కార్సినోమా ఆఫ్‌ అన్‌నోన్‌ ప్రైమరీ (కప్‌)

కార్సినోమా ఆఫ్‌ అన్‌నోన్‌ ప్రైమరీ (కప్‌)

కార్సినోమా ఆఫ్‌ అన్‌నోన్‌ ప్రైమరీ అనేది మూల స్థానం తెలియని క్యాన్సరు. మామూలుగా ప్రతి క్యాన్సరుకు మూల స్థానం ఉంటుంది. ఉదాహరణకు, ఊపిరితిత్తుల క్యాన్సరు అనేది ఊపిరితిత్తుల్లో ప్రారంభమై శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించే క్యాన్సరు. ఉదాహరణకు కాలేయానికి వ్యాపించిన రొమ్ము క్యాన్సరు, కాలేయం క్యాన్సరు కాదు, కానీ కాలేయంలోని రొమ్ము క్యాన్సరు. కాలేయం క్యాన్సరు అనేది కాలేయంలో ప్రారంభమయ్యే మరియు మరెక్కడా రాని క్యాన్సరు.
కప్‌ అనేది మూల స్థానం తెలియని క్యాన్సరు మరియు ఇది సమస్య కావచ్చు.

ప్రాథమిక మూల స్థానం తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?

ప్రతి క్యాన్సరు, దాని మూల స్థానంపై ఆధారపడి భిన్నంగా ప్రవర్తిస్తుంది మరియు చికిత్స వ్యూహాలన్నీ క్యాన్సరు రకంపై ఆధారపడి ఉంటాయి. మళ్ళీ, ఉదాహరణకు, కాలేయంలోని రొమ్ము క్యాన్సరు కాలేయంలో ఊపిరితిత్తుల క్యాన్సరుకు భిన్నంగా చికిత్స చేస్తారు. కాబట్టి, చికిత్సను ప్రణాళిక చేయడానికి ముందు ఏ క్యాన్సరు మూల స్థానాన్ని అయినా నిర్థారించడం చాలా ముఖ్యం.

కొంతమంది రోగుల్లో మూల స్థానాన్ని కనుగొనండం ఎందుకు సాధ్యపడదు?

ప్రాథమిక సైట్‌ని కనుగొనడం కొంతమంది రోగుల్లో కష్టంగా ఉండొచ్చు. రోగికి క్యాన్సరు ఉన్నట్లుగా కనుగొనే సమయానికి, అది శరీరంలోని అనేక ప్రాంతాలకు విస్తరించివుంటుంది కాబట్టి, ఇది ఎక్కడ ప్రారంభమైందో డాక్టర్లకు కచ్చితంగా తెలియదు. అనేక సార్లు, ఆ సెట్టింగులో ప్రాథమిక సైట్‌ స్పష్టమవుతుంది, కానీ కొన్నిసార్లు ఇది కాదు.

కార్సినోమా ఆఫ్‌ అన్‌నోన్‌ ప్రైమరీని నిర్థారణ చేసినప్పుడు ఏ పరీక్షలు చేయబడతాయి?

మూల స్థానాన్ని కనుగొనేందుకు కార్సినోమా ఆఫ్‌ అన్‌నోన్‌ ప్రైమరీ గల రోగిలో అనేక పరీక్షలు చేయబడవచ్చు.

స్కాన్‌లు

సిటి స్కాన్‌, పిఇటి- సిటి స్కాన్‌ లేదా ఎంఆర్‌ఐ స్కాన్‌తో సహా వివిధ స్కాన్‌లను చేయవచ్చు. పిఇటి- సిటి స్కాన్‌ మామూలుగా చేయబడుతుంది మరియు సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉండటానికి మంచిది.

రక్త పరీక్షలు

క్యాన్సరు రకాన్ని నిర్థారించగల రక్త పరీక్షలు చేయబడతాయి. కణితి మార్కర్‌లు లాంటి నిర్దిష్ట రక్త పరీక్షలు కూడా సహాయపడతాయి.

బయాప్సీ

క్యాన్సరు బయాప్సీ మరియు పరీక్ష క్యాన్సరు మూలాన్ని గుర్తించడానికి సహాయపడతాయి. బయాప్సీ స్పెసిమెన్‌ని పరీక్షించినప్పుడు, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ (ఐహెచ్‌సి) లాంటి శాంపిల్‌పై ప్రత్యేక పరీక్షలు చేయబడతాయి మరియు ప్రాథమిక సైట్‌ని గుర్తించడానికి ఈ పరీక్షలు సహాయపడవచ్చు. కొన్నిసార్లు, ఐహెచ్‌సి పరీక్షలు ప్రాథమిక ఆలోచనను ఇవ్వవచ్చు, కానీ దాని గురించి కచ్చితంగా తెలియకపోవచ్చు. అప్పుడప్పుడు, బయాప్సీ శాంపిల్‌పై జన్యుపరమైన పరీక్ష వ్యాధి నిర్థారణలో సహాయపడవచ్చు.

కార్సినోమా ఆఫ్‌ అన్‌నోన్‌ ప్రైమరీకు ఎలా చికిత్స చేస్తారు?

సాధారణంగా, క్యాన్సర్‌ ఆఫ్‌ అన్‌నోన్‌ ప్రైమరీ సెట్టింగులో, వ్యాధి శరీరంలోని విభిన్న భాగాలకు విస్తరించివుండి దీనిని దశ 4 వ్యాధిగా చేస్తుంది. కాబట్టి, చికిత్స వ్యూహంలో కీమోథెరపి లాంటి చికిత్స ఉంటుంది, ఇది శరీరంలోని భాగాలన్నిటికీ వెళ్ళగలుగుతుంది మరియు క్యాన్సరును నియంత్రించడానికి సహాయపడుతుంది. రోగిలో క్యాన్సరు మూల స్థానం కనుగొనబడితే, కనుగొన్న కణితి రకాన్ని బట్టి చికిత్స ప్రణాళిక చేయబడుతుంది. అనేక సార్లు, అనేక పరీక్షలు మరియు స్కాన్‌లు చేసినప్పటికీ, ప్రాథమిక మూల స్థానం తెలియదు మరియు అనేక అవకాశాలను కవర్‌ చేసేందుకు ‘‘విస్త్రుత ఆధారిత’’ చికిత్స విధానం ఉపయోగిస్తారు. నిర్దిష్ట లక్షణాలను నియంత్రించేందుకు రేడియోథెరపి లాంటి ఇతర చికిత్సలు కూడా ఉపయోగించబడతాయి.