Cancer and Covid-19 Infection

క్యాన్సరు మరియు కోవిడ్-19 ఇన్ఫెక్షన్

క్యాన్సరు రోగుల్లో కోవిడ్-19 లేదా వినూత్న కరోనావైరస్ ఎక్కువ సామాన్యమైనవా?
చైనా, ఇటలీ మరియు స్పెయిన్లో చేసిన అధ్యయనాల ఆధారంగా, మీరు క్యాన్సరు ఉన్న రోగి అయితే కోవిడ్ 19 సోకే ప్రమాదం పెరుగుతుంది. మొత్తంగా, సాధారణ జనాభాలో 1% కంటే తక్కువగా ఉండటంతో పోల్చుకుంటే దాదాపు 1-4% క్యాన్సరు రోగులకు కోవిడ్-19 ఉండొచ్చు. రోగి యొక్క భౌగోళిక ప్రాంతం మరియు రోగులు మరియు ఆసుపత్రులు తీసుకుంటున్న సురక్షిత చర్యలు లాంటి స్థానిక అంశాలపై ఆధారపడి ఇది మారిపోతుండొచ్చు.

క్యాన్సరు రోగుల్లో కోవిడ్-19 లక్షణాలు ఏమిటి?
క్యాన్సరు రోగుల్లో కోవిడ్-19 లక్షణాలు క్యాన్సరు లేని రోగుల్లో ఉండే వాటి మాదిరిగా ఉంటాయి. వీటిల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు పుండు, తలనొప్పి, కండరాల మరియు ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోలేకపోవడం, రుచి, వాసన కోల్పోవడం ఉన్నాయి.

వృద్ధులు, డయాబెటీస్, హైపర్టెన్షన్ మరియు గుండె జబ్బు, క్యాన్సరు, ఊబకాయం గల ప్రజలకు కోవిడ్-19 ప్రమాదం పెరిగే అవకాశం ఉంటాయి. వీటి సమ్మేళనం ప్రమాదాన్ని పెంచవచ్చు.

క్యాన్సరు రోగులను ఎప్పుడు కోవిడ్-19 కొరకు పరీక్షించాలి?
పైన పేర్కొనబడిన లక్షణాలు గల క్యాన్సరు రోగి ఎవరినైనా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కోసం పరీక్షించాలి. అదే సమయంలో, క్యాన్సరు వల్లే ఈ లక్షణాలు కలుగుతున్నాయా అనే విషయం తెలుసుకునేందుకు వీళ్ళను మదింపు చేయడం జరుగుతుంది. ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్చుకోవడానికి ముందు లేదా రోగనిరోధక వ్యవస్థను అణచివేసే చికిత్సను ప్రారంభించే ముందు క్యాన్సరు రోగుందరికీ పరీక్ష చేయాలని కొంతమంది డాక్టర్లు కోరుకోవచ్చు.

ఏ రకమైన క్యాన్సర్లకు కోవిడ్-19 ప్రమాదం ఎక్కువగా ఉంటుంది?
కోవిడ్-19తో తీవ్ర జబ్బు కలిగే ప్రమాదం ఊపిరితిత్తుల క్యాన్సరు మరియు రక్త క్యాన్సర్లు లాంటి కొన్ని రకాల క్యాన్సరుతో పెరుగుతుంది. వృద్ధాప్యపు వయస్సు మరియు పైన వివరించినట్లుగా ఇతర వైద్య స్థితులు ఉండటం అత్యంత ముఖ్యమైన ప్రమాదాలు.

కోవిడ్-19కి కీమోథెరపి లేదా ఇతర థెరపిలు చేయించుకోవడం ప్రమాదకరమా?
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఉన్న 4 వారాల లోపు క్యాన్సరుకు కీమోథెరపి లేదా ఇతర థెరపి చేయడం వల్ల ప్రమాదకరమైన దుష్ప్రభావాల ప్రమాదం పెరగదు. కాబట్టి, క్యాన్సరును నియంత్రించడంలో మరియు ప్రమాదం విషయంలో దానిని బ్యాలెన్స్ చేయడంలోని మెరిట్స్పై ఈ చికిత్సల గురించి డాక్టర్లు నిర్ణయాలు తీసుకుంటారు.

కోవిడ్-19 ఇన్ఫెక్షన్ పొందే అపాయాన్ని తగ్గించుకునేందుకు క్యాన్సరు రోగి ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి?
తీసుకోబడే ముందుజాగ్రత్తలు మరెవ్వరికైనా తీసుకోబడే వాటి మాదిరిగా ఉంటాయి మరియు తరచుగా చేతులు కడుక్కోవడం మరియు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ముఖం మాస్క్ లేదా కవరింగ్ ధరించడం, సామాజిక దూరం పాటించడం మరియు కిక్కిరిసిన జనంలోకి వెళ్ళకపోవడం ఉంటాయి.

కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఉన్న క్యాన్సరు రోగికి చికిత్స ఎలా భిన్నంగా ఉంటుంది?
సాధారణంగా, క్యాన్సరు లేని వారితో పోల్చుకుంటే కోవిడ్-19 గల క్యాన్సరు రోగుల మాదిరిగా చికిత్స ఎంపికలు ఉంటాయి. అయితే, రోగనిరోధక వ్యవస్థను అణచివేసే కీమోథెరపి లేదా ఇతర థెరపిలు లాంటి చికిత్సలపై ఉన్న రోగులు కోవిడ్-19 లక్షణాలన్నీ పరిష్కారమయ్యేంత వరకు ఆపేయాలి.

కోవిడ్-19 ఇన్ఫెక్షన్ తరువాత క్యాన్సరు చికిత్సను ఎప్పుడు పునఃప్రారంభించవచ్చు?
జ్వరం ఆగిపోయిన కనీసం 24 గంటల తరువాత చికిత్సను పునఃప్రారంభించవచ్చని మరియు జ్వరాన్ని నియంత్రించేందుకు మందులు వేటినీ రోగి తీసుకోకూడదని అత్యధిక మార్గదర్శకాలు సిఫారసు చేస్తున్నాయి. ఇంకా, దగ్గు లాంటి ఇతర లక్షణాలు ఉంటే, అవి తగ్గిపోవాలి. రోగికి లక్షణాలు ఏవీ లేకపోతే, కానీ కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్లుగా కనుగొంటే, పాజిటివ్ పరీక్ష తరువాత 20 రోజులకు చికిత్సను ప్రారంభించవచ్చు. క్యాన్సరు చికిత్సలు ప్రతిఒక్కరికీ భిన్నంగా ఉంటాయి మరియు ప్రతిపాదిత చికిత్స ప్రమాదాలు మరియు ప్రయోజనాలను డాక్టరు మదింపు చేస్తారు.

నాకు క్యాన్సరు ఉండొచ్చునని అనుకుంటున్నాను, కానీ పరీక్షలు చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్ళడానికి భయపడుతున్నాను. నేను కొంత సమయం ఆగవచ్చా?
మీకు క్యాన్సరు ఉందని మీరు అనుకుంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఆసుపత్రికి వెళ్ళడం ప్రమాదంతో కూడుకొనివుంటే, డాక్టరుతో ఆన్లైన్ కన్సల్టేషన్ ఏర్పాటు చేసుకోండి. మీ ఆందోళనల గురించి డాక్టరు మీకు మరింత సమాచారం ఇస్తారు మరియు ఏ పరీక్షలు చేయాలనే విషయం గురించి నిర్ణయం తీసుకుంటారు. క్యాన్సరు నిర్థారణ మరియు చికిత్సలో జాప్యం జరిగితే క్యాన్సరు పెరగడం మరియు వ్యాపించడం కొనసాగుతుంది.