Why do you need to know about Cancer?

క్యాన్సరు గురించి మీరు ఎందుకు తెలుసుకోవలసి ఉంటుంది?

క్యాన్సరు 21వ శతాబ్దపు వ్యాధి. ఇటీవలి ‘గ్లోబోకన్‌2018’ డేటా ప్రకారం, 2018లో దాదాపు 1 కోటి ఎనభై లక్షల మంది కొత్త రోగులకు క్యాన్సరు ఉంది. ఈ కొత్త క్యాన్సరు నిర్థారణల్లో దాదాపు 50% ఆసియాలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20% మంది పురుషులు మరియు 16% మంది మహిళలకు జీవిత కాలంలో క్యాన్సరు కలుగుతుందని అంచనా. పాశ్చాత్య ప్రపంచంలో, క్యాన్సరు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంచనా.

క్యాన్సరు రేట్లు పాశ్చాత్య ప్రపంచంలో కంటే భారతదేశంలో తక్కువగా ఉంటున్నాయి. సంవత్సరానికి 11 లక్షల కొత్త క్యాన్సర్లు ఉంటున్నాయని తాజా డేటా చూపించింది. కానీ జనాభా జీవిత ఆయుర్దానం పెరగడం మరియు దేశంలో మారుతున్న సామాజిక- ఆర్థిక పరిస్థితుల వల్ల వీటి సంఖ్య నిలకడగా పెరుగుతోంది.

అన్నిటికీ మించి, మన జీవిత కాలంలో మనకు క్యాన్సరు కలిగే అవకాశం ఏయేటికాయేడు పెరుగుతోంది కాబట్టి, ఇది ఏమిటి, మనకు ఇది ఎలా వస్తుంది, మనం దీనిని ఎలా నిరోధించవచ్చు, మనం దీనిని త్వరగా ఎలా కనిపెట్టవచ్చు అనే విషయాల పరంగా వ్యాధి గురించి మరింతగా తెలుసుకోవడం ముఖ్యం, ఇది మనకు సోకితే ఎలా నయం చేయవచ్చో మరియు చికిత్స చేయవచ్చో మనకు తెలుస్తుంది.

క్యాన్సరు నిలకడగా పెరుగుతున్నందువల్ల, దాని గురించి మనం ఏం చేయాలి? మనం మామూలుగా కొనసాగాలా మరియు దీనిని కనిపెట్టినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవాలా లేదా భవిష్యత్తులో మనకు కలిగే అవకాశాలను తగ్గించేందుకు వ్యాధి గురించి మరింతగా తెలుసుకోవడానికి మనం అవసరమైన చర్యలు తీసుకోవాలా? ఉదాహరణకు, వరద లేదా తుపాను మన వైపు దూసుకొస్తుందని ఊహించుకుందాం. మనం ఏం చేయాలి? మనల్ని మరియు మన కుటుంబాలను కాపాడుకునేందుకు మనం అవసరమైన ముందుజాగ్రత్తలన్నిటినీ తీసుకుంటాము. ప్రభుత్వ మరియు సంబంధిత ఏజెన్సీలన్నీ రంగంలోకి దిగి ప్రాణాలను కాపాడేందుకు మరియు డేమేజ్‌ని నిరోధించేందుకు చర్యలన్నిటినీ తీసుకుంటాయి. క్యాన్సరు పట్ల మనకు ఇలాంటి దృక్పథం ఉండాలి.

క్యాన్సరు ఉన్నట్లుగా రోగనిర్థారణ చేయించుకోవడం మరియు దీని పర్యవసానాలను ఎదుర్కోవడం రోగికి మరియు కుటుంబానికి వ్యక్తిగత, సామాజిక, భావోద్వేగ మరియు ఆర్థిక స్థాయిల్లో భయపడే అనుభవం కల్పించవచ్చు. దీనిని నిరోధించేందుకు లేదా ముందుగానే నిర్థారించేందుకు చర్యలు తీసుకోవడం ఆ ప్రభావాలను తగ్గించవచ్చు లేదా పరిమితం చేయవచ్చు.

గుండె జబ్బు, డయాబెటీస్‌ తదితర అపాయాన్ని నిరోధించేందుకు మనం చేసిన విధంగానే ఆరోగ్యకరమైన జీవితం జీవించడం ద్వారా అనేక క్యాన్సర్లను నిరోధించవచ్చు. ఈ జబ్బుల్లో వేటినైనా పొందేందుకు నష్టాంశాలు ఎక్స్‌టెంట్‌ మాదిరిగా ఉంటాయనే విషయం తెలుసుకోవడం ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. మీకు క్యాన్సరు కలిగే ప్రమాదాన్ని ఎలా తగ్గించాలనే విషయం గురించి మరింత సమాచారం పొందడానికి క్యాన్సరును నిరోధించడంపై సెక్షన్‌ని చూడండి.

జబ్బు ప్రారంభ దశలో ఉన్నప్పుడు కనిపెడితే దాదాపుగా అన్ని క్యాన్సర్లు నయంచేయదగినవి. ప్రారంభ క్యాన్సర్లు లక్షణాలు కలిగించకపోవచ్చు కాబట్టి అనేక సార్లుది కష్టంగా ఉండొచ్చు, కానీ కొన్ని క్యాన్సర్లను ముందుగానే కనిపెట్టడానికి క్యాన్సరు స్క్రీనింగ్‌ పరీక్షలు లభిస్తాయి. ముందుగా కనిపెట్టడానికి లభించే స్క్రీనింగ్‌ పరీక్షలు ఏమిటో కనుగొనేందుకు క్యాన్సరు స్క్రీనింగ్‌పై సెక్షన్‌ని చూడండి.

క్యాన్సరును ఎలా నిర్థారణ చేస్తారు, స్థితి గురించి తెలుసుకునేదుకు ఏ పరీక్షలు చేయబడతాయి మరియు ఏ చికిత్స ఎంపికలు లభిస్తాయనే విషయం గురించి మరింతగా తెలుసుకోవడం రోగికి మరియు అతని/ఆమె కుటుంబానికి చాలా ముఖ్యం. ఏదైనా క్యాన్సరు చికిత్స విషయమై నిర్ణయం తీసుకునే ప్రక్రియలో రోగి క్రియాశీల పాత్ర పోషించాలి. దీనిని షేర్‌డ్‌ నిర్ణయం తీసుకోవడం అని అంటారు. తదుపరి చర్య గురించిన నిర్ణయం రోగి, కుటుంబం మరియు డాక్టరుతో ఉమ్మడిగా తీసుకోవాలి మరియు ఇలాంటి చికిత్సల ప్రయోజనాలు మరియు అపాయాలను రోగి మరియు కుటుంబం సంపూర్ణంగా తెలుసుకోవాలి. క్యాన్సరు చికిత్సల్లో అనేక సార్లు ఒకటి కంటే ఎక్కువ చికిత్స ఎంపికలు లభిస్తాయి కాబట్టి మరియు దేనిని ఎంచుకోవాలనే విషయం చికిత్స ఫలితం, దుష్ప్రభావాలు, వ్యవధి, వ్యక్తిగత అంశాలు తదితర అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ కాన్‌సెప్ట్‌ చాలా ముఖ్యం. అందువల్ల, చర్యను నిర్ణయించుకేటప్పుడు అవగాహనపూర్వక ఎంపిక చేసుకోవలసిందిగా ఎల్లప్పుడూ సిఫారసు చేయబడుతోంది, ఎందుకంటే ఒక ఎంపిక ప్రతి ఒక్కరికీ సరిపడకపోవచ్చు.

చివరగా నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఈ వ్యాధి గురించి కొద్దిగా పరిజ్ఞానం కలిగివుండటం మనందరికీ ముఖ్యం మరియు క్యాన్సరు గురించి మీకు అవసరమైన సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌ ఇస్తుందని మేము ఆశిస్తున్నాము.