Alternative Medicines

ప్రత్యామ్నాయ మందులు (ఆల్టర్నేటివ్ మెడిసన్స్)

మెడిసిన్ ప్రత్యామ్నాయ రూపాలు ఏమిటి?

అల్లోపతికి సంబంధం లేని చికిత్సా ఎంపికలను ప్రత్యామ్నాయ చికిత్స రూపాలు అంటారు. కేన్సర్ కి చికిత్స చేసి తగ్గించాలనే ఆశతో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ప్రత్యామ్నాయ చికిత్సలు ఉపయోగించబడుతున్నాయి. భారతదేశంలో, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, ఇంకా ఇతరులు ఉపయోగించే కొన్ని సాధారణ రూపాలు ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులుగా ఉన్నాయి.

కేన్సర్ చికిత్సలో ప్రత్యామ్నాయ మెడిసిన్ రూపాలు పనిచేస్తాయా?

సాధారణంగా, అవి కేన్సర్ చికిత్సలో పనిచేస్తాయనడానికి చాలా పరిమితమైన ఆధారాలు ఉన్నాయి.

ఎంతోమంది ప్రజలు ఈ చికిత్సలను విశ్వసించి, వాటిని ఉపయోగిస్తునప్పుడు ఈ రకమైన చికిత్సలు పనిచేయవని మీరు ఎలా చెప్పగలరు?

ఆధునిక ఆరోగ్య సంరక్షణ “ఋజువు ఆధారంగా ఔషధం” (ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్) అనే భావనపై రూపొందించబడింది. కేన్సకి సంబంధించిన కెమోథెరపీ, సర్జరీ, రేడియోథెరపీ, బయోలాజికల్ ఇమ్యునోథెరపీ, ఇలా ఏ చికిత్స అయినా సరే, ఆ చికిత్సలో ఆ సెట్టింగ్ లో పనిచేస్తున్నట్లు ఆధారాలు ఉంటేనే రోగికి ఇవ్వబడుతుంది.

ఈ ఋజువు ఎలా సేకరించబడుతుంది?

సాధారణంగా నిర్దిష్ట కేన్సర్ ఉన్న వందల నుండి వేల మంది రోగులపై ఒక చికిత్సను మరో చికిత్సతో బాటు అనేక మంది రోగులపై పరీక్షించడం ద్వారా “ఋజువు ఆధారంగా ఔషధం” సేకరించబడతాయి. ఈ పరీక్షలలో లేదా క్లినికల్ ట్రయల్స్ లో అర్ధవంతమైన ప్రయోజనాన్ని అందించే చికిత్సలు మాత్రమే చికిత్స కోసం ఆమోదించబడతాయి. అందువల్ల, అల్లోపతి చికిత్సలు ఉపయోగించినప్పుడు, ఈ చికిత్సలు ఆ పరిస్థితిలో ప్రయోజనకరంగా ఉంటాయనడానికి బలమైన ప్రమాణం ఉంది.

మెడిసిన్ ప్రత్యామ్నాయ రూపాలు పనిచేస్తాయనడానికి ఆధారాలు ఉన్నాయా?

కేన్సర్లో పనిచేసే ఈ చికిత్సలకు ఖచ్చితమైన క్లినికల్ ట్రయల్స్ ఆధారాలు లేవు. కొన్ని కేసుల్లో లభించే ఆధారాలు అలాంటి ప్రయోజనాల్ని వెల్లడి చేయవచ్చు, కానీ అందుకు ఎలాంటి క్లినికల్ ట్రయల్ ఆధారాలూ బలంగా లేవు. ఈ ఔషధాలలో చాలావరకు అల్లోపతి ఔషధాల కంటే తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉన్నందున, ఏ విధమైన ప్రత్యామ్నాయ ఔషధం పనిచేస్తుందో తగిన ఋజువులు లభిస్తే, రోగులందరికీ ప్రామాణిక చికిత్సలకు బదులుగా ఈ చికిత్సలు ఇవ్వబడవచ్చని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.

నేను ప్రత్యామ్నాయ ఔషధాలను ప్రయత్నించాలనుకుంటే, నేను వాటిని ఎప్పుడు ఉపయోగించాలి?

మీరు ఈ ఔషధాలను ప్రయత్నించాలనుకుంటే, గుర్తించబడిన మరియు నిరూపితమైన అన్ని చికిత్సలూ ఉపయోగించి, ఇక తదుపరి చికిత్సా ఎంపికలు మిగిలి లేవనుకున్న తర్వాత వాటిని ఉపయోగించడం మంచిది.

నేను ఒకే సమయంలో ప్రామాణిక అల్లోపతి మరియు ప్రత్యామ్నాయ చికిత్సలను ఉపయోగించవచ్చా?

లేదు, రెండు చికిత్సల మధ్య పరస్పర చర్య ఏమిటో మాకు తెలియదు కాబట్టి ఈ రెండు చికిత్సా ఎంపికలను ఒకేసారి ఉపయోగించడానికి సిఫార్సు చేయడంలేదు, పరస్పర చర్యలు చికిత్సలను అసమర్థంగా చేస్తాయి లేదా దుష్ప్రభావాల ప్రమాదాన్ని పెంచుతాయి.