Knowing the diagnosis

రోగ నిర్ధారణ గురించి తెలియజేయడం

నా బంధువు కేన్సర్‌తో బాధపడుతున్నాడు. రోగ నిర్ధారణ తెలుసుకోవడం అతడికి తెలియడం మంచిదేనా?

కేన్సర్ నిర్ధారణ గురించి రోగి తెలుసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. సాధారణంగా చాలా మంది రోగులు తమకి ఏం జరుగుతుందో సరిగ్గా తెలుసుకోవాలనుకుంటారు. ఎంపిక ఇచ్చినట్లయితే, చాలా కొద్ది మంది రోగులు తాము ఎదుర్కొంటున్న సమస్య గురించీ, రోగ నిర్ధారణ గురించీ తెలియకూడదని ఎంచుకుంటారు.

ఏదేమైనా, రోగి కలత చెందుతారనే భయంతోనే రోగికి వైద్యుడు లేదా బంధువులు కేన్సర్ ఉందనే విషయాన్ని చాలా సార్లు వెల్లడించరు. ఇది పాక్షికంగా మన సంస్కృతిలో ఉన్న అలవాటని చెప్పుకోవాలి, పాక్షికంగా బంధువుల నుండి ఈ వార్త వినగానే రోగి భయపడతాడనీ, కలత చెందుతాడనీ లేదా జీవించాలనే ఆశను వదులుకుంటాడనే భావం ఉంది.

కేన్సర్‌తో బాధపడుతున్న ఎవరైనా తమకు ఏం జరుగుతుందోనని కలత పడతారు, ఆందోళన చెందుతారు. ఈ భావన ప్రపంచవ్యాప్తంగా అందరికి ఉంది. ప్రజలు మొదట్లో ఈ వార్తతో కలత చెందినప్పటికీ, వారు సమస్యను ఎదుర్కోవడానికి ఒక కోపింగ్ స్ట్రాటజీ మెకానిజమ్‌ను అభివృద్ధి చేసుకుంటారు. ఇది అందరిలోనూ కొంచెం తేడాలతో జరుగుతుంది, అయితే సాధారణంగా జరుగుతుంది. తమకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉండే కంటే, రోగి తన పరిస్థితినీ, భవిష్యత్ లో జరిగే విషయాల్నీ అర్థం చేసుకున్న తర్వాత, అతను/ఆమె అన్ని రకాల చికిత్సా వ్యూహాలను ప్లాన్ చేసి ఎదుర్కోవడానికి మంచి స్థితిలో ఉంటాడు. రోగ నిర్ధారణను తెలుసుకోవడం ద్వారా, వారు చికిత్సా ఎంపికలను వైద్యుడితో నేరుగా చర్చించడానికీ, భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యల గురించి అన్నీ తెలుసుకుని ఆ సమాచారం మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. తమకి ఏం జరుగుతుందో తెలుసుకోవడం ద్వారా రోగులు తమ ప్లాన్లు, కోరికలు, భయాలు, ఇతర విషయాలు వేటి గురించైనా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో చర్చించగలుగుతారు.

తమకి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం, పరీక్షల ఫలితాలను తెలుసుకోవడం రోగి ప్రాథమిక హక్కు.

రోగికి రోగ నిర్ధారణ గురించి తెలియకుండా రహస్యంగా ఉంచడం కుటుంబానికి చాలా కష్టమైన పని. వారు రోగికి నిరంతరం అబద్ధం చెప్పాల్సిన స్థితిలో ఉంటారు సాధారణంగా వ్యాధి సమయంలో ఏదో ఒక సమయంలో నిజం బయటకు వస్తుంది. రోగికి అప్పటికే తనకి ఉన్న రోగం గురించి తెలిసినా, కుటుంబం లేదా డాక్టర్ కూడా తనకి తెలియకుండా ఉండాలని దాచి పెట్టారు కాబట్టి తనకు తెలియనట్టే నటించడం కూడా చాలా సార్లు చూడవచ్చు.

రోగికి రోగ నిర్ధారణ గురించి తెలియజేయడం కుటుంబానికి చాలా కష్టతరమైన విషయం. ఆ సంభాషణ జరపడానికి అనుభవం, శిక్షణ ఉన్నందున రోగ నిర్ధారణ గురించి తెలియజేయడానికి వైద్యుడే సాధారణంగా ఉత్తమ వ్యక్తి. కొన్ని సందర్భాల్లో, ఆ వార్తని ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడి ద్వారా తెలియజేయడమే మంచిది కావచ్చు.