ఆసాధారణ ఆంకాలజిస్టు

ఆసాధారణ ఆంకాలజిస్టు

ప్రిథ్వీరాజ్ జంపన
ప్రిథ్వీరాజ్ జంపన

క్యాన్సరు అనేది రోగికి మరియు అతని/ఆమె కుటుంబ సభ్యులకు కష్టమైన వ్యాధిగా పరిణమిస్తుంది. మామూలుగా, తమకు ఈ స్థితి ఉందని నిర్థారణ చేయబడినప్పుడు ప్రజలు షాక్‌కి గురవుతారు మరియు తరువాత ఏం చేయాలో అనేక సార్లు పూర్తిగా తెలియకుండా ఉంటుంది. రోగి మరియు కుటుంబం ఈ స్థితి నుంచి బయట పడేందుకు మరియు ‘‘క్యాన్సరు ప్రయాణాన్ని’’ నిర్వహించడం మరింత సులభతరం చేసేందుకు సహాయపడటంలో సన్నిహిత బంధువులు, స్నేహితులు మరియు ఆరోగ్యసంరక్షణ ప్రొఫెషనల్స్‌ కీలక పాత్ర పోషిస్తారు.

రోగి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు సాధ్యమైనంత ఉత్తమంగా పరిస్థితిని అర్థంచేసుకునేలా మరియు సంభాళించేలా చేయడంలో డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి పాలన సిబ్బంది, క్లీనర్‌లు లాంటి హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ మరియు అనేక మంది ఇతరులు కీలక పాత్ర పోషిస్తారు.

క్యాన్సరు డాక్టర్‌లు లేదా ఆంకాలజిస్టులుగా పిలవబడే వారు ఈ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తారు. వాళ్ళు చికిత్సను ఎలా పొందుతారు, మాట్లాడతారు, చర్చిస్తారు, ప్రణాళిక చేస్తారు మరియు అమలు చేస్తారనేది, ఈ క్యాన్సరు ప్రయాణం తీసుకునే మార్గాన్ని నిర్వచిస్తుంది. అత్యధిక మంది హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ కష్టపడి పనిచేస్తారు మరియు ఈ ప్రక్రియలో మంచి పని చేస్తారు. కొంతమంది ఈ ప్రక్రియలో అసాధారణంగా మరియు మేటిగా ఉంటారు. ఇలాంటి ఒక అనుభవాన్ని ఇక్కడ ఇస్తున్నాము.

మా నాన్నకు నాన్‌ హాడ్జ్‌కిన్స్‌ లింఫోమా ఉన్నట్లుగా 1998లో నిర్థారణ చేయబడింది. ఆ సమయంలో నేను యుకెలో ఉన్నాను మరియు మొదటి సంవత్సరం శిక్షణ పొందుతున్నాను. శిక్షణ జాబ్స్ పొందడం కష్టంగా ఉండేది, నేను పార్ట్‌ టైమ్‌ పని మాత్రమే చేస్తున్నాను. ఈ వ్యాధి ఉన్నట్లుగా నిర్థారణ కావడం అతనికి మరియు కుటుంబంలోని ఇతరులందరికీ భారీ షాక్‌ కలిగించింది. నేను విదేశాల్లో ఉండటం సమస్యను మరింత జటిలంగా చేసింది. నిర్ణయం తీసుకోవడానికి నా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. నేను తిరిగి ఇండియా వెళ్ళి నా కెరీర్‌ని ఫణంగా పెట్టి అతని చికిత్సకు మద్దతు ఇవ్వడం లేదా అతను యుకెకి వచ్చి చికిత్స కొరకు నాతో ఉండటం. ఇది కష్టమైన నిర్ణయం. నేను మరియు మా అమ్మ డాక్టర్లం అయినప్పటికీ యుకె నాకు కొత్త, ఉపయోగించే చికిత్స ఎంపికల గురించి మాకు కొద్దిపాటి పరిజ్ఞానం ఉంది. ఈ ఎంపికలను పరిగణిస్తూనే, మాకు అదృష్టం కలిసివచ్చింది లేదా దేవుడు మా పట్ల కరుణ చూపారని చెప్పవచ్చు.

నేను లండన్‌లో నివసిస్తున్న నా స్నేహితుని యొక్క బంధువు ఆంకాలజిస్టు. ఇతను మాన్‌చెస్టర్‌లోని క్రిస్టీ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. ఇది యూరప్‌ మరియు యుకెలో బాగా ప్రసిద్ధి చెందిన క్యాన్సర్‌ సెంటర్‌. మేము నివసించే ప్రాంతం నుంచి ఇది కేవలం 30 మైళ్ళ దూరంలో ఉంది.

అక్కడ పనిచేస్తున్న క్లినికల్‌ ఆంకాలజిస్టు పేరు డా. హనుమంతరావు ఘట్టమనేని. డా. రావుగా అక్కడ పేరుపొందిన అతను పిజిఐ చండీగఢ్‌లో ఆంకాలజిస్టుగా శిక్షణ పొంది అనంతరం యుకె వెళ్ళారు.

నేను మొదట్లో అతనితో ఫోన్‌లో మాట్లాడి ఆ తరువాత ఫలితాలన్నిటితో కలుసుకున్నాను. అతను పరీక్షల మరియు స్కాన్‌లన్నిటి ఫలితాలను వివరంగా వివరించి క్రిస్టీలో మా నాన్నకు చికిత్స చేస్తానని చెప్పారు. మేము నివసించే ప్రాంతానికి ఇది దగ్గరలోనే ఉండటంతో మేము హాయిగా ఊపిరి పీల్చుకున్నాము. పైగా మంచి డాక్టరు. ఎప్పుడూ మాకు సులభంగా అందుబాటులో ఉంటారు.

కొద్ది రోజుల తరువాత మేము అతన్ని కలుసుకున్నాము. కీమోథెరపితో మా నాన్నకు చికిత్స ప్రారంభించారు. ప్రతి మూడు వారాలకు ఒకసారి దీనిని ఇచ్చారు మరియు ప్రతి కోర్సుకు మేము మేంచెస్టర్‌ వెళ్ళాము. మొదటి కోర్సు కొరకు, నాన్న ఒక రాత్రంతా ఆసుపత్రిలో ఉండి మరుసటి రోజు డిశ్చార్జి అయ్యారు. ఆ రోజున డాక్టరు గారు పట్టుబట్టి మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్ళి లంచ్‌గా ఆంధ్రా భోజనం తినిపించారు. ఆ తరువాత అతను మమ్మల్ని స్టేషన్‌లో వదిలిపెట్టారు. రెండవ చక్రం కీమోథెరపి తరువాత అతను మరొక అడుగు ముందుకేశారు. మమ్మల్ని 30 మైళ్ళ దూరంలో ఉన్న మా ఇంటి వద్ద తన కారులో విడిచిపెట్టారు. అతను మా నాన్నను చాలా శ్రద్ధగా చూశారు మరియు మా ఖర్చును కూడా సాధ్యమైన మేరకు తగ్గించారు. కీమోథెరపి మరియు ఆ తరువాత రేడియోథెరపి పూర్తయిన తరువాత మా నాన్న బాగా కోలుకొని తిరిగి ఇండియా వెళ్ళిపోయారు. డా. రావు మా నుంచి ప్రొఫెషనల్ ఫీజు తీసుకోలేదు మరియు మేము పట్టుబట్టగా మర్యాదపూర్వకంగా 1 పౌండ్‌ తీసుకున్నారు.

తదుపరి 13 సంవత్సరాల పాటు, డా,రావు సంరక్షణలో అనేక సార్లు కీమోథెరపి మరియు ఇతర థెరపిలతో మా నాన్నకు చికిత్స కొనసాగింది. ఈ కాలంలో నేను మరియు నా తల్లిదండ్లు అతనికి లెక్కలేనన్ని ఫోన్‌ కాల్స్‌ చేసి దుష్ప్రభావాలు, ప్రోగ్నోసిస్‌, పరీక్షలు, ఫలితాలు గురించి అడిగాము. ఈ వ్యవధి మొత్తంలో మాకు లభించిన సంరక్షణ అసాధారణమైనది అని చెప్పడం అతిశయోక్తి కాదు.

డా. రావు మాకు ఇచ్చినట్లుగానే నేను కూడా ఆంకాలజిస్టుగా అదే విధమైన సంరక్షణను నా కెరీర్‌లో అందిస్తున్నాను. స్పెషాలిటిలో దాదాపు 20 సంవత్సరాల పాటు పనిచేశాక, భోజనం కోసం నేను రోగిని ఇంటికి తీసుకెళ్ళలేదు లేదా వాళ్ళను ఇంటి వద్ద వాహనంలో విడిచిపెట్టలేదు. అయితే భవిష్యత్తులో ఇదే స్థాయిలో సంరక్షణ అందించగలుగుతానని నేను ఆశిస్తున్నాను. నేను నా కెరీర్‌లో యుకె మరియు ఇండియాలో అనేక మంది అద్భుతమైన డాక్టర్లను మరియు ఇతర హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ని చూశాను. తమ రోగుల సంక్షేమం చూసే ఏకైక లక్ష్యంతో వీళ్ళు ఎల్లప్పుడూ శాయశక్తులా సంరక్షణ అందిస్తున్నారు. వీళ్ళల్లో కొద్దిమంది అసాధారణ వ్యక్తులైతే వాళ్ళలో డా. రావు ఒకరు.