Acute Myeloid Leukaemia

ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియా (ఎఎంఎల్)

ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియా అనేది రక్త కణాల క్యాన్సరు. రక్త నాళాలు అనేవి ఎముక మూలుగలో మరియు రక్త ప్రవాహంలో ఉండే కణాలు, ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి ప్రజలను కాపాడతాయి మరియు తెల్ల రక్త కణాలతో శరీరానికి రోగనిరోధక శక్తి ఇస్తుంది, ఎర్ర రక్త కణాలతో శరీరం యొక్క భాగాలన్నిటికీ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజెన్ని రవాణా చేస్తుంది మరియు ప్లెట్లెట్లతో రక్తం గడ్డకట్టడానకి సహాయపడుతుంది. ఎముక మూలుగలోని స్టెమ్ సెల్తో ఈ రక్త కణాలన్నీ ప్రారంభమవుతాయి. స్టెమ్ సెల్ మైలోయిడ్ స్టెమ్ సెల్ మరియు లింఫోయిడ్ స్టెమ్ సెల్లోకి విభజించబడుతుంది. మైలోయిడ్ స్టెమ్ సెల్ అనంతరం మైలోయిడ్ బ్లాస్ట్ సెల్లోకి విభజించబడుతుంది, ఇది అనంతరం న్యూట్రోఫిల్స్ మరియు మోనోసైట్స్లోకి విభజించబడుతుంది. మైలోయిడ్ స్టెమ్ సెల్ ఎర్ర రక్త కణాలను మరియు ప్లెట్లెట్స్ని పెంచుతుంది. ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియా అనేది మైలోయిడ్ స్టెమ్ సెల్ క్యాన్సరు. ఎఎంఎల్లో, బ్లాస్ట్ కణాల, అపరిపక్వ న్యూట్రోఫిల్స్ మరియు మోనోసైట్స్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.

క్యాన్సరు పెరిగిపోయి ఎముక మూలుగ లోని అత్యధిక స్థలాన్ని ఆక్రమించుకుంటుంది కాబట్టి, ఇతర తెల్ల రక్త కణాలు, ప్లెట్లెట్లు, ఎర్ర రక్త కణాలు తదితర లాంటి శరీరంలోని ఇతర రక్త కణాల ఉత్పత్తిని ఇది నిరోధిస్తుంది. ఇది క్యాన్సరు లక్షణాల ఉత్పత్తికి దారితీస్తుంది. క్యాన్సరు లింఫ్ నోడ్స్, ప్లీహం లేదా నరాల వ్యవస్థ లాంటి శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించవచ్చు.

నెమ్మదిగా అభివృద్ధి చెందుతుండే క్రానిక్ మైలోయిడ్ ల్యూకేమియా మాదిరిగా కాకుండా, రోజులు లేదా వారాల్లో రోగిలో ఎఎంఎల్ త్వరగా పెరుగుతుంది.

ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియా పిల్లల్లో మరియు వయోజనుల్లో ఉండొచ్చు, కానీ వయోజనుల్లో ఎక్కువ సామాన్యంగా ఉంటుంది, ప్రత్యేకించి 40% ఎఎంఎల్ 75 సంవత్సరాలకు పైగా వయస్సు గల రోగుల్లో కలుగుతుంది.

ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియా అభివృద్ధిలో ముడిపడివున్న నష్టాంశాలు ఈ కింద ఇవ్వబడ్డాయి. ఈ నష్టాంశాలు ఉండటం ఎఎంఎల్ని పొందే ప్రమాదాన్ని పెంచుతుంది.

వయస్సు

వృద్ధాప్య వయస్సు ఎఎంఎల్కి నష్టాంశం. దాదాపు 4% ఎఎంఎల్ 75 సంవత్సరాల వయస్సు మించిన రోగుల్లో కలుగుతుంది.

జన్యుపరమైన స్థితులు

ఈ కింది జన్యుపరమైన స్థితులతో ముడిపడివున్న ప్రజలకు ల్యూకేమియా కలిగే అపాయం పెరుగుతుంది.

  • డౌన్స్ సిండ్రోమ్
  • లై- ఫ్రావుమెని సిండ్రోమ్
  • బ్లూమ్ సిండ్రోమ్
  • అటాక్సియా తెలంగిఎక్టాసియా
  • న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1
  • విస్కోట్- అల్డ్రిచ్ సిండ్రోమ్

రేడియేషన్

గతంలో ఎక్కువ స్థాయిల్లో రేడియేషన్కి గురైన ప్రజలకు ఎక్యూట్ ల్యూకేమియా కలిగే ప్రమాదం ఉంటుంది. ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా కంటే ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియా కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇతర క్యాన్సరు లేదా స్థితికి పూర్వ రేడియోథెరపి వల్ల ల్యూకేమియా కలిగే ప్రమాదం ఉంటుంది.

పూర్వ కీమోథెరపి

పూర్వ కీమోథెరపి గల పిల్లలకు చికిత్స తరువాత కొన్ని సంవత్సరాలకు ల్యూకేమియా ప్రమాదం పెరుగుతుంది. ఎఎల్ఎల్ కంటే ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియాకి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ధూమపానం

ఎఎంఎల్ కలగడానికి ధూమపానం గణనీయమైన నష్టాంశం. పొగాకులో ఉన్న బెంజీన్ ఈ ప్రమాదాన్ని పెంచుతుంది.

బెంజీన్కి గురవ్వుట

పెట్రోలియంలో మరియు రసాయనిక పరిశ్రమలో పనిచేస్తూ బెంజీన్కి గురయ్యే ప్రజలు దీనిని పీల్చినప్పుడు ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియా కలిగే ప్రమాదానికి నష్టాంశంగా ఉంటుంది.

రక్తం రుగ్మతలు లేదా స్థితులు

పాలిసైథేమియా వెరా, మైలోడైస్ప్లాస్టిక్ సిండ్రోమ్, మైలోఫైబ్రోసిస్ మరియు క్రానిక్ మైలోయిడ్ ల్యూకేమియా లాంటి రక్తం రుగ్మతలు ఎఎంఎల్ కలిగే అవకాశం కలిగించవచ్చు

అధిక బరువు మరియు ఊబకాయం

అధిక బరువు లేదా ఊబకాయంతో ఉండటం ఎఎంఎల్ కలిగే అపాయాన్ని కొద్దిగా పెంచుతుంది.

రక్తం, ఎముక మూలుగ, లింఫ్ నోడ్స్, కాలేయం, ప్లీహం మరియు శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపడం వల్ల ఎఎంఎల్ అనేక లక్షణాలు కలిగించవచ్చు. దీనితో ముడిపడివున్న మామూలు లక్షణాలు ఈ కింద ఇవ్వబడ్డాయి. ఈ లక్షణాలు ఇతర కారణాలతో కలగవచ్చని మరియు ఈ లక్షణాలు గల అత్యధిక మంది రోగులకు ల్యూకేమియా ఉండొచ్చునని గమనించడం ముఖ్యం.

నీరసం మరియు అలసట

ఇది ఈ స్థితి గల రోగుల్లో ఉండే మామూలు లక్షణం. ఇది రక్తహీనత వల్ల అయివుండొచ్చు ఎందుకంటే ఈ స్థితి వల్ల తగినన్ని ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయబడవు కాబట్టి. ఇంతకుముందు చేయగలిగిన చిన్న పనులు చేసేటప్పుడు రోగికి అలసటగా అనిపిస్తుంది.

శ్వాసతీసుకోలేకపోవడం

శ్వాసతీసుకోలేకపోవడం కూడా రక్తహీనత యొక్క లక్షణం, ఎందుకంటే కణజాలాలకు ఆక్సిజెన్ని తీసుకెళ్ళడానికి ఎర్ర రక్త కణాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇంతే మొత్తంలో పనిచేయడానికి శ్వాస తీసుకోవడానికి రోగి మరింతగా శ్రమించవలసిన అవసరం ఉంటుంది.

జ్వరం

జ్వరం ఎఎంఎల్ యొక్క మామూలు లక్షణం.

పదేపదే ఇన్ఫెక్షన్లు

ఎఎంఎల్ ఉన్న రోగులకు రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల పదేపదే ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. దీనికి కారణం మామూలు తెల్ల రక్త కణాల ఉత్పత్తి తగ్గడం మరియు ఉత్పత్తి అయిన తెల్ల రక్త కణాల పనితనం తగ్గడమే. ఇన్ఫెక్షన్లపై పోరాడ గల శరీరం యొక్క సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి రోగులు ఇన్ఫెక్షన్లు అనుభవించవచ్చు.

రక్తస్రావం మరియు కమలడం

ఎముక మూలుగలో ప్లెట్లెట్ ఉత్పత్తి తగ్గడం వల్ల మరియు శరీరంలో ప్లెట్లెట్ల విధ్వంసం పెరగడం వల్ల ఎఎంఎల్ గల రోగుల్లో ప్లెట్లెట్ల సంఖ్య తగ్గవచ్చు. రక్తం గడ్డకట్టడానికి సహాయపడటం ప్లెట్లెట్ విధి కాబట్టి, ఈ కణాలు తగ్గడం వల్ల రక్తస్రావం సంఘటనలు పెరగవచ్చు. మలం లేదా మూత్ర విసర్జన సమయంలో చిగుళ్ళు, ముక్కుతో సహా శరీరంలో ఎక్కడి నుంచైనా రక్తస్రావం కలగవచ్చు. చర్మంపై కమిలిన గాయం కనిపించవచ్చు.

లింఫ్ నోడ్ పెరగడం

మెడ, బాహుమూలలో, ఛాతీ, పొత్తికడుపు, పెల్విస్ మరియు గజ్జలతో సహా శరీరంలోని భాగాలన్నిటిలో లింఫ్ నోడ్లు ఉంటాయి. ఈ లింఫ్ నోడ్లు పెరగడం, ఎఎంఎల్ లక్షణం అయివుండొచ్చు మరియు ఇది ఈ ప్రాంతాల్లో వాపు కలగడానికి దారితీస్తుంది. ఛాతీలో నోడ్స్ పెరగడం దగ్గు మరియు శ్వాస తీసుకోలేకపోవడానికి దారితీయొచ్చు.

పొత్తికడుపు వాపు మరియు నిండుట

ఎఎల్ఎల్ గల కొంతమంది రోగులకు కాలేయం మరియు ప్లీహం లాంటి అవయవాలు పెరగడం ఉంటుంది. ఉభయ అవయవాలు పొత్తికడుపులో ఉంటాయి, ఇలా పెరగడం పొత్తికడుపులో నిండుగా ఉందని అనిపించడం లేదా గ్యాస్పోవడం, నొప్పిగా లేదా ఊపిరాడనట్లుగా ఉండటానికి దారితీస్తుంది.

ఎఎంఎల్ని అనుమానించినప్పుడు, రోగనిర్థారణలో సహాయపడటానికి మరియు చికిత్స ఎంపికలను నిర్ణయించడానికి ఈ కింది పరీక్షలు చేయబడతాయి. డాక్టరు బాగా పరీక్షించిన తరువాత వీటిని చేస్తారు.

రక్త పరీక్షలు

సంపూర్ణ రక్త కౌంట్ లేదా పూర్తి బ్లడ్ పిక్చర్ లాంటి నిత్యపరిపాటి రక్త పరీక్షలు ఎర్ర రక్త కణాల, తెల్ల రక్త కణాల మరియు రక్తంలో ప్లెట్ల సంఖ్య గురించిన సమాచారం ఇస్తాయి. రక్తంలో ల్యూకేమియా కణాలు ఉంటే అవి ఉన్నాయనే విషయం కూడా ఇది సూచించవచ్చు. ఇతర రక్త పరీక్షల్లో మూత్రపిండం పనితనం మరియు కాలేయం పనితనం పరీక్షలు, రక్తస్రావం మరియు రక్తం యొక్క క్లాటింగ్ ప్రొఫైల్, లాక్టేట్ డీహైడ్రోజెనేస్ (ఎల్డిహెచ్) మరియు యూరిక్ యాసిడ్ ఉంటాయి.

ఫ్లో సైటోమెట్రీ

భౌతిక మరియు రసాయనిక గుణాలపై ఆధారపడి రక్త కణాలు మరింతగా చిత్రీకరించబడే ప్రక్రియ ఇది. ఫ్లో సైటోమీటర్ అనేది లేజర్ని ఉపయోగించి రక్తం శాంపిల్ని విశ్లేషించే మెషీన్. కణాలను కనిపెట్టేందుకు ఇది యాంటీబాడీలు మరియు ఫ్లోరెసెన్స్ని ఉపయోగిస్తుంది. కణాలు ఉత్పత్తిచేసే భిన్న ఫోరెసెన్స్తో కణాలకు పేరుపెట్టబడుతుంది లేదా వేరుచేయబడుతుంది. కంప్యూటర్ దీనిని తీసుకొని విశ్లేషిస్తుంది. ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియాను నిర్థారణ చేయడానికి మరియు విభిన్న రకాల ఎఎల్ఎల్ని ఉపరకం చేయడానికి ఇది సహాయపడుతుంది. ఫ్లో సైటోమెట్రీ అనేది ప్రామాణిక మైక్రోస్కోపి కంటే ఎక్కువ సున్నితమైన పరీక్ష మరియు ఎఎంఎల్ని నిర్థారణ చేయడానికి మరియు ప్రారంభ చికిత్స తరువాత తిరిగికలగడాన్ని కనిపెట్టేందుకు ఉపయోగించబడుతుంది.

ఎముక మూలుగ పరీక్ష

క్యాన్సరు కణాలను (ఎఎల్ఎల్) మరియు ఎముక మూలుగలోని ఇతర అసాధారణతలను చూసేందుకు ఎముక నుంచి మూలుగ శాంపిల్ని తీసుకోవడం ఎముక మూలుగ పరీక్షలో ఉంటుంది. రక్తం మరియు లింఫటిక్ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లలో ఈ పరీక్ష మామూలుగా చేయబడుతుంది. పెల్విస్ లేదా స్టెర్నమ్లోని ఎముకల నుంచి మూలుగ తీసుకోబడుతుంది. ప్రక్రియకు ముందు అసౌకర్యాన్ని తగ్గించేందుకు స్థానిక మత్తుమందు ఔషధం ఇవ్వబడుతుంది. అవుట్పేషెంట్ ప్రాతిపదికన పరీక్ష చేయబడుతుంది మరియు పరీక్ష చేసిన తరువాత రోగి ఇంటికి వెళ్ళవచ్చు. రెండు రకాల పరీక్షలు చేయబడతాయి. ఒకటి ఎముక మూలుగ ఆస్పిరేషన్, దీనిలో మూలుగ నుంచి ఒక ద్రవం శాంపిల్ తీసుకోబడుతుంది మరియు రెండవది ట్రెఫైన్ బయాప్సీ, దీనిలో చిన్న ఎముక ముక్క కూడా తీసుకోబడుతుంది. రిపోర్టు కొద్ది రోజుల్లో లభిస్తుంది.

సైటోజెనెటిక్స్

ఎముక మూలుగ బయాప్సీ నుంచి తీసుకున్న శాంపిల్స్ని కణాల్లో జన్యుపరమైన మెటీరియల్లో మార్పుల కోసం కూడా పరీక్షించడం జరుగుతుంది, ఎఎల్ఎల్ యొక్క ఉపరకాన్ని నిర్థారణ చేయడానికి ఇవి సహాయపడతాయి మరియు చికిత్స తరువాత స్థితి యొక్క సంభావ్య ఫలితాల గురించి తెలియజేస్తాయి.

ఇమ్యునోఫెనో టైపింగ్ మరియు ఇమ్యునో హిస్టో కెమిస్ట్రీ

ఎఎంఎల్ యొక్క కణాలను కచ్చితంగా కనుగొనేందుకు మరియు టైప్ చేసేందుకు యాంటీజెన్ మరియు యాంటీబాడీ ప్రతిచర్యలను ఉపయోగించి కణాల్లోని ప్రొటీన్లను ఈ పరీక్షలు చూస్తాయి. కణాలపై యాంటీజెన్స్ని కనిపెట్టేందుకు ఉపయోగించే యాంటీబాడీలు ఫ్లోరెసెంట్, కణాలను చూసేందుకు పరీక్షకునికి ఇది వీలు కల్పిస్తుంది.

ఫిష్ మరియు పిసిఆర్

డిఎన్ఎ ప్రోబ్లను ఉపయోగించి జన్యుపరమైన మార్పులను చూడటం ద్వారా ల్యూకేమియాను నిర్థారణ చేసేందుకు ఈ పరీక్షలు ఉపయోగించబడతాయి.

లంబార్ పంక్చర్

ల్యూకేమియా కణాలను ఉన్నాయేమో చూసేందుకు వెన్నెముక చుట్టూ గల ఏరియాలో ఉన్న ఫ్లూయిడ్ శాంపిల్ని తీసుకునేందుకు వెన్నెముకలోకి సూది గుచ్చే పరీక్ష ఇది. రోగి వయస్సును బట్టి స్థానిక లేదా సాధారణ మత్తుమందు ఇచ్చి చేయబడే పరీక్ష ఇది.

సిటి స్కాన్

లింఫ్ నోడ్లు లేదా కాలేయం మరియు ప్లీహం లాంటి అవయవాలు పెరిగాయేమో చూసేందుకు ఎఎల్ఎల్ గల రోగుల్లో సిటి స్కాన్ తీయబడుతుంది. మెడ, ఛాతీ, పొత్తికడుపు మరియు పెల్విస్ ఏరియాలను కవర్ చేయడం స్కాన్ లక్ష్యం.

ఎంఆర్ఐ స్కాన్

క్యాన్సరు మెదడుకు విస్తరించిందేమోననే అనుమానం ఉంటే ఎంఆర్ఐ స్కాన్ పరిగణించబడుతుంది. ఈ సెట్టింగులో, సిటి స్కాన్ కంటే ఎంఆర్ఐ మెరుగ్గా ఉంటుంది.

యుఎస్ స్కాన్

సిటి స్కాన్ పరిగణించకపోతే కాలేయం లేదా ప్లీహం పెరిగిందేమో చూసేందుకు పొత్తికడుపుకు అల్ట్రాసౌండ్ స్కాన్ తీయబడుతుంది.

ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియాకు చేసే చికిత్స రోగనిర్థారణ సమయంలో క్యాన్సరు వయస్సు, రోగి ఫిట్నెస్, వ్యాధి ఏ మేరకు విస్తరించింది మరియు ఎఎల్ఎల్ యొక్క ఉప రకంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చికిత్సను దశల్లోకి విభజించవచ్చు, ఇవి ఏమిటంటే ఇండక్షన్ దశ, కన్సాలిడేషన్ దశ మరియు నిర్వహణ దశ.
ఈ మూడు దశల్లో ఉపయోగించే ప్రధాన రకం చికిత్స కీమోథెరపి, దీనిలో సిర ద్వారా ఔషధాలను ఇవ్వడం ఉంటుంది. నరాల వ్యవస్థలో గల వ్యాధికి చికిత్స చేసేందుకు లేదా వ్యాధి తిరగబెట్టడాన్ని నిరోధించేందుకు వెన్నెముకలోకి కూడా కీమోథెరపి ఇవ్వబడుతుంది. ఉపయోగించే ఇతర చికిత్సల రూపాల్లో లక్షిత లేదా బయోలాజికల్ థెరపి, రేడియోథెరపి మరియు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నాయి. ఇవి ఈ కింద చర్చించబడ్డాయి.

కీమోథెరపి

ఇండక్షన్ దశ

రెమిషన్ ఇండక్షన్ దశగా కూడా పిలవబడే కీమోథెరపి యొక్క ఇండక్షన్ దశలో వ్యాధి నుంచి పూర్తి ఉపశమనం సాధించడం లక్ష్యంగా ఔషధాల సమ్మేళనం ఉపయోగించడం ఉంటుంది, ఇక్కడ రక్తం లేదా ఎముక మూలుగలో మిగిలిన ఎఎల్ఎల్ కణాలు ఉండవు. ఇన్పేషెంట్ ప్రాతిపదికన చికిత్స ఇవ్వబడుతుంది మరియు రక్తం కౌంట్లు మరియు చికిత్స యొక్క దుష్ప్రభావాలను పర్యవేక్షించేందుకు కొంత సమయం, సాధారణంగా వారాల పాటు రోగి ఆసుపత్రిలో ఉంటారు. ఇండక్షన్ దశకు కీమోథెరపిగా మామూలుగా ఉపయోగించే ఔషధాల్లో ఉండేవి
మైటోక్సాన్ట్రోన్ లేదా డౌనోరుబిసిన్ లేదా ఇడారుబిసిన్తో పాటు సైటరాబైన్. వీటిని ‘‘7+3’’ చికిత్సలు అని అంటారు, ఇక్కడ సైటరాబైన్ని రోజూ 7 రోజుల పాటు మరియు ఆ తరువాత ఇర ఔషధాల్లో ఒకదానిని 3 రోజుల పాటు ఇస్తారు.
ఎఫ్ఎల్టి3, ఐడిహెచ్1 మరియు ఐడిహెచ్2 మ్యుటేషన్ల లాంటి కొన్ని రకాల ఎఎంఎల్లు కూడా వరుసగా మిడోస్రౌనిన్, ఇవోసిడెనిబ్ లేదా ఇనాసిడెనిబ్ లాంటి లక్షిత ఔషధాల నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు.
చికిత్స సాధారణంగా చాలా ఉధృతంగా ఉంటుంది మరియు సంభావ్య దుష్ప్రభావాల్లో అలసట, వికారం, వాంతులు, మలబద్ధకం, జుట్టు ఊడటం, రుచి మరియు ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, నోటిలో పుండు, తక్కువ రక్త కౌంట్లు మరియు ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటాయి.
తక్కువ రక్త కౌంట్లు గల రోగుల్లో, తెల్ల రక్త కౌంట్ని (వృద్ధి కారకాలు) మెరుగుపరచడానికి ఇంజెక్షన్లు, రక్తం లేదా ప్లెట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం కావచ్చు. చికిత్స తరువాత ఇన్ఫెక్షన్ గల రోగులకు యాంటీబయాటిక్స్ ఇవ్వబడతాయి. తక్కువ రక్త కౌంట్లు కొంత కాలంలో నెమ్మదిగా కోలుకుంటాయి.
తక్కువ ఫిట్గా ఉన్న రోగులకు, తక్కువ ఉధృతి గల ఇండక్షన్ చికిత్స అజాసిటాడైన్, డెసిటాబైన్, తక్కువ మోతాదు సైటరాబైన్ మరియు జెంటుజుమాబ్ ఒజోగామైసిన్ లాంటి ఔషధాలతో ప్రణాళిక చేయబడుతుంది. రోగి స్థితిని బట్టి అత్యుత్తమ వైఖరిని ఆంకాలజిస్టు లేదా హెమటాలజిస్టు నిర్ణయిస్తారు.
కీమోథెరపికి స్పందన మదింపు కోసం చూడటానికి ఎముక మూలుగ ఆస్పిరేట్ మరియు బయాప్సీ 7 రోజులకు మరియు అవసరమైతే మళ్ళీ 14 రోజుల్లో చేయబడతాయి.

కన్సాలిడేషన్ దశ

ఇంటెన్సివ్ కీమోథెరపి అయిన కన్సాలిడేషన్ థెరపిని, ఇండక్షన్ కీమోథెరపి తరువాత సంపూర్ణంగా వ్యాధి ఉపశమనం కలిగిన రోగుల్లో వ్యాధిని చేసే అవకాశాలను పెంచేందుకు ఇవ్వడం జరుగుతుంది. కన్సాలిడేషన్ కీమోథెరపి లేకపోతే, ఎఎంఎల్ తిరిగికలిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. చికిత్స యొక్క ఈ దశలో ఎక్కువ మోతాదు సైటరాబైన్ (హైడ్యాక్), డౌనోరుబిసిన్, ఇడారుబిసిన్, మైటోక్సాన్ట్రోన్ తదితర వాటి యొక్క ఎక్కువ మోతాదుతో కీమోథెరపి కోర్సులు లేదా ఆటోలోగస్/అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఉంటాయి. ఇండక్షన్ చికిత్సలో లక్షిత థెరపిని ఉపయోగిస్తే, దీనిని ఈ దశలో కూడా కొనసాగించవచ్చు. కీమోథెరపి మాత్రమే లాంటి చికిత్సల ఎంపిక లేదా కీమోథెరపి తరువాత స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ లేదా నేరుగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఎంపిక ఎఎంఎల్ రకం, ఎఎంఎల్లో జన్యుపరమైన మార్పులు, రోగి ఫిట్నెస్ మరియు పై విశిష్టతలపై ఆధారపడి వ్యాధి యొక్క రిస్కు ప్రొఫైల్పై ఆధారపడి ఉంటుంది. రోగులను అనుకూలమైన ప్రొఫైల్, మధ్యస్త రిస్కు ప్రొఫైల్ లేదా పూర్ రిస్కు ప్రొఫైల్గా వర్గీకరించవచ్చు మరియు అత్యంత సముచితమైన కన్సాలిడేషన్ చికిత్స గురించిన నిర్ణయాలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తీసుకోబడతాయి.

స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్

స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది వ్యాధి పూర్తిగా ఉపశమనం పొందిన మరియు వ్యాధి రిస్కు ప్రొఫైల్ ఒకమోస్తరుగా లేదా ఎక్కువగా ఉన్న రోగుల్లో మరియు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల రోగుల్లో ఎఎల్ఎల్లో ఉపయోగించే ఒక రకం చికిత్స. వ్యాధి తిరగబెట్టే ప్రమాదం మామూలుగా ఉన్న రోగులకు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండకపోవచ్చు.
ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి ముందు, రోగికి కండిషనింగ్ కీమోథెరపి అనే కీమోథెరపి ఎక్కువ మోతాదు ఇవ్వబడుతుంది, ఎఎల్ఎల్ కణాలన్నిటినీ (మైలోఅబ్లేటివ్ కండిషనింగ్) చంపడం ఈ కీమోథెరపి లక్ష్యం. నాన్ మైలోఅబ్లేటివ్ కండిషనింగ్ అనేది వృద్ధులకు లేదా తక్కువ ఫిట్గా ఉన్న రోగులకు ఇవ్వబడుతుంది, ఇక్కడ కీమోథెరపి తక్కువ ధృతంగా ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్కి ముందు కండిషనిం్ చికిత్సగా కీమోథెరపి మరియు రేడియోథెరపి సమ్మేళనం కూడా ఇవ్వబడవచ్చు.
ఎముక మూలుగ పనితనం మామూలుగా ఎర్ర రక్త కణాలు లాంటి ఎర్ర కణాలను ఉత్పత్తిచేయడం, ఇది ఆక్సిజెన్ని, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే తెల్ల రక్త కణాలను తీసుకెళ్ళడానికి మరియు రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడే ప్లెట్లెట్లను తీసుకెళ్ళడానికి ఇది సహాయపడుతుంది. రక్తంలో ఈ కణాలు గణనీయంగా తగ్గడం రోగికి ప్రమాదకరం కాబట్టి ఎక్కువ మోతాదు కీమోథెరపి తరువాత ఈ కణాల ట్రాన్స్ప్లాంట్ అవసరమవుతుంది.

స్టెమ్ సెల్స్ సేకరణ

స్టెమ్ సెల్స్ అనేవి ఒక రకం రక్త కణాలు. ఎర్ర రక్త, తెల్ల రక్త కణం లేదా ప్లెట్లెట్లు లాంటి ఏ రకమైన రక్త కణంలోకైనా అభివృద్ధి చెందగల సామర్థ్యం వీటికి ఉంది. ఈ స్టెమ్ సెల్స్ రక్త ప్రవాహంలో మరియు ఎముక మూలుగలో ఉంటాయి మరియు రోగి ఎక్కువ మోతాదు కీమోథెరపిని పొందడానికి ముందు రోగి నుంచి మొదట్లో సేకరించబడతాయి. రోగి నుంచి స్టెమ్ సెల్స్ని సేకరించే మరియు కీమోథెరపి ఎక్కువ మోతాదు తరువాత అదే రోగిలోకి తిరిగి ఇన్ఫ్యూజ్ చేయబడే ఈ ప్రక్రియను ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు.
స్టెమ్ సెల్స్ కనుక మరొక వ్యక్తి నుంచి అయితే (దాత), దీనిని అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. దాత బంధువు అయివుండొచ్చు, సాధారణంగా సోదరుడు లేదా సోదరి. లేదా సంబంధం లేని, కానీ సరిపోలిన లేదా పాక్షికంగా సరిపోలిన దాత. ఒకవేళ దాత లభించకపోతే ఎఎంఎల్లో అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంట్కి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
స్టెమ్ సెల్స్ని సేకరించడానికి ముందు, రోగికి/దాతకు జి-సిఎస్ఎఫ్ గల ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి, విజయవంతంగా సేకరణను సాధించడానికి రక్తంలో స్టెమ్ సెల్స్ సంఖ్యను ఇవి పెంచుతాయి.
స్టెమ్ సెల్స్ సేకరణ రోజున, రోగిని (ఆటో) లేదా దాతను (అల్లోజెనిక్) మెషీన్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది మరియు ఒక సిర నుంచి రోగి రక్తం తీయబడుతుంది మరియు రక్తంలో ఉన్న స్టెమ్ సెల్స్ని సేకరించడానికి ఇది యంత్రం గుండా పోతుంది. అనంతరం రక్తం మరొక సిర గుండా రోగిలోకి తిరిగి వెళుతుంది. ఈ ప్రక్రియను కొద్ది గంటల్లో చేస్తారు.

ఒకసారి స్టెమ్ సెల్స్ని సేకరిస్తే, రోగి అధిక మోతాదు కీమోథెరపి పొందుతారు. కీమోథెరపి తరువాత, స్టెమ్ సెల్స్ తిరిగి రోగిలోకి ఎక్కించబడతాయి. ఈ కణాలు ఎముక మూలుగలోకి వెళ్ళ మళ్ళీ రక్త కణాలు తయారుచేయడం ప్రారంభిస్తాయి.

ఎముక మూలుగ సేకరణ

ఎముక మూలుగ అనేది ఎముకల లోపల ఉండే మెత్తని మెటీరియల్. ఎముక మూలుగ ట్రాన్స్ప్లాంట్ కోసం, ఎక్కువ మోతాదు కీమోథెరపిని ఇవ్వడానికి ముందు మూలుగను సేకరించవలసి ఉంటుంది. మూలుగను సేకరించే ప్రక్రియ సాధారణ మత్తుమందు కింద, ఆపరేషన్ థియేటర్లో చేయబడుతుంది. ఎముకల్లోని విభిన్న చోట్ల నుంచి మూలుగ తీసుకోబడవచ్చు మరియు ప్రక్రియలో దీ నుంచి దాదాపు 1 లీటర్ తీయవచ్చు. ఒకసారి తీస్తే, నిల్వ చేయబడుతుంది మరియు అవసరమైతే రోగిలోకి ఎక్కించబడుతుంది.

స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ యొక్క ప్రమాదాలు మరియు దుష్ప్రభావాలు

స్టెమ్ సెల్ లేదా ఎముక మూలుగ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం సంక్లిష్టమైన ప్రక్రియ మరియు దుష్ప్రభావాలతో ముడిపడివుంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన తరువాత మూలుగలో మరియు రక్తంలో రక్త కణాలు మామూలు స్థాయిలకు కోలుకోవడానికి ఆసుపత్రిలో ఉండటం ఈ ప్రక్రియలో సాధారణంగా ఉంటుంది. ఈ ప్రక్రియతో ముడిపడివుండే మామూలు దుష్ప్రభావాల్లో ఉంటాయి:
వికారం, వాంతులు, జుట్టు ఊడటం, కాలేయం పనితనం మారడం ఈ చికిత్స యొక్క సంభావ్య దుష్ప్రభావాలు.
తెల్ల రక్త కణాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది మరియు రోగి ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. ఈ ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియల్, వైరల్ లేదా ఫంగల్ సంబంధమైనవి అయివుండొచ్చు మరియు వీటిని నియంత్రించడానికి సాధారణంగా యాంటీబయాటిక్స్ అవసరమవుతాయి.
నోరు మరియు జీర్ణ మార్గం యొక్క లైనింగ్ లోపలి వైపున కీమోథెరపి ప్రభావమే ముకోసైటిస్. రోగి తీసుకునే ఆహారం పరిమాణాన్ని ఇది పరిమితం చేయవచ్చు మరియు ఇలాంటి సందర్భంలో ఇతర ఫీడింగ్ పద్ధతులు ఉపయోగించవచ్చు.
రక్తస్రావం అనేది తక్కువ ప్లెట్లెట్ కౌంట్ వల్ల ఈ ప్రక్రియతో ముడిపడివున్న ప్రమాదం, కానీ ప్లెట్లెట్ కౌంట్లను కావలసిన స్థాయిల్లో ఉంచేందుకు ప్లెట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ని ఇవ్వవచ్చు.

గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ వ్యాధి అనేది ట్రాన్స్ఫ్యూజ్డ్ కణాలకు శరీరం యొక్క ప్రతిచర్య, ప్రత్యేకించి స్టెమ్ సెల్స్ లేదా మూలుగ కనుక దాత నుంచి తీసుకుంటే.

రేడియోథెరపి

స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్కి ముందు కండిషనింగ్ చికిత్సగా కూడా రేడియోథెరపి ఉపయోగించబడవచ్చు. కండిషనింగ్ చికిత్స అనేది స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంట్కి ముందు శరీరంలో రక్త కణాలన్నిటినీ తొలగించడం చికిత్స లక్ష్యంగా కలది. ఈ కండిషనింగ్ చికిత్స కీమోథెరపి లేదా రేడియోథెరపి అయివుండొచ్చు. రేడియోథెరపిని ఉపయోగించినప్పుడు, ఇది శరీరం మొత్తానికి ఇవ్వబడుతుంది మరియు టోటల్ బాడీ ఇరాడియేషన్ (టిబిఐ) అని అంటారు. టిబిఐ చికిత్స యొక్క దుష్ప్రభావాల్లో అలసట, నిద్రమత్తు, జుట్టూ ఊడటం, నీళ్ళ విరేచనాలు, నోటిలో పుండు, తక్కువ రక్త కౌంట్లు మరియు ఇన్ఫెక్షన్ ప్రమాదం, రక్తస్రావం, వికారం మరియు వాంతులు ఉంటాయి.

తిరగబెట్టిన లేదా అవశేష వ్యాధికి చికిత్స

చెప్పుకోదగిన సంఖ్యలో రోగులు ఇండక్షన్ మరియు కన్సాలిడేషన్ చికిత్సలో వ్యాధి ఉపశమనం పొందుతారు. కొంతమంది రోగులకు ఇతర ఔషధాలతో చికిత్స చేయవలసి ఉంటుంది మరియు చేయవలసిన అవసరం ఉండదు. పై వాటి తరువాత వ్యాధి ఉపశమనం కలిగిన రోగులు కొంతమందికి కొద్ది కాలం తరువాత వ్యాధి తిరగబెట్టవచ్చు. ఈ రోగులకు గల చికిత్స ఎంపికల్లో ఎక్కువ కీమోథెరపి, ఆ తరువాత స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఉంటాయి, ఒకవేళ మళ్ళీ చికిత్స తరువాత పాక్షికంగా లేదా సంపూర్ణంగా వ్యాధి ఉపశమనం సాదిస్తే.

గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ వ్యాధి అనేది స్టెమ్ సెల్ లేదా ఎముక మూలుగ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క సంక్లిష్ట సమస్య. రోగి లోకి మరియు రోగి శరీరంలోకి ఎక్కించబడిన దాత యొక్క కణాల (టి కణాలు) మధ్య ప్రతిచర్య ఇది. టి కణాలు హోస్ట్ (రోగి) కణాలను పరాయివిగా చూస్తాయి మరియు వాటికి ప్రతిస్పందిస్తాయి. చర్మం, పేగు మరియు కాలేయం అనేవి ఈ స్థితి వల్ల బాగా ప్రభావితమయ్యే అవయవాలు. అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న రోగుల్లో జివిహెచ్డి కలుగుతుంది, ఇవి మరొక వ్యక్తి నుంచి ట్రాన్స్ప్లాంట్ చేయబడిన కణాలు. ట్రాన్స్ప్లాంట్ దాత సన్నిహిత బంధువు అయితే మరియు దాతకు మరియు రోగికి మధ్య మంచి పోలిక ఉంటే ఈ సంక్లిష్ట సమస్య ప్రమాదం తక్కువగా ఉంటుంది. సంబంధం లేని దాత అయితే లేదా పాక్షికంగా సరిపోలిన దాతను ఉపయోగిస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
జివిహెచ్డి రెండు రకాలుగా ఉండొచ్చు, ఎక్యూట్ మరియు క్రానిక్. జివిహెచ్డిని దాని తీవ్రత ప్రకారం కూడా గ్రేడ్ చేయవచ్చు.

గ్రేడ్ 1- రోగికి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి
గ్రేడ్ 2- లక్షణాలు ఒకమోస్తరుగా ఉన్నాయి
గ్రేడ్ 3- లక్షణాలు తీవ్రంగా ఉన్నాయి
గ్రేడ్ 4- లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయి

ఎక్యూట్ జివిహెచ్డి అనేది ట్రాన్స్ప్లాంట్ జరిగిన తొలి 100 రోజుల్లో కలిగే సంక్లిష్ట సమస్య, కానీ ట్రాన్స్ప్లాంట్ తరువాత సాధారణంగా 2-3 వారాల్లో ఇది జరుగుతుంది. ఎక్యూట్ జివిహెచ్డి లక్షణాల్లో చర్మ దద్దుర్లు ఉంటాయి, ఇవి దురదగా మరియు నొప్పిగా ఉండొచ్చు. ఇతర లక్షణాల్లో నీళ్ళ విరేచనాలు, ఆకలి లేకపోవడం, వాంతులు మరియు పచ్చకామెర్లు (కళ్ళు పసుపుపచ్చగా మారడం) ఉంటాయి.

ట్రాన్స్ప్లాంట్ తరువాత 100 రోజులకు క్రానిక్ జివిహెచ్డి కలుగుతుంది మరియు దాని లక్షణాల్లో చర్మ దద్దుర్లు ఉంటాయి, ఇవి దురదగా, చర్మం రంగుమారడం, నీళ్ళ విరేచనాలు, నోరు ఎండిపోవుట, పచ్చకామెర్లు మరియు కాలేయం మచ్చపడటంగా ఉండొచ్చు. దగ్గు మరియు శ్వాస తీసుకోలేకపోవడానికి దారితీసేలా ఊపిరితిత్తులను ప్రభావితం చేయవచ్చు, కళ్ళు పొడిబారడం మరియు నొప్పి, కండరాల్లో నొప్పి కలిగించవచ్చు.

రోగి లక్షణాలపై మరియు డాక్టరు చేసిన పరీక్ష ఫలితాలపై ఆధారపడి జివిహెచ్డిని రోగనిర్థారణ చేస్తారు. ఇది ఉందనే విషయం ధృవీకరించుకునేందుకు చర్మం, కాలేయం లేదా ఇతర ఏరియాకు బయాప్సీని తీసుకుంటారు.
జివిహెచ్డికి చికిత్స మరియు నిరోధకతను దాత మరియు హోస్ట్ కణాలకు మధ్యలో ప్రతిచర్యను తగ్గించడానికి రోగనిరోధక వ్యవస్థను అణచివేయడం ద్వారా ప్రధానంగా సాధించవచ్చు. దీనితో సహాయపడటానికి ఔషధాలను ఉపయోగిస్తారు. ఈ స్థితిని నియంత్రించేందుకు సహాయపడటం కోసం మామూలుగా ఉపయోగించే ఔషధాల్లో ఇన్ఫ్లిక్సిమాబ్, ఎటనేర్సెప్ట్, మైకోఫెనోలేట్ మొఫెటిల్ (ఎంఎంఎఫ్), సిరోలిమస్, టాక్రోలిమస్, రిటూక్సిమాబ్, ఇబ్రూటినిబ్, అజాథయోప్రైన్ మరియు పెంటోస్టాటిన్ ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ లాంటి మామూలు సపోర్టివ్ చికిత్సలు, వాంతులు, నీళ్ళ విరేచనాలు తగ్గించేందుకు మందులు, ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు లేదా చికిత్స చేసేందుకు యాంటీబయాటిక్స్, కళ్ళు పొడిబారడాన్ని నిరోధించేందుకు కృత్రిమ కన్నీరు, పౌష్ఠికాహారం మరియు ఫ్లూయిడ్ సపోర్టు మరియు ఇతర చర్యలను ఉపయోగిస్తారు. క్రానిక్ జివిహెచ్డి గల రోగులకు సుదీర్ఘ కాలం పాటు ఉండే లక్షణాలు ఉండొచ్చు మరియు చర్మం, కాలేయం, ఊపిరితిత్తులు, కళ్ళు, యోనికి సపోర్టివ్ చర్యలు కొనసాగించబడతాయి. అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోబడతాయి.