హాడ్జ్ కిన్ లింఫోమా

లింఫోమా

లింఫోమా అనేది లింఫటిక్ సిస్టమ్ క్యాన్సరు. లింఫటిక్ సిస్టమ్ లో శరీరం అంతటా ఉండే లింఫ్ నోడ్స్‌, ఈ లింఫ్ నోడ్స్ ని పరస్పరం కనెక్ట్‌ చేసే లింఫ్ నాళాలు ఉంటాయి. ప్లీహం, థైమస్ గ్రంథి, ఎముక మూలుగ మరియు టాన్సిల్స్‌ లాంటి అవయవాలు కూడా లింఫటిక్ సిస్టమ్ లో భాగంగా ఉంటాయి. రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలైన లింఫోసైట్స్ మరియు ఎముక మూలుగ కూడా లింఫటిక్ సిస్టమ్ లో భాగంగా ఉంటాయి.

అవయవాల నుంచి ద్రవాన్ని బయటకు పంపడం మరియు ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని కాపాడటం లింఫటిక్ సిస్టమ్ యొక్క విధి. శరీరంలోని ఒక భాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలోని నింఫ్ నోడ్స్ శరీరంలోని ఇతర భాగాలకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఆపుతాయి మరియు ఆపడానికి ప్రయత్నిస్తాయి. మామూలుగా కనిపించినట్లుగా ఇది లింఫ్ నోడ్స్ పెరగడానికి దారితీస్తుంది.

లింఫోమా రకాలు

లింఫోమా ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒక దానిని హాడ్జ్ కిన్స్ లింఫోమా అని మరియు మరొక దానిని నాన్ హాడ్జ్ కిన్స్ లింఫోమా అని అంటారు.

హాడ్జ్ కిన్స్ లింఫోమా

ఈ స్థితిని కనుగొన్న వ్యక్తి పేరు హాడ్జ్ కిన్స్ లింఫోమాకు పెట్టబడింది. సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు, ఈ లింఫోమాలో రీడ్ స్టెర్న్ బెర్గ్‌ సెల్ అనే ఒక రకం సెల్ ఉంది. ఈ లింఫోమా ఇతర లింఫోలాకు భిన్నంగా ఉంటుంది మరియు ప్రవర్తిస్తుంది మరియు నాన్ హాడ్జ్ కిన్స్ లింఫోమాకు భిన్నంగా చికిత్స చేయబడుతుంది. మొత్తం లింఫోమాస్ లో ఇది దాదాపు 20% ఉంది.

మైక్రోస్కోప్ లో ఎలా కనిపిస్తుందనే దానిని బట్టి హాడ్జ్ కిన్స్ లింఫోమా అనేక రకాలుగా ఉండొచ్చు. వీటిని ఈ కింది విధంగా వర్గీకరించవచ్చు

  • క్లాసికల్ హాడ్జ్ కిన్స్ లింఫోమా
  • నోడ్యులర్ స్లెరోసింగ్
  • మిశ్రమ సెల్యులారిటి
  • లింఫోసైట్ ప్రీడామినంట్
  • లింఫోసైట్ డిప్లీటెడ్
  • నోడ్యులర్ లింఫోసైట్ ప్రీడామినంట్ రకం

అంతర్జాతీయ డేటా 2 0 1 8 ప్రకారం, 2 0 1 8 లో భారతదేశంలో 9 1 1 5 కొత్త హాడ్జ్ కిన్స్ లింఫోమా క్యాన్సర్లు నమోదయ్యాయి, మొత్తం క్యాన్సర్లలో దీని వాటా 0.7 9%.

హాడ్జ్ కిన్స్ లింఫోమా అనేక లక్షణాలు కలిగిస్తుంది. ప్రారంభ దశ వ్యాధి గల రోగుల్లో, లక్షణాలు అతితక్కువగా ఉండొచ్చు లేదా లేకపోవచ్చు.

లింఫ్ నోడ్స్ వాపు మరియు పెరగడం

శరీరంలో లింఫ్ గ్రంథులు పెరగడం మామూలుగా కనిపించే లక్షణం. ఇది మెడలో, బాహు మూల కింద, గజ్జల్లో లేదా ఛాతీ లేదా పొట్ట లాంటి శరీరంలోని ఇతర భాగాల్లో ఉండొచ్చు. ఈ వాపులు సాధారణంగా నొప్పిలేకుండా ఉంటాయి, కానీ అప్పుడప్పుడు నొప్పి కలిగించవచ్చు. ఇన్ఫెక్షన్లతో సహా అనేక కారణాల వల్ల లింఫ్ నోడ్స్ పెరగవచ్చు మరియు కానీ ఎల్లప్పుడూ లింఫోమా వల్ల కాదు.

ఇతర లక్షణాలు

హాడ్జ్ కిన్స్ లింఫోమాతో మామూలుగా ముడిపడివుండే ఇతర లక్షణాల్లో జ్వరం, బరువు తగ్గడం, రాత్రిళ్ళు ఎక్కువగా చెమటలుపోయడం, చర్మం దురద, దగ్గు, శ్వాస తీసుకోవడంలో కష్టం లేదా పొట్ట నొప్పి ఉంటాయి.
రక్తహీనత వల్ల లక్షణాలు లేదా కమలడం, రక్తస్రావం లేదా ఇన్ఫెక్షన్లు లాంటి లక్షణాలు కలగవచ్చు ఒకవేళ హాడ్జ్ కిన్స్ లింఫోమా వల్ల ఎముక మూలుగకు ప్రమేయం ఉంటే.

లింఫోమాలను అనుమానించినప్పుడు, హాడ్జ్ కిన్ లేదా నాన్- హాడ్జ్ కిన్ లింఫోమా, సాధారణంగా ఈ కింది పరిశోధనలు చేస్తారు.

బయాప్సీ

లింఫోమా ఉందా అనే విషయం ధ్రువీకరించుకునేందుకు పెరిగిన లింఫ్ నోడ్ యొక్క బయాప్సీ చేయబడుతుంది. ఇది కోర్ బయాప్సీ (లింఫ్ నోడ్ కోర్) లేదా లింఫ్ నోడ్ మొత్తం తొలగించబడే ఎక్సిషన్ బయాప్సీ అయివుండొచ్చు, ఎఫ్ ఎన్ ఎ సి అనే మరొక రకం బయాప్సీని ఈ సెట్టింగులో చేయరు. ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ (ఐ హెచ్ సి) మార్కర్స్ అనేవి నిర్దిష్ట రకం లింఫోమాను గుర్తించేందుకు బయాప్సీ శాంపిల్ పై చేయబడే ప్రత్యేక పరీక్షలు. కొన్నిసార్లు, కచ్చితమైన లింఫోమా రకాన్ని తెలుసుకునేందుకు మరియు సరైన చికిత్సను నిర్థారించేందుకు అనేక ఐ హెచ్ సి మార్కర్లు పరీక్షించబడతాయి. లింఫ్ నోడ్ కి వేరుగా గడ్డ లేదా మాస్ ఉంటే, గడ్డకు బయాప్సీ చేయబడుతుంది. కొన్ని రకాల లింఫోమాలు ఉన్నాయా లేదా అనే విషయం ధ్రువీకరించుకునేందుకు క్రోమోజోమ్స్ లో అసాధారణతల కోసం కొన్నిసార్లు జన్యుపరమైన పరీక్షలు చేయబడతాయి.

సిటి స్కాన్ లేదా పిఇటి-సిటి స్కాన్

సిటి స్కాన్ లేదా పిఇటి- సిటి స్కాన్ అనేది లింఫోమా ఏ మేరకు వ్యాపించిందో చూసేందుకు చేసే అనువైన పరీక్ష. వ్యాధి స్థితి ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు స్కాన్ తీస్తారు మరియు శరీరంలో క్యాన్సరు ఎక్కడ ఉందనే సమాచారం ఇస్తుంది. లింఫోమాను మరియు దశను నిర్థారణ చేసేందుకు సిటి స్కాన్ కంటే పిఇటి-సిటి స్కాన్ మెరుగైనది. చికిత్సకు క్యాన్సరు ఎంత బాగా స్పందిస్తోందో తెలుసుకునేందుకు, లింఫోమాకు కీమోథెరపి చేయించుకుంటున్న రోగుల్లో కూడా ఈ స్కాన్లు తీస్తారు.

ఎముక మూలుగ బయాప్సీ

ఎముక మూలుగ నుంచి కణాల శాంపిల్ని తీయడం ఎముక మూలుగ బయాప్సీలో ఉంటుంది. ఎము మూలుగ లోకి ఈ క్యాన్సరు వ్యాప్తిని చూసేందుకు లింఫోమాలో ఇది ముఖ్యమైన పరీక్ష. స్థానికంగా మత్తుమందు ఇచ్చి ఈ బయాప్సీ చేయబడుతుంది. మూలుగలో వ్యాధి దేనినీ పిఇటి-సిటి స్కాన్ చూపించని రోగుల్లో ఎముక మూలుగ పరీక్ష చేయబడకపోవచ్చు.

రక్త పరీక్షలు

వివిధ అవయవాల పనితనాలను మదింపు చేసేందుకు సిబిపి, ఇఎస్ఆర్, ఎల్ డి హెచ్, కాలేయం పనితనం పరీక్షోలు, క్రియేటినిన్, ఎలక్ట్రోలైట్స్ లాంటి అనేక రక్త పరీక్షలు చేయబడతాయి.

ఇతర పరీక్షలు

వ్యాధి గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఎక్స్ రేలు, పొత్తికడుపుకు అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కాన్లు లాంటి ఇతర పరీక్షలు కూడా కొన్ని పరిస్థితుల్లో చేయబడతాయి. ఫ్లూయిడ్ శాంపిల్ ని తీసుకోవడానికి వెన్నెముకలోకి సూది గుచ్చే లంబార్ పంక్చర్ కూడా చేయబడవచ్చు.

దశ 1

దశ 1లో, సింగిల్ లింఫ్ నోడ్ ప్రాంతం (1) లేదా సింగిల్ అదనపు లింఫటిక్ అవయవం ప్రమేయం ఉండటం లేదా లింఫ్ నోడ్ ప్రమేయం లేకుండా సైట్ (ఐఇ) ఉంటుంది. సింగిల్ లింఫ్ నోడ్ ప్రాంతంలో ఒక నోడ్ లేదా పక్క నోడ్ ల సమూహం ఉండొచ్చు.

దశ 2

దశ 2లో, డయాఫ్రామ్ (ఛాతీని మరియు పొత్తికడుపును వేరుచేసే కండరం) ఒక్కదాని యొక్క (2) లేదా పరిమిత, కంటిజియస్ అవయవంతో లేదా లింఫ్ నోడ్ (ఐఐఇ) కాని కణజాలంతో అదే వైపున రెండు లేదా ఎక్కువ లింఫ్ నోడ్ రీజియన్లకు ప్రమేయం ఉంటుంది.

దశ 3

దశ 3లో, డయాఫ్రామ్ యొక్క ఇరు వైపులా లింఫ్ నోడ్ ప్రాంతాలు లేదా లింఫోయిడ్ నిర్మాణాల ప్రమేయం ఉంటుంది.

దశ 4

దశ 4లో, సంబంధిత లింఫటిక్ ప్రమేయంతో లేదా లేకుండానే, అదనపు నాన్- కంటిజియస్ ఎక్స్ ట్రా లింఫటిక్ ప్రమేయం ఉంటుంది.ఈ కింది లక్షణాల్లో ఒకటి లేదా ఎక్కువ లేకపోవడాన్ని (ఎ) లేదా ఉండటాన్ని (బి) సూచించేందుకు లింఫోమాస్ అన్నిటినీ ఉప-వర్గీకరణ చేయడం జరుగుతుంది: 101 డిగ్రీల ఎఫ్ కంటే ఎక్కువ అకారణ జ్వరం, రాత్రిళ్ళు చెమటతో తడిచిముద్దవడం, లేదా రోగనిర్థారణకు ముందు ఆరు నెలల్లో శరీరం బరువు అకారణంగా 10 శాతం కంటే ఎక్కువగా తగ్గడం. బడలిక, దురద, మద్యంప్రేరేపిత నొప్పి బి లక్షణాలుగా పరిగణించబడవు, కానీ గమనించాలి.

హాడ్జ్ కిన్ లింఫోమాకు చికిత్స హాడ్జ్ కిన్ లింఫోమా దశ, ఉప రకం, రోగి వయస్సు మరియు సాధారణ ఫిట్ నెస్ లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రారంభ దశ హాడ్జ్ కిన్ లింఫోమా

ప్రారంభ దశ హాడ్జ్ కిన్ లింఫోమాకు కీమోథెరపి మరియు రేడియోథెరపి సమ్మేళనంతో చికిత్స చేయబడుతుంది. కీమోథెరపి సాధారణంగా ఎబివిడి అనే చికిత్సతో ఉంటుంది. ఇది డోక్సోరుబిసిన్, బ్లెయోమైసిన్, విన్ బ్లాస్టిన్ మరియు డకార్బజైన్ అనే 4 ఔషధాల సమ్మేళనం. దీనిని 2-4 దఫాలుగా సిరలోకి ఇస్తారు, ప్రతి దఫా 28 రోజులు ఉంటుంది. 28 రోజుల్లో, చికిత్స రెండు సార్లు ఇవ్వబడుతుంది, రోజు 1 న మరియు రోజు 15 న, ఆ తరువాత రేడియోథెరపి ఉంటుంది. ప్రారంభ దశకు రేడియోథెరపి 2-3 వారాలు ఉంటుంది.

ముదిరిన దశ హాడ్జ్ కిన్ లింఫోమా

ముదిరిన దశ హాడ్జ్ కిన్ లింఫోమాకు ప్రధానంగా కీమోథెరపితో చికిత్స చేస్తారు. సాధారణంగా ఎబివిడి చికిత్సను 4 దఫాలుగా చేస్తారు. కొన్నిసార్లు, రోగి స్థితిని బట్టి ఇతర కీమోథెరపి రెజిమెన్స్ ని ఉపయోగిస్తారు.

కొన్ని సెట్టింగ్స్ లో కీమోథెరపిని పూర్తిచేసిన తరువాత కన్సాలిడేషన్ చికిత్సగా రేడియోథెరపిని ఉపయోగిస్తారు.

రిలాప్స్ డ్ లేదా రిఫ్రాక్టరీ హాడ్జ్ కిన్ లింఫోమా

ప్రారంభ చికిత్సతో నియంత్రించిన తరువాత వ్యాధి తిరిగొచ్చినప్పుడు, దీన్ని తిరగబెట్టిన వ్యాధి అని అంటారు. చికిత్సకు వ్యాధి స్పందించనప్పుడు లేదా పాక్షికంగా మాత్రమే స్పందించినప్పుడు, దీనిని రిఫ్రాక్టరీ వ్యాది అంటారు.

తిరగబెట్టిన లేదా రిఫ్రాక్టరీ వ్యాధి ఉన్న పరిస్థితుల్లో, రోగి శారీరకంగా ఫిట్ గా ఉంటే, ఎముక మూలుగ ట్రాన్స్ ప్లాంట్ ని పరిగణిస్తే భిన్న కీమోథెరపి ఉపయోగించడం జరుగుతుంది.

కీమోథెరపి

హాడ్జ్ కిన్ లింఫోమా చికిత్సలో కీమోథెరపి ముఖ్య భాగం. ఈ స్థితిలో కీమోథెరపిని విభిన్న రూపాల్లో ఇస్తారు. ఉపయోగించే విభిన్నరకాల చికిత్సలు ఈ కింద ఇవ్వబడ్డాయి. ఈ రెజిమెన్లలో కొన్నిటినీ ప్రథమ శ్రేణి చికిత్సలుగా ఉపయోగిస్తారు, అంటే నిర్థారణ సమయంలో మరియు ఇతర వాటిని ప్రారంభ చికిత్స తరువాత లింఫోమా కలిగినప్పుడు ఉపయోగిస్తారు.

ఎబివిడి

ఇది హాడ్జ్ కిన్ లింఫోమాలో, ప్రత్యేకించి వ్యాధి ప్రారంభ దశలో ఉపయోగించే మామూలు కీమోథెరపి రెజిమెన్. ఎబివిడిలో నాలుగు ఔషధాలు ఉంటాయి, అడ్రియామైసిన్ (డోక్సోరుబిసిన్), బ్లెయోమైసిన్, విన్ బ్లాస్టిన్ మరియు డకార్బజైన్. ఈ చికిత్సను దఫదఫాలుగా ఇస్తారు, ప్రతి దఫా 2 8 రోజులు ఉంటుంది. 28 రోజుల్లో, చికిత్సను రోజు 1 మరియు రోజు 14న ఇస్తారు. వ్యాధి దశను బట్టి 2-4 దఫాలుగా ఇవ్వబడుతుంది.

స్టాన్ ఫోర్డ్‌ 5

ఈ రకమైన కీమోథెరపిని ప్రధానంగా అధిక దశ వ్యాధిలో ఉపయోగిస్తారు. ఈ రెజిమెన్ లో డోక్సోరుబిసిన్, విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టిన్, ముస్టైన్, ఎటోపోసైడ్, బ్లెయోమైసిన్ మరియు స్టీరాయిడ్స్ తో సహా ఏడు ఔషధాలు ఉంటాయి.

బీకాప్

ఈ రెజిమెన్ లో బ్లెయోమైసిన్, ఎటోపోసైడ్, డోక్సోరుబిసిన్, సైక్లోఫోస్ఫామైడ్, విన్ క్రిస్టిన్, ప్రోకార్బజైన్ మరియు ప్రెడ్నిసోలోన్ ఉంటాయి.

సిహెచ్ఎల్ విపిపి

ఈ రకమైన కీమోథెరపిలో క్లోరాంబుసిల్, విన్ బ్లాస్టిన్, ప్రోకార్బజైన్ మరియు ప్రెడ్నిసోలోన్ ఉంటాయి.

జెమ్ పి

ఈ కీమోథెరపిలో జెమ్ సిటాబైన్, సిస్ ప్లాటిన్ మరియు ప్రెడ్నిసోలోన్ ఉంటాయి మరియు తిరగబెట్టిన వ్యాధికి చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు.

ఎస్ హ్యాప్

ఈ చికిత్సలో సిస్ ప్లాటిన్, సైటరాబైన్, ఎటోపోసైడ్ మరియు ప్రెడ్నిసోలోన్ ఉంటాయి మరియు తిరగబెట్టిన వ్యాధికి చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు.

బీమ్

ఈ చికిత్సలో మస్టైన్, ఎటోపోసైడ్, సైటరాబైన్ మరియు మెల్ఫలాన్ ఉంటాయి మరియు స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ కి ముందుగా ఉపయోగిస్తారు.

కీమోథెరపి దుష్ప్రభావాలు

లింఫోమాకు కీమోథెరపి దుష్ప్రభావాలతో ముడిపడివుంటుంది. ఇవ్వబడిన ఔషధాలపై ఇవి ఆధారపడి ఉంటాయి. ఈ దుష్ప్రభావాల్లో కొన్నిటిని మందులతో నియంత్రించవచ్చు. కీమోథెరపిని సహించడం వ్యక్తి నుంచి వ్యక్తికి మారిపోతుంది. కొంతమంది ప్రజలు దుష్ప్రభావాలు ఏమీ లేకుండా చికిత్సను బాగా తట్టుకుంటే, మరికొంతమందికి దుష్ప్రభావాలు ఉండొచ్చు. మామూలు దుష్ప్రభావాలు ఇవి:

జుట్టు ఊడటం

పేర్కొన్న కీమోథెరపి రెజిమెన్స్ తో ఇది జరగడం మామూలు విషయమే. మొదటి దఫా రెండవ వారం తరువాత జుట్టు ఊడటం సాధారణంగా ప్రారంభమవుతుంది. కీమోథెరపి పూర్తయిన తరువాత జుట్టు తిరిగి పెరుగుతుంది.

వికారం మరియు వాంతులు

ఇది కీమోథెరపి యొక్క బాగా తెలిసిన దుష్ప్రభావం, కానీ ఆధునిక మందులతో, ఈ లక్షణాలు చాలా బాగా నియంత్రించబడతాయి. వికారం అనేది వాంతులు లాంటి అనుభూతి.

అలసట

అలసట అనేది మామూలు దుష్ప్రభావం. ఇది సాధారణంగా మొదటి వారంలో ఎక్కువగా ఉండి ఆ తరువాత క్రమేపీ మెరుగుపడుతుంది.

నోటిలో పుండు

కీమోథెరపి తరువాత ఇది కలగడం మామూలు విషయం, అయితే ఇది దానంతటదే పోతుంది.

నీళ్ళ విరేచనాలు

కీమోథెరపి తరువాత ఈ లక్షణం అప్పుడప్పుడు కలగవచ్చు.

మలబద్ధకం

మలబద్ధకం కీమోథెరపి యొక్క మామూలు దుష్ప్రభావం. కీమోథెరపి ఔషధం వల్లే ఇది కలగవచ్చు, కానీ ప్రధానంగా కీమోథెరపితో పాటు ఇవ్వబడే వాంతుల నిరోధక ఔషధాల ప్రభావం వల్ల కలుగుతుంది.

ఇన్ఫెక్షన్ ప్రమాదం

ఇది కీమోథెరపి యొక్క ముఖ్యమైన దుష్ప్రభావం. ఇన్ఫెక్షన్లపై పోరాడగల శరీర సామర్థ్యాన్ని కీమోథెరపి తగ్గిస్తుంది కాబట్టి ఇది కలుగుతుంది. కాబట్టి, కీమోథెరపి ఇచ్చిప్పుడు ఏ సమయంలోనైనా (అది అర్ధరాత్రి అయినా సరే) మీకు జ్వరం వస్తే వెంటనే మీరు మీ డాక్టరును సంప్రదించడం ముఖ్యం

రుచి మార్పులు

కీమోథెరపితో ఇది మామూలుగా కలుగుతుంది కాబట్టి అంతకుముందు మాదిరిగా ఆహారం రుచింగా అనిపించదు. కీమోథెరపి పూర్తయిన తరువాత రుచి కోలుకుంటుంది.

చేతులు మరియు పాదాల్లో తిమ్మిరి

కొన్ని కీమోథెరపి ఔషధాల వల్ల ఈ దుష్ప్రభావం కలుగుతుంది.

రక్తహీనత

కీమోథెరపి వల్ల ఇది కలగవచ్చు. సాధారణంగా ఇది తాత్కాలికంగా కలుగుతుంది మరియు చికిత్స పూర్తయిన తరువాత మెరుగుపడుతుంది. దీనిని మెరుగుపరిచేందుకు కొన్నిసార్లు రక్తం ఎక్కించడం లేదా ఇతర చికిత్స అవసరం కావచ్చు.

రక్తస్రావం

కీమోథెరపి వల్ల రక్తస్రావం కలిగే ప్రమాదం కొద్దిగా ఉంటుంది. ఇది కలిగితే, మీరు వెంటనే మీ డాక్టరును సంప్రదించాలి.

సంతానోత్పత్తి తగ్గడం

యువకుల్లో హాడ్జ్ కిన్ లింఫోమా మామూలుగా కలుగుతుంది మరియు స్త్రీపురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గడం ఒక సంభావ్య దుష్ప్రభావం. కీమోథెరపి కారణంగా, స్త్రీల అండాశయాల పనితనం మరియు పురుషుల్లో వీర్యం ఉత్పత్తి తగ్గిపోవచ్చు. కీమోథెరపి పూర్తయిన తరువాత పనితనం కోలుకోవచ్చు, కాబట్టి భవిష్యత్తులో పిల్లలను కనాలనుకుంటున్న యువ రోగులు కీమోథెరపిని ప్రారంభించడానికి ముందు ఫెర్టిలిటి స్పెషలిస్టును సంప్రదించవలసిందిగా సిఫారసు చేయబడుతోంది. ఇలాంటి ఆప్షన్లలో పురుషునిలో వీర్యం స్టోరేజ్ (వీర్యం బ్యాంకింగ్) మరియు స్త్రీలో అండాన్ని (ఓసైట్) భద్రపరచడం ఉంటాయి.

రుతువిరతి

పెద్దవాళ్ళలో ప్రత్యేకించి 40 వ లేదా 50 వ పడిలో ఉన్నవాళ్ళకు కీమోథెరపి తరువాత రుతువిరతి కలిగే ప్రమాదం ఉంది ఎందుకంటే కీమోథెరపి పూర్తయిన తరువాత అండాశయం పనితనం కోలుకోదు కాబట్టి.

దగ్గు మరియు ఊపిరాడకపోవడం

ఇది బ్లెయోమైసిన్ ఔషధం వల్ల ఎబివిడి కీమోథెరపి యొక్క సంభావ్య దుష్ప్రభావం. దగ్గు మరియు శ్వాస తీసుకోలేకపోవడం లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన దుష్ప్రభావాలను ఈ ఔషధం కలిగించవచ్చు.

హాడ్జ్ కిన్ లింఫోమాలో విభిన్న సెట్టింగ్సులో చికిత్సగా రేడియోథెరపిని ఉపయోగిస్తారు.

ప్రారంభ దశ హాడ్జ్ కిన్ లింఫోమా

ప్రారంభ దశ లింఫోమాస్ లో, కీమోథెరపి తరువాత రేడియోథెరపిని ఉపయోగిస్తారు. దాదాపు 2-3 వారాల వ్యవధి పాటు రేడియోథెరపిని ఇస్తారు మరియు ఈ చికిత్సతో కలిగే దుష్ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. లింఫోమా కనుగొనబడిన చోట కీమోథెరపి ప్రారంభానికి ముందు ఈ చికిత్సను ఇస్తారు. హాడ్జ్ కిన్ లింఫోమాలో రేడియోథెరపి యొక్క సంభావ్య దుష్ప్రభావాల్లో అలసట, చికిత్స చేసిన చోట స్వల్పంగా చర్మం ఎర్రబడటం మరియు చికిత్స చేయబడుతున్న శరీర ప్రాంతాన్ని బట్టి ఇతర దుష్ప్రభావాలు ఉంటాయి.

ముదిరిన దశ హాడ్జ్ కిన్ లింఫోమా

ముదిరిన దశ హాడ్జ్ కిన్ లింఫోమాలో, కొన్నిసార్లు రేడియోథెరపిని కీమోథెరపి పూర్తయిన తరువాత కన్సాలిడేషన్ చికిత్సగా ఉపయోగిస్తారు. రోగనిర్థారణ సమయంలో లింఫోమా పెద్దదిగా ఉన్న పరిస్థితుల్లో లేదా కీమోథెరపిని పూర్తిచేసిన తరువాత ఆ ప్రాంతంలో ఇప్పటికీ లింఫోమా ఉంటే దీనిని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.

ముదిరిన వ్యాధి గల ఇతర పరిస్థితుల్లో, నొప్పి లాంటి స్థానిక లక్షణాలను నియంత్రించేందుకు రేడియోథెరపిని ఉపయోగించవచ్చు.

ఎముక మూలుగ ట్రాన్స్ ప్లాంట్ లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ అనేది తొలి చికిత్స తరువాత క్యాన్సరు తిరిగొచ్చినప్పుడు (తిరగబెట్టడం) లేదా తొలి కీమోథెరపితొ వ్యాధి పోనప్పుడు ఉపయోగించే చికిత్స రకం.ఎముక మూలుగ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవడానికి ముందు, రోగికి కీమోథెరపి అధిక మోతాదులో ఇవ్వబడుతుంది, ఉదాహరణకు బీమ్ లాంటి కీమోథెరపి రెజిమెన్. లింఫోమా కణాలన్నిటినీ చంపడం ఈ కీమోథెరపి యొక్క లక్ష్యం. ఈ కీమోథెరపి అ ధిక మోతాదు కాబట్టి, ఎముక మూలుగలో ఉన్న మామూలు కణాలను కూడా ఇది చంపుతుంది.

రక్తం ఆక్సిజెన్ ని తీసుకెళ్ళడానికి సహాయపడే ఎర్ర రక్త కణాలు లాంటి రక్త కణాలను, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే తెల్ల రక్త కణాలు మరియు రక్తస్రావాన్ని ఆపేందుకు సహాయపడే ప్లెట్లెట్స్ ని ఉత్పత్తి చేయడం ఎముక మూలుగ విధి. రక్తంలో ఈ కణాల సంఖ్య గణనీయంగా తగ్గడం రోగికి ప్రమాదకరం కాబట్టి కీమోథెరపి అధిక మోతాదు తరువాత ఈ కణాల ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది.

స్టెమ్ కణాల సేకరణ

స్టెమ్ కణాలు అనేవి ఎర్ర రక్త, తెల్ల రక్త కణాలు లాంటి ఏదో రకం రక్త కణాలు లేదా ప్లెట్లెట్స్ లోకి అభివ్రుద్ధి చెందగల సామర్థ్యం ఉన్న ఒక రకం రక్త కణాలు. ఈ స్టెమ్ సెల్స్ రక్త ప్రవాహంలో మరియు ఎముక మూలుగలో ఉంటాయి మరియు రోగి అధిక మోతాదు కీమోథెరపిని పొందడానికి ముందు రోగి నుంచి మొదట్లో సేకరించబడతాయి. రోగి నుంచి స్టెమ్ సెల్స్ ని సేకరించే మరియు అధిక మోతాదు కీమోథెరపి తరువాత ఇదే రోగికి తిరిగి వాటిని ఎక్కించే ఈ ప్రక్రియను ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ అంటారు.

స్టెమ్ సెల్స్ మరొక వ్యక్తి నుంచి (దాత) తీసుకుంటే, దీనిని అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ అంటారు. దాత బంధువు అయివుండొచ్చు, సాధారణంగా సోదరుడు లేదా సోదరి, లేదా సంబంధం లేని, కానీ సరిపోలిన దాత అయివుండొచ్చు. మూలుగలో క్యాన్సరు ఉన్న పరిస్థితుల్లో లేదా ఇంతకుముందు ఆటోలోగస్ ట్రాన్స్ ప్లాంట్ చేయబడినప్పటికీ, వ్యాధి మళ్ళీ తిరగబెట్టినప్పుడు దాతను ఉపయోగించుకోవచ్చు.

స్టెమ్ సెల్స్ ని సేకరించడానికి ముందు, రోగి కీమోథెరపి మరియు జి-సిఎస్ఎఫ్ తో ఇంజెక్షన్లు చేయించుకోవచ్చు, విజయవంతమైన సేకరణ సాధించేందుకు రక్తంలో స్టెమ్ సెల్స్ సంఖ్యను ఇది పెంచవచ్చు.

స్టెమ్ సెల్స్ సేకరణ రోజున, రోగిని మెషీన్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది మరియు ఒక సిర నుంచి రోగి యొక్క రక్తం తీసుకోబడుతుంది మరియు రక్తంలో ఉన్న స్టెమ్ సెల్స్ ని సేకరించేంుకు ఇది మెషీన్ గుండా వెళుతుంది. అనంతరం మరొక సిర గుండా రక్తం రోగిలోకి తిరిగి పోతుంది. ఈ ప్రక్రియను కొద్ది గంటల్లో చేస్తారు.

స్టెమ్ సెల్స్ ని సేకరిస్తే, రోగి అధిక మోతాదు కీమోథెరపి పొందుతారు. కీమోథెరపి తరువాత, స్టెమ్ సెల్స్ ని తిరిగి రోగికి ఎక్కిస్తారు. ఈ కణాలు ఎముక మూలుగలోకి వెళ్ళి మళ్ళీ రక్త కణాలు తయారుచేయడం ప్రారంభిస్తుంది.

ఎముక మూలుగ ట్రాన్స్ ప్లాంట్ తో పోల్చుకుంటే ఈ రోజుల్లో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ఎముక మూలుగ సేకరణ

ఎముక మూలుగ అనేది ఎముకల లోపల ఉండే మెత్తని మెటీరియల్. ఎముక మూలుగ ట్రాన్స్ ప్లాంట్ కోసం, అధిక మోతాదు కీమోథెరపిని ఇవ్వడానికి ముందు మూలుగను సేకరించవలసి ఉంటుంది. మూలుగ సేకరణ ప్రక్రియ ఆపరేషన్ థియేటరులో సాధారణ మత్తుమందు కింద తీసుకోబడుతుంది. ఎముకల్లోని విభిన్న స్థలాల నుంచి మూలుగ తీసుకోబడవచ్చు మరియు ప్రక్రియ సమయంలో అది దాదాపు 1 లీటరు బయటకు తీయబడుతుంది. ఒకసారి బయటకు తీస్తే, ఇది నిల్వచేయబడుతుంది మరియు అవసరమైనప్పుడు రోగికి ఎక్కించబడుతుంది.

స్టెమ్ సెల్స్ మరియు ఎముక మూలుగ ట్రాన్స్ ప్లాంట్ అపాయాలు మరియు దుష్ప్రభావాలు

స్టెమ్ సెల్ లేదా ఎముక మూలుగ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవడం సంక్లిష్ట ప్రక్రియ మరియు దుష్ప్రభావాలతో ముడిపడివుంటుంది. ట్రాన్స్ ప్లాంట్ చేసిన తరువాత మామూలు స్థాయిలకు కోలుకోవడానికి మూలుగ మరియు రక్తంలో రక్త కణాల కోసం కొద్ది వారాల పాటు ఆసుపత్రిలో ఉండటం సాధారణంగా ఈ ప్రక్రియలో ఉంటుంది. ఈ ప్రక్రియతో ముడిపడివుండే మామూలు దుష్ప్రభావాల్లో ఉండేవి:

వికారం, వాంతులు, జుట్టు ఊడటం, కాలేయం పనితనం మారడం ఈ చికిత్స యొక్క సంభావ్య దుష్ప్రభావాలు.

ఇన్ఫెక్షన్ ప్రమాదం. ఎందుకంటే తెల్ల రక్త కణాలు తక్కువగా ఉంటాయి మరియు రోగి ఇన్ఫెక్షన్ కి గురవుతుంటారు కాబట్టి. ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియల్, వైరల్ లేదా ఫంగల్ అయివుండొచ్చు మరియు వాటిని నియంత్రించేందుకు సాధారణంగా యాంటిబయాటిక్స్ అవసరమవుతాయి.

ముకోసైటిస్. నోటి మరియు జీర్ణ మార్గం లోపలి లైనింగ్ పై కీమోథెరపి ప్రభావం వల్ల కలుగుతుంది. రోగి తీసుకునే ఆహార పరిమాణాన్ని ఇది పరిమితం చేయవచ్చు మరియు ఇలాంటప్పుడు ఇతర ఆహార పద్దతులు ఉపయోగించవచ్చు.

రక్తస్రావం., తక్కువ ప్లెట్ లెట్ కౌంట్ వల్ల ఈ ప్రక్రియతో ముడిపడివున్న ప్రమాదం ఇది, కాపీ ప్లెట్లెట్ కౌంట్ ని పెంచేందుకు ప్లెట్ లెట్ ట్రాన్స్ ఫ్యూజన్ ని ఇవ్వవచ్చు.

గ్రాఫ్ట్‌ వర్సెస్ హోస్ట్ వ్యాధి. ట్రాన్స్ ఫ్యూజ్ చేసిన కణాలకు శరీరం యొక్క ప్రతిచర్య ఇది, ప్రత్యేకించి స్టెమ్ సెల్స్ లేదా మూలుగ కనుక దాత నుంచి అయితే.