విమ్స్‌ కణితి

విమ్స్‌ కణితి

విమ్స్‌ కణితి లేదా నెఫ్రోబ్లాస్టోమా అనేది బాల్యంలో కలిగే క్యాన్సరు. పొత్తికడుపులో ఉన్న మూత్రపిండాల్లో ఇది కలుగుతుంది. పిల్లల్లో ఇది అత్యంత సామాన్యమైన పొత్తికడుపు కణితి మరియు బాల్యంలో కలిగే క్యాన్సర్‌లన్నిటిలో దాదాపు 5-6% ఉంటుంది. ఈ క్యాన్సర్లలో అత్యధికం 5 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లల్లో కలుగుతుంది.

విమ్స్‌ కణితితో ముడిపడివున్న ప్రమాదకర అంశాల్లో డబ్ల్యుఎజిఆర్‌ సిండ్రోమ్‌, బెక్విత్‌-వైడ్‌మన్‌ సిండ్రోమ్‌, డేనిస్‌- డ్రాష్‌ సిండ్రోమ్‌, సోటోస్‌ సిండ్రోమ్‌ మరియు పెరల్‌మన్‌ సిండ్రోమ్‌ లాంటి పుట్టుకతో వచ్చే సిండ్రోమ్‌లు ఉంటాయి.

విమ్స్‌ కణితితో ముడిపడివున్న లక్షణాల్లో పొత్తికడుపు నొప్పి లేదా మాస్‌, నొప్పి, జ్వరం మరియు అధిక రక్త పోటు ఉంటాయి. ఇతర ప్రాంతాలకు క్యాన్సరు వ్యాపించడం వల్ల కలిగే లక్షణాల్లో వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపిస్తే దగ్గు లేదా శ్వాస తీసుకోలేకపోవడం, ఆకలి మరియుబరువు తగ్గడం లాంటివి ఉంటాయి.

విమ్స్‌ కణితిని నిర్థారణ చేసేందుకు మామూలుగా చేసే పరిశోధనల్లో పొత్తికడుపుకు అల్ట్రాసౌండ్‌ ఉంటుంది, చేయబడే మొదటి పరీక్ష ఇది. మూత్రపిండాల నుంచి ఉత్పన్నమయ్యే పొత్తికడుపులోని మాస్‌ని ఇది చూపిస్తుంది. దీని తరువాత పొత్తికడుపుకు సిటి స్కాన్‌ లేదా ఎంఆర్‌ఐ స్కాన్‌ ఉంఆయి. ఇతర అవయవాలకు క్యాన్సరు వ్యాప్తిని చూసేందుకు మిగతా శరీరానికి కూడా సిటి స్కాన్‌ తీయబడుతుంది. బయాప్సీ స్పెసిమెన్‌పై చేసే జన్యుపరమైన అధ్యయనాలు ఉత్తమ చికిత్స ఎంపికలను నిర్థారించడంలో విలువ చేర్చవచ్చు మరియు ప్రోగ్నోసిస్‌ గురించి సలహా కూడా సిఫారసు చేయవచ్చు.

విమ్స్‌ కణితి స్టేజింగ్‌ విభిన్న వ్యవస్థలతో చేయబడుతుంది మరియు ఎన్‌డబ్ల్యుటిఎస్‌ సిస్టమ్‌, ఎస్‌ఐఒపి స్టేజింగ్‌ సిస్టమ్‌ వీటిల్లో ఉంటాయి. విమ్స్‌ కణితిని తక్కువ, ఒకమోస్తరు మరియు అధిక రిస్కు గల గ్రూపుల్లోకి కూడా వర్గీకరించడమైనది మరియు చికిత్స వ్యూహాలు దానిపై ఆధారపడి మారుతుంటాయి. సర్జరీ చేసిన తరువాత ఈ స్టేజింగ్‌ సిస్టమ్స్‌ ఉపయోగించబడతాయి మరియు సరళీకృత సిస్టమ్‌ ఈ కింద ఇవ్వబడింది.

స్టేజ్‌ 1 కణితి మూత్రపిండానికి పరిమితమైంది.
స్టేజ్‌ 2 కణితి మూత్రపిండాల పక్కన ఉన్న అవయవాలు లేదా కణజాలాలకు విస్తరించింది, కానీ సర్జరీలో పూర్తిగా తొలగించబడింది.
స్టేజ్‌ 3 పొత్తికడుపులోని లింఫ్‌ నోడ్‌ల్లో కణితి ఉంది లేదా చితికిపోయింది లేద ఆపరేషన్‌ చేసినప్పుడు అసంపూర్ణంగా తొలగించబడింది.
స్టేజ్‌ 4 మెటాస్టాటిక్‌ వ్యాధి లేదు
స్టేజ్‌ 5 ఉభయ మూత్రపిండాల్లో వ్యాధి ఉంది.

విమ్స్‌ కణితికి చికిత్సలో సర్జరీ, కీమోథెరపి మరియు రేడియోథరపి సమ్మేళనం ఉపయోగించడం ఉంటుంది. విమ్స్‌ కణితి గల అత్యధిక మంది రోగులకు వ్యాధిని నయం చేయవచ్చు. అత్యధిక మంది రోగులకు సర్జరీ మరియు కీమోథెరపితో చికిత్స ఉంటుంది. ఆపరేషన్‌ చేయదగిన కణితులు గల రోగులందరికీ క్యాన్సరును తొలగించేందుకు సర్జరీ చేయబడుతుంది. దీని తరువాత కీమోథెరపి ఉంటుంది. వినిక్రిస్టిన్‌, డోక్సోరుబిసిన్‌ మరియు డాక్టినోమైసిన్‌ అనేవి ఉపయోగించే కీమోథెరపి ఔషధాలు. కొన్ని సెంటర్లలో మొదటగా కీమోథెరపి ఇచ్చి ఆ తరువాత సర్జరీ చేయవచ్చు. ఒకమోస్తరు మరియు అధిక రిస్కు గల కణితులు గల రోగుల్లో రేడియోథెరపి ఉపయోగించబడుతుంది మరియు 4-5 వారాలు ఉండొచ్చు.