Oncologists

క్యాన్సర్ వైద్యులు లేదా ఆంకాలజిస్టులు

అంకాలజిస్ట్ ఎవరు?

కేన్సర్ చికిత్సలో ప్రత్యేకత కలిగిన వైద్యుడు అంకాలజిస్ట్

ప్రస్తుతం ఎన్ని రకాల అంకాలజిస్టులు ఉన్నారు?

అంకాలజిస్టులు అనేక రకాలుగా ఉంటారు.

మెడికల్ అంకాలజిస్ట్

మెడికల్ అంకాలజిస్ట్ కేన్సర్ రోగులకు సిస్టమిక్ (శారీరిక వ్యవస్థలు) ట్రీట్మెంట్ (చికిత్స) చేసేవారు. సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటే ఇమ్యునోథెరపీతో సహా కెమోథెరపీ, బయోలాజికల్ థెరపీలు కావచ్చు. ఈ మందులు ఇచ్చిన మందులు ఇంజెక్షన్లు, డ్రిప్స్ లేదా మాత్రల రూపంలో ఇవ్వవచ్చు.

భారతదేశంలో శిక్షణ పొందిన మెడికల్ అంకాలజిస్ట్

భారతదేశంలో శిక్షణ పొందే సంవత్సరాలు: ఎంబిబిఎస్‌ తరువాత 6 సంవత్సరాలు
ఎంబిబిఎస్ తర్వాత పొందే డిగ్రీలు: జనరల్ మెడిసిన్ లో MD
మెడికల్ అంకాలజీలో DM
మెడికల్ అంకాలజీలో DNB

UK లో శిక్షణ పొందిన మెడికల్ అంకాలజిస్ట్

UK లో శిక్షణ పొందే సంవత్సరాలు: MBBS తర్వాత కనీసం 7 సంవత్సరాలు
MBBS తర్వాత పొందే డిగ్రీలు: జనరల్ మెడిసిన్‌లో MRCP (UK)
మెడికల్ అంకాలజీలో MRCP CCT (UK)
క్లినికల్ అంకాలజీలో FRCR (ప్రధానంగా గట్టిగా ఉన్న ట్యూమర్లు)

USA లో శిక్షణ పొందిన మెడికల్ అంకాలజిస్ట్

USA లో శిక్షణ పొందే సంవత్సరాలు: MBBS తర్వాత 6 సంవత్సరాల
MBBS తర్వాత పొందిన డిగ్రీలు: ఇంటర్నల్ మెడిసిన్ లో MD
మెడికల్ అంకాలజీ హెమటాలజీలో ఫెలోషిప్

కెనడాలో శిక్షణ పొందిన మెడికల్ అంకాలజిస్ట్

USA లో శిక్షణ పొందే సంవత్సరాలు: MBBS తర్వాత 5 సంవత్సరాలు
MBBS తర్వాత పొందే డిగ్రీలు: మెడికల్ అంకాలజీలో MD

క్లినికల్ అంకాలజిస్ట్

ఒక క్లినికల్ అంకాలజిస్ట్ అంటే, కెమోథెరపీ, రేడియోథెరపీ రెండింటితోనూ కేన్సర్ రోగులకు చికిత్స చేసేవాడు. వీరు గట్టిగా ఉన్న ట్యూమర్లను (బ్లడ్ కేన్సర్ మినహాగా మిగతా అన్ని కేన్సర్లలోనూ) కెమోథెరపీ మరియు అన్ని రకాల రేడియోథెరపీలతో చికిత్స చేస్తారు.

క్లినికల్ అంకాలజిస్టులకు UK, హాంకాంగ్‌ లో శిక్షణ ఇవ్వబడుతుంది.

UK లో క్లినికల్ అంకాలజీ శిక్షణ

UK లో శిక్షణ పొందే సంవత్సరాలు: MBBS తర్వాత 8 సంవత్సరాలు
MBBS తర్వాత పొందే డిగ్రీలు: జనరల్ మెడిసిన్‌లో MRCP (UK)
క్లినికల్ అంకాలజీలో FRCR

రేడియేషన్ అంకాలజిస్ట్

రేడియోథెరపీ లేదా రేడియేషన్ థెరపీతో కేన్సర్లకు చికిత్స చేసేవాడు రేడియేషన్ అంకాలజిస్ట్.

భారతదేశంలో రేడియేషన్‌ ఆంకాలజీ శిక్షణ

MBBS తర్వాత శిక్షణ పొందే సంవత్సరాలు: MBBS తర్వాత 2-3 సంవత్సరాలు, రేడియోథెరపీలో డిప్లొమాకు రెండు సంవత్సరాలు లేదా రేడియోథెరపీ MD లేదా DMB కి మూడు సంవత్సరాలు
MBBS తరువాత పొందేన డిగ్రీలు: రేడియోథెరపీలో DMRT
రేడియోథెరపీలో MD
రేడియోథెరపీలో DNB

UK లో రేడియేషన్ అంకాలజీ శిక్షణ

UK లో రేడియేషన్ అంకాలజిస్ట్‌గా శిక్షణ పొందితే క్లినికల్ అంకాలజిస్ట్‌గా ఉండవచ్చు. వివరాల కోసం పైన చూడండి

USA లో రేడియేషన్ అంకాలజీ శిక్షణ

MBBS తర్వాత శిక్షణ పొందే సంవత్సరాలు: MBBS తర్వాత 3 సంవత్సరాలు
MBBS తరువాత పొందే డిగ్రీలు: MD రేడియేషన్ అంకాలజీ

ఆస్ట్రేలియాలో రేడియేషన్ అంకాలజీ శిక్షణ

MBBS తర్వాత శిక్షణ పొందే సంవత్సరాలు: MBBS తర్వాత 7 సంవత్సరాలు
MBBS తర్వాత పొందే డిగ్రీలు: FRANZCR IN రేడియేషన్ అంకాలజీ

కెనడాలో రేడియేషన్ అంకాలజీ శిక్షణ

MBBS తర్వాత శిక్షణ పొందే సంవత్సరాలు: 5 సంవత్సరాలు
MBBS తర్వాత పొందే డిగ్రీలు: రేడియేషన్ అంకాలజీలో MD
రేడియేషన్ అంకాలజీలో FRCPC

సర్జికల్ అంకాలజిస్ట్‌

సర్జికల్ అంకాలజిస్ట్ కేన్సర్ శస్త్రచికిత్స చికిత్సలో నైపుణ్యం కలిగిన డాక్టర్. సర్జికల్ అంకాలజీ శిక్షణ వివిధ దేశాల్లో భిన్నంగా ఉంటుంది. అది ఈ క్రింద ఇవ్వబడింది.

భారతదేశంలో సర్జికల్ అంకాలజీ శిక్షణ

MBBS తర్వాత శిక్షణ పొందే సంవత్సరాలు: MBBS తర్వాత 6 సంవత్సరాలు
MBBS తరువాత పొందే డిగ్రీలు: జనరల్ సర్జరీలో MS లేదా DNB,
ఆ తర్వాత సర్జికల్ అంకాలజీలో MCh

సర్జికల్ అంకాలజీలో DNB

  • ఇతర సబ్ స్పెషలిస్ట్ సర్జన్లు కూడా సర్జికల్ అంకాలజీని తమ ప్రత్యేకత విషయాల్లో అభ్యసిస్తారు. అవి ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
  • సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో MCh లేదా DNB- జీర్ణశయాంతర (గాస్ట్రోఇంటస్టైనల్) ప్రేగు కేన్సర్లపై పనిచేస్తారు.
  • యూరాలజీలో MCh లేదా DNB- యూరాలజికల్ సిస్టమ్ కేన్సర్లపై పనిచేస్తారు.
  • థొరాసిక్ సర్జరీలో MCh లేదా DNB- వీరు ఛాతీ కేన్సర్లపై పనిచేస్తారు.
  • న్యూరోసర్జరీలో MCh లేదా DNB- మెదడు కణుతులపై పనిచేస్తారు.
  • గైనకాలజికల్ అంకాలజీలో MCh- స్త్రీ జననేంద్రియ కేన్సర్లపై పనిచేస్తారు
  • తల, మెడ అంకాలజీలో MCh- తల, మెడ కేన్సర్లపై పనిచేస్తారు.

గైనాయి- ఆంకాలజీలోఎంసిహెచ్ లేదా డిఎన్బి

క్లినికల్ హెమటాలజిస్టు

క్లినికల్ హెమటాలజిస్టులు అనేవారు రక్తం సమస్యలు గల రోగులను చూసే స్పెషలిస్టులు. లింఫోమాస్, ల్యూకోమియాస్, మైలోమాస్ లాంటి రక్తం సంబంధ క్యాన్సర్లు గల రోగులను వీళ్ళు చూస్తారు.

భారతదేశంలో క్లినికల్ హెమటాలజిస్టు శిక్షణ

ఎంబిబిఎస్ తరువాత శిక్షణకు సంవత్సరాలు: ఎంబిబిఎస్ తరువాత 5 సంవత్సరాలు
ఎంబిబిఎస్ తరువాత సంపాదించే డిగ్రీలు: ఎండి జనరల్ మెడిసిన్

యుకెలో క్లినికల్ హెమటాలజి

ఎంబిబిఎస్ తరువాత శిక్షణ సంవత్సరాలు: 8
ఎంబిబిఎస్ తరువాత పొందే డిగ్రీలు: ఎంఆర్సిపి జనరల్ మెడిసిన్
ఎఫ్ఆర్సిపాత్
సిసిటి

యుఎస్ఎలో హెమటో- ఆంకాలజీ శిక్షణ

పైన మాదిరిగా మెడికల్ ఆంకాలజీ మాదిరిగా

ఇతరులు

క్యాన్సరు రోగులను చూడటంలో కీలక పాత్ర పోషించే ఇతర డాక్టర్లలో ఉండేవారు

పేథాలజిస్టులు- వీళ్ళు బయాప్సీలపై రిపోర్టు చేస్తారు

రేడియాలజిస్టులు- ఎక్స్రేలు మరియు స్కాన్లపై రిపోర్టు చేస్తారు

న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్లు- పిఇటి స్కాన్లు మరియు ఇతర స్కాన్లపై రిపోర్టు చేస్తారు మరియు రేడియోన్యూక్లియిడ్ చికిత్సలు ఇస్తారు.

ఇతర స్పెషాలిటిస్ అన్నీ గల డాక్టర్లు- చికిత్స సంక్లిష్ట సమస్యల రోగనిర్థారణలో మరియు నిర్వహణలో సహాయపడతారు.