Spinal Cord Compression

వెన్నుపూస కంప్రెషన్

వెన్నుపూస

వెన్నుపూస అనేది మెదడును శరీరంలోని భాగాలన్నిటిలోని నరాలకు కనెక్ట్ చేసే మెత్తని ట్యూబు లాంటి నిర్మాణం. వెన్నుపూస వెర్టెబ్రల్ బాడీస్ లేదా వెర్టెబ్రా మధ్యలో ఉండే స్థలమైన స్పైనల్ కెనాల్లో ఉంటుంది. వెర్టెబ్రాలన్నీ కలిపి వెన్నుపూసను ఏర్పరుస్తాయి మరియు సెర్వైకల్ (మెడ), థొరాసిక్ (ఛాతీ), లంబార్ (పొత్తికడుపు) మరియు సాక్రల్ ఏరియాలుగా విభజించవచ్చు. ఈ వెర్టెబ్రాలో ఉండే వెన్నుపూసను సెర్వైకల్ కార్డ్, థొరాసిక్ కార్డ్ లాంటి అవే పేర్లతో కూడా పిలుస్తారు.

కూడా వెన్నుపూస పని శరీర భాగాల నుంచి నరం ప్రేరేపణలను మెదడుకు మరియు మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు పంపడం. ఉదాహరణకు, మనం నడవాలని నిర్ణయించుకుంటే, మెసేజ్ మెదడు నుంచి కాళ్ళు మరియు చేతుల్లోని కండరాలకు ప్రసారమవుతుంది. దీనివల్ల మనం పైకి లేచి నడవడం ప్రారంభిస్తాము. అలాగే స్పర్శ, నొప్పి, ఉష్ణోగ్రత లాంటి అనుభూతులు మెదడుకు వెళ్ళినప్పుడు కూడా ఈ అనుభూతులు కలుగుతాయి.

క్యాన్సరులో వెన్నుపూస కంప్రెషన్

వెన్నుపూస కంప్రెషన్ అనేది క్యాన్సరు వెట్రెబ్రాకు వ్యాప్తించిన రోగుల్లో కలిగే స్థితి లేదా సంక్లిష్టసమస్య. వెట్రెబ్రాలో క్యాన్సరు ఉన్నప్పుడు, వెట్రెబ్రా బలహీనపడుతుంది మరియు ఫ్రాక్చర్ లేదా విరగడం కలగవచ్చు లేదా అస్థిరంగా మారి వెన్నుపూస ఇరుకుగా మారడానికి దారితీస్తుంది మరియు వెన్నుపూస కంప్రెషన్ లేదా బిగుసుకుపోవడం కలిగిస్తుంది. దీనివల్ల వెన్నుపూస అసంబద్ధంగా పనిచేయడానికి దారితీసి రోగికి లక్షణాలు కలిగించవచ్చు. కొంతమంది రోగుల్లో, వెట్రెబ్రా విరగడం ఉండకపోవచ్చు, కానీ వెన్నుపూసలోకి క్యాన్సరు పెరిగి కంప్రెషన్ కలిగించవచ్చు. వెట్రెబ్రాలో క్యాన్సరు గల వారందరికీ వెన్నుపూస కంప్రెషన్ జరగదని, కొంతమందిలో కలగవచ్చని తెలుసుకోవడం ముఖ్యం. ఈ స్థితితో మామూలుగా ముడిపడివుండే క్యాన్సర్లలో ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, రొమ్ము, మైలోమా మరియ మూత్రపిండాల క్యాన్సర్లు ఉంటాయి.

క్యాన్సరు గల రోగిలో వెన్నుపూస కంప్రెషన్ జరిగివుండొచ్చునని అనుమానించడానికి ఈ కింది లక్షణాలు కలగవచ్చు, ప్రత్యేకించి ఎముకల్లో మెటాసాసెస్లు ఉన్న వాళ్ళలో కలగవచ్చు. మామూలు లక్షణాలు ఈ కింద జాబితాగా ఇవ్వబడ్డాయి.

నడుము నొప్పి

ఎముక మెటాస్టాసెస్ గల రోగుల్లో నడుము నొప్పి మామూలు లక్షణం. వెన్నెముకలో ఏ భాగంలోనైనా నొప్పి ఉండొచ్చు మరియు ఈ కింద ఇవ్వబడిన ఇతర లక్షణాలతో ఉన్నప్పుడు వెన్నుపూస కంప్రెషన్ గురించి రోగిని అప్రమత్తం చేయాలి.

కాళ్ళు మరియు చేతుల్లో బలహీనత

కాళ్ళు లేదా చేతుల్లో బలహీనత ఉండటం ముంచుకురాబోతున్న లేదా ఖాయమైన వెన్నుపూస కంప్రెషన్కి సంకేతం కావచ్చు. కాళ్ళు లేదా చేతుల్లో అకస్మాత్తుగా లేదా క్రమేపీ వెన్నుపూస బలహీనపడటం గమనించిన రోగులు వెన్నుపూస కంప్రెషన్ లేదనే విషయం రూఢిపరచుకునేందుకు డాక్టరును సంప్రదించాలి. నడవడంలో కష్టం లేదా నడిచేటప్పుడు పాదాలపై అస్థిరంగా ఉండటం లేదా మంచంపై నుంచి లేదా కుర్చీలో నుంచి లేవడం ఇబ్బందిగా ఉండటం రూపంలో బలహీనత లక్షణాలు కలగవచ్చు.

ఇంద్రియానుభూతి లక్షణాలు

పాదాలు, చేతులు లేదా బాహువులు లేదా శరీరంలోని ఏదైనా భాగంలో మొద్దుబారడంతో పాటు ఈ ప్రాంతాల్లో తిమ్మిరి లేదా ఇంద్రియానుభూతి మారడం కూడా ఈ స్థితి లక్షణం అయివుండొచ్చు.

మూత్రం నిలుపుదల

మూత్ర విసర్జన చేయలేకపోవడం అకస్మాత్తుగా లేదా క్రమేపీ రావడం వెన్నుపూస కంప్రెషన్ యొక్క లక్షణం అయివుండొచ్చు.

మలబద్ధకం

తీవ్ర మలబద్ధకం లేదా మలవిసర్జన చేయలేకపోవడం వెన్నుపూస కంప్రెషన్ యొక్క లక్షణం అయివుండొచ్చు, ప్రత్యేకించి ఇది పైన పేర్కొనబడిన ఇతర లక్షణాలతో ముడిపడివుంటే.

చేసిన పరీక్ష మరియు రోగికి గల లక్షణాలపై ఆధారపడి వెన్నుపూస కంప్రెషన్ ఉన్నట్లుగా డాక్టరు అనుమానిస్తే, డయాగ్నసిస్ని ధృవీకరించుకునేందుకు లేదా తిరస్కరించేందుకు అత్యవసరంగా ఎంఆర్ఐ స్కాన్ తీయబడుతుంది. ఈ స్థితిని అనుమానిస్తే, అత్యవసర పరిశోధనలు మరియు చికిత్స చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది లక్షణాలను మెరుగుపరచవచ్చు మరియు శాశ్వత అంగవైకల్యాన్ని నిరోధించవచ్చు.

వెన్నెముక మొత్తానికి ఎంఆర్ఐ

వెన్నుపూస కంప్రెషన్ ఉందా అనే విషయం నిర్థారించడానికి వెన్నెముక మొత్తానికి ఎంఆర్ఐ స్కాన్ తీయడం ఉత్తమ పరీక్ష. ఎంఆర్ఐ స్కాన్ లభించకపోతే లేదా రోగి దీనికి అనుకూలమైనవారు కాకపోతే, ఈ స్థితిని నిర్థారణ చేయడానికి సిటి స్కాన్ తదుపరి ఉత్తమ పరీక్ష.

వెన్నుపూస కంప్రెషన్ అనేది వైద్య అత్యవసరం కాబట్టి దీనికి అత్యవసరంగా చికిత్స చేయాలి. ఆదర్శప్రాయంగా నిర్థారణ చేసిన రోజునే మరియు సాధారణంగా 24 గంటల లోపు. వెన్నుపూసకు శాశ్వత డేమేజ్ని నిరోధించడానికి ఇలా చేస్తారు, దెబ్బతిన్న తరువాత కోలుకోవడం నామమాత్రంగా ఉండొచ్చు. ఈ స్థితికి రెండు ప్రధాన చికిత్స విధానాలు ఉన్నాయి. ఇవి సర్జరీ మరియు రేడియోథెరపి. పరిస్థితిని బట్టి మరియు క్యాన్సరు దశ మరియు రోగి ఫిట్నెస్ని బట్టి ఒకటి లేదా ఉభయ ఎంపికలను ఉపయోగించవచ్చు.

స్టీరాయిడ్లు

వెన్నుపూస కంప్రెషన్ నిర్వహణలో స్టీరాయిడ్లు ముఖ్య చికిత్స ఎంపిక. ఈ స్థితిని అనుమానించిన వెంటనే, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేయడానికి ముందు కూడా మామూలుగా వీటిని ప్రారంభిస్తారు. వెన్నుపూస చుట్టూ వాపును స్టీరాయిడ్లు తగ్గిస్తాయి మరియు దాని చుట్టూ ఒత్తిడిని తగ్గిస్తాయి. డెక్సామెథాసోన్ ఈ స్థితిలో మామూలుగా ఉపయోగించే స్టీరాయిడ్.

సర్జరీ

వెన్నుపూస కంప్రెషన్‌కి చేసే సర్జరీలో చుట్టూ ఉన్న క్యాన్సరు నుంచి వెన్నుపూసను డీకంప్రెషన్ చేయడం సర్జరీలో ఉంటుంది. ఇది వెన్నుపూసపై ఒత్తిడిని తగ్గించి అది తిరిగి మామూలుగా పనిచేసేలా చేస్తుంది. వెన్నెముక అస్థిరంగా ఉన్న చోట స్థిరీకరించడంతో పాటు వెర్రెట్రాలోని కొంత భాగాన్ని తొలగించడం సర్జికల్ డీకంప్రెషన్లో ఉండొచ్చు. వెన్నుపూస చుట్టూ ఉన్న క్యాన్సరును కూడా తొలగిస్తారు. యవ్వనంలో, ఫిట్గా ఉన్న మరియు శరీరంలో పరిమిత మొత్తంలో క్యాన్సరు గల రోగుల్లో సర్జరీ మామూలుగా చేయబడుతుంది.

రేడియోథెరపి

రేడియోథెరపి అనేది వెన్నుపూస కంప్రెషన్ని అదుపుచేసేందుకు చేయబడే మామూలు చికిత్స రూపొం. వెన్నుపూస కంప్రెషన్ని కలిగిస్తున్న క్యాన్సరును నియంత్రించడం ఈ చికిత్స లక్ష్యం. రేడియోథెరపిని రెండు భిన్న విధాలుగా ఇవ్వవచ్చు.
ప్రామాణిక రేడియోథెరపి, దీనిలో చికిత్స 1, 5 లేదా 10 రోజులకు ఇవ్వబడుతుంది, ఈ స్థితికి చికిత్స చేయడానికి దీనిని మామూలుగా ఉపయోగిస్తారు. దీనిని రోజుకు ఒకసారి ఇస్తారు మరియు ప్రతి రోజూ దాదాపు 5-10 నిమిషాలు ఉంటుంది.

కీమోథెరపి

లింఫోమాస్, జెర్మ్ సెల్ ట్యూమర్స్ లేదా ఊపిరితిత్తులకు స్మాల్ సెల్ కార్సినోమా లాంటి క్యాన్సర్ల వల్ల వెన్నుపూస కంప్రెషన్ గల రోగులకు సర్జరీ లేదా రేడియోథెరపికి బదులుగా కీమోథెరపితో చికిత్స చేయబడుతుంది. ఇతర వాటితో పోల్చుకుంటే కీమోథెరపికి ఈ క్యాన్సర్లు త్వరితంగా స్పందిస్తాయి.

పునరావాసా మరియు ఫిజియోథెరపి

ఈ స్థితికి చేసే చికిత్సలో ఇది ముఖ్యమైన భాగం మరియు చికిత్స మొత్తం పూర్తయితే రోగి తన పనితనాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. వెన్నుపూస కంప్రెషన్‌కి సంబంధించిన లక్షణాల నుంచి కోలుకోవడానికి సమయం పట్టవచ్చు మరియు మంచి పునరావాస కార్యక్రమం ఆ కోలుకునే ప్రక్రియకు సహాయపడుతుంది.