగులకు కెమోథెరపీతో మాత్రమే ఉపయోగిస్తారు.

కెమోథెరపీ దుష్ప్రభావాలు

అన్నవాహిక కేన్సర్ కి కెమోథెరపీ దుష్ప్రభావాలు ఉంటాయి. వాడుతున్న మందుల్ని బట్టి ఈ దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ దుష్ప్రభావాల్లో కొన్ని మందులతో బాగా నియంత్రించబడతాయి. కెమోథెరపీని తట్టుకునే శక్తి మనిషి మనిషికీ తేడాగా ఉంటుంది. కొంతమంది ఎలాంటి దుష్ప్రభావాలూ లేకుండా చాలా బాగా చికిత్సను తట్టుకోగలుగుతారు, మరికొంతమందికి కొన్ని రకాల దుష్ప్రభావాలు ఉండవచ్చు. సాధారణ దుష్ప్రభావాలు ఇక్కడ ఇస్తున్నాము.

జుట్టు ఊడిపోవడం

ఇది పైన పేర్కొన్న చికిత్సా విధానాల నియమాల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. జుట్టు ఊడడం సాధారణంగా మొదటి విడత (ఫస్ట్ సైకిల్) రెండవ వారంలో ప్రారంభమవుతుంది. కెమోథెరపీ పూర్తయిన తర్వాత జుట్టు మళ్లీ పెరుగుతుంది. కొన్ని కేంద్రాల్లో “కోల్డ్ (చల్లటి) టోపీ” సర్వీసును అందిస్తారు, అది జుట్టు రాలిపోవడాన్ని కొద్దిగా తగ్గిస్తుంది.

వికారం, వాంతులు

ఇది కెమోథెరపీలో అందరికీ తెలిసిన ఒక దుష్ప్రభావం. కానీ ఆధునిక ఔషధాలతో ఈ లక్షణాలు బాగా నియంత్రించబడతాయి.

అలసట

అలసట అనేది ఒక సాధారణ దుష్ప్రభావం. ఇది సాధారణంగా మొదటి వారంలో ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత క్రమంగా మెరుగుపడుతుంది.

నోటిలో పుండ్లు పడడం

కెమోథెరపీలో ఇది సాధారణంగా కనిపించే దుష్ప్రభావం. దానంతట అదే మామూలవుతుంది. అయితే నోటిని శుభ్రం చేసుకోవడానికి రోజుకు 3-4 సార్లు నోరు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

నీళ్ల విరేచనాలు

కెమోథెరపీ తర్వాత ఈ లక్షణం అప్పుడప్పుడు కనిపిస్తుంది. మీ డాక్టర్ తో మాట్లాడి, అది మందులతో నియంత్రించబడుతుందేమో చూడండి.

మలబద్ధకం

మలబద్ధకం కెమోథెరపీకి ఉండే సాధారణ దుష్ప్రభావం. ఇది కెమోథెరపీ డ్రగ్ ఫలితంగా సంభవిస్తుంది కానీ ప్రధానంగా ఇది కెమోథెరపీతో పాటు వికారం రాకుండా ఇచ్చే మందుల ప్రభావం వల్ల జరుగుతుంది. కెమోథెరపీ ఇచ్చిన మొదటి కొద్ది రోజుల పాటు ఇలా మలబద్ధకం ఉంటుంది.

సంక్రమణ (ఇన్ఫెక్షన్) ప్రమాదం

ఇది కెమోథెరపీలో ప్రధానమైన సైడ్ ఎఫెక్ట్. కెమోథెరపీ, అంటువ్యాధులతో పోరాడే శరీరం శక్తి సామర్థ్యాల్ని తగ్గించడం వల్ల ఇది జరుగుతుంది. అందువల్ల, కెమోథెరపీ సమయంలో ఎప్పుడైనా జ్వరం ఉంటే (రాత్రి మధ్యలో ఉన్నప్పటికీ) వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

రుచి మార్పులు

కెమోథెరపీలో ఇది సాధారణంగా ఉంటుంది. అందువల్ల ఆహారం మునుపటి రుచి ఉండదు. కెమోథెరపీ పూర్తయిన తర్వాత రుచి మామూలుగా వస్తుంది.

చేతులు కాళ్ళలో జలదరింపు

కొన్ని కెమోథెరపీ మందులు ఈ రకమైన ప్రభావం కలిగిస్తాయి. మీ తదుపరి సందర్శనలో వాటి విషయంగా డాక్టర్ తో మాట్లాడండి.

