Neutropenic Fever and Sepsis

న్యూట్రోపెనిక్ జ్వరం మరియు సెప్సిస్

న్యూట్రోపెనిక్ సెప్సిస్

న్యూట్రోపెనియా అనేది రక్తంలో న్యూట్రోఫిల్ కౌంట్ మామూలుగా కంటే తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించే పదం. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు ప్లెట్‌లెట్‌లు అనే విభిన్న రకాల కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు అనేక రకాలుగా ఉండొచ్చు. వీటిల్లో ఒకటి న్యూట్రోఫిల్స్. ఇన్ఫెక్షన్‌ల నుంచి శరీరాన్ని కాపాడటం న్యూట్రోఫిల్స్ పని.

కీమోథెరపి, బయోలాజికల్ థెరపి లేదా ఇమ్యునోథెరపి లాంటి ఔషధాలను రోగికి ఇచ్చినప్పుడు, అవి రక్త కౌంట్లపై ప్రభావం చూపించి అవి తగ్గిపోయేలా చేస్తాయి. న్యూట్రోఫిల్స్, ప్లెట్లెట్స్ మరియు ఎర్ర రక్త కణాల సంఖ్యలో తగ్గుదల ఉండొచ్చు. ఈ కణాలు తగ్గిపోయే ప్రమాదం క్యాన్సరుకు చికిత్స చేయడానికి ఇచ్చిన ఔషధాల రకంపై ఆధారపడి ఉంటుంది.

ఇన్ఫెక్షన్ నుంచి కాపాడటం న్యూట్రోఫిల్స్ పని కాబట్టి, కౌంట్ తగ్గిపోయినప్పుడు, రోగికి ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో రోగికి ఇన్ఫెక్షన్ కలిగితే, దీనిపై పోరాడగల సామర్థ్యం శరీరానికి తగ్గిపోతుంది మరియు ఇన్ఫెక్షన్ త్వరగా గంభీరంగా మారవచ్చు మరియు రోగికి సెప్టిక్ కలగవచ్చు. ఈ స్థితిని న్యూట్రోపెనిక్ సెప్సిస్ అంటారు. రోగికి న్యూట్రోపెనియా మరియు జ్వరం ఉండి సెప్సిస్ లేకపోతే, దీనికి న్యూట్రోపెనిక్ జ్వరం అంటారు మరియు ఈ స్థితి సెప్సిస్ అంతగా గంభీరమైనది కాదు, కానీ ఇది సెప్సిస్‌లోకి మారకుండా ఆపడానికి వెంటనే చికిత్స చేయవలసి ఉంటుంది.

న్యూట్రోపెనిక్ సెప్సిస్ లక్షణాలు

న్యూట్రోపెనిక్ సెప్సిస్తో ముడిపడివున్న అనేక లక్షణాలు ఉండొచ్చు మరియు 99 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత పెరగడం, ఒంట్లో బాగా లేదని అనిపించడం, మామూలుగా కంటే ఎక్కువగా అలసిపోవడం, సొమ్మసిల్లుతున్నట్లుగా అనిపించడం, తక్కువ రక్త పోటు, గుండె సూచి పెరగడం, దగ్గుతో కూడిన జ్వరం, నీళ్ళ విరేచనాలు ఉంటాయి.

రోగి ఏం చేయాలి?

రోగి క్యాన్సరు చికిత్స చేయించుకుంటుంటే, ప్రధానంగా కీమోథెరపి, బయోలాజికల్ లేదా ఇమ్యునోథెరపి చేయించుకుంటుంటే మరియు 99 డిగ్రీలకు మించి జ్వరం లేదా ఒంట్లో బాగా లేదని అనిపించడం లాంటి లక్షణాలు ఉంటే, వాళ్ళు వెంటనే డాక్టరు సహాయం కోరాలి. న్యూట్రోఫిల్స్ లాంటి రక్త కణాల స్థాయిని చూసేందుకు అత్యవసరంగా రక్త పరీక్ష చేయించుకోవలసిందిగా సాధారణంగా రోగికి డాక్టరు సలహా ఇస్తారు. ఈ అత్యవసర పరీక్షను వెంటనే చేయాలి మరియు మరుసటి ఉదయం లేదా కొద్ది గంటల్లో కాదు. రక్తం కౌంట్లు మామూలుగా ఉంటే, చింతించవలసిన పనిలేదు, కానీ అవి తక్కువగా ఉంటే, సిరలోకి యాంటీబయాటిక్స్ని ఇచ్చేందుకు రోగిని ఆసుపత్రిలో చేర్చవలసి ఉంటుంది. రోగికి న్యూట్రోపెనిక్ సెప్సిస్ ఉంటే, ఇన్ఫెక్షన్ ప్రాణాలకు ముప్పు కలిగించేదిగా మారడాన్ని నిరోధించేందుకు ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్తో వెంటనే చికిత్స చేయడం చాలా ముఖ్యం.

చికిత్స

పైన తెలియజేసినట్లుగా, ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు మరియు న్యూట్రోఫిల్ కౌంట్లు మామూలు స్థాయిలకు పెరిగేంత వరకు ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ని ఇవ్వడం చికిత్సలో ఉంటుంది. న్యూట్రోపెనియా తీవ్రంగా లేని కొంతమంది రోగులకు, అవుట్పేషెంట్ ప్రాతిపదికన మౌఖిక యాంటీబయాటిక్స్ని ఇవ్వవచ్చు, ఈ నిర్ణయం చికిత్స చేస్తున్న ఆంకాలజిస్టు తీసుకుంటారు. కొన్నిసార్లు, రోగికి ఒంట్లో బాగా లేకపోతే, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స ఇవ్వవలసిన అవసరం ఉండొచ్చు. పరిస్థితిని బట్టి తెల్ల రక్త కణ కౌంట్ని పెంచేందుకు జి- సిఎస్ఎఫ్ అనే ఇంజెక్షన్లు కూడా చేయబడవచ్చు. కొంతమంది రోగుల్లో, న్యూట్రోపెనిక్ సెప్సిస్ ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రతి కీమోథెరపి కోర్సుతో ఈ ఇంజెక్షన్లను ఇవ్వవచ్చు.