Questions to ask the doctor

కేన్సర్ వైద్యుడిని సంప్రదించి అడిగే ప్రశ్నలు

నేను నా అంకాలజిస్ట్‌ను మొదటిసారి చూస్తున్నాను. నేను అతనిని/ఆమెని ఎలాంటి ప్రశ్నలు అడగాలి?

మీరు మీ అంకాలజిస్ట్‌ ని మొదటిసారి చూసినప్పుడు మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఒక అపాయింట్‌మెంట్ సందర్శనలో అన్ని ప్రశ్నలను అడగడం సాధ్యం కాకపోవచ్చు. అయితే మీరు పరిస్థితి, స్వభావం, భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యల్ని అర్థం చేసుకోవడానికి ఈ క్రింది ప్రశ్నలు అవసరం.

  1. ఇది ఏ కేన్సర్?
  2. ఏ స్టేజిలో ఉంది?
  3. శరీరంలోని ఏ భాగాలకు ఇది వ్యాపించింది?
  4. చికిత్స నయం చేసే లక్ష్యంతో చేయబడుతోందా? అలా అయితే, నివారణకు ఎంత అవకాశం ఉంది?
  5. అవసరమైన ఇన్వెస్టిగేషన్లు ఏమిటి?
  6. చికిత్సలో ఎలాంటి ఆప్షన్లు ఉన్నాయి? ప్రత్యామ్నాయ (ఆల్టర్నేటివ్) ఎంపికలు ఏమిటి?
    ఒక ఎంపిక మరొకటి కంటే ఉత్తమమైనదా
    శస్త్రచికిత్స, కెమోథెరపీ, రేడియోథెరపీ లేదా బయోలాజికల్ థెరపీ వంటి అన్ని రకాల చికిత్సలూ అవసరమేనా?
  7. చికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?
  8. చికిత్స ఖర్చు ఎంత?

కేన్సర్ 4 వ దశలో ఉండి, అది నయం కానిదైతే, నేను ఏ ప్రశ్నలు అడగాలి?

  1. చికిత్స ఎంపికలు ఏంటి?
  2. కేన్సర్ నయం అయే అవకాశం లేనప్పుడు అందుబాటులో ఉన్న ఎంపికలు ఎంత మాత్రం ప్రయోజనకరంగా ఉంటాయి?
  3. చికిత్స ఆయుర్దాయాన్ని పెంచుతుందా అలా అయితే, ఎంత పెంచగలుగుతుంది?
  4. అలాంటి చికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి?
  5. అలాంటి చికిత్సకు ఎంత ఖర్చు అవుతుంది?
  6. ప్రత్యామ్నాయ ఎంపికలు ఏంటి?

కెమోథెరపీ చికిత్స సమయంలో నేను నా వైద్యుడిని చూస్తున్నట్లయితే, నేను ఏ ప్రశ్నలు అడగాలి?

  1. చికిత్స వల్ల ప్రస్తుతం ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయో మీరు వైద్యుడికి రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
  2. చికిత్స పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు లేదా స్కాన్లు ఎప్పుడు జరుగుతాయని అడగండి.
  3. ఒకవేళ ఇటీవలే స్కాన్ చేయబడితే, ఆ కేన్సర్ చికిత్సకు ప్రతిస్పందిస్తుందో లేదో డాక్టర్ చెప్పగలరేమో అడగండి.

రేడియోథెరపీ చికిత్స సమయంలో నేను నా వైద్యుడిని చూస్తున్నాను, నేను ఏ ప్రశ్నలు అడగాలి?

  1. మీరు చికిత్స చికిత్స వల్ల ఎదుర్కొంటున్న దుష్ప్రభావాలు ఏమైనా ఉంటే మీరు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
  2. చికిత్సలో ప్రస్తుత దశలో మీరు ఎలా ఉన్నారని వైద్యుడిని అడగండి?
  3. చికిత్సకు ప్రతిస్పందనను అంచనా వేయడానికి తదుపరి స్కాన్ ఎప్పుడు చేయబడుతుందని అడగండి?
  4. రేడియోథెరపీని పూర్తి చేస్తే, తదుపరి ఫాలో అప్ అపాయింట్‌మెంట్ గురించీ, ఆ కాలంలో ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడగండి.

కేన్సర్‌కు సర్జరీ జరిగిన తర్వాత నేను నా వైద్యుడిని చూస్తున్నాను, నేను ఏ ప్రశ్నలు అడగాలి?

  1. పాథాలజీ రిపోర్టు ఏం చూపిస్తుంది?
  2. మార్జిన్లు స్పష్టంగా ఉన్నాయా?
  3. పాథాలజీ రిపోర్టులో కేన్సర్ దశ ఏం చూపిస్తోంది?
  4. ఇప్పుడు అదనపు పరీక్షలు అవసరమా?
  5. కెమోథెరపీ లేదా రేడియోథెరపీ వంటి ఇంకేమైనా చికిత్సలు అవసరమా?
  6. నేను మామూలుగా నా పనుల్ని తిరిగి ఎప్పుడు చేసుకోవడం మొదలుపెడతాను?

నా డాక్టర్ నా కేన్సర్‌కు చికిత్సగా సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు. వారిని నేను ఏ ప్రశ్నలు అడగాలి?

  1. శస్త్రచికిత్స కేన్సర్‌కు నివారణ చికిత్సగా ఉందా?
  2. శస్త్రచికిత్సను ఏమని పిలుస్తారు?
  3. ఇది ఏ రకమైన శస్త్రచికిత్స? ఓపెన్, లాప్రోస్కోపిక్ లేదా రోబోటిక్ చికిత్సల్లో ఏ రకం?
  4. ఏ రకమైన అనస్థీషియాను ఉపయోగిస్తారు, ఆపరేషన్ ఎంతసేపు పడుతుంది?
  5. శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలు, నష్టాలు ఏమిటి?
  6. శస్త్రచికిత్స తర్వాత నేను ఎంతకాలం ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది?
  7. శస్త్రచికిత్స ఖర్చు ఎంత?

నా కేన్సర్‌కు మా డాక్టరు రేడియోథెరపీ చికిత్స చేయించుకోమని సలహా ఇచ్చారు. వారిని నేను ఏ ప్రశ్నలు అడగాలి?

  1. రేడియోథెరపీ ఈ కేన్సర్‌ ని తగ్గించే నివారణ చికిత్సగా ఉందా?
  2. చికిత్స ఎంతకాలం పడుతుంది?
  3. బ్రాకీథెరపీ వంటి వివిధ రకాల రేడియోథెరపీలను ఉపయోగించవచ్చా?
  4. ఏ ఎంపిక మంచిది మరియు ఎందుకు మంచిది?
  5. ఈ ఎంపికల మధ్య ఖర్చు తేడా ఎంత?
  6. ఈ చికిత్స వల్ల కలిగే అవకాశం ఉన్న దుష్ప్రభావాలు ఏమిటి?
  7. ఇది ఒక్కటే విడిగా ఇస్తారా లేదా కెమోథెరపీతో కలిపి ఇస్తారా?
  8. ఇది క్యురేటివ్ ట్రీట్మెంట్ (తగ్గించే చికిత్స) కాకపోతే, ఈ చికిత్స వల్ల ప్రయోజనం ఏమిటి?

మా డాక్టరు నా కేన్సర్‌కు చికిత్సగా కెమోథెరపీ, ఇమ్యునోథెరపీ లేదా బయోలాజికల్ థెరపీని సలహా ఇచ్చారు, వారిని నేను ఏ ప్రశ్నలు అడగాలి?

  1. కెమోథెరపీ రెజిమెన్ పేరు ఏమిటి?
  2. ఇది ఎంత తరచుగా ఇవ్వబడుతుంది?
  3. చికిత్స డే కేర్‌గా జరుగుతుందా లేదా నేను ఒక రాత్రి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉందా?
  4. చికిత్స మాత్రలు లేదా డ్రిప్స్ లేదా ఇంజెక్షన్ రూపంలో గానీ లేదా వాటి కాంబినేషన్ లో గానీ ఉంటుందా?
  5. ఊహించగలిగే దుష్ప్రభావాలు ఏమిటి?
  6. ఈ చికిత్స చేసేటప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
  7. నేను ఏ దుష్ప్రభావాలను అత్యవసరంగా రిపోర్టు చేయాలి?
  8. నాకు ఎన్ని కెమోథెరపీ కోర్సులు అవసరం?
  9. చికిత్స ఖర్చు ఎంత?