Bone Cancer

ఎముక క్యాన్సర్

ఎముక క్యాన్సర్‌ అనేది ఎముకలో కలిగే క్యాన్సర్‌. ఎముక క్యాన్సర్‌లు ప్రధానంగా రెండు రకాలుగా ఉండొచ్చు.

ప్రాథమిక ఎముక క్యాన్సర్‌లు

ప్రాథమిక ఎముక క్యాన్సర్‌లు అనేవి ఎముకలో ప్రారంభమయ్యేవి మరియు ఎముక, కార్టిలేజ్‌ లేదా ఎముకలోని ఇతర కణాలతో నిర్మితమైన కణాల్లో ఉద్భవిస్తాయి. ఈ క్యాన్సర్లలో అత్యధిక సర్కోమాలు. ఆస్టియోసక్రోమాస్‌, కోండ్రోసర్కోమాస్‌ మరియు ఎవింగ్స్‌ సర్కోమాలు మామూలు మామూలు కణితులు.

సెకండరి ఎముక క్యాన్సర్‌లు

సెకండరి ఎముక క్యాన్సర్‌లు అనేవి ఊపిరితిత్తులు, రొమ్ము తదితర లాంటి శరీరంలోని ఇతర అవయవాల్లో ప్రారంభమైనవి మరియు అనంతరం ఎముకకు విస్తరించినవి.
ఈ సెక్షన్‌లో, మేము ప్రాథమిక ఎముక క్యాన్సర్‌ల గురించి మాట్లాడబోతున్నాము, సెకండరి ఎముక క్యాన్సర్‌లు మరొక సెక్షన్‌లో చర్చించబడతాయి.

నిరపాయకర కణితులు

ఇతర నిరపాయకర మచ్చలు ఎముకలో కనిపిస్తాయి. ఇవి కణితులు, కానీ క్యాన్సర్‌లు కావు మరియు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే సామర్థ్యం ఉండదు.

ఎముక లేదా కార్టిలేజ్‌లో ఏ రకమైన సెల్‌లో ప్రారంభమయ్యాయి అనే దానిపై ఆధారపడి ప్రాథమిక ఎముక క్యాన్సర్‌లు విభిన్న రకాలుగా ఉంటాయి. మామూలు క్యాన్సర్‌లు ఈ కింద ఇవ్వబడ్డాయి.

ఆస్టియోసర్కోమా లేదా ఆస్టియోజెనిక్‌ సర్కోమా

ఇది కౌమారుల్లో, యుక్తవయస్కుల్లో మరియు యువ వయోజనుల్లో కలిగే అత్యంత సామాన్య రకం ఎముక క్యాన్సర్‌, కానీ ఏ వయస్సులోనైనా కలగవచ్చు. క్యాన్సరు శరీరంలో ఏ ఎముకలోనైనా కలగవచ్చు, కానీ ఫెమర్‌లో (తొడ ఎముక) మోకాలు పరిసరాల్లో, టిబియా (కాలు ఎముక) మరియు భుజంలో సామాన్యంగా కలుగుతుంది.

ఎవింగ్స్‌ సర్కోమా

ఇది పిల్లల్లో మరియు వయోజనుల్లో యుక్త వయస్సులో ఎక్కువ సామాన్యంగా, కానీ ఏ వయస్సులోనైనా కలగగల ఒక రకం క్యాన్సర్‌. ఇది అత్యంత సామాన్యంగా పెల్విస్‌, ఫెమర్‌ (తొడ ఎముక) మరియు టిబియా (కాలు ఎముక)లో కలుగుతుంది. ఈ రకమైన సర్కోమా శరీరంలోని మెత్తని కణజాలాల్లో ఎముక బయట కూడా ఉత్పన్నం కావచ్చు.

కోండోసర్కోమా

ఇది ఎముక కార్టిలేజ్‌ నుంచి ఉత్పన్నమయ్యే ఒక రకం ఎముక సర్కోమా. కార్టిలేజ్‌ అనేది ఎముక బెడ్‌లో ఉండే మృదువైన తెల్లని నిర్మాణం. ఇది మధ్య నుంచి వృద్ధ వయస్సులో కలుగుతుంది మరియు శరీరంలోని ఏ భాగంలోనైనా కలగవచ్చు, కానీ ఎగువ బాహువు మరియు ఫెమర్‌లో (తొడ ఎముక) సామాన్యంగా కలుగుతుంది. ఇది ఉత్పన్నమయ్యే ఇతర భాగాల్లో పెల్విస్‌, పుర్రె అడుగు పక్కటెముకలు.

స్పిండిల్‌ సెల్‌ సర్కోమా

ఇవి ఎముక నుంచి ఉత్పన్నమయ్యే సర్కోమాలు, కానీ మెత్తని కణజాలాలతో తయారుచేయబడతాయి మరియు ఎముకను ఏర్పరచే కణాలు ఉండవు. ఇవి వృద్ధుల్లో కలుగుతాయి మరియు మాలిగ్నంట్‌ ఫైబ్రవస్‌ హిస్టియోసైటోమా (ఎంఎఫ్‌హెచ్‌) లేదా ఎముక యొక్క లెయోమయోసర్కోమా లేదా దాని విశిష్టతలపై ఆధారపడి ఫైబ్రోసర్కోమాగా పిలుస్తారు.

ఎముక క్యాన్సర్‌లు కలిగే అవకాశాన్ని పెంచగల కొన్ని ప్రమాదకర అంశాలు ఉంటాయి మరియు ఇవి ఇక్కడ ఇవ్వబడ్డాయి.

రేడియేషన్‌కి గురవ్వడం

గతంలో రేడియేషన్‌కి గురవ్వడం ఎముక క్యాన్సర్‌ కలిగే ప్రమాదాన్ని పెంచుతుంది.