రక్తహీనత

ఇది కెమోథెరపీ ఫలితంగా సంభవించవచ్చు. సాధారణంగా దీనిని గమనించవచ్చు. చికిత్స పూర్తయిన తరువాత ఇది మెరుగుపడుతుంది. కొన్నిసార్లు పరిస్థితి మెరుగుపరచడానికి రక్త మార్పిడి లేదా ఇతర చికిత్స అవసరమవుతుంది.

రక్తస్రావం

కెమోథెరపీతో రక్త స్రావం వచ్చే చిన్న ప్రమాదం ఉంది. ఇలా జరిగితే, మీ వైద్యుని మీరు నేరుగా సంప్రదించండి.

దగ్గు, అనారోగ్యం లేదా పాదాల వాపు

ఈ ప్రభావాలు ట్రస్టుజుమాబ్ ఉన్న రోగులలో కనిపించే అవకాశం ఉంది. అలా జరిగితే, డాక్టర్ కి చెప్పాలి.

రేడియోథెరపీ అంటే ఏమిటి

కేన్సర్ కణాలు నాశనం చేయడానికి ఇచ్చే అధిక శక్తివంతమైన x- కిరణాల (రే)నే రేడియోథెరపీ అంటారు. ఈ x- రే లు కేన్సర్ కణాల DNA కు నష్టం కలిగించడం ద్వారా వాటిని చంపుతాయి. రేడియోథెరపీ చికిత్స అనేది ఒక స్థానిక చికిత్స. ఇది ఇచ్చిన ప్రాంతంలోనే దీని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. x- కిరణాలను ఉత్పత్తి చేసే ఒక పెద్ద యంత్రాన్ని (లీనియర్ యాక్సిలరేటర్) ఉపయోగించి ఇది రోగికి చికిత్సను అందిస్తుంది. ఈ పద్ధతిని ఎక్స్టర్నల్ (బాహ్య) బీమ్ థెరపీగా పిలుస్తారు. రేడియోథెరపీనిఇచ్చే మరో మార్గం రేడియోయాక్టివ్ వనరులను కేన్సర్ లోకి చేర్చడం. ఈ పద్ధతిని బ్రాచీథెరపీ అని పిలుస్తారు కొన్ని రకాల అన్నవాహిక కేన్సర్లని చికిత్స చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.

అన్నవాహిక కేన్సర్ కి రేడియోథెరపీ

రేడియోథెరపీ అనేది అన్నవాహిక కేన్సర్ కి చేసే చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం. ఇది అన్నవాహికకేన్సర్ లో అన్ని దశల (1 దశ నుండి 4 దశవరకు)చికిత్సకు ఉపయోగిస్తారు. 1, 2, 3 దశల్లోరేడియోథెరపీఇవ్వడమనేది కేన్సర్ ని పూర్తిగా నివారించే ఉద్దేశ్యంతోనూ, భవిష్యత్తులో తిరిగి రాకుండానూ కేన్సర్ ని పూర్తిగా తొలగించేందుకు ఉపయోగించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఐదు నుంచి ఏడు వారాలపాటు వారానికి ఐదు రోజుల చొప్పున చికిత్స ఇవ్వబడుతుంది.

అన్నవాహిక కేన్సర్ 1 వ దశలోశస్త్రచికిత్సని తట్టుకోలేని రోగులకి రేడియోథెరపీ ఉపయోగిస్తారు. ఈ సెట్టింగ్ లో,రేడియోథెరపీ కెమోథెరపీ (కెమోరేడియోథెరపీ) తో బాటు గానీ లేదా కేవలం రేడియోథెరపీ గానీ రోగి శరీర దృఢత్వాన్ని బట్టి ఇవ్వబడుతుంది.

2,3 దశల్లో ఉన్న రోగులకు చికిత్సగాకెమోరేడియోథెరపీ లేదా కేవలం రేడియోథెరపీ గానీ లేదా నివారణా శస్త్ర చికిత్సకు ముందుగా గానీ రోగి శరీర దృఢత్వాన్ని బట్టి ఇవ్వబడుతుంది.

4 దశలో, రేడియోథెరపీ ప్రధానంగా లక్షణాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ, ఇది 1 నుండి 3 వారాల వరకు తక్కువ వ్యవధిలో ఇవ్వబడుతంది. 4దశరోగులకి బ్రాచీథెరపీని కూడా ఉపయోగించవచ్చు. దీంట్లో స్థానికంగా రేడియోథెరపీ ఇవ్వడానికి రేడియోయాక్టివ్ వనరును అన్నవాహికలో కొంతకాలం పాటు ఉంచడం జరుగుతుంది.ఈ చికిత్సలో ఇది ఒక్కటే విడిగానూ ఇవ్వవచ్చు లేదా బాహ్య కిరణ రేడియోథెరపీతో కలిపి కూడా ఇవ్వవచ్చు.

