న్యూరోబ్లాస్టోమా

న్యూరోబ్లాస్టోమా

న్యూరోబ్లాస్టోమా అనేది బాల్యంలో కలిగే అరుదైన క్యాన్సరు. సాధారణంగా 5 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్న పిల్లల్లో కలుగుతుంది. ఇది శిశువుల్లో అత్యంత సామాన్యంగా కలిగే గట్టి కణితి. న్యూరల్‌ క్రెస్ట్‌ల్లో ఉండే న్యూరోబ్లాస్ట్స్‌ అనే ఒక రకం కణాల్లో ఇది ప్రారంభమవుతుంది. శరీరంలోని న్యూరల్‌ క్రెస్ట్‌ల్లోని ఏ భాగంలోనైనా కణితి కలగవచ్చు, కానీ సామాన్యంగా పొత్తికడుపులో ఎక్కువ సామాన్యంగా, ప్రత్యేకించి అడ్రెనల్‌ గ్రంథిలో కలుగుతుంది.న్యూరోఫైబ్రోమాటోసిస్‌ టైప్‌ 1, బెక్‌విత్‌-వైడ్‌మన్‌ సిండ్రోమ్‌, లైఫ్రావుమెని సిండ్రోమ్‌ మరియు కాస్టెల్లో సిండ్రోమ్‌ లాంటి స్థితి, జన్యుపరమైన అవ్యవస్థల చరిత్ర కుటుంబంలో ఉండటం న్యూరోబ్లాస్టోమాను కలిగించే ప్రమాదకర అంశాలు ఉంటాయి.
నొప్పి లేదా అసౌకర్యంతో ముడిపడివున్న పొత్తికడుపు మాస్‌ ఉండటం న్యూరోబ్లాస్టోమా లక్షణాల్లో ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు విస్తరిస్తే, ఇది జ్వరం, బరువు తగ్గడం మరియు ఎముకల్లోకి క్యాన్సరు విస్తరిస్తే నొప్పి ఉంటాయి.ప్రాథమిక కణితిని చూడటానికి మరియు శరీరంలోని ఇతర ప్రాంతాలకు క్యాన్సరు వ్యాప్తిని చూసేందుకు క్యాన్సరును నిర్థారణ చేయడానికి చేసే పరిశోధనల్లో ఎంఆర్‌ఐ లేదా సిటి స్కాన్‌ ఉంటుంది. ఎముకల్లోకి వ్యాపించించేమో చూసేందుకు ఎముక స్కాన్‌, అయోడిన్‌ 123-ఎంఐబిజి స్కాన్‌ మరియు ఎముక మూలుగ బయాప్సీలు ఇతర పరీక్షల్లో ఉంటాయి. ఎంవైసిఎన్‌ జీన్స్‌ కోసం చూసేందుకు జన్యుపరమైన పరీఓలు కణితి వేగంగా లేదా నెమ్మదిగా పెరుగుతోందా అనే విషయం నిర్థారించేందుకు సహాయపడతాయి.

న్యూరోబ్లాస్టోమా స్టేజింగ్‌ ఈ కింది విధంగా ఉంటుంది.

స్టేజ్‌ 1 మరియు 2 క్యాన్సరు వ్యాపించకుండా ఏదైనా ఒక ప్రాంతానికి పరిమితమవుతుంది.
స్టేజ్‌ 3 క్యాన్సరు సమీపంలోని నిర్మాణాలకు వ్యాపించివుంటుంది, కానీ చాలా దూరంగా కాదు.
స్టేజ్‌ 4 క్యాన్సరు శరీరంలోని దూర ప్రాంతాలకు విస్తరించివుంటుంది.
స్టేజ్‌ 4ఎస్‌ ఈ దశ 1 సంవత్సరం లోపు చంటిపిల్లలకు పరిమితమవుతుంది, సర్జరీతో తొలగించగల ప్రాథమిక కణితి ఉంటుంది మరియు కాలేయం, చర్మం మరియు ఎముక మూలుగకు పరిమితమైన మెటాస్టాసెస్‌ ఉన్నాయి.

న్యూరోబ్లాస్టోమాకు చికిత్స రోగనిర్థారణ సమయంలో క్యాన్సరు దశ మరియు ప్రమాదంపై ఆధారపడి ఉంటుంది. ఇంకా, వయస్సు, ఫిట్‌నెస్‌ మరియువ్యాధి ప్రమాద గ్రూప్‌ చికిత్స వ్యూహాన్ని నిర్థారించడంలో పాత్ర పోషిస్తుంది. చికిత్స ఎంపికల్లో సర్జరీ, కీమోథెరపి మరియు రేడియోథెరపి ఉంటాయి. ఒక ప్రాంతానికే వ్యాధి పరిమితమైన మరియు ప్రమాదం తక్కువగా ఉన్నట్లుగా పరిగణించబడిన రోగులకు, సర్జరీ ఏకైక చికిత్స. ప్రమాదం తక్కువగా ఉన్న ఇతర రోగుల్లో, సర్జరీ మరియు కీమోథెరపి ఉపయోగించబడతాయి. ఆపరేషన్‌ చేయడానికి వ్యాధి చాలా పెద్దదిగా ఉన్న రోగుల్లో, మొదటగా కీమోథెరపి ఇచ్చి, ఆ తరువాత సర్జరీ చేయబడుతుంది. స్టేజ్‌ 4ఎస్‌ వ్యాధి గల రోగుల్లో, పరిశీలన ఏకైక ఎంపిక కావచ్చు. కీమోథెరపిని ఉపయోగిస్తే, ఎంపికచేసే ఔషదాల్లో సిస్‌ప్లాటిన్‌ లేదా కార్బోప్లాటిన్‌, డోక్సోరుబిసిన్‌, ఎటోపోసైడ్‌ మరియు సైక్లోఫాస్ఫమైడ్‌ ఉంటాయి.

న్యూరోబ్లాస్టోమా ప్రమాదం ఒకమోస్తరుగా గల పిల్లలకు సాధారణంగా కీమోథెరపి మరియు సర్జరీ సమ్మేళనం ఇవ్వబడతాయి. సర్జరీ తరువాత కీమోథెరపి లేదా వైస్‌ వెర్సా ఉంటుంది.

న్యూరోబ్లాస్టోమా ప్రమాదం ఎక్కువగా గల రోగులకు, చికిత్స ఎంపికల్లో కీమోథెరపి, సర్జరీ, రేడియోథెరపి మరియు అధిక మోతాదు కీమోథెరపి, ఆ తరువాత స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఉంటాయి. ప్రమాదం ఎక్కువగా ఉన్న రైతులకు చికిత్స ఎక్కువ దూకుడుగా ఉంటంుది మరియు ఇండక్షన్, కన్సాలిడేషన్‌ మరియు మెయింటెనెన్స్‌ దశలు ఉంటాయి. పైన పేర్కొన్న ఎంపికలన్నిటినీ అదే రోగికి ఉపయోగించవచ్చు. ఇంకా, డినుటూక్సిమాబ్‌తో బయోలాజికల్‌ థెరపిని ఉపయోగించవచ్చు.