Survival and Prognosis in Cancer

కేన్సర్ లో మనుగడ, రోగ నిర్ధారణ

కేన్సర్ ఉందని నిర్ధారించబడినపుడు, “నేను ఎంతకాలం జీవిస్తాను”? అనేదే మనస్సులో వచ్చే మొదటి ప్రశ్న. కేన్సర్ నయం చేయడానికి సాధ్యమవుతుందా లేదా అనే విషయాన్ని కేన్సర్ దశను బట్టి కాదా అని డాక్టర్ చెప్పగలుగుతారు.

కేన్సర్ ని నయం చేయడానికి కుదురుతుందా?

నయం చేయగల కేన్సర్ అంటే కేన్సర్‌ మళ్లీ తిరిగి రాకుండా పూర్తిగా నివారించగల చికిత్స. నయం చేయగలిగే కేన్సర్ అయితే, డాక్టర్ చాలా సందర్భాల్లో నయం చేయడానికి సుమారు శాతం అవకాశం ఇవ్వగలరు.

కేన్సర్ నయం కాకపోతే?

కేన్సర్ నయం చేయగలిగేది కాకపోయినా, అప్పటికీ చికిత్సా ఎంపికలు అందుబాటులో ఉంటాయి. అయితే కేన్సర్ కలిగించే ఏవైనా లక్షణాలను నియంత్రించడం, జీవితాన్ని పొడిగించడం వీటి లక్ష్యాలుగా ఉంటాయి.

మనుగడ మరియు రోగ నిరూపణ గురించి మాట్లాడేటప్పుడు అంకాలజిస్ట్ ఎలాంటి సంఖ్యలు చెప్తారు?

సాధారణంగా అంకాలజిస్టులు ఎంతమందికి నయమైందీ, ఎంత మంది జీవించి ఉన్నారూ అనే చికిత్స ప్రయోజనాల గురించి ఇచ్చే గణాంకాల గురించి తెలియజేస్తారు. వాటిల్లో కొన్ని సాధారణమైనవి ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

ప్రతిస్పందన రేటు

ప్రజలు చికిత్సకు స్పందించే రేటు ఇది. ఉదాహరణకు, ప్రతిస్పందన రేటు 40% అంటే, ఆ చికిత్స తీసుకున్న 40% మంది రోగుల్లో కేన్సర్ స్థిరంగా ఉందనీ లేదా మెరుగుపడుతుందనీ అర్థం.

ప్రోగ్రషన్ ఫ్రీ సర్వైవల్

చికిత్స తర్వాత కేన్సర్ మళ్లీ పెరగడానికి ముందు రోగి ఎంతసేపు బాగున్నారో ఇందులో డాక్టర్ చెప్పగలరు. ఉదాహరణకు, స్టేజ్ 4 కేన్సర్ ఉన్న రోగిలో ఒక నిర్దిష్ట కెమోథెరపీ మందు ప్రోగ్రషన్ ఫ్రీ సర్వైవల్ 6 నెలలు అయితే, చికిత్స తర్వాత 6 నెలల వరకు కేన్సర్ మళ్లీ పెరగదనీ, అంతవరకు రోగి బాగానే ఉంటారనీ అర్థం.

మీడియన్ సర్వైవల్

ఇది సాధారణంగా 4 వ దశ కేన్సర్ రోగుల్లో అంకాలజిస్టులు రోగులకు చెప్పే సంఖ్య. ఉదాహరణకి, రోగికి సగటు మనుగడ 11 నెలలు అయితే, 50% మంది రోగులు ఆ సమయం వరకు గానీ, అంత కంటే ఎక్కువ కాలం గానీ జీవించగలరని భావించబడుతున్నట్టు అర్థం. మీడియన్ సర్వైవల్ సంఖ్య అలాంటి రోగుల సగటు, అది రఫ్ గైడ్ అని అర్థం చేసుకోవాలి. ఇది సగటున, ఈ ఉదాహరణలో కొంతమంది మనుగడ 11 నెలల కన్నా తక్కువగానూ, మరి కొంతమంది మనుగడ 11 నెలల కన్నా ఎక్కువ ఉంటుంది.

5 సంవత్సరాల మనుగడ

చాలా కేన్సర్లు చికిత్స తర్వాత 5 సంవత్సరాల్లో మళ్లీ వస్తాయి. అందువల్ల కేన్సర్ రోగుల దీర్ఘకాలిక మనుగడ గురించి రోగులకు తెలియజేయడానికి 5 సంవత్సరాల జీవిత కాల గణాంకాలను మార్గదర్శకంగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు 10 సంవత్సరాల జీవిత కాల గణాంకాలు కూడా ఉపయోగించబడతాయి.

డాక్టర్ చెప్పిన సర్వైవల్ ఫిగర్ రోగి వాస్తవమైన ఆయుర్దాయంతో సరిపోలలేదా?

కేన్సర్‌తో రోగి ఎన్నాళ్లు జీవించి ఉంటారనే విషయంలో వైద్యులు ఎన్నడూ ఖచ్చితమైన అంచనా ఇవ్వలేరు. కోట్ చేసిన గణాంకాలు చాలావరకు ఒక నిర్దిష్ట కేన్సర్ ఉన్న రోగుల సమూహానికి వర్తించే సగటు గణాంకాలే తప్ప ఏదో ఒక రోగికి సంబంధించినవి కాదు. ప్రతి రోగి మనుగడా అతడికి వచ్చిన కేన్సర్ రకంపైనా, చికిత్సకి ప్రతిస్పందన, ఇంకా ఇతర అంశాలపైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ గణాంకాలను గైడ్‌గా మాత్రమే ఉపయోగించాలి తప్ప అవే ఖచ్చితమైన వాస్తవాలుగా తీసుకోకూడదు.