కెమోరేడియోథెరపీని ఉపయోగించినప్పుడు, కెమోథెరపీని ఆ మందుల్ని బట్టి రెండు రకాలుగా ఇవ్వబడతాయి. సాధారణంగా, రేడియోథెరపీఇచ్చే సమయంలో వారానికి ఒకసారి చొప్పున గానీ లేదా మొదటి, చివరి వారాల్లో5 రోజులు వరసగా ప్రతిరోజూ గానీ కెమోథెరపీ లేదా చికిత్స ఇవ్వబడుతుంది.

వివిధ పద్ధతులను ఉపయోగించి రేడియోథెరపీని ఇవ్వవచ్చు, అవి క్రింద ఇవ్వబడ్డాయి.

3D కన్ఫర్మల్ రేడియోథెరపీ

ఇది రేడియోథెరపీ ఇవ్వడానికి ప్లానింగ్ చేసే ఒక మార్గం. ఇందులో CT, MRI స్కాన్ల నుంచి కణితి త్రీ-డైమన్షనల్ ఇమేజిని చూడడానికి ఇలా చేస్తారు. ఇది ప్లానింగ్ ప్రక్రియని మూడు కోణాల్లో ఉండేలా చూస్తుంది.
ఇది రేడియేషన్ చికిత్సనిచాలా ప్రామాణికంగా ఉండేలాగానూ,2D రేడియోథెరపీ కంటే మరింత ఖచ్చితమైనదిగానూ చూస్తుంది.

ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ(IMRT)

IMRT అనేది 3D కన్ఫర్మల్ ట్రీట్మెంట్ ప్లానింగ్ మరియు డెలివరీ మెథడ్ కి చెందిన రకం. ఇందులో రేడియేషన్ కిరణాలు కణితి ఆకారంలో సరిగ్గా సరిపోయే ఆకారంలో ఉంటాయి. ఇది శరీరంలోని సాధారణ నిర్మాణాల చుట్టూ విషపదార్థాల్ని తగ్గిస్తుంది. IMRT కీ, 3D కన్ఫర్మల్ రేడియోథెరపీకీ మధ్య గల వ్యత్యాసం ఏమిటంటే IMRT కణితి ఆకారానికి సరిపోయే విధంగా మరింత ఖచ్చితమైన ఆకారంలో ఉంటుంది. అందువలన, దుష్ప్రభావాలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే, IMRT తో, అదే కణితి లో వేర్వేరు భాగాలకు రేడియోథెరపీకి చెందిన వివిధ మోతాదులను పంపిణీ చేసే అవకాశం ఉంది. IMRT వివిధ కోణాల నుండి కణితిపై పలు రేడియేషన్ కిరణాల్ని ప్రసరింపచేసి చేయబడుతుంది.

ఆర్క్ ఆధారిత (బేస్డ్) చికిత్స

ఆర్క్ ఆధారిత థెరపీ (రాపిడ్ ఆర్క్, VMAT) అంటే ఆర్క్ వంటి లీనియర్ యాక్సిలరేటర్ తో చేసే రేడియోథెరపీ. ఈ రకమైన చికిత్స ప్రామాణికమైన IMRT కన్నా ఖచ్చితమైనదిగా ఉంటుంది, చాలా వేగంగా డెలివర్ చేస్తుంది. ఇది చాలా ఖరీదైనది.

ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ (IGRT)

చికిత్స ఖచ్చితత్వాన్ని పర్యవేక్షించడానికి CT స్కానర్ల వంటి ఇమేజింగ్ సిస్టమ్స్ ని ఉపయోగించడం ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. సాధారణంగా, ప్రామాణిక 3D కన్ఫర్మల్ రేడియోథెరపీలో, ప్లానింగ్ ప్రయోజనాల కోసం చికిత్స ప్రారంభించడానికి ముందు CT స్కాన్ చేయడం జరుగుతుంది. IGRT లో, చికిత్స ఖచ్చితత్వం కోసం పరీక్షించడానికి ప్రతి రేడియోథెరపీ చికిత్సకు ముందు ఒక CT స్కాన్ లేదా x- రే చేస్తారు.

అన్నవాహికకి రేడియోథెరపీ దుష్ప్రభావాలు

రేడియోథెరపీకి సంబంధించిన దుష్ప్రభావాలు రేడియోథెరపీ మోతాదుపైన, చికిత్స వ్యవధి, చికిత్స చేయబడుతున్న ప్రాంతంపైన ఆధారపడి ఉంటాయి. రేడియోథెరపీ మోతాదు ఎక్కువగా ఉన్నందున నివారణ చికిత్సలో కెమోరేడియోథెరపీ మరియు రేడియోథెరపీ ఇస్తున్న రోగులలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.

అన్నవాహికకి చేసే రేడియోథెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాల్లో అలసట, వికారం, వాంతులు, ఆసిడ్ రిఫ్లక్స్, ఛాతీలో మంటగా ఉండడం, గొంతులో పుండ్లు పడడం, మ్రింగడానికి కష్టంగా ఉండడం, ఇరుకుదన(అన్నవాహిక కుంచించుకుపోవడం), దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటివి సంభవిస్తాయి. ఈ దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి, ఇవి చికిత్స జరిగే సమయంలో గానీ లేదా చికిత్స తర్వాత 3 నెలలు దాటిన తర్వాత కొంచెం ఆలస్యంగా గానీ ఇవి సంభవిస్తాయి. చికిత్స ముగిసిన తరువాత తీవ్ర ప్రభావాలు తగ్గి మామూలు స్థితి రావడానికి సుమారు 4 వారాల సమయం తీసుకుంటుంది.

కష్టంగా మ్రింగుడు పడడం

రోగికి మ్రింగడం చాలా కష్టంగా ఉండి, తగినంత ఆహారం తీసుకోలేకపోయే సందర్భంలో, చికిత్స పొందుతున్నపుడు, చికిత్స జరిగి స్వస్థత పొందినప్పుడు రోగికి అవసరమైన అన్ని పోషకాలను ఇవ్వడానికి రోగి కడుపులోకి ఆహారం పంపేదుకు ఒక ట్యూబ్ ని ప్రవేశ పెడతారు. . ఈ ఫీడింగ్ ట్యూబ్ జెజునోస్టమీ కావచ్చు. ఈ ట్యూబ్ ని జెజునమ్ లేదా గాస్ట్రోస్టమీ అనబడే చిన్న ప్రేవుల్లో ప్రవేశపెడతారు. ట్యూబ్ ఉదరంలో ఉంటుంది. ఈ ట్యూబ్ లు చర్మం నుంచి బయటికి వచ్చి ఉంటాయి. ఆహారం, ద్రవపదార్థాల్ని ఈ ట్యూబ్ గుండా లోపలికి పంపడం జరుగుతుంది.

పిడి-ఎల్1 పాజిటివ్ గల లేదా మైక్రోశాటిలైట్ ఇన్స్టెబిలిటి (ఎంఎస్ఐ) అధిక స్థాయిల్లో గల మరియు చాలా అధునాతన లేదా మెటాస్టాటిక్ ఇసోఫాజియల్ క్యాన్సరు గల రోగుల్లో పెంబ్రోలిజుమాబ్తో ఇమ్యునోథెరపిని ఉపయోగించవచ్చు. ఈ సెట్టింగ్లో రోగులందరికీ ఈ చికిత్స అనువుగా ఉండకపోవచ్చు. పైన పేర్కొన్న రోగుల్లో కీమోథెరపి తరువాత తదుపరి చికిత్సగా కూడా పెంబ్రోలిజుమాబ్ని ఉపయోగించవచ్చు.

క్యాన్సర్లు గల రోగుల్లో ఇసోఫాజియల్ స్టెంట్స్ ని పెట్టడం ఒక ఆప్షన్ మరియు ఆహారం మింగలేరు. ఇసోఫాగస్ యొక్క లూమెన్ని తెరిచి ఆహారం దాని గుండా వెళ్ళేందుకు స్టెంట్స్ సహాయపడతాయి. స్టెంట్ అనేది ఎండోస్కోపితో అన్నవాహికలోకి పెట్టే మెటాలిక్ మెష్ వైర్. ఒకసారి ఇది దాని స్థానంలో ఉంటే, దీనిని విస్తరించవచ్చు. స్టెంట్ని పెట్టడం వల్ల కలిగే దుష్ప్రభావంలో ఛాతీలో అసౌకర్యం, నొప్పి మరియు గుండెమంట ఉంటాయి.