Causes of cancer

క్యాన్సరుకు గల కారణాలు

క్యాన్సరుకు అనేక కారణాలు ఉంటాయి మరియు అనేక అంశాల వల్ల సాధారణంగా క్యాన్సరు కలుగుతుంది. క్యాన్సరు కలగడం అనేది బహుళ స్టెప్ల ప్రక్రియ మరియు ఒకటి లేదా ఎక్కువ కారణాలు దీనిని ఒక స్టెప్ నుంచి మరొక దానికి తీసుకెళ్ళవచ్చు. క్యాన్సరుకు గల మామూలు కారణాలు ఈ కింద ఇవ్వబడ్డాయి.

ధూమపానం మరియు పొగాకు వాడకం

క్యాన్సరుకు గల అత్యంత సామాన్యమైన కారణాల్లో ఇది ఒకటి. ధూమపానం లేదా ఇతర మార్గాల్లో పొగాకు ఉపయోగించడం మరణానికి గల అయిదు ప్రధాన కారణాల్లో మూడింటికి ప్రేరణాత్మక ఏజెంట్గా ఉంటోంది. పొగాకు వాడటం క్యాన్సరు, గుండె జబ్బు, స్ట్రోక్, సిఒపిడి మరియు శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లు కలిగించవచ్చు. 2030 నాటికి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 మిలియన్ల మంది ప్రజల మరణానికి పొగాకు కారణమవుతుందని అంచనావేయడమైనది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాదాపు 10% మరణాలకు ఇది కారణమవుతోంది.

ధూమపానం చేసే వాళ్ళు తమ జీవితంలో సగటున దాదాపు 10 సంవత్సరాల ఆయుష్షు కోల్పోతారు మరియు ధూమపానం చేసేవారిలో దాదాపు 50% మంది పొగాకు సంబంధ వ్యాధితో చనిపోతారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని గ్యాట్స్ 2010లో భారతదేశంలో చేసిన సర్వే, భారతదేశంలో 35% మందికి పైగా వయోజనులు ఏదో ఒక రూపంలో పొగాకు వాడుతున్నట్లుగా వెల్లడించింది. వీళ్ళల్లో మూడింట రెండు వంతుల మంది పొగలేని పొగాకు ఉపయోగిస్తున్నారు. ఖైనీ (పొగాకు మరియు సున్నం మిశ్రమం) అత్యంత సామాన్యంగా వాడుతున్న పొగలేని పొగాకు కాగా, ఆ తరువాత స్థానంలో గుట్కా ఉంది. పొగాకు ధూమపానం చేసే వారిలో, సిగరెట్ కంటే బీడీని ఎక్కువ సామాన్యంగా వాడుతున్నారు. పొగాకు నమలడం కొంత కాలానికి నోరు మరియు గొంతులో మార్పులు కల్పిస్తోంది మరియు ఈ మార్పులు ఆ తరువాత క్యాన్సరు అభివృద్ధికి దారితీస్తున్నాయి.

ధూమపానం మరియు క్యాన్సరు

క్యాన్సరు కలగడానికి ధూమపానం చాలా ముఖ్యమైన ప్రమాదకర అంశంగా ఉంది. ఊపిరితిత్తులు, అన్నవాహిక, బ్లాడర్తో సహా అనేక క్యాన్సర్లు, నోరు, గొంతు, నాలుకతో సహా తల మరియు మెడ క్యాన్సర్లు కలిగే ప్రమాదాన్ని ధూమపానం పెంచుతుంది, భారతదేశంలో, పొగలేని పొగాకు వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నోటి ప్రాంతంలో క్యాన్సరు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పొగాకు ధూమపానంలో దాదాపు 70 తెలిసిన రసాయనాలు ఉన్నాయి. ఇవి ఇతర వందలాది రసాయనాలతో పాటు క్యాన్సరు కలిగించవచ్చు.

పొగాకు ధూమపానంలో గల క్యాన్సరును- కలిగించే రసాయనాల్లో తారు, పోలోనియమ్-210, కాడ్మియం,బెంజీన్, నికెల్,ఆర్సెనిక్, ఫార్మల్డీహైడ్, పాలిసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్లు, ఆక్రోలెయిన్, నైట్రోసామినేస్, క్రోమియం మరియు ఇతర రసాయనాలు ఉంటాయి. అమ్మోనియా, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజెన్ ఆక్సైడ్లు, హైడ్రోజెన్ సైనైడ్ మరియు అనేక ఇతరవి ఉంటాయి.

ధూమపానం క్యాన్సరు ఎలా కలిగిస్తుంది

పొగాకులో గల రసాయనాలను పీల్చినప్పుడు లేదా మింగినప్పుడు శరీరంలోని మామూలు నిర్మాణాలకు డమేజ్ కలిగించవచ్చు. ఉదాహరణకు, ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలను నైట్రోజెన్ ఆక్సైడ్ సంకోచింపజేసి శ్వాసతీసుకోలేకపోవడం కలిగిస్తుంది. హైడ్రోజెన్ సైనైడ్ మరియు అమ్మోనియా ఊపిరితిత్తుల యొక్క శుభ్రంచేసే యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఊపిరితిత్తుల్లో ఉన్న టాక్సిన్లను శుభ్రంచేయడాన్ని నిరోధిస్తుంది. సిగరెట్ పొగలో గల రేడియోయాక్టివ్ పోలోనియమ్-210 వాయుమార్గాల యొక్క కణాల లైనింగ్కి రేడియేషన్ డేమేజ్ కలిగించవచ్చు. ఈ కార్సినోజెన్స్లో కొన్ని శరీరంలోకి పీల్చుకోబడతాయి మరియు ఇతర అవయవాలను ప్రభావితం చేయవచ్చు, ఆ అవయవాల్లో క్యాన్సరు కలిగే అపాయాన్ని పెంచుతుంది. కణాల్లోని డిఎన్ఎతో కలిపి కెమికల్ కార్సినోజెన్స్ జీన్స్లో శాశ్వతంగా మ్యుటేషన్లు కలిగిస్తాయి.

ఇది కణంలోని వృద్ధి నియంత్రణ యంత్రాంగాలు కోల్పోవడానికి ఇది దారితీయొచ్చు, ఫలితంగా ఇది క్యాన్సరుకు దారితీయొచ్చు. క్యాన్సరు అభివృద్ధితో ధూమపానం నేరుగా ముడిపడివుందడానికి బోలెడంత సాక్ష్యం ఉంది.

ధూమపానం చేయనివారు పీల్చే పొగను సెకండ్ హ్యాండ్ ధూమపానం అని అంటారు మరియు ఇది ఊపిరితిత్తుల క్యాన్సరుకు ప్రమాదకర అంశంగా లేదా ప్రేరణాత్మక ఏజెంట్గా ఉంటుంది. ఈ విధమైన ధూమపానానికి పిల్లలు మరియు వయోజనులు గురవ్వడం సామాన్యమైన విషయం. ధూమపానం చేయని మరియు ధూమపానం చేసే వ్యక్తిని వివాహమాడిన స్త్రీలకు దూమపానం చేయని భర్తలు గల మహిళలతో పోల్చుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సరు కలిగే ప్రమాదం 25% పెరుగుతుంది. సెకండ్ హ్యాండ్ పొగకు గురయ్యే పిల్లలకు ఊపిరితిత్తుల క్యాన్సరు కలిగే ప్రమాదం పెరగవచ్చు. పనిచేసే చోట సెకండ్ హ్యాండ్ పొగకు గురయ్యే వారి విషయంలో కూడా ఇది నిజమవుతుంది.

ఆల్కహాల్


క్యాన్సరుకు ఆల్కహాల్ ముఖ్యమైన ప్రమాదకర అంశం. నోటి క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు (గల్లెట్), గొంతు క్యాన్సరు మరియు లారినిక్స్ (స్వర పేటిక), కాలేయం క్యాన్సరు, పేగు క్యాన్సరు మరియు రొమ్ము క్యాన్సరుతో సహా వివిధ క్యాన్సర్లు కలగడంతో ఆల్కహాల్ ముడిపడివుంటుంది.

ఆల్కహాల్ అనేక విధాలుగా క్యాన్సరు కలిగించవచ్చు. ఇది నోరు మరియు గొంతులో ఇరిటెంట్గా చర్య చూపించి కణం దెబ్బతినడానికి దారితీస్తుంది. ఆల్కహాల్ తాగగానే, శరీరంలో ఇది దాని ఉప ఉత్పాదనల్లోకి విభజించబడుతుంది. ఈ ఉప ఉత్పాదనలు రసాయనాలుగా పనిచేసి పేగు మరియు కాలేయంలోని కణాలను పాడుచేస్తాయి. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను కూడా ఆల్కహాల్ పెంచుతుంది, ఇది తిరిగి రొమ్ము క్యాన్సరు కలిగే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫోలేట్ అనే విటమిన్ బి స్థాయిలు తగ్గుతాయి, ఇది పేగు మరియు రొమ్ము క్యాన్సరు ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆల్కహాల్ని కొద్ది మొత్తాల్లో తీసుకున్నా కూడా క్యాన్సరు కలిగించవచ్చు. రోజుకు ఒక డ్రింక్ తీసుకోవడం క్యాన్సరు కలిగే ప్రమాదాన్ని 4-7% మేర పెంచుతుంది. ఆల్కహాల్ని వినియోగించే మొత్తాలను పెంచే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం మరియు మద్యపానం చేసే వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పొగాకు మరియు ఆల్కహాల్ సమిష్టిగా పనిచేసి శరీరాన్ని డేమేజ్ చేస్తాయి.

స్థానబద్ధ జీవనశైలి

గణనీయమైన యాక్టివిటి లేదీ లేకుండా సెకండరి జీవనశైలిని కలిగివుండటం క్యాన్సరుకు ప్రమాదకర అంశం కావచ్చు. క్యాన్సరు మరణాల్లో దాదాపు 5% శారీరక వ్యాయామం తగ్గడానికి సంబంధించినది అయివుండొచ్చు.

ఆహారం

ఊబకాయానికి దారితీసేలా అనారోగ్యకరమైన ఆహారం తినడం క్యాన్సరు కలగడానికి ప్రమాదకర అంశం. క్రమంతప్పకుండా తినే ప్రాసెస్డ్ మాంసం లేదా రెడ్ మాంసం ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాదాపు మూడో వంతు క్యాన్సరు మరణాలకు బహుశా ఆహారం మరియు ఊబకాయం కారణమవుతాయి.

ఊబకాయం


ఊబకాయం లేదా బరువు పెరగడం క్యాన్సరు కలిగే ప్రమాదంతో ముడిపడివుంటుంది. రొమ్ము, పొట్ట, పెద్దపేగు, అన్నవాహిక, క్లోమం, మూత్రపిండం మరియు థైరాయిడ్ క్యాన్సర్లతో సహా అన్ని క్యాన్సర్లలో దాదాపు అయిదో వంతు కలగడానికి ఊబకాయం కారణం. బరువు తగ్గడం వల్ల ఆ ప్రమాదం తగ్గుతుంది.

కాలుష్యం

రసాయనాలు మరియు డీజిల్ లేదా పెట్రోల్ ఎగ్జాస్ట్ మంటల నుంచి వెలువడే వాయు కాలుష్యాలు క్యాన్సరుకు ప్రమాదకర అంశాలు. మామూలు వాయు కాలుష్యాల్లో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజెన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సడ్, బెంజీన్ లాంటి సేంద్రీయ కాంపౌండ్లు మియు పాలిసైక్లిక్ ఆరోమ్యాటిక్ హైడ్రోకార్బన్లు ఉంటాయి.

పర్టిక్యులేట్ మేటర్ అనేది గట్టి మరియు లిక్విడ్ రేణువులన్నిటికీ మరియు గాలిలో ఉండే తుంపరలకు ఉపయోగించే పదం. ఈ పర్టిక్యులేట్ మేటర్స్ వివిధ సైజుల్లో ఉండొచ్చు. పిఎం10 అంటే మ్యాటర్ సైజు 10 మైక్రాన్ల కంటే తక్కువగా ఉందని అర్థం. అలాగే, పిఎం2.5 అంటే మ్యాటర్ సైజు 2.5 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్న రేణువులు, ప్రత్యేకించి పిఎం2.5ని ఊపిరితిత్తుల్లోకి లోతుగా పీల్చగలిగినవి మరియు అక్కడి నుంచి రక్తప్రవాహంలోకి ప్రవేశించవచ్చు.

ఇన్ఫెక్షన్

కొన్ని క్యాన్సర్లు ఇన్ఫెక్షన్ల ఫలితంగా కలగవచ్చు. అత్యధిక సెర్వైకల్ క్యాన్సర్లు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పివి) అనే వైరస్ వల్ల కలిగిన పూర్వ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతాయి. ఈ వైరస్ తల మరియు మెడ ప్రాంతంలో కొన్ని క్యాన్సర్లు, మలద్వార క్యాన్సర్ మరియు అంగం క్యాన్సర్ కూడా కలిగించవచ్చు. పిల్లల్లో ఇన్ఫెక్షన్లు కలిగించే ఎప్స్టీన్ బర్ వైరస్ (ఇబివి) అనే వైరస్ లింఫోమాలు మరియు నాసోఫారింజియల్ కార్సినోమాలు కూడా కలిగించవచ్చు. హెచ్ఐవి గల ఇన్ఫెక్షన్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచవచ్చు. పొట్టలో ఉండే బ్యాక్టీరియమ్ హెలికోబాక్టర్ పైలోరి పొట్టలోని క్యాన్సర్కి కారణం కావచ్చు. హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి గల ఇన్ఫెక్షన్లు కాలేయం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చు.

వృత్తిపరమైన కారణాలు

కొన్ని వృత్తుల్లో పనిచేసేవాళ్ళు క్యాన్సర్ కలగడానికి దారితీయగల ప్రమాదకర అంశాలకు గురవ్వవచ్చు. ఉడ్, రబ్బరు మరియు డై పరిశ్రమల్లో పనిచేసే ప్రజలకు వరుసగా ముక్కు మరియు బ్లాడర్ క్యాన్సర్లు కలిగే ప్రమాదం పెరుగుతుంది. నిర్మాణ, ఆటోమొబైల్ లేదా ఇతర పరిశ్రమల్లో యాజ్బెస్టాస్కి గురయ్యేవారికి మెసోథెలియోమా లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ కలిగే ప్రమాదం ఉంటుంది. పనిచేసే చోట డీజిల్ పొగలు, ఆయిల్ మరియు బొగ్గు ఉత్పాదనలకు గురవ్వడం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

జీన్స్ మరియు క్యాన్సర్

శరీరంలోని ప్రతి కణంలో న్యూక్లియస్లో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ క్రోమోజోమ్ల్లో జీన్స్ దాదాపు 25000 ఉంటాయి. జీన్స్ మన లక్షణాలన్నిటినీ మరియు శరీరంలో కణాలు ఎలా పనిచేసే విధానాన్ని నిర్ణయిస్తాయి. లోపాలు జీన్స్లో కొంత కాలంలో మరియు పెరుగుతున్న వయస్సులో ధూమపానం లాంటి పైన వివరించిన బాహ్య కారకాల వల్ల కనిపిస్తాయి. లోపాలన్నీ ఒకేసారి కలగకపోవచ్చు మరియు కొంత కాలంలో సమీకరణ కావచ్చు. తన జీన్స్లో అనేక దోషాలు కలిగిన కణం క్యాన్సరు కణంగా మారుతుంది కాబట్టి క్యాన్సర్లు కలగడంలో లోపభూయిష్టమైన జీన్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. వ్యక్తిలో కొంత కాలంలో సమీకృతమైన లోపాలు పిల్లలకు సంక్రమించవు. జీన్స్లోని కొన్ని లోపాలు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావచ్చు. క్యాన్సరును కలిగించగల వారసత్వ జీన్స్ గల ప్రజలు లేదా కుటుంబాలకు, వాళ్ళ జీవిత కాలంలో క్యాన్సరు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన, క్యాన్సరు కలిగించగల లోపభూయిష్టమైన జీన్స్ మామూలుగా కణితి సప్రెసర్ జీన్స్. మామూలు స్థితిలో, దెబ్బతిన్న డిఎన్ఎకి మరమ్మతులు చేయడం ద్వారా శరీరంలో క్యాన్సరు ఏర్పడటాన్ని అణచివేసేందుకు ఈ జీన్స్ పని చేస్తాయి. కానీ ఈ జీన్లో లోపం ఉన్నప్పుడు, మరమ్మతుల ప్రక్రియ బలహీనపడి మరిన్ని లోపభూయిష్టమైన జీన్స్ సమీకృతం కావడానికి దారితీస్తుంది, ఇది క్యాన్సరు కలిగే ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో ప్రతి జీన్ కాపీలు రెండు ఉంటాయి మరియు వీటిల్లో ఒకటి దెబ్బతింటే, తల్లిదండ్రి నుంచి లోపభూయిష్టమైన జీన్ శిశువుకు సంక్రమించే అవకాశం 50% ఉంటుంది. కుటుంబంలో వారసత్వంగా వచ్చిన జీన్స్ వల్ల చాలా కొద్ది సంఖ్యలో క్యాన్సర్లు కలుగుతాయి. మొత్తంగా, క్యాన్సర్లలో దాదాపు 5% దీనివల్ల కలుగుతాయి. మిగతావి పర్యావరణం మరియు జీవనశైలి కారకాల వల్ల కలుగుతాయి.

వయస్సు

పెరుగుతున్న వయస్సు క్యాన్సరుకు ప్రమాదకారకం. క్యాన్సరు ఏ వయస్సులోనైనా కలగనున్నప్పటికీ, 50 సంవత్సరాల వయస్సు తరువాత దీని ప్రమాదం పెరుగుతుంది మరియు అత్యధిక క్యాన్సర్లు జీవిత చరమాంకంలో కలుగుతాయి.

హార్మోన్లు

కొన్ని హార్మోన్లు, ప్రత్యేకించి హార్మోన్ రీప్లేసెమెంట్ థెరపి రూపంలో రుతువిరతి తరువాత ఈస్ట్రోజెన్, రొమ్ము కర్కరోగానికి ప్రమాదకారకం కావచ్చు. శరీరంలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉన్నప్పుడు రొమ్ము కర్కరోగం ప్రమాదం పెరుగుతుంది. రుతువిరతి తరువాత హెచ్ఆర్టి ప్రయోజనాలు ఉంటాయి మరియు రొమ్ము కర్కరోగం లాంటి ప్రమాదాలపై దీనిని సమతూకం చేయాలి. మౌఖిక గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం కూడా ఇదే విధంగా రొమ్ము కర్కరోగం ప్రమాదాన్ని పెంచవచ్చు. అయితే, ఔషధాలు అండాశయ మరియు గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మొత్తంగా, మౌఖిక గర్భనిరోధక మాత్రల వల్ల ప్రమాదం కంటే ఎక్కువ ప్రయోజనం ఉండొచ్చు, కాబట్టి వీటిని ప్రారంభించే ముందు డాక్టరుతో చర్చించడం ఉత్తమంగా ఉంటుంది.

ఎక్స్రేలు, సిటి స్కాన్లు మరియు పిఇటి- సిటి స్కాన్లు

ఎక్స్రేలు, సిటి స్కాన్లు మరియు పిఇటి- సిటి స్కాన్లు అన్నిటికీ అయానైజింగ్ రేడియేషన్ ఉంటుంది, ఇది మామూలు కణాలను పాడుచేయవచ్చు. తరచుగా స్కాన్లు తీయించుకోవడం వల్ల వాళ్ళలో క్యాన్సరు ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా, మామూలు ఎక్స్రేలకు చాలా తక్కువ మోతాదుల్లో ఉంటుంది మరియు ఇది హానిలేనిది. అయితే, సిటి మరియు పిఇటి- సిటి స్కాన్లకు ఎక్స్రేల కంటే చాలా ఎక్కువ మోతాదుల్లో రేడియేషన్ ఉంటుంది మరియు ప్రమాదాన్ని పెంచవచ్చు. ఈ స్కాన్లను అవసరమైనప్పుడు మాత్రమే చేయడం జరుగుతుంది మరియు సాధ్యమైతే దానిని తక్కువగా ఉంచాలి, ప్రత్యేకించి వాటి వల్ల ప్రయోజనం లేని ప్రజల్లో. క్యాన్సరు రోగులకు ఈ పరీక్షలు తరచుగా చేయబడతాయి, ఇక్కడ స్కాన్ వల్ల రిస్కు కంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది, కానీ క్యాన్సరు తగ్గుముఖం పట్టిన రోగుల్లో, ఈ స్కాన్లను సాధ్యమైన మేరకు పరిమితం చేయాలి. బాగా ఉన్న ప్రజల్లో వీటిని మరింత పరిమితం చేయాలి లేదా అస్సలు చేయకూడదు.