Chemotherapy Lines

కెమోథెరపీ లైన్స్

సాధారణంగా, కెమోథెరపీని చేతి వెనుక గానీ లేదా ముంజేయిపై సిర (వెయిన్) లో గానీ ఇస్తారు. వెయిన్స్ దొరకడం కష్టంగా ఉన్నప్పుడు లేదా కెమోథెరపీ కోర్సు బాగా ఎక్కువ కాలం జరగాల్సి ఉన్నపుడు లేదా కెమోథెరపీ నిరంతర ఇన్ఫ్యూషన్ అవసరమైన పరిస్థితుల్లో చికిత్సను సులభంగా అందించడానికి ఒక సెంట్రల్ లైన్ ను ఇన్సర్ట్ చేస్తారు. వివిధ రకాలైన లైన్లు ఉపయోగించబడతాయి. అవి ఇక్కడ క్లుప్తంగా వివరించబడ్డాయి.

పిఐసిసి (PICC) లైన్

PICC (పెరిఫెరల్లీ ఇన్సర్టెడ్ సెంట్రల్ లైన్) లైన్, ఒక పొడవుగా, ఇరుకుగా ఉండే ట్యూబ్. ఇది చేతిలోని సిర వెయిన్ లోకి చొప్పించబడుతుంది. లైన్ కొన గుండె (SVC) పైన ఉన్న ఛాతీలో ఉన్న పెద్ద సిరల్లో ఉంటుంది. మరొక చివర శరీరం వెలుపల ఉంటుంది. మందులను నేరుగా ఇవ్వడానికీ, రక్త నమూనాలను తీసుకోవడానికీ ఉపయోగించవచ్చు.

ఈ లైన్ ని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ లేదా వాస్కులర్ సర్జన్ లేదా ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సు చేత ఇన్సర్ట్ చేయబడుతుంది. ఎటువంటి నొప్పి లేకుండా లైన్ ని ఇన్సర్ట్ చేయడానికి స్థానిక (లోకల్) మత్తుమందు ఉపయోగించబడుతుంది.

చికిత్సకు అవసరమైనంత కాలం PICC లైన్ ని ఆ ప్రదేశంలోనే ఉంచవచ్చు. ఉపయోగంలో లేకపోయినా వారానికి ఒకసారి లైన్ ని ఫ్లష్ చేయాలి.

PICC లైన్ ఫలితంగా ఈ క్రింది సమస్యలు సంభవించవచ్చు. వాటి గురించి మీ వైద్యుడిని చూడటం చాలా ముఖ్యం.

  • రక్తస్రావం
  • లైన్ సైట్ చుట్టూ ఎర్రబారడం, నొప్పి
  • PICC లైన్ పాక్షికంగా లేదా పూర్తిగా బయటకు రావడం లేదా వదులుగా వ్రేలాడుతూ ఉండడం
  • అనారోగ్యంగా ఉండడం లేదా జ్వరం ఉన్నట్లు అనిపించడం

హిక్మాన్ లేదా గ్రోషాంగ్ టన్నెల్డ్ లైన్

ఇది మరొక రకమైన సెంట్రల్ లైన్ , ఇందులో ఒక కొస గుండె (SVC) పైన ఉన్న ఛాతీ పెద్ద సిర (వెయిన్)లో ఉంటుంది. మరొక కొస ఎగువ ఛాతీ చర్మం నుండి వ్రేలాడుతుంది. లైన్ లో చిన్న భాగం రెండు కొసల మధ్యా చర్మం క్రింద టన్నెల్ (సొరంగం) చేయబడి ఉంటుంది.
ఈ లైన్ ని రేడియాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ లేదా వాస్కులర్ సర్జన్ ద్వారా ఇన్సర్ట్ చేయబడుతుంది.ఈ లైన్ ని అవసరమైనంత కాలం ఉంచవచ్చు, అయితే, కనీసం వారానికి ఒకసారి ఫ్లష్ చేయాలి. ఈ లైన్ వల్ల వచ్చే కొన్ని సమస్యల్లో ఇవి కూడా ఉంటాయి

  • లైన్ ఉన్న ప్రాంతంలో సంక్రమణ (ఇన్ఫెక్షన్)
  • సిరలో సంక్రమణ
  • బయటకు వచ్చిన లైన్ లేదా విరిగిన లైన్
  • లైన్ చుట్టూ గడ్డకట్టడం.

కెమో పోర్ట్

కెమో పోర్ట్ అనేది గుండె పైన ఉన్న ఛాతీలోని పెద్ద సిరలోకి ఇన్సర్ట్ చేయబడిన సెంట్రల్ వెయిన్ (సిర). కెమో పోర్ట్ కీ, ఇతర లైన్లకీ మధ్య గల వ్యత్యాసం ఏమిటంటే, లైన్ మరొక కొస చర్మం నుంచి బయటికి వ్రేలాడదు. పోర్ట్ చివరలో గుండ్రంగా ఉంటుంది, అది చర్మం క్రింద ఉంచబడుతుంది. ఇది బయటి నుండి చూడలేము, కాని చేతిని ఛాతీపై ఉంచినప్పుడు దాన్ని స్పర్శ ద్వారా తెలుసుకోగలము. ఈ పోర్టులో రక్తం తీసుకోవడానికి లేదా కెమోథెరపీ ఇవ్వడానికి ఒక సూదిని ఇన్సర్ట్ చేసే ప్రాంతం ఉంటుంది. ఈ పోర్టుని రోగికి సర్జికల్ ఆంకాలజిస్ట్ లేదా వాస్కులర్ సర్జన్ చేత ఇన్సర్ట్ చేయిస్తారు.

పోర్ట్ రెండు చివరలూ రోగి శరీరం లోపల ఉన్నందున, ఈ రకమైన లైన్ తో సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, కొన్ని సమస్యలు ఉండవచ్చు, వాటిలో ఇవి కూడా ఉంటాయి-

  • ఇన్ఫెక్షన్
  • సిరలో గడ్డకట్టడం
  • లైన్ విరగడం లేదా చెల్లాచెదురవడం