Patients as teachers

ఉపాధ్యాయులుగా రోగులు

ప్రిథ్వీరాజ్ జంపన
ప్రిథ్వీరాజ్ జంపన

ఆంకాలజిస్టుగా ఉండటం సవాలుతో మరియు అదే సమయంలో ప్రతిఫలం ఉండే జాబ్. క్యాన్సరు సంక్లిష్టమైనది మరియు చికిత్స చేయడం కష్టంగా ఉండే వ్యాధి కాబట్టి ఇది సవాలుగా ఉంటుంది. క్యాన్సరుతో ప్రభావితమైన రోగులకు డాక్టరు పరిష్కరించవలసిన శారీరక లక్షణాలు ఉండటమే కాకుండా, అదే సమయంలో అనేక సామాజిక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక మరియు ఆధ్యాత్మిక అంశాలు పాత్ర పోషిస్తాయి. భారతదేశంలోని వైవిధ్యమైన దేశంలో, ఈ అంశాలు ప్రజలపై వాళ్ళ యొక్క పరిస్థితులు, సంస్కృతి, మతం, నమ్మకాలు మరియు భౌగోళిక ప్రాంతం లాంటి వాటిపై ఆధారపడతాయి. ఆంకాలజిస్టు లేదా ఎవరైనా డాక్టరుకు, చికిత్స ప్రణాళిక రూపొందించడానికి మరియు రోగితో మాట్లాడటానికి ఈ అంశాలను సత్వరం గ్రహించడం మరియు అర్థంచేసుకోవడం ముఖ్యం.
క్యాన్సరు డాక్టర్లు తమ రోగులు గురించి చాలా బాగా తెలుసుకోవాలి. అత్యధిక మంది రోగులకు దీర్ఘ కాలం పాటు చికిత్స చేయడం కష్టంగా ఉంటుంది మరియు వాళ్ళు తమ డాక్టర్లతో భాగస్వామ్యంగా ఈ దశలు ఎదుర్కొంటారు. వార్తలు ఎప్పుడూ సానుకూలం ఉండవు మరియు చెడు వార్తలు ఉన్నప్పుడు, వాళ్ళు దానిని సమిష్టిగా డీల్ చేయవలసి ఉంటుంది.
ఆంకాలజిస్టుగా నా ప్రయాణంలో, నేను కొంతమంది మనోహరమైన ప్రజలను కలుసుకున్నాను. గొప్ప ధైర్యం మరియు కేరక్టర్ గల ప్రజలు, ఎప్పుడూ వదులుకోవాలనుకోరు. పరిస్థితి ఎలా ఉన్నా సరే మౌనంగా మరియు కంపోజ్గా ఉండే ప్రజలు, తమను నియంత్రణలో ఉంచుకుంటారు మరియు ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళ భావోద్వేగాలు భయంగా ఉంటాయి మరియు అశాంతిగా మారుతుంటారు. తమకు కలిగినది ఇతరులెవ్వరికీ కలగకూడదని లేదా సులభంగా ఎదుర్కొనేలా ఉండాలనే భావించే ప్రజలు. ఇలాంటి ఒక వ్యక్తి నా దృష్టికి వచ్చారు.
జేమ్స్ (జిమ్) కోస్టెల్లోకి ముఖంపై బాసల్ సెల్ కార్సినోమా అనే చర్మ క్యాన్సరు నిర్థారణ చేయబడింది. ఈ క్యాన్సరు చర్మంపై మామూలుగా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది, సాధారణంగా ముఖంపై లేదా స్కాల్ప్పై. ఆపరేషన్ లేదా రేడియోథెరపితో దీనికి సులభంగా చికిత్స చేయవచ్చు. నాకు బాగా గుర్తున్నంత వరకు జిమ్కి ఇరవయ్యవ పడిలో క్యాన్సరు వచ్చింది. అతను సమీపంలోని క్యాన్సరు సెంటరుకు వెళ్ళి రేడియోథెరపితో చికిత్స చేయించుకున్నారు. కొంత కాలం తరువాత, ముఖం మరియు మరొక దానిపై ఇలాంటి మరొక క్యాన్సరు వచ్చింది. ఇది అసాధారణమైనదని డాక్టర్లు అనుమానించారు, అతనికి పరీక్షలు చేసి గోర్లిన్స్ సిండ్రోమ్ అనే అరుదైన సిండ్రోమ్ నిర్థారణ చేయబడింది. ఈ సిండ్రోమ్ గల ప్రజలకు ఇతర వాటితో పాటు బాసల్ సెల్ కార్సినోమా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకా, ఈ సిండ్రోమ్ కుటుంబాల్లో వారసత్వంగా వస్తుంది మరియు జిమ్కి తన తండ్రి నుంచి వచ్చింది. దాని గురించి అతనికి తెలిసే పాటికి, అతనికి ముగ్గురు పిల్లలు పుట్టారు. వీళ్ళందరికీ ఈ స్థితి వచ్చింది. ఇది చాలదన్నట్లుగా, ఈ జన్యుపరమైన స్థితి గల ప్రజలకు రేడియోథెరపి చేయించుకోవడం వల్ల క్యాన్సరు ప్రమాదం పెరుగుతుందని జిమ్కి తన డాక్టర్ల ద్వారా తెలిసింది. కాబట్టి, తన క్యాన్సర్లను నియంత్రించేందుకు ముఖంపై చేయించుకున్న రేడియోథెరపి, భవిష్యత్తులో అతనికి ఎక్కువ క్యాన్సర్లు కలిగిస్తుంది. ఈ స్థితి గురించి మరియు అది తనపై మరియు తన కుటుంబంపై చూపే ప్రభావం గురించి పూర్తిగా తెలిసిన తరువాత జిమ్కి విధ్వంసకరంగా ఉంటుంది. ఏం జరుగుతోందనే విషయం తెలియడం అత్యధిక మంది ప్రజలకు కష్టంగా ఉంటుంది మరియు సాధ్యమైనంత ఉత్తమ మార్గం కొనసాగిస్తారు.
సమాజంలో మరియు వైద్య ప్రొఫెషన్లో ఉన్న తన యొక్క అరుదైన స్థితి గురించి కొద్దిపాటి పరిజ్ఞానం మాత్రమే ఉందని, దీనివల్ల తనకు మరియు ఈ స్థితి గల ఇతరులకు సమాచారం ఉండటం లేదని మరియు అసముచితమైన చికిత్స ఇస్తున్నారని జిమ్ గ్రహించారు.
కాబట్టి, అతను తన భార్య మార్గెట్, కొంతమంది ఇతరులతో కలిపి 1992లో గొర్లిన్ సిండ్రోమ్ ఫౌండేషన్ని స్థాపించారు. కొంత కాలానికి, గ్రూప్ సైజు పెరిగి యుకెలోని వందలాది కుటుంబాలను చేర్చుకోవడం జరిగింది. యుఎస్ఎ, నెదర్లాండ్స్ మరియు ఇతర యూరోపియన్ దేశాల్లోని రోగులతో ఈ గ్రూప్ కాంటాక్టులు ఏర్పరచుకుంది మరియు ఈ స్థితికి ప్రపంచవ్యాప్తంగా వార్షిక సమావేశాలు నెలకొల్పడంలో పెద్ద పాత్ర పోషించాయి. పరిశోధనను పెంపొందించేందుకు మరియు వాళ్ళ సభ్యులకు అత్యుత్తమంగా లభించే చికిత్సల గురించిన సలహా పొందడానికి వైద్య ప్రొఫెషన్తో గ్రూప్ గొప్ప లింకులు ఏర్పరచుకుంది. ఈ స్థితి గురించిన మెసేజ్ని వ్యాపింపజేసేందుకు మీడియాను కూడా జిమ్ ఉపయోగించుకున్నారు మరియు బిబిసిలో వచ్చిన ‘‘బిట్టర్ ఇన్హెరిటెన్స్’’ డాక్యుమెంటరీకి మంచి ఆదరణ లభించింది.
నేను జిమ్ని 2002లో కలుసుకున్నాను మరియు కొన్ని నెలల పాటు అతని సరక్షణలో ఉన్నా. ఆ సమయంలో జిమ్ అంధుడుగా ఉన్నాడు. అతని ముఖంపై అనేక చిన్న క్యాన్సర్లు ఉన్నాయి, ఇవి సమీపంలోని స్ట్రక్చర్లకు వ్యాపించాయి. దీంతో సర్జన్లు అతని కళ్ళలో ఒకటి తొలగించవలసి వచ్చింది. ఆ తరువాత, అతనికి రెండవ కంటిలో కంటిచూపు తగ్గింది, దీంతో అతను దాని గుండా చూడలేకపోయారు. ముఖంపై వ్యాధి ఇప్పటికీ పెరుగుతోంది మరియు సమీపంలోని ప్రాంతాలకు బాగా నష్టం కలిగిస్తోంది. దీంతో జిమ్ తన ముఖం మొత్తాన్ని కవర్ చేస్తూ బ్యాండేజి కట్టుకోవలసి వచ్చింది.
అతని గురించి నాకు బాగా తెలిసింది మరియు మేము పరస్పరం మా మొదటి పేర్లతో పిల్చుకునేవాళ్ళము. అతను నిజంగా మంచి మనిషి. అతను చూడలేకపోయినప్పటికీ, అతనికి మంచి వినికిడి శక్తి ఉంది. నేను తన గదిలోకి వెళ్ళినప్పుడు అతను పసిగట్టగలిగేవారు మరియు నేను ఏదైనా చెప్పడానికి ముందే, ప్రశాంతంగా ‘‘హాయ్ రాజ్’’ అని పిలిచేవారు. చాలా తరచుగా, నేను ఎలా ఉన్నాను అని అడగడానికి నన్ను కొడుతుండేవారు. అది అడగవలసింది మీరు కాదు నేను అంటూ అతనితో జోక్ వేసేవాడిని.
ఈ వ్యాధి మరియు దాని పర్యవసానాల వల్ల కలిగిన అత్యంత కష్ట కాలంలో సైతం, మాట్లాడటానికి జిమ్ చాలా ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా ఉండేవారు. అతను తన లక్షణాల గురించి ఫిర్యాదు చేసేవారు కాదు. వాటిని తెలుసుకునేందుకు మేమే కొంత ప్రయత్నం చేయవలసి వచ్చేది. అతను తరచుగా వాటిని కొట్టిపారేసేవారు. అతను తన సమస్యలు చెప్పేవారు కాదు, కానీ మా సమస్యలు వినాలనుకునేవారు.దాదాపుగా అదే సమయంలో, నేను జీవితంలో అత్యం కష్ట కాలం ఎదుర్కొంటున్నాను. దీనికి కారణంగా మా నాన్నకు లింఫోమా కలగడమే. అతనికి 1999లో మొట్టమొదటగా చికిత్స చేయబడింది. కొంత కాలం పాటు వ్యాధి తిరిగిరాదని మేము ఆశించాము, కానీ దురదృష్టవశాత్తూ, ఆ సంవత్సరానికి అతనికి ఎక్కువ చికిత్స అవసరమైంది. నాన్న యుకె వచ్చి కీమోథెరపి చేయించుకుంటూ నా వద్ద ఉండిపోయారు. మీ కుటుంబంలో ఎవరైనా క్యాన్సరు చికిత్స చేయించుకుంటుంటే అది ఎల్లప్పుడూ కష్ట కాలంగా ఉంటుంది. అప్పుడప్పుడు నాకు బాధ కలుగుతుంది. కానీ జిమ్ లాంటి వారిని కలుసుకోవడం నా స్థితిని మెరుగ్గా నిర్వహించుకోవడానికి సహాయపడింది. మీ జీవితం అత్యంత దుర్లభంగా ఉన్నప్పుడు దానిని ఎలా మెరుగ్గా జీవించాలనే విషయంలో జిమ్ ఆదర్శంగా నిలిచారు. అతను ఎదుర్కొన్న కష్టాలతో పోల్చుకుంటే నా సమస్యలు చాలా చిన్నవి. ఆ విషయం తరువాత నాకు తెలిసింది, ఇది నాకు ఎంతగానో సహాయపడింది.
ఆ సంవత్సరం ద్వితీయార్ధంలో జిమ్ ప్రశాంతంగా చనిపోయారు. అతని యొక్క గొర్లిన్స్ సిండ్రోమ్ గ్రూప్ అతని కుటుంబం, స్థానిక ప్రజలు మరియు ప్రొఫెషనల్స్ సహాయంతో ప్రజలకు మద్దతు ఇస్తూనే ఉంటారు. అతను తన వ్యాధిని ఎదుర్కొన్న విధానం మరియు అతని ప్రతికూలతలు నాకు మరియు అతను కలుసుకున్న లెక్కలేనంత మంది ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటాయి.
కష్ట కాలంలో మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో జిమ్ కథ మనకు చెబుతుంది. రెండు విశాల దృక్పథాలు ఉన్నాయని నేను అనుకుంటాను. ఒకటి మనపై పోగయిన కష్టాలను చూడటం, ముడుచుకుపోయిన భయం, మనం ఉన్న స్థితికి ఇతరులను నిందించడం, ఆసాంతం వదిలేయడం మరియు వేచివుండటం ఒకటి. మరొక ఎంపిక మనలో గూడుకట్టుకున్న భయాన్ని అధిగమించడానికి ప్రయత్నించడం, ప్రశాంతంగా మరియు సానుకూలంగా ఆలోచించడం, సమస్యను ఎదుర్కొనేందుకు వ్యూహ రచన చేయడం, ఇతరులు అందించే అవసరమైన మద్దతు మొత్తం తీసుకోవడం మరియు పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైనది చేయడం. నేను ఏ ఎంపిక చేసుకోవాలో నాకు తెలుసు. మీరు కూడా ఈ పని చేస్తారని ఆశిస్తున్నాను.

ఒక ఆసక్తికరమైన క్యాన్సరు సంబంధ కథను మీరు పంచుకోవాలనుకుంటే, దయచేసి దానిని పేరు మరియు ఫోటోగ్రాఫ్తో మాకు పంపండి. మేము దానిని సైట్లో సంతోషంగా పోస్ట్ చేస్తాము.