Radionuclide Therapy

రేడియోన్యూక్లైడ్‌ థెరపి

రేడియోన్యూక్లైడ్‌ థెరపి అనేది శరీరంలోకి ఎక్కించబడే లేదా మింగిన రేడియోధార్మిక పదార్థం. ఒకసారి ఇస్తే, పదార్థం క్యాన్సరు ఉన్న చోటుకు వెళుతుంది. అనంతరం ఏరియాలో క్యాన్సరు కణాలను ధ్వంసం చేసే లక్ష్యంతో ఇది స్థానికంగా రేడియేషన్‌ని విడుదల చేస్తుంది. ఇలాంటి థెరపిలకు ఉపయోగించే రేడియోన్యూక్లయిడ్స్‌ రేడియోఐసోటోప్స్‌, ఇవి అల్ఫా రేణువులు, బీటా రేణువులు లేదా గమ్మా రేడియేషన్‌ లాంటి విభిన్న రకాల రేడియేషన్‌ని విడుదల చేస్తాయి. ఈ రేణువులకు భిన్న గుణాలు ఉంటాయి, ఇవి చికిత్స పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

క్యాన్సరులో ఉపయోగించే అనేక రేడియోన్యూక్లయిడ్‌ థెరపీలు అనేకం ఉన్నాయి మరియు ఇవి ఇక్కడ క్లుప్తంగా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఎక్కువ తరచుగా ఉన్న కొత్త చికిత్సలతో విస్తరిస్తున్న రంగం ఇది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లకు ఉపయోగించే చికిత్స రకం. ఇది రేడియోథెరపి లేదా కీమోథెరపి లాంటి క్యాన్సర్లన్నిటికీ సాధారణ చికిత్స కాదు.

అయోడిన్‌ 131 (ఐ 131)

అయోడిన్‌ 131 అనేది థైరాయిడ్‌ క్యాన్సరుకు చికిత్స చేసేందుకు ఉపయోగించే అయోడిన్‌ యొక్క ఐసోటోప్‌. థైరాయిడ్‌ గ్రంథి మామూలుగా పనిచేయడానికి అయోడిన్‌ అవసరం మరియు అయోడిన్‌ గణనీయమైన మొత్తంలో అవసరమైన శరీరంలోని ఏకైక అవయవం. కాబట్టి, థైరాయిడ్‌ క్యాన్సరులో (పాపిల్లరీ లేదా ఫోలిక్యులర్‌), అయోడిన్‌ యొక్క రేడియేషన్‌ని విడుదల చేసే ఐసోటోప్‌ రోగి మింగే క్యాప్సుల్‌ రూపంలో ఇవ్వబడుతుంది. దీనిని క్యాన్సరు కణాలు తీసుకుంటాయి మరియు ఆ ఏరియాలో రేడియోఐసోటోప్‌ ఈ రేడియేషన్‌ని విడుదల చేసి, శరీరంలో ఉండే క్యాన్సరు కణాలను చంపుతుంది. థైరాయిడ్‌ గ్రంథికి సర్జరీ తరువాత ఈ చికిత్స చేయబడుతుంది. ఇది థైరాయిడ్‌ క్యాన్సరు కణాలు మరియు శరీరంలోని కొన్ని ఇతర మామూలు కణాలతో తీసుకోబడుతుంది కాబట్టి, చికిత్స యొక్క దుష్ప్రభావాలు స్వల్పంగా ఉంటాయి.

పెప్టైడ్‌ రిసెప్టార్‌ రేడియోన్యూక్లయిడ్‌ థెరపి (పిఆర్‌ఆర్‌టి)

న్యూరోఎండోక్రైన్‌ క్యాన్సర్ల చికిత్సలో ఈ రకమైన రేడియోన్యూక్లయిడ్‌ థెరపిని ఉపయోగిస్తారు. న్యూరోఎండోక్రైన్‌ క్యాన్సర్లకు వాటి కణాల్లో సొమాటోస్టాటిన్‌ రిసెప్టార్‌లు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో, రేడియోన్యూక్లయిడ్‌ సొమాటోస్టాటిన్‌ అనలాగ్‌తో సమ్మిళితం చేయబడుతుంది. క్యాన్సరు కణానికి ఔషధం ఎటాచ్‌ కావడానికి అనలాగ్‌ సహాయపడుతుంది మరియు క్యాన్సరు కణంపై రేడియేషన్‌ ప్రభావాన్ని రేడియోన్యూక్లయిడ్‌ ఉత్పత్తి చేస్తుంది. మామూలుగా ఉపయోగించే రేడియోన్యూక్లయిడ్‌లు ల్యుటేటియం ఎల్‌యు-177 డొటాటేట్‌ మరియు వైట్రియమ్‌-90 డొటాటోక్‌.

వైట్రియమ్‌ 90

వైట్రియమ్‌ 90 అనేది వైట్రియమ్‌ యొక్క ఐసోటోప్‌ మరియు కాలేయం కణితుల చికిత్సలో ఉపయోగించబడుతుంది. దీనిని ప్రాథమిక కాలేయం క్యాన్సరులో (హెపటోసెల్యులార్‌ కార్సినోమా) లేదా కాలేయానికి వ్యాపించిన ఇతర క్యాన్సర్లు గల రోగుల్లో దీనిని ఉపయోగించవచ్చు. కణితి సమీపంలో ఉన్న రక్త నాళాల్లోకి ఈ ఐసోటోప్‌ ఎక్కించబడుతుంది మరియు దీనిని నియంత్రించేందుకు కణితి సమీపంలో రేడియేషన్‌ని ఇస్తుంది.

ఇబ్రిటుమోమాబ్‌ టైయుక్సెటాన్‌ (జెవాలిన్‌) వైట్రియమ్‌ 90

ప్రారంభ చికిత్స తరువాత విడుదలైన లింఫోమాకు చికిత్స చేయడానికి ఈ ఔషధం ఉపయోగించబడుతుంది. ఇబ్రిటుమోమాబ్‌ అనేది యాంటీ సిడి 20 మోనోక్లోనల్‌ యాంటీబాడీ. ఇది లింఫోమాపై చర్య చూపిస్తుంది మరియు లింఫోమా కణాలకు ఎటాచ్‌ అవుతుంది. ఇది ఇంజెక్షన్‌గా ఇవ్వబడుతుంది మరియు లింఫోమా కణాలకు సమీపంలో వైట్రియమ్‌ 90 స్థానిక రేడియేషన్‌ని విడుదల చేస్తుంది.

అయోడిన్‌-131 ఎంఐబిజి

అయోడిన్‌ 131 మెటా-యిడోబెంజైల్‌ గునాడైన్‌ అనేది ఫెయోక్రోమోసైటోమా, పారాగంగ్లియోమా మరియు న్యూరోబ్లాస్టోమా లాంటి న్యూరోఎండోక్రైన్‌కి చికిత్స చేయడానికి ఉపయోగించే మాలిక్యూల్‌. ఎంఐబిజిని ఈ కణితులు తీసుకుంటాయి మరియు క్యాన్సరు కణాలకు రేడియేషన్‌ని ఐ131 విడుదల చేస్తుంది.

ప్రొస్టేట్‌ క్యాన్సరు

ప్రామాణిక చికిత్సలన్నిటినీ ఉపయోగించిన తరువాత స్టేజ్‌ 4 ప్రొస్టేట్‌ క్యాన్సర్లకు చికిత్స చేసేందుకు రేడియోన్యూక్లయిడ్‌ థెరపిని ఉపయోగించవచ్చు. ప్రొస్టేట్‌ క్యాన్సరు మామూలుగా ఎముకల్లోకి వ్యాపించి ఎముక నొప్పి కలిగిస్తుంది.

సమారియం-153 మరియు స్ట్రోంటియమ్‌-89 అనేవి రేడియోయాక్టివ్‌ ఐసోటోప్స్‌, క్యాన్సరును నియంత్రించేందుకు మరియు నొప్పిని మెరుగుపరచేందుకు సహాయపడటానికి వీటిని ఎముకల్లోకి తీసుకుంటారు. వీటి పాత్ర ప్రధానంగా లక్షణాలను నియంత్రించడమే.

రేడియమ్‌-223 అనేది రేడియమ్‌ యొక్క ఐసోటోప్‌, ఎముక మెటాస్టాసెస్‌తో ప్రొస్టేట్‌ క్యాన్సరు గల రోగుల్లో జీవించివుండటాన్ని పెంపొందించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని చూపించబడింది.

ల్యూటేటియమ్‌-177 అనేది ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ మెంబ్రేన్‌ యాంటీజెన్‌ అయిన పిఎస్‌ఎంఎతో సమ్మిళితమైన ల్యూటేటియమ్‌-177 రేడియోఐసోటోప్‌ని కలిగివున్న మాలిక్యూల్‌. ఈ రకమైన సమ్మేళనాన్ని రేడియోలిగండ్‌ థెరపిగా (ఆర్‌ఎల్‌టి) కూడా పిలుస్తారు. ప్రొస్టేట్‌ క్యాన్సరు కణాల ఉపరితలంపై పిఎస్‌ఎంఎ ఉంటుంది మరియు చికిత్సను రేడియోఐసోటోప్‌స్థానికంగా డెలివర్‌ చేయడానికి సహాయపడుతుంది.

రేడియోన్యూక్లైడ్‌ థెరపి యొక్క దుష్ప్రభావాలు

రేడియోన్యూక్లైడ్‌ థెరపితో చికిత్స దుష్ప్రభావాలతో ముడిపడివుండొచ్చు మరియు ఇవి క్యాన్సరుకు మరియు ఉపయోగించిన చికిత్స రకానికి నిర్దిష్టమైనవి. సాధారణంగా, దుష్ప్రభావాలు స్వల్పంగా ఉంటాయి మరియు గంభీరమైన దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. చికిత్స చేస్తున్న డాక్టరు చికిత్స యొక్క సంభావ్య దుష్ప్రభావాలను వివరిస్తారు.

ముందుజాగ్రత్తలు

ఈ ఔషధాలు రేడియోయాక్టివ్‌ పదార్థాలు కాబట్టి, రేడియేషన్‌ ఇతరులకు సోకడాన్ని నిరోధించేందుకు రోగులు మరియు సిబ్బంది ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవలసి ఉంటుంది. చికిత్స తరువాత రోగిని వేరుచేయడం దీనిలో ఉంటుంది మరియు ఇది చికిత్స మరియు ఉపయోగించిన మోతాదుపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది రోగులకు, ఇంటికి వెళ్ళడానికి ముందు చికిత్స తరువాత కొద్ది రోజుల పాటు రోగి ఆసుపత్రిలో ఉండవలసి రావచ్చు.