Personalised Medicine in Cancer

కేన్సర్ లో పర్సనలైజ్ చేయబడిన మందులు

సాధారణంగా కేన్సర్ చికిత్స ఎలా పొందుతారు?

కేన్సర్ చికిత్స ప్రధానంగా కేన్సర్ రకం మీద ఆధారపడి ఉంటుంది. కేన్సర్ రకం అంటే కేన్సర్ ప్రారంభమైన ప్రాధమిక అవయవం, కేన్సర్‌గా మారిన అవయవంలోని కణాల రకం. కేన్సర్ రకం, రోగ నిర్ధారణ సమయంలో కేన్సర్ దశ లేదా ప్రణాళికాబద్ధమైన చికిత్స, రోగికి గల సాధారణ ఫిట్నెస్ ఆధారంగా చికిత్సా వ్యూహాలు రూపొందించబడతాయి.

ఇవన్నీ నిర్ణయించిన తర్వాత, చికిత్స ఎంపిక రోగితో చర్చించబడుతుంది. ఉదాహరణకు, గతంలో అలాంటి రకం, అలాంటి దశ, అలాంటి ఫిట్‌నెస్ ఉన్న రొమ్ము కేన్సర్ ఉన్న రోగిలో, చికిత్స ఎంపిక కూడా అలాంటి రకానికి చెందినదై ఉంటుంది. కెమోథెరపీ ఎంపిక అయితే, ఔషధాల కాంబినేషన్ ఇవ్వబడుతుంది.

కేన్సర్‌లో పర్సనలైజ్ చేయబడిన మెడిసన్ అంటే ఏమిటి?

పర్సనలైజ్ (వ్యక్తిగతీకరించిన) చేయబడిన మెడిసన్ అంటే, కేన్సర్ చికిత్స గతంలో కేసుల్లాంటి రకం, స్టేజి, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ, ఆ రోగిలోని కేన్సర్‌ మరి కొన్న ప్రత్యేకమైన ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కేన్సర్‌లో మ్యుటేషన్ల (ఉత్పరివర్తనలు) వంటి జన్యుపరమైన మార్పుల కోసం మరిన్ని పరీక్షలు జరుగుతాయి. ఈ సమాచారం ప్రతి రోగికి తగిన చికిత్సకు సహాయపడుతుంది. ఇది కేన్సర్ చికిత్స బాగా పనిచేయడానికీ, దుష్ప్రభావాలను తగ్గించడానికీ వీలు కల్పిస్తుంది.

అన్ని కేన్సర్లకు ఈ విధంగా చికిత్స చేయవచ్చా?

అన్ని కేన్సర్లకీ పర్సనలైజ్ ఔషధం ఒక ఎంపికగా అందుబాటులో లేదు. ఈ ఎంపిక ఉన్న సాధారణ కేన్సర్లలో ఊపిరితిత్తుల కేన్సర్, రొమ్ము కేన్సర్, అండాశయ కేన్సర్, పెద్దప్రేగు, రెక్టల్ (మలాశయ) కేన్సర్, లుకేమియా, లింఫోమా, మైలోమా, కిడ్నీ కేన్సర్, మెలనోమా వంటి చర్మ కేన్సర్ లు ఉన్నాయి. ఈ శాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో ఈ పద్ధతిలో ఎక్కువ కేన్సర్లకు చికిత్స జరపవచ్చు.

స్క్రీనింగ్ మరియు కేన్సర్ నివారణలో పర్సనలైజ్ చేయబడిన మందులు ఏవైనా ఉన్నాయా?

కేన్సర్ బలంగా ఉన్న కుటుంబ చరిత్ర గల రోగుల్లో, భవిష్యత్తులో ఒక వ్యక్తికి కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని గుర్తించడానికి జన్యు పరీక్షలు చేయవచ్చు. ఈ లక్షణం జనాభాలో కొద్దిమందికి మాత్రమే పరిమితం చేయబడింది. ఇది సాధారణ సిఫార్సు కాదు. మిగతా అందరికీ, ప్రామాణిక స్క్రీనింగ్ పరీక్షలు ఉపయోగపడతాయి. మరింత సమాచారం కోసం కేన్సర్ కోసం స్క్రీనింగ్ విభాగాన్ని చూడండి.

సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ (CTC) అంటే ఏమిటి? లేదా సర్క్యులేటింగ్ ట్యూమర్ DNA అంటే ఏమిటి?

ఈ రోజుల్లో, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో, రక్తం నమూనాను తీసుకొని కేన్సర్ కోసం చూసే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కేన్సర్‌ కి చికిత్స పొందిన రోగులకీ, తగ్గుతున్న స్థితిలో ఉన్నవారికీ చేయబడుతుంది. కేన్సర్ కణాలు రక్తంలో సర్క్యులేట్ అవుతున్నట్లు కనిపిస్తే, భవిష్యత్తులో కేన్సర్ పునరావృతమవుతుందని అంచనా వేయవచ్చు.

అయితే, భవిష్యత్తులో పునరావృతమయ్యే ప్రమాదం గురించిన సమాచారం ఇవ్వడం తప్ప, చికిత్సను నిర్ణయించడంలో వాటి పాత్ర ఏమీ లేదు. అందువల్ల వాటి పాత్ర పరిమితం, ఇది రొటీన్ గా చేసేది కాదు.