Diet and Nutrition in Cancer

కేన్సర్ – ఆహారం ‍& పోషణ

నా బంధువు ఒకరు కేన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. వారు ఏ ఆహారం తీసుకోవాలి?

ఇది కేన్సర్ చికిత్సలో ఉన్న రోగులందరూ అడిగే సాధారణ ప్రశ్న. రోగులు తమ ఆహారాన్ని మార్చడం వల్ల వారికి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని తప్పుగా భావిస్తారు. సాధారణంగా, సాధారణ ఆహారానికి బదులు తాజా పండ్లు, రసాలు, సూప్‌లకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

కేన్సర్ ఉన్న రోగులు మరియు చికిత్సలో ఉన్నవారికి సాధారణంగా ఆకలి తగ్గుతుంది, వారు ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినలేరు. కేన్సర్ ముదిరిన రోగులు సాధారణంగా బరువు కోల్పోతారు.

కేన్సర్ చికిత్స సమయంలో తీసుకోవలసిన ఆహారం గురించి ఈ క్రింది విధంగా సలహా ఇవ్వబడుతోంది:

  • కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉన్న సాధారణ సమతుల్య ఆహారం తినాలి.
  • ఈ సాధారణ ఆహారం మానవద్దు, దాని బదులు తగినంత కేలరీలు, ప్రోటీన్ లేదా క్రొవ్వులు లేని రసాలు, సూప్‌లు తీసుకోవద్దు.
  • అధిక పరిమాణంలో ఒకేసారి తినలేని రోగులు, రోజుకు ఎక్కువ సార్లు కొద్ది మొత్తాల్లో భోజనం చేయాలి.
  • సాధారణ ఆహారంలో తగినన్ని కేలరీలు, క్రొవ్వులు లేదా ప్రోటీన్లు తీసుకోలేని రోగులు, వారి ఆహారంలో ప్రోటీన్ లేదా కేలరీ సప్లిమెంట్లను చేర్చవచ్చు. అదనంగా తీసుకునే ఆహారం (సప్లిమెంట్స్) సాధారణ ఆహారంతో బాటు అదనంగా తీసుకోవలసిన ఆహారమే తప్ప సాధారణ ఆహారానికి బదులుగా తీసుకోవలసింది కాదని గమనించడం ముఖ్యం.
  • కెమోథెరపీ ఇవ్వబడుతున్న రోగులకు, వండని ఆహార పదార్థాలు, సలాడ్లు తినకూడదని సలహా ఇవ్వబడుతోంది, అలా చేస్తే వారికి ఇన్ఫెక్షన్ (సంక్రమణ) వచ్చే ప్రమాదం ఉంది.
  • ఇంట్లో తాజాగా వండిన ఆహారం తీసుకోవడం ఉత్తమం. పరిశుభ్రమైన పద్ధతిలో తయారు చేయబడినవైతే బయటి నుంచి వచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా మంచిదే.
  • మింగే సమస్య ఉన్న రోగులకు ఒక నాసోగాస్ట్రిక్ ట్యూబ్ (ముక్కు ద్వారా కడుపులోకి ఇన్సర్ట్ చేయబడిన ట్యూబ్) లేదా PEG ట్యూబ్ (చర్మం ద్వారా నేరుగా కడుపులోకి ఇన్సర్ట్ చేయబడిన ట్యూబ్) సహాయంతో ఆహారం ఇవ్వవచ్చు.
  • ప్రోటీన్ కీ, క్రొవ్వులకీ మాంసాహార ఆహారం పుష్కలమైన వనరు కాబట్టి, మాంసాహారం తినే రోగులు దాన్ని యాథావిధిగా కొనసాగించవచ్చు.
  • ఒక నిర్దిష్ట కేన్సర్ కోసం అవసరమైన సిఫార్సు చేయబడిన సాధారణంగా ఆహార మార్పులు లేదా పరిమితులు లేవు. ఉదాహరణకు, ప్రొస్టేట్ కేన్సర్‌ వచ్చిన రోగులు డైరీ ఉత్పత్తులు లేదా క్రొవ్వును తగ్గించడం మంచిదనే భావనలు ఉన్నాయి కానీ ఆ విషయం ఖచ్చితంగా తెలియదు కాబట్టి, సిఫారసు చేయబడడంలేదు.
  • కేన్సర్ చికిత్సలో ఉన్న వ్యక్తి సాధారణంగా తింటూ ఉండి, బరువు తగ్గకపోతే, ఆహారంలో ఎలాంటి సప్లిమెంట్లు గానీ లేదా ఇతర ఆహార పదార్థాలను గానీ చేర్చాల్సిన అవసరం లేదు.