నిరపాయకర ఎముక వ్యాధి

ఎంకోండ్రోమాస్‌, ఆస్టియోకోండ్రోమాస్‌ లాంటి కొన్ని రకాల నిరపాయకర ఎముక స్థితులు ఉండటం కొంత కాలానికి క్యాన్సరుగా మారవచ్చు.

జన్యుపరమైన అంశాలు

కుటుంబ సభ్యుల్లో గల కొన్ని జీన్స్‌ ఎముక క్యాన్సర్‌లతో సహా వివిధ క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇలాంటి ఒక వ్యాధి లై ఫ్రావుమెని సిండ్రోమ్‌, కుటుంబంలో ఈ స్థితి ఉంటే ప్రమాదం పెరుగుతుంది.

బాల్యంలో వచ్చే క్యాన్సర్

బాల్యంలో వచ్చిన క్యాన్సరుకు కీమోథెరపి మరియు రేడియోథెరపితో చికిత్స చేయించుకున్న పిల్లలకు ఇలాంటి చికిత్సలు చేయించుకోని సాధారణ ప్రజానీకంతో పోల్చుకుంటే పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఎముక క్యాన్సర్‌లు పెరిగే ప్రమాదం పెరిగింది.

ఎముక క్యాన్సర్‌ల వల్ల కలిగే లక్షణాలు కణితి రకం మరియు దాని లొకేషన్‌ని బట్టి మారిపోవచ్చు.

వాపు లేదా గడ్డ

ఇది ఈ స్థితుల్లో కనిపింఏ మామూలు లక్షణం. వాపు కొద్ది రోజుల నుంచి వారాల్లో త్వరగా పెరగవచ్చు లేదా నెలల నుంచి సంవత్సరాల్లో నెమ్మదిగా పెరగవచ్చు. ఇది కొన్నిసార్లు ఎక్కువ సమయం ఒకే సైజులో ఉన్న వాపుగా ఉంటుంది, కానీ మళ్ళీ పెరగడం ప్రారంభిస్తుంది. వాపు నొప్పిగా లేదా నొప్పి లేకుండా ఉండొచ్చు. ఆ ప్రాంతంలో చర్మం ఎర్రబడటంతో వాపు ముడిపడివుండొచ్చు.

నొప్పి

నొప్పి ఈ గాయాల యొక్క మామూలు లక్షణం, కానీ క్యాన్సరును నిర్థారణ చేసే లక్షణం కానక్కరలేదు, ఎందుకంటే కొన్ని నొప్పిలేకుండా ఉండొచ్చు. మామూలుగా, నొప్పి ఉంటుంది మరియు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి కణితి వల్ల నరం అణచివేయడం వల్ల బాహువు లేదా కాలుకు వ్యాపించవచ్చు.

ఫ్రాక్చర్

ఎముక ఫ్రాక్చర్‌ అంతర్లీనంగా ఉన్న ఎముక క్యాన్సర్‌ యొక్క లక్షణంగా ఉండొచ్చు. ఫ్రాక్చర్‌ తక్కువ ట్రామాతో కలగవచ్చు, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎముక బలహీనంగా ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్చర్‌ని పేథోలాజికల్‌ ఫ్రాక్చర్‌ అని అంటారు.

ఇతర లక్షణాలు

ఎముక క్యాన్సర్‌లతో ముడిపడివున్న ఇతర లక్షణాల్లో జ్వరం, అలసట, ఆకలి మరియు బరువు తగ్గడం ఉంటాయి.

ప్రాథమిక ఎముక క్యాన్సర్‌ నిర్థారణకు సహాయపడటానికి ఈ కింది పరిశోధనలు చేయబడతాయి.

ఎక్స్‌రే

ప్రభావితమైన ఎముకకు ఎక్స్‌రే సాధారణంగా ఎముక క్యాన్సర్‌ నిర్థారణలో చేయబడే మొదటి పరీక్ష. రోగి ఎముకకు సంబంధించిన నొప్పి లేదా వాపు గురించి ఫిర్యాదు చేసినప్పుడు, కారణం తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయబడుతుంది. ఎక్స్‌రేలో కనిపించేవి కారణం ఏదో బాగా సూచించగలవు.

ఎంఆర్‌ఐ స్కాన్

ప్రభావిత ఎముకకు ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయడం తదుపరి పరిశోధన పద్ధతి మరియు సాధారణంగా ఎక్స్‌రే తరువాత తీయబడుతుంది. ఆ చోటు గురించి ఎంఆర్‌ఐ గణనీయంగా ఎక్కువ సమాచారం ఇస్తుంది మరియు ఎముకలో నిరపాయకర వాపులతో పోల్చుకుంటే క్యాన్సర్‌ని గుర్తించగలుగుతుంది.

సిటి లేదా పిఇటి-సిటి స్కాన్

ఎముక క్యాన్సర్‌ని మరియు స్టేజింగ్‌ ప్రక్రియను నిర్థారించడానికి సిటి స్కాన్‌ లేదా పిఇటి-సిటి స్కాన్‌ తీయబడుతుంది. క్యాన్సరు తన మూలస్థానం నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందా అనే విషయం స్టేజింగ్‌ పరిశోధన మనకు చెబుతుంది.

ఎముక స్కాన్

ఎముకల్లో అసాధారణ అవయవాల విశిష్టతలను నిర్థారించేందుకు ఐసోటోప్‌ ఎముక స్కాన్‌ తీయబడుతుంది. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఈ స్కాన్‌ తీయబడుతుంది.

బయాప్సీ

ఎముక క్యాన్సర్‌ ఉందనే విషయం ధృవీకరించేందుకు అనుమానిత ప్రాంతం బయాప్సీ అవసరమవుతుంది. సమస్య స్వభావం గురించి తెలుసుకోవడానికి ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలు బాగా ఉపయోగపడతాయి, కానీ చికిత్స వ్యూహాన్ని ప్రణాళిక చేయడానికి ముందు బయాప్సీ అవసరమవుతుంది. అల్ట్రాసౌండ్‌ లేదా సిటి స్కాన్‌ మార్గదర్శనంతో బయాప్సీ తీయబడుతుంది. ఆపరేషన్‌ చేస్తున్న సర్జన్‌ని సంప్రదించి బయాప్సీ జాగ్రత్తగా చేయబడుతుంది, ఎందుకంటే బయాప్సీ లొకేషన్‌ చాలా ముఖ్యం. లొకేషన్‌ తప్పుగా ఉంటే, తరువాత ఏ సర్జరీ చేయాలనే విషయంలో తేడా చూపిస్తుంది.

ఎముక మూలుగ బయాప్సీ

ఎవింగ్స్‌ సర్కోమా లాంటి కొన్ని ఎముక క్యాన్సర్‌లను అనుమానించినప్పుడు ఎముక మూలుగ బయాప్సీ చేయబడుతుంది.

ఎముక సర్కోమాలను టిఎన్‌ఎం స్టేజింగ్‌ లేదా నంబరు స్టేజింగ్‌ వ్యవస్థ ప్రకారం స్టేజింగ్‌ చేయడం జరుగుతుంది. టిఎన్‌ఎం అంటే ట్యూమర్‌, నోడ్‌ మరియు మెటాస్టాసెస్‌ అని అర్థం. ఇది ఈ కింది విధంగా ఉంటుంది. ఈ క్యాన్సర్‌లకు ఇతర స్టేజింగ్‌ మరియు వర్గీకరణ వ్యవస్థలు కూడా ఉంటాయి, కానీ పొడవాటి ఎముకలకు టిఎన్‌ఎం వ్యవస్థ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడటం జరుగుతోంది.

టి స్టేజ్‌ (ఎముకలు, మొండె మరియు తలకు)

టి1 కణితి సైజు 8 సెం.మీ లోపు
టి2 కణితి సైజు 8 సెం.మీకి పైగా
టి3 టి3 ప్రాథమిక ఎముక సైట్‌లో కణితి నిలిపివేత

ఎన్‌ స్టేజ్

ఎన్‌0 క్యాన్సర్‌ లింఫ్‌ నోడ్స్‌కి విస్తరించలేదు
ఎన్‌1 క్యాన్సర్‌ లింఫ్‌ నోడ్స్‌కి విస్తరించింది

ఎం స్టేజ్

ఎం0 క్యాన్సరు తన అసలు చోటు నుంచి దూరంగా విస్తరించలేదు
ఎం1ఎ క్యాన్సర్‌ ఊపిరితిత్తులకు విస్తరించింది
ఎం1బి క్యాన్సర్‌ ఇతర తావులకు విస్తరించింది

ఆస్టియోసర్కోమా గ్రేడింగ్

బయాప్సీపై నిర్థారణ చేయబడిన ప్రతి ఆస్టియోసర్కోమాకు 1 నుంచి 3 గ్రేడ్‌ ఇవ్వబడుతుంది. స్టేజింగ్‌ దశలో కూడా గ్రేడింగ్‌ పాత్ర పోషిస్తుంది.
గ్రేడ్‌ 1 బాగా తేడా తెలుసుకోవచ్చు (లో గ్రేడ్‌)
గ్రేడ్‌ 2 ఒకమోస్తరుగా తేడా తెలుసుకోవచ్చు (హై గ్రేడ్‌)
గ్రేడ్‌ 3 పెద్దగా తేడా తెలుసుకోలేరు (హై గ్రేడ్‌)

ఆస్టియోసర్కోమాలో నంబరు స్టేజింగ్

టి స్టేజ్ ఎన్‌ స్టేజ్‌ ఎం స్టేజ్ గ్రేడ్‌ నంబరు స్టేజ్
T1 N0 M0 1 1A
T2 N0 M0 1 1B
T3 N0 M0 1 1B
T1 N0 M0 2,3 2A
T2 N0 M0 2,3 2B
T3 N0 M0 2,3 3
Any T N0 M1a Any 4A
Any T N1 Any M Any 4B
Any T N1 M1b Any 4B

ఇది కౌమారుల్లో, యుక్తవయస్కుల్లో మరియు యువ వయోజనుల్లో కలిగే అత్యంత సామాన్య రకం ఎముక క్యాన్సర్‌, కానీ ఏ వయస్సులోనైనా కలగవచ్చు. క్యాన్సరు శరీరంలో ఏ ఎముకలోనైనా కలగవచ్చు, కానీ ఫెమర్‌లో (తొడ ఎముక) మోకాలు పరిసరాల్లో, టిబియా (కాలు ఎముక) మరియు భుజంలో సామాన్యంగా కలుగుతుంది.

ఆస్టియోసర్కోమా చికిత్స

సర్జరీ

సర్జరీ ద్వారా క్యాన్సరును తీసేయడం ఆస్టియోసర్కోమాలో అత్యంత ముఖ్యమైన చికిత్స. కీమోథెరపితో సమ్మేళనంగా ఇది చికిత్సలో ప్రధాన భాగమవుతుంది మరియు రెండు చికిత్సల సమ్మేళనం వ్యాధిని మెరుగ్గా నియంత్రించే మరియు నయంచేసే అవకాశాలను పెంచుతుంది.
సర్జికల్‌ రీసెక్షన్‌ అంగవిచ్ఛేదనం కావచ్చు, ఇక్కడ ప్రభావిత కాలు/చేతిని తొలగించడం జరుగుతుంది లేదా లింబ్‌ స్పేరింగ్‌ని ఎంచుకోవడం జరుగుతుంది, ఇక్కడ కణితి తగినంత మార్జిన్‌తో తొలగించబడుతుంది మరియు కాలు/చేయి వదిలేయబడుతుంది. వెడల్పాటి రీసెక్షన్‌లో కాలు/చేయి పనితనాన్ని ప్రభావితం చేయకుండానే చుట్టూ ఉన్న మామూలు కణజాలంతో క్యాన్సరును తొలగించడం ఉంటుంది.
అంగవిచ్ఛేదనం చేయబడితే, పొరుగున ఉన్న కీలుతో సహా కాలు/చేయి మొత్తాన్ని తొలగించవచ్చు. ఆ అవయవం కదలడానికి లేదా ఇతర పనులు చేయడానికి ప్రొస్థెసిస్‌ని ధరించవచ్చు. కణితి ఉధృతంగా ఉన్నప్పుడు లేదా ప్రధాన రక్త నాళాలు లేదా నరాలు లాంటి దాని చుట్టూ ఉన్న ముఖ్యమైన నిర్మాణాలకు ప్రయేయం ఉన్నప్పుడు లేదా లింబ్‌ స్పేరింగ్‌ ఆపరేషన్‌ తరువాత తిరిగికలిగినప్పుడు అంగవిచ్ఛేదనం చేయబడుతుంది. అంగవిచ్ఛేదనం దుష్ప్రభావాల్లో ఫాంటమ్‌ నొప్పి ఉంటుంది, దీనిలో రోగి తొలగించబడిన అవయవం యొక్క ఒక భాగంలో నొప్పిని అనుభవించవచ్చు. ఇది కొంత కాలానికి మెరుగుపడుతుంది.
అంగవిచ్ఛేదనం కంటే లింబ్‌ స్పేరింగ్‌ సర్జరీ ఎక్కువ సామాన్యంగా చేయబడుతుంది. దీనిలో అవయవంలోని ఎముకలో కొంత భాగాన్ని తొలగిస్తారు మరియు తొలగించిన ఎముక స్థానంలో ప్రొస్థేసిస్‌ లేదా శరీరంలోని మరొక భాగం నుంచి ఎముకను పెట్టడం జరుగుతుంది. పనిచేయడానికి వీలుగా అవయవాన్ని స్థానంలో వదిలేయడం జరుగుతుంది.
ఏ ఆపరేషన్‌ని ఎంచుకోవాలనే విషయం క్యాన్సరు లొకేషన్‌, రోగి వయస్సు, ఎందుకంటే యువ రోగిలో ఎముకలు ఇప్పటికీ పెరుగుతుంటాయి, పరిగెత్తడం లాంటి రోగి యొక్క యాక్టివిటి లెవెల్‌ మరియు ఆపరేషన్‌ తరువాత కార్యనిర్వాహక ఫలితంపై ఆధారపడి ఉంటుంది.
ప్రాథమిక ఎముక క్యాన్సర్‌లకు చేసే అత్యధిక ఆపరేషన్‌లకు కోల్పోయిన కణజాలాలకు సరిపోయేలా ఏదో ఒక రకం రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ అవసరమవుతుంది. సాధ్యమైనంత ఉత్తమ మార్గంలో శరీరంలోని ఆ భాగం పనితనాన్ని పునరుద్ధరించడం ఈ రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ లక్ష్యం. వివిధ రకాల ఈ సర్జరీలో తొలగించిన ఎముక స్థానంలో మెటల్‌ లేదా ప్లాస్టిక్‌ వస్తువు అయిన ఎండోప్రొస్థేసిస్‌ని పెట్టడం ఉంటుంది. ఆ అవయవం పనితనాన్ని పునరుద్ధరించేందుకు ప్రొస్థేసిస్‌ సహాయపడుతుంది. ప్రొస్థేసిస్‌ని రోగికి అనువుగా తయారుచేయడం జరుగుతుంది దీనివల్ల ఇది సర్జరీ తరువాత రోగికి కచ్చితంగా ఫిట్‌ అవుతుంది. కొన్ని సర్జరీల్లో ఎముక గ్రాఫ్ట్‌ అవసరమవుతుంది, ఇక్కడ రోగి యొక్క మరొక భాగం నుంచి లేదా మరొక వ్యక్తి నుంచి (అల్లోగ్రాఫ్ట్‌) ఎముక కొంత తొలగించబడుతుంది. ఈ ఎముక ముక్కను సర్జరీలో సృష్టించిన లోపంలో పెట్టడం జరుగుతుంది.

కీమోథెరపి

వ్యాధిని నయం చేసేందుకు ఆస్టియోసర్కోమాలో కీమోథెరపి ముఖ్యమైన చికిత్స భాగం. కీమోథెరపి ఔషధాల సమ్మేళనంతో ఇవ్వబడుతుంది మరియు సర్జరీకి ముందు (నియోఅడ్జువంట్‌) లేదా తరువాత (అడ్జువంట్‌) ఇవ్వబడవచ్చు. అనేక సార్లు, కొంత కీమోథెరపి సర్జరీకి ముందు మరియు కొంత తరువాత ఇవ్వబడుతుంది. ఉపయోగించే మామూలు రకాల కీమోథెరపిలో మెథోట్రెక్సేట్‌, డోక్సోరుబిసిన్‌ మరియు సిస్‌ప్లాటిన్‌ (ఎంఎపి) లేదా డోక్సోరుబిసిన్‌ మరియు సిస్‌ప్లాటిన్‌ సమ్మేళనం ఉంటాయి. ఎంఎపి కీమోథెరపికి చేర్చబడే ఇతర ఔషధాల్లో ఐఫోస్ఫామైడ్‌ మరియు ఎటోపోసైడ్‌ ఉంటాయి.
మెటాస్టాటిక్‌ లేదా స్టేజ్‌ 4 వ్యాధి గల రోగులకు కూడా పైన జాబితాగా ఇచ్చిన వివిధ ఔషధాల సమ్మేళనాన్ని ఉపయోగించి కీమోథెరపి ఇవ్వబడుతుంది.

రేడియోథెరపి

రేడియోథెరపికి ఆస్టియోసర్కో చాలా సున్నితంగా ఉండదు కాబట్టి ఇది ప్రామాణిక చికిత్స పద్ధతి కాదు.

ఆస్టియోసర్కోమా

ఆస్టియోసర్కోమాకు గల ప్రమాదకర అంశాల్లో పూర్వ రేడియోథెరపి లేదా కీమోథెరపి, సాధారణంగా అనేక సంవత్సరాల ముందు, (>10 సంవత్సరాలు) ఉంటాయి. వయోజన రోగుల్లో, 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల రోగుల్లో, ఎముకకు పాజెట్ వ్యాధి లాంటి నిరపాయకర ఎముక మచ్చలు, ఫైబ్రవస్ డైస్ప్లాసియాచ, ఎముక ఆస్టియోమైలైటిస్ యొక్క దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు ఉంటాయి లేదా ఎముక ఇన్ఫార్క్ట్స్ ఉండటం ఆస్టియోసర్కోమా కలగడానికి ప్రమాదకర అంశాలు కావచ్చు.

ఆస్టియోసర్కోమాతో ముడిపడివున్న మామూలు లక్షణాల్లో ప్రమేయం ఉన్న ఎముకలో నొప్పి ఉండొచ్చు, ఇది అనేక నెలల పాటు ఉండొచ్చు. నొప్పితో పాటు, సాధారణంగా మెత్తగా మరియు తాకితే నొప్పిగా ఉండే ఏరియాలో వాపు ఉండొచ్చు.

రోగనిర్థారణ మరియు దశపై వివరాల కొరకు ఎముక కణితులపై విభాగం చూడండి.

సర్జరీ చేయించుకోలేని లేదా కొన్ని రకాల ఆస్టియోసర్కోమా (చిన్న కణం) గల రోగుల్లో రేడియోథెరపిని అప్పుడప్పుడు ఉపయోగించవచ్చు.

రికరెన్స్

తిరగబెట్టిన క్యాన్సరు గల లేదా ప్రారంభ చికిత్స తరువాత తిరిగొచ్చిన రోగులకు అది తిరగబెట్టిన తావుపై ఆధారపడి చికిత్స చేయబడుతుంది. క్యాన్సరు మామూలుగా ఊపిరితిత్తుల్లో తిరిగి కలుగుతుంది. కొంతమంది రోగుల్లో ఊపిరితిత్తుల్లో తిరిగిరావడం వల్ల, దానిని సర్జరీతో తొలగించడం సాధ్యపడవచ్చు కాబట్టి దానిని అనుకరించవచ్చు. ఆపరేషన్కి ముందు లేదా తరువాత కీమోథెరపితో ఇది మిళితమై ఉంటుంది. సర్జరీ చేయడం సాధ్యపడని రోగులకు, వ్యాధిని నియంత్రించడానికి మరియు ప్రయత్నించడానికి కీమోథెరపి ఒక ఆప్షన్.

కోండ్రోసర్కోమా అనేది కార్టిలేజ్‌ కణజాలం నుంచి ఉత్పన్నమయ్యే క్యాన్సర్‌. ప్రాథమిక ఎముక సంబంధ కణితులన్నిటిలో దాదాపు 20% వరకు కోండ్రోసర్కోమా భర్తీ చేయవచ్చు. లో గ్రేడ్‌ క్యాన్సర్లలో కణితులు చాలా నెమ్మదిగా పెరగడం నుంచి హై గ్రేడ్‌ క్యాన్సర్లలో కణితి దూకుడుగా పెరగడం వరకు కోండ్రోసర్కోమా ప్రవర్తన చాలా ఎక్కువగా మారుతుంది. అత్యధిక కోండ్రోసర్కోమాలు, 90% వరకు తక్కువ నుంచి ఒకమోస్తరు గ్రేడ్‌లో ఉంటాయి మరియు నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఎవింగ్స్‌ సర్కోమా మరియు ఆస్టియోసర్కోమాలుగా కాకుండా, కోండ్రోసర్కోమాలు 50 సంవత్సరాలకు పైగా వయస్సు గల ప్రజల్లో ఎక్కువగా కలుగుతుంటాయి. మామూలుగా ప్రమేయం గల ఎముకల్లో ఫెమర్‌ (తొడ ఎముక), పెల్విస్‌ మరియు హ్యూమెరస్‌ (చేతి ఎముక) ఉంటాయి.
కోండ్రోసర్కోమాతో ముడిపడివున్న లక్షణాల్లో ఎముకల నొప్పి మరియు వాపు, వారాల్లో లేదా నెలల్లో నెమ్మదిగా పెరుగుతుండే ఎముకపై లేదా సన్నిహితంగా ఉన్నదానిపై వాపు. అప్పుడప్పుడు, సుదీర్ఘ కాలం పాటు ఉన్న మరియు వేగంగా పెరగడం ప్రారంభమైన వాపును రోగులు గమనించవచ్చు.

కోండ్రోసర్కోమాకు చికిత్స

కోండ్రోసర్కోమాకు చికిత్స రోగనిర్థారణ సమయంలో కణితి సైజు, లొకేషన్‌, గ్రేడ్‌ మరియు దశపై ఆధారపడి ఉంటుంది.

సర్జరీ

సర్జికల్‌ చికిత్స కోండ్రోసర్కోమాను నయంచేసేందుకు వీలు కల్పించే ఏకైక ఎంపిక. కణితి రకాన్ని బట్టి చేయబడే సర్జరీ రకం మారిపోతుంది.
తక్కువ గ్రేడ్‌ కణితులకు, ఇంట్రాలెజనల్‌ క్యూరిటేజ్‌ మామూలుగా చేయబడుతుంది. ప్రమేయం ఉన్న ఎముక నుంచి కణితిని కూరెటింగ్‌ చేయడం మరియు ఎముక సిమెంట్‌కి ఇంజెక్షన్‌ లాంటి అదనపు చికిత్స లేదా క్రైయోథెరపిని ఉపయోగించడం దీనిలో ఉంటుంది. ఇది తక్కువ అగ్రెసివ్‌ అప్రోచ్‌ మరియు రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ అవసరం ఏదీ ఉండదు.
మధ్యస్త మరియు హైగ్రేడ్‌ కణితులకు, వెడల్పుగా విచ్ఛేదనం చేయడం ద్వారా క్యాన్సరును పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ఆపరేషన్‌కి ముందు సాధ్యమైనంత ఎక్కువగా రోగి పని చేసేలా సాధ్యమైనంత కార్యనిర్వాహక ఫలితం పొందడానికి ఇది సాధారణంగా రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీతో ముడిపడివుంటుంది.

రేడియోథెరపి

హై గ్రేడ్‌ కోండ్రోసర్కోమా గల రోగుల్లో చికిత్సగా రేడియోథెరపి ఉపయోగించబడుతుంది, ప్రత్యేకించి దీనిని అసంపూర్ణంగా తొలగించినప్పుడు లేదా ఉన్న లొకేషన్‌ కారణంగా సర్జరీతో దీనిని తొలగించలేనప్పుడు. రేడియోథెరపి రోజుకు ఒకసారి, కనీసం 6 వారాల పాటు వారానికి 5 రోజులు ఇవ్వబడుతుంది. సాధారణంగా ప్రామాణిక బాహ్య బీమ్‌ రేడియోథెరపి ఇవ్వబడుతుంది, కానీ శరీరంలో లోతుగా తిష్టవేసిన క్యాన్సర్‌లు ప్రోటాన్‌ బీమ్‌ రేడియోథెరపి మంచి ఎంపిక అవుతుంది. మెటాస్టాటిక్‌ లేదా స్టేజ్‌ 4 కోండ్రోసర్కోమాస్‌ గల రోగులకు, లక్షణాలను నియంత్రించేందుకు 1-10 చికిత్సలు ఉండే పాల్లియేటివ్‌ రేడియోథెరపి ఉపయోగించబడుతుంది.

కీమోథెరపి

దశ 4 వ్యాధి ఉన్నట్లుగా రోగనిర్థారణ చేయబడిన రోగులకు, వ్యాధిని అదుపుచేయడానికి కీమోథెరపిని ఉపయోగించవచ్చు. ఉపయోగించే ఔషధాల్లో సిస్ప్లాటిన్ మరియు డోక్సోరుబిసిన్ ఉంటాయి.

ఇది పిల్లల్లో మరియు వయోజనుల్లో యుక్త వయస్సులో ఎక్కువ సామాన్యంగా, కానీ ఏ వయస్సులోనైనా కలగగల ఒక రకం క్యాన్సర్‌. ఇది అత్యంత సామాన్యంగా పెల్విస్‌, ఫెమర్‌ (తొడ ఎముక) మరియు టిబియా (కాలు ఎముక)లో కలుగుతుంది. ఈ రకమైన సర్కోమా శరీరంలోని మెత్తని కణజాలాల్లో ఎముక బయట నుంచి కూడా ఉత్పన్నం కావచ్చు మరియు వీటన్నిటినీ కలిపి ఎవింగ్స్‌ కణితుల కుటుంబం అని అంటారు.

ఎవింగ్స్‌ సర్కోమా లక్షణాలు

ఎవింగ్స్‌ సర్కోమా గల రోగుల్లో కలిగే మామూలు లక్షణాల్లో ఎముకలో లేదా అవయవం కదలకలో ప్రమేయం ఉన్న, కదలిక తగ్గిన కీలులో నొప్పి మరియు వాపు ఉన్నాయి. ఇతర లక్షణాల్లో జ్వరం, రాత్రి చెమటలు, ఆకలి మరియు బరువు తగ్గడం ఉంటాయి. ఇతర నిర్దిష్ట లక్షణాలు క్యాన్సరు మూల స్థానంపై ఆధారపడి ఉంటాయి.

ఎవింగ్స్‌ సర్కోమాకు చికిత్స

ఎవింగ్స్‌ సర్కోమాకు చికిత్స ఎంపికల్లో కీమోథెరపి, సర్జరీ మరియు రేడియోథెరపి ఉంటాయి మరియు ఇవి ఈ కింద ఇవ్వబడ్డాయి.

కీమోథెరపి

ఇది సాధారణంగా ఈ స్థితిలో పరిగణించబడే మొదటి చికిత్స. ఇది ఔషదాల సమ్మేళనం మరియు సర్జరీ, రేడియోథెరపి లేదా రెండూ ఉన్న బహుళ-విధానాల వైఖరిలో భాగం. ఉపయోగించిన ఔషధాల్లో విన్‌క్రిస్టిన్‌, ఐఫోస్ఫామైడ్‌, డోక్సోరుబిసిన్‌, ఎటోపోసైడ్‌, సైక్లోఫాస్ఫమైడ్‌ ఉంటాయి. ఈ చికిత్స ఉధృతంగా ఉంటుంది మరియు సర్జరీకి ముందు దాదాపు 3 నెలల పాటు ఇవ్వబడుతుంది. ఆపరేషన్‌కి ముందు క్యాన్సరును తగ్గించే మంచి అవకాశం కీమోథెరపికి ఉంది. ఈ చికిత్స జి- సిఎస్‌ఎఫ్‌తో పాటు ఇవ్వబడుతుంది, తెల్ల రక్త కణాలు త్వరగా రికవరి కావడానికి ఇది సహాయపడుతుంది. కీమోథెరపి యొక్క మామూలు దుష్ప్రభావాల్లో అలసట, వికారం, వాంతులు, తక్కువ రక్త కౌంట్‌లు, ఇన్ఫెక్షన్‌ మరియు రక్తస్రావం ప్రమాదం, జుట్టు ఊడటం, నీళ్ళ విరేచనాలు, మలబద్ధకం ఉంటాయి. ఏ చికిత్స ఎంపిక చేయబడిందనే దానిపై ఆధారపడి సర్జరీ లేదా రేడియోథెరపి తరువాత కీమోథెరపి లేదా రెండూ మళ్ళీ ఇవ్వబడతాయి. మొత్తం 6 నెలల వరకు కీమోథెరపి పరిగణించబడుతుంది.

సర్జరీ

ఎవింగ్స్‌ సర్కోమా చికిత్సలో సర్జరీ ముఖ్యమైన భాగంగా ఉంటుంది. కీమోథెరపితో కలిపి ఇది అత్యధిక మంది రోగుల్లో ప్రధాన చికిత్సను ఏర్పరుస్తుంది మరియు రెండు చికిత్సల సమ్మేళనం వ్యాధిని మెరుగ్గా నియంత్రించే మరియు నయం చేసే అవకాశాలను పెంచుతుంది.
సర్జికల్‌ రీసెక్షన్‌ అంగవిచ్ఛేదనం కావచ్చు, ఇక్కడ ప్రభావిత కాలు/చేతిని తొలగించడం జరుగుతుంది లేదా లింబ్‌ స్పేరింగ్‌ని ఎంచుకోవడం జరుగుతుంది, ఇక్కడ కణితి తగినంత మార్జిన్‌తో తొలగించబడుతుంది మరియు కాలు/చేయి వదిలేయబడుతుంది. వెడల్పాటి రీసెక్షన్‌లో కాలు/చేయి పనితనాన్ని ప్రభావితం చేయకుండానే చుట్టూ ఉన్న మామూలు కణజాలంతో క్యాన్సరును తొలగించడం ఉంటుంది.
అంగవిచ్ఛేదనం చేయబడితే, పొరుగున ఉన్న కీలుతో సహా కాలు/చేయి మొత్తాన్ని తొలగించవచ్చు. ఆ అవయవం కదలడానికి లేదా ఇతర పనులు చేయడానికి ప్రొస్థెసిస్‌ని ధరించవచ్చు. కణితి ఉధృతంగా ఉన్నప్పుడు లేదా ప్రధాన రక్త నాళాలు లేదా నరాలు లాంటి దాని చుట్టూ ఉన్న ముఖ్యమైన నిర్మాణాలకు ప్రమేయం ఉన్నప్పుడు లేదా లింబ్‌ స్పేరింగ్‌ ఆపరేషన్‌ తరువాత తిరిగికలిగినప్పుడు అంగవిచ్ఛేదనం చేయబడుతుంది. అంగవిచ్ఛేదనం దుష్ప్రభావాల్లో ఫాంటమ్‌ నొప్పి ఉంటుంది, దీనిలో రోగి తొలగించబడిన అవయవం యొక్క ఒక భాగంలో నొప్పిని అనుభవించవచ్చు. ఇది కొంత కాలానికి మెరుగుపడుతుంది.
అంగవిచ్ఛేదనం కంటే లింబ్‌ స్పేరింగ్‌ సర్జరీ ఎక్కువ సామాన్యంగా చేయబడుతుంది. దీనిలో అవయవంలోని ఎముకలో కొంత భాగాన్ని తొలగిస్తారు మరియు తొలగించిన ఎముక స్థానంలో ప్రొస్థేసిస్‌ లేదా శరీరంలోని మరొక భాగం నుంచి ఎముకను పెట్టడం జరుగుతుంది. పనిచేయడానికి వీలుగా అవయవాన్ని స్థానంలో వదిలేయడం జరుగుతుంది.
ఏ ఆపరేషన్‌ని ఎంచుకోవాలనే విషయం క్యాన్సరు లొకేషన్‌, రోగి వయస్సు, ఎందుకంటే యువ రోగిలో ఎముకలు ఇప్పటికీ పెరుగుతుంటాయి, పరిగెత్తడం లాంటి రోగి యొక్క యాక్టివిటి లెవెల్‌ మరియు ఆపరేషన్‌ తరువాత కార్యనిర్వాహక ఫలితంపై ఆధారపడి ఉంటుంది.
ప్రాథమిక ఎముక క్యాన్సర్‌లకు చేసే అత్యధిక ఆపరేషన్‌లకు కోల్పోయిన కణజాలాలకు సరిపోయేలా ఏదో ఒక రకం
రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ అవసరమవుతుంది. సాధ్యమైనంత ఉత్తమ మార్గంలో శరీరంలోని ఆ భాగం పనితనాన్ని పునరుద్ధరించడం ఈ రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ లక్ష్యం. వివిధ రకాల ఈ సర్జరీలో తొలగించిన ఎముక స్థానంలో మెటల్‌ లేదా ప్లాస్టిక్‌ వస్తువు అయిన ఎండోప్రొస్థేసిస్‌ని పెట్టడం ఉంటుంది. ఆ అవయవం పనితనాన్ని పునరుద్ధరించేందుకు ప్రొస్థేసిస్‌ సహాయపడుతుంది. ప్రొస్థేసిస్‌ని రోగికి అనువుగా తయారుచేయడం జరుగుతుంది దీనివల్ల ఇది సర్జరీ తరువాత రోగికి కచ్చితంగా ఫిట్‌ అవుతుంది. కొన్ని సర్జరీల్లో ఎముక గ్రాఫ్ట్‌ అవసరమవుతుంది, ఇక్కడ రోగి యొక్క మరొక భాగం నుంచి లేదా మరొక వ్యక్తి నుంచి (అల్లోగ్రాఫ్ట్‌) ఎముక కొంత తొలగించబడుతుంది. ఈ ఎముక ముక్కను సర్జరీలో సృష్టించిన లోపంలో పెట్టడం జరుగుతుంది.

రేడియోథెరపి

ఎవింగ్స్‌ సర్కోమా గల రోగుల్లో సర్జరీ సాధ్యంకానప్పుడు లేదా కీమోథెరపితో పాటు సర్జరీ, స్పష్టమైన మార్జిన్‌లను సర్జరీ తరువాత సాధించలేకపోయినప్పుడు రేడియోథెరపి మామూలుగా ఉపయోగించబడుతుంది. శరీరంలోని ఏ భాగంలోనైనా ఎవింగ్స్‌ సర్కోమా కలిగించవచ్చు మరియు కొన్ని క్యాన్సర్లను వాటి లొకేషన్‌ని బట్టి, ఉదాహరణకు మెడలో, పుర్రె అడుగున, పొత్తికడుపు లేదా ఛాతీలో. ఆపరేషన్‌ తరువాత తొలగించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో, కీమోథెరపి కోర్సుల్లో లేదా తరువాత రేడియోథెరపి కోర్సు ఇవ్వబడుతుంది. రేడియోథెరపిని ఉపయోగించినప్పుడు, ప్రభావితమైన ఏరియాకు 5-6 వారాల పాటు రోజూ ఇవ్వబడుతుంది.

మెటాస్టాటిక్‌ వ్యాధి చికిత్స

మెటాస్టాటిక్‌ వ్యాధి అనేది స్టేజ్‌ 4 వ్యాధి, ఇక్కడ క్యాన్సరు తన మూలస్థానం నుంచి శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించివుంటుంది. స్టేజ్‌ 4 ఎవింగ్స్‌ సర్కోమా ఉండి కీమోథెరపి ఇవ్వబడేందుకు తగినంత ఫిట్‌గా ఉన్న రోగుల్లో పైన వివరించిన ఔషధాలతో కీమోథెరపి ఇవ్వబడుతుంది. ఈ విధానాలతో వ్యాధిని బాగా నియంత్రించవచ్చని భావిస్తే సర్జరీ మరియు రేడియోథెరపి లాంటి ఇతర ఎంపికలను చేర్చవచ్చు. ఈ దశలో చికిత్స ఎంపికలు చాలా వరకు రోగి నిర్దిష్టంగా ఉంటాయి మరియు రోగి స్థితి, వ్యాది ఉధృతి, రోగి కోరికలు మరియు ఆర్థిక స్థితిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోబడతాయి.

ఇవి ఎముకల్లో లేదా మచ్చల్లో కనిపించే క్యాన్సర్‌లు కావు. ఇవి క్యాన్సర్‌లు కావు కాబట్టి, ఇవి శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించవచ్చు. ఇవి స్థిరంగా ఉండొచ్చు లేదా మూలస్థానం నుంచి నెమ్మదిగా పెరగవచ్చు. ఇతర కారణాలతో పరీక్షలు చేసినప్పుడు నిరపాయకర కణితులు మామూలుగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో, ఇవి లక్షణాలు కలిగిస్తాయి. ఈ కణితుల్లో అత్యధికం సీరియల్‌ ఎక్స్‌రేలతో లేదా స్కాన్‌లతో కొంత కాలంలో చేయవచ్చు. లక్షణాలు కలిగిస్తున్న వీటికి చికిత్స అవసరం కావచ్చు. మామూలు కణితులు ఈ కింద ఇవ్వబడ్డాయి.

నిరపాయకర కణితులు ఏర్పరుస్తున్న ఎముక

  • ఓస్టోయిడ్‌ ఓస్టోమా
  • ఓస్టోబ్లాస్టోమా

నిరపాయకర ఎముక కణితులు ఏర్పరుస్తున్న కార్టిలేజ్

  • ఆస్టియోకోండ్రోమా
  • ఎంకోడ్రోమా
  • కోండ్రోమిక్సోయిడ్‌ ఫైబ్రోమా
  • కోండ్రోబ్లాస్టోమా

ఫైబర్‌తోకూడిన కణితులు

  • ఫైబర్‌తోకూడిన డైస్‌ప్లాసియా
  • ఆసిఫైయింగ్‌ ఫైబ్రోమా

సిస్ట్‌ని ఏర్పరుస్తున్న కణితులు

  • అనియూరైస్మల్‌ ఎముక సిస్ట్

ఇతరవి

ఎముక యొక్క భారీ కణ కణితి

ఇది ఎముక యొక్క నిరపాయకర కణితి, కానీ లక్షణాలు కలిగిస్తూ స్థానికంగా విస్తరించవచ్చు. ఇది యువతలో కనిపిస్తుంది మరియు సాధారణంగా మోకాలు పరిసరాల్లో ఉంటుంది. ఈ కణితుల్లో అత్యధిక వాటిని క్యూర్‌టేజ్‌ రూపంలో సర్జరీతో అదుపు చేయవచ్చు మరియు సర్జరీ తరువాత ఏ తావులోకి ఎముక సిమెంట్‌ ఎక్కించబడుతుంది. పెద్ద గాయాలకు, మరింత ఎగ్రెసివ్‌ సర్జరీ అవసరం కావచ్చు. ఆపరేషన్‌ చేయలేని లేదా సర్జరీ తరువాత తిరిగికలిగే కణితులకు డెనోసుమాబ్‌ అనే ఔషధంతో లేదా రేడియోథెరపితో చికిత్స చేయబడుతుంది. చాలా అప్పుడప్పుడు, ఈ కణితులు ఊపిరితిత్తులకు విస్తరించవచ్చు.