Blood Cancers

బ్లడ్(రక్త) క్యాన్సర్

రక్తం తయారయ్యే కణాల నుండి అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్ ను రక్త క్యాన్సర్ అని పిలుస్తారు. క్యాన్సర్ ఉత్పన్నమయ్యే కణాల రకాన్ని బట్టి ఈ క్యాన్సర్లు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని రక్త క్యాన్సర్లు నెమ్మదిగా వృద్ది చెందుతాయి, మరికొన్ని త్వరగా విజృంభిస్తాయి. అందువల్ల చికిత్సను త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. వివిధ రకాలైన రక్త క్యాన్సర్లు వాటి లక్షణాలను బట్టి వేర్వేరుగా ప్రవర్తిస్తాయి. అయితే, వాటన్నింటిలో కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతం అనేక రకాల రక్త క్యాన్సర్లు మానవాళిని పట్టి పీడిస్తున్నాయి, వాటిలో సాధారణంగా ఎక్కువగా కనిపించే క్యాన్సర్ల రకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

లుకేమియా

లుకేమియా అనేది రక్తం మరియు ఎముక మజ్జలో అసాధారణమైన తెల్ల రక్త కణాల వృద్ది మరియు అనియంత్రిత ఉత్పత్తి వలన కలిగే రక్త క్యాన్సర్. లుకేమియా యొక్క సాధారణ రకాలు కింద ఇవ్వబడ్డాయి.
– అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML)
– అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ALL)
– క్రానిక్ మైలోయిడ్ లుకేమియా (CML)
– క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా (CLL)

మల్టిపుల్ (బహుళ) మైలోమా

ఇది రక్తంలో ఉన్న ప్లాస్మా కణాల క్యాన్సర్. ప్లాస్మా కణాలు వ్యాధిసంక్రమణతో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.
– మల్టిపుల్ మైలోమా

లింఫోమా

లింఫోమా అనేది శోషరస వ్యవస్థ యొక్క క్యాన్సరు. లింఫోమా క్యాన్సర్ కణాలు శరీరంలోని శోషరస కణుపులలో గుంపుగా చేరిన అసాధారణ లింఫోసైట్ల నుండి ఉద్భవిస్తాయి. లింఫోమాను కింది రకాలుగా విభజించవచ్చు.
– హాజ్కిన్ లింఫోమా
– నాన్-హాజ్కిన్ లింఫోమా