Ovarian cancer

అండాశయం క్యాన్సర్

అండాశయ

అండాశయాలు అనేవి మహిళలో ఉండే స్త్రీ సంతానోత్పత్తి అవయవాలు. పెల్విస్‌కి (పొత్తికడుపు యొక్క అత్యంత దిగువ భాగం) ఇరు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి (కుడి మరియు ఎడమ). అండాశయానికి బయటి వైపున ఎపిథీలియల్‌ కణాలు, లోపలి వైపున క్రిమి కణాలు మరియు లోపలి స్ట్రోమల్‌ కణాలు ఉంటాయి.

పిల్లలను కనగల సామర్థ్యం ఉన్న మహిళల్లో ప్రతి నెల అండాన్ని ఉత్పత్తి చేయడం అండాశయాల పని. ఈ అండం బహిష్టు చక్రం యొక్క మధ్యలో ఉత్పత్తి చేయబడుతుంది. ఈ అండం గర్భాశయంలోకి వెళ్లి వీర్యం వల్ల ఫలదీకరణ చెందుతుంది. అండాశయాలు ఈస్ట్రోజెన్‌ మరియు ప్రొజెస్టెరోన్‌ అనే హార్మోన్‌లను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఇవి బహిష్టు చక్రాన్ని నియంత్రిస్తాయి మరియు మహిళలో వక్షోజాలు మరియు ఇతర శారీరక ధర్మాలు అభివృద్ధి చెందడానికి కారణమవుతాయి. అండాశయ పనితనం రజస్వలలో ప్రారంభమై రుతువిరతిలో ముగుస్తుంది.

అండాశయ క్యాన్సర్

అండాశయ క్యాన్సరు అనేది అండాశయంలో ప్రారంభమైన క్యాన్సర్‌. అండాశయం యొక్క ఏ భాగంలో క్యాన్సర్‌ ఉత్పన్నమైందనే దానిని బట్టి అండాశయ క్యాన్సరు అనేక రకాలుగా ఉండొచ్చు. వీటిని ఈ కింద అండాశయ క్యాన్సరు రకాలులో ఇవ్వడమైనది.

అండాశయ క్యాన్సరు రకాలు

ఎపిథీలియల్‌ కార్సినోమా

ఎపిథీలియల్‌ కార్సినోమాలు అనేవి అండాశయం యొక్క అత్యంత సామాన్య క్యాన్సర్లు. మొత్తం అండాశయ క్యాన్సర్లలో ఇవి దాదాపుగా 95% ఉంటాయి. ఎపిథీలియల్‌ క్యాన్సర్లు వివిధ రకాలుగా ఉండొచ్చు. వీటిల్లో అత్యంత సామాన్యమైనది అండాశయం యొక్క గంభీరమైన కార్సినోమా. మొత్తం ఎపిథీలియల్‌ క్యాన్సర్లలో ఇవి దాదాపు 75% ఉంటాయి. ఇతర ఎపిథీలియల్‌ క్యాన్సర్లలలో ముసీనియస్‌, ఎండోమెట్రోయిడ్‌, క్లియర్‌ సెల్‌, మిశ్రమ మరియు తేడా తెలుసుకోలేని కార్సినోమాలు ఉంటాయి.

ఇతరవి

మిగతా 5% అండాశయ క్యాన్సర్లలో టెరటోమస్‌, డైస్‌జెర్మినోమస్‌, ఎండోడెర్మల్‌ సైన్‌ ట్యూమర్‌, ఎంబ్రియోనల్‌ కార్సినోమాస్‌, మిక్స్‌డ్‌ జెర్మ్‌ సెల్‌ ట్యూమర్స్‌, కోరియోకార్సినోమాస్‌ మరియు సర్కోమస్‌ ఉన్నాయి.

అండాశయ క్యాన్సరు కలగడానికి గల కారణం పూర్తిగా తెలియదు, కానీ కొన్ని ప్రమాదకర అంశాలు ఈ కింద ఇవ్వబడ్డాయి. ప్రమాదకర అంశం ఉన్నంత మాత్రాన క్యాన్సరు కలుగుతుందని అర్థం కాదు, కానీ ప్రమాదకర అంశాలు లేని ఇతరులతో పోల్చుకుంటే ప్రమాదం పెరుగుతుంది.

వయస్సు

వయస్సు పెరిగే కొద్దీ అండాశయ క్యాన్సరు కలిగే ప్రమాదం పెరుగుతుంది. 5లో 4 అండాశయ క్యాన్సరు మహిళల్లో 50 సంవత్సరాల తరువాత కలుగుతాయి.

పిల్లలను కనగల సామర్థ్యం చరిత్ర

పిల్లలను కన్న మహిళల కంటే పిల్లలు పుట్టని మహిళలకు అండాశయ క్యాన్సరు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

హార్మోన్‌లు

పిన్న వయస్సులోనే పీరియడ్స్‌ ప్రారంభం కావడం లేదా ఆలస్యంగా రుతువిరతి కలగడం వల్ల అండాశయ క్యాన్సరు కలిగే ప్రమాదం పెరుగుతుంది. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపి (హెచ్‌ఆర్‌టి) ఉపయోగించడం దీని ప్రమాదాన్ని కొద్దిగా పెంచుతుంది. హెచ్‌ఆర్‌టిని ఆపేయగానే మళ్ళీ ఈ ప్రమాదం తగ్గుతుంది.

ఆహారం మరియు బరువు

అధిక బరువుతో ఉండటం వల్ల అండాశయ క్యాన్సరు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జంతు కొవ్వు ఎక్కువగా మరియు కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల కూడా ప్రమాదం పెరుగుతుంది.

ఎండోమెట్రియోసిస్

ఎండోమెట్రియోసిస్‌ అనే స్థితి ఉండటం అండాశయ క్యాన్సరు కలిగే ప్రమాదాన్ని పెంచుతుంది.

జన్యుపరమైన అంశాలు

కుటుంబంలో ఎవరికైనా అండాశయ క్యాన్సరు ఉన్న చరిత్ర ఉంటే ఇది వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దాదాపుగా 5-10% అండాశయ క్యాన్సర్లు కుటుంబాల్లో ఉండే జన్యుపరమైన లోపం వల్ల కలుగుతాయి. దీనిని బిఆర్‌సిఎ మ్యుటేషన్‌ అంటారు. బిఆర్‌సిఎ1 మరియు బిఆర్‌సిఎ2 అనేవి రెండు జీన్స్‌, ఇవి అసాధారణంగా పెరిగితే రొమ్ము క్యాన్సరు మరియు అండాశయ, పేగు, క్లోమం మరియు థైరాయిడ్‌ క్యాన్సర్లు లాంటి ఇతర క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. వారసత్వ క్యాన్సరు ఉన్నట్లుగా అనుమానిస్తే ఈ అసాధారణ జీన్స్‌ కొరకు పరీక్ష చేయించుకోవచ్చు.

ఫాల్టీ జీన్‌ ఉందనే విషయం అనుమానించవచ్చు ఒకవేళ

  • ఇద్దరు సన్నిహిత బంధువుల్లో (సోదరి, తల్లి, కుమార్తె) అండాశయ క్యాన్సరు చరిత్ర ఉంటే
  • ఇద్దరు సన్నిహిత బంధువుల్లో రొమ్ము లేదా అండాశయ క్యాన్సరు చరిత్ర ఉంటే
  • ముగ్గురు సన్నిహిత బంధువులకు పెద్దపేగు, గర్భాశయ మరియు అండాశయ క్యాన్సరు ఉంటే.

అండాశయ క్యాన్సరు నుంచి కాపాడే అంశాలు

రక్షణాత్మకంగా చెప్పబడే కొన్ని అంశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇవి అండాశయ క్యాన్సరు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి కాబట్టి. అవి ఏమిటంటే

  • బిడ్డకు చనుబాలివ్వడం
  • పిల్లలను కనడం
  • మౌఖిక గర్భనిరోధకతలను ఉపయోగించడం
  • అండాశయాలను మరియు ఫాలోపియన్‌ ట్యూబును శస్త్రచికిత్స ద్వారా తీయించేయడం
  • గర్భసంచి తీసేయడం

అండాశయ క్యాన్సరు ప్రారంభ దశలో ఉన్నప్పుడు లక్షణాలు ఏవీ కలిగించకపోవచ్చు. క్యాన్సరు ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొంతమంది రోగులు ఈ కింది లక్షణాలను గమనించవచ్చు

దిగువ పొత్తికడుపులో నొప్పి

కడుపుబ్బరంగా అనిపించడం లేదా పొత్తికడుపు నిండిపోయినట్లుగా అనిపించడం

అండాశయ క్యాన్సరు ఆ తరువాతి దశల్లో అనేక లక్షణాలు కలిగించవచ్చు. ఈ లక్షణాల్లో అత్యధికం చాలా వరకు స్పష్టంగా తెలియనివి మరియు మామూలు స్థితులను ప్రదర్శించవచ్చు. ఈ లక్షణాలను ఈ కింద ఇస్తున్నాము.

  • క్రమరహితంగా బహిష్టు పీరియడ్స్
  • పీరియడ్స్‌ మధ్య రక్తస్రావం
  • పొత్తికడుపు లేదా పెల్విస్‌లో నొప్పి లేదా గడ్డ
  • మూత్రవిసర్జన తరచుదనం పెరగడం
  • మలబద్ధకం
  • సెక్స్‌ జరిపేటప్పుడు నొప్పి
  • కడుపుబ్బరంగా అనిపించడం లేదా పొత్తికడుపు నిండినట్లుగా అనిపించడం
  • ఆకలి లేకపోవడం
  • నడుము నొప్పి
  • పొత్తికడుపు లేదా కాళ్ళ వాపు
  • శ్వాస తీసుకోలేకపోవడం

అండాశయ క్యాన్సరు ఉన్నట్లుగా అనుమానిస్తే ఈ కింది పరిశోధనలు చేయవచ్చు.

క్లినికల్‌ పరీక్ష

గైనకాలజిస్టు లేదా ఆంకాలజిస్టు పెల్విస్‌ని పరీక్షిస్తారు. పెల్విస్‌లో (పొట్టలో అత్యంత దిగువ భాగం) ఏవైనా భారీ మాస్‌లు ఉంటే కనిపెట్టడానికి ఇది సహాయపడుతుంది.

పెల్విస్‌ మరియు పొత్తికడుపుకు అల్ట్రాసౌండ్

పొత్తికడుపు మరియు పెల్విస్‌కి అల్ట్రాసౌండ్‌ తీయడం వల్ల అండాశయం పరిసరాల్లో మాస్‌లను లేదా పెల్విస్‌లోని ఇతర మాస్‌లను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. అండాశయ క్యాన్సరు ఉండొచ్చని అనుమానిస్తే క్లినికల్‌ పరీక్ష తరువాత చేసే మొట్టమొదటి పరిశోధన ఇది.

ఛాతీ ఎక్స్‌రే

ఊపిరితిత్తుల్లో క్యాన్సరు లేదా ఊపిరితిత్తుల కవరింగ్‌లో ఏర్పడే ఫ్లూయిడ్‌ ఉందేమో చూసేందుకు ఛాతీ ఎక్స్‌రే తీయబడుతుంది. సిటి స్కాన్‌ తీస్తుంటే ఎక్స్‌రే తీయవలసిన అవసరం లేదు.

సిటి స్కాన్

అండాశయ క్యాన్సరు ఉన్నట్లు అనుమానించినప్పుడు లేదా రోగనిర్థారణ చేసినప్పుడు సిటి లేదా కంప్యూటెడ్‌ టోమోగ్రాఫిక్‌ స్కాన్‌ తీస్తారు. ఛాతీ, పొత్తికడుపు మరియు పెల్విస్‌ యొక్క సవివరమైన ఇమేజ్‌లు ఇచ్చేందుకు సిటి స్కాన్‌ ఎక్స్‌రేలను ఉపయోగిస్తుంది మరియు మరియు కొద్ది మిల్లీమీటర్ల కంటే పెద్దవిగా ఉన్న అత్యధిక అసాధారణతలను చూపించగలదు. ఇది త్వరతితమైనది, నొప్పిలేనిది మరియు అత్యధిక సెంటర్లలో లభిస్తుంది. క్యాన్సరు దశను తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. (క్యాన్సరుకు దశ ఇవ్వండి).

రక్త పరీక్షలు

రోగనిర్థారణలో సిఎ125తో సహా రక్త పరీక్షలు చేయబడతాయి. సిఎ125 అనేది అండాశయ క్యాన్సరులో మార్కర్‌. అత్యధిక అండాశయ క్యాన్సర్లలో ఇది మామూలుగా కంటే ఎక్కువగా ఉంటుంది. ఇతర స్థితుల్లో కూడా సిఎ125 పెరిగి ఉండొచ్చు. కచ్చితంగా అండాశయ క్యాన్సరు గల రోగిలో, చికిత్సకు స్పందనను చూసేందుకు లేదా క్యాన్సరు తిరిగి వచ్చిందేమో చూసేందుకు సిఎ125ని మార్కర్‌గా ఉపయోగిస్తారు. చేయబడే ఇతర రక్త పరీక్షల్లో పూర్తి రక్తం వివరాలు, కాలేయం మరియు మూత్రపిండాల పనితనం పరీక్షలు ఉంటాయి.

బయాప్సీ

అండాశయ క్యాన్సరు ప్రారంభ దశలో ఉన్నట్లుగా స్కాన్‌లో అనుమానిస్తే, సాధారణంగా బయాప్సీ చేయబడదు. రోగి నేరుగా సర్జరీ చేయించుకోవాలి. ఎందుకంటే బయాప్సీ సమయంలో అండాశయ క్యాన్సరు పొత్తికడుపులోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి. రోగుల్లో అప్పటికే క్యాన్సరు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినట్లుగా సాక్ష్యం ఉంటే, అండాశయ క్యాన్సరు ఉందనే విషయం ధృవీకరించుకునేందుకు బయాప్సీ చేయబడవచ్చు.

క్యాన్సరు దశ అనేది శరీరంలో క్యాన్సరు ఉన్న చోటు మరియు సైజును వివరించేందుకు ఉపయోగించే పదం. క్యాన్సరు దశను తెలుసుకోవడం వల్ల డాక్టరు అత్యంత సముచితమైన చికిత్సను నిర్ణయిస్తారు.

అండాశయం నుంచి క్యాన్సరు ఏ మేరకు వ్యాపించిందనే దానిని బట్టి అండాశయ క్యాన్సరును 4 దశలుగా (1 నుంచి 4వ దశ) విభజించవచ్చు. దశలు ఈ కింద ఇవ్వబడ్డాయి.

దశ 1

దశ 1 అండాశయ క్యాన్సరు అంటే క్యాన్సరు అండాశయానికి పరిమితమైందని అర్థం. ఈ దశను మళ్ళీ మూడు గ్రూపుల్లోకి ఉపవిభజన చేయవచ్చు.

దశ 1ఎ-

క్యాన్సరు ఒక అండాశయానికి మాత్రమే పరిమితమైనప్పుడు దీనిని ఇలా అంటారు.

దశ 1బి-

క్యాన్సరు ఉభయ అండాశయాల్లో ఉన్నప్పుడు ఇలా పిలుస్తారు.

దశ 1సి-

క్యాన్సరు 1ఎ లేదా 1బిలో ఉన్నప్పుడు మరియు అండాశయం ఉపరిలంపై క్యాన్సరు కణాలు ఉన్నప్పుడు లేదా సర్జరీ సమయంలో పొత్తికడుపు నుంచి తీసిన ఫ్లూయిడ్‌లో క్యాన్సరు కణాలు ఉంటే లేదా సర్జరీలో లేదా ముందుగా అండాశయం చితికిపోయివుంటే ఇలా పిలుస్తారు.

దశ 2

దశ 2 అండాశయ క్యాన్సరు అంటే క్యాన్సరు అండాశయం నుంచి పెల్విస్‌లోని ఇతర ప్రాంతాలకు విస్తరించిందని అర్థం. దీనిని మళ్ళీ మూడు గ్రూపులుగా ఉపవిభజన చేయవచ్చు.

దశ 2ఎ-

క్యాన్సరు గర్భాశయానికి లేదా ఫాలోపియన్‌ ట్యూబులకు విస్తరించినప్పుడు ఇలా పిలుస్తారు.

దశ 2బి-

క్యాన్సరు గర్భాశయానికి లేదా ఫాలోపియన్‌ ట్యూబులకే కాకుండా పెల్విస్‌లోని ఏరియాలకు విస్తరించినప్పుడు ఇలా పిలుస్తారు.

దశ 2సి-

ఇది దశ 2ఎ లేదా 2బిలో ఉన్న క్యాన్సరు మరియు సర్జరీ సమయంలో పొత్తికడుపు నుంచి తీసిన ఫ్లూయిడ్‌లో క్యాన్సరు కణాలు ఉండటం.

దశ 3

దశ 3 అండాశయ క్యాన్సరు అంటే క్యాన్సరు పెల్విస్‌ని దాటి పొత్తికడుపు లైనింగ్‌, పేగు లేదా పొత్తికడుపులోని లింఫ్‌ నోడ్‌లకు విస్తరించిందని అర్థం. ఈ దశను మూడు గ్రూపుల్లోకి ఉపవిభజన చేయవచ్చు.

దశ 3ఎ-

క్యాన్సరు పొత్తికడుపుకు వ్యాపించి ఉంటుంది, కానీ చిన్నదిగా ఉంది మరియు సూక్ష్మదర్శినితో మాత్రమే కనిపిస్తుంది.

దశ 3బి-

పొత్తికడుపులోకి వ్యాపించిన క్యాన్సరు కనిపిస్తుంది మరియు సైజు 2 సెం.మీ లేదా చిన్నగా ఉంటుంది.

దశ 3సి-

పొత్తికడుపులోకి వ్యాపించిన క్యాన్సరు 2 సెం.మీ కంటే పెద్దదిగా ఉంటుంది లేదా సమీపంలోని లింఫ్‌ నోడ్‌లకు వ్యాపించివుంటుంది.

దశ 4

కాలేయం, ఊపిరితిత్తులు తదితర లాంటి శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సరు వ్యాపించింది.

క్యాన్సరు గ్రేడింగ్

సూక్ష్మదర్శినితో క్యాన్సరు కనిపించినప్పుడు అండాశయ క్యాన్సరుకు గ్రేడింగ్‌ కూడా పేథాలజిస్టు ఇస్తారు. గ్రేడింగ్‌ 1 నుంచి 3 ఉంటుంది, గ్రేడ్‌ 1 అంటే తక్కువ దూకుడుగా ఉందని మరియు గ్రేడ్‌ 3 అంటే ఎక్కువ దూకుడు రకం క్యాన్సరు అని అర్థం.

గ్రేడ్‌ 1 (తక్కువ గ్రేడ్‌) – క్యాన్సరు కణాలు నెమ్మదిగా పెరుగుతుంటాయి, చూడటానికి చాలా వరకు మామూలు కణాలుగా ఉంటాయి (బాగా తేడా తెలుసుకోవచ్చు) మరియు అధిక గ్రేడ్‌ క్యాన్సర్ల కంటే తక్కువగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి.

గ్రేడ్‌ 2 (మధ్యస్త గ్రేడ్‌) – కణాలు చూడటానికి ఎక్కువ అసాధారణంగా ఉంటాయి మరియు కొద్దిగా ఎక్కువ త్వరగా పెరుగుతుంటాయి.

గ్రేడ్‌ 3 (అధిక గ్రేడ్‌) – క్యాన్సరు కణాలు చాలా త్వరగా పెరుగుతుంటాయి, చూడటానికి చాలా అసాధారణంగా ఉంటాయి (పెద్దగా తేడా తెలుసుకోలేరు) మరియు తక్కువ గ్రేడ్‌ క్యాన్సర్ల కంటే తక్కువగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి.

అండాశయ క్యాన్సరుకు సర్జరీ ముఖ్యమైన మరియు అత్యంత సామాన్యమైన చికిత్స పద్ధతి. అండాశయ క్యాన్సరుకు రోగనిర్థారణ చేసిన తరువాత సాధారణంగా చేసే మొట్టమొదటి చికిత్స ఇది. రోగనిర్థారణ సమయంలో క్యాన్సరు దశను బట్టి చేసే సర్జరీ రకం మారిపోవచ్చు.

అండాశయ క్యాన్సరుకు ప్రామాణిక ఆపరేషన్‌ టోటల్‌ అబ్డామినల్‌ హిస్టెరెక్టమి మరియు బైలేటరల్‌ సాల్పింగో-ఊఫోరెక్టమి. ఈ ప్రక్రియలో పొత్తికడుపుకు గంటు పెట్టి ఉభయ అండాశయాలు, ఫాలోపియన్ ట్యూబులు, గర్భసంచి, సెర్విక్స్‌, కొని పొత్తికడుపు లింఫ్‌ నోడ్స్‌లు, ఒమెంటమ్‌ మరియు పొత్తికడుపులో ఉన్న ఇతర క్యాన్సరు డిపాజిట్‌లను తీసేస్తారు, ఆపరేషన్‌ చేసే సమయంలో, విశ్లేషణ కోసం పొత్తికడుపు క్యావిటి నుంచి ఫ్లూయిడ్‌ శాంపిల్‌ని సర్జన్‌ తీస్తారు. దీనిని పెరిటోనియల్‌ వాషింగ్‌ అంటారు.

ముదిరిన క్యాన్సరులో పొత్తికడుపులో క్యాన్సరు డిపాజిట్‌లు ఎక్కువగా ఉన్నప్పుడు, డీబల్కింగ్‌ సర్జరీ చేయబడుతుంది, ఈ సమయంలో సర్జన్‌ పూర్తిగా కాకపోయినప్పటికీ సాధ్యమైనంత ఎక్కువగా క్యాన్సరును తొలగిస్తారు.

ప్రారంభ దశ క్యాన్సరు గల (దశ 1ఎ) మరియు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవాలనుకునే యువ మహిళల్లో, మామూలు అండాశయం మరియు గర్భాశయంలను వదిలేయవచ్చు, దీనివల్ల భవిష్యత్తులో వాళ్ళు పిల్లలను కనగలుగుతారు.

అనేక సార్లు, కీమోథెరపిని సర్జరీకి ముందు ఇస్తారు. దీనిని నియో-అడ్జువంట్‌ కీమోథెరపి అంటారు మరియు క్యాన్సరు ముదిరిన రోగులకు పరిగణించబడుతుంది. సర్జరీకి ముందు మరియు తరువాత కీమోథెరపితో చేయబడే ఈ రకమైన సర్జరీని ఇంటర్వల్‌ డీబల్కింగ్‌ సర్జరీ అంటారు. సర్జరీ సమయంలో దాదాపుగా క్యాన్సరు మొత్తాన్ని తొలగించేందుకు వీఉలగా సర్జరీకి ముందు పొత్తికడుపులో ఉన్న క్యాన్సరు మొత్తాన్ని తగ్గించడం నియో-అడ్జువంట్‌ కీమోథెరపి ఉద్దేశం. ఆపరేషన్‌ తరువాత, 10 రోజుల లోపు మహిళలు ఇంటికి వెళ్ళగలుగుతారు. సర్జరీ నుంచి కోలుకుంటే, అత్యధిక మంది మహిళలకు కీమోథెరపి ఇవ్వబడుతుంది.

అండాశయ క్యాన్సరు చికిత్సలో కీమోథెరపి అత్యంత ముఖ్యమైనది. ఈ స్థితిని అదుపుచేసేందుకు విభిన్న సెట్టింగుల్లో కీమోథెరపిని ఉపయోగిస్తారు.

నియో అడ్జువంట్‌ కీమోథెరపి

ముదిరిన అండాశయ క్యాన్సరు ఉన్నట్లుగా నిర్థారణ చేయబడిన రోగుల్లో, సర్జరీకి ముందు కీమోథెరపి ఇవ్వబడవచ్చు. దీనిని నియో అడ్జువంట్‌ కీమోథెరపి అంటారు. క్యాన్సరును నిర్థారణ చేసిన సమయంలో సర్జరీకి తగినంత ఫిట్‌గా లేని రోగులకు లేదా కీమోథెరపి తరువాత మెరుగైన సర్జికల్‌ ఫలితాలు సాధించవచ్చని సెట్టింగ్స్‌లో నమ్మినప్పుడు ఈ చికిత్స పద్ధతి ఎంచుకోబడుతుంది. సర్జరీ చేసిన తరువాత 3-6 నెలల పాటు ఈ చికిత్స ఇవ్వబడుతుంది. కార్బోప్లాటిన్‌ మరియు సిస్‌ప్లాటిన్‌ లాంటి ప్లాటినమ్‌ ఔషధాలు మరియు ప్లాక్సీటాక్సెల్‌ లాంటి టాక్సేన్‌లు నియోఅడ్జువంట్‌ మరియు అడ్జువంట్‌ సెట్టింగ్‌ల్లో ఉపయోగించే ఔషధాలు. వీటిని వేర్వేరుగా లేదా సమ్మేళితంగా ఉపయోగించవచ్చు. ఈ కీమోథెరపి ఔషధాలను ప్రతి 21 రోజులకు 3-6 చక్రాల్లో ఇస్తారు. ఫిట్‌గా లేని రోగులకు, వారంవారీ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు.

అడ్జువంట్‌ కీమోథెరపి

ఇక్కడ, కీమోథెరపిని అండాశయ క్యాన్సరును సర్జరీ తరువాత తొలగించిన తరువాత ఇస్తారు. అండాశయ క్యాన్సరుకు చికిత్స చేసేందుకు ఇది సాధారణంగా అత్యంత సామాన్యంగా ఉపయోగించే పద్ధతి. చికిత్సకు క్యాన్సరు స్పందించడాన్ని బట్టి మరియు చికిత్సను రోగిని తట్టుకోవడాన్ని బట్టి కీమోథెరపిని 6 నెలల వరకు ఇవ్వవచ్చు.

తిరగబెట్టిన జబ్బులో కీమోథెరపి

ప్రారంభ సర్జరీ మరియు కీమోథెరపి తరువాత వ్యాధి తిరగబెట్టిన రోగుల్లో, వ్యాధిని నియంత్రించేందుకు మరింతగా కీమోథెరపి ఉపయోగించబడుతుంది. ఈ సెట్టింగులో ఉపయోగించేందుకు అనేక ఔషధాలు లభిస్తున్నాయి మరియు క్యాన్సరును నియంత్రించడంలో మరియు లక్షణాలను మెరుగుపరచడంలో మంచి ప్రభావం చూపుతాయి. ప్రారంభ కీమోథెరపి పూర్తయిన తరువాత వ్యాధి తిరగబెట్టిన రోగులకు, ప్లాటినమ్‌ ఔషధం మళ్ళీ ఇవ్వబడుతుంది. ఇతరులకు వేరే ఔషదం లేదా ఔషధాలు వాడతారు.

జెమ్‌సిటాబైన్‌, టోపోటెకాన్‌, లైపోసోమ్‌ డోక్సోరుబిసిన్‌, బెవాసిజుమాబ్‌ మరియు ఇటోపోసైడ్‌లు ఈ సెట్టింగులో ఉపయోగించే ఔషదాలు.

లక్షిత థెరపి

బిఆర్‌ఎసి1 మరియు బిఆర్‌ఎసి 2 లాంటి జన్యుపరమైన మార్పుల వల్ల అండాశయ క్యాన్సరు వచ్చిన రోగుల్లో ఓలపారిబ్‌ మరియు నిరపారిబ్‌ ఔషధాలను ఉపయోగిస్తారు. వీటిని టాబ్లెట్‌లుగా నోటి గుండా ఇస్తారు మరియు బిఆర్‌ఎసి మార్పులు గల మరియు లేని రోగుల్లో కీమోథెరపి తరువాత మెయింటెనెన్స్‌ చికిత్సగా ఇవ్వబడవచ్చు.

బెవాసిజుమాబ్‌ అనేది మనోక్లోనల్‌ యాంటీబాడీ. క్యాన్సరులో కొత్త రక్త కణాల వృద్ధిని ఇది ఆపుతుంది. అండాశయ క్యాన్సరులో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది మరియు కీమోథెరపితో సమ్మిళితంగా లేదా ఒక్కటిగా ఇవ్వబడుతుంది.

లక్షణాలను అదుపుచేయుట

అండాశయ క్యాన్సరు తిరగబెట్టిన రోగుల్లో, మామూలుగా ఉండే ఒక లక్షణం పొత్తికడుపులో అసైటెస్‌ (ఫ్లూయిడ్‌) అభివృద్ధి చెందడం. పొత్తికడుపులోకి ట్యూబు వేయడం ద్వారా దీనిని తొలగించవచ్చు మరియు అవసరమైతే పదేపదే చేయవచ్చు. నిరంతర డ్రైనేజి కోసం పొత్తికడుపులో కొన్ని సెంటర్‌లు కేథటర్‌ని పెట్టవచ్చు మరియు దీనితోనే రోగి ఇంటికి వెళ్ళవచ్చు.

ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపి (ఐపి)

ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపి అనేది పొత్తికడుపు స్థలంలోకి నేరుగా కీమోథెరపిని ఇవ్వడం. దశ 3 అండాశయ క్యాన్సరు గల మరియు మంచి డీబల్కింగ్ సర్జరీ చేయించుకున్న, ఇక్కడ ఆపరేషన్ తరువాత పొత్తికడుపులో పరిమిత మొత్తంలో మాత్రమే వ్యాధి గల రోగులకు ఈ రకమైన కీమోథెరపి ఎంపికలు. సర్జరీ సమయంలో లేదా తరువాత కేథటర్ లేదా ట్యూబు పొత్తికడుపులోకి పెట్టబడుతుంది మరియు పొత్తికడుపులోకి కార్బోప్లాటిన్ మరియు/లేదా పాక్లీటాక్సెల్తో కీమోథెరపిని ఇవ్వవచ్చు. ఈ విధంగా కీమోథెరపిని ఇవ్వడం సిరలోకి ఇచ్చినప్పటి కంటే మెరుగ్గా పనిచేయవచ్చని కొన్ని అధ్యయనాలు చూపించాయి. రోగులందరూ ఈ చికిత్సకు అనువైనవారు కాఉ మరియు ఇది మామూలుగా ఉపయోగించబడదు.