Benign breast disease

నిరపాయకర రొమ్ము వ్యాధి

నిరపాయకర రొమ్ము వ్యాధులు అనేవి రొమ్ములో మామూలుగా కలిగే మరియు క్యాన్సర్లు కాని స్థితులు. రొమ్ములో నిరపాయకర స్థితులు అనేక రకాలుగా ఉంటాయి మరియు ప్రారంభ రొమ్ము క్యాన్సరు మాదిరిగానే ఉండొచ్చు. రొమ్ము క్యాన్సరేమోనని భయపడేంతగా రోగులకు రొమ్ములో లక్షణాలు ఉండటం సామాన్యమైన విషయం. ఇలాంటి లక్షణాలను డాక్టరు మదింపుచేయడం మరియు క్యాన్సరు లేదని నిర్థారణ చేసేందుకు తగిన పరీక్షలు చేయడం ముఖ్యం. అత్యధిక మంది రోగుల్లో ఇలాంటి పరీక్షలు నిరపాయకర రొమ్ము స్థితులను వెల్లడిస్తాయి.కొన్ని నిరపాయకర రొమ్ము స్థితులు భవిష్యత్తులో రొమ్ము క్యాన్సరు కలిగే ప్రమాదాన్ని పెంచవచ్చు మరియు ఇలాంటి కేసుల్లో ఎలా వ్యవహరించాలో ఉత్తమ ఎంపికలపై డాక్టరు సలహా ఇస్తారు.

కొన్ని మామూలు నిరపాయకర రొమ్ము స్థితుల యొక్క క్లుప్త విశదీకరణ ఈ కింద ఇవ్వబడింది.

రొమ్ముకు ఫైబ్రోఅడెనోమా

15-30 సంవత్సరాల వయస్సు గల రోగుల్లో ఇది మామూలు స్థితి. రొమ్ములో గ్రంథి లాంటి కణాలు మరియు కనెక్టివ్ టిష్యూ సమీకరణ ఇది. సమిష్టిగా అవి గడ్డ ఏర్పరుస్తాయి, వీటి అనుభూతి రోగికి కలుగుతుంది. స్పష్టమైన అంచులతో ఇది రబ్బరు మాదిరిగా అనిపిస్తుంది మరియు రొమ్ము లోపల స్వేచ్ఛగా కదులుతుంది. ఈ ప్రాంతంలో కొంతమంది మహిళలకు నొప్పి లేదా అసౌకర్యం ఉండొచ్చు.

ఒకటి లేదా రెండు రొమ్ముల్లో ఒక్కటే లేదా అనేకంగా ఫైబ్రోఅడెనోమా ఉండొచ్చు. వీటి సైజు మారుతుంది, కానీ మామూలుగా 2 సెం.మీ కంటే తక్కువగా ఉండొచ్చు. కొన్ని ఫైబ్రోఅడెనోమాలు పెద్దవిగా ఉండొచ్చు మరియు 5 సెం.మీ లేదా ఎక్కువకు పెరుగుతాయి. ఫైబ్రోఅడెనోమా సరళంగా లేదా మిశ్రమంగా ఉండొచ్చు. గట్టి మరియు సిస్ట్ లాంటి కాంపొనెంట్ల మిశ్రమం కాంప్లెక్స్లో ఉండొచ్చు.

ఫైబ్రోఅడెనోమా రోగనిర్థారణ క్లినికల్ పరీక్షతో చేయబడుతుంది. రోగనిర్థారణను ధృవీకరించుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్, మమ్మోగ్రామ్ మరియు గడ్డ యొక్క సూది శాంప్లింగ్ చేయవచ్చు. ఫైబ్రోఅడెనోమా రొమ్ము క్యాన్సరులోకి మారిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.

రోగనిర్థారణ ధృవీకరించబడితే, ఎలాంటి చికిత్స లేకుండా చిన్న ఫైబ్రోఅడెనోమాను అలా వదిలేయవచ్చు. పెద్ద, మిశ్రమం మరియు లక్షణాలను కలిగిస్తున్న ఫైబ్రోఅడెనోమాలను సర్జరీతో తొలగించవచ్చు.

రొమ్ముకు ఫిల్లోడెస్ కణితి

ఇది ఒక రకం రొమ్ము స్థితి, ఇది సాధారణంగా గడ్డ మాదిరిగా ఉంటుంది. ఫైల్లోడెస్ కణితి నిరపాయకర స్థితి నుంచి క్యాన్సరు లాగా ప్రవర్తించేదగా ఉండొచ్చుమరియు అనేకం ఈ రెండిటి మధ్య ఉంటాయి. రోగి మామూలుగా ఫైబ్రోఅడెనోమా లాంటి రొమ్ములో గడ్డను గమనిస్తారు.

సూది ఆస్పిరేషన్లో ఫైల్లోడెస్ కణితిని నిర్థారణ చేస్తే (ఎఫ్ఎన్ఎసి), దీనిని తొలగించడానికి సర్జరీ చేయబడుతుంది. కణితి రకాన్ని హిస్టోపేథాలజీ రిపోర్టు స్పష్టంగా గుర్తిస్తుంది. ఈ కణితిల్లో అత్యధికం నిరపాయకరమైనవి మరియు సర్జరీ తరువాత మరింతగా చికిత్స ఏదీ అవసరం ఉండదు. హద్దుల్లో ఉన్న లేదా క్యాన్సరుగా ఉన్న చాలా కొద్ది వాటికి రేడియోథెరపి లాంటి ఇతర చికిత్స ఎంపికలు అవసరం కావచ్చు.

డక్ట్ పపిల్లోమా

డక్టల్ పపిల్లోమా అనేది రొమ్ము నాళంలో పెరుగుతుంది. ఇది వార్ట్ లాంటి ఆకారంలో ఉంటుంది. రొమ్ము నాళంలో ఇది పెరిగే కొద్దీ, ఇది కలిగించే లక్షణాల్లో చనుమొన నుంచి డిశ్చార్జి ఉంటుంది. డిశ్చార్జి నిర్మలంగా, గోధుమరంగులో లేదా రక్తం మాదిరిగా ఉండొచ్చు. కొంతమంది రోగుల్లో ఈ ప్రాంతంలో గడ్డ లేదా నొప్పి ఉండొచ్చు.

ఈ స్థితికి చికిత్స మైక్రోడొచెక్టమి అనే మైనర్ సర్జరీ, దీనిలో పపిల్లోమాతో పాటు నాళాన్ని తొలగిస్తారు.

రొమ్ము సిస్ట్లు

సాధారణ ప్రజానీకంలో రొమ్ము సిస్ట్లు చాలా సామాన్యమైనవి మరియు 30-50 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో నిరపాయకర గడ్డలు కలిగిస్తాయి. సిస్ట్ అంటే లోపల ఫ్లూయిడ్ గల తిత్తి అని అర్థం. రొమ్ములో సిస్ట్లు ఒకటి లేదా రెండు రొమ్ముల్లో ఒక్కటి లేదా అనేకం ఉండొచ్చు. రోగికి మామూలుగా రొమ్ములో గడ్డ ఉంటుంది. గడ్డ మెత్తగా ఉంటుంది మరియు స్వేచ్ఛగా కదులుతుంది. రోగనిర్ధారణ చేయడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఎఫ్ఎన్ఎసి సహాయపడతుంది మరియు సిస్ట్లో ఫ్లూయిడ్ని తొలగించడానికి ఎఫ్ఎన్ఎసిని కూడా ఉపయోగించవచ్చు. లోపల గట్టి భాగం ఉందా లేదా సిస్ట్ని భాగాల్లోకి విభజించే సెప్టేషన్లు ఉన్నాయా అనే దానిపై ఆధారపడి సిస్ట్లు సింపుల్గా లేదా మిశ్రమంగా ఉండొచ్చు. ఈ విశిష్టతలపై ఆధారపడి, సిస్ట్ని తొలగించాలా లేదా చికిత్స అవసరం ఏదీ లేకుండానే రొమ్ములో వదిలేయాలా అనే విషయం నిర్ణయించబడుతుంది.

ఎటిపికల్ హైపర్ప్లాసియా

హైపర్ప్లాసియాలో కణాలు సంఖ్య ఎక్కువగా ఉంటుంది మరియు ఎటిపికల్ హైపర్ప్లాసియా అంటే రొమ్ములో అసాధారణ కణాల సంఖ్య పెరిగిందని అర్థం. ఈ కణాలు క్యాన్సరు కణాలు కావు, కానీ తదుపరి 10-15 సంవత్సరాల్లో క్యాన్సరులోకి మార్చే అవకాశం ఉంటుంది. ఎటిపికల్ డక్టల్ హైపర్ప్లాసియాగా పిలవబడే రొమ్ము నాళంలో లేదా ఎటిపికల్ లోబ్యులర్ హైపర్ప్లాసియాగా పిలవబడే లోబ్యూల్స్లో ఎటిపికల్ హైపర్ప్లాసియా ఉండొచ్చు. ఎటిపికల్ హైపర్ప్లాసియా గల రోగులకు లక్షణాలు ఏమీ ఉండవు మరియు రొమ్ముల్లో మమ్మోగ్రామ్స్ లేదా ఇతర నిత్యపరిపాటి పరీక్షలు చేసినప్పుడు మాత్రమే ఈ స్థితి నిర్థారణ చేయబడుతుంది. ఈ స్థితి నిర్థారణ చేయబడిన రోగుల్లో, రెగ్యులర్ మమ్మోగ్రామ్స్తో సన్నిహితంగా అనుసరణ చేయడం లేదా ఎటిపికల్ హైపర్ప్లాసియా ఏరియాను సర్జరీతో తొలగించడం చికిత్స ఎంపికల్లో ఉంటాయి. ఎడిహెచ్ గల కొంతమంది రోగుల్లో భవిష్యత్తులో క్యాన్సరు అపాయాన్ని తగ్గించేందుకు టామోక్సిఫెన్ లేదా ఇతర రూపంలో టాబ్లెట్లను ఉపయోగించవచ్చు. ఈ ఎంపిక వల్ల మంచి చెడులు ఉంటాయి మరియు వీటిని ఆంకాలజిస్టులతో చర్చించవచ్చు.