Penile Cancer

పురుషాంగానికి క్యాన్సర్‌

పెనైల్ క్యాన్సర్

పురుషాంగం అనేది పురుషుని యొక్క సంతానోత్పత్తి అవయవం. పురుషాంగానికి కలిగిన క్యాన్సరును పెనైల్ క్యాన్సరు అంటారు. పెనైల్ క్యాన్సరు వృద్ధ పురుషుల్లో కలుగుతుంది. ఇది పురుషాంగంలో ఏ భాగంలోనైనా కలగవచ్చు, కానీ పురుషాంగం హెడ్‌లో చర్మం కింద ఎక్కువ సామాన్యంగా ఉంటుంది.

గ్లోబోకాన్‌ 2018 రిపోర్టు ప్రకారం, భారతదేశంలో ఈ తరహా క్యాన్సర్లు 9938 ఉన్నాయి, నిర్థారణ చేయబడిన మొత్తం క్యాన్సర్లలో ఇవి దాదాపు 1% ఉన్నాయి.

పెనైల్ క్యాన్సరు యొక్క అత్యంత సామాన్యమైన క్యాన్సర్‌ స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా. ఇతర రకాల క్యాన్సర్లలో పాపిల్లరీ కార్సినోమా, బాసలోయిడ్‌ కార్సినోమా, వెర్రుకోవస్‌ కార్సినోమా మరియు అరుదుగా కార్సినోమా లాంటి సర్కోమా.

పురుషాంగానికి ప్రమాదకర అంశాల్లో ఈ కింద ఇవ్వబడినవి ఉంటాయి.

వయస్సు

50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వారిలో పెనైల్ క్యాన్సరు ఎక్కువ సామాన్యంగా, 70 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో ప్రత్యేకంగా ఎక్కువగా ఉంటుంది.

హెచ్పివి ఇన్ఫెక్షన్

హెచ్పివి అనేది హ్యూమన్ పాపిల్లోమా వైరస్, ఇది లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమీ కల్పించదు మరియు హెచ్పివి ఇన్ఫెక్షన్ జీవితంలో ఏదో ఒక సమయంలో కలిగిన ప్రజలకు పెనైల్ క్యాన్సరు కలిగే ప్రమాదం పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి తగ్గడం

అవయవ మార్పిడి లేదా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ లాంటి ఇన్ఫెక్షన్ల తరువాత మందుల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిన ప్రజలకు పెనైల్ క్యాన్సరు కలిగే ప్రమాదం పెరుగుతుంది.

ఇతరులు

వివాహం చేసుకున్న మరియు సుంతీ చేయించుకోని ప్రజలకు పెనైల్ క్యాన్సరు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సోరియాసిస్ అనే వైద్య స్థితి గల వారికి, సోరాలెన్ లేదా యువిఎ చికిత్స చేయించుకున్న వారికి కూడా పెనైల్ క్యాన్సరు కలిగే ప్రమాదం పెరుగుతుంది.

పురుషాంగానికి గల క్యాన్సరు ఈ స్థితి గురించి రోగిని అప్రమత్తం చేయగల లక్షణాలను కలిగించవచ్చు. వీటిల్లో ఉంటాయి

బుడిపె లేదా అల్సర్

పురుషాంగంపై గట్టి బుడిపె, అల్సర్ లేదా పుండు కలగవచ్చు. ఇది పురుషాంగం చర్మంపై లేదా చర్మం కింద కనిపించవచ్చు. ఈ బుడిపె నొప్పిగా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు కొంత కాలంలో సైజు పెరుగుతుంది.

రక్తస్రావం లేదా డిశ్చార్జి

పురుషాంగం నుంచి లేదా ముందరి చర్మం కింద నుంచి రక్తస్రావం పురుషాంగం యొక్క క్యాన్సరు లక్షణం అయివుండొచ్చు. ఈ స్థితి గల కొంతమంది రోగులకు డిశ్చార్జి దుర్వాసన రావడం కూడా ఉండొచ్చు.

ముందరి చర్మాన్ని కదిలించలేకపోవడం

ఇంతకుముందు మాదిరిగా పురుషాంగంపై ముందరి చర్మాన్ని స్వేచ్ఛగా కదిలించలేకపోవడం పురుషాంగం యొక్క క్యాన్సరుకు చిహ్నం అయివుండొచ్చు.

ఇతర లక్షణాలు

ముదిరిన క్యాన్సరు గల రోగుల్లో కనిపించిన పురుషాంగం క్యాన్సరుకు సంబంధించిన ఇతర లక్షణాల్లో ఒకటి లేదా రెండు గజ్జబల్లో వాపు లేదా బుడెపె, అలసట, కాలు వాపు, బరువు తగ్గడం మరియు ఆకలి లేకపోవడం ఉంటాయి.

పురుషాంగానికి క్యాన్సరు ఉన్నట్లుగా అనిపించినప్పుడు, వ్యాధి నిర్థారణ మరియు దశను ధృవీకరించేందుకు ఈ కింది పరీక్షలు చేయబడతాయి.

బయాప్సీ

క్యాన్సరును నిర్థారించేందుకు పురుషాంగంపై బుడిపె లేదా వృద్ధి బయాప్సీ చేయబడుతుంది. అదే సమయంలో, గజ్జల్లో ఏవైనా అనుమానాస్పద లింఫ్ నోడ్స్ ఉంటే, క్యాన్సరు వ్యాప్తి కోసం చూసేందుకు ఈ నోడ్స్పై నీడిల్ ఆస్పిరేషన్ (ఎఫ్ఎన్ఎసి) చేయబడుతుంది.

సిటి స్కాన్

క్యాన్సరు వ్యాప్తిని మరియు దాని దశను నిర్ధారించేందుకు ఛాతీ, పొత్తికడుపు మరియు పెల్విస్కి సిటి స్కాన్ తీయబడుతుంది. శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సరు వ్యాప్తిని స్కాన్ చూస్తుంది.

ఎంఆర్ఐ స్కాన్

అనుమానిత క్యాన్సరును మరియు పెరిగిన లింఫ్ నోడ్స్ని చూసేందుకు మరియు దాని స్టేజిని తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కాన్ తీయబడుతుంది. స్టేజిని తెలుసుకునేందుకు సాధారణంగా సిటి స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ సరిపోతుంది, కానీ కొన్ని పరిస్థితుల్లో రెండూ అవసరమవుతాయి.

పిఇటి సిటి స్కాన్

క్యాన్సరు స్టేజిని తెలుసుకునేందుకు సిటి స్కాన్కి బదులుగా పిఇటి సిటి స్కాన్ తీయబడుతుంది. పురుషాంగం బయట క్యాన్సరు వ్యాపించిన ఏరియాలను కనుగొనడంలో పిఇటి సిటి స్కాన్ ఎక్కువ సున్నితంగా ఉండొచ్చు.

సెంటినెల్ నోడ్ బయాప్సీ

సెంటినెల్ నోడ్ అనేది క్యాన్సరు వ్యాపించగల మొదటి నోడ్ లేదా నోడ్స్లో ఒకటి. సెంటినెల్ నోడ్లో క్యాన్సరు లేకపోతే, ఇతర లింఫ్ నోడ్స్లో క్యాన్సరు ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది.
పురుషాంగంలో కణితి చుట్టూ గల ప్రాంతంలోని కొద్ది మొత్తంలో రేడియోధార్మిక పదార్థం లేదా బ్లూ డైని ఎక్కించిన తరువాత సాధారణంగా గజ్జల్లో సెంటినెల్ నోడ్ ఉంటుంది. డై వ్యాపించిన మొదటి లింఫ్ నోడ్/లచే ఈ డై తీసుకుంటుంది. సర్జరీ సమయంలో నోడ్స్ని కనిపెట్టడానికి ఈ పదార్థాలు సర్జన్కి సహాయపడతాయి. అదే సమయంలో లేదా సర్జరీకి ముందు సెంటినెల్ నోడ్ బయాప్సీ చేయబడుతుంది. ఇలా తొలగించిన నోడ్స్ క్యాన్సరు కణాల కోసం సూక్ష్మదర్శినిలో పరీక్షించబడతాయి. క్యాన్సరు కణాలు లేకపోతే, నోడ్స్ని తొలగించడానికి సర్జరీ చేయవలసిన అవసరం ఉండదు. అయితే, ఒకవేళ క్యాన్సరు కణాలు కనుగొంటే, ఆ ఏరియాలో ఇతర లింఫ్ నోడ్స్ అన్నిటినీ తొలగించాలని సర్జన్ నిర్ణయించవచ్చు.

టిఎన్ఎం లేదా నంబరు స్టేజింగ్ సిస్టమ్ ప్రకారం పెనైల్ క్యాన్సరుకు స్టేజి ఇవ్వబడుతుంది.
క్యాన్సరు స్టేజ్ అనేది శరీరంలో క్యాన్సరు సైజు మరియు లొకేషన్ని వివరించేందుకు ఉపయోగించే పదం.
క్యాన్సరు స్టేజిని తెలుసుకోవడం అత్యంత సముచితమైన చికిత్సను నిర్ణయించడానికి డాక్టర్లకు సహాయపడుతుంది. టిఎన్ఎం లేదా నంబరు స్టేజింగ్ సిస్టమ్ ప్రకారం పెనైల్ క్యాన్సరుకు స్టేజి ఇవ్వబడుతుంది.
ఏ సిస్టమ్తో స్టేజి ఇవ్వాలనే విషయం పురుషాంగంపై కణితి ఏ మేరకు ఉంది, లింఫ్ నోడ్స్కి క్యాన్సరు వ్యాప్తి, శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సరు వ్యాప్తి అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. టిఎన్ఎం అంటే ట్యూమర్, నోడ్ మరియు మెటాస్టాసెస్ అని అర్థం. టి అంటే ట్యూమర్ అని అర్థం. ఎన్ అంటే నోడ్స్ మరియు నోడ్స్కి క్యాన్సరు వ్యాప్తి అని అర్థం. ఎం అంటే మెటాస్టాసెస్ అని మరియు క్యాన్సరు శరీరంలోని దూర ప్రాంతాలకు వ్యాపించిందని అర్థం.

టిఎన్ఎం స్టేజింగ్

టి స్టేజ్

టి1 కణితి కేవలం చర్మం కింది ఏరియాలకు ఉంది.
టి2 కార్పస్ స్పాంజియోసమ్లో కణితి ఉంది, ఇది పురుషాంగంలోని మెత్తని అంగస్తంభన కణజాలం మరియు యురెత్రాలో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.
టి3 కణితి కార్పోరా కావెర్నోసమ్లో ఉంది మరియు యురెత్రాలో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.
టి4 కణితి ప్రొస్టేట్ గ్రంథి, వృషణం లేదా ప్యూబిక్ ఎముక లాంటి సమీపంలోని అవయవాలకు వ్యాపించింది.

ఎన్ స్టేజ్

ఎన్0 లింఫ్ నోడ్స్కి ప్రమేయం లేదు
ఎన్1 గజ్జల్లోని ఒక లింఫ్ నోడ్కి క్యాన్సరు వ్యాపించింది (ఇంగ్యునల్)
ఎన్2 గజ్జల్లోని అనేక లింఫ్ నోడ్స్కి క్యాన్సరు వ్యాపించింది.
ఎన్3 పెల్విస్ లోని లింఫ్ నోడ్స్కి లేదా లింఫ్ నోడ్ నుంచి పరిసర కణజాలాల్లోకి క్యాన్సరు వ్యాపించింది.

ఎం స్టేజ్

ఎం 0 క్యాన్సరు ఇతర అవయవాలకు లేదా కణజాలాలకు వ్యాపించలేదు
ఎం1 క్యాన్సరు పెల్విస్ బయటి ప్రాంతాలకు విస్తరించింది.

సంఖ్య స్టేజింగ్

స్టేజ్ 1 టి1 ఎన్0 ఎం0
స్టేజ్ 2 టి1b ఎన్0 ఎం0
టి2 ఎన్0 ఎం0
టి3 ఎన్0 ఎం0
స్టేజ్ 3ఎ టి1-3 ఎన్1 ఎం0
స్టేజ్ 3బి టి1-3 ఎన్2 ఎం0
స్టేజ్ r4 టి4 aఎన్y ఎన్ ఎం0
Aఎన్y టి ఎన్3 ఎం0
Aఎన్y టి aఎన్y ఎన్ ఎం1

పెనైల్ క్యాన్సరుకు లభించే చికిత్సల్లో కణితిని తొలగించడానికి సర్జరీ, రేడియోథెరపి మరియు కీమోథెరపి ఉంటాయి. ఏ చికిత్సను ఎంచుకోవాలనే విషయం రోగనిర్థారణ సమయంలో క్యాన్సరు దశ మరియు లొకేషన్ మరియు రోగి ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది.

సర్జరీ

ఈ రకమైన క్యాన్సరును నియంత్రించేందుకు గల ప్రధాన చికిత్సలో సర్జరీ ఒకటి. పురుషాంగంపై క్యాన్సరు ఎక్కడ మరియు ఏ మేరకు ఉందనే దానిపై సర్జరీ రకం ఆధారపడి ఉంటుంది. క్యాన్సరుతో పాటు దాని చుట్టూ ఉన్న మామూలు పురుషాంగాన్ని తొలగించడం ర్జరీ లక్ష్యం. దాని చుట్టూ ఉన్న మామూలు మార్జిన్ని తొలగించడం ఆపరేషన్ పరిపూర్ణంగా ఉండేలా చూస్తుంది. విభిన్న రకాల ఆపరేషన్లు ఇవి.

గ్లాన్‌సెక్టోమి

ఈ ఆపరేషన్లో గ్లాన్స్ పెన్నిస్ (పురుషాంగం హెడ్) తొలగించబడుతుంది. పురుషాంగం యొక్క ముందరిచివరలో క్యాన్సరు ఉంటే ఈ ఆపరేషన్ చేయబడుతుది. గ్లాన్స్ని తొలగించిన తరువాత, శరీరంలో మరొక చోటు నుంచి చర్మం లేదా కండరంలో కొంత భాగాన్ని తీసి పురుషాంగానికి మళ్ళీ ఆకారం ఇచ్చేందుకు గ్లాన్స్ స్థానంలో పెట్టబడుతుంది.

పెనెక్టోమి

పెనెక్టోమి అంటే పురుషాంగాన్ని తొలగించడమని అర్థం. ఇది పాక్షిక పెనెక్టోమి అయివుండొచ్చు, దీనిలో పురుషాంగంలో కొంత భాగం తొలగించబడుతుంది లేదా సంపూర్ణ పెనెక్టోమి, దీనిలో పురుషాంగం మొత్తం తొలగించబడుతుంది. ఏ రకమైన పెనెక్టోమి చేయాలనేది కణితి పురుషాంగం లోపలకు ఎంత దూరం వెళ్ళింది మరియు క్యాన్సరు ఏ మేరకు ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. క్యాన్సరు కనుక పురుషాంగం వెనుక ఉంటే, సంపూర్ణ పెనెక్టోమి చేయబడుతుంది. పాక్షిక పెనెక్టోమి చేయించుకున్న రోగులు నిలబడి మూత్రవిసర్జన చేయగలుగుతారు మరియు సంపూర్ణ పెనెక్టోమి చేయించుకున్న వారికి యురెత్రాను మలద్వారానికి కనెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, దీని ద్వారా మూత్రవిసర్జన చేయగలుగుతారు. మూత్రాన్ని ఉంచుకోవడం మరియు నియంత్రించడం పనిచేస్తూనే ఉంటుంది.

పునర్నిర్మాణం

కొంతమంది సర్జన్లు రోగి యొక్క శరీరంలోని ఇతర భాగాల నుంచి తీసిన కండరం మరియు చర్మం ఉపయోగించి సర్జరీ తరువాత పురుషాంగాన్ని పునర్నిర్మిస్తారు. పునర్నిర్మాణం తరువాత, సర్జరీకి ముందు మాదిరిగానే రోగి మూత్రవిసర్జన చేయడం సాధ్యపడుతుంది.

లింఫ్‌ నోడ్‌ని తొలగించుట

లింఫ్ నోడ్కి వ్యాపించినట్లుగా అనుమానం ఉంటే, లింఫ్ నోడ్స్లో క్యాన్సరు ఉందేమో చూసేందుకు ఎఫ్ఎన్ఎసి చేయబడుతుంది. గజ్జలోని లింఫ్ నోడ్స్లో క్యాన్సరు ఉన్నట్లుగా సాక్ష్యం ఉంటే, లింఫ్ నోడ్ విచ్ఛేదనం చేయబడుతుంది లేదా తొలగించడం చేయబడుతుంది. ఏరియాలోని లింఫ్ నోడ్లన్నీ తొలగించబడతాయి. ఇది ఒకటి లేదా రెండు గజ్జల్లో చేయబడుతుంది. సెంటినెల్ నోడ్ బయాప్సీ తీయబడితే, పాజిటివ్ సెంటినల్ నోడ్స్ సైడ్లో గల లింఫ్ నోడ్స్ తొలగించబడతాయి.

రేడియోథెరపి

పురుషాంగం క్యాన్సరులో చికిత్సగా రేడియోథెరపి విభిన్న పరిస్థితుల్లో ఉపయోగించబడుతుంది. ఫిట్నెస్ తగ్గడం లేదా ఇతర కారణాల వల్ల సర్జరీ చేయించుకోని రోగుల్లో సర్జరీకి బదులుగా క్యాన్సరుకు చికిత్స చేసేందుకు దీనిని ఉపయోగించవచ్చు. పురుషాంగంపై సర్జరీ తరువాత గజ్జల్లో లింఫ్ నోడ్లను తొలగించడానికి బదులుగా లింఫ్ నోడ్లకు చికిత్స చేసేందుకు రేడియోథెరపిని ఉపయోగించవచ్చు. పెల్విస్లోని లింఫ్ నోడ్లకు వ్యాపించిన క్యాన్సరుకు చికిత్స చేసేందుకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇచ్చినప్పుడు దీనిని 6 వారాల వరకు వ్యవధి వరకు రోజువారీ చికిత్సగా ఉపయోగించవచ్చు.

కీమోథెరపి

ముదిరిన క్యాన్సరు గల రోగుల్లో పురుషాంగ క్యాన్సరుకు కీమోథెరపిని ఉపయోగిస్తారు. వ్యాధి పరిమాణాన్ని తగ్గించేందుకు సర్జరీకి ముందు టాక్సేన్స్, సిస్ప్లాటిన్ మరియు ఇఫోస్ఫామైడ్ లాంటి ఔషధాలతో సమ్మేళనంగా కీమోథెరపిని ఉపయోగించవచ్చు. క్యాన్సరును తిరగబెట్టే ప్రమాదాన్ని తగ్గించేందుకు ముదిరిన వ్యాధి గల రోగుల్లో సర్జరీ తరువాత కూడా దీనిని ఉపయోగించవచ్చు. మెటాస్టాటిక్ వ్యాధి లేదా ప్రారంభ చికిత్స తరువాత తిరిగొచ్చిన వ్యాధి గల రోగుల్లో, వ్యాధిని నియంత్రించేందుకు కీమోథెరపిని ఉపయోగిస్తారు.