Germ cell tumours

జెర్మ్ సెల్ ట్యూమర్లు

జెర్మ్ కణాలు మగవారిలో పురుషబీజకణం మరియు ఆడవారిలో అండములని ఉత్పత్తి చేయు శరీరంలోని కణాలు. ఈ కణాల నుండి వృద్ధిచెందు ట్యూమర్లు లేదా క్యాన్సర్లను జెర్మ్ సెల్ ట్యూమర్లు అంటారు.

జెర్మ్ సెల్ ట్యూమర్ల రకాలు

జెర్మ్ సెల్ ట్యూమర్లు అనేక రకాలుగా ఉంటాయి మరియు అవి క్రింద ఇవ్వబడ్డాయి.

వృషణాలలో ట్యూమర్లు (మగవారిలో)

  • – సెమినోమా
  • – టెరటోమా

అండాశయంలో ట్యూమర్లు (ఆడవారిలో)

  • – టెరటోమా
  • – డైస్జెర్మినోమా
  • – మిక్స్‌‌డ్ ట్యూమర్

ఇతరములు

  • – మెడియాస్టినల్ జెర్మ్ సెల్ ట్యూమర్లు (ఛాతీలో)
  • – మెదడులోని జెర్మ్ సెల్ ట్యూమర్లు

వృషణాల జెర్మ్ సెల్ ట్యూమర్ల కొరకు, దయచేసి టెస్టిక్యులర్ ట్యూమర్ల సెక్షన్‌‌ను చూడండి. ఇతర రకాల కొరకు క్రింద చూడండి. స్త్రీలలో, 15-30 సంవత్సరాల మధ్య తక్కువ వయసు గల వారిలో జెర్మ్ సెల్ ట్యూమర్లు సంభవిస్తాయి. నిరపాయమైన ట్యూమర్ అయిన పరిపక్వ టెరాటోమా అనేది అన్నింటిలోకి అత్యంత సాధారణ ట్యూమర్.

ఒవేరియన్ జెర్మ్ సెల్ ట్యూమర్లు

అండాశయపు జెర్మ్ సెల్ ట్యూమర్లను నిరపాయమైన మరియు ప్రాణాంతక ట్యూమర్లుగా విభజించవచ్చు. నిరపాయమైన ట్యూమర్లలో అండాశయం యొక్క పరిపక్వ టెరాటోమా కుడా ఉంటుంది.

ప్రాణాంతక ట్యూమర్లలో అపరిపక్వ టెరాటోమా, డైస్జెర్మినోమా, పచ్చసొన ట్యూమర్, కొరియోకార్సినోమా మరియు ఎంబ్రియోనల్ కార్సినోమాలు ఉంటాయి.

అబ్డామెన్‌‌లో వాపు మరియు నొప్పి, క్రమంగా రాని పీరియడ్లు మరియు అబ్డామెన్‌‌లో వాచినట్టుగా అనిపించడం అనేవి జెర్మ్ సెల్ ట్యూమర్లతో సంబంధం గల సాధారణ లక్షణాలు.

టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించినపుడు, ఈ క్రింది పరీక్షలు పరిగణించబడతాయి.

అబ్డామెన్‌‌కు అల్ట్రాసౌండ్ స్కాన్

అబ్డామెన్‌ యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామెన్‌‌‌లోని వాపు గురించి మరియు ట్యూమర్ కారణంగా అండాశయాలు సాధారణంగా ఉన్నయా లేదా పరిమాణం పెరిగిందా అనే సమాచారాన్ని ఇవ్వగలవు.

రక్త పరీక్షలు

ట్యూమర్ మార్కర్లు అనేవి క్యాన్సర్ ఉనికిని పరీక్షించడానికి చేసే రక్త పరీక్షలు. ట్యూమర్ మార్కర్లు కొన్ని నిర్దిష్ఠ జెర్మ్ సెల్ ట్యూమర్లలో పెరగవచ్చు కావున అటువంటి క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించబడిన రోగులందరిలోను ఈ పరీక్షలు చేయబడతాయి. సాధారణంగా పరిగణింపబడే ట్యూమర్ మార్కర్లు, ఆల్ఫా ఫెటో ప్రోటీన్ (AFP), B హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోఫిన్ (b HCG) మరియు LDH. ట్యూమర్ మార్కర్లు కాకుండా, కాలేయం, మూత్రపిండాల పనితీరును అంచనా వేయడానికి క్రమమైన రక్త పరీక్షలు జరుగుతాయి.

స్టేజింగ్ అనేది క్యాన్సర్ దాని మూలం నుండి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి సహాయపడే ప్రక్రియను సూచిస్తుంది.

ఛాతీ ఎక్స్-రే

ఛాతీలో క్యాన్సర్ వ్యాప్తి చెందినదో లేదో తెలుసుకోవడానికి ఛాతీ ఎక్స్-రే తీయబడుతుంది.

CT స్కాన్

ఒవేరియన్ జెర్మ్ సెల్ ట్యూమర్ ఉన్నట్లు అనుమానించబడిన రోగి దశను తెలుసుకోవడానికి వ్యత్యాసంతో కూడిన చెస్ట్ అబ్డామెన్ మరియు పెల్విస్ CT స్కాన్ చేయబడుతుంది. క్యాన్సర్ లేదా ట్యూమర్ శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందా లేదా అనే దాని గురించి ఈ స్కాన్ సమాచారం ఇస్తూ, ఏ చికిత్స ఇవ్వబడుతుందో ఇది నిర్ణయిస్తుంది

PET CT స్కాన్

జెర్మ్ సెల్ క్యాన్సర్ స్టేజింగ్‌‌కు PET CT స్కాన్ సాధారణంగా సిఫారసు చేయబడదు కాని క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలలో వ్యాప్తి చెందుతుందని అనుకునే పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది.

ఈ ట్యూమర్లు శరీరంలోని ట్యూమర్ లేదా క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని బట్టి 1వ దశ నుండి 4వ దశ వరకు చూపబడతాయి.

1వ దశ

ట్యూమర్ అండాశయంలో మాత్రమే ఉంటుంది మరియు ఒక లేదా రెండు అండాశయాలలోనూ ఉంటుంది

2వ దశ

2వ దశలో, ట్యూమర్ అండాశయం నుండి ఫెలోపియన్ ట్యూబ్, గర్భసంచి (గర్భాశయం) వంటి సమీప అవయవాలకు లేదా కటి(పెల్విస్)లోని ప్రాంతాలు (కడుపు యొక్క దిగువ భాగం) కు వ్యాప్తి చెందుతుంది.

3వ దశ

3వ దశలో, ట్యూమర్ లేదా క్యాన్సర్ అబ్డామెన్‌‌లోని శోషరస కణుపులు లేదా అబ్డామెన్ యొక్క అన్ని అవయవాలపై లైనింగ్ అయినటువంటి పెరిటోనియం లాంటి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది.

4వ దశ

4వ దశలో, ఊపిరితిత్తులు లేదా కాలేయం వంటి శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది.

ఒవేరియన్ జెర్మ్ సెల్ ట్యూమర్లకు చికిత్స ఎంపికలు ట్యూమర్ నిరపాయమైనదా లేదా ప్రాణాంతకమైనదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు ప్రాణాంతకమైతే, రోగ నిర్ధారణ సమయంలో క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటుంది.

ఈ ట్యూమర్ల శస్త్రచికిత్స నిర్వహణలో ఒకటి లేదా రెండు అండాశయాలను, ఆ రెండూ ప్రభావితమయ్యాయా లేదా అనే దానిపై ఆధారపడి తొలగించడం జరుగుతుంది. భవిష్యత్తులో పిల్లల్ని కనాలని కోరుకునే చిన్న వయసు గల మహిళలలో, వీలుని బట్టి ఒక అండాశయం తొలగించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లల కొరకు ప్రణాళిక లేని మహిళలలో, అండాశయాలతో పాటు గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌‌లు కూడా తొలగించబడతాయి. వ్యాధి అధునాతన దశలో ఉన్న రోగులలో, క్యాన్సర్ బారిన పడిన ఇతర ప్రాంతాలైన శోషరస కణుపులు, పెరిటోనియం మొదలైనవి కూడా తొలగించబడతాయి. 2 లేదా 3వ దశలో ఉన్న రోగులలో కూడా అన్ని ట్యూమర్లను తొలగించడమే శస్త్రచికిత్స యొక్క లక్ష్యం.

ప్రాణాంతక ఒవేరియన్ జెర్మ్ సెల్ ట్యూమర్లతో బాధపడుతున్న చాలా మంది రోగుల నిర్వహణలో కీమోథెరపీని సాధారణంగా ఉపయోగిస్తారు. ప్రారంభ 1వ దశ ట్యూమర్లు ఉన్నవారు మాత్రమే ఈ చికిత్స నుండి ప్రయోజనాన్ని పొందరు. కీమోథెరపీ వ్యాధిని నియంత్రించడానికి మరియు నయం చేయడానికి ఉద్దేశించబడింది. కీమోథెరపీ అవసరం మరియు ఉపయోగించిన మందుల ఎంపిక అనేది క్యాన్సర్ రకం మరియు రోగనిర్ధారణ సమయంలో క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటుంది.

డైస్జెర్మినోమా

కీమోథెరపీని డైస్జెర్మినోమాస్ చికిత్సలో ఉపయోగిస్తారు. సాధారణంగా ఉపయోగించే మందులలో కార్బోప్లాటిన్, EP లేదా BEP కెమోథెరపీ ప్రక్రియలు ఉంటాయి. BEP ప్రక్రియలో బ్లోమైసిన్, ఎటోపోసైడ్ మరియు సిస్ప్లాటిన్ మందులు ఉంటాయి. ఎంచుకున్న మందులు క్యాన్సర్ దశ మరియు రోగి యొక్క సాధారణ స్థితి మరియు ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటాయి. ప్రారంభ దశ ట్యూమర్లలో, కీమోథెరపీని శస్త్రచికిత్స తరువాత పరిగణిస్తారు మరియు అధునాతన దశలలో, కీమోథెరపీని ప్రప్రధమ చికిత్సగా ఉపయోగించవచ్చు. EP లేదా BEP కెమోథెరపీని ప్రతి 3 వారాల క్రమాలుగా ఇస్తారు. 3 వారాల వ్యవధిలో, ఎంపిక చేయబడిన ప్రక్రియను బట్టి 3 లేదా 5 రోజులలో చికిత్స ఇవ్వబడుతుంది.

నాన్-డైస్జెర్మినోమా క్యాన్సర్లు

అపరిపక్వ టెరాటోమా, పచ్చసొన ట్యూమర్, ఎంబ్రియోనల్ కార్సినోమాస్ మరియు మిక్స్‌‌డ్ జెర్మ్ సెల్ ట్యూమర్లనేవి డైస్జెర్మినోమా కాకుండా ఇతర క్యాన్సర్లు. ఈ ట్యూమర్ల చికిత్స ఎంపికలు రోగనిర్ధారణ సమయంలో క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటాయి. ప్రారంభ క్యాన్సర్లలో, శస్త్రచికిత్స తప్ప కీమోథెరపీ ఉపయోగించవలసిన అవసరం లేదు, కాగా మరింత అధునాతన క్యాన్సర్లలో కీమోథెరపీ ప్రయోజనకరంగా ఉంటుంది. పైన వివరించిన విధంగా, ఇక్కడ సాధారణంగా ఉపయోగించే కీమోథెరపీ ఎంపిక BEP. సాధారణంగా 4 క్రమాలు ఇవ్వబడతాయి.

మెడియాస్టినల్ జెర్మ్ సెల్ ట్యూమర్లు

మెడియాస్టినమ్ అనేది ఊపిరితిత్తుల మధ్యన ఛాతీలోని శరీర భాగం. మెడియాస్టినమ్ ఛాతీ, ఆహారవాహిక (గల్లెట్) మరియు శోషరస కణుపులలోని ప్రధాన రక్త నాళాలను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో వృద్ధి చెందుతున్న జెర్మ్ సెల్ ట్యూమర్లను మెడియాస్టినల్ జెర్మ్ సెల్ ట్యూమర్లు అంటారు.

మెడియాస్టినమ్‌లోని జెర్మ్ సెల్ ట్యూమర్లు వృషణాలు లేదా అండాశయాలలో కనిపించే రకంగానే ఉంటాయి. మెడియాస్టినల్ జెర్మ్ సెల్ ట్యూమర్ ఉన్నట్లు అనుమానించినపుడు లేదా కనపడినపుడు, అది మెడియాస్టినమ్‌లో మాత్రమే ప్రారంభమయ్యిందని మరియు అండాశయం లేదా వృషణాలలో కాకుండా మరియు అక్కడ వ్యాపించి లేదని నిర్ధారించుకోవడానికి స్కాన్‌‌లు మరియు పరీక్షలు చేస్తారు.

దగ్గు, ఛాతీ నొప్పి, ఛాతీలో భారం, బరువు తగ్గడం, శ్వాస తీసుకోలేకపోవడం లేదా మింగడంలో ఇబ్బందులు అనేవి మెడియాస్టినల్ ట్యూమర్లచే కనబరచు లక్షణాలు.

ఒకసారి మెడియాస్టినల్ జెర్మ్ సెల్ ట్యూమర్‌‌ని కనుగొన్న తరువాత, రోగ నిర్ధారణ చేయడానికి మరియు వ్యాధి దశను తెలుసుకోవడానికి క్రింది పరీక్షలు చేస్తారు.

కంప్లీట్ బ్లడ్ పిక్చర్‌, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ పరీక్షలు, LDH, ఆల్ఫా ఫెటో ప్రోటీన్ (AFP) మరియు బీటా HCG ‌తో కూడిన రక్త పరీక్షలు. ఈ సెట్టింగ్‌‌లో చెస్ట్ ఎక్స్-రే, చెస్ట్ అబ్డామెన్ మరియు పెల్విస్ CT స్కాన్ లేదా టోటల్ బాడీ PET-CT స్కాన్ సహా ఇతర పరీక్షలు జరుపబడతాయి.

మెడియాస్టినల్ జెర్మ్ సెల్ ట్యూమర్ల కొరకు చికిత్స అనేది, ట్యూమర్ సెమినోమా రకమా (మగవారిలో సెమినోమా లేదా ఆడవారిలో డైస్జెర్మినోమా) లేదా మరొక రకమా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

20-40 సంవత్సరాల వయస్సు గల రోగులలో సాధారణమైన మెడియాస్టినల్ సెమినోమాస్ లేదా డైస్జెర్మినోమాస్ అనేవి సాధారణంగా BEP ప్రక్రియతో కాంబినేషన్ కీమోథెరపీతో చికిత్స జరుపబడతాయి. BEP అనేది బ్లోమైసిన్, ఎటోపోసైడ్ మరియు సిస్ప్లాటిన్ అనే మందుల కలయిక. 4 క్రమాల వరకు ప్రతి 3 వారాలకు ఇది బొట్లు బొట్లుగా ఇవ్వబడుతుంది. ప్రతి క్రమంలో, చికిత్స సాధారణంగా 5 రోజులు ఉంటుంది. కొంతమంది రోగులలో, బ్లోమైసిన్‌‌ను తీసివేసి, EP కీమోథెరపీ ఇవ్వబడుతుంది.

రేడియోథెరపీ అనేది కీమోథెరపీ చేయలేని రోగులకు చికిత్స కొరకు ఒక ఎంపిక, కానీ సామాన్యంగా తక్కువగా ఉపయోగించబడుతుంది. ఒకవేళ ఇచ్చినట్లయితే, ఇది 5 వారాలకు పైగా జరుగుతుంది.

ఈ పరిస్థితిలో సర్జరీ అనేది చికిత్స ఎంపిక‌గా చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది

నిరపాయమైన ట్యూమర్లుగా పరిగణించబడే పరిపక్వ టెరాటోమాస్‌, సర్జరీచే తొలగించడం ద్వారా చికిత్స చేయబడుతుంది.

ప్రాణాంతక ట్యూమర్లు లేదా క్యాన్సర్‌గా పరిగణించబడే అపరిపక్వ టెరాటోమాస్‌, కీమోథెరపీతో మరియు సర్జరీకి ముందు లేదా తరువాత ఇచ్చే కీమోథెరపీతో చికిత్స చేయబడుతుంది.

మిక్స్‌‌డ్ జెర్మ్ సెల్ ట్యూమర్లు, పచ్చసొన సాక్ లేదా ఎంబ్రియోనల్ కార్సినోమాస్ వంటి ఇతర మెడియాస్టినల్ జెర్మ్ సెల్ ట్యూమర్లకు కీమోథెరపీతో చికిత్స అందించబడుతుంది. సాధారణంగా ఉపయోగించే ప్రక్రియలు పైన వివరించిన విధంగా BEP లేదా సిస్ప్లాటిన్, ఎటోపోసైడ్ మరియు ఐఫోస్ఫామైడ్ కలిసివున్న VIP.