LIVING WITH CANCER

క్యాన్సర్‌తో జీవనా

మీకు క్యాన్సర్ ఉందనే విషయం తెలుసుకొనుట

క్యాన్సరు నిర్థారణ చేయబడటం జీవితాన్ని మార్చే సంఘటన కావచ్చు. క్యాన్సరు నిర్థారణ అయిన విషయం తెలిస్తే ఏ వ్యక్తి అయినా కొన్ని అనుభూతులకు మరియు భావోద్వేగాలకు గురవ్వవచ్చు. ఈ పరిస్థితులకు ప్రతి ఒక్కరూ భిన్నంగా స్పందిస్తారు, కానీ అత్యధిక మంది ప్రజలు అనుభవించే కొన్ని మామూలు అంశాలు ఉంటాయి.ఈ అనుభూతులు మరియు భావోద్వేగాలు చాలా మామూలు విషయమని మరియు వాళ్ళ జీవితంలో ఒత్తిడి ఎదుర్కొనే సమయంలో సహజంగా కలిగే ప్రతిచర్య అనే విషయం తెలుసుకోవడం ముఖ్యం.

మీకు క్యాన్సరు ఉందనే విషయం తొలిసారి తెలిసినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. ఈ వాస్తవం డాక్టరు క్లినిక్ గది నుంచి, ఆసుపత్రిలో వార్డుపై లేదా ఆసుపత్రి బయట స్నేహితుడు లేదా బంధువు ఇచ్చిన సమాచారం నుంచి తెలియవచ్చు. ఇలాంటి సందర్భంలో కలిగే మొదటి చర్య దిగ్భాంత్రికి గురవ్వడం మరియు నమ్మలేకపోవడం. ఒక్కసారిగా మొద్దుబారినట్లుగా అనిపించడం లేదా విషయం విన్న మీదట ప్రతిస్పందన లేకపోవడం ప్రజల్లో చాలా సామాన్యంగా కనిపించే ప్రతిచర్య. పిడుగులాంటి ఈ వార్తను జీర్ణించుకోవడానికి మరియు మీకు చెప్పిన విషయం అర్థంచేసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. క్యాన్సరును నిర్థారించిన సమాచారం ఇచ్చిన డాక్టరు తరచుగా క్యాన్సరు యొక్క ప్రభావాల గురించి మాట్లాడుతూనే ఉంటారు, కానీ మొదట్లో చెప్పిన విషయానికి స్పందించడానికి మీ మనసు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ ప్రక్రియలో డాక్టరు చెబుతున్న విషయంపై మీరు పెద్దగా దృష్టిపెట్టలేరు లేదా దానిని గ్రహించలేరు. ఇలాంటి వార్త విన్నప్పుడు మీ మదిలోకి వచ్చే కొన్ని ప్రశ్నలు ఏమిటంటే, ‘‘నేను ఎంత కాలం బతుకుతాను’’, ‘‘ఈ స్థితికి ఏదైనా చికిత్స ఉందా’’, ‘‘దీని గురించి ఇతరులు తెలుసుకోవాలా లేదా’’, ‘‘నేను చచ్చిపోతానా’’. క్యాన్సరు నిర్థారణ అయిన విషయం రోగికి చెప్పకపోవడం భారతీయ సమాజంలో అసామాన్యమేమీ కాదు. ఈ వార్తను రోగితో వచ్చిన బంధువుకు లేదా స్నేహితునికి చెబుతారు. ప్రతి ఒక్కరూ తన గురించి మాట్లాడుకుంటుండటం వల్ల కూడా రోగి గాబరాపడుతుంటారు, కానీ ఏం జరుగుతోందో రోగికి తెలియదు లేదా ఎవ్వరూ చెప్పరు.

క్యాన్సరు నిర్థారణ అయిన విషయం తెలుసుకున్న తరువాత, కొంతమంది ప్రజలు ఖండించే స్థితిలోకి వెళతారు, తమకు చెప్పిన వాస్తవాన్ని పాక్షికంగా లేదా సంపూర్ణంగా విస్మరిస్తారు లేదా నివారిస్తారు. ఇలాంటి అనుభూతి రోగుల్లో లేదా వాళ్ళ బంధువుల్లో లేదా స్నేహితుల్లో ఉండొచ్చు. అత్యధిక మంది రోగుల్లో, ఖండించే కాలం ఎక్కువ కాలం ఉండదు మరియు తమకు జరుగుతున్న విషయం అర్థంచేసుకుంటారు మరియు అంగీకరిస్తారు. వీళ్ళలో కొంతమంది ఖండిస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు చికిత్స ఇవ్వబడదు. స్థితిని ఖండించే కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు ఈ స్థితి గురించి మాట్లాడటం కష్టంగా అనిపిస్తుంది. మీ అనుభూతులు మరియు భావోద్వేగాలను వ్యక్తపరచగలుగుతారు మరియు చికిత్స ప్రక్రియలో మీకు మద్దతు ఇవ్వగలుగుతారు.

కోపం అనేది క్యాన్సరు నిర్థారణ చేయబడిన రోగుల్లో మామూలుగా కలుగుతుంది. ఖండించే కాలం తరువాత ఇది సాధారణంగా జరుగుతుంది, కానీ ఏ సమయంలోనైనా కలగవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు, మెడికల్ ప్రొఫెషన్ సబ్యులు, యజమానులు లేదా మరెవ్వరిపైనైనా కోపం ఉండొచ్చు. కోపం మామూలుగా ‘‘నాకే ఎందుకు’’ అనే అనుభూతితో ముడిపడివుంటుంది, వేరేవాళ్ళకు కాకుండా నాకే ఈ స్థితి ఎందుకు కలగాలనే ప్రశ్న అడగటం ద్వారా. క్యాన్సరు నిర్థారణ కారణంగానే కాకుండా, రోగనిర్థారణలో జాప్యం జరిగిందని రోగి భావిస్తే లేదా ఈ స్థితికి మరొక కారణం ఉన్నా కూడా కోపం కలగవచ్చు. అలాగే, ఇంతకుముందు వివరించినట్లుగా, ఇలాంటి పరిస్థితుల్లో రోగులు అనుభవించే మామూలు ప్రతిచర్యలు ఇవి.

భయం, ఆందోళన చెందడం మరియు ఆతృత అనేది క్యాన్సరుతో ముడిపడివున్న మామూలు అనుభూతులు, ప్రత్యేకించి క్యాన్సరు ఉన్నట్లుగా రోగనిర్థారణ చేసినప్పుడు. ఇలాంటి కష్టమైన స్థితిలో ఈ భయాలు మరియు ఆందోళనలు ఉండటం పూర్తిగా సహజం. ఈ అనుభూతులతో జీవించడం వ్యక్తికీ వ్యక్తికీ మారిపోతుంది, కానీ ఈ అనుభూతులను స్నేహితులతో మరియు కుటుంబంతో చర్చించడం వల్ల, ఈ స్థితితో జీవించడానికి డాక్టరు ఎంతో సహాయపడగలరు. ఈ స్థితి, ప్రతిపాదిత చికిత్సలు మరియు సంభావ్య ఫలితాల యొక్క సంపూర్ణ వాస్తవాలను తెలుసుకోవడం ఈ భయాల్లో కొన్నిటిని పోగొట్టగలదు. ఏం జరిగే అవకాశం ఉందనే విషయం గురించి తెలియకపోవడం కొంతమంది రోగుల్లో ఈ భయాలు మరియు ఆందోళనలను పెంచవచ్చు. మరొక వైపు, చికిత్స యొక్క సంభావ్య ఫలితం గురించి చాలా కొద్దిగా తెలిస్తే ఈ స్థితిలో మెరుగ్గా జీవించే ఇతర రోగులు ఉండొచ్చు.

తమకు ఏం జరుగుతోందనే విషయం అర్థంచేసుకోవడానికి మరియు వాస్తవాన్ని అంగీకరించడానికి రోగికి కొద్ది సమయం పట్టవచ్చు. క్యాన్సరు కలగడానికి గల కారణాలు మరియు తమకు మద్దతు ఇచ్చే సన్నిహితులపై పడే బాధ్యత మరియు భారం గురించి తెలిస్తే కొంతమంది రోగులకు తప్పుచేసిన అనుభూతి కలగవచ్చు. ఎవరైనా అనుభవించగల మామూలు అనుభూతి ఇదే.

ఆశ అనేది స్థితిని అంగీకరించిన తరువాత రోగులకు కలిగే మామూలు అనుభూతి. ఏదైనా ఇతర దాని మాదిరిగానే క్యాన్సరు అనేది జబ్బు అని మరియు ఆధునిక రోజులో, క్యాన్సర్లు అన్నిటికీ చికిత్సలు లభిస్తాయి మరియు ఈ స్థితిని బాగా నియంత్రించే మరియు నయంచేసే సంబావ్యతతో ఎళ్ళవేళలా కొత్త చికిత్సలు వస్తున్నాయనే వాస్తవం అర్థంచేసుకోవాలి.

జబ్బు చేసిన వ్యక్తికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఆశించకుండా సేవలందించే వ్యక్తిని సంరక్షకుడు/రాలు అంటారు. జీవితభాగస్వామికి, తోబుట్టువుకు, బంధువుకు, స్నేహితునికి, శిశువుకు లేదా పొరుగింటి వ్యక్తితో సహా ఎవరికైనా సేవలందించడం ఉండొచ్చు. క్యాన్సరు రోగికి సేవలందించడం ఇతర జబ్బులు గల ప్రజలకు సేవలందించడం కంటే భిన్నంగా ఉంటుంది.

క్యాన్సరు రోగికి సేవలందించడం రివార్డింగ్ మరియు సంతృప్తికర అనుభవంగా ఉండొచ్చు మరియు సేవలందించాక విజయం సాధించామనే అనుభూతి కలగవచ్చు. అదే సమయంలో, ఇది అలసటగా మరియు ప్రయత్నించే అనుభవంగా కూడా ఉండొచ్చు.

రోగికి అందించగల అనేక భూమికలు సంరక్షకునికి ఉంటాయి. అవి ఏమిటో ఈ కింద ఇవ్వబడ్డాయి.

వివిధ కారణాల వల్ల రోగి బాగా కమ్యూనికేట్ చేయలేని పరిస్థితుల్లో, ప్రధాన సంరక్షకుడు/రాలు రోగికి అడ్వకేట్గా చర్య తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు మరియు రోగి యొక్క అత్యుత్తమ మరియు వ్యక్తపరిచిన ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని రోగికి సలహా ఇస్తారు. చికిత్స అంశాలను మరియు రోగి సంరక్షణను నిర్ణయించడంలో హెల్త్కేర్ ప్రొఫెషనల్స్తో సంరక్షకుడు/రాలు మాట్లాడగలుగుతారు. రోగి స్థితి గురించి అవసరమైన విధంగా ఇతర కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో కూడా సంరక్షకుడు/రాలు మాట్లాడగలుగుతారు.

సంరక్షకుడు/రాలు రోగితో బాగా మాట్లాడగలుగుతారు మరియు సంరక్షణ గురించి రోగి ఆకాంక్షలు ఏమిటో కచ్చితంగా అర్థంచేసుకోగలుగుతారు. స్థితి, చికిత్సలు మరియు చికిత్సల ఫలితాల గురించి రోగితో నిజాయితీగా మరియు మొహమాటం లేకుండా చర్చించడం ద్వారా దీనిని సాధించవచ్చు.

రోగి చెప్పేది వినడం మరియు ఆ ప్రకారంగా చర్యలు తీసుకోవడం సంరక్షకుడు/రాలు చేసే అత్యంత ముఖ్యమైన పనుల్లో బహుశా ఒకటి. క్యాన్సరు మరియు దాని చికిత్స యొక్క శారీరక మరియు మానసిక ప్రభావాలు ఎన్నిటినో రోగి ఎదుర్కొంటారు. ఎక్కువగా తినేలా లేదా వ్యాయామం చేసేలా రోగిని బలవంతపెట్టడానికి ప్రయత్నించడం లేదా పరిపూర్ణంగా చేయగలిగిన పనులను రోగి చేయకుండా పరిమితం చేయడం లేదా ఏదైనా ఇతర మార్గంలో రోగిని సతాయించడం రోగి యొక్క కులాసాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

మందులు ఇవ్వడం, రోగి అనుభవించిన లక్షణాల రికార్డు ఉంచడం, పరిస్థితులను బట్టి కావలసిన మందులు సరిగ్గా ఇవ్వడం, రోగిని ఆసుపత్రి సందర్శనలకు తీసుకెళ్ళడం, భోజనం తయారుచేయడం, ఒకవేళ రోగి పరిమితంగా కదలగలిగితే రోగి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత అవసరాలను తీర్చడం, ఎత్తడం, రోగిని కదలించడం తదితర లాంటి వాటితో సహా రోగి యొక్క అనేక అవసరాలను సంరక్షకుడు/రాలు తీర్చవలసి ఉంటుంది.

క్యాన్సరు రోగి చికిత్స పొందేటప్పుడు భావోద్వేగ మద్దతు అవసరం మరియు సంరక్షకుడు/రాలు దానిని ఇవ్వగలరు లేదా ఆ మద్దతు ఇవ్వగల ఇతరుల సహాయం తీసుకోగలరు.

క్యాన్సరు మరియు దాని చికిత్స వల్ల రోగిపై భారీ ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి రోగి యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని చికిత్సల మంచి చెడులను మదింపు చేయడానికి సంరక్షకుడు/రాలు అవసరం ఉంటుంది. ఇంకా, ఆకస్మికంగా జబ్బుచేసిన రోగులకు డబ్బు సమకూర్చడం రోగికి బతుకుతావనే సంకల్పాన్ని కల్పించడం లాంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

భారతీయ విధానంలో, ఏక లేదా భిన్న సమయాల్లో అనేక మంది సంరక్షకులు/రాళ్ళు రోగికి సేవలందిస్తుంటారు. రోగి సంరక్షణ చూసే బాధ్యతను ఒక వ్యక్తిని నియమించడం సంరక్షకులు/రాళ్ళు అందరికీ ఎల్లప్పుడూ మంచిగా ఉంటుంది. హెల్త్కేర్ టీమ్తో బాగా మాట్లాడటానికి దీనివల్ల వీలవుతుంది మరియు రోగితో పాటు ఈ వ్యక్తితో మాట్లాడటం ఉత్తమంగా ఉంటుందనే విషయం డాక్టర్లకు కూడా తెలుస్తుంది.

చివరగా, సంరక్షకుడు/రాలు రోగి గురించే కాకుండా తమ గురించి కూడా చూసుకోవలసి ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న రోగికి సేవలందించడం చాలా కష్టంగా ఉంటుంది, ప్రత్యేకించి ఇతరుల నుంచి సహాయం లభించడం కష్టంగా ఉన్నప్పుడు. కాబట్టి వీలైనప్పుడల్లా సంరక్షకుడు/రాలు విశ్రాంతి తీసుకోవాలి మరియు సేవలకు దూరంగా ఉండి కొద్దిగా మామూలు జీవితం గడపాలి. తగినంత నిద్రపోవాలి మరియు విశ్రాంతి తీసుకోవాలి, కొన్ని సేవలను ఇతరులకు అప్పగించాలి. దీనివల్ల మీరు మీ ఆత్మీయులను జాగ్రత్తగా చూసుకోగలుగుతారు.

రోగి మగ అయినా లేదా ఆడ అయినా సరే, క్యాన్సరుకు చికిత్స చేయించుకుంటే భవిష్యత్తులో పిల్లలు పుట్టగల సామర్థ్యం ప్రభావితమవుతుంది. క్యాన్సరుకు చేసే చికిత్సల్లో సర్జరీ, కీమోథెరపి, రేడియోథెరపి, హార్మోన్ థెరపి, బయోలాజికల్ థెరపి లేదా ఇమ్యునోథెరపి ఉండొచ్చు. చికిత్స పూర్తయిన తరువాత పిల్లలు పుట్టాలని కోరుకునే రోగికి, చికిత్సను ప్రారంభించడానికి ముందు ఆంకాలజిస్టుతో చర్చించడం ఉత్తమంగా ఉంటుంది, కాబట్టి ఇలాంటి చికిత్సను రూపొందించేటప్పుడు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

సంతానోత్పత్తి సామర్థ్యం క్యాన్సరు చికిత్సలో అనేక విధాలుగా ప్రభావితమవుతుంది మరియు మామూలువి ఈ కింద వివరించబడ్డాయి, సమస్యను వంచించే సంభావ్య మార్గాలు ఆ తరువాత ఇవ్వబడ్డాయి.

సాధారణంగా, క్యాన్సరుకు చికిత్స చేయించుకున్న పురుష లేదా స్త్రీ రోగి, చికిత్స పూర్తయిన తరువాత కనీసం ఒక సంవత్సరం పాటు పిల్లలను కనడానికి ప్రయత్నించకూడదని సిఫారసు చేయబడుతోంది. కీమోథెరపి లాంటి క్యాన్సరు చికిత్సలు వీర్యం మరియు అండాల డేమేజ్ చేయవచ్చు మరియు పుట్టుక లోపాలు కలిగించే అపాయం ఉంది. చికిత్స తరువాత ఒక సంవత్సర విరామం ఆ అపాయాన్ని తగ్గిస్తుంది.

కీమోథెరపి

అండాలను ఉత్పత్తి చేయగల అండాశయం పనితనం కీమోథెరపి ఫలితంగా ప్రభావితమవుతుంది. కీమోథెరపిని ప్రారంభించిన తరువాత మహిళ రోగికి పీరియడ్స్ ఆగిపోవచ్చు. కీమోథెరపి పూర్తయిన తరువాత, అండాశయ పనితనం మరియు దాని ఫలితంగా పీరియడ్స్ రోగి వయస్సును బట్టి మరియు చికిత్సను ప్రారంభించడానికి ముందు అండాశయాల పనితనాన్ని బట్టి పీరియడ్స్ తిరిగికలగడం ఉంటుంది. 30 ఏళ్ళు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల యువ రోగుల్లో, కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు వయస్సు 45 ఏళ్ళు పైబడిన వారిలో, ఈ అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఇదే మాదిరిగా, కీమోథెరపి ఫలితంగా పురుష రోగ వీర్యం ఉత్పత్తిచేయగల సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. వీర్యం కౌంట్ (సెమెన్లో వీర్యం సంఖ్య) కీమోథెరపి సమయంలో మరియు తరువాత తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. కోలుకోవడం జరుగుతుంది మరియు రోగి వయస్సు మరియు చికిత్సను ప్రారంభించడానికి ముందు ఉన్న వీర్యం కౌంట్పై ఇది ఆధారపడి ఉంటుంది.

రేడియోథెరపి

పెల్విస్ ఏరియాకు రేడియోథెరపి ఇవ్వడం స్త్రీలో అండాశయం పనితనం లేదా పురుషునిలో వృషణాల పనితనాన్ని ప్రభావితం చేయవచ్చు మరియు వంధ్యత్వానికి దారితీయొచ్చు. ఆ ప్రాంతంలో చికిత్స అవసరమైతే, డాక్టరు చూస్తారు మరియు సాధ్యమైతే వృషణాలకు లేదా అండాశయానికి కాంతికిరణాలను నివారించడానికి ప్రయత్నిస్తారు. సాధ్యపడకపోతే, ఇలాంటి చికిత్స యొక్క సంభావ్య పర్యవసానాలను వాళ్ళు చర్చిస్తారు. పెల్విస్లోని ఇతర భాగాలకు రేడియోథెరపి వల్ల కూడా సంతానోత్పత్తి తగ్గడాన్ని కలిగించవచ్చు. పెల్విస్కి రేడియోథెరపి చేయించుకున్న పురుష రోగులకు నంపుసకత్వం కలుగుతుంది లేదా పెల్విస్లో ఉన్న ఇతర లైంగిక అవయవాలు పనిచేయకపోవడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.

క్యాన్సర్ చికిత్స తర్వాత సంతానోత్పత్తిని మెరుగుపరిచే పద్ధతులు

క్యాన్సర్ చికిత్స తర్వాత సంతానోత్పత్తిని మెరుగుపరిచే పద్ధతులు

కొన్ని క్యాన్సర్లు, ప్రత్యేకించి సెర్విక్స్, గర్భాశయం లేదా అండాశయం లాంటి పొత్తికడుపు (పెల్విస్) దిగువ భాగాన్ని ప్రభావితం చేసే వాటికి, సర్జరీ చేయడం వల్ల పూర్తిగా నయం చేయడం జరుగుతుంది. గర్భాశయాన్ని లేదా అండాలను తొలగించడం భవిష్యత్తులో మహిళ గర్భందాల్చే అవకాశం ఆగిపోతుంది. రోగి భవిష్యత్తులో పిల్లలను కనాలనుకుంటే, చాలా ప్రారంభ దశలో ఉన్న క్యాన్సర్లకు, ఒక అండాశయాన్ని వదిలేయడానికి, లేదా ప్రారంభ సెర్వైకల్ క్యాన్సర్లకు గర్భాశయాన్ని తొలగించని చోట ఈ విధంగా ఆపరేషన్లు చేయవచ్చు.

వీర్యం బ్యాంకింగ్

వీర్యం బ్యాంకింగ్ అనేది ఒక ప్రక్రియ. దీనిలో పురుష రోగి యొక్క వీర్యాన్ని కీమోథెరపి ప్రారంభించడానికి ముందు నిల్వచేయబడుతుంది. స్ఖలనం జగినప్పుడు ఉత్పత్తి అయ్యే సెమెన్లో వీర్యం భాగం, రోగి నుంచి సెమెన్ ఫీజు తీసుకొని వీర్యం బ్యాంకులో భద్రపరచబడుతుంది మరియు భవిష్యత్తులో రోగి పిల్లలను కనాలనుకున్నప్పుడు ఉపయోగించబడుతుంది. కీమోథెరపి చేయించుకున్న యువ పురుష రోగుల్లో, చికిత్సకు ముందు రోగి వయస్సు మరియు సంతాన సామర్థ్యాన్ని బట్టి వీర్యం కౌంట్ మరియు నాణ్యత తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ప్రభావితం చేయవచ్చు. కాబట్టి, చికిత్సను ప్రారంభించడానికి ముందు వీర్యస్ఖలనం చేయించబడుతుంది మరియు శీతలీకరించడం ద్వారా భద్రపరచబడుతుంది (క్రైయోప్రిజర్వ్డ్).
క్యాన్సరు చికిత్స పూర్తయిన తరువాత, రోగి వీర్యం కౌంట్ తిరిగి మామూలు స్థితికి వస్తే మరియు బాగా పనిచేస్తే, తండ్రి కావడం కోసం అతను మామూలుగా ప్రయత్నించవచ్చు. ఒకవేళ పుట్టకపోతే, భద్రపరిచిన వీర్యాన్ని ఉపయోగించవచ్చు. భద్రపరచబడిన వీర్యం కరిగించబడుతుంది మరియు భార్య యొక్క గర్భాశయంలోకి పంపడం ద్వారా ఉపయోగించబడుతుంది లేదా మహిళ ఉత్పత్తి చేసిన అండాన్ని ఫలదీకరణ చేసేందుకు ఇన విట్రో ఫెర్టిలైజేషన్లో (ఐవిఎఫ్) ఉపయోగించవచ్చు.

ఎంబ్రియోను భద్రపరచుట

క్యాన్సరు చికిత్సను ప్రారంభించడానికి ముందు, మహిళ అండాన్ని తీయించుకోవచ్చు మరియు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ద్వారా భర్త యొక్క వీర్యంతో ఫలదీకరణ చేయించుకోవచ్చు. ఫలదీకరణ చెందిన అండాన్ని శీతలీకరించి భద్రపరచవచ్చు. చికిత్స పూర్తయితే మరియు మహిళ పిల్లలను కనాలనుకుంటే, ఈ ఫలదీకరణ చెందిన అండాన్ని గర్భాశయంలో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. హార్మోన్లను ఉపయోగించి మహిళ నుంచి అండాలను తీయవచ్చు.

అండాన్ని శీతలీకరించుట

వివాహం చేసిన లేదా భాగస్వామి లేని మరియు క్యాన్సరు చికిత్సకు ముందు ఫలదీకరణను భద్రపరచుకోవాలనుకునే స్త్రీ రోగుల్లో, అండాన్ని తొలగించవచ్చు మరియు వీర్యం మాదిరిగా శీతలీకరించవచ్చు. దీనిని తరువాత ఐవిఎఫ్ చికిత్సకు ఉపయోగించవచ్చు. అయితే ఈ టెక్నిక్ని ప్రయత్నించలేదు మరియు బాగా విజయవంతమవుతుందా అనే విషయం తెలియదు.

కృత్రిమ గర్భధారణ

ఇది ఒక టెక్నిక్. దీనిలో పురుషుడి నుంచి లేదా వీర్యం బ్యాంక్ నుంచి వీర్యం సేకరించి అండంతో ఫలదీకరణ చేయించేందుకు స్త్రీ యొక్క గర్భాశయంలోకి పంపబడుతుంది. గర్భధారణ విజయవంతం కావడానికి వీలుగా అండాల ఉత్పత్తి సమయంలో ఇది చేయబడుతుంది.

ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్)

సహజమైన పద్ధతిలో పిల్లలు పుట్టడం విజయవంతం కానప్పుడు ఆ జంట పిల్లలను కనడానికి సహాయపడే ఒక రకమైన చికిత్స ఇది. చికిత్స వల్ల ఫలదీకరణ తగ్గిపోయిన క్యాన్సరు రోగుల్లో టెక్నిక్గా ఐవిఎఫ్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ క్లుప్తంగా చర్చించినట్లుగా ఐవిఎఫ్ అనేది బహుళదశ ప్రక్రియ.

వీర్యం సేకరణ- వీర్యం పురుషుని నుంచి నేరుగా లేదా వీర్యం బ్యాంకులో భద్రపరిస్తే క్రైయోప్రిజర్వ్డ్ స్పెసిమెన్ నుంచి సేకరించబడుతుంది.

అండాశయ ప్రేరేపణ మరియు అండాన్ని తిరిగిసంపాదించుట- స్త్రీకి హార్మోన్లను ఎక్కించిన తరువాత ఇన్ఫెర్టిలిటి స్పెషలిస్టు స్త్రీ నుంచి అండాన్ని తిరిగిసంపాదిస్తారు. అండాశయంలోని అండాలు పరిపక్వత చెందేందుకు హార్మోన్లు వీలు కల్పిస్తాయి. ఆ తరువాత, అండాశయంలోకి డాక్టరు సూది గుచ్చి పరిపక్వత చెందిన అండాలను తీస్తారు. మత్తుమందు ఇచ్చి ఈ ప్రక్రియ చేయబడుతుంది.

ఫలదీకరణ- వీర్యం మరియు అండాన్ని తిరిగిసంపాదించిన తరువాత, ఎంబ్రియోను సృష్టించేందుకు లేబొరేటరీలో రెండిటినీ ఫలదీకరణ చేస్తారు.

ఇంప్లాంటేషన్- గర్భధారణ చేసేందుకు స్త్రీ గర్భాశయంలోకి ఎంబ్రియోను ఇంప్లాంట్ చేస్తారు.

ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే ఒకటి లేదా ఎక్కువ ప్రయత్నాలు అవసరం కావచ్చు. ఈ ప్రక్రియతో అనేక ఎంబ్రియోలను తయారుచేస్తే, వీటిల్లో ఒకటి లేదా రెండిటిని గర్భాశయంలోకి ఇంప్లాంట్ చేయవచ్చు, అవసరమైతే భవిష్యత్తులో ఉపయోగించేందుకు ఇతర వాటిని శీతలీకరించవచ్చు.

టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్ (టిఎస్ఇ)

చికిత్సకు ముందు వీర్యం బ్యాంకింగ్ని ఉపయోగించని లేదా వీర్యం కౌంట్ తగ్గిన లేదా తక్కువగా ఉన్న మరియు పిల్లలు కావాలనుకుంటున్న పురుషుల్లో ఉపయోగించే ప్రక్రియ ఇది. మత్తుమందు కింద చిన్న ఆపరేషన్ చేయడం ఈ పద్ధతిలో ఉంది, వీర్యం కోసం చూసేందుకు సర్జరీతో వృషణాల యొక్క కొద్ది భాగం తొలగించబడుతుంది. వీర్యం కనుగొంటే, పైన వివరించిన ప్రక్రియల్లో అండాన్ని ఫలదీకరణ చేయించేందుకు వీటిని ఉపయోగించవచ్చు.

నేడు క్యాన్సరుకు లభిస్తున్న రోగనిర్థారక మరియు చికిత్స సదుపాయాలు చాలా అధునాతనమైనవి, కాబట్టి అనేక మంది రోగులు ప్రారంభ దశల్లో తమ వ్యాధిని నిర్థారణ చేయించుకుంటే నయం చేయించుకోవచ్చు. తరువాతి దశల్లో క్యాన్సరు కనుగొనబడిన రోగుల్లో, గత దశాబ్ద కాలంలో సాధించిన అధునాతన చికిత్సలు అనేక క్యాన్సర్లు గల రోగులు ఆయుష్షును పెంచుకోవడానికి వీలు కల్పించాయి. కాబట్టి క్యాన్సరు చికిత్సలు పూర్తయిన తరువాత జీవితం గురించి మాట్లాడటం మరియు తెలుసుకోవడం ముఖ్యం మరియు కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ కింద జాబితాగా ఇవ్వబడ్డాయి.

దుష్ప్రభావాల నుంచి కోలుకొనుట

క్యాన్సరు చికిత్సల దుష్ప్రభావాలను మధ్యకాలంలో మరియు ఆలస్యంగా వచ్చే దుష్ప్రభావాలను వర్గీకరించవచ్చు. సత్వరం కలిగే ప్రభావాలు అనేవి చికిత్స సమయంలో మరియు ఆ తరువాత 3 నెలల వరకు కలిగేవి మరియు ఆలస్యంగా వచ్చే ప్రభావాలు అనేవి చికిత్స తరువాత నెలల నుంచి సంవత్సరాల వరకు జరిగేవి. ఈ దుష్ప్రభావాలు చికిత్స చేయబడుతున్న క్యాన్సరు మరియు ఉపయోగించిన చికిత్స రకంపై ఆధారపడి ఉంటాయి. సత్వర ప్రభావాల్లో అత్యధికం చికిత్స తరువాత దాదాపు 3 నెలల లోపు, సాధారణంగా 6 వారాల లోపు పరిష్కారమవుతాయి. వీటిల్లో కొన్ని ఉండొచ్చు మరియు దీర్ఘ కాలం పాటు కొనసాగవచ్చు. ఇవ్వబడుతున్న చికిత్స నుంచి కలుగుతాయని ఆశిస్తున్న ప్రభావాలు వాటిని మెరుగ్గా నిర్వహించడానికి రోగికి వీలు కల్పిస్తాయి, ఎందుకంటే వీటికి రోగి సిద్ధపడతారు కాబట్టి. చికిత్స పూర్తయిన తరువాత హెల్త్కేర్ టీమ్ నుంచి సపోర్టు కొనసాగడం దుష్ప్రభావాలను మెరుగ్గా అదుపుచేయడానికి సహాయపడుతుంది.

అనుసరణ

చికిత్స పూర్తయిన తరువాత, ఆంకాలజిస్టు వద్దకు కాలానుగుణంగా వెళ్ళడం చికిత్స ప్రక్రియలో చాలా ముఖ్యమైన భాగం. చాలా మంది రోగులు పాటించనది ఇదే. చికిత్స పూర్తయిన తరువాత అనుసరణ ప్రక్రియ చాలా తరచుగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ అనుసరణ అపాయింట్మెంట్ల మధ్య సమయం పెరుగుతుంది. ఉండిపోయిన ఏవైనా దుష్ప్రభావాలను రిపోర్టు చేయడానికి అపాయింట్మెంట్లు రోగికి అవకాశం కల్పిస్తాయి, దీనివల్ల వాటికి బాగా చికిత్స చేయవచ్చు. అనుసరణ వల్ల కలిగే మరింత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే క్యాన్సరు తిరగబెట్టిందా అనే విషయం చూసేందుకు ఎప్పటికప్పుడు రోగిని పరీక్షించడం మరియు స్కాన్లు తీయడం, రక్తం లేదా ఇతర పరీక్షలు చేయడం ఉంటుంది. వ్యాధి తిరగబెట్టిన విషయం ముందుగానే కనుగొంటే, ప్రభావవంతంగా చికిత్స చేయవచ్చు. అత్యధిక క్యాన్సర్లకు అనుసరణ ప్రక్రియ 5 సంవత్సరాలు ఉంటుంది మరియు కొన్ని క్యాన్సర్లకు 10 సంవత్సరాల వరకు ఉండొచ్చు.

ఆహారం మరియు న్యూట్రిషన్

రోగులందరూ చికిత్స తరువాత మామూలు ఆరోగ్యకరమైన ఆహారం నియమం పాటించాలి. పండ్లు మరియు కూరగాయలతో పాటు ఇతర ఆహారపదార్థాలు గల సమతుల్యమైన ఆహారం సరైన పరిమాణంలో తీసుకోవలసిందిగా సిఫారసు చేయబడుతోంది. కొన్ని పరిస్థితుల్లో, రోగులు ఆహారం బాగా మింగలేకపోవచ్చు లేదా భోజనం ఎక్కువ మొత్తాల్లో తినలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది మొత్తాల్లో భోజనం ఎక్కువ సార్లు తినడం ఉత్తమంగా ఉంటుంది. రోగి మామూలు ఆహారం తినలేకపోతేనే భోజనానికి పౌష్ఠికాహార అనుబంధాలను చేర్చవలసిన అవసరం ఉండొచ్చు.

గర్భధారణ

క్యాన్సరుకు చికిత్స తరువాత గర్భందాల్చాలనుకునే కుటుంబాలకు, ప్రత్యేకించి వాళ్ళకు కీమోథెరపి చేయించుకొనివుంటే, చికిత్స తరువాత కనీసం 1 సంవత్సరం పాటు గర్భందాల్చడానికి ప్రయత్నించకూడదు. పురుష రోగిలో వీర్యం బ్యాంకింగ్ అయితే, స్త్రీ రోగిలో అండం లేదా ఎంబ్రియో ప్రిజర్వేషన్ని ఉపయోగిస్తే, 12 నెలల నిబంధనకు కట్టుబడవలసిన పని లేదు. గర్భందాల్చడానికి ప్రయత్నించడానికి ముందు ఆంకాలజిస్టుతో చర్చించడం ఉత్తమంగా ఉంటుంది.

తిరిగి పనికి వెళ్ళుట

చికిత్సను పూర్తిచేసిన తరువాత, తాము ఫిట్గా ఉన్నట్లు భావించినప్పుడు రోగులు తిరిగి పనికి వెళ్ళవచ్చు. పనిని ఎప్పుడు ప్రారంభించవచ్చనడానికి నిర్దిష్ట సిఫారసు లేదు. పని ఉధృతంగా లేదా ఒత్తిడిమయంగా ఉంటే, తొలి రోజు నుంచే పూర్తి సమయం పనిచేసే బదులుగా దశల వారీగా చేయడం ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. పరిస్థితిని యజమానితో చర్చించడం ఉత్తమంగా ఉంటుంది మరియు పనికి తిరిగిరావడాన్ని సుగమం చేస్తుంది.

వ్యాయామం

సలహా ఇవ్వబడిన వ్యాయామ కార్యక్రమాన్ని క్రమేపీ చేయాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం క్యాన్సరు సంఘటనను తగ్గిస్తుందని నిరూపించబడింది. కొద్దిగా నడవడం నుంచి జిమ్కి వెళ్ళడం వరకు ఏ రూపంలోనైనా వ్యాయామం ఉండొచ్చు.

దినచర్య తిరిగిచేపట్టడం

చికిత్సను పూర్తిచేసిన తరువాత మరియు దుష్ప్రభావాలను కోలుకున్న తరువాత, క్యాన్సరు నిర్థారణ చేయడానికి ముందు అనుసరించిన దినచర్యను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించడం ఉత్తమంగా ఉంటుంది. చికిత్స గురించి మరియు ఇప్పటి వరకు జరిగిన దాని గురించి ఆలోచించుకోవడం రోగికి సామాన్యమైన మరియు పూర్తి మామూలు విషయం మరియు కొంతమంది రోగులకు ఆ పరిస్థితి నుంచి బయటకు రావడం కష్టంగా ఉండొచ్చు. పూర్వ దినచర్యకు తిరిగిరావడం ఆ ప్రక్రియ మొత్తాన్ని వదిలేయడానికి మరియు జీవితాన్ని సాఫీగా కొనసాగించడానికి సహాయపడుతుంది. ఈ విషయంలో కూడా డాక్టర్లు, స్నేహితులు, సహచరులు మరియు కుటుంబ మద్దతు పొందడం కీలకం.

క్యాన్సరు తిరిగొచ్చిందా అనే విషయం ఎలా తెలుసుకోవాలి?

క్యాన్సరు తిరిగొచ్చిందని లేదా తిరగబెట్టిందని సూచించే నిర్దిష్ట లక్షణాలు లేవు. క్యాన్సరు తిరగబెట్టిన శరీరంలోని ఏరియాపై ఈ లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ, ప్రతి ఒక్కరికీ కలిగే లక్షణాలు మామూలు లక్షణాల మాదిరిగా ఉంటాయి. మామూలుగా ఉండవలసిన దానికంటే ఎక్కువ కాలం ఈ మామూలు లక్షణాలు ఉంటే లేదా రోగికి మళ్ళీ ఒంట్లో బాగా లేకపోవడం మొదలైతే, బాగా తినకపోతుంటే లేదా బరువు తగ్గడం జరుగుతుంటే అనుమానించవచ్చు. క్యాన్సరు ప్రారంభ దశలో తిరిగొచ్చిందనే విషయం గుర్తించడం కష్టం కాబట్టి, అనుసరణ షెడ్యూలుకు కట్టుబడటం మరియు క్యాన్సరు రకాన్ని బట్టి అవసరమయ్యే రక్త పరీక్షలు, స్కాన్లు లేదా ఇతర పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.

ఇప్పుడు నన్ను నయం చేస్తారా?

క్యాన్సరుకు చికిత్సను పూర్తిచేసిన తరువాత రోగులు అడిగే మామూలు ప్రశ్న ఇది. ‘‘నయం’’ అనే పదానికి అర్థం క్యాన్సరు పోయిందని మరియు ఎప్పుడూ తిరిగిరాదని. దురదృష్టవశాత్తూ, చికిత్స పూర్తయిన తరువాత వెంటనే కర్కరోగం నయమైందనే విషయం రోగికి డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. తదుపరి కొద్ది సంవత్సరాల్లో క్యాన్సరు తిరిగొచ్చే అపాయం ఉండటమే దీనికి కారణం. స్టేజ్ ఎంత ఎక్కువ ఉంటే, దాని అపాయం ఎక్కువగా ఉంటుంది. 5 సంవత్సరాల అనుసరణ తరువాత క్యాన్సరు తిరిగిరాకపోతేనే అది నయమైనట్లుగా డాక్టర్లు చెప్పగలుగుతారు. చికిత్స పూర్తయిన తరువాత నయం అయ్యే అవకావాలను డాక్టర్లు ఊహించగలుగుతారు. ఇది క్యాన్సరు రకం మరియు దశ, ఇవ్వబడిన చికిత్సపై ఇది ఆధారపడి ఉంటుంది. నయమయ్యే అవకాశం గురించి ఈ సమయంలో డాక్టరు సహేతుకమైన అంచనా ఇస్తారు. కొంతమంది రోగులు ఇలాంటి సమాచారం తెలుసుకోవాలనుకోవచ్చు, ఇతరులు తెలుసుకోవాలనుకోకపోవచ్చు.

రచన: డాక్టర్ నీలిమా జంపన, MBBS, MRCPsych, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, పీటర్‌బరో, UK

ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల రుగ్మతలకు డిప్రెషన్ అనేది ఒక ప్రధాన కారణం. క్యాన్సర్ రోగులలో తేలికపాటి నుండి అధిక డిప్రెషన్ అనేది సర్వ సాధారణం. క్యాన్సర్ రోగులు చికిత్స తీసుకుంటున్నప్పుడు, వారిలో 24% వరకు నిరాశ కలిగి ఉంటారు. క్యాన్సర్ చివరిదశలో ఉన్న రోగులు మరియు పాలియేటివ్ కేర్ (ఉపశమన సంరక్షణలో) ఉన్నవారికి కూడా డిప్రెషన్ ఉన్నట్లు తెలుస్తుంది. డిప్రెషన్ కలిగి ఉండటం క్యాన్సర్ యొక్క చికిత్సను చాలా ప్రభావితం చేస్తుంది మరియు దానికి అనుగుణంగా చికిత్సను చేయాల్సి ఉంటుంది. ఇది అనారోగ్య భారాన్ని తట్టుకోగల రోగి యొక్క సామర్థ్యాన్ని కూడా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి త్వరగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం మరియు డిప్రెషన్ ను తగ్గించడానికి చికిత్సను మొదలుపెట్టడం అనేవి క్యాన్సర్ రోగ నిరూపణ మరియు జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

డిప్రెషన్ అనేది అసంతృప్తిగా ఉండటం లేదా కొన్ని రోజులు విసుగు చెందడం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కనీసం 2 వారాల పాటు మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, నీరసంగా అనిపిస్తున్నప్పుడు మరియు ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం వంటి విషయాలను బట్టి డిప్రెషన్ నిర్ధారణ చేయబడుతుంది. అసంతృప్తి మరియు డిప్రెషన్ మధ్య గల అతి సన్నని గీత ఏమిటంటే, అది తరువాతి రోజులలో వారి దైనందిన జీవన విధానంలో అంతరాయాన్ని కలిగిస్తుంది. ఇది నిద్ర, ఆకలి మరియు ఏకాగ్రత స్థాయిలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఆందోళన, కన్నీటిని ఆపుకోలేకపోవడం, తక్కువ ఆత్మగౌరవం, అపరాధ భావాలు, నిరాశావాద ఆలోచనలు, నిస్సహాయత మరియు ఆత్మహత్య ఆలోచనలు వంటివి మధ్యస్తం నుండి తీవ్రమైన డిప్రెషన్ ఉన్నవారిలో కనిపిస్తాయి.

క్యాన్సర్ నిర్ధారణకు రోగి స్పందించే విధానం, జీవనశైలి మార్పులకు సర్దుబాటు, చికిత్స దుష్ప్రభావాలు మరియు భవిష్యత్తు యొక్క అనిశ్చితి వంటి అనేక కారణాలు క్యాన్సర్ రోగులలో డిప్రెషన్ కు దారితీయవచ్చు. ఎక్కువగా చింతించే మరియు ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు, వారు ఇంతకుముందు డిప్రెషన్ కలిగివుండటం లేదా కుటుంబ సభ్యులలో ఎవరికైనా డిప్రెషన్ చరిత్ర కలిగినవారు ఉండటం, సామాజిక-ఆర్ధిక స్థితిగతులు మరియు సామాజిక మద్దతు లేనివారు డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

క్యాన్సర్ రోగులలో డిప్రెషన్ నిర్ధారించడం కష్టం, ఎందుకంటే క్యాన్సర్ మరియు దాని చికిత్స వలన కలిగే శారీరక ఆరోగ్య లక్షణాల అతివ్యాప్తి కారణంగా వారిలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. సోమరితనం, ఆందోళన, ఆకలి లేకపోవడం, నొప్పి, వికారం మరియు శ్వాస తీసుకోకపోవడం వంటివి డిప్రెషన్ మరియు క్యాన్సర్ లలో గమనించే సెకండరీ లక్షణాలు. రోగి, వారి కుటుంబం మరియు వైద్యుడు అలాంటి లక్షణాలను గమనించడం, తరువాత వివరణాత్మక అంచనా వేయడం రోగ నిర్ధారణ చేయడంలో సహాయపడుతాయి.

డిప్రెషన్ కు చికిత్స చాలా అందుబాటులో ఉంది మరియు డిప్రెషన్ ఉన్నవారికి యాంటిడిప్రెసెంట్లు సాధారణంగా సూచించే మందులు. పాత వాటితో పోలిస్తే కొత్త యాంటిడిప్రెసెంట్లు బాగా తట్టుకోగలవు. యాంటిడిప్రెసెంట్లు మీద చాలా కాలంగా ఒక అపవాదు ఉంది, అది ఎక్కువకాలం పాటు రోగులు యాంటిడిప్రెసెంట్లు వాడినట్లైతే, వారు మాదకద్రవ్యాలు మరియు వాటిపై ఆధారపడతారు అని, కాని అది నిజం కాదు. అవి మానసికంగా ఆధారపడటానికి [తృష్ణ] కారణం కావు మరియు కొత్త మందులు ఎక్కువగా మత్తుని కలిగించవు. క్యాన్సర్ రోగులలో యాంటిడిప్రెసెంట్ల యొక్క మోతాదు డిప్రెషన్ యొక్క తీవ్రత, శారీరక ఆరోగ్య సమస్యలు మరియు వారి బలహీనతలను బట్టి పరిగణించబడుతుంది.

యాంటిడిప్రెసెంట్లు తీసుకునే రోగులలో ఎక్కువమంది వాటి నుండి ప్రయోజనాన్ని పొందుతారు. రోగిలో కొంత ప్రతిస్పందనను చూపించడానికి వాటికి 2 నుండి 8 వారాలు పట్టవచ్చు, అందువల్ల వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి ముందు కనీసం 2 నెలలు వాడమని సూచిస్తారు. యాంటిడిప్రెసెంట్లు యొక్క దుష్ప్రభావాలు మందుల రకం మరియు మోతాదును బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దుష్ప్రభావాలు వారం తరువాత కనిపించవచ్చు. కనిపించనట్లైతే, ప్రత్యామ్నాయ యాంటిడిప్రెసెంట్‌ను పరిగణించవచ్చు. యాంటిడిప్రెసెంట్ మోతాదు సాధారణంగా తక్కువ మోతాదుతో ప్రారంభమవుతుంది మరియు రోగి యొక్క సహనాన్ని బట్టి క్రమంగా పెరుగుతుంది. అకస్మాత్తుగా వాటిని ఆపడం అనేది రోగిలో చిరాకు మరియు ఆందోళన వంటి లక్షణాలకు కారణం కావచ్చు. అందువల్ల, డాక్టర్ సలహా మేరకు వాటిని నెమ్మదిగా తగ్గించాలి.

అనేక రకాల మానసిక చికిత్సలు లేదా మాట్లాడుతూ చేసే చికిత్సలు ఉన్నాయి, ఇవి డిప్రెషన్ నుండి బయటపడటానికి సహాయపడతాయి. డిప్రెషన్ ఉన్న క్యాన్సర్ రోగులలో సాధారణంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ [CBT]ని ఉపయోగించి చికిత్స చేస్తారు. CBT లో, చికిత్సకుడు రోగి యొక్క ప్రవర్తన, ఆలోచనలు మరియు భావాల మధ్య గల సంబంధాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. లక్షణాలను తగ్గించడానికి సహాయపడే నిర్మాణాత్మక వ్యూహాలను వారు సిఫారసు చేస్తారు. రోగులు ప్రతికూల ఆలోచనలను మరియు భావాలను గుర్తించడం నేర్చుకుంటారు, అలాగే ఇంటివద్ద చేసే అభ్యాసం, మానసిక వ్యాయామాల ద్వారా చికిత్సకుడి మార్గదర్శకత్వంలో వాటిని నియంత్రించగలుగుతారు.

ECT, ఎలెక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది తీవ్రమైన/ ఎక్కువ డిప్రెషన్ ఉన్న వారికి చేసే చికిత్స యొక్క ఒక రూపం. యాంటిడిప్రెసెంట్లు సరిగ్గా పనిచేయని సందర్భంలో ఇది డిప్రెషన్ కోసం సూచించబడుతుంది. తీవ్రమైన నిరాశలో రోగులు తినడం, నిద్రపోవడం లేదా ఇతర వ్యక్తులతో మాట్లాడటం మానేయవచ్చు. నిజ జీవితంలో వాస్తవానికి జరగని విషయాలను వారు ఊహించవచ్చు, ఇది అనుమానాస్పద, ఆత్మహత్య ఆలోచనలు మరియు దూకుడు ప్రవర్తనకు దారితీస్తుంది. ఈ పరిస్థితులలో, యాంటిడిప్రెసెంట్ల కంటే ECT వేగంగా పనిచేస్తుంది. క్యాన్సర్ రోగులు ECT కి అనుకూలంగా ఉన్నట్లైతే దానిని అంచనా వేయవచ్చు.

ECT ఒక రోజు ప్రక్రియగా ఆసుపత్రిలో ఇవ్వబడుతుంది మరియు సాధారణంగా రోగులు కోలుకుంటారు మరియు సెషన్ ముగిసిన 8 గంటల్లో ఇంటికి తిరిగి వస్తారు. ప్రక్రియ సమయంలో రోగులకు కండరాలకు విశ్రాంతినిచ్చేది మరియు మత్తు కలిగించే ఏజెంట్ ఇవ్వబడుతుంది, ఇది సుమారు 10 నిమిషాలు నిద్రపోయేలా చేస్తుంది. రోగి తప్పనిసరిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడానికి, వారికి కొన్ని సెకన్ల పాటు తక్కువ మరియు నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి రోగి తలపై ఎలక్ట్రోడ్లు అమర్చబడతాయి., ఇది మెదడులోని కొన్ని రసాయనాలను పెంచడానికి సహాయపడుతుంది. చికిత్స సమయంలో రోగులు అపస్మారక స్థితి లేదా ఏదైనా సంబంధిత నొప్పిని అనుభూతి చెందరు. స్వల్పకాలిక గందరగోళం మరియు తలనొప్పి అనేవి ECT యొక్క దుష్ప్రభావాలు.

క్యాన్సర్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సంరక్షకుని విద్య మరియు మద్దతు, ఆందోళన నిర్వహణ మరియు సంపూర్ణ విచక్షణ లాంటి ఇతర చికిత్సలు సహాయపడుతాయి. రోగికి సంరక్షకుని మద్దతు మరియు విశ్రాంతి చాలా అవసరం. జీవిత భాగస్వామి మరియు దగ్గరి కుటుంబ సభ్యులపై క్యాన్సర్ నిర్ధారణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సంరక్షకులకు వారి ఒత్తిడి మరియు భావాలను బయటకు తీసే అవకాశం మరియు స్థలం ఇవ్వాలి. సంరక్షకుడు వారి జీవితంలో కొంత సాధారణతను కొనసాగించాలని మరియు సంరక్షణ పాత్రకు కొంత సమయం అవసరమని గుర్తుంచుకోవాలి. సంరక్షణ ఏజెన్సీల నుండి అదనపు మద్దతు, ఇతర కుటుంబసభ్యుల మద్దతు మరియు / లేదా స్వల్ప విరామంతో దీన్ని సులభతరం చేయవచ్చు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారి ప్రియమైన వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి అవసరమైన మానసిక మరియు శారీరక బలాన్ని మెరుగుపర్చడానికి, విశ్రాంతి వారికి సహాయపడుతుంది.

క్యాన్సర్ నిర్ధారణ మరియు దాని పర్యవసానాలు కుటుంబ సభ్యులలో చర్చకు అత్యంత సున్నితమైన అంశంగా మారతాయి. ఇది భావోద్వేగ ప్రకోపాలకు మరియు పరస్పర సంబంధాలను దెబ్బతీసే వాదనలకు దారితీస్తుంది. రోగ నిరూపణ, చికిత్స ప్రణాళికలు మరియు భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చలు అవసరమైతే కౌన్సిలర్ ద్వారా సూచనలు మరియు మద్దతు అందించబడతాయి.

మానసిక ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉన్న అపవాదు గత దశాబ్దంలో తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలకు డిప్రెషన్ గురించి తెలుసు మరియు చికిత్సను పొందటానికి ముందుకు వస్తున్నారు. క్యాన్సర్ రోగులలో డిప్రెషన్ ను గుర్తించడం మరియు చికిత్స చేయడం చాలా ముఖ్యం. డిప్రెషన్ ఉన్న రోగులకు సహాయపడటానికి మనోరోగ వైద్యులు, మనస్తత్వవేత్తలు మరియు సంపూర్ణ చికిత్సకులు అందించే అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు సహాయాన్ని అందించడంలో ఆన్‌లైన్ స్వయం సహాయక మరియు స్వచ్ఛంద సేవలు కూడా గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి.