Immunotherapy FAQ’s

ఇమ్యునోథెరపీలో తరచుగా అడిగే ప్రశ్నలు

కేన్సర్‌లో ఇమ్యునోథెరపీ (రోగనిరోధక శక్తి చికిత్స)అంటే ఏమిటి?

కేన్సర్‌ను నియంత్రించడానికీ మరియు చికిత్స చేయడానికీ రోగనిరోధక శక్తిని సవరించే మందుల వాడకమే ఇమ్యునోథెరపీ.

రోగనిరోధక వ్యవస్థ అంటే ఏమిటి మరియు దాని పనితీరు ఏమిటి?

శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో శరీరమంతటా రక్తంలోని తెల్ల రక్త కణాలు, ఎముక మజ్జ, శోషరస కణుపులు (లింఫు నోడ్స్), ప్లీహం వంటి అవయవాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ శరీరానికి అంటువ్యాధులు రాకుండా, బయటి నుంచి ఎలాంటి ప్రమాదమూ లోపలికి చొరబడకుండా పోరాడడానికి శరీరానికి నిరంతరం సహాయపడతాయి.

రోగనిరోధక వ్యవస్థ కేన్సర్‌ను చంపుతుందా?

శరీరం రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్ ల వంటి బాహ్య ప్రమాదాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు వాటికి ఆశ్రయమిచ్చే ఆతిథేయ (హోస్ట్) కణాల నుండి వేరు చేస్తుంది. అందువల్ల, ఈ బాహ్య ప్రమాదాలతో పోరాటానికి రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలకమైనపుడు, రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రమాదాల్ని చంపుతుందే కాని ఆతిథేయ సాధారణ కణాలకు ఎటువంటి నష్టమూ కలిగించదు.

శరీరంలో కేన్సర్ అభివృద్ధి చెందినపుడు, రోగనిరోధక వ్యవస్థ కేన్సర్‌ను శరీరంలో ఉండకూడని (విదేశీ) పదార్థంగా గుర్తించదు, అందువల్ల దానిని నాశనం చేయడానికి ప్రయత్నించదు లేదా గుర్తించదు, కాని దానిని చంపలేకపోతుంది. కేన్సర్ కూడా రోగనిరోధక వ్యవస్థ ద్వారా గుర్తింపబడకుండా ఉండేలా పెరుగుతుంది.

ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది?

ఇమ్యునోథెరపీలో రోగనిరోధక వ్యవస్థను సవరించే అనేక మందులు ఉన్నాయి, ఉదాహరణకు-కేన్సర్ కణాలను విదేశీ కణాలుగా గుర్తించే మందులు, యంత్రాంగాన్ని మార్చి రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచే మందులు.

అందుబాటులో ఉన్న వివిధ రకాల ఇమ్యునోథెరపీ ఏమిటి?

అనేక రకాలైన ఇమ్యునోథెరపీ అందుబాటులో ఉంది, వీటిలో కొన్ని ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్

ఈ మందులు మోనోక్లోనల్ యాంటీబాడీస్ (మాబ్స్). ఇవి కేన్సర్ కణాల ఉపరితలంపై తమను తాము జత చేసుకుంటాయి, ఇవి రోగనిరోధక వ్యవస్థకు మరింత కనిపించేలా చేస్తాయి. కేన్సర్ కణాలను చంపడానికి ఈ వ్యవస్థ ప్రారంభించబడుతుంది. కేన్సర్ చికిత్స కోసం ఈ చెక్ పాయింట్ ఇన్హిబిటర్లు బాగా అందుబాటులో ఉన్నాయి. ఇవి సాధారణంగా 4 వ దశలో ఉపయోగించబడతాయి మరియు కేన్సర్‌ను నియంత్రించడానికీ, జీవితాన్ని పొడిగించడానికీ సహాయపడతాయి. ఇవి కేన్సర్లను పూర్తిగా నయం చేయలేవు. ఉపయోగించే కొన్ని చెక్‌పాయింట్ ఇన్హిబిటర్లలో నివోలుమాబ్, పెంబ్రోలిజుమాబ్, అటెజోలిజుమాబ్, అవెలుమాబ్, దుర్వాలుమాబ్ మొదలైనవి ఉన్నాయి. చెక్ పాయింట్ ఇన్హిబిటర్లు ఎలా పనిచేస్తాయో ఈ క్రింది రేఖాచిత్రం చూపిస్తుంది. శరీరంలోని రోగనిరోధక కణం (T సెల్) లోని T సెల్ రిసెప్టార్ (గ్రహీత) కేన్సర్ కణం యొక్క యాంటిజెన్‌ మీద అతుక్కుంటుంది. అలాగే, క్రింద, PD-1 రిసెప్టార్ మరియు PD-ఎల్ 1 లిగ్ మిళితమవుతాయి. ఈ కలయిక T సెల్ ద్వారా కేన్సర్ కణాల నాశనం నిరోధిస్తుంది. రెండవ చిత్రంలో, చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ (PD -1 లేదా యాంటీ PD-ఎల్ 1) ద్వారా PD 1 మరియు PD-ఎల్ 1 నిరోధించబడుతున్నాయి. ఇది T సెల్ క్రియాశీలతకూ, అలాగే కేన్సర్ కణాన్ని నాశనం చేయడానికి దారితీస్తుంది.

PD-L1 స్థితి

కేన్సర్‌లో ఉన్న PD-ఎల్ 1 స్థాయిని పరీక్షతో చూడవచ్చు. పెంబ్రోలిజుమాబ్ వంటి మందుని ఇవ్వడానికి ప్లాన్ చేసినప్పుడు కొన్ని కేన్సర్లలో ఈ పరీక్ష జరుగుతుంది. PD-L1 స్థితి ఫలితం శాతంగా వస్తుంది. ఇది కొన్ని సెట్టింగులలో మందుల్ని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. పిడి-ఎల్ 1 పరీక్ష ఇప్పుడు ఊపిరితిత్తుల కేన్సర్ రోగులలో మామూలుగా జరుగుతుంది.

సైటోకిన్లు

సైటోకిన్లు ప్రతిస్పందనను పెంచడానికి సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన పదార్థాలు. ఇంజెక్షన్‌గా ఇచ్చినప్పుడు ఇంటర్‌లూకిన్ మరియు ఇంటర్‌ఫెరాన్ వంటి ఈ సైటోకిన్లు కేన్సర్‌పై రోగనిరోధక వ్యవస్థ ప్రభావాన్ని పెంచుతాయి మరియు దానిని నియంత్రించడంలో సహాయపడతాయి. సైటోకిన్‌లను అనేక సంవత్సరాలుగా కేన్సర్ చికిత్సలుగా ఉపయోగిస్తున్నారు. వాటి ప్రయోజనం చాలా అల్పమైనది, చర్మం (మెలనోమా) మరియు మూత్రపిండాల కేన్సర్లలో వీటిని ఉపయోగిస్తారు.

కేన్సర్ టీకాలు

ఈ రకమైన చికిత్సలో రోగికి ఏ రకం కేన్సర్‌ ఉందో ఆ రకం టీకా చికిత్సను ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టీకా, కేన్సర్‌ ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఎక్జిటింగ్ (నిష్క్రమించే) మోడ్ చికిత్సా విధానం. అయితే ప్రోస్టేట్ కేన్సర్‌కు మాత్రమే ప్రస్తుతం ఇలాంటి చికిత్స అందుబాటులో ఉంది. ఇది చాలా ప్రభావవంతమైన చికిత్సా విధానమని చూపబడలేదు.

అడాప్టివ్ సెల్ థెరపీ

కార్ T సెల్ థెరపీ

ఇది కొత్త రకం ఇమ్యునోథెరపీ. రోగి యొక్క T లింఫోసైట్ల (తెల్ల రక్త కణాల రకం) ను రక్త ప్రసరణ నుండి తొలగించబడే అడాప్టివ్ సెల్ థెరపీలలో ఒకటి. ఇవి చిమెరిక్ యాంటిజెన్ గ్రాహకాలను (CAR) వ్యక్తీకరించడానికి పునరుత్పత్తి చేయబడతాయి. ఈ గ్రాహకాలు ఈ T-కణాల ఉపరితలంపై ఉంటాయి, రోగికి తిరిగి ఇంజెక్ట్ చేసినప్పుడు కణాలు కేన్సర్ కణాలను గుర్తించి చంపడానికి వీలు కల్పిస్తాయి. ఈ చికిత్స చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది, పిల్లలలో కొన్ని రక్త కేన్సర్లకు చికిత్స చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ చికిత్స ప్రస్తుతం చాలా ఖరీదైనది.

ఇమ్యునోథెరపీ చికిత్సలు దుష్ప్రభావాలను కలిగి ఉన్నాయా?

అవును, ఇమ్యునోథెరపీ చికిత్సలు దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. వాటిలో కొన్ని తీవ్రమైనవీ, ప్రాణాంతకమైనవీ కావచ్చు. మొత్తం మీద చూస్తే, ఇమ్యునోథెరపీ మందుల దుష్ప్రభావాలు కెమోథెరపీ దుష్ప్రభావాల కంటే తక్కువగా ఉంటాయి. ఈ మందుల వల్ల సంభవించగల దుష్ప్రభావాలని తెలుసుకోవడానికి రెగ్యులర్ పరీక్షలు, ముఖ్యంగా రక్త పరీక్షలు చేస్తారు.

రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలకం చేయబడినప్పుడు లేదా మెరుగుపరచబడినప్పుడు, చికిత్స సాధారణ కణాలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. రక్త పరీక్షల ద్వారానూ, అలాగే రోగి ఫీలింగ్ నీ నిశితంగా పరిశీలించాలి.

ప్రతిసారీ ఇమ్యునోథెరపీ చికిత్సలు పనిచేస్తాయా?

కేన్సర్‌లోని అన్ని ఇతర చికిత్సల మాదిరిగా, ప్రతి రోగికీ ఇమ్యునోథెరపీ చికిత్సలు పనిచేయవు. ఈ మందులకు ప్రతిస్పందన అవకాశాలు కేన్సర్ లో ఉపయోగించే చికిత్సా ఔషధాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ చికిత్సలకు కేన్సర్ ప్రతిస్పందన బాగున్న రోగుల్లో చికిత్సా ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